వాత్సల్యాదభయ ప్రదాన కరణాత్ అర్తార్తి నిర్వాపణాత్
ఔదార్యాదఘశోషణా దగణిత శ్రేయః పదం ప్రాపణాత్
సేవ్య: శ్రీపతి రేక ఏవ జగతాం
ఏతేచ షట్ సాక్షిణః
ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యా ధ్రువం
ఈ శ్లోకం అప్పయ్య దీక్షితుల రచన. అప్పయ్య దీక్షితులు మహా శివ భక్తుడు ఆది శంకరుల అద్వైత సిద్ధాంతాన్ని నమ్మి ప్రచారం చేసిన వ్యక్తి సాక్షాత్ తిరుపతి వేంకటేశ్వరస్వామియే ఇతని భక్తికి మెచ్చి శివ రూపంలో దర్శనమిచ్చినాడట.
ఈ శ్లోకం లో భగవంతుని సేవిస్తే కలిగే ప్రయోజనాలు, దానిని పొందిన సాక్షులను తెలుపు తున్నాడు అప్పయ్య దీక్షితులు... అవి వరుసగా
1. వాత్సల్యము చూపుట
ప్రహ్లాదుని తన అమిత వాత్సల్యంతో అడుగడుగునా రక్షించడం మనందరికీ తెలుసు..
2. అభయమిచ్చి రక్షించుట
రామాయణం లో విభీషణునికి శ్రీ రామచంద్ర ప్రభువు అభయ మిచ్చి కాపాడాడు కదా!
3. ఆర్తుల ఆస్తిని తొలగించుట.
గజేంద్రుని ఆర్తినితొలగించి కాపాడుట మనం భాగవతంలో చూసాము
4 ఔదార్యము చూపుట
ద్రౌపదిని ఔదార్యంతో మాన సంరక్షణ చేయడం..
పాపులపాపములను తొలగించుట
అహల్యను పాపవిముక్త చేయటం
ఉన్నత స్థానం అనుగ్రహించుట
ద్రువుడు చిరంజీవి గాఉన్నత స్థానం పొందడం
ఈ ఆరు గుణాలతో భక్తులను సదా రక్షించు పరమాత్మా నీకు వందనం..
ఈ శ్లోకాన్ని భక్తితో చదివిన వారందరూ వాసుదేవ అనుగ్రహానికి పాత్రులై సమస్త దుఃఖము లోనుండి విముక్తులగుదరని అప్పయ్య దీక్షితుల ఉవాచ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి