మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, అక్టోబర్ 2026, శనివారం

ధూళిపాళ సీతారామశాస్త్రి - అపర సుయోధనుడు

సంప్రదాయబద్ధమైన వైదిక బ్రాహ్మణ వంశం మాది. వేదశాస్త్ర అధ్యయనం మా వంశాచారం. నేను గుంటూరు జిల్లా, గురజాల తాలూకా, దాచేపల్లి గ్రామంలో దుర్మతి నామ సంవత్సరం భాద్రపద బహుళ సప్తమి, సరియగు తేదీ 24.09.1921న జన్మించాను. మా తల్లి ధూళిపాళ రత్నమ్మగారు, తండ్రి ధూళిపాళ శంకరయ్యగారు. మా నాన్నగారు బాల్యంలో వేదశాస్త్ర అధ్యయనం కొంత వరకు చేసినా, హలం పట్టి పొలం సాగించారు. మేం మొత్తం నలుగురు అన్నదమ్ములం, మాకు ముగ్గురు సోదరీమణులు. మా చిన్నతనం చాలా సరదాగా గడిచింది. రోజూ నాగులేటి కెళ్లి, ఈతలు కొట్టి స్నానాలు చేసేవాళ్లం. కారంపూడి కనుమలలో పుట్టి, బ్రాహ్మనాయుడు, నాగమ్మ, నలగామరాజు, బాలచంద్రుడు, వంటి పల్నాటి వీరులతో పల్నాటియుద్ధం జరిగిన ప్రదేశాల నుంచి మా గ్రామంలో మా ఇంటి వెనకాల నుంచే ప్రవహిస్తూ ఉంటుంది “నాగులేరు”. ఆ నాగులేరు పక్కన ఒడ్డులో వున్న తోటల్లోని పెద్దపెద్ద చెట్లెక్కి అక్కడి నుంచి నాగులేటి నిండు ప్రవాహంలో దూకి, రోజూ ఈదుతుండే వాళ్లం. ఆ నిండు ప్రవాహంలో కొంత దూరం నీటికి వాలుగా నీళ్లమీద వెల్లికిలా పడుకుని విశ్రాంతిగా వెళ్లి, మళ్లీ అదే ప్రవాహంలో ఎదురీదుకుంటూ మా రేవుకు చేరేవాళ్లం. అలాంటి ఈతలు శరీరానికి, ముఖ్యంగా లేత మనస్సులో ఎంత పరిశ్రమ, ఎంత బలం అనేది విజ్ఞాన శాస్త్రాలు చెబుతూనే ఉన్నాయి. ఆ పరిశ్రమల ఫలం, బలం ఈనాటి స్విమ్మింగ్ పూల్స్‌లో రావడం అసంభవం.

ఆ కాలంలో చిన్నపిల్లలకు ఇదో సంవత్సరం రాకుండా అక్షరాభ్యాసం చేసేవారు కాదు. నా క్కూడా ఔదో సంవత్సరం వచ్చిన తర్వాతనే అక్షరాభ్యాసం చేయించారు. అప్పటికి స్కూళ్లల్లో ఇంగ్లీషు మీడియం లేదుగానీ ఇంగ్లీషు భాషాబోధన చేసేవారు. ఇంగ్లీషు ఒక సబ్జక్టుగా మాత్రం ఉండేది. ఆనాటికి మా గ్రామంలో, “లోకల్ ఫండ్ మిడిల” స్కూలు మాత్రం వున్నది. చుట్టు ప్రక్కలనున్న చిన్న పల్లెల వాళ్లంతా మా వూరు వచ్చి చదువుకునేవారు. ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉండేది. ఎలిమెంటరీ స్కూల్‌లో ఒకటో తరగతి నుండి మÖడో తరగతి వరకు చెప్పేవారు. నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు మిడిల్ స్కూల్‌లో చెప్పేవారు. కనుక ఎనిమిదో తరగతి వరకే మాగ్రామంలో విద్య వుండేది. అంతవరకు నిరాఘాటంగా ప్యాసయ్యాను. గణితంలో తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులే వచ్చేవి. ఆటల్లో కూడా నేను ముందు వుండేవాణ్ణి. ముఖ్యంగా “చెడుగులు” ఆటలో మంచి ప్రావీణ్యత ఉండేది. నేనూ, మా పెదతల్లి కుమారుడు బేతనభట్ల సీతారామయ్య “చెడుగుడు” ఆటకు నాయకులం. గెలుపు ఎప్పుడూ మాదే.

మా చిన్నతనంలో సినిమాలు లేవు, సినిమా హాల్సు లేవు. అయినా అప్పుడప్పుడూ మÖకీ చిత్రాలు వస్తూవుండేవి. గుడÊ తెర మీద u£మ్మలు ఎగురుతున్నాయని జనమంతా వేలంవెర్రిగా వెళ్లేవారు. అయితే అక్కడ ఒక చిన్న చిక్కు వుంది. ఆ సినిమాకు టిక్కెట్టు పెద్దవాళ్లకు అణా, చిన్నవాళ్లకు అర్దణా! అణా అంటే రూపాయిల 16 వంతు. ఆనాడు వచ్చే రూపాయిలన్నీ కూడా వెండి నాణాలే. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనిషికి సినిమాటిక్కెటు అణా పెట్టి కొనాలి గనుక ఆ శక్తి వున్నవాళ్లే ఎప్పుడైనా వచ్చే మÖకీ సినిమాలు చూచేవాళ్లు. మాకు ఆ అవకాశమే లేదు. గనుక తరుచుగా వస్తూ వుండే వీధి భాగవతాలు, తోలుu£మ్మలాటలు, హరికథలు లాంటి ఉచితంగా చూడగలిగే వాటికెళ్లేవాళ్లం.

వీధి భాగోతులు, తోలుu£మ్మలాటలాడే వాళ్లు, ఎవరైనా సరే వాళ్లు ఒక్కోవూరికి స్వయంగా వెళ్లి, ఆ వూళ్లోని కరణం, మునసబు, పెద్దకాపు, మొదలైన వాళ్ల దగ్గరకెళ్లి, వారి సహాయంతో ఆ వూర్లో ప్రదర్శించేవారు. ఆ ప్రదర్శనలు ఒక బజారు కూడలిలో రెండు గుంజలు పాతి, తెల్లని తెర కట్టేవారు. రాత్రి తొమ్మిది గంటలకు ప్రదర్శన ప్రారంభిస్తే తెల్లవార్లూ జరుగుతూ వుండేది. సూత్రధారుడు, వారి ఉపోద్ఘాతం, కేతిగాడు, ఆనాటి ప్రదర్శనకు సహకారమందిస్తున్న సంపన్నులకు నమస్కారాలతో కథలు ప్రారంభమయ్యేవి. అన్నీ పౌరాణిక కథలే ప్రదర్శించేవారు. ఇవేగాక కూచిపూడి భాగవతులు అని వచ్చేవారు. వీళ్లంతా కూడా కృష్ణాజిల్లా కూచిపూడి వాస్తవ్యులు. బ్రహ్మణులు. నలుగురైదుగురు కలసి వచ్చి తెరలలో పని లేకుండా ఎవరింట్లోనో ఒక నివాసమేర్పాటు చేసుకుని, ఉదయాన్నే స్నానం, సంధ్యాదులు పూర్తి చేసుకుని, అక్కడే వాళ్లు వేషాలు వేసుకునేవారు. ఆ వేషాల్తోనే వాళ్లింటింటికీ వెళ్లి “మాది కూచిపూడి అగ్రహారం, కులమున బ్రాహ్మణ వారం. కళలే మా జీవిత సర్వం” అని చెప్పుకుంటూ వారు ధరించిన పాత్రల తాలూకు సంభాషణలు పలుకుతూ వెళ్లేవారు. ఒక్కొక్కరు అర్థనారీశ్వర వేసం వేసుకుని, అంటే ముఖంలో సగభాగం స్త్రీరూపంగాను, సగభాగం పురుషరూపంగాను, ఆయా చిహ్నాలతో వేషాలు వేసేవారు. వాళ్ల శిరసున వుండే తెర గుడ్డను పురుషపాత్ర సంభాషణ చేస్తున్నప్పుడు స్త్రీ పాత్రధారణను, స్త్రీ కంఠాన్ని గొంతులు మార్చి, మార్చి చక్కగా ప్రదర్శించేవారు. ఆ వూరు శక్తిని బట్టి, బ్రాహ్మణ యిళ్లల్లోనే భోజనం చేస్తూ వూరి వాళ్లు అందించే సహకారంతో సంచారం చేస్తుండేవాళ్లు అవికూడా ఎంతో విజ్ఞాన వినోదాలనందిస్తూండేవి.

ఎనిమిదో తరగతి పాస్ అయ్యేసరికి నాకు పదకొండు సంవత్సరాలు నిండాయి. ఇంక పై చదువులు మా గ్రామంలో లేక దూరంగా వుండే గుంటూరు లాంటి పట్టణాలకు వెళ్లలేక, స్కూల్ చదువుకు స్వస్తి చెప్పడం జరిగింది. అయితే అప్పటికే మా అన్నగారు బాపట్లలోని శంకరవిద్యాలయంలో వేదాధ్యయనం చేసేవారు. నన్ను కూడా ఆ వేద పాఠశాలకే పంపించారు. అక్కడే ఉచితంగా భోజనం పెట్టి వేదాలు నేర్పించేవారు. పీసపాటి త్య్రంబకావధాన్లు, జాన్నలగడ్డ విశ్వనాధ శాస్త్రిగార్లు మాకు ఎంతో శ్రద్ధగా పాఠాలు నేర్పించారు.

అప్పటికి మాకు బయట ఫ్యాషన్ ప్రపంచం తెలీదు గనుక, చిన్న వయసులో శిఖ పెట్టుకోవడం అలవాటే గనుక, అక్కడ వేద విద్యార్థి వేషం నాకేమి కొత్త అన్పించలేదు. అయితే మేమెప్పుడైనా బజారు వెళ్తే అక్కడ ఇంగ్లీషు చదువుకునే పిల్లలు మమ్మల్ని, మా వేషభాషల్ని చూసి అవహేళన చేస్తుండేవాళ్లు. మాకు చాలా కోపమొచ్చేదికానీ, ఏమీ చెయ్యలేక తల వంచుకుని వెళ్లిపోయేవాళ్లం. బహుశా అదే ఇప్పుడు ర్యాగింగ్ అనే మాటతో అభివృద్ధి అయి కాలేజీలో, ముఖ్యంగా వృత్తి కళాశాలల్లో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వరకు పెరిగిందనుకుంటాను.

ఇదే పద్ధతిలో ఒకనాడు బాపట్ల కాలేజి విధ్యార్ధులు మా పాఠశాలకు వచ్చి, వేద విద్యార్ధుల్ని అల్లరిపాలు చేస్తున్నారు. మా సీనియర్ విద్యార్థులు, గురువులు మంచిగా చెప్పి వెళ్లిపొమ్మన్నారు. అలా చెప్పేకొద్దీ వాళ్లు మరీ రెచ్చిపోయారు. ఇక అంతే. పొయ్యిలో మండుతున్న సర్వీకర్రలు తీసుకుని వెంటపడ్డాం. అదీ కూడా మా పల్నాటి విద్యార్ధులు ఇద్దరు ముగ్గురం మాత్రమే. ఆ దెబ్బతో వాళ్లు పారిపోయారు. మా కంటే వయస్సులో పెద్దవాళ్లయిన విద్యార్థులు, మేం చేసిన సాహసం చేయలేకపోయారు. “మొత్తానికి పలనాటి వీరులు అన్పించారయ్యా” అని మమ్మల్ని అభినందించారు. ఇంక మళ్లీ ఆ అల్లరిమÖకలు మా పాఠశాల ప్రక్కకే రాలేదు. ఇలా ఒక సంవత్సరం గడిచిపోయింది. ఎండాకలం శెలవులకు మా వూరు వచ్చాం. ఈలోగా మా నాన్నగారి ఆలోచన మారిపోయింది. ఇద్దరు కొడుకులూ వైదిక విద్యలోనే వుంటే ఎలా? ఒకర్ని లౌకికంలో ప్రవేశపెట్టాలి అని అనుకున్నారు. 

గురజాల మాకు ఎనిమిది మైళ్ల దూరంలో ఉంది. అక్కడ మునసబు కోర్టు ఉంది. లాయర్లు ఉన్నారు. అక్కడకు వెళ్లి వాలంటరీ పని నేర్చుకోమన్నారు. బాబో! నాకు లెక్కలు రావు. నేనాపని చేయలేనని అన్నాను. “వాళ్లే నేర్పుతాను, నీకేం భయం లేదని చెప్పి గురజాలలో సోమయాజు శ్రీనివాసరావుగారు అనే వకీలు దగ్గర వాలెంటరీగా చేర్పించారు. వాలెంటర్ అంటే మొదట చేయాల్సినపని వకీలు గుమాస్తా దగ్గర కేసుల కట్టలు మోస్తూ వుండడమే. వాళ్లిచ్చేది ఏమీ వుండదు. వారి గుమాస్తా పీసపాటి గోపాలరావుగారు. వారి దగ్గర పని నేర్చుకోవాలి. మా వూరికి దగ్గరే కాబట్టి శెలవుల్లో నడచిగాని, వీలైతే బస్సెక్కిగానీ మా వూరు వెళ్తూ వుండేవాడ్ని. వుండటం మాత్రం మా పెద్దతల్లి కుమారుడు, ఆ వూళ్లో సీనియర్ ప్లీడర్ గుమాస్తా భేతనభట్ల సదాశివయ్య గారింట్లో వుండేవాడిని. భోజనం మాత్రం ప్లీడరు గుమాస్తాల యిళ్లలోనే యింటికోరోజు చొప్పున వారాలు కుదుర్చుకున్నాను. ఇలా తొమ్మిది మాసాలు గడిచాయి. మాపెద్దతల్లి కుమారుడు సదాశివయ్య గారు “యిక్కడ ఎన్నాళ్లు వుంటే ఏం ప్రయోజనం, గుంటూరు పంపిస్తాను వెళ్తావా” అని అడిగారు. వెళ్తానని చాలా ధైర్యంగా చెప్పాను. ఆ కాలంలో కొంపల్లి రామనాధం గారని ఒక ప్లీడరు ఉండేవారు. వారికి అప్పటికి పెద్ద ఫైలు లేదు గానీ వారింట్లో సంప్రదాయ బద్ధమైన నిత్యదేవాతార్చన వుంది. ఆ దేవాతార్చన చేయడానికి మాత్రం చెప్పుకున్న మంచి కుర్రాడు కావాల్సివచ్చింది. నాకు మంత్రాలు వచ్చుకాబట్టి నన్ను సదాశివయ్యగారు సిఫారసు చేసి పంపించారు. అప్పుడు మా వూరు నుంచి గుంటూరుకు రైలు టిక్కెట్టు 10 అణాలు. మా నాన్న నాకు 1-4-0 (రూపాయి పావలా) ఇచ్చారు. అందులో టిక్కెట్టుకు 10 అణాలు పోయింది. మిగిలిన పది అణాలతో గుంటూరులో కాలుమోపాను. ఎట్లాగో కొంపల్లివారి సులభంగానే గుర్తుపట్టగలిగాను. సదాశివయ్యగారు ఇచ్చిన ఉత్తరం యివ్వగానే  నన్ను చూసి, సంతోషపడి పోయి, ఒక గది చూపించి వుండమన్నారు. అంతబాగానే వుంది. వేళవేళకు దేవాతార్చని, పూటపూటకు భోజనం. అయితే ఒక్కటే లోపం - వారికి పెద్ద ఫైలు లేదు గనుక గుమాస్తా గారు చెప్పడం, నేను నేర్చుకోవడం ఏమో జరగలేదు. ఇలా నాలుగు మాసాలు గడచిపోయాయి.  ఈ వూరు వచ్చింది దేనికి? కేవలం భోజనం కొరకేనా? జీవిత ధ్యేయానికి యిదే మార్గమా? ఈ మార్గం ఎంతకాలం జరుగుతుంది? నా భవిష్యత్తు ఏంటి? అనే ఆవేదన నాలో పెరిగిపోయంది. చివరకు ఓ నిర్ణయం తీసుకున్నాను. మంచి ఫైలులో ఉన్న ప్లీడరు, పని నేర్పే గుమాస్తా వున్న చోటు వెతుక్కోవాలని, వెతకడం ప్రారంభించాను. అక్కడే పెద్దిuó£ట్ల చలపతిగారని పెద్ద లాయరు ఉండేవారు. ఆయన గుమాస్తా కౌతా వెంకటరత్నంగారు. ఆయన పని నేర్పతానని రమ్మన్నారు. మళ్లీ భోజనం సమస్యవచ్చింది. వెంకటరత్నం గారే నలుగురికి చెప్పి వారాలు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు ఖాయమయ్యాక నేను వెళ్లిపోతానని కొంపల్లి వారింట్లో చెప్పాను. వాళ్లు పంపించలేదు గదా, వెళ్తే పోలీసులకు పట్టిస్తామని బెదిరించారు. తప్పు చేస్తే కదా భయం. నా పెట్టె, బట్టలు వాళ్ళిచ్చిన గదిలోనే వదిలేసి చెప్పకుండానే వెళ్ళిపోయాను. చలపతిరావుగారి ఆఫీసులో చేరాను. తర్వాత కొంపల్లివారు కూడా నన్నర్థం చేసుకుని నా వస్తువులు నాకిచ్చేశారు. రోజులు గడుస్తున్నాయి. బాగా పిన నేర్చుకుంటున్నానని వకీలు గుమాస్తాలు, కోర్టు గుమాస్తాలు అందరూ నన్ను అభిమానించేవారు. మా పెద్ద గుమాస్తా గారు ఎప్పుడైనా పావలా, లేక అర్థరూపాయి ఇచ్చేవారు.

అది 1934వ సంవత్సరం అయి వుంటుంది. గుంటూరు మొత్తం మీద రెండు, మÖడు సినిమాహాల్సు వుండేవి. ఒకరోజు నాకూ సినిమా చూడాలనిపించింది. అణాపెట్టి నేల టిక్కెట్టుకొనుక్కున్నాను. అది హిందీ మÖకీ సినిమా. కథ, తెరమీద నడుస్తుంటే పక్కన ఒకడు వుండి కథకు అనుకూలంగా హాస్యంతో ప్రేక్షకుల్ని నవ్విస్తూ, కవ్విస్తూ, కన్నీటితో ఏడిపిస్తూ, క్రోధంతో కలవరపరుస్తూ తెలుగులో కథ చెప్పేవాడు. అతని కోసమే కూడా కొందరు సినిమాకు వెళ్లేవారు. ఆ లేతవయసులోనే అతని మాటలు నన్ను కూడా ఉత్తేజపరిచాయి. “మనం కూడా తెరమీద యిలా ఎగిరితే ఎంత బాగుండును” అనే భావన కల్గింది. నిద్రపోదామని పడుకుంటే కూడా ఆ సినిమా రీలే గుర్తుకు వచ్చేది. ఆ గుర్తులలో నుంచి మనస్సు బాల్యానికి వెళ్లింది. ఇక్కడ చాలా ముఖ్య విషయం చెప్పాలి. అది మరపురాని ఘట్టం. ఈనాడు ఒక నటుడిగా అభిమానుల ఆశీస్సులు అందుకోవడానికి అదే నాందీ బీజం అయిందని నా భావన.

మా స్వగ్రామంలో ఎనిమిదో తరగతి చదువుతున్నాను. స్కూలు వార్షికోత్సవాల్లో పిల్లలతో చిన్న, చిన్న ఘట్టాలు, నాటకం వేయించారు. అది గయోపాఖ్యానం నాటకంలో ఒక ఘట్టం. మిగతా ఎవరెవరు ఏ.ఏ వేషాలు వేశారో గుర్తులేదు గానీ “హరికథాకేసరి” రాజశేఖరుని లక్క్ష్మీపతిరావుగారు ఆనాడు మా సహోధ్యాయుడు. అతను అర్జున పాత్ర ధరించాడు. శ్రావ్యమైన మధురకంఠం వారి సొత్తు. అతను అర్జున పాత్రలో ‘శరణని వేడిన భీరువు కావలె శత్రుని పక్షమునన” అని గానం చేస్తే, ముగ్ధులై ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. నేను వేసిన వేషం సహదేవుడు. పాటాలేదు, మాటా లేదు. నాకు సంగీతం రాదని కదా మంచి వేషం యివ్వలేదు. అతని లాగానే నేను ఏనాటికైనా రంగస్థలం మీద పాడగలనా! అనే ఆలోచన కలిగింది. వీటినే పిచ్చి వూహలు అంటారు. సినిమా చూస్తూ అలా తెరమీద ఎగరాలనుకోవడం, ఎవరైనా చక్కగా పాడితే అతనిలాగా పాడాలనుకోవడం గాలిమేడలు కాకపోతే ఏమిటి? కానీ, కొన్ని జీవితాల్లో ఆ గాలిమేడలే గట్టి భవనాలు అవుతాయని చరిత్ర చెబుతోంది. ఎవరి అదృష్టం ఎలా వుంటుందో ఆ భగవంతునికి మాత్రమే తెలుసు.

ఆనాటి నాటకసంస్థలలో గుంటూరు వకీలు గుమాస్తాల నాటక సంస్థ కూడా ప్రఖ్యాతి చెందిందే. మాకు పూర్వం, వకీలు గుమాస్తాలైన గిరిరాజు రామమÖర్తి, బండారు రామస్వామినాయుడు గార్లు మంచి నటులుగా పేరు సంపాదించుకున్నారు. వారి పాత్రధారణ, నటజీవితం గురించి నాకు తెలీదుగానీ వ్యక్తులుగా పరిచయస్థులే. అంటే అప్పటికి వారు వేషాలు వేయడం మానుకున్నారన్నమాట. మాకాలం నాటికీ అంటే 1934 సం॥రం నాటికి వకీలు గుమాస్తాలలో నటులుగా పేరున్నవాళ్లు లేకపోలేదు. వాళ్లలో ముఖ్యులు కుర్చేటి నాగేశ్వరరావు. అతనికి సొంత ట్రూపు లేదుగానీ, ఇతరుల నాటకాల్లో కిరాయికి వెళ్లి వేషమేసి వస్తుండేవాడు. నేనూ వకీలు గుమాస్తానే కనుక, నాలో ఏదో చెప్పలేని నాటకాసక్తి వుండడం వల్ల అతనితో సన్నిహితంగా వుండేవాడ్ని. 1935 సం॥లో గుంటూరు సమీపంలోని శిరింగిపాలెం అనే గ్రామంలో “శ్రీకృష్ణతులాభారం” నాటకమేర్పాటు చేశారు. అందులో “నళిని” పాత్రకు ఎవ్వరూ దొరకలేదేమో నన్ను పిలిచి ఆ వేషం వేయించారు కుర్చేటి నాగేశ్వరరావు. కిరాయి, నాటకానికి ఐదు రూపాయల నుండి ఎనిమిది రూపాయల వరకూ వుండేది. ఆ కాలంలో ఎంతపెద్ద నటులకైనా కిరాయి ఆ రేంజి లోనే వుండేది. ఇంక నామేమిస్తారు? 0-4-0 (పావలా) ఇచ్చి కాఫీ తాగమనేవారు. ఆ పావలాకే నేను సంతోషించేవాడ్ని.

తర్వాత అదే నాటకం మరో ఊర్లో ప్రదర్శించినప్పుడు నా చేత రుక్మిణి వేషం వేయించారు. అంతేకాదు ‘తులసీ బలజనాభు కృప వడసీకరుణను, భక్తుల బ్రోవుము’ అనే పాట ప్రాక్టీసు చేయించారు. గుంటూరులోనే వెలవర్తిపాటి రంగరావు గారని ఉండేవారు. ఆయన పోలీసు ఆఫీసులో గుమాస్తాగా పనిచేసేవారు. ఆయనికి వేషాలెయ్యడం సరదానే గానీ, గాత్రం నిండుగా వుండేది కాదు. అందుకని తనకు తగినట్లుగానే కాళిదాసు నాటకం ఎన్నుకుని అందులో తాను ‘కాళుడు’ పాత్ర వేశాడు. హీరో (కాళిదాసు) కుర్చేటి నాగేశ్వరరావు. అందులో నా చేత కాళికాదేవి వేషమేయించారు. కొద్దిగా డైలాగులు మాత్రం వున్నాయి. చక్కగా చెప్పాను. బాగానే వుందనుకున్నారు. ఆ సమయంలోనే గుంటూరులో సవరం వీరాస్వామి నాయుడు గారి నాటకం కంపెనీ ప్రచారంలో వుండేది. ఆయన రంగూన్‌రౌడీ వేషానికి పెద్దపేరు. ఆయన స్ఫూరద్రూపి. పెద్దగా సంగీత ప్రాధాన్యం లేకున్నా హావ, భావ, ప్రకటనలతో పద్యం బాగా ఆలపించేవారు. అందులో నాచేత రౌడీ చెల్లెలు “జానకి” పాత్ర వేయించారు. దాంతో నా స్త్రీ పాత్రధారణ పదిమందికీ తెలిసి చాలా మంచి పేరు వచ్చింది. నాలో కూడా స్త్రీ పాత్రధారణ పదిమందికీ తెలిసి చాలా మంచి పేరు వచ్చింది. నాలో కూడా స్త్రీ పాత్రలు ధరించి మంచిపేరు తెచ్చుకోవాలని తపన బయలుదేరింది. అప్పట్లో రిలీజైన సినిమాల వాల్‌పోస్టర్లలో వున్న కన్నాంబ, సీనియర్ శ్రీరంజని, రామతిలకం గార్లను చూస్తూ అలా ఉండాలని ప్రాక్టీసు చేసేవాడ్ని. ఆతదానిలాగా నడవడం అలవాటు చేసుకునే వాడ్ని. గాత్ర సంగీతం లేదు కాబట్టి నాకెవ్వరూ పెద్ద వేషాలు యిచ్చేవారు కాదు. 

1937వ సంవత్సరం, ప్రఖ్యాత సినీ, రంగస్థల నటులు సి.ఎస్.ఆర్. ఆంజనేయులుగారు, గుంటూరులో నాటకకంపెనీ పెట్టి, “భక్తతుకారాం”, “పతితపావన” నాటకాలు ఆడించారు. ఏలూరు కాపురస్తులు బండారు వెంకటేశ్వర్లుగారు తుకారాం మొదటి భార్యగా నటిస్తే, నా చేత రెండోభార్య జిజియాబాయి పాత్ర వేయించారు. సి.ఎస్.ఆర్. గారు చాలా మాస్యప్రియులు. ఒక చిన్న తమాషా సంగతి చెప్తాను. గుంటూరులో నాటకమైన వారం రోజులకు తెనాలిలో “భక్తతుకారాం” నాటకం. ఆ రోజు సాయంత్రం ఆరుగంటలకు, నేను నాటకం హాలుకు చేరాను. సి.ఎస్.ఆర్‌గారు కనిపించారు. “హా! రావోsTÖ చూద్దువుగానీ వారం రోజులు నుంచి ప్రాణం తీస్తున్నావు కదా” అని ఒకాయన్ని పిలిచారు. ఆయన రాగానే నన్ను చూపించి “ఊ! ఇక మాట్లాడి ఏర్పాటు చేసుకో, భయంలేదులే” అని అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. యింతకీ అసలు విషయమేమింటే, గుంటూరు నాటకంలో ఆయన నా వేషం చూసి, ఎవరూ అమ్మాయి? ఎలాంటిది? ఏమిటి? మాట్లాడవచ్చా? అని నన్ను గురించి, గుచ్చి గుచ్చి అడిగారట. సియస్సార్ గారు అసలు విషయాన్ని మభ్యపరచి రేపు తెనాలి నాటకానికి వస్తుందిలే నేను పరిచయం చేస్తాను. తొందరపడకు. నువ్వు మాట్లాడుకుందువుగాని, అని చెప్పారు. పాపం ఆ పెద్దమనిషి నన్ను చూసి నివ్వెరపోయాడు. అందరూ నవ్వుకున్నారు. నావేషం అంత అందంగా, అచ్చం ఆడపిల్లలాగా వుండి, నా అందానికి ý£ంగిపోయి మనుష్యులు వెంటపడేటంత చక్కగా వుంది కాబోలు అనుకుని నాలోనేను ఓ విధంగా సంతసించాను.

నాటకరంగం మీద నా పురుషవేషధారణ చరిత్రలో కూడా ఇలాంటి ఘట్టాలెన్నో జరిగాయి. భగవదనుగ్రహం వల్ల ఎక్కడా తప్పటడుగేయలేదు. ఇలాంటి ఘట్టాలెదురైనప్పుడల్లా మందు, మగువల వ్యామోహంలో మునిగి, పతనమై కాలగర్భంలో కనుమరుగై పోయిన మహానటులంతా నా మదిలో మెదులుతూ వుండేవాళ్లు. వాళ్లంతా “జాగ్రత్త నాయనా” అని హెచ్చరిస్తున్నట్లుగా నాకనుభూతి కలిగేది. ఇదిగాక, అలా పతనమై, చరిత్ర హీనులై, స్వయం కృతాపరాధాలతో, వృద్ధాప్యంలో అష్టకష్టాలు అనుభవిస్తున్న కళాకారుల్ని గురించి, సమాజం ప్రకటిస్తున్న దూషణ, తిరస్కార ఏహ్యభావనలు, నిందావాక్యాలు నా చెవుల్లో గింగురుమంటూండేవి. అదే నాభవిష్యత్తుకు రాజబాటలయ్యాయి. జీవితంలో గుణపాఠాలయ్యాయి. 

మా పెద్ద గుమస్తా కవుతా వెంకటరత్నం గారు, అర్థా ఇస్తుండేవారు. పార్టీలకు చెప్పి కొద్ది కొద్దిగా ఇప్పించేవారు. అది జీవనభృతికి పూర్తిగా చాలదు. నాబ్రతుకు కోసం నాన్ననడిగి డబ్బు తెచ్చుకోవడం నాకిష్టంలేదు. కష్టపడి స్వయంకృషితో పైకి రావాలనేది  నా సంకల్పం. అందుకనే వారాల భోజనం వద్దనుకున్నాను. స్వతంత్ర జీవనం చేయాలనుకున్నాను. గుంటూరు, బ్రాండీపేట, రెండోలైను, ఆరో అడ్డరోడ్డులో తూటుపల్లి వారి మేడ వుండేది. అందులో ఒక పక్కన బాగా ఖాళీస్థలం వుంది. అక్కడ తాటాకు పాక ఉండేది. దానికి అద్దె నెలకు అర్థరూపాయి. నేనొక్కడినే అద్దె చెల్లించలేనని మరో పార్టనర్‌ను చేర్చుకున్నాను. అతని పేరు తాడేపల్లి వెంకట కృష్ణయ్య. వంట మొదలు పెట్టాం. ఒక అణాబియ్యం తెచ్చుకుంటే మా ఇద్దరికీ ఒకపూట సరిపోయేది అన్నం. ఎవరిదగ్గర అణావుండే వాళ్లు బియ్యం తెచ్చేవాళ్లం. వంటచేసుకోవడానికి గిన్నెలు వగైరా కావాలిగా, ఒక వ్యాపారి దగ్గర వాయిదా పద్ధతుల ద్వారా సామాన్లు కొనుక్కున్నాం. ఒకరోజు మా యిద్దరి దగ్గర ఉండేదికాదు. ఇక ఆరోజు వండుకోకుండా మా యింట్లో వున్న మామిడి చెట్టుకి కాయలు కోసుకొని, వాటిని తినేసి పడుకునేవాళ్లం. అలాంటి రోజులు త్వరగానే వెళ్లెపోతాయి. ఇద్దరం నెలకు పదెనిమిది రూపాయల సంపాదనలో పడ్డాం. నేను ఆ రూం ఖాళీచేసి బ్రాండిపేట 13వ అడ్డరోడ్డులో ఒక గది అద్దెకు తీసుకున్నాను. అద్దె మాసానికి మÖడురూపాయిలు.

ఒకసారి వేసవి శెలవుల్లో మా సొంత ఊరు దాచేపల్లి వెళ్లాను. మానాన్నగారు ఒకరోజు మంచం అల్లుతూవున్నారు. “ఒరే అబ్బాయ్, ఏం పనిరా ఇది? మన ఇంటా వంటా లేదు. నాటకాల్లో వేషాలేస్తున్నావట. విÖ అమ్మ చెప్పింది. చెడిపోతావు జాగ్రత్తనాయనా” అని చాలా సున్నితంగా మందలించారు. “అబ్బే ఏం లేదురా నాన్న” అని నీళ్ళు నములుతూ సమాధానం చెప్పి మెల్లగా అక్కడి నుండే తప్ప్పుకున్నాను. ఆ మందలింపు చాలా సున్నితంగా ఉన్నది కానీ, నాగుండెల్లో మాత్రం రామబాణాల్లా గుచ్చుకున్నాయి.

మా ముందు తరంలో  నాటకాలు వేస్తే అతను చాలా చెడ్డవాడనీ, అలాంటి వాళ్లకు పిల్లను కూడా ఇవ్వకూడదనీ చాలా మంది అభిప్రాయం. ఇంకా అంతకుముందు కాలంలో నాటకంలో వేషాలు వేసిన వాళ్లను ఇంట్లోకి రానిచ్చేవారుకాదు, సహపంక్తి భోజనాలు లేవు. నాటకాల్లో వేషం వేసినంత మాత్రాన ఇంత కఠనంగా ఆ కళాకారున్ని శిక్షించాలా? “నటకం పంచమవేదం” అన్నారు పెద్దలు, మరి ఎందుకు అలా నాటకాల్ని నటుల్ని హీనంగా చూసేవారో!

1938లో ఒకనాడు నేను గుంటూరు కలెక్టరాఫీసులో ఉన్న పోస్టాఫీసుకు ఏదో పనుండి వెళ్లాను. అక్కడే ఒకాయన నన్ను నిశితంగా చూడటం గ్రహించాను. నన్ను చూచి ఇదేదోవేషం వేసే ముఖంలాగా వుందనుకున్నాడో, ఏమో, నా దగ్గరకు వచ్చాడు. “చూడబ్బాయ్! ఇక్కడ ప్లీడరు గుమస్తాల కంపెనీలో ఒకబ్బాయి ఆడవేషాలు వేస్తూ ఉంటాడట. నీకు తెలుసా?”

“నేనేనండే” అన్నాను సగర్వంగా 

అయితే u£బ్బిలయుద్ధంలో మల్లమాంబ వేషం వచ్చా? ఆ”వచ్చండీ” అయితే నువ్వొక పనిచేయాలి. రేపల్లెలో ‘u£బ్బిలయుద్ధం’ నాటకం వేస్తున్నాం అందులో రంగరాయుడుగా మాధవపెద్ది వెంకట్రామయ్యగారు, పాపారాయుడిగా చిలుకూరి సుబ్బారావుగారు, హైదర్‌జంగ్‌గా బసవరాజు సుబ్బారావుగారు వంటి మహానటులంతా నటిస్తున్నారు. నీవు మల్లమాంబ వేషం వేయాలి “ఓ అలాగేనండీ” అన్నాను. ఆ మహానటులందరి పక్కన ఆ పాత్ర దొరకడమే మహాభాగ్యంగా భావించాను.

మర్నాడు సాయంకాలానికి ఆ పెద్ద మనిషి  అచ్చయిన ఆ నాటిక  కరపత్రం తీసుకొచ్చి నాకిచ్చారు. అంతమంది మహానటుల పేర్లు అడుగున మల్లమాంబగా ‘గాన సరస్వతి’ ధూళిపాళ సీతారామశాస్త్రి అని చదివాను. ముచ్చెటమలు పోసాయి. గుండె దడదడలాడిపోయింది. ఆయన రెండు చేతులూ పట్టుకుని “నాకా వేషమే రాదు బాబూ! సంగీతం తెలీదు, కేవలం వేషం వెయ్యాలనే దురాశతోనే వేషం వేస్తాను, అది నాకు వచ్చు” అని నేను విÖకు అబద్ధం చెప్పాను దయచేసి నన్నొదిలి పెట్టండి, మరొకచేత వేయించుకోండి” అని బ్రతిమాలతాను కానీ ఆయన ఒప్ప్పుకోలేదు. ఆయన కూడా ఒక నటుడేనని, మహానటులైన చిలుకూరి సుబ్బారావుగారి అల్లుడు సి.వి.చలపతిరావు గారనీ తర్వాత తెలుసుకున్నాను.

నాటకం రోజు రానే వచ్చింది. ఆ చలపతిరావు గారొచ్చి నన్ను రేపల్లె తీసుకెళ్లారు. ఆరోజు నాటకం జరుగుతున్న సినిమా హాలుకు సాయంత్రం ఆరు గంటలదాకా పెద్దనటులంతా వచ్చిచేరారు. రాత్రి ఎనిమిదన్నర కల్లా అందరూ మేకప్‌రూంలో వేషధారణ చేసుకుంటున్నారు. మేకప్‌మాన్ రత్తయ్య నన్నొక మÖల కూర్చోపెట్టి మేకప్ చేస్తున్నాడు. అక్కడే మేకప్‌చేసుకుంటున్నా మాధవపెద్ది వెంకట్రామయ్యగారు ఎడమ అరచేతిలో రంగువేసుకుని కుడిచేతిలో == మర్దన చేసుకుంటూ “అబ్బీ! రత్తయ్య! ఇవ్వాళ మల్లమ్మెవరు? అని అడిగారు.

ఇక్కడొక విషయం మనవి చేస్తాను- ఆరోజుల్లో నాటకాల ట్రూపులు ఎన్నోవున్నా,  ప్రఖ్యాతి చెందిన నటులంతా వ్యక్తిగతంగా విడిగా వచ్చి కిరాయి నాటకాలు ప్రదర్శించే పద్ధతికూడా అమలులో వుంది. అలాంటిదే ఈ రోజు జరుగుతున్న u£బ్బిలియుద్ధం నాటకం ప్రతివారు తమతమ పాత్రలకు ప్రఖ్యాతిచెందినవారే గానీ  అందరూ కలసి ఒక ట్రూపుగా ఉన్నవారు మాత్రం కాదు. అందువలన కనీసం నాటక ప్రదర్శనకు ముందు ఒకసారైనా ఎవరు ఏ పాత్ర వేస్తున్నారో ఎంత పోర్షన్ చెబుతారో ఎంత ఒమిట్ చేస్తారో, ఎంత శృతిలో పాడుతారో అని ముఖ్య పాత్రధారులు తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే నాటకం రసాభాస అవుతుంది. ఎంత ప్రతిభావంతులైన నటుడైన,  తన  పక్కనున్న పాత్రధారులు సమర్థులు కాకపోతే, అతని నటన కూడా రాణించదు. కనుక అలా తెలుసుకోవడం పెద్ద నటీనటుల కనీసధర్మం.

అందుకే మాధవపెద్ది వెంకట్రామయ్యగారు మల్లమ్మ ఎవరు? అని అడిగి వుంటారు. అప్ప్పుడు “ ఈ అబ్బాయేనండీ, పేరు సీతారామశాస్త్రి, ఊరు గుంటూరు” అని నన్ను చూపించారు రత్తయ్య. నేను వెంటనే వినయంగా నమస్కరించాను. నీ శృతి ఎంతబ్బాయ్? అన్నారు. “ఎంతచెప్పాలో నాకే తెలీదు ఆ! నాలుగు, నాలుగున్నర ఉంటుంది” అన్నాను. “పోర్షన్ ఏమైనా ఒమిట్ చేస్తున్నావా? “అబ్బేలేదండీ”! నాటకమారంభమయ్యింది.

కిక్కిరిసిన ప్రేక్షకులతో నాటకం హాలంతా నిండిపోయింది. ఢాంఢాం అని టపాకాయలు పేల్చేస్తున్నారు. u£బ్బిలివీరులు పాపారాయుడు, వెంగళరాయుడు, నాలుగు నాలుగున్నర శృతిపై పద్యాలు చదువుతూ రంగస్థలం విÖద కోపోద్రేకాలు ప్రదర్శిస్తూ ఉంటే అందరికీ ఒళ్లు ..........ప్రేక్షకులోకమంతా గాలి కూడా పీల్చనంత ఏకాగ్రతతో నాటకం చేస్తున్నారు. బుస్సీదొర తరపున రహస్యంగా వచ్చి పట్టుబడిన గూఢాచారికి రంగరాయుడు అభయవిÖచ్చే సీను కూడా అయిపోయింది.

ఇటు u£బ్బిలి సంస్థాన వారికి, అటు విజయనగరం సంస్థానం వారికి అభిప్రాయం భేదాల వల్ల యుద్ధ వాతావరణం నెలకొన్నకాలం. u£బ్బిలి పట్టమహిషి మల్లమాంబకు పగలే ఒక కల వచ్చింది. ఆ కలలో భయ బ్రాంతురాలై “హా! నాధా సకల జగదేక వల్లభా ! ఆనాధను రక్షింపుము” అని కేకపెట్టింది, ఈ ఆర్తనాదం విన్న భర్త రంగరాయుడు “నన్నుకొట్టి నిన్ను కొట్టనెంచిన దుష్మాత్ముడెవరు? వానినిప్ప్పుడే ఈ కరపొలంబున కాహారము గావించెదను” అని “పాతాళంబునన్ దూరినన్.... అనే పద్యాన్ని  పెద్ద శృతిలో పై స్థాయిలో కోపోద్రేకంతో గడగడ చదువుతూ, పిడుగులు పడ్డట్టుగా గంభీరనాదం చేస్తూ పులిలాగా రంగస్థలం విÖదకు దూకారు. ‘వెవడా దుర్మార్గుడు? నిర్భయంగా చెప్ప్పు, వాడిని వాడి వంశాన్నీ నిర్మూలం గావిస్తాను” అని కత్తిదూసి బుసలు కొడుతున్నారు. మాధవపెద్ది వెంకట్రామయ్యగారు. అక్కడ “వయసున పెద్దవాడు.. “అనేపద్యం నేను చదవాలి. హార్మోనిస్టు శృతి ఇచ్చాడు. నేను పద్యమారంబించాను. కానీ శృతి కలవలేదు. మతి చెడిపోయింది. ఏవిÖ చెప్పలేక భయంతో ఏడుస్తున్నాను. నాలోపం గ్రహించేసిన మాధవపెద్ది వెంకట్రామయ్యగారు ఆ సీనుకు ఔచిత్య భంగం కలగకుండా, ప్రేక్షకులకు నా అసమర్థద తెలీయనీయకుండా “దేవీ! భయములేదు చెప్ప్పు, ఎవడువాడు? “అంటూ తొందరపెడుతున్నాడు. వాడిపేరు నేను చెబితేనే గానీ తన పద్యానికి లింకు దొరకదు. ఈలోగా నేను మెల్లిగా “ఇప్ప్పుడా విజయరామరాజయమున్.... అని శృతిలో కలవకుండానే అందించాను. నాలోపంవలన శృతి తప్పినట్లు జనులు గ్రహించకుండా “దేవీ! భయబ్రాంతురాలై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక స్త్రీకి ఇలాంటి ==== స్వభావసిద్ధకు, ఇక నీకాభయంలేదు” అని అంటూ “ఓరీ విజయరామరాజ !.... “అని ఫెనుతుఫాన్‌లాగా చెలరేగి, కరవాలంతో వీరత్వాన్ని ప్రేక్షకుల గుండెలు అదిరేటట్లు సమాసభూయిష్టమైన ఆ పద్యాన్ని పూర్తిచేసారు. హాలంతా ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. అంటే నా బలహీనత వల్ల పద్యం చదవలేక పోయాననే స్పృహా ప్రేక్షకులకు కలుగనీకుండా నా నటనచాతుర్యంతో గాద్గదికంగా పద్యం చదివాననే భావం ప్రేక్షకులకు అందించారు వెంకట్రామయ్యగారు. సీను బ్రహ్మాండంగా రక్తికట్టించింది. ఆ సీను కాగానే మేకప్‌రూంకు వచ్చి వేషం తుడుచుకుంటున్నాను. తలెత్తి ఇతరలను చూడడానికి కూడా సిగ్గు పడుతున్నాను. ఈలోగా “నిన్ను మాధవపెద్ది వెంకట్రామయ్యగారు రమ్మంటున్నారు, బయట ఉన్నారు” అని కబురువచ్చింది. నేను హడలిపోయాను. సిగ్గుపడుతూ మెల్లగా వారి దగ్గరకు వెళ్లాను. అప్ప్పుడు రాత్రి రెండవుతోంది. ఆయన సినిమాహాలు గోడకు ఒకకాలు ఆనించి చీతీ కాలుస్తు నిల్చున్నాను. “ఏ ఊరబ్బాయ్ నీది? “అయ్యా క్షమించండి తెలీకవచ్చాను యిలా నసగుతూనే వుంటే ఆయన అవేవిÖ పట్టించుకోకుండా“విÖదే ఊరు?” అని మళ్లీ ప్రశ్నించారు. గుంటూరు. ఏం చేస్తున్నావ్? ప్లీడరు గుమస్తాగా ఉంటున్నాను. ఇలా అడుగుతూ అడుగుతూ “చూడబ్బాయ్ ! నాకో వేషం వేసి పెడతావా?” అన్నారు. నాకు ఏం చెప్పాలో తెలీలేదు. “అయ్యా ! నేనిక ఏ వేషాలు వెయ్యను క్షమించండి” అని చెప్పాను. ఆయన నా మానసిక ఆవేదనను బాగా గ్రహించినట్లున్నారు. ‘అబ్బీ ! శృతి పోయిందని బాధపడుతున్నావు. భయపడకు నేను చెబుతున్నాను. డైరీలో రాసి పెట్టుకో”.

“తెలుగుదేశంలో ఒకనాటికి నీవు ప్రఖ్యాత నటుడివై భాసించి చరిత్ర సృష్టిస్తావు. పెట్టు విÖసం, ఇక వేయక ఆడవేషం” అని ఎంతో ఆదరంగా పలికారు. నా ఆనందానికి అంతులేదు. ఇంకా “అబ్బాయ్! నీకు వయసొస్తుంది. గొంతు మారిపోయింది. గంభీరపురుషనాతం పలుకుతోందిగన్క ఆడవేషాలెయ్యక మగవేషాలేవేయి, అభ్యాసంచేస్తే నీకు కావల్సిన నాటకలక్షగాలన్నీ నటరాజస్వామి ప్రసాదిస్తాడు” అని చెబుతూ తన “వీరాభిమన్యు” నాటకంలో అభిమన్యుడి వేషమెయ్యమని అన్నారు. నేనూ తమ ఆశీర్వాదముంటే వేస్తానన్నాను.

మహానటులు మాధవపెద్ది వెంకట్రామయ్యగారు పలికిన పలుకులే మదిలో మెదులుతున్నాయి. మనసులోని ఆశాజ్వాలలు అంతరిక్షానికి పరుగులు తీస్తున్నాయి. ఏమైనా విÖసం పెట్టి పురుష పాత్ర ధరించితీరాలి అని తీర్మానించుకున్నాను. కానీ sTÖ తీర్మానానికి శ్రీకారం చుట్టడం ఎలా? ఎప్ప్పుడు? ఏం చేయాలి? అని దిక్కుతోచని స్థితిలో వున్నాను. అది కూడా మా గురువుగారు వేసిన “దురోధనపాత్ర”నే వేయాలని నిశ్చయించుకున్నాను. ఇతరులెవ్వరూ అవకాశం ఇవ్వరూ గనుక నేనే, నా మిత్రుల్ని కూడగట్టుకొని “శ్రీకృష్ణరాయబారం” నాటకం వేయాలని అనుకొన్నాను. అప్పుడు నా నివాసం గుంటూరు బ్రాడీపేట. కృష్ణుడు కొర్రపాటి శేషగిరిరావు, అర్జునుడు దర్శి శేషగిరిరావు, కర్ణుడు జగర్లపూడి సత్యన్నారయణ, దుర్యోధనుడు నేను. ఇలా కొందర్నీ ప్రోగు చేసుకొని రాయబారం నాటకం ప్రారంభించాం. గుంటూరు 5,6 మైళ్ల దూరంలో ఉన్న “దామేపల్లి” గ్రామంలో నాటకం వేద్దాం అని అనుకొన్నాం. అందరం చందాలు వేసుకొని, డ్రస్సు వగైరాలు మాట్లాడుకొని నాటకం ఏర్పాటు చేశాం. ఒక ఎడ్లకొట్టం నాటకం వేయటానికి మాట్లాడుకొన్నాం. మేకప్‌తో సహా నాటకానికి డ్రస్సు కంపెనీ కిరాయి ఐదు రూపాయలు. కరపత్రాలు అచ్చు వేయించాం. ఒక ఎద్దులబండి మాట్లాడుకొని మేమందరం సైకిళ్లమీద కొందరు, నడిచి కొందరు బయల్దేరాం. అయితే వానల వల్ల పొలాల డొంకంతా బురదబురదగా ఉంది. కొంతదూరం పోయేసరికి ఒక చోట బండి చక్రాలు బురదలో దిగబడ్డాయి. అయితే ఏం? కోడె దూడల్లాగా మేమంతా కుర్రాళ్లం ఉన్నాం. నాటకం వేయాలనే ఉత్సాహం ఊరుకులు పరుగులు తీస్తున్నది గదా! అతి తేలికగా ఆ బండిని బురద దాటించాం. అనుకున్నటైంకే నాటక మాడించాం. ఆ తర్వాత వేల్పూరు గ్రామంలో రెండో నాటకం వేసాం.

తర్వాత లంకెల కూరపాటి నరసింహారావు, కోతూని రాఘవరావు వంటి పెద్దల సహకారంతో స్టార్ థియేటర్ ప్రారంభించాం. ఆ కంపెనీ కోసం గుంటూరు అరండల్‌పేటలోని పాలపర్తి హనుమంతరావు గారి మేడమీద ఒక గది అద్దెకు తీసుకున్నాం. ఆ మేడే sTÖనాడు శేషమహల్ సినిమా హాలుగా పిలువబడుతుంది. కంపెనీ ఖర్చులకు ప్లీడరు గుమాస్తాలు, కోర్టు గుమాస్తాలు అందరూ నెలకి రూపాయి చొప్పున చందా యిచ్చేవారు. అన్ని పాత్రలకు నటులు కుదిరారు గానీ అర్జునుడి పాత్రకు దొరకలేదు. చివరకు కురుచేతి నాగేశ్వరరావును అర్జున పాత్ర వేయమని అడిగాం. అతనికి అప్పటికే గుంటూరు ప్రాsతంలో నటుడిగా మంచి పేరుంది. అలాంటి పేరున్న వ్యక్తికి నా పక్కన అర్జునుడుగా వేయడం చిన్నతంగా తోచింది. నిన్నటిదాకా నా పక్కన ఆడవేషాలు వేసిన ధూళిపాళ దుర్యోధనుడు వేస్తే, వాడి పక్కన నేను, అర్జునుడు వేయాలా? అని తిరస్కరించాడు. పెద్దలందరూ చేరి ఎలాగోలా ఒప్పించారు. “పాడవోద్యోగ విజయాలు” నాటకం ప్రారంభించాం. మొదటి నాటకం గుంటూరు పక్కనే చెమళ్లమÖడి అనే గ్రామంలో ఏర్పాటు చేశాం. అందరిలోకి పేరు లేని వాన్ని! పూర్తిగా ఉత్సాహం ఉన్నవాడ్ని. నేనే గనుక ప్రతి పని నా నెత్తిన పెట్టేవారు. చెమళ్లమÖడి నాటకం ఏర్పాటు కూడా నాకే పెట్టారు. ముందుగా వెళ్లి గోడలకు వాల్‌పోస్టర్లు అంటించడం, పబ్లిసిటీ వగైరా పనులకు కూడా నేనే వెళ్లేవాడ్ని. అలా అక్కడక్కడ పల్లెల్లో సొంత నాటకాలు పెట్టుకోవడం, శ్రమ చేయడం నాకు అలవాటైపోయింది.

ఈ నేపథ్యంలోనే 1941-42 ప్రాంతంలో అబ్బూరి వరప్రసాదరావు గారి ట్రూపు కూడా వెలుగులోకి వచ్చింది. ప్రతి వూర్లో ఒకసారి అబ్బూరినాటకం జరిగితే మళ్లీ స్టార్ థియేటర్ నాటకం ఆడించేవారు. వాళ్లకు మంచి కలక్షన్స్ వచ్చేవి. మాకంటే వారే ఎక్కువ నాటకాలు ప్రదర్శించగలిగేవాళ్లు. అవసరమైన చోట వాళ్లు బయట నుంచి ప్రఖ్యాత నటుల్ని తీసుకొచ్చి నాటకాన్ని ప్రదర్శించేవాళ్లు. కొంతకాలం జరిగిన తర్వాత మేం కూడా ఇతర ట్రూపుల్లోకి కిరాయి నటులుగా వెళ్లటం ప్రారంభిస్తుంది.

స్వతంత్రంగా రాణించే శక్తి లేకపోతే కళాకారుడికి కష్టాలు తప్పవు. నా స్వానుభవమే మనవి చేస్తాను. ఒక ఊళ్లో మా ట్రూపులోనే ఉద్యోగవిజయాలు నాటకం ప్రదర్శిస్తున్నాం. ఆనాటకంలో మొదటి అర్జునుడు బంగారు కోటయాచారి. అతనిది చాలా పెద్ద శ్రుతి, ఆనాఇకి నాదింకా ప్రాథమిక దశ అని చెప్పుకోవచ్చు. నేను దుర్యోధనుడు. దురదృష్టవశాత్తు ఆ నాటకానికి మా హార్మోనిస్టు 

రాలేదు. కృష్ణుడి పడకసీనులో అర్జునుడుగా కోటయాచారి ‘నందకుమార యుద్ధమున...’ అనే పద్యం చక్కగా చదివాను. జనం వన్స్‌మోర్ అన్నారు. ఆ వెంటనే ‘రధమునందెన్ని చిత్రంపు...’ అనే పద్యం నేను చదవాలి’ హార్మోనిస్టు నా శ్రుతి యివ్వలేదు. ఆవేశంతో పద్యం ప్రారంభించాను అతని శ్రుతిలోనే. పైకి వెళ్లేసరికి శ్రుతి అందలేదు. గొంతు u£ంగురు పోయింది. జనం నవ్వారు. నాకు తల తెగనరికినంత పనయ్యింది. అవమానభారంతో కృంగిపోయాను.

sTÖ స్థితిలో అర్జునుడుగా రాబోతున్న కురిచేటి నాగేశ్వరరావు. నన్ను పిలిచి “ఆ అయిందిగా. ఇక చాలు - చాలా బాగుంది. ఇకరా” అని హేళనగా నవ్వాడు. ఆ ఘట్టం ఈ నాటికే గాదు. ఏనాటికీ మరువలేను. అయితే ఇలాంటి అపహాస్య సంభాషణలే నన్ను నటుడిగా తీర్చిదిద్దాయి. నవ్విన వాటి కన్న ఉత్తమ నటుడనవ్వాలన్న దీక్షతో అనుక్షణం కఠోర తపస్సు చేశాను. ఒక్క విషయం మాత్రం నిజం - నా నటజీవితంలో నిరంతరం సహకరించిన ఉళక్కికి ఎంతస్థానం వుందో నన్ను అవహేళన చేసి, నా హృదయాన్ని అగ్నితో రగిల్చిన కుర్చేటి నాగేశ్వరరావుకు కూడా అంతే స్థానం ఇచ్చాను. అందుకే వారిద్దరికీ ఒకే వేదిక మీద ఘనసన్మానం చేశాను. అలాంటి అవమానమే అతను చేయకపోతే నాలో ఇంత పట్టుదల పెరిగేది కాదేమో! అంతా భగవదేచ్ఛ. 

కుర్చేటి నాగేశ్వరరావుతో కలసి, స్టార్ థియేటర్ ట్రూపుగా నాటక ప్రదర్శనలిస్తూనే వున్నాం. నాకు కూడా ప్రజల్లో ఒక గుర్తింపు వచ్చింది. అక్కడక్కడా చక్కని ప్రశంసలు కూడా వచ్చాయి. 1943లో కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు అనే గ్రామంలో పశువుల సంత జరిగింది. ఆ సంతలో ‘ఉద్యోగవిజయాలు’ నాటకం ఏర్పాటు చేశారు. ఆ నాటకంలో మిగిలిన పాత్రలన్నీ ఆ ప్రాంతీయులే ధరించి, దుర్యోధనుడుగా నన్ను, ధర్మరాజుగా ముప్పవరపు భీమారావు గార్ని గుంటూరు నుంచి బుక్ చేసుకున్నారు. నాకు ఖర్చులు గాక ఇరవైరూపాయలు ఇచ్చారు. నాటకం బాగానే జరిగింది. ఆ నాటకంలో నన్ను ప్రత్యేకంగా ప్రశంసించడమే గాక నాకు ఒక రజిత పాత్రను బహూకరిచారు. అదే నా నటజీవితంలో ప్రప్రథమంగా అందుకున్న బహుమానం.

1949వ సంవత్సరంలో ఆంధ్రప్రభుత్వ ఆస్థానకవి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి సన్మానసంఘం వారు, అఖిలాంధ్ర పాండవోద్యోగ పోటీ నాటకాలు ప్రకటించారు. పోటీలు గుంటూరు ఏ.సి.కాలేజీలో ఏర్పాటు చేశారు. పోటీలు వారం రోజులు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ట్రూపులు పోటీలకు వచ్చాయి. కొన్ని ట్రూపుల్లో దుర్యోధనపాత్రకు, నా కన్న సీనియర్లు పేరున్న వారూ వున్నారు. నేనేం భయపడలేదు. అప్పుడు నాకు 28 సంవత్సరాలు. శరీరసౌష్ఠవం, గాంభీర్యం, ఉచ్ఛారణ, స్పష్టత తగమోతాదుతో సాత్త్విక, ఆంగిక, అభినయం, చక్కని మార్కులను ప్రసాదిస్తాయని నా ఊహ. ఏమైనా దైవకటాక్షం ప్రథమం అని భావిస్తూ పరిశ్రమిస్తున్నాను. రోజుకొక్క నాటక ప్రదర్శనమే జరుగుతున్నది. చివరిరోజు ప్రదర్శన మా స్టార్ థియేటర్ వారి నాటకం. నాటకం దిగ్విజయంగా జరిగింది. జమ్మలమడక మాధవరామశర్మ, తెలికచర్ల వెంకటరత్నం, ముద్దుకృష్ణ గార్లు న్యాయనిర్ణేతలు. ప్రేక్షకులు మొదలు కళాకారుల వరకు ఆతృతతో, అతి ఉత్కంఠతతో ఫలితాలకోసం వర్ణనాతీతం. ప్రథమ ప్రకటనగా, కృష్ణ పాత్రధారి పీసపాటి నరసింహమÖర్తి అన్నారు. తర్వాత ‘సుయోధనుడు’ అని అనేసరికి ఇతరులకేమోగానీ నా గుండె మాత్రం దడదడలాడిపోయింది. “సుయోధనుడు - ధూళిపాళ సీతారామశాస్త్రి” అని బిగ్గరగా ప్రకటించారు. ఇక నా ఆనందాన్ని ఎన్ని పేజీల తరబడి చెప్పినా మాటలు చాలవు. 

ఒక్కో విజేతకు అయిదు శవర్ల నటరాజ విగ్రహం ఇస్తామని ప్రథమంలో ప్రకటించారు. కానీ పోటీలు పూర్తయిన తర్వాత 5 శవర్లు ఇవ్వలేం. 2” శవర్లతో నటరాజ స్వామిని చేయిచిస్తామన్నారు. పోటీలు జరిగిన మరుసటి నెలలో విజయవాడలో విజేతలందరికీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, టంగుటూరి ప్రకాశం పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు గార్ల చేతుల మీదుగా విజేతలకు, సువర్ణ నటరాజ విగ్రమాలను పై తెలిపిన మహనీయులందరి సంతకాలతో ప్రశంసాపత్రాల్ని వేలాది మంది జనుల హర్షద్వానాలు మధ్య బహుకరించారు. దాంతో, నా నటజీవితంలో మరో మెట్టు పైకెక్కాను. క్రమేణా నన్ను కూడా బయ కాంట్రాక్టు నాటకాల్లో ఒక దుర్యోధనుడుగా మార్కెట్టులోకి దించారు.

1941లో నా చేతుల మీదుగా ప్రారంభించిన స్టార్‌థియేటర్ 1951 వచ్చేసరికి లుకలుకలు ప్రారంభమై, మనస్పర్ధలు పెరిగాయి. కుర్చేటి నాగేశ్వరరావు స్టార్‌థియేటర్ నుంచ విడిపోయి లంకా పిచ్చయ్యశాస్త్రిగారితో కలిసి ఒక కంపెనీ పెట్టుకున్నాడు. ఇంకా ముప్పవరపు భీమారావు, పాపరాజు రమణరావు, గుంటుపల్లి వెంకటరత్నం మొదలైన వారంతా కూడా వేరే కంపెనీల్లో చేరిపోయారు. దీంతో దుర్యోధనుడుగా రంగస్థలం మీద నేను స్థిరపడినా, మా స్టార్‌థియేటర్‌కు మాత్రం వన్నె తరిగిపోయింది. 

కాంబినేషన్ నాటకాలు బహుళ ప్రచారంలో వున్నా, వాటిపైన సంస్కార వంతులు వెలిబుచ్చే అభిప్రాయాలు. విసిరేవిమర్శలు తలచుకుంటూంటే ఒక కొత్తనాటకం తీసుకుని ప్రదర్శించుదామా అనే ఆలోచన కలిగింది. సుదర్శన వేణుగోపాలకృష్ణమÖర్తి గారు “పరశురామ” అనే నాటకం రాసిస్తాను. మీరు “పరశురాముడు” వేయండి. చాలా మంచి పేరు వస్తుంది. అని చెప్పారు. సరేనని హార్మోనిస్టు హుళక్కి సహకారంతో నాటకం ఆడించాలనుకున్నాను. మల్లాది సూర్యనారాయణ (జమదగ్ని), పువ్వుల అనసూయ (రేణుక), మొదలైన నటీనటులనంతా బుక్‌చేసుకున్నాను. మొదటినాటకం గుంటూరు ఏకాదండయ్య పంతులు హాలులో పెట్టాం. అందులో నా నటనకు మెచ్చి అప్పటి మునిసిపల్ కమీషనర్ వాసుదేవన్‌గారు ఒక వెండి గడ్రంగొడ్డలి బహూకరించారు. నాటకం బాగానే జరిగిందిగానీ వ్యాపారాత్మకంగా మార్కెట్టులో నిలువలేక పోయింది. మరోసారి విజయవాడ ఆలిండియా రేడియో ఆరుబయట రంగస్థలం మీద sTÖ నాటకమే ప్రదర్శించాం. అప్పుడు పింగళి లక్క్ష్మీకాంతంగారు ఎ.ఐ.ఆర్. డైరెక్టరుగా వున్నారు. అది రాష్ట్రమంతా ప్రసారమైంది. ఆ తర్వాత ‘పరుశురామ’ మళ్లీ ఎప్పుడూ ప్రదర్శించిన జ్ఞాపకం లేదు. 

భగవంతుని అనుగ్రహం బండి సక్రమంగానే నడుస్తూ వుంటుంది. వృత్తిపరంగా కొన్నాళ్లు కష్టపడి పని నేర్చుకుని గుమాస్తానయ్యాను. మా అడ్వకేట్ కొల్లి బసివిరెడ్డిగారు మంచి కళాభిమానులు, సహృదయులు. అప్పుడు నా జీతం నెలకు ఎనిమిది రూపాయలు. జీతం ఎంతైనా నాటకరంగంలో నేను పైకి రావడానికి ఆయన పరోక్ష సాయం చాలామేలు చేసింది. అందుకు నేను వారికి సదా కృతజ్ఞతలు తెల్పుకుంటూనే వుంటాను. నేను ఎక్కడ నాటకానికి వెళ్లినా నన్ను ఇబ్బంది పెట్టేవారుకాదు. నేను చిన్నతనంలో ఎనిమిదో తరగతి మాత్రమే చదివిన తర్వాత హిందీ రాష్ట్రభాషా విశారద డిగ్రీ పుచ్చుకొని, నా ముప్ఫై రెండోఏట మెట్రిక్‌లేషన్ ప్యాసై ఆ పిమ్మట ఇంగ్లీషు లోయరు ప్యాసై జాబ్‌వర్క్స్ చేస్తూ వుండేవాడ్ని. ఆ ఆదాయంతో నాకేలోటు వుండేదికాదు. నేను ఇంగ్లీషు టైప్ నోయింగ్‌క్లార్కుగా అందిరికి తెలిశాను. కనుక పెద్ద పెద్ద వకీళ్లు నన్ను తమ దగ్గరికి రమ్మని పిలిచేవారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ నేను నాటకాలను తిరగటానికి అవకాశం ఉండదు. గనుక బసివిరెడ్డిగారి దగ్గరే ఉంటూ, బయట నుండి జాబ్‌వర్క్ తెచ్చుకుని టైపు చేసుకోవడంతో నాకు తీరిక ఉండేదికాదు. 

వకీలు గుమాస్తాగా తలపాగా చుట్టుకుని కోర్టులో తిరిగిన తర్వాత అదే తలపాగాతో, అదే కోర్టులో లాయరు కావాలనే సంకల్పం కలిగింది. ఆ కాలంలో ఇంటర్మీడియట్ ప్యాసైతే ఎల్.ఎల్.బి. చదివి లాయరు కావచ్చు. కానీ నేను ఇంటర్ ప్యాస్ కాలేదు గనుక అది పూర్తి చేయాలనుకున్నాను. ఆంధ్రయÖనివర్సిటీలో ఇంటర్మీడియట్ ప్రయివేట్‌గా చదువుకోవడానికి అవకాశం ఉన్నది గాని, దరఖాస్తుదారు ఏదో గవర్నమెంటు సర్వీసులో ఉండాలి అని ఉన్నది. ఆంధ్రాయÖనివర్సిటీ రిజిష్ట్రారు కె.బి.గోపాలస్వామి నాయుడు గారు నాకు తెలుసు. వారి దగ్గరకెళ్లి ఇంటీర్మడియట్ చదువుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని అడిగాను. ఆయన నో నో...... Yశీu sష్ట్రశీuశ్రీd అవఙవతీ bవcశీఎవ a శ్రీawyవతీ. Yశీu ఎust శ్రీఱఙవ as aఅ actశీతీ. Yశీuతీ జూశ్రీacవ ఱఅ tష్ట్రవ sశీcఱవty ఱs aఅ actశీతీ అశీt a శ్రీawవyవతీ. అని ప్రేమతో ఆవేశంగా అన్నారు. అప్పటికీ నేను సంతృప్తి చెందక అజ్మీరు యÖనివర్సిటీ ఇంటరుకు డబ్బు కట్టాను. అడ్వకేటు గాదె వీరాంజనేయశర్మ గారి దగ్గర పాఠాలు చెప్పించుకున్నాను. ఆ సమయంలోనే మా అమ్మాయికి పెళ్లి పెట్టుకోవడం వల్ల అజ్మీరు పరీక్షలకు వెళ్లలేకపోయాను. ఈలోగా నాటకరంగంలో నిర్విరామంగా పర్యటన చేయాల్సివచ్చింది. ఒక్కోనెలలో ఇరవై లేక ఇరవై అయిదు నాటకాలు వుండేవి. అలా కాలం గడిచిపోయింది. ఆంధ్రదేశం అంతటానే గాకుండా తెలుగువారు నివసిస్తున్న ప్రతి ప్రాంతంలోనూ “దుర్యోధనుడు” అంటే “ధూళిపాళ” అనే పేరు వచ్చేసింది. ఆ పేరే తర్వాత నన్ను సినిమా రంగానికి తీసుకుని వెళ్లిందిగానీ వకీలు కావాలనే ధ్యేయం మాత్రం నెరవేరలేదు. 

అవి బహుశా 1959 సం॥రం చివరిరోజులు. పీసపాటి నరసింహమÖర్తితో కలిసి ముమ్మరంగా నాటకాలు దేశవ్యాప్తంగా ఆడుతున్నాను. ఓసారి విశాఖపట్నంలో రెండు నాటకాలు పెట్టారు. మొదటిది ‘ఉద్యోగ విజయాలు’, రెండోది ‘గయోపాఖ్యానం’ ఎందుకనో ‘మయసభ’ సీను పెట్టలేదు. జూదం సీను నుండి నాటకం ప్రారంభమైంది. ధర్మరాజుగా ఏ.ఎస్సార్ ఆంజనేయులుగారు “చక్కని మేనువాడు, గుణసంపద ఇంద్రుని బోలినాడు...” అనే పద్యం పాడుతున్నాడు. జనాల్లో అల్లరి ప్రారంభమైంది. “మాఉ మయసభకావాలి” అని పెద్దగా అరుస్తున్నారు. “మయసభలేదు జూదం సీను నుండే.. నాటకం ప్రారంభమని కరపత్రాలు ప్రచురించాం” అని నిర్వాహకులు చెప్పారు. జనం వినిపించుకోలేదు. “మయసభ లేకపోతే మా టిక్కెట్ల డబ్బు మాకు వాపసు యివ్వండి, మేం వెళ్లిపోతాం” అని అరిచారు. అప్పుడు పీసపాటి నా దగ్గరకొచ్చి “బావా! మయసభలో ఎంటర్‌కా! లేకపోతే నాటకం రసాభాసమవుతుందన్నాడు. చేసేది లేక ‘మయసభ’ ఆడాను. ప్రేక్షకులు ముగ్ధులైపోయారు.

రాత్రి రెండు గంటలు కావస్తోంది. ఆనాడు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రఖ్యాత సినీనటుడు గుమ్మడి గారికి సన్మానసభ ఏర్పాటు చేశారు. ఒక దుశ్శాలువా, వెండి సరస్వతి షీల్డునిచ్చి ఘనసన్మానం చేశాను. ఆ తర్వాత గుమ్మడిగార్ని మాట్లాడమనికోరారు. ఆయన “ఈనాడు నా నటజీవితంలో గొప్పసుదినం. మా గురువుగారు శ్రీ మాధవపెద్దివారు కాలగతి చెందిం తర్వాత సరి అయిన దుర్యోధనులు లేరనుకున్నాను. ధూళిపాళ సీతారామశాస్త్రిగారు ఆ నా అనుమానాన్ని నివృత్తి చేశారు. మాధవపెద్ది గారు లేనిలోటు ధూళిపాళ గారు భర్తీ చేశారు” అని ప్రశంసిస్తూ, అర్గనైజర్స్‌ను ఒక కోరిక కోరారు ‘అయ్యా! ఇలాంటి కళాకారులను చూచి నేను రిక్తహాస్తాలతో, శుష్కవాక్యాలతో వెళ్లడం సముచితం కాదు. ఏదైనా కానుక ఇద్దామనుకుంటే నేనా ప్రయత్నంలో రాలేదు. గనుక మీరు అనుమతిస్తే నాకిచ్చిన వెండి షీల్డును నాకు నచ్చిన కళాకారునికి యిస్తాను. అందుకు మీరనుమతించండి!’

నిర్వాహకులు ఆమోదించారు. “నాకు sTÖరోజు విశేష సంతృప్తిని కలిగించిన ధూళిపాళగార్కి నా షీల్డును బహూకరిస్తున్నాను.” అని చెప్పి నన్ను గాఢాలాగనం చేసుకుని మనసారా అభినందించారు. నామేను పులకరించింది. అణువణువూ పరవశించింది. ఒక్కసారి మా గురుదేవులు మాధవపెద్ది వారికి మనస్సులోనే పాదాభివందనం చేసుకున్నాను. వారి అమృతవాక్కు నిజమయ్యిందని తృప్తి చెందాను.

నాకు గుమ్మడిగారికి అదే తొలి పరిచయం. అయినా అంత విశాల హృదయంతో, వేలాది ప్రజానీకం ముందు తనకిచ్చిన బహుమతిని మరో నటుడికిచ్చి కౌగిలించుకోవడం చాలా అరుదైన విషయం. ఆ మర్నాడే అక్కడే, మా ట్రూపుతో “గయోపాఖ్యానం” నాటకం ప్రదర్శించాం. అందులో నేను గయుడు. ఆ రెండో నాడు మద్రాసులో “రోషనార” నాటకం. ఆ నాటకమే నేను సినిమారంగంలో ప్రవేశించడానికి కారణభూతమైంది. ప్రఖ్యాత రంగస్థల, సినీనటులు ఏ.వి.సుబ్బారావుగారు “రోషనార”  ఏర్పాటు చేశారు. ఆనాటి నాటకంలో నేను “రామసింహుడు” టి.నగర్ పానగల్ పార్కుకు దక్షిణంగా ఆనాడు వున్న కృష్ణగానసభలో నాటకం ప్రారంభమయ్యింది. ఆ నాటకానికి ముఖ్యఅతిధిగా ప్రఖ్యాత దర్శకనిర్మాత బి.ఏ.సుబ్బారావు విచ్చేసారు. నాటకం ప్రారంభమైన ఇరవై నిముషాలకు నా పాత్రప్రవేశం అవుతుంది. నిలువెత్తు దేశాభిమానం గల వీరపురుషుడుగా రంగస్థలం మీదకు ఒక్క గంతుతో దూకాను. నా డైలాగులు ప్రారంభించాను. మెట్టుమెట్టుగా క్రమేణా ధ్వని పెంచుతూ, చివరకు ఉన్నతస్థాయికి తీసుకొని పోయి, అక్కడ డైలాగు పరిసమాప్తి చేస్తూ మళ్లీ కర్టెనులోకి ఒక దూకు దూకాను. దాంతో కృష్ణగానసభ హాలంతా హర్షధ్వానాలతో ప్రతిధ్వనించింది. ఆ ధ్వనిలోనే ఒక స్త్రీగాత్రం “ఆహా! వాడురా యాక్టరంటే” అని పెద్దగా అరిచింది. నేను ఆశ్చర్యపడి తలతిప్పి పరికించి చూశాను. ఆమె ప్రఖ్యాత సినీనటి జి.వరలక్క్ష్మిగారు. రసానుభూతితో, ఆవేశంతో నిండుసభలో “వాడు” అని సంబోధించడం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఆమె అలా అన్నారని కోపం రాలేదు. అది ఒక భూషణగానే నేను భావిస్తాను. ప్రేక్షకుడు రసానుభూతితో తనను తాను మరచిపోయిన తాదాత్మ్యస్థితిలో అది సహజం. 

మద్రాసులో రోషనాన నాటకమైపోయి గుంటూరు చేరి, నాటకరంగంలో బిజీగా వుండగా, అంటే నాటకం జరిగిన ఇరవైరోజులకు దర్శక నిర్మాత బి.ఏ. సుబ్బారావుగారి లెటర్‌హెడ్ విÖద, ఏ.వి.సుబ్బారావుగారు నాకు ఉత్తరం రాశారు. “బీష్మ” చిత్రంలో నీకు వేషం వున్నది. వెంటనే మద్రాసు బయలుదేరి రమ్మని రాశారు. నాకు వెళ్ళాలనిపించలేదు మరో వారం రోజులకు “స్టార్టు ఇమిడియట్లీ” అని వచ్చింది. సరేనని బయలుదేరాను.

నేరుగా ఏ.వి.సుబ్బారావు గారింటికి వెళ్ళాను. ఆయన ఉదయం పదకొండు గంటలకు నన్ను బి.ఏ.ఎస్. ఆఫీసుకు తీసుకుని వెళ్ళారు. బి.ఏ. సుబ్బారావుగార్కి నన్ను పరిచయం చేస్తూ “ఇతనే ధూళిపాళ” మనం రమ్మన్నాం కదా! వచ్చాడు” అని చెప్పారు. బి.ఏ. సుబ్బారావుగారు కొంతసేపు ఎగాదిగా చూచి “నిజంగా నిన్నేనయ్యా? ఆరోజు నాటకంలో చూచించి” అని ఆశ్చర్యంగా అడిగారు. వేషం విÖద ఉన్ననాకు ఇంత తారతమ్య ఉంటుందా అని నేనూ ఆశ్చర్యపోయాను. బి.ఏ.ఎస్.గారు వెంటనే మేకప్‌మాన్ నరసింహుల్ని పిలిచి, ఈయనే మన సినిమాలో “దుర్యోధనుడు వేస్తారు. ఎలా వుంటుంది? అని అడిగారు. తర్వాత వాళ్లిద్దరూ ఏదో మాట్లాడుకొని, నన్ను సాయంత్రం రమ్మన్నారు. సాయంకాలం వెళ్లేసరికి భీష్మచిత్రంలో “దుర్యోధునుడిగా” నా అగ్రిమెంట్ టైపు అయివున్నది. షూటింగ్‌డేట్సుకు రెండ్రోజులు ముందుగా రమ్మని కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆ ప్రకారం నేను గుంటూరు వెళ్లి జైహింద్ సత్యంగారి స్టూడియోలో నాకు మేకప్ చేయించి స్టిల్స్ తీశారు. 

నాకు సినిమా షూటింగ్ కొత్తవిÖకాదు. బాగాగుర్తుచేసుకుంటే 1945లో అనుకుంటా- ప్రముఖనటుడు జంధ్యాల గౌరినాథశాస్త్రిగారు “గీతాంజలి” చిత్రం నిర్మిస్తూ నాకూ ఓ వేషమిచ్చారు. అందులో కొంచెం వయసు మళ్లిన గౌరినాథశాస్త్రిగారు హీరో పాత్రధరించి, ఆయన తండ్రిగా పాతిక సంవత్సరాల వయసున్న నన్ను ఆ వేషం వేయించారు. ఆ సినిమా విజయవాడ దుర్గామహాల్‌లో రిలీజైంది. చిత్రం పరాజయం పొందింది. అంతే - మళ్లీ సినిమా  ఊసే మర్చిపోయాను. మళ్లీ ఇప్ప్పుడు సినిమా జీవితం  పున:ప్రారంభం.

భీష్మ చిత్రంలో దుర్యోధునుడిగా మేకప్ అయింది. సాయంత్రం  నాలుగు గంటలకు సెట్లోకివెళ్లాం. యుద్ధ సన్నాహాలన్నీ పూర్తయిన తర్వాత దుర్యోధునుడు భీష్మడిని సర్వసైన్యాధ్యక్షుడుగా పట్టాభిషేకం జరిపించే ఘట్టం, సెట్లోకి అడుగుపెట్టేసరికి ఒక అడుగున్నర ఎత్తుగల ప్లాట్‌ఫారం విÖద నవరత్న ఖచిత సింహాసనం పైన తెల్లనిగడ్డం పెట్టుకొని, సకల రాజు చిహ్నాలతో వీరత్వం ఉట్టిపడుతూ ఒక కడువృద్ధుడు మెరిసిపోతున్నాడు. ఆయన ఎవరు అని అడిగాను. ఎన్టీరామారావు అన్నారు. ఆనాటికి రామారావు గారు నవయువకలు. అయినా కురువృద్ధులు భీష్మాచార్యుల వారి వేషంలో ముమÖ్మర్తులా భీష్మడిని పోలి ఉన్నారు. సర్వసైన్యాధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసే సందర్భంలో దుర్యోధుడికి ఒక పేజీ డైలగ్ ఉంది. ఆ కాగితం నాకు ఇచ్చారు. అది చదువుకుని వెంటనే కంఠస్థంచేశాను. షాట్ రెడీ చేశారు. వేదికవిÖద వున్న రామారావుగార్కి పరిచయం చేశారు బి.ఏ.ఎస్.గారు. “ఓ! వెరీగుడ్ వారి పేరు విన్నాం” అని చిరుదరహాసంతో కరచాలన చేసుకున్నారు.

రిహార్సలో నా పద్ధతి ప్రకారం అంత పెద్ద డైలాగ్ నిర్భయంగా చెప్పి, భీష్మునకు తళ తళ మెరిసే కత్తి, డాలు సమర్పించి, నమస్కరించాను. నా రిహార్సలుచూచి, ఓకే, లైట్స్ ఆన్ అన్నారు డైరెక్టర్‌గారు. “ స్టార్ట్ కెమెరా” అన్నారు.

నా డైలగ్ యధాతదంగా చెప్పి, భీష్మునకు నా కత్తి,డాలు సగౌరవంగా యిచ్చి నమస్కరించాను. వెంటనే భీష్ముడు (ఎన్టీఆర్) “సుయోధనా! నీ మనోభీష్టాన్ని నెరవేరుస్తానని ఇప్ప్పుడే అభయ ప్రధానం చేస్తున్నాను.” అని నా భుజం విÖద బలంగా చేయివేసి తడుతూ తనడైలాగు ముగించారు. దర్శకులు షాట్ ఒకే అంటూ నా దగ్గరకొచ్చి మెల్లగా సార్! డైలాగంతా కరెక్టే, కానీ రామారావుగారు చేయి వేసి భుజం తట్టినప్పుడు మీరు కదిలారు” అన్నారు.

“ఆయనగారు, నాకంటే ఎత్తుగా వున్నారు. భుజం మీద బలంగా చేయి వేసి ఊపితే కదలకుండా ఎలా ఉంటాను సార” అన్నాను. ఆ షాటు మళ్లీ చేద్దామన్నారు. సరేనన్నాను. నాడైలాగు, యాక్షను పూర్తయ్యింది. భీష్మ డైలాగు, యాక్షన్ పూర్తయ్యింది. భుజం మీద మళ్లీ చేయి వేశారు కానీ లోగడలాగా గట్టిగా ఊపలేదు. కాక - ఊపు తారని నేను కూడా స్టడీగానే వున్నాను. మొత్తం మీద షాట్ ఓ.కే. చేశారు.

నాకు కొంత ధైర్యం వచ్చింది. ఎన్టీరామారావుగారికి నాకు కలిగిన ప్రథమ పరిచయచ ఘడియ మహిమ ఏమోగానీ, తర్వాత్తర్వాత నేను పరిశ్రమను వదలి వచ్చేంతవరకే కాదు, తాను ముఖ్యమంత్రిగా ఉండి తుదిశ్వాస వదిలేవరకు కూడా మా స్నేహం, ఆస్వాయతలు అలాగే కొనసాగాయి. నేను ఎక్కువ సినిమాలు పనిచేసింది రామారావు గారితోనే.

నా ప్రథమ పౌరాణిక చిత్రం భీష్మ అయితే నా ప్రథమ సాంఘిక చిత్రం “కలిమిలేములు” (). గుమ్మడిగారు పాలేరుగాను, నేను జమిందారు గాను వేశాం. నాది విలన్ పాత్ర. ఆ చిత్రం కూడా విజయవంంతంగానే నడిచింది. అలా నా మొదటి రెండుచిత్రాలు శతదినోత్సవాలు జరుపుకోవడంతో సినిమా పరిశ్రమలో నిలదొక్కుకున్నాను.

అప్పటికి ఇంకా మద్రాసులో కాపురం పెట్టలేదు. గుంటూరు నుంచి షూటింగ్‌లకి వెళ్లివస్తున్నాను. ఆ సమయంలోనే “మద్రాసు  కళారంజని వారు’ ముక్కోటి ఏకాదశీ సందర్భంగా “గయోపాఖ్యానం” మద్రాసు అన్నామలై హాలులో ఏర్పాటు చేశారు. ఆ నాటకాన్ని బందా కనకలింగేశ్వరరావు గారు నడిపించారు. అందులో బందాగారు శ్రీకృష్ణుడుగా, నేను గయుడుగా నటించాం. ఆ నాటకానికి ప్రఖ్యాత దర్శకులు కె.వి.రెడ్డిగారి ప్రొడక్షన్ మేనేజర్ శంకరరెడ్డిగారు, ప్రముఖ రచయిత పింగళి నాగేంద్రరావు గారు, కళాదర్శకులు మాధవపెద్ది గోఖలే గారు వచ్చి నాటకం చూచి వెళ్లారట. మర్నాడు ఉదయం కె.వి.రెడ్డిగారి దగ్గరనుంచి బి.ఏ.సుబ్బారావుగార్కి ఫోన్ వచ్చింది. రాత్రి గయోపాఖ్యానం నాటకం చూచి, అందులో గయడు చాలా బాగా వుందని మా వాళ్లంతా చెప్పారు. నేను కూడా వార్ని చూడాలి అనుకుంటున్నాను. కనుక ధూళిపాళగార్ని మా ఆఫీసుకు పంపడానికి వీలవుతుందా? అని అడిగారు. కంపెనీ కారు వచ్చింది. నా బాల్యమిత్రుడు మాధవపెద్ది సత్యంను తీసుకొని కె.వి.రెడ్డిగారి ఆఫీసుకు వెళ్ళాను. రెడ్డిగారు నాపద్యాలు, డైలాగులు విని వెంటనే వారి “కృష్ణార్జునయుద్ధం” సినిమాలో నాకు గయుని పాత్ర ఖాయం చేశారు.

ఇలా అన్నీ పెద్దకంపెనీలకే బుక్ అవడం మÖలనా సినిమారంగాన్ని నమ్ముకోవచ్చనే ధైర్యం కల్గింది. దాంతో 1962లో మద్రాసుకు మాకాం మార్చేశాను.

“శ్రీకృష్ణపాండవీయం” రామారావు గారి సొంత చిత్రం. అప్ప్పుడు నేను నార్త్‌బోగ్‌రోడ్డులో మాస్టర్‌వేణు గారింట్లో అద్దెకుండేవాడ్ని. ఒకరోజు ఉదయం ఇంటిముందు కారు ఆగింది. ఎన్టీరామారావుగారింటికి వెళ్లాను. అప్పటికే వారు ఆఫీసులో పూర్తిమేకప్‌లో కూర్చొని ఏదో రాసుకుంటున్నాను.లోపలకు వెళ్ళి నమస్కారం సార్ అన్నాను. “రండి రండి బ్రదర్. విÖకోసమే చూసున్నాను కూర్చోండి” అన్నారు. కూర్చున్నాను. “శ్రీకృష్ణపాండవీయం” లోని శకుని పోర్షన్ స్క్రిప్ట్స్ తెలుగు, అరవం - రెండు పుస్తకాలు నాకు యిచ్చారు. శకుని పాత్ర రెడు భాషల్లో విÖరే వేస్తున్నారన్నారు. నాకు ఆశ్చర్యం, భయం ఒక్కేసారిగా కలిగాయి. వెంటనే కాల్ షీట్Ê

 యిచ్చారు. వారికి తోచిన పారితోషకం చెప్పారు. పారితోషకం విషయంలో నేను సంకోచిస్తుంటే “పారితోషకం కాదు, పాత్రను చూడండి బ్రదర్, చరిత్రలో నిలిచిపోతారు” అని భుజం తట్టి మేడ మిదకు వెళ్ళిపోయారు.

రంగస్థలం విÖదగానీ, వెండితెరమీదగానీ నేను అప్పటికి శకుని పాÔ ఎన్న్రడూ పోషించి వుండలేదు. నేను ధరించిన పాత్రలు దుర్యోధునుడు, గయుడు. sTÖ రెంటికీ భిన్నమైంది శకుని పాత్ర. శకుని చేసింది చెప్పడు. చెప్పింది చేయడు. సర్వతంత్ర కుతంత్రడు. కనులలో కారుణ్యాన్నీ, ప్రేమనూ ప్రవహింపజేస్తూ, కార్యంలలో కర్కశత్వాన్ని చిందించగలగాలి. కురుసామ్రాజ్యాన్ని మంటకలిపి, మట్టిపాలు చేసిన మేధావి. వ్యక్తిగతంగా నా స్వభావానికి, నా sTÖ శకుని పాత్రను నేను నటించాలి.

గతంలో నెల్లూరి నగరాజారావు, సి.యస్.ఆర్, ముదిగొండ లింగమÖర్తి, కె.వి.ఎస్. శర్మ మొదలైన గొప్పనటులంతా సినిమాల్లో శకుని పాత్ర ధరించి పేరు సంపాదించుకుని వున్నారు. వీరెవ్వరూ గుర్తుకు రాకుండా ఆ పాత్రను నేను ఎలా నటించాలి? ఎలాగో ఆ నటరాజస్వామి కృపవలన ధైర్యం తెచ్చుకొని ఆలోచించాను. నేను ఎవరితోనూ చర్చించలేదు. సలహాల్ని అడగలేదు. భారత శకునితో ఇంచుక పరిచయం ఉన్నది కాబట్టి, నాలో నేనే ఒక రూపాన్ని నిర్ణయించుకున్నాను. పాత్రధారణ, పాత్రపోషణ. నటనాశైలి, నడక తీరు దానికి కావల్సిన మేనరిజమ్స్, హంగులు నాలో నేనే స్థిరపరచుకున్నాను.

ఇక్కడ మరోసమస్య వచ్చింది. అది భాషా సమస్య. తమిళభాష కోసం ఒక మాష్టారును పెట్టుకున్నాను. చాలా శ్రద్ధగా త్వరత్వరగా రాయడం చదవడం నేర్చేశాను. ఈలోగా షూటింగ్ షెడ్యులు వచ్చేసింది. సెట్సు అన్నీ రెడీ అయ్యాయి. నేను వెళ్లేసరికి ఎన్టీరామారావుగారు దుర్యోధనుడుగా మేకప్ అంతావేసుకుని షాటt్స ఏర్పాటుచేస్తూ, దర్శక భాద్యతలు నిర్వహిస్తున్నారు. సెట్లోకి వెళ్లగానే నాగడ్డం. విÖసం, కిరీటం, u£ట్టు, డ్రస్సు అన్నీ నిశతంగా పరిశీలించి “ఓ.కే.బ్రదర్! చాలా బావుంది. కూర్చోండి” అన్నారు. షాటు అంతా రెడీ కాగానే నన్ను పిలిచి” ఏం బ్రదర్ మా సినిమాలో విÖ శకుని ఎలా దర్శనమిస్తున్నాడు” అని అన్నారు. “నాకేం తెలీదుసార్ ! విÖరెలా చెబితే అలాచేస్తాను” అన్నాను. “నో నో నేను విÖకు చెప్పడమేమిటి? విÖరు అనుకున్నది ముందు చేసి చూపండి తర్వాత చూద్దాం” అన్నారు. విÖరు అనుకున్నట్లుగానే శరీరాన్ని కొంచెం బెండ్ చేసి, తలను  ఒక పక్కగా వంచి, కుడిచేతితో కర్రపట్టుకుని, వారిచ్చిన కెమెరా పరిధిలో నడుస్తూ, వంకర చూపులతో నర్మగర్భంగా నా డైలాగు చెప్పాను. నవ్వుతూ “ఒకే బ్రదర్ అందుకే ఈ పాత్ర మీకిచ్చాం” అని ఎన్టీరామారావుగారు సంతోషంగా అన్నారు.

నటుడు ఎంత సమర్థవంతంగా పోషించినా, దర్శకుడు ఆ నటనకు వెలుగునిచ్చి కెమెరాద్వారా మంచి క్లోజు షాట్స్‌లో ప్రజలకు చూపించినప్ప్పుడే పాత్రధారునికి మంచిపేరు వస్తుంది. ఆ సినిమా బాక్సాఫీస్ హిట్ అయితే చిన్న చిన్న పాత్రలధారులకు కూడా మంచి పేరు వస్తుంది. నా శకుని పాత్ర ఎక్కువ ప్రాధాన్యత కల్గింది కనుక విశాల హృదయంతో, దర్శకుడిగా ఎన్టీరామారావుగారు, మంచి మంచి షాట్స్‌లో నన్ను చూపించారు. ముఖ్యంగా పాతాళగుహ జైలులో నాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి శకుని జీవితగాధను, కురు వంశం విÖద కత్తి పట్టి కక్ష తీర్చుకున్న ఘట్టాలను బాగా చూపించారు. ఇప్పటికీ ఆ సినిమా విడుదలై ఇప్పటికి నలభై అయిదు సంవత్సరాలు దాటిపోయినా, నా శకుని పాత్ర గురించి అభిమానులు ప్రత్యేకంగా ప్రశంసిస్తూ ఉంటారు. ఏ ఊరు పోయినా ఏ ఫ్లాట్ ఫారం విÖద కన్పించినా, నన్ను చూచి “అడుగోర మన శకుని మామా” అని కుర్రకారు అంటూ వుంటారు. ఈ నాటికీ కొందరు నాడైలాగులు చెప్ప్పుతూ వుంటారు.

మరో విశేషం విÖకు చెప్పాలి - ఆ పిక్చర్ షూటింగ్ పూర్తయిపోయింది. విజయా స్టూడియోలో ప్రివ్యూలు వేస్తున్నారు. ఒక రోజు నేను వెళ్ళాను. సినిమా చూచి నేను బయటకు వచ్చేస్తుంటే జి. వరలక్ష్మిగారు నన్ను పిలిచి “అబ్బా! తినేశావయ్యా ! పాత్రలో జీవించావయ్యా ! అని గట్టిగా అరిచారు.  నేను “అమ్మా ! అమ్మా ! మీరు అట్లా అరవకండి. మీరు కురిపించే ప్రశంసలు నా కడుపు కొడతాయి - పరిశ్రమ సంగతి విÖకు తెలిసిందే కదా !” అన్నాను. ఆమె మళ్ళీ నవ్వారు. ఆ సినిమా ప్రభావం మÖలంగానే తర్వాత రిలీజైన “భాలభారతం”, “దాన వీర శూర కర్ణ” మొదలైన అన్ని సినిమాల్లో శకుని పాత్ర నా చేత వేయించారు. మంచి పేరు వచ్చింది. ఇండస్ట్రీ నుండి నేను రిటైరైనా నా పేరు మాత్రం “శకునిమామ” గా స్థిరపడిపోయింది.

సినిమాల్లో ఏ నటునికైనా అన్నీ పెద్ద పాత్రలే దొరకవు. అయా కంపెనీల్ని బట్టి ఒక్కోసారి ఇష్టంలేకపోయినా, చిన్న పాత్ర వేయాల్సి వస్తుంది. అలాంటిదే “పాండవనవాసం” గంధర్వరాజైన చిత్రసేనుడి పాత్ర. అందులో దుర్యోధునుడుగా ఎస్వీరంగారావుగార్కి, చిత్రసేనుడిగా నాకు మంచి వాద ప్రతివాదనలున్నాయి. సినిమా పూర్తయినతర్వాత  ప్రివ్యూకు పిలిచారు. చిన్నవేషం అనే భావనతో నేనా ప్రివ్యూకు వెళ్లలేదు. మరునాడు నాకు ఫోన్ వచ్చినది, “తమ్ముడూ పాండవ వనవాసం చూచాను. ఆ సీనులో నన్ను తినేశావోయి. నన్ను కనపడకుండా చేశావు. కంగ్రాచ్యులేషన” అన్నారు. మహానుభావుడు చనిపోయి ఏ స్వర్గంలో ఉన్నారోగానీ ఆయన విశాల హృదయం ఇతర కళాకారులకు మార్గదర్శకంగా నిలవాలి. ఎస్వీఆర్ గారు తన సినిమాలన్నింటినిలోనూ నాకు అవకాశం యిచ్చారు. ముఖ్యంగా “భాందవ్యాలు”లో తన తమ్ముడి వేషం ఇచ్చారు. ఆ చిత్రం నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి బెస్ట్ యాక్టర్ అవార్డు తెచ్చిపెట్టింది.

తర్వాత నా నటజీవితంలో చెప్ప్పుకోదగిన చిత్రం “కంచుకోట” దాంట్లో నేను మహాదుష్టబుద్ధి కలిగిన మంచిపాత్ర ధరించాను నా కూతురుగా మహానటి సావిత్రి వేసింది, లోకంలోని ఐశ్వర్యమంతా నాÅకూతురికే కట్టబెట్టాలని ఎన్నో దుష్కార్యాలు చేస్తాడా మంత్రి, కానీ ఏ లాభం- తన ఏకైక కూమార్తె అనుకోకుండా చనిపోతుంది. ఆ ధనరాసుల్నీ ఏం చెయ్యాలో తెలీక, మంత్రి పిచ్చి వాడైపోతాడు. సినిమా చివరి సీనులో, తన కూతురు శవం దగ్గర ఆ ధనరాసుల్నీ కుప్పపోసి, “ఇవన్నీ నీకోసమే సంపాదించానమ్మా ! నన్ను అన్యాయం చేసి దాటి పోయావా” అని శవంవిÖదపడి ద్ణఖించే ఘట్టం, నాకు విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఇప్పటికే ఎన్నిసార్లు శతదినోత్సవాలు జరుపుకుందో లెక్కలేదు. ఇంకా “ఉండమ్మా u£ట్టుపెడతా”, “ప్రేమజీవులు”, “మట్టిలో మాణిక్యం”, “కథానాయకుడు”, “కన్నవారి కలలు”, “మంచిరోజులు వచ్చాయి”, “అందాలరాముడు” మొదలైన చిత్రాలన్నీ నాకు పేరుతెచ్చిపెట్టినవే. 1964లో బి.ఏ సుబ్బారావుగారే “మైరావణ” తీస్తూ నన్ను నాయకపాత్ర అంటే “మైరావణుడు”గా బుక్ చేశారు. కానీ చిత్రం ఎందుకనో పెద్దగా విజయంసాధించలేదు. ఆ సినిమాగాని విజయవంతమై ఉంటే నాస్థితి ఇంకాస్త ఉన్నతంగా ఉండి వుండేదేమో ! ఏమైనా సినిమా పరిశ్రమలో నాకు అన్నం పెట్టినవారు బి.ఏ.సుబ్బారావుగారు. వారి ఋణం ఈ జన్మకు తీరనది. ఇక కన్నడభాషలో కూడా హేమారెడ్డి మల్లమ్మ”, “అమరశిల్పి జక్కన్న”, “శివరాత్రి మహాత్మ్యం”. మొదలైన చిత్రాలలో చేశాను. తమిళంలో “హీరో 72”, కణ్ణన్ కరునై”, “రాజసూయం”, “ఆలయుగళ”, “ఎందవూరు కణ్ణగీ” మొదలైన చిత్రాలలో నటించాను. కానీ నేను ఊహించిన ఫలితాలు ఆ తమిళపరిశ్రమలో నాకు అందలేదు. 

తెలుగులో కంటే తమిళంలో నాటకరంగానికి ఎక్కువ ప్రాధాన్యత వుండేది. మద్రాసులో నా తెలుగు నాటకాలు మనోహర్‌గారు చూచారు. మేం సన్నిహిత మిత్రులమయ్యాం. మనోహర్‌గారి “లంకేశ్వర” నాటకం అఖండ ఖ్యాతి నార్జించింది. ఆ నాటకం తెలుగులో వెయ్యాలని నాకు సంకల్పం కల్గించి, తెలుగులో రాయించాను. నాలుగైదు సార్లు ప్రదర్శించాం గానీ పెద్ద విజయవంతం కాలేదు. కనుక తమిళంలోనే నాటకం చేయాలనే సంకల్పం కల్గించి. దానకి “మైరావణ” నాటకాన్ని ఎన్నుకున్నాను. ఒక అరవ కవిచేత నాటకం రాయించాను. ఒక అసోసియేషన్‌కు కాంట్రాక్టుకు యిచ్చి మద్రాసులోనే ప్రదర్శించాను. ఆ ప్రదర్శన చాలా దిగ్విజయంగా నడిచింది. ఆ నాటకానికి ముఖ్య అతిథిగా తమిళనావటక అకాడమీ అధ్యక్షులు ఎస్.డి.సుందరంగారు వచ్చారు. ప్రఖ్యాత తమిళ సినీ హీరో ఏ.వి.రాజన్‌గారు అధ్యక్షులుగాను, ప్రముఖ నటగాయని ఎస్వరలక్క్ష్మిగారు ప్రత్యేక ఆహ్వానితులుగాను పాý£్గన్నారు. యస్.డి.సుందరం గారు మాట్లాడుతూ, “ఈ మైరావణ పాత్రధారి, తెలుగు నటుడు అని అంటే నమ్మలేక పోతున్నాను.” అని ప్రశంసించారు. ఈ నాటకంలో ప్రఖ్యాత తమిళహాస్య నటులు టి.ఆర్.రామచంద్రన్‌గారు కూడా నా ట్రూపులో మంచి హాస్యపాత్ర ధరించడం మÖలంగా ఆ నాటకం రసవత్తరంగా సాగింది.

ఇది గాక తెలుగు సాంఘిక నాటకంగా తెలుగులో ప్రఖ్యాతి గాంచిన భమిడిపాటి రాధాకృష్ణగారి “దంతవేదాంతం” నాటిక తీసుకొని దాన్ని తమిళంలోనికి తర్జుమా చేయించాను. నాటిక యొక్క కథాసమయం, నాటకానికి సరిపోదు గనుక. ప్రముఖహాస్యనటులు టి.ఆర్.రామచంద్రన్ గారితో కొన్ని సీన్లు పెంచాం. ఇదీ గాక “కాణినిలకు” (ఎకరం నేల) అనే ఒక సాంఘిక నాటకాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది. తమిళ ప్రభుత్వనాటక అకాడమీ పక్షాన శ్రీ ఎస్.డి.సుందరంగారు ప్రదర్శించిన “భారతస్వాతంత్య్రము” అనే తమిళనాటకం కూడా నాకు మంచిపేరే తెచ్చింది. అదే నాటకంలో నేడు ప్రముఖనటుడుగా ఖ్యాతి గాంచిన పద్మశ్రీ కమల్‌హాసన్ కూడా ఒక చిన్న పాత్ర వేశాడు. 

తమిళనాటక రంగంలో గానీ, సినిమారంగంలోగానీ ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని చిత్రాల్లో నటించినా, ఆర్థికంగా నాకేమీ ప్రయోజనం కల్గలేదు. కానీ పరభాషలో ఇంత మంచి వేషాలేసి తమిళుల అభినందనలందుకున్నాననే ఆత్మతృప్తి మాత్రం మిగిలింది.

1976వ సంవత్సరంలో, ఒక నాటి ప్రాత్ణకాల ధ్యానంలో నేనుండగా, “నీ విక్కడ నుంచి వెళ్లిపో! నా గుడి కట్టు” అని ఆంజనేయస్వామి సాక్షాత్కరించారు. నా శరీరమంతా పులకరించింది. ఆ అనుభూతి, ఆనందం జన్మజన్మలకు మరువలేని మధురానుభూతి.

సరే నాకూ గుడి కట్టాలనే సంకల్పం రోజురోజుకూ బలమయ్యింది. కానీ గుడి ఎక్కడ కట్టాలి? నాకు అప్పటికే చెన్నైలో ఒక మేడ, కోడంబాకం, వేలచ్చేరిలో స్థలాలు వున్నాయి. కానీ పరరాష్ట్రంలో ఆలయం నిర్మాంచి, అక్కడే ఉండాలని అనిపించలేదు. అప్పటికే నాకు యాభై అయిదు సంవత్సరాలు ప్రాప్తించాయి. పిల్లలంతా స్థిరపడ్డారు. ఎప్పటికైనా వృద్ధాప్యం రాకపోదు. అందువల్ల మనసు కన్నతల్లిలాంటి స్వస్థలానికి చేరాలని ఉవ్విళ్లురించి. 1977లో మేడ అమ్మేశాను. గుంటూరులో గుడి నిర్మాణం కోసం ప్రదేశం వెదకడం ప్రారంభించాను. అలా చూచేటప్పుడే సన్నిహిత బంధుకోటిలో, అప్పుడే చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లంతా నా కళ్లల్లో కన్పించారు. వారెవ్వరికీ ఎక్కడా స్వగృహాలు లేవు. వీళ్లందర్నీ ఒకచోట చేర్చాలని అందరికీ ఉత్తరాలు రాశాను. గుంటూరులో ఈనాడు “మారుతిగారు”గా ప్రసిద్ధి చెందిన ప్రాంతమంతా అనాడు, అంటే 1979 నాటికి నిర్మానుష్యంగా వుంది. సుమారు నాలుగు ఎకరాలస్థలం గజం ఒకటికి 6 రూపాయల 20 పైసల చొప్పున ఎగ్రిమెంటు చేశాను. సన్నిహితులకు, మిత్రులకు మొత్తం 42 ప్లాట్లుగా ఇచ్చాను. తర్వాత రోడ్డు విషయంలో, ఇంకా ఇతర అడ్డంకులెన్నో వచ్చాయి. ఎన్ని అడ్డంకుý£చ్చినా ఆంజనేయస్వామి అనుగ్రహం వల్ల అన్నీ అధిగమించాం. ఆలయనిర్మాణం జరగాల్సిన ప్రాంతానికి “మారుతినగరు” అని నామకరణం చేశాం. 12.03.1981లో మారుతినగరు గుంటూరు జిల్లా అండ్ సెషన్సు జడ్జి కె.పి.నారాయణరావు గారి చేతులమీదుగా ప్రారంభమియ్యంది. మళ్ళీ నేను చెన్నై వెళ్లిపోయాను. కాలం గుడిచేకొద్దీ ఆలయనిర్మాణం ఆరాటం ఎక్కువయ్యింది. కెమేరా ముందు నిలుచుని డైలాగు చెప్పలేని స్థితి ఏర్పడింది, ఒక రోజు స్వప్నంలో “ఏరా! గుడి కట్టవా? కాటికి పోయిందాకా కాసుకోసం ఇక్కడే కాలక్షేపం చేస్తావా!” అని ఆంజనేయస్వామి ప్రశ్నించారు. దాంతో శరీరమంతా వేడెక్కిపోయింది. కర్మ, జ్ఞాన ఇంద్రియాలు సక్రమంగా వుండగానే స్వామి ఆజ్ఞ నెరవేర్చాలనుకున్నాను. ఎన్టీరామారావు, గుమ్మడిగారు వంటి ఆత్మీయులందరూ ఇన్ని సినిమాలు చేతిలో వుండగా వదులుకుని వెళ్లడమేమిటయ్యా? స్థలాలు కూడా అన్నీ అమ్మేస్తున్నావట. అమ్మవాక, అవి బంగారం” అని హెచ్చరించారు. ఏది ఏమైనా మద్రాసులో అన్నీ వదులుకుని 31.07.1982 న గుంటూరు వచ్చేశాను.

ఒకనాటి సాయంకాలం మా ఇంటికి ఒకావిడ వచ్చింది. కంచి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతి స్వామి వారు తెనాలిలో మకాం వున్నట్లు చెప్పింది. మరునాడు తెనాలి వెళ్లి ఆయనను దర్శించి “అయ్యా! మీరు వచ్చి మారుతినగరులో ఆంజనేయస్వామి ఆలయానికి శంఖుస్థాపన చేయాలని” ప్రార్థించాను. వారు రెండురోజుల వ్యవధిలో ముహూర్తం నిర్ణయించారు. 09.07.1983లో శ్రీశ్రీశ్రీ జయేంద్రస్వామి వారి ఆశీస్సులతో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయానికి శంఖుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.

ఆలయశంఖుస్థాపన తదుపరి ఆలయనిర్మాణ మెలా చేయాలో అర్థం కావడం లేదు. నేనెంతని ఖర్చుపెట్టగలను? ఎవరిని చందాలడగగలను? పైగా “సినిమాలు లేవు కాబోలు, ఇదొక ఎత్తు ఎత్తాడని” ప్రజలంటారేమోనని భయం. మరి కార్యసాధన ఎలా? ఏమీ తోచక ఒకనాడు

“శ్రీ రామదూతా! శ్రీఆంజనేయా! ప్రణుతించు నీ పాద పద్మములంటి

ఎక్కడెవ్వారికిని దిక్కునీవేగదా  నీ పాదముల నంటినే కవిత మొదలిడితి”

అని యధాలాపంగా రాసుకున్నాను. మా సాహిత్యగురువు మల్లాది లక్క్ష్మీపతి శాస్త్రి గారెందుకో మా ఇంటికి వచ్చారు. నే రాసిన గేయం చదివి విన్పించాను. ఆయన “చాలా బాగుందయ్యా! తప్పులేమీ లేవు. మరేదైనా రాయరాదా!” అన్నారు.

“ఆంజనేయస్వామి కిష్టమై, సకలకష్టనవారణమైన “సుందరకాండ” రాయమంటారా అన్నాను. “సుందరకాండ ఏంటి? రామాయణమే రాయి” అన్నారు. ఆ ముక్కలే గేయరామాయణ రచనకు ప్రాతిపదికలయ్యాయి. ఆ కావ్యరచనకు తొమ్మిది మాసాలు పట్టింది. తిరుమలతిరుపతి దేవస్థానం వారు ఆర్థికసాయం, బాపుగారు u£మ్మసాయం చేశారు. గ్రంథం అచ్చయినంతమాత్రాన ఆర్థికస్థోమత రాదు కదా! సరే సుందరకాండ ఊరూరా గానం చేద్దామనుకున్నాను. ధర్మప్రచారం, ధనసేకరణ రెండు సిద్ధిస్తాయి కదా! మిత్రులు అంబటిపూడి శ్రీరామÖ్మర్తి నా సుందరకాండకు మధురమైన స్వరాలు కూర్చాడు. నేను ప్రారంభించిన గేయగాన యజ్ఞం ఒక వినూత్నప్రక్రియ. ఇంతకు ముందు ఇలా ఎవ్వరూ గానం చేయలేదు. దానికి “సంగీత, సాహిత్య, వచన, సవీÖక్షాసహిత సుందరకాండ గేయగాన మనోజ్ఞం’ అని నామకరణం చేసుకున్నాను.

మొదటి యజ్ఞం 14.07.1984 నుండి 17.07.1984 వరకు విశాఖ పట్నంలో జరిగింది. కళాuంధు టి.సుబ్బిరామిరెడ్డి గారు మా మొదటి యజ్ఞానికి వచ్చి జ్యోతి ప్రజ్వలన గావించారు. వేదిక మీది అతిథులంతా మాట్లాడి ఆలయనిర్మాణం మరోపుణ్యప్రదం అన్నారు. కథా ఎలా నటించిందో నాకు తెలీదుగానీ, రెండున్నర గంటల పాటు కాలం తెలీకుండా, ప్రప్రథమ మహాయజ్ఞ ప్రథమదినం దివ్యంగా నడిచింది. సుబ్బరామిరెడ్డి గారు భక్త్యావేశంతో వేదికమీదకొచ్చి గోపురానికి అయ్యే 35 వేల రూపాయలు ఇస్తామన్నారు. అలా మారుతీదేవాలయానికి ప్రప్రథమంగా విరాళ మిచ్చిన వారు రెడ్డిగారే. అలా నాలుగురోజుల్లో 62.000/- వసూలయ్యింది. అలా వివిధ ప్రదేశాల్లో 273 రోజులు సుందరకాండ యజ్ఞాన్ని నిర్వహించాను.

1983లో శంఖుస్థాపన జరిగిన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి ఆలయనిర్మాణం 1985లో ప్రారంభమైంది. ఏ దేవానుగ్రహమో, ఏ గురు కటాక్షమో, ఏ మంత్ర ప్రభావమో గానీ, నా సంకల్పం దినదినాభివృద్ధిగా నెరవేరి నా కలలు పండాయి. కాలక్రమంలో నవగ్రహాలయం, గౌరీశంకరాలయం, గౌరిదేవి ప్రతిష్ఠ, సిద్ధి గణపతి, మృత్యుంజయ ప్రతిష్ఠలు జరిగాయి. రెండు కల్యాణమండపాలు వచ్చాయి. మొత్తం మీద sTÖనాడు మారుతినగరు ఒక దివ్యక్షేత్రమైంది. 1985 జనవరిలో ఆరంభమైన నిర్మాణం ఆ సంవత్సరానికి పూర్తయ్యింది. 17.03.1986లో శృంగేరీ పీఠాధిపతులు, శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థమహాస్వామి వారి చేతుల మీదుగా సర్వవిగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించారు.

26.01.1990న నేను “తెనాలిరామకృష్ణ” టెలీసీరియల్ షూటింగుకు వెళ్తున్నాను. గుండెనొప్పి వచ్చింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఛీఫ్ డా॥ ఆర్.మురళీబాబురావు గారి ట్రీటుమెంటుతో బయటపడ్డాను. ఆకారణంగానే నాటకరంగం నుంచి నిష్క్రమించాను. శాశ్వత ధర్మకార్యాలకోసం, నా చిరకాల వాంఛగా మిగిలి వున్న “ధూళిపాళ సీతారామశాస్త్రి, వరలక్క్ష్మమ్మట్రస్టు” కూడా రూపొందించాను. జీవితాలు బుద్భుద ప్రాయాలు గనుక నేనటూ ఇటూ అయితే, sTÖ ఆలయబాధ్యత ఎవరూ వహిస్తారు? కనుక 22.10.1991న శ్రీ మారుతిదేవాలయాన్ని కంచి శ్రీ కామకోటి పీఠానికి సమర్పించాను. 1991లోనే తంగిరాల శ్రీనివాసరావు, ధూళిపాళ పూర్ణానందశాస్త్రి, అన్నంuó£ట్ల శ్రీరామచంద్రమÖర్తిలు “ధూళిపాళ కళావాహిని” ప్రారంభించారు. దాని అభివృద్ధి కోసం 1997లో ఒక భారీనాటకం పెట్టాను. నేను మళ్లీ మీసం కట్టి వేషం వేయకతప్పలేదు. అందులో మÖడుతరాల నటులు పీసపాటి, వేమÖరి రామయ్య, ఏ.వి.సుబ్బారావు మొదలైన వారంతా ఏ మాత్రం పారితోషికం తీసుకోకుండా పాý£్గన్నారు. కళాభారతి జమునగారు ముఖ్య అతిథిగా పాý£్గన్న ఆ నాటకం ఒక రికార్డు సృష్టించిందంటే అతిశయోక్తి కాదు. ఆరోజు రెండు లక్షల రూపాయలు మేరకు నిధి వసూలయ్యింది. ఆ నిధి మీద వచ్చే వడ్డీని మాత్రమే వినియోగించి, మాసవారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది ధూళిపాళ కళావాహిని.

అరవై ఏడు సంవత్సరాల కళాజీవితంలో నాకు ప్రజలాశీర్వదించి యిచ్చిన జ్ఞాపక చిహ్నాలన్నీ విడివిడిగా, వీలున్న చోట్లలో వుంచడం జరిగింది. ఇలా గాకుండా- మెమొంటోలు, షీల్డులు, సన్మానపత్రాలు, తదితర జ్ఞాపకాలన్నీ ఒకే చోట వుంచితే ముందు తరాలకు స్ఫూర్తిగా వుంటుందని అనిపించింది. అది ఒక మÖ్యజియంగా తయారైంది. దానికే “ధూళిపాళ కళాభవనమ” అని పేరు పెట్టుకున్నాను. 

భగవంతుడు ఇంతవరకూ నేను అనుకున్నవన్నీ సమకూర్చాడు. మేము ప్రతి సంవత్సరం కాశీ క్షేత్రం వెళ్లి, రెండు మÖడు మాసాలపాటూ అక్కడ గడిపి వస్తూ వుంటాం. యధావిధిగా 11.03.2001లో కూడా కాశీకి బయలుదేరాం. విజయవాడ స్టేషనుకు చేరుకునే సరికి నాకు గుండెల్లో మంట వచ్చింది. మా శ్రీమతి ప్రయాణం ఆపుదామన్నది. నేను వినకుండా, పరమేశ్వర దర్శనాతురుడనై, అవేమీ పట్టించుకోకుండా రైలెక్కాను. సరే ఎలాగో కాశీక్షేత్రానికి చేరుకునేసాం. అక్కడ వున్న రోజుల్లో నిత్యం శ్రీ గౌరీసమేత కేదారస్వామి వారి దర్శనం చేసుకునే వాళ్లం. ఆ ఆలయంలో నవగ్రహాలయం లేదనీ, అది కట్టాలనే సంకల్పం దేవస్థానం వారికి వున్నదనీ తెలిసింది. వెంటనే ఆ భాగ్యం మేమే పొందాలనే ఆతురత కలిగింది. అయితే నాకు మరోమారు గుండెనెప్పి రావడంతో అది వీలు పడలేదు. ప్రస్తుతం వృద్ధాప్యం వల్ల తిరగలేకపోతున్నాను. కాశీలో నవగ్రహాలయం నిర్మించాలన్న కోరిక అలాగే వుండిపోయింది. ఈ రోజు వరకు ఇన్ని అసాధ్యమైన కార్యాలు నాకు సూసాధ్యం చేసిన ఆ పరమాత్మ sTÖ సత్కార్యానికి ఎందుకు విఘ్నం కల్గించాడో అజ్ఞానిని నాకేం తెలుస్తుందీ?

నాకు తెలిసినంత వరకూ, గడిచిన నా మÖడు ఆశ్రమాల జీవన విధానాన్ని సక్రమంగానే నడిపించాడు భగవంతుడు. అదృష్టమో, దురదృష్టమో, నాలుగో ఆశ్రమం (తురీయాశ్రయం) కూడా అనుభవించాలనే కోరిక కలిగింది. కర్మయోగం నుంచి ధ్యానయోగానికి ఎదగాలనే వాంఛ బలపడింది. 07.05.2001న శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతీస్వామి వారి ఆశీస్సులతో కృష్ణనదీ తీరాన తురాయాశ్రమాన్ని స్వీకరించాను. ఇంతకాలం మారుతిసేవ చేశాను గనుక “మారుతి సేవేంద్ర సరస్వతి స్వామి” అని నామకరణం చేశారు స్వామివారు. ఆ క్షణం నుండి కొత్త జీవితం ప్రారంభమయ్యింది. ప్రస్తుతం పూర్తి సమయం ఆశ్రమంలోనే వుంటున్నాను. దాదాపు ముప్పాతికభాగం మౌనాన్నే వరిస్తున్నాను. అరవై ఐదేళ్లు గృహస్థాశ్రమం గడిపిన నా అర్థాంగి వరలక్క్ష్మమ్మ ఇంటిలో తానొక్కతే ఒంటరిగా కాలం గడుపుతున్నది.

నాకు పూర్వశ్రమంలో ఇద్దరు అబ్బాయిలు, ఒకమ్మాయి. వారూ బాగానే జీవితంలో స్థిరపడ్డారు. ఆరోగ్యంగానే వున్నాను. sTÖజన్మలో, గతజన్మలలో తెలిసో, తెలీకో ఎన్నో తప్పులు చేసుంటాం, వాటి పరిహారార్థ్రం శ్రీ కృష్ణపరమాత్మ భగవద్గీతను ప్రజలకు చెపుతూ శ్రీకృష్ణుడి కృపకు పాత్రుడనై తరించాలనే కోరిక ప్రబలింది. ప్రప్రథమ గీతా మహాయజ్ఞం మారుతీక్షేత్రంలో 5.11.2002న ప్రారంభించి 18 అధ్యాయాలు యథాశక్తి నిర్వహించాను. 29 రోజులు పట్టింది. రెండుమార్లు గుండెపోటు వచ్చినా బతికి బయటపడ్డానంటే... నేను చేయాల్సి కార్యాలింకా మిగిలి ఉన్నాయనిపిస్తోంది. ఇంకా ముందు ముందు నిర్వరామ తపస్సుకు తోడుగా గీతాయజ్ఞాలు విరివిగా చేయాలని సంకల్పం. 

ఇక అవార్డులూ వచ్చాయి - నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీరామారావుగారి చేతులమీదుగా “తెలుగు వెలుగులు” పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాటక అకాడమీ వారిచే “నాటకకళాప్రవీణ” (1983), కళావేదిక హైదరాబాదు వారి పక్షాన నాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్‌సింగ్ చేతులమీదుగా “కళాసరస్వతి” (1984), శ్రీశ్రీశ్రీ నరసింహభారతీ మహాస్వామి వారిచే “ఆధ్యాత్మిక శిరోమణి” (1996), నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గారిచే “ఆత్మగౌరవ పురస్కారం” (1999), తెలుగువిజ్ఞాన సమితి, బెంగుళూరు వారిచే “శ్రీ కృష్ణదేవరాయ అవార్డు” (2002)... యిలా చాలా పురస్కారాలే అందుకున్నాను.

కళకళ కోసమే గాక సమాజశ్రేయస్సు కోసం కూడా ఉద్దేశించింది. కళాకారుడనే వాడు కూడా నిత్య జీవితంలో కూడా జీవితాంతం సమాజ శ్రేయస్సు కోసమే పాటు పడాలన్నది నా అభిమతం. కళలు వర్థిల్లిన చోట, కళాకారులు ఆనందంగా జీవించేచోటే సౌభాగ్యం విరాజిల్లుతుంది. కళాకారుడు అర్థాకలితో అలమటిస్తే అది దేశానికి ఏమాత్రం క్షేమకరం కాదు. మరి కళాకారులు గౌరవింపబడే తరుణం వస్తుందంటారా? కళాకారులు కూడా క్రమశిక్షణతో మెలగడం అత్యంతవసరం. సాధ్యమైనంత వరకు వాళ్లు వ్యసనాలకు దూరంగా వుండాలి. నేను షూటింగ్‌లో వున్నప్పుడు కూడా మా ఇంటినుండే భోజనం వచ్చేది. అవుట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లినపుడు మాత్రమే నిర్మాతల భోజనం నేను భుజించినట్లు గుర్తు. నిరంతర అధ్యాత్మిక చింతనే మనిషిని క్రమబద్ధీకరిస్తుంది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి