మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2026, శుక్రవారం

అమ్మకు కవితా మందార కుసుమాంజలి


మా అమ్మ రామామణి

మమతానురాగాల అమృత స్వరూపిణి 

అనురాగ దీపం అసమాన త్యాగం 

స్త్రీ జాతి కొరకు సృజియించే దైîవం

అందుకే మనకామె ఆరాధ్య దైవం 

చిరునవ్వుల అమృతాన్నీ మనకే వదిలి

చిరంజీవులను చేసిన ప్రేమ కడలి 

మమతలు వీడవు వీడేది మనిషే 

తలుపులు వీడవు వీడేది తనువే 

మనకేమొ పంచింది ప్రేమ ధనం

కులకాంతకదియే కలకాల ధనం 

మనం చూపే రవ్వంత అభిమానం

అమ్మ మదిలో కురిసే సంతోష వర్షం

హృదిలో కలిగే పరవశ హర్షం.. 

సంగీత సాహిత్యాలే ఆమె భూషణద్వయములు

అసమాన సరస సంభాషణాలే ఆమె సిరిసంపదలు 

పంచమ స్వర కోకిల నినాదం ఆమె స్వరం 

విరంచి విపంచి పై వినిపించే వేదగానం 

అదియేమన జీవన నినాదం 

ఆ అమ్మ పాదార్చనే కాదా

మన నిత్యదేవార్చన! 

ఆమె సంతానం అష్ట దిగ్గజములు 

బొడ్డుపల్లి కాళిదాసు కుసుమ 

శ్రీనివాస్ విమల 

శ్రీకాంత్ లక్ష్మీ 

కృష్ణ శంకరయ్య 

పద్మావతి ప్రభాకర్ 

శ్రీదేవి సత్య నారాయణ 

సంధ్య ఆశోక్ బాబు 

శ్రీధర్ జ్యోతి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి