మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

10, అక్టోబర్ 2026, శనివారం

అప్పు అంకమ్మ కుమారుని ప్రాణం ఖరీదు


తాను జీతమున్న శివారెడ్డి తోట దగ్గరున్న బండ మీద కూర్చుని అంకమ్మ తన కుమారున్ని తలుచుకుంటు రోజు కుమిలి కుమిలి ఏడుస్తు వుంటుంది. అంకమ్మ జీతమున్న తుర్కపల్లి గ్రామం దత్తలూరు పట్టణానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో వుంది. అంకమ్మ జీతమున్న శివారెడ్డి తోట నుండి తుర్కపల్లి గ్రామానికి వెళ్ళడానికి కాలి బాట మాత్రమే వుంది. ఈ కాలిబాట ఇటు ప్రక్క అటు ప్రక్క అలాగే ఆ గ్రామ పరిసరాలలో అంకమ్మ వంటి అనేక మంది నిర్బంధ కార్మికుల నిశ్శబ్ద ఆక్రందనలు కోకొల్లలుగా ఉన్నాయి. 

నిమ్మతోట మధ్యలో శివారెడ్డికి విశాలమైన ఇల్లు వుంది. ఈ శివారెడ్డి 12 ఎకరాల నిమ్మతోట పనులు అలాగే బర్లను మేపడం వంటి ఇతర పనులు చేయడానికి అంకమ్మ మరియు ఆమె భర్త ప్రకాశ్ నెలకు 15000 జీతం వుండి పని చేస్తున్నారు. అంకమ్మ మరియు ప్రకాష్‌లకు స్వంత ఇల్లు లేదు. నాలుగు వైపున నాలుగు గుంజలు పాతబడి పైన టార్పలిన్ కప్పబడి వున్న గుడిసెను తన ఇల్లుగా చూయించింది అంకమ్మ. ఆ గుడిసె లోపల పడుకునేంత స్థలం మాత్రమే వుంది. 

ఎప్పుడైన శివారెడ్డి పని చేస్తున్నారో లేదో చూడడానికి గుడిసె వైపు వస్తే అంకమ్మ, ప్రకాశ్ ఇద్దరూ మోకాళ్ళ మీద కింద కూర్చుంటారు. “వారు రెడ్లు పెద్ద వాళ్ళు” అని అంకమ్మ అమాయకంగ, చాలా గౌరవంగ చెబుతుంది. ఇప్పటి వరకు జరిగినవన్నీ తన పొరపాట్ల వల్ల జరిగాయని అంకమ్మ తనకు తాను నిందించుకుంటుంది. తమ ప్రాణం పోయినా శివారెడ్డిని వదిలి వెళ్ళమని చెప్పింది. శివారెడ్డిని కాదని ముత్తు దగ్గర పని చేయడానికి వెళ్ళడం వల్ల తన కుమారుని మరణం సంభవించినదని అందుకని ఇప్పటి నుండి శివారెడ్డి పట్ల విశ్వాసంగ వుంటామని అంకమ్మ చెప్పింది. 

కొడుకు చనిపోయినందుకు నీకు డబ్బు వస్తుందట కదా అని కొందరనగా తనకు న్యాయం తప్ప ఏమీ అవసరం లేదని అంకమ్మ వారితో చెప్పింది. 

నిర్బంధ కార్మికుల పునరావాసం గూర్చి కేంద్ర ప్రభుత్వ పథకం 2021 ఏం చెబుతుందంటే వెంటనే రూ. 30000 నిర్బంధ బాధిత కార్మికులకు అందజేసి వారిని నిర్బంధం నుండి రక్షించాలని చెబుతుంది. నేరం రుజువైతే కేసు తీవ్రతనుబట్టి రూ. మÖడు లక్షల సహాయం అందుతుంది. సత్యవేడు సుళ్ళూరుపేట రెవెన్యూ డివిజన్ కిందికి వస్తుంది కాబట్టి తిరుపతి అధికారులు అంగీకరిస్తే బాధితులకు ఇంటి స్థలం మరియు పరిహారం వచ్చే అవకాశం వుందని సుళ్ళూరుపేట అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవి కుమార్ చెప్పాడు. 

అంకమ్మ కుటుంబానికి “రిలీజ్ సర్టిఫికేట” ఇవ్వాల్సిన అవసరం వుందని నిర్బంధ కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడే కార్యకర్తలు చెప్పారు. ‘ఎవరైతే నిర్బంధ కార్మికులుగా వున్నారో వారికే రిలీజ్ సర్టిఫికేట’ ఇవ్వబడుతుంది. సాంకేతికంగ అంకమ్మ కుటుంబంలో వెంకటేశ్ ఒక్కడే చనిపోయే వరకు నిర్బంధ కార్మికుడు కాబట్టి మొత్తం కుటుంబానికి ఆ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని రవికుమార్ అన్నారు. నిర్బంధ కార్మిక వ్యవస్థ నుండి రక్షించబడినట్లు అనే అర్థంలో రిలీజ్ సర్టిఫికేట్ ఇస్తారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి