మొత్తం పేజీ వీక్షణలు

28, జూన్ 2026, ఆదివారం

ఈలపాట రఘురామయ్య మెమోరియల్ గ్రంధాలయము


పద్మశ్రీ కళ్యాణం (ఈలపాట) రఘురామయ్య మెమోరియల్ గ్రంధాలయము, సుద్దపల్లి, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా, నిర్మించిన వారు : శ్రీ కల్యాణం నరసింహారావు, బి.టెక్ (మెకానికల్), శ్రీ తోట రామాంజనేయులు, (బిల్డరు)

ఈ గ్రంధాలయము కీ?శే? పద్మశ్రీ కల్యాణం (ఈలపాట రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మరియు ఉపాధ్యక్షులు రఘురామయ్య గారి అన్న గారు కీ?శే? కోటయ్య గారి కుమారుడు శ్రీ కె. నరసింహారావు గారు, రిటైర్డ్ సీనియర్ మేనేజర్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హైదరాబాదు వారి కుమారుడు శ్రీ కె. రమణ్ రావు (యు.యస్.ఎ).

మరియు తోట రామాంజనేయులు గారు (రఘురామయ్య గారి మనుమడు) మరియు వారి కుమారుడు శ్రీ బ్రహ్మయ్య (యు.యస్.ఎ) సంయుక్తముగా సమపాళ్ళ ఖర్చుతో నిర్మించటమైనది.

శ్రీ కట్టా భానుమÖర్తి గారు రిటైర్డ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, శ్రీ మట్టుపల్లి రామకృష్ణ కిషోర్ బాబు, రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, మరియు నల్లనూకల వెంకటేశ్వర్లు గారు రిటైర్డ్ హైస్కూలు టీచరు గ్రంధాలయమునకు కావలసిన పుస్తకములు, బీరువాలు, కుర్చీలు, టేబుల్స్ సమకూర్చినారు.

శ్రీ కట్టా భానుమÖర్తి గారు గవర్నమెంటు అధికారులు మరియు సుద్దపల్లి గ్రామ పంచాయితీ వారితో సంప్రదించి ప్రభుత్వం తరపున గ్రంధాలయ పర్యవేక్షకునిగా నెలవారీ జీతముతో శ్రీ మట్టుపల్లి శ్రీనివాసరావు గారిని నియమించినారు. గ్రంధాలయమునకు 3 తెలుగు దినపత్రికలు వచ్చునట్లు మంజూరు చేయించినారు. ఈ గ్రంధాలయము ది. 20.03.2022వ తేదీన గౌ|| శ్రీ కిలారి వెంకట రోశయ్య గారు (అప్పటి శాసనసభ్యులు, పొన్నూరు) మరియు శ్రీ బత్తుల దేవానంద్, ఛైర్మన్ గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ వారిచే ప్రారంభోత్సవము జరిపించబడినది.

శ్రీ గోవాడ మోహన్రావు, రిటైర్డ్ అసిస్టెంటు ఇంజనీరు (ఇరిగేషన్ డిపార్ట్మెంట్), ప్రెసిడెంటు సమైక్య గ్రామాభివృద్ధి సేవా సంఘం, కోశాధికారి శ్రీ రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్.

శ్రీ మట్టుపల్లి గోపిచంద్ గారు రిటైర్డ్ సీనియర్ సెక్షన్ ఇంజనీరు (సౌత్ సెంట్రల్ రైల్వేస్) సెక్రటరీ సమైక్య గ్రామాభివృద్ధి సేవా సంఘం.

శ్రీ కల్యాణం సత్యనారాయణ, రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీరు, బి.యస్.యన్.యల్, ప్రెసిడెంట్ రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్.

శ్రీ నల్లనూకల రంగారావు గారు రిటైర్డ్ పోస్ట్మస్టరు, కోశాధికారి సమైక్య గ్రామాభివృద్ధి సేవా సంఘం.

శ్రీ వెలగా నరేష్ కుమార్ గారు, శ్రీ తోట శివనాగేశ్వరావు గారు (కార్యనిర్వహక సభ్యులు) ఈ రెండు సంస్థలు మరియు సుద్దపల్లి ప్రజల సమైక్య కృషితో గ్రామమునకు కావలసిన అభివృద్ధి కార్యక్రమములన్నియÖ దిగ్విజయముగా చేయబడుచున్నవి.

బ్రాహ్మణకోడూరు వాస్తవ్యులు ఈలపాట గాయకులు శ్రీ ఎ.ఆర్. లయగారు అనేక ఈలపాట కచేరీలు చేయుచున్నారు. వారి ప్రతిభను గుర్తించి ఈలపాట రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్, సుద్దపల్లి వారిచే రఘురామయ్య గారి కాంశ్య విగ్రహము ఆవిష్కరణ సందర్భముగా 2014 సం||లో వారిచే ప్రంశంసా పత్రము యిచ్చి సత్కరించినాము.

గమనిక : సమైక్య గ్రామాభివృద్ధి సంఘము అసోసియేషన్ పద్మశ్రీ (ఈలపాట రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్ మరియు సుద్దపల్లి గ్రామ ప్రజలు కీ?శే? దంటు లక్ష్మి కాంత శాస్త్రి గారితో మాట్లాడినపుడు వారు ఉదార స్వభావముతో 660 గ? స్థలమును సమైక్య గ్రామాభివృద్ధి సంఘమునకు విరాళముగా రిజిష్టరు చేసి, యిచ్చిన స్థలములో షిరిడి సాయి దంటు త్రిపురాంబ గ్రామ కల్యాణ | మండపము, షిరిడి సాయిబాబా వారి గుడి, గ్రంధాలయము మరియు రఘురామయ్య గారి కాంశ్య విగ్రహము నిర్మించటమైనది.

కీ.శే. దంటు లక్ష్మి కాంత శాస్త్రి గారు మహానుభావుడైన పద్మశ్రీ కల్యాణం రఘురామయ్య గారి కాంశ్య విగ్రహము మరియు వారికి మందిరము నిర్మాణము జరిగినందుకు సేవా సంఘముల వారిని మన:స్ఫూర్తిగా అభినందించారు.

ఈ కళ్యాణ మండపములో పేరుగాంచిన రంగస్థల నటులతో గుంటూరు వారిచే వారము రోజులు నాటక పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేసి సత్కరించటము జరిగినది. ఈ పోటీలలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో వివిధ ప్రాంతములు వారు పాల్గొని విజయవంతముగా ప్రదర్శించినారు.


ఏ దైవ నామాన్ని స్మరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది #chant #results #godpuja #nakshatra #jyothisam #astrologytips #hinduworld


 

27, జూన్ 2026, శనివారం

ఆధ్యాత్మిక చింతనా విధానం - దేవాలయాల ప్రస్తావన - లింగమూర్తి

  ప్రపంచ దేశాలకే మకుటాయమానం భారతీయుల ఆధ్యాత్మిక చింతనా విధానం. నిరంతరం తమ ఆరాధ్యదైవాన్ని ప్రార్థిస్తూ అచంచల భక్తి తత్వాన్ని ప్రబోధించి ప్రసిద్ధికెక్కిన వారు కొందరైతే...అద్భుతమైన శిల్పకళా సంపదతో ఆలయాలను నిర్మించి తమ భక్తి ప్రపత్తిని, కీర్తి ప్రతిష్ఠలను చిరస్థాయిగా నిలుపుకున్న వారు మరికొందరు, ఆనేపథ్యంలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ ప్రజలను సన్మార్గంలో నడపడానికి ఆనాటి పాలకులు, మేధావులు ఎంచుకున్నమార్గం దేవాలయాల నిర్మాణం. 

ఆధ్యాత్మిక చింతనతో పాటు చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలను ఆనాటి నుండి ఈనాటి వరకు కాపాడుకుంటూ వస్తున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక్క దేవాలయాలు మాత్రమే. అలాంటి ఆలయాల నిర్మాణానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, స్థలపురాణాలు, ఐతిహ్యాలు, మౌఖిక సమాచారాన్ని bంతో శ్రమకోర్చి విషయ సేకరణ చేసి వ్యాసాల రూపంలో పాఠకులకు అందించిన సుప్రసిద్ధ కవి పండితులు స్వర్గీయ డా. కపిలవాయి లింగమÖర్తి గారు. తెలుగు సాహిత్యంలోని దాదాపు అన్ని ప్రక్రియలలో గ్రంధరచన చేసిన సాహితీ విద్వన్మూర్తి ఆయన. పద్యాన్ని ఎంత రసరమ్యంగా శిల్పించáగలరో వ్యాసాన్ని కూడా అంతే లయబద్ధంగా విరచించగల సుప్రతిష్ఠులు. ఏడు పదలకుపైగా సాగిన వారి సాహిత్య జీవితంలో అక్షర రూపం దాల్చిన ప్రతీ అంశం ఒక ఆణిముత్యం. అలా ఒక వ్యాసమహర్షిలా వందలాది వైవిధ్యమైన వ్యాసాలకు ప్రాణం పోసిన అక్షర తపస్వి.

వంశపారంపర్య శిల్పిగా దేవాలయాలంటే అభిరుచితో ఈ సదస్సులో ప్రసంగించడానికి నేను డా. కపిలవాయి లింగమÖర్తి గారు రాసిన వ్యాసాలలో దేవాలయాల ప్రస్తావనను ఎంచుకోవడం జరిగింది. నాకు లభించిన వ్యాసాలలో ఏవో రెండు మÖడు తప్ప మిగతా అన్ని కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న దేవాలయాల గూర్చి రాసినవే ఉన్నాయి. ప్రతీ ఆలయానికి ఒక ప్రత్యేకమైన కథనం, చరిత్ర ఉంది. ఉమామహేశ్వరం, అలంపురం, జటప్రోలు, కురుమÖర్తి, మన్యంకొండ మొదలైనవి పురాణాంతర్గత క్షేత్ర ప్రాశస్త్యాన్ని కలిగి నిర్మించిన ఆలయాలు కాగా...ఆయా దేవతా మÖర్తులు స్వప్నంలో అగుపించి ఆలయనిర్మాణానికి ఆదేశించినవి మరికొన్ని, అలాగే ఆనాడు ఆయాప్రాంతాలను ఏలిన ప్రభువులు తమ కోరికలు నెరవేరగా కట్టినవి కొన్ని కాగా...ఏదో చిత్రం జరిగి...ఆవిచిత్రానికి భగవంతుడే కారణమని నమ్మి ఆ దైవం కోసం నిర్మించిన ఆలయాలు ఇంకొన్ని. ఇవేగాక స్వయంభూగా వెలసిన దేవతామÖర్తులకు కట్టించిన దేవాలయాలు కొన్నైతే...ప్రజలు తమ అభిష్టం మేరకు నిర్మించిన ఆలయాల వివరాలు కూడా ఈ వ్యాసాలలో ఉన్నాయి. అంతేగాక ఇలా వెలసిన ధూపదీపనైవేద్యాలకు చేసిన భూదాన, గోదానాది శాసనాల వివరాలు కూడా ఈ వ్యాసాలలో ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోవలసిన మరో ముఖ్య విషయమేమంటే ఆయా ఆలయాల నిర్మాణ శైలిని బట్టి అవి ఎవరి కాలం నాటివో గుర్తించి ఎంత ప్రాచీనమైన కూడా తెలియజేశారు. 

శ్రీ కపిలవాయి లింగమÖర్తి గారు రాసిన ఈ వ్యాసాలు 1960 నుండి 2018 వరకు వివిధ పత్రికలలో ప్రచురింతమయ్యాయి. ఇందులో కొన్నిటిని తాను ప్రచురించిన “పాలమÖరు జిల్లా దేవాలయాలు” గ్రంథానికి ఉపయోగించుకోగా...చాలా వ్యాసాలు ఇంకా గ్రంథస్థం కాలేదు. చరిత్ర నిర్మాణానికి సైతం దోహదం చేసే వీరి వ్యాసాలలోని పలు దేవాలయాల వివరాలను రేఖా మాత్రంగా పరిచయం చేస్తాను. 

ఇక లభిస్తున్నంతో డా. కపిలవాయి లింగమÖర్తి గారు 1960 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో “స్వధర్మం” పత్రిక కోసం రాసిన “బెÂక్కేశ్వరుడు” వ్యాసం మొదటిది. దీనికి కొనసాగింపు వివరాలు మార్చి నెల సంచికలో కూడా ప్రచురింపబడ్డాయి. “బెక్కెం” ప్రస్తుతం వనపర్తి జిల్లాలో కృష్ణానది తీరంలో ఉన్న ప్రాచీన గ్రామం. శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు కోసం నిర్మించిన ఆనకట్టవల్ల పాత బెక్కెం నీటిలో మునిగిపోయింది. బెక్కేశ్వర దేవాలయం నదికి చాలా దూరంగా ఉండటం వల్ల అది సురక్షితంగా ఉంది. 

బెÂక్కేశ్వరుడు వ్యాసంలో బెక్కెం గ్రామం ఏర్పడటానికి, అక్కడ బెÂక్కేశ్వరుడు ప్రతిష్ఠింపబడటానికి గల ఐతిహ్యం, అది ఎవరికాలంలో నిర్మించబడిందో, ఆ ప్రాంతాన్ని ఏలిన పాలకులు, వారు చేసిన దాన శాసనాది వివరాలు...శివకవిత్రయంలో ఒకరైన మల్లికార్జున పండితారాధ్యులు తమ సంచారవశంగా ఈ ప్రాంతాన్ని సందర్శించడం, ఇక్కడికి సమీపంలో ఉన్న “మÖకగుళ్ళ”ను చూసి ముగ్దుడై తన అంత్యకాలంవరకు ఇక్కడే ఉండి సమాధిగతులైన విషయాలు ఈ వ్యాసంలో ఉన్నాయి.

బెక్కెం, బెక్కేశ్వర ఆలయ సంబంధితమైన మరిన్ని వివరాలను “పరిశీలన” పత్రిక (మార్చి`1980)లో  “పెక్కు సమాధుల నిలయం`బెక్కెం”. “భారతి” (నవంబర్ 1990) పత్రికలో “బిక్కవోయిన బెక్కెంకథ”, “శ్రీశైల ప్రభ” (ఏప్రిల్`2004) పత్రికలో “కృష్ణాతీరక్షేత్రాలు`బెక్కెం” అను వ్యాసాలలో రాశారు. వీటితోపాటు “కృష్ణానది పుష్కరాల” సందర్భంగా ప్రచురించిన సంచికలలో కృష్ణా తీరం వెంట ఉన్న ఆలయాలేగాక ఈ “బెక్కేశ్వరాలయం” గూర్చి కూడా రాశారు. 

ఆ తర్వాత 1963 (జూన్ 19లో) “ఆంధ్రప్రభ” వారపత్రిక కోసం రాసిన వ్యాసం “శ్రీ రంగనాయకాలయం శ్రీరంగాపురం” వనపర్తి జిల్లా కేంద్రానికి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగాపురం ప్రస్తుతం మండల కేంద్రం ఇక్కడి శ్రీరంగనాయకాలయం శిల్ప సౌందర్యంలో ప్రసిద్ధి. దీన్ని సూగూరును రాజధానిగా చేసుకొని వనపర్తి సంస్థానాన్ని ఏలిన అష్టభాషా బహిరీగోపాలరావు (1254`1676) కట్టించాడు. ఈ గోపాల రాయుడికి రంగనాయక స్వామి కలలో కనిపించి తాను ఫలాన చోట పుట్టలో ఉన్నాను వెలికి తీయించి ప్రతిష్ఠించ వలసిందని ఆదేశించాడట. మరునాడు మందిని తీసుకొని వెళ్ళి పుట్టను త్రవ్వింఛగా శ్రీదేవి, భూదేవి సమేతుడై శేషునిపై శయనించి నాభి పద్మంలో  బ్రహ్మతో కూడిన స్వామి మÖర్తి కనిపించింది. ఏ మాత్రం భిన్న కాకుండా లభించిన ఆ స్వామిని తెచ్చి ఆ గ్రామానికి “శ్రీరంగపురం” అని నామరకణ చేసి గుట్ట క్రింద “రంగ సముద్రం” అనే చెరువును త్రవ్వించాడు.

ఈ సంస్థానపు రాణీ శంకరమ్మ (1866`1892) ఈ ఆలయానికి విమానం, ముఖద్వారంపై గోపురం కట్టించి ఇక్కడి సమీపంలో ఆండాళును ప్రతిష్టించింది. చెరువు మధ్యలో “శ్రీ కృష్ణ విలాసమ”నే విశ్రాంతి భవనాన్ని నిర్మించింది. ఈమె తర్వాత ద్వితీయ రామేశ్వరరావు (1893`1922) ఈ ఆలయాన్ని మరింత విస్తృతపరిచి ప్రధాన గర్భగుడి పక్కన లక్ష్మీదేవి ఆలయాన్ని, కల్యాణ మంటపాన్ని నిర్మించాడు. ఇక్కడ దసరా నవరాత్రులు ముక్కోటి ఏకాదశి, ఫాల్గుణ మాసంలో ఉత్సవాలు పౌర్ణమికి రథోత్సవం జరిగే విషయాలు ఈ వ్యాసంలో వివరించారు. 1980 డిశంబర్‌లో వెలువడిని “మÖసీ” పత్రికకు “శ్రీరంగాపురం క్షేత్రం అనే ఈ ఆలయ సంబంధిత విశేషాలతో మరోవ్యాసం రాశారు. 

1970 జూలై మాసపు “పరిశీలన” పత్రిక కోసం సుప్రసిద్ధ శైవక్షేత్రమైన “శ్రీశైలక్షేత్రము” గూర్చి రాశారు శ్రీ లింగమÖర్తి గారు. ఇందులో శ్రీశైలక్షేత్ర స్థల పురాణం, స్థానిక ఐతిహ్యాలు, అక్కడగల ఆలయాలు, వాటి నిర్మాణ విశేషాలు, చరిత్ర మున్నగుల అంశాలను తమదైన పరిశీలనతో ఈ వ్యాసంలో తెలియజేశారు. 

మన తెలంగాణలో కనీసం ఒకటోరెండో నాగప్రతిమలు, నరనాగ విగ్రహాలు లేని గ్రామం ఉండదు. కానీ ఆలయంపై ఆపాదమస్తకం నాగ చిహ్నాలే ఉండటం అపురూపంగా చెప్పుకోవచ్చు. అలా ఒకప్పుడు ఈ ప్రాంతమంతా నాగ సర్పాలకు నిలయమై...శ్రీశైలం వెళ్ళే భక్తుల బసకు స్థావరమై...అనంతర కాలంలో ఊరుగా ఏర్పడిన గ్రామం “కొండనాగుల”. ఇది నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో ఉంది. ఇక్కడ వెలసిన నాగలింగేశ్వర స్వామి వృత్తాంతాన్ని 1972 జూలైలో “ఆరాధన” పత్రికకోసం రాసిన వ్యాసం “నాగలింగేశ్వరాలయం కొండనాగుల”.

పూర్వం ఈ ప్రాంతాన్ని నాగవంశీయులు పాలించారు. వారే ఇక్కడి ఆలయాన్ని నిర్మించి ఉంటారని ఊహ. ఇక్కడ గుట్టవంటి రెండు పెద్ద గుండ్లు ఉన్నాయి. ఒక గుండుపై నాగలింగేశ్వరాలయాన్ని నలభై స్తంభాలతో కట్టి స్వామి ప్రతిష్ఠించారు. ఈ స్వామిని భక్తులు “రామలింగేశ్వరుడు” అని కూడా పిలుచుకుంటారు. డర్రన్న, బర్రన్న అనే సోదరులు మొదట ఇక్కడ నివాసం ఏర్పరుచుకొని అది గ్రామంగా విస్తరించడానికి ఆద్యులయ్యారని ఈ వ్యాసం ద్వారా తెలుస్తుంది. ఈ ఊళ్ళో గౌరీ, గంగాభవానీ, చెన్నకేశవ, హనుమదాలయాలు కూడా ఉన్నాయి. 

ఉమ్మడి పాలమÖరు జిల్లాలో 32 విధాల గ్రామ దేవతలు కొలువబడుతున్నారని, వారిలో ప్రతి వారికీ ఒక చరిత్ర ఉందని చెబుతూ 1975 డిశంబర్ “పరిశీలనర” పత్రికలలో వచ్చిన వ్యాసం. “మన జిల్లాలోని కొన్ని వీరగల్లులు”. గ్రామదేవతలు మనకు రామాయణ కాలం నుండే ఉన్నారని దీనివల్ల తెలుస్తుంది. ఇక్కడి గ్రామాలలో ఇదమ్మ,ఎల్లమ్మ,పోషమ్మ,మశమ్మ, మున్నగు గ్రామ దేవతలకు దేవాలయాలున్నాయని, పూర్వం కోటలు, చెరువుల నిర్మాణాలకు బలి ఇవ్వబడినవారు, బందిపోట్ల దాడిలో వీరోచితంగా పోరాడి మరణించినవారు, మత యుద్ధాలలో చచ్చిన వారి కోసం స్మృత్యర్థంగా ఆలయాలు నిర్మించి కొలిచిన వివరాలను ఇందులో ప్రస్తావించారు.

‘ఇంద్రకల్లు’ నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక ప్రాచీన గ్రామం. ఈ ఊళ్ళో ఉన్న శివాలయాలలో ఈ శాన్యంగా ఉన్నదానికి నందీశ్వర, ఆగ్నేయంలో ముక్కంటీశ్వర, నైఋతిలో ఇంద్రేశ్వర, వాయవ్యంలో ఉన్నదానికి భీమేశ్వరాలయాలని పేర్లు. ఇప్పుడు ఇక్కడ ముక్కంటీశ్వర, ఇంద్రేశ్వరాలయాలు మాత్రమేమిగిలాయి. ఈ ఇంద్రేశ్వరాలయం గూర్చి రాసిన వ్యాసం “భారతి” పత్రిక (జనవరి 1977)లో ప్రచురితమైంది.

పూర్వ ఇంద్రకల్లు గ్రామంలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన గంగాపురానికి యజ్ఞ వాటికగా ఉండేదట గంగాపురం మాదిరి ఇక్కడ కూడా జైన సంప్రదాయం వర్ధిల్లింది. రాష్ట్ర కూటులు జైనులు కాబట్టి వారిలో ఇంద్రనామం కలవారు ఉన్నందువల్ల ఈ గ్రామానికి “ఇంద్రకల్లు” పేరు వచ్చి ఉండవచ్చునని వివరించారు. ఇక్కడ పలు జైన పత్రిమలతో పాటు, నాగ శిల్పాలు కూడా ఉన్నాయి. ఆనాడు ఇదొక క్షేత్రంగానే గాక సామంత రాజధానిగా కూడా ఉన్న చిహ్నాలున్నాయి. అంతేగాక యుద్ధం జరిగిన స్థలం, రాణులు అగ్ని ప్రవేశం చేసిన అగ్ని గుండుం, వీర లింగన్న అనే ఒక యోధుని వీరగల్లు కూడా ఉన్నాయి. ఈ గ్రామంలో నేడు ఇంద్రేశ్వర, చెన్న కేశవాలయాలు మాత్రమే నిత్య పూజలందుకుంటున్నాయి. ఇదే అంశంపై శ్రీలింగమÖర్తిగారు “సుపధ” పత్రిక (నవంబర్ 2008)కు వ్యాసం రాశారు. 

కృష్ణానది తీరం వెంట ఉన్న దేవాలయాల గూర్చి ‘ఆంధ్రభూమి’ దినపత్రిక (15`1`1979)లో  వెలువడిన వ్యాసం “పాలమÖరులోని కృష్ణా తీరం క్షేత్రాలు”. ఇందులో కృష్ణానది తీరం వెంట ఉన్న గురజాల కాఢ లింగేశ్వరాలయం, ముడుమాల, మంత్రాలయ రాఘవేంద్రుని సహధ్యాయి అయిన “యాదవేంద్ర తీర్థుల” కొల్పూరులోని ఉత్తరాది మఠసంప్రదాయానికి చెందిన “సత్యతీర్థల మఠం” ఇందుపూర్‌లో శంకరానందుల వారి మఠం ఉన్నాయి. బ్రహూత్తర ఖండంలో కృష్ణానది మహాత్మ్యంలో ప్రస్తావింపబడిన గుడబల్లూరులోని శ్రీ వేîంకటేశ్వస్వామి దేవాలయం ప్రస్తావన, కురువపురంలో, దత్తావతారుడైన శ్రీపాదవల్లభుని” దేవాలయం, ధరూరు మండలంలోని చింతరేవులలో వెలసిన హనుమత్ క్షేత్రం, బీచుపల్లి క్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయం, చిన్న అగ్రహారంలోని శివకేశవాలయాలు, యాపర్లలో ఉన్న శ్రీరామ వేంకటేశ్వర స్వామి దేవాలయం, ఆంజనేయస్వామి ఆలయం, మారమునుగాలలో మార్కండేయ చరిత్ర, బెక్కెంలోని బెక్కేశ్వరాలయం, మÖకగుళ్ళు, పెద్దమారురు, చిన్నమారు గ్రామాల ప్రస్తావన, జటప్రోలు మదనగోపాల ఆలయం, మంచాలకట్ట రామతీర్థ, గొందిమళ్ళ, అగస్తేశ్వరం, మల్లేశ్వరం, సోమశిల, మద్దిమడుగు, ఈగలపెంట మున్నగు చోట్ల వెలసిన ఆలయాల వివరాలు ఈ వ్యాసంలో ఉన్నాయి. 

1980 మార్చిలో “నృసింహప్రియ” పత్రికకు రాసిన వ్యాసం నృసింహాలయం మామిళ్ళపల్లి. ఈ దేవాలయాన్ని క్రీ.శ. 1136`76 నడుమ నల్లగొండ జిల్లా పానుగంటి నుండి రాజ్యపాలన చేసిన గోకర్ణం మహరాజు కట్టించినట్లు ఇక్కడి శాసనం వల్ల తెలుస్తుంది. ఇక్కడ శ్రీ వేంకటేశ్వర, సప్తమాతృకా,గణపతి ఆలయాలున్నాయి. ఇక్కడ నృసింహాస్వామిని ప్రతిష్ఠించేకంటే ముందు “శ్యామలపీఠం” ఉండేదట. ఫాల్గుణశుద్ధ పంచమి నుండి పున్నమి వరకు బ్రీVA్మత్సవాలు, వైశాఖలో నృసింహ జయంతి ఘనంగా జరుగుతాయి. ఇదే ఆలయాన్ని గూర్చి శ్రీ లింగమÖర్తిగారు 1981 మే,లో ఆరాధన పత్రికకు కూడా వ్యాసం అందించారు. 

పూర్వం ఒక ప్రసిద్ధ సౌరక్షేత్రంగా చెప్పబడిన గ్రామం కల్వకుర్తి మండలంలోని “తరణి కల్లు”. వర్ధమానపురం శాసనకర్తలైన అభినవ మయÖర సూరి వంశీయులు ఈ గ్రామ వాసులు మయÖరుడు సూర్యోపాసకుడు కనుక ఇక్కడి కవులు మయÖర నామాన్ని తమకు బిరుదుగా స్వీకరించినారు. ఈ గ్రామంలో శ్రీరామ, సూర్య, శివ, దేవి, భైరవ, వేణుగోపాల ఆలయాలున్నట్లు తెలిపే ఈ వ్యాసం అక్టోబర్ 1981 “మÖసీ” పత్రికలో వెలువడింది. 

అచ్చంపేట నియోజకవర్గంలోని వంకేశ్వరానికి సమీపంలో ఉన్న లక్ష్మీ పురాన్ని మరో అీVAబిలంగా పిలుచుకుంటారు. ఇక్కడ నవనారసింహ పత్రిష్ఠలుండేవట. కానీ ప్రస్తుతం నృసింహ, వరాహ, వృద్ధ, ఉగ్రయోగ నారసింహాలయాలతో పాటు హయగ్రీవ, హనుమంత, శివ, మహిషాసురమర్ధని, భైరవుల ప్రతిష్ఠలున్నాయి. ఇక్కడ ప్రధానాలయమైన యోగనరసింహ తదితర ఆలయాలను చాళుక్యులు కట్టి ఉండవచ్చునని తెలిపే ఈ వ్యాసం “ఆరాధన” పత్రిక (సెప్టెంబర్ 1982)లో ప్రచురింపబడింది.

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న అవంచ ఒక ప్రాచీన గ్రామం. ఇది పశ్చిమ చాళుక్యుల రాజపత్రినిధి పురంగా ఉండేది. ఆవంచ అనగానే దాదాపు 20 అడుగుల ఎత్తున పెద్ద గుండుకు చెక్కుబడిన గణపతి విగ్రహం గుర్తుకొస్తుంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి పొందిన భైరవ, రాజగోపాల, హనుమ, భ్రమరాంబ ఆలయాలున్నాయి. ఇక్కడి భమరాంబదేవి స్వయం వ్యక్తమని “ఆవంచ భ్రమరాంబ పంచవింశతి” (పులిజాల పట్టాభికవి) వల్ల తెలిపే వ్యాసం మార్చి 1982 మÖసీ పత్రికలో వచ్చింది.

అలాగే డిశంబర్ 1982లో మÖసి పత్రికలో “కందూరు” వ్యాసం వెలువడింది. గొప్ప చరిత్ర కలిగిన ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో ఉంది. చోళులు కోడూరును విడిచిన తర్వాత కందూరుకు చేరి “కందూరు చోళులైనారు. ఆనాడు వారు నిర్మించిన కట్టడాలు నేడు శిధిలాలుగా దర్శనమిస్తాయి. సాధారణంగా శివలింగం సోమసూత్రంపై ఉండటం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం శివలింగం రథ చక్రంలో ప్రతిష్ఠింపబడింది. ఈ స్వామిని “రామలింగేశ్వరుడు” అంటారు. ఈ ప్రదేశానికి ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రం కదంబ వృక్షాలకు నిలయం. ఈ గ్రామంలో గౌరీ, ఆంజనేయ వీరభద్ర, చెన్నకేశవ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. 

నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల క్షేత్రానికి అత్యంత సమీపంలో ఉన్న “సంగమేశ్వరక్షేత్రం” యొక్క పౌరాణిక, చారిత్రక, ఆలయవిశేషాలతో రాసిన వ్యాసం “సంగమేశ్వర స్థల పురాణం” “సంగమేశ్వర స్థలపురాణమను” గ్రంథాన్ని బెక్కె వాస్తవ్యులైన బలహరిసింహఠాకూరు 1982లో  ప్రచురించారు. ఇది పద్య రచన. ఈ గ్రంథానికి లింగమÖర్తి గారు రాసిన సమీక్ష “దుందుభి మాస పత్రిక (డిశంబర్ 1982)లో వచ్చింది. 

నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలో “రామగిరి” ఉంది. దీనిపై ఉన్న ఆలయాన్ని ఏరువ వంశానికి చెందిన గోకర్ణ మహారాజు కట్టించాడు. ఈ వ్యాసంలోని కథనం ప్రకారం మొదటి ఇది పార్శ్యనాథ, తర్వాత శివ, శ్రీరామ ప్రస్తుతం శ్రీ రామలింగేశ్వరాలయంగా పిలువబడుతోంది. వీటితోపాటు లక్ష్మీ గణపతి, శ్రీ సీతారామలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాలున్నాయి. ఈ ఆలయాల సంబంధిత వ్యాసం 1983 అక్టోబర్ “ఆరాధన” మాసపత్రికలో వెలువడింది. 

అమరాబాదుకు సమీపంలోఉన్న రాయనిగండి ప్రాంతాన్ని చింతకుంట రంగారాయుడు పాలించాడు. క్రీ.శ. 1532లో ఈయన పల్నాటి బ్రహ్మనాయుడు, మలిదేవాదులతో శ్రీశైల అరణ్య ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఇక్కడ చెన్నకేశవస్వామిని ప్రతిష్ఠించాడనే ప్రతీతి ఉంది. రంగ రాయుడు వేయించిన ఒక శాసనం కూడా ఉంది. ఈ వివరాలతో కూడిన వ్యాసం “ఆరాధన” పత్రిక 1984 ఆగష్టులో ప్రచురితమైంది. 

నాగర్‌కర్నూల్ జిల్లాలో తీగలపల్లి ఒక ప్రాచీన గ్రామం. తీగన్న అనే యాదవుడు స్థాపించిన గ్రామంగా చెబుతారు. ఈ ఊరికి తూర్పున వీరన్న గుట్ట ఉంది. ఎవరో ఈ గుట్టపై ఆలయాన్ని కట్టి అందులో వీరభద్రున్ని నిలిపినారు. ఒకప్పుడు ఇక్కడ కాకతీయుల సైన్యవాసం ఉండేదట. స్వామికి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మహిమాన్వితుడిగా చెప్పబడే ఈ వీరభద్ర స్వామితో పాటు శివాలయం, చెన్నకేశవాలయాలున్నాయి. వీటి వివరాలు “మÖసీ” పత్రికలో 1982 మేలో వచ్చాయి. 

ఎండవెట్ల గ్రామం నాగర్‌కర్నూల్‌కు దగ్గరలో ఉంది. ఈ ఊరికి దక్షిణాన గుట్టపై ప్రాచీన ఏకకూట నృసింహాలయం ఉంది. ఇది ఎవరు కట్టించారో తెలియదు. ఈ స్వామిపేర కేసరీ సముద్రమనే పెద్ద చెరువు కూడా త్రవ్వించారు. ఈ చెరువుకు మొదట “శిఖేశ్వర సముద్ర”మని పేరు. ఇక్కడికి సమీపంలో శిఖేశ్వరాలయం ఉంది. ఆ వివరాలు “నృసింహప్రియ” పత్రిక (జూలై 1985)లో “ఎండవెట్ల నృసింహాలయం” అనే శీర్షికన వచ్చింది. ఇదే పత్రికలో ఇదే సంవత్సరం సెప్టెంబర్‌లో “అంకూరు నృసింహాలయం” వ్యాసం వచ్చింది. స్వామి స్వప్నంలో అగుపించి ఆదేశించగా నిర్మించిన గుడి. గుడిలో మÖల విరాట్టు విగ్రహం కాకుండా భావనామÖర్తి శిల ఉండేది. మొదట మట్టితో కట్టబడిన ఈ ఆలయాన్ని వనపర్తి సంస్థానపాలకుడు రాజాకృష్ణ దేవరావు రాతితో నిర్మించాడు. ఈ గుడి ఒక పెద్ద గుండుపై ఉంది. ఇక్కడే శివాలయంతో పాటు వైవిద్యమైన దీపస్తంభపు వివరాలున్నాయి. 

సిరసవాడ దుందుభీ (డిండి) నది తీరంలోని ఒక ప్రాచీనగ్రామం. ఇక్కడే చెన్నకేశవాలయం. వేణుగోపాలాలయం అని రెండు విధాలుగా పిలువబడే ఆలయముంది. ఇందులో విగ్రహ ప్రతిష్ఠ ఎందుకు జరుగలేదో ఎవ్వరికీ తెలియదు. ఈ వ్యాసం “ఆరాధన” పత్రిక (1986 ఆగష్టులో వచ్చింది. ఇదే సంవత్సరం అక్టోబర్‌లో ఈ పత్రికలోనే ప్రచురింపబడిన వ్యాసం “కల్యాణ వేంకటేశ్వరుని కథ” ఇది కొత్తకోట మండలం అమడబాకుల గ్రామంలో స్వామి స్వప్నం చెప్పగా వెలసిన “స్వయంభూ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి” దేవాలయ కథనం. ఈ వృత్తాంతాన్ని గూర్చి ఇదే పత్రికలో ఫిబ్రవరి 1987లో రాగా, “సుపధ” పత్రికలో అక్టోబర్ 1987లో ప్రచురింపబడింది.

శ్రీ కపిలవాయి లింగమÖర్తిగారు దేవాలయ సంబంధితంగా 1987 సంవత్సరంలో రాసిన వ్యాసాల గూర్చి తెలుసుకుంటే... ‘ఆరాధన’ పత్రిక కోసం ఫిబ్రవరిలో రాసిన వ్యాసం “మాతంగిక్షేత్రం వెలికట్ట”. వెలికట్ట షాద్‌నగర్ పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామం. ఇక్కడ అంబాభవానీ ఆలయం ప్రసిద్ధి. అతి పరాతనమైన ఈ ఆలయం విశేషాలు ఇందులో ఉన్నాయి. 

ఫిబ్రవరి, మార్చి మాసం “ఆంధ్ర పత్రిక భారతి, సారస్వతానుబంధం” సంచికల్లో “సహస్ర గణపతీశ్వరుడు, గణపురం” వ్యాసం వచ్చింది. గణపురం కకాకతీయ గణపతి దేవుని పేరున వెలసిన గ్రామం. వనపర్తి జిల్లాలో మండల కేంద్రంగా ఉన్న దీన్ని ప్రస్తుతం “ఖిల్లా ఘనపురం” అని పిలుస్తారు. గోనగణిపి రెడ్డి అక్కడ గల గుట్టపైన కోటను, గుట్ట క్రింద గణపతీశ్వరాలయాన్ని కట్టించాడన్న వివరాలు, ఇతర ఆలయాల గూర్చి ఇందులో ప్రస్తావించారు. 

జూన్ “సమాలోచన” పత్రికలో “గురుభక్త విజయం” పేరున వచ్చిన వ్యాసంలో వనపర్తి సంస్థాన పాలకులు నివాసమున్న ‘రాజనగరం’లో కట్టిన “రామకృష్ణాలయం” తదితర వివరాలున్నాయి. ఇదే పత్రికలో ఆగష్టు మాసంలో “గంగాపురం మాహాత్మ్యం” వ్యాసం వచ్చింది. ఇందులో గంగాపురం చెన్నకేశవ దేవాలయ నిర్మాణ నేపథ్యం, పౌరాణిక ప్రశస్తి, జైన బౌద్ధమతాల ప్రస్తావన, ఆ ప్రాంతాన్ని పాలించిన ప్రభువులు, అక్కడి ఉత్సవాలు, వారి దానశాసన వివరాలు ఉన్నాయి.  

1988వ సంవత్సరంలో దేవాలయ సంబంధితంగా రాసిన వ్యాసం ఒకటి మాత్రమే కనబడుతుంది. అది “అప్పాజిపల్లె, సింగన్న”ను గూర్చి ఏప్రిల్ “ఆరాధన” పత్రికలో వచ్చింది. అప్పాజిపల్లె నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని గ్రామం. ఈ ఊరి వెలుపల ఉన్న గుట్టపై గల చారికలో వెలసిన నృసింహ స్వామి గూర్చి రాసిన సమాచారం. 

1989వ సంవత్సరంలో రెండు వ్యాసాలొచ్చాయి. ఒకటి భారతి (మార్చి)లో వచ్చిన “నంది వనపర్తి” కాగా, మరొకటి “ఆరాధన” పత్రిక (ఆగష్టు)లో వచ్చిన “వీరన్న పేట గుడులు”. నందివనపర్తి రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని గ్రామం. ప్రాచీన చరిత్రగల గ్రామం. పూర్వం ఈ గ్రామానికి “ వహ్నిపురం” అనే వ్యవహారం ఉండేదట. ముస్లీం ప్రభువులు “వన్‌ఫర” అని, ప్రజలు “వనపర్తి” అని, ప్రజలు “వనపర్తి” అని పిలుచుకున్నారు. ఈ ఊళ్ళో సిద్దేశ్వర, నందీశ్వర, ఓంకారేశ్వరమును మÖడు ఆలయాలున్నవి. వీటిలో చెప్పుదగింది. “నందీశ్వరాలయం”. దానిలో ఉండే నంది విగ్రహాన్ని బట్టి ఈ గ్రామం “నందివనపర్తి” అయింది. ఈ నందిని గూర్చి ఇక్కడ రెండు మÖడు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటితోపాటు ఆనాడు ఇక్కడ జరిగిన ఉత్సవాలు, పలు చారిత్రక అంశాలు ఈ వ్యాసంలో ఉన్నాయి. రెండవది “వీరన్నపేట గుడులు” వ్యాసం, వీరన్నపేట`ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఒక కాలనీ చాలా కాలం కిందట ఇది మÖలికా వృక్షాలుగల ఒక అడవి. వీరన్న అనే భక్తుడు ఇక్కడ గల ఒక గుట్టపై నివసించి శివ, వీరభద్ర ఆలయాలతో పాటు మరికొన్ని గుళ్ళను నిర్మించిన సమాచారం ఇందులో ఉంది. అంతేగాక ఆనాటి ఐతిహ్యపు వివరాలుకూడా ఉన్నాయి. 

1990వ సంవత్సరంలో ఆలయాలకు సంబంధించి రాసిన రెండు వ్యాసాలు లభించాయి. అవి “60వ శివకోటి జపయజ్ఞ గీతాయజ్ఞ భక్త సమాజం వారు ప్రచురించిన షష్టిపూర్తి (అక్టోబర్) సంచికలో “ద్వాదశ జ్యోతిర్లింగముల చరిత్ర “వ్యాసం కాగా రెండోది “భారతి” (నవంబర్)లో వచ్చిన “బిక్కవోయిన బెక్కెం కథ”. మొదటి వ్యాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్ర సమాచార ఉండగా, రెండోవ్యాసంలో బెక్కెం గ్రామం, అక్కడ ఉన్న “బెక్కేశ్వరాలయం” మున్నగు ఆలయాల ప్రస్తావన ఉంది. 

1992వ సంవత్సరంలో “కళామతల్లికి ఊయల సోమశిల” (ఆస్తికభూమి`పత్రిక), “అద్వితీయ జ్యోతిర్లింగ క్షేత్రం (సద్గురువాణి`జనవరి) అను రెండు వ్యాసాలు వచ్చాయి. “సోమశిల” నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న సుప్రసిద్ధశైవ క్షేత్రం. ఇది కృష్ణానది తీరంలో ఉంది. ఇక్కడ కృష్ణానది “సప్తనదీ సంగమం” గా ప్రసిద్ధి. దీన్ని పూర్వం “సోమేశ్వరక్షేత్రం” అని పిలిచేవారు. లలితా, సోమేశ్వరులిక్కడ ప్రధాన దేవతలు. ఒకే కప్పు కింద 13 ఆలయాలున్నాయి. పాత గ్రామం శ్రీశైలం డ్యాం నిర్మాణం కోసం మునిగిపోగా ఈ దేవాలయాన్ని మరోచోటుకి తరలించారు. ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో శాతవాహనుల కాలం నుండి విజయ నగర కాలం వరకు గల శిల్పావశేషాలు బయటపడ్డాయి. పలు పురాణ, చారిత్ర అంశాలతో ఈ వ్యాసం రాయబడింది. ఇదే క్షేత్రాన్ని గూర్చి 1993లో “సద్గురువాణి” పత్రిక (జనవరి)లో “మన పుణ్యక్షేత్రాలు`సోమేశ్వరం” అనే వ్యాసం వచ్చింది.

1994,95 సంవత్సరాలలో వ్యాసాలు అగుపించకపోగా...1996వ సంవత్సరంలో ఆం.ప్ర. ప్రభుత్వం ప్రకటించిన 8వ తరగతి “తెలుగువాచకం”తో “ఉమామహేశ్వరం” క్షేత్రం గురించి పాఠ్యాంశ ఉంది. ఇది నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇదే క్షేత్రాన్ని గురించి 2006వ సంవత్సరం ఫిబ్రవరి “వేదాంత భేరి” పత్రికలో, 2010 జూలై`సెప్టెంబర్ “సద్గురువాణి” పత్రికలో కూడా వ్యాసాలు రాశారు.

2001వ సంవత్సరంలో...“అలంపురం`ఆలయ సంపద” శీర్షికన “సుపధ” పత్రిక ఏప్రిల్‌లో వ్యాసం వెలువడింది. “అలంపురం” కృష్ణా తుంగభద్ర నదుల నడుమగల పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలోని పది భాస్కరక్షేత్రాలలో, పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటై`శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ ఉన్నన్ని ఆలయాలు మరెక్కడాలేవు. ఇక్కడ నవబ్రహ్మల పేర ఆలయాలు వెలయటం ఈక్షేత్రం యొక్క ప్రత్యేకత.

జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరలు ఇక్కడి ప్రధాన దేవతలు. క్రీ.శ. ఏడవ శతాబ్ది వరకే ఈ బ్రహ్మేశ్వరాలయాలు ప్రసిద్ధి. ఈ వ్యాసంలో అలంపురంలోని కోట, డుంఠి గణపతి, కామాక్షిదేవి, రససిద్ధుడు, వేîంకటేశ్వర, దత్తాత్రేయ, నృసింహ, కోటమీది ఆంజనేయ, సూర్యనారాయణ, బసవేశ్వర, నీలకంఠేశ్వర స్వాముల ఆలయాల ప్రస్తావన, చారిత్రక విషయాలు ప్రస్తావించబడ్డాయి.

2003వ సంవత్సరంలో “(శ్రీ శైల ప్రభ” పత్రిక డిశంబర్)లో “ పీడలు తొలగించే బీచుపల్లి క్షేత్రం” అనే వ్యాసంరాగా, 2004వ సంవత్సరంలో “సుపథ” పత్రిక (మార్చి)లో, “యుగ యుగాలకృష్ణ” శ్రీశైల ప్రభ`ఏప్రిల్, మే, జూన్ సంచికలో వరుసగా కృష్ణాతీరక్షేత్రాలు బెక్కెం. కృష్ణాతీరక్షేత్రాలు కురవపురం వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. ఆగష్టు మాసంలో “ఆంధ్రభూమి” పుష్కరాల ప్రత్యేక సంచికలో “పాలమÖరు కృష్ణా తీరాలు`కృష్ణవేణి” శ్రీశైలప్రభ`ఆగష్టు, సెప్టెంబర్ మాసంలో “మహబూబ్‌నగర్‌లోని కృష్ణాతీర క్షేత్రాలు” వ్యాసాలు వెలువడ్డాయి.

2005వ సంవత్సరం నవంబర్ “విశ్వఐక్యత” మాసపత్రికలో “భైరవకోనక్షేత్రము” గూర్చి, 2008వ సంవత్సరం మే నెలలో ఆం. ప్ర హిందూ ధర్మ ప్రచార సమితివారి “పుణ్యక్షేత్ర సందర్శన రథయాత్ర స్మరణిక”లో “మహబూబ్‌నగర్ జిల్లాలో కొన్ని ముఖ్య దేవాలయాలు” వ్యాసం వచ్చింది. 2008 నవంబర్ “సుపథ” పత్రికలో “చరిత్రలో ఇంద్రకల్లు” వ్యాసం, కె.వి. సుందరాచార్యుల సంఫాదకత్వంలో 2009 జనవరిలో వెలువడిన “వాహనోత్సవ వైభవము” గ్రంథంకోసం “వాహనసేవ వాని తత్వము వైష్ణవాలయాలు” వ్యాసం రాశారు. 

2011వ సంవత్సరంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో వట్టెం ప్రసిద్ధవైష్ణవక్షేత్రం. ఆ దేవస్థానం వారు ప్రచురించిన “పుష్కరశ్రీ” ద్వితీయ పుష్కర మీVAత్సవ విశేష సంచిక కోసం “వట్ట్టెం నాడు నేడు” అనువ్యాసాన్ని అందించారు. 

2012వ సంవత్సరంలో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని “మహారాణి ఆది లక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రి కళాశాల స్వర్ణోత్సవ సంచిక “స్వర్ణవాహిని”లో “గద్వాల తాలూకాలోని ఆలయాలు” అనువ్యాసం ప్రచురించపబడగా...ఆగష్టు మాస “సుపథ” పత్రికకు తక్షశిల నుండి తక్కశిల వరకు అను వ్యాసాన్ని అందించారు. ఈ వ్యాసంలో ఉత్తర భారతంలోని అయోధ్య,         ఉజ్జయిని, తక్షశిల నగరాలకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ ఉజ్జలి తక్కశిల అనేవి ప్రతిరూపాలుగా వెలయటం దీని ప్రత్యేకతగా చెప్పారు. తక్కశిల గ్రామంలో ఉన్న రామేశ్వర మున్నగు దేవాలయాల వివరాలు రాశారు. 

చివరగా 2016వ సంవత్సరంలో “బంగారు తంగేడు” ఆగష్టు మాస పత్రికకు “పాలమÖరులో కృష్ణాతీర క్షేత్రాలు” వ్యాసం ఇవ్వగా`ఇదే అంశంపై 2019 జనవరి మార్చి “పునాస” పత్రికలో వ్యాసం వెలువడింది. 


కొత్త పింఛన్ల దరఖాస్తు కోసం ఏ పత్రాలు కావాలి #pension #apply #new #telangana #government #scheme


 

గుడ్లతో పాటు తినకూడని ఆహారాలు ఏమిటి #eggs #combined #food #items #health #arogyam


 

26, జూన్ 2026, శుక్రవారం

దేవదాసు.....నిందాస్తుతి

వినోదా వారి ‘దేవదాసు’ విడుదలైన 58 సంవత్సరాలకు sTÖ కైవారగీతం పాడటానికి రెండు కారణాలు. షష్టిపూర్తి చేసుకొనే సమయంలో కూడా సర్వాంగసుందరంగా, సొగసుజూడతరమా అన్నట్లిది శోభిల్లడం. ఇప్పటికి అయిదు భాషల్లో తయారైన పదకొండు (G ఒక మÖకీ) చిత్రాలలో దీనికి వచ్చిన పేరూ ప్రతిష్ఠా మరే చిత్రానికీ రాకపోవడం.

నేనీ ‘దేవదాసు’ల్లో ఎనిమిదింటిని చూశాను. ప్రతిదానిలో ఏదో ఒక ప్రత్యేకాకర్షణ యిప్పటికీ సూదంటురాయిలా వుంది. ఒకదానిలో సంగీత సాహిత్యాలు (ఆరుద్ర - రమేశ్ నాయుడు / విజయనిర్మల-1974), యింకోదానిలో స్క్రీన్-ప్లే (పి.సి.బరువా/ పి.సి.బరువా-1935, హిందీ), ఛాయాగ్రహణం (కమల్ బోస్ / బిమల్ రాయ్-1955, హిందీ), మొట్టమొదటి టైటిల్ కార్డు నుంచి చిట్టచివరి సమాప్తం కార్డు వరకూ ప్రౌఢ స్ధాయిలో పటాటోపం (సంజయ్ లీలా భన్సాలి, 2002, హిందీ), భగవాన్-చునీలాల్‌గా అమోఘ నటన (ఉత్తమ్ కుమార్/దిలీప్ రాయ్-1979, బెంగాలీ)  యిలా అన్నిటిగురించీ ఒక ప్రత్యేక దీప్తిని ఎంచి చూపవచ్చు.

కాని sTÖ అన్ని పరిధులను దాటి, ప్రేక్షకుల మనసుపై చెరగని ముద్ర వేసింది వినోదా వారి ‘దేవదాసే’,  నిస్సంశయంగా. నేనీమాట ఒక ఆంధ్రుడిగా మాతృభాషాభిమానంతో చెప్పడంలేదు. అరవై అయిదు సంవత్సరాలుగా పలు భాషల్లో వేల సినిమాలు చూసి సినిమా కళ అంటే ఒక స్పష్టమైన దృష్టినేర్పరుచుకొని అంటున్నమాట.

స్వర్ణయోగం సిద్ధించటానికి కారణాలు సవాలక్ష. అలాగే sTÖ చిత్రమిలా బంగారమయిదంటే దాని వెనుకనున్న తారాబలం, సాంకేతిక బృందమే కాక మరొక అంశం అదృష్టం, అన్నీ అలా అందంగా కలిసిరావడం. ఆ యోగానికి ఒక్కరినే వేలెత్తి చూపమంటే, కాదు బలాత్కరిస్తే దర్శకుడు (వీరికి సంగీత, నృత్య, సాహిత్యాభినయాలు వంశపారంపర్యంగా వచ్చి, కృషితో చేతికందిన కల్యాణసౌగంధికాలు) వేదాంతం రాఘవయ్యనే పేర్కొనాలి. ఆ మరుసటి సంవత్సరమే వీరి దర్శకత్వంలోనే వచ్చి, అందరినీ నిరుత్సాహపరచిన ‘అన్నదాత’  మాటేమిటి అని అడిగితే నేనొక ఋషివాక్యాన్నే ఉదాహరించగలను: ‘చినికిన చినుకెల్ల మంచి ముత్యము కాదు’ (మల్లాది రామకృష్ణశాస్తి - చివరకు మిగిలింది/రామినీడు, 1960).

సాంకేతిక వర్గంలో ప్రతి ఒక్కరూ తాము చేయవలసింది నిష్కళంకంగా చేశారు. తేటతెల్లంగా కనబడే ఛాయ, కళ, మేకప్, వస్తాలంకరణలే కాక గాలి తెచ్చే గంధంలా తెలిసీ తెలియక అలముకొనే నృత్యరచన, నేపథ్య సంగీతము, కూర్పు కూడా ఒకదానికొకటి తోడైనాయి.

నేను మొట్టమొదట ‘దేవదాసు’ చూసింది మొదటి విడుదలకే, 1953లో  స్కూలు క్రికెట్టు జట్టు అఫీషియల్ ఫోటోగ్రాఫర్‌గా బెంగుళూరు వెళ్లినప్ప్పుడు. చివరనే కాదు ఎన్నో సన్నివేశాలలో కన్నీళ్లు కాలువలై ప్రవహించాయి. ఆ వయసు—నిండా నిండని పధ్నాలుగు—అటువంటిది. ముఖ్యంగా చంద్రముఖి-దేవదాసు వీడ్కోలు సన్నివేశం గుండెను పిండివేసింది. ఎన్నో సంవత్సరాల తరువాత విజయవాడ మాడర్న్ కఫేలో వుంటూ దగ్గరున్న ఎ.సి. హాలులో చూడని ‘సీతారామయ్యగారి మనవరాలి’ని వదులుకొని దూరంగా బెంజ్ సర్కిల్ అవతల వున్న పాత హాలులో, ఆ హోటలు మేనేజరు సైకిలు తీసుకొని వెళ్లి, రాత్రి ఆటను చూసినప్ప్పుడు - అదే ఉత్పాతం. అదే sTÖ ‘దేవదాసు’ గొప్పతనం.

ఒకటి రెండు ముచ్చట్లు అందరికీ తెలియనివి చెప్పి, sTÖ వందిమాగధీయాన్ని ముగిస్తాను.

‘దేవదాసు’ పాటల్లో మల్లాది వారి హస్తం ఉందనే మాట పాతదే. దీనికి ఉదాహరణగా ‘అందాల ఆనందం’, ‘కుడి యెడమైతే’ పాటలను పేర్కొంటారు. ‘తాగినోడి మాటకర్థం వెతకాలా’ అని ఒక రిక్షావాడడగడం కట్టుకథని ప్రతిభాశాస్తి నాతో స్వయంగా చెప్పారు. అవటుపెడితే, మÖడుచోట్ల సంభాషణల్లో నాకు ఆ రామకృష్ణుడే ప్రత్యక్షమౌతాడు.

“నువ్వెందుకే sTÖ గీత గోవిందం?” (నాయనమ్మ, పుట 25).

“నమస్కారం మహాప్రభో! నాకు సెలవిప్పించండి. ఇహ నేనీ ‘ప్రహ్లాద’ నాటకం ఆడలేను!” (బడిపంతులు, పుట 31).

“అయ్యయ్యో! అదేం పరధ్యానమే తల్లీ? నాకు తలంబ్రాలు పోస్తావేమే!” (నాయనమ్మ, పుట 38).

సినిమా రచయితగా సముద్రాల రాఘవాచార్యులు మల్లాది రామకృష్ణశాస్తి ప్రక్కన ఆచంట మల్లన్నే, సందేహం లేదు. కాని పై మÖడూ సముద్రాల కాదు గదా తన మగని నాలిక దిగివచ్చిన చదువులతల్లీ వ్రాయలేదు. కస్తూరి, పునుగు, జవ్వాదుల ఘాటు లేకపోవచ్చు. కాని వట్టి వేరు మట్టి వాసన, చల్లని పరిమళం, దానిదే. మల్లాది వారి సంభాషణలు పాత్రలకు సహజాతాలు.

‘దేవదాసు’ కోసం రికార్డు చేసి అందులో ఉపయోగించని పాట£కటున్నది. అది ‘వినవేడుక” (ఆర్కే బుక్స్, 2005, వెల రూ. 100/-) పుస్తకంలో 26వ పుటలో ఉంది.

ఏరు నవ్విందోయ్ ఊరు నవ్విందోయ్

ఏటిలోన చిట్టి చేప యిట్టే నవ్విందోయ్

గట్టున చిట్టి పాప అట్టే నవ్విందోయ్ ॥ఏరు॥

ఏరు మీద ఊరు, ఊరు మీద ఏరు

ఏరు మయాన పాలేరు

గరప చేనుమీద మిరపపండు చూసి

దొరబిడ్డ ఉలుకెత్తి దొండపండనుకుంటే ॥ఏరు॥

నిమ్మకు నీరెట్టి చేనుకు నారెట్టి

సమ్మతైనావోడు నిదరోతే

కంటినిద్దుర రాక ఒంటిపొద్దూ పోక

ఏమి తోచని పిల్ల ఏతామెక్కిందని ॥ఏరు॥

ఈ పాట వినోదావారి ‘దేవదాసు’ కోసం సి.ఆర్. సుబ్బురామన్‌కి పాడినట్లుగా మాధవపెద్ది సత్యం నోటు బుక్కులో వుంది. ఆ పాట బోళ్ల సుబ్బారావు ప్రథమ చిత్రం ‘పల్లెపడుచు’లో ఉపయోగించుకొన్నారు. ఈ సినిమా పాటలతోనే విడుదలలైన రికార్డు పైనా వినోదా వారి సౌజన్యంతో అనీ, రచన మల్లాది రామకృష్ణశాస్తి అనీ వుంది.

ఇదంతా నాకు తెలిసేటప్పటికి డి.ఎల్.నారాయణ, వేదాంతం రాఘవయ్య లేరు. ఉన్న ప్రతిభాశాస్తి, పేకేటి శివరాం, అక్కినేని నాగేశ్వరరావు sTÖ పాట సంగతే తెలియదన్నారు.

పాట రచన బట్టి ఏ సన్నివేశం కోసం చేశారా అని ఆలోచిస్తే, ఏదీ తేలడం లేదు. వరసా, వాద్యగోష్ఠి గమనిస్తే, ఒక పడవవాని పాటై వుండవచ్చు అనిపిస్తున్నది. ఒకవేళ బెంగాలులో చిన్న చిన్న నదులు చిలవలు పలవలుగా వుండటం దృష్టిలో పెట్టుకొని, తండ్రి చనిపోయిన తరువాత దేవదాసు సొంత వూరు వచ్చే తరుణంలో, పార్వతీ ప్రయాణం కట్టిన సన్నివేశానికా? ఇవన్నీ తలపోతలే.

చివరి మాట. విజయనిర్మల ‘దేవదాసు’తో బాటు వినోదా వారిది కూడా విడుదల చేయబడి బాగా ఆడటంతో అన్ని పాటలతో ఒక ఎల్.పి. కొలంబియా లేబిల్‌పైన సరస్వతీ స్టోర్స్ వారు విడుదల చేశారు. వివరాలన్నీ తప్ప్పుల తడకలు. ఆ పాటలు మొదట విడుదల చేసింది హెచ్.ఎం.వి. ఈ తప్ప్పులు దిద్దమని సరస్వతీ స్టోర్స్ కణ్ణన్‌ని అడిగితే, అవి మాకు హెచ్.ఎం.వి వాళ్లిచ్చారు, అవే కరెక్టు, మార్చడం కుదరదన్నారు. గ్రామకో మంగాపతినడిగితే అది కొలంబియా విడుదల, నేను చేయగలిగిందేమీ లేదు అని చేతులెత్తేశారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడని బద్దెన యేనాడో అన్నాడు కదా తన సుమతీ శతకంలో! వసుదేవుణ్ణయినా ఫలితం లేకపోయింది.

అప్ప్పుడు మద్రాసు విజయ-వాహిని స్టూడియోలో షూటింగ్‌కని అక్కినేని వున్నారు. ఆయన చేతులు పట్టుకొన్నాను, మధ్యాహ్నం విశ్రాంతి వేళ భంగం కలిగించి. ‘మీరు రెండు మాటలు చెప్పిన దేవదాసు ఎల్.పి. యిన్ని తప్ప్పుడు వివరాలతో విడుదల చేశారు. నేను మర్యాదగా అడిగితే మాట వినడం లేదు ఆ గ్రామ, యింటి సింహాల వాళ్లు. ఏయే దిద్దుబాట్లు చేయాలో మీరు వ్రాసినట్లు ఆ కంపెనీల వారికి ఒక ఉత్తరం టైపు చేసి తీసుకువచ్చాను. మీరు సంతకం పెట్టండి’ అంటూ అభ్యర్థించాను.

ఒకసారి చదివి సంతోషంగా సంతకం పెట్టారు. ఆ ఉత్తరం చివరి పేరాలో ‘ఈ సరియైన వివరాలు వి.ఎ.కె. రంగారావు యిచ్చినవని కొత్త విడుదలపై వుండాలి’ అని వుంది. అలాగే ఆ ఈస్టిండియా కుంఫిణీ వారు బ్రతికినట్టు విడుదలైన కేసెట్టులో వేశారు. ఇప్ప్పుడా కౌటిల్యులా విషయం తొలగించే వుంటారు.

ఆ విజయం నాకు జరిగిన కనకాభిషేకంలో ఒక నాణెం. ఇప్ప్పుడీ లోకంలో లేనివారికి జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించడం కన్నా ఆనంద్‌కి ఆనందమేమున్నది! నాకీనాడు పేరుప్రతిష్ఠలున్నవంటే దీనికి కారణం వారు కట్టిన సరాగమాలలే కదా! 

ఇలాంటి పాత చిత్రాల సంభాషణలు నవలా రూపంలో రావడం ఆ కర్తలకు నివాళి. ఆ కార్యానికి దాఖలా. నేటి ప్రేక్షక పఠితలకు పచ్చకర్పూరం వేసిన కొఱ్ఱబియ్యపు పాయసం. ఎత్తండి. గుర్తించండి. ఆస్వాదించండి.

ఆంధ్ర నృత్య సంప్రదాయాలు - ఒకమాట

శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ఆశీస్సులు, అలాగే ఆరుద్ర గారి శుభాకాంక్షలకు... విమర్శలను కూడా అర్హతలుగా మార్చే శక్తి ఉందన్నది నా దృఢ విశ్వాసం.

కొన్నేళ్ల క్రితం, ఒక రచయిత రచనలో నాకు అనేక వాస్తవ దోషాలు కనిపించాయి. నా శ్రమతో కూడిన పరిశోధనకు కృతజ్ఞతలు చెప్పడానికి బదులుగా, అదే పుస్తకం (అది కూడా తప్పులతో నిండినదే) రెండవ ముద్రణ ముందుమాటలో ఆయన నా గురించి "ప్రూఫ్ రీడర్ స్థాయికి దిగజారి..." అని అసహనంతో వ్యాఖ్యానించారు.

ఆ రోజు నుండి ఇప్పటి వరకు, నేను కనీసం డజను పుస్తకాలకు ప్రూఫ్ రీడింగ్ చేశాను. ముద్రణ దోషాలే కాకుండా ఇతర తప్పులను సరిదిద్దుతూ, నాకున్న సమాచారాన్ని పరిజ్ఞానంగా మలచుకునే క్రమంలో నేను ఎంతో నేర్చుకున్నాను.

ఆ అసంతృప్త రచయితను దేవుడు చల్లగా చూడాలి.

డాక్టర్ ఆరుద్ర గారి ఈ పుస్తకం కూడా దీనికి మినహాయింపు కాదు. 'ఆయన వ్యక్తిగత తోటలోని సంపద' వంటివారైన డాక్టర్ కె. రామలక్ష్మి గారు, ఈ పుస్తకాన్ని ప్రచురణకు సిద్ధం చేయడంలో కొన్ని బాధ్యతలు చేపట్టమని నన్ను కోరినప్పుడు, వారి విజ్ఞతకు మరియు నా అదృష్టానికి నేను ఎంతో సంతోషించాను. నాకంటే అర్హత కలిగిన వారు వారికి దొరకవచ్చు.

అది నిజమే కావచ్చు; కానీ అంత అంకితభావం కలిగిన వ్యక్తి? దొరకడం కష్టమే.

నా అంతర్గత అభిరుచులను నెరవేర్చుకునే మార్గాన్ని శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు సూచిస్తే, ఆ కఠినమైన మార్గంలో నన్ను నడిపించింది మాత్రం ఆరుద్ర గారే. కేవలం ప్రోత్సాహంతోనే కాకుండా, తప్పులను వెతికేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నన్ను హెచ్చరిస్తూ, విమర్శల ద్వారా కూడా ఆయన నన్ను ముందుకు నడిపించారు.

సంస్కృత భాగాలను సరిచేయడానికి నేను డాక్టర్ ఎం. నరసింహాచార్య గారిని సంప్రదించాను. ఏవైనా తప్పులు మిగిలి ఉంటే, దానికి నేనే బాధ్యుడిని. నన్ను సరిదిద్దవచ్చు కానీ, ఎంత మంచి ఉద్దేశం ఉన్నా, నన్ను ఒక పండితుడిగా మార్చలేరు.

ఈ సందర్భంలోనే కాకుండా, నేను మార్గదర్శకత్వం కోరినప్పుడల్లా సహాయం చేసినందుకు వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వారి వంటి వారు ఇంకా ఎంతో మంది ఉండాలి.

ఈ ప్రాజెక్టులో డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారిని భాగస్వామిని చేయాలని నిర్ణయించింది డాక్టర్ రామలక్ష్మి గారే. భరతముని నిర్దేశించినట్లుగా నాట్య కళ పట్ల అంకితభావానికి నిలువుటద్దంలా నిలిచే ఆమె నా గురువు; నృత్యం, సంగీతం, సాహిత్యం మరియు శిల్పకళల వైభవాన్ని నాకు పరిచయం చేసినవారు ఆమె. ఆమె దృష్టిలో, ఈ ప్రదర్శన కళ అనే అమూల్యమైన వజ్రానికి అవి కేవలం వివిధ కోణాలు మాత్రమే. ఆమె చేసిన సవరణలు చిన్నవే అయినప్పటికీ, పాఠకులకు ఆ విషయాన్ని మరింత సులభంగా అర్థమయ్యేలా చేయడంలో అవి కీలక పాత్ర పోషించాయి.

నిజమే, ఒకవేళ ఆరుద్ర గారు స్వయంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. కానీ అది సాధ్యం కాదు కాబట్టి, ఆ పరిస్థితులలో మేమందరం మా శాయశక్తులా కృషి చేశామని నాకు నమ్మకం ఉంది.

డాక్టర్ ఆరుద్ర గారి నోట్స్ ఆధారంగా డాక్టర్ రామలక్ష్మి గారు రూపొందించిన ఈ రచనపై నాకు ఎంతో నమ్మకం ఉండేది. ఆరుద్ర గారి అపార పాండిత్యం ఒక దిక్సూచిలా నిలిచి, బ్యాలె (నృత్య నాటిక) అభిమానులను అపోహల నుండి కాపాడాలని, నృత్యకారులకు మరియు గురువులకు వాస్తవ చరిత్రపై అవగాహన కల్పించాలని, అలాగే నాలాంటి సామాన్య పాఠకులను ఆంధ్ర నృత్య విశేషాలతో మంత్రముగ్ధులను చేయాలని నేను ఆశించాను; ఆ ఆశ ఇప్పుడు ఫలించింది.

యశోద ఇంటి ముంగిట వెలిసిన ఆ 'ముత్యం' (శ్రీకృష్ణుడు) మనల్ని ఆశీర్వదించుగాక.

జాతకంలో 12 రకాల కాలసర్ప దోషాలు ఏవి #jathakam #kalasarpa #dosham #astrology #vastu #hindu


 

ఏ రాశి వారు ఏ మూల మంత్రాలని చదవాలి #moolamantra #bijakshara #hymn #zodiac #astrology #jyothish #facts #chant


 

గోదావరి ప్రస్తావన ఉన్న తెలుగు సినిమా పాటలు ఏవి?

1. చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది - గోదావరి పొంగింది

2. వేదంలా ఘోషించే గోదావరి - ఆంధ్ర కేసరి 

3. గల గల పారుతున్న గోదారిలా - గౌరి

4. పడమటింట దీపం పెట్టి -గోదావరి పొంగింది 

5. ఉప్పొంగెలే గోదావరి - గోదావరి

6. గోదారి గట్టుంది - మూగ మనసులు 

7. నీలో ఆలా గోదారి వెన్నెల - ప్రేమ విజేత 

8. గోదావరి పయ్యెదా - సరిగమలు 

9. గోదారొడ్డున మామిడి తోట - గోదావరి పొంగింది 

10. మా తల్లి గోదావరి - అందాల రాముడు 

11. తల్లీ గోదారికి - చిల్లర కోటు చిట్టెమ్మ

12. వయ్యారి గోదారమ్మ - ప్రేమించు పెళ్లాడు

13. చుక్కల్లో పెద చుక్క - చిల్లరకొట్టు చిట్టెమ్మ

14. ఈదితే గోదారి ఈదాలి - గౌరి

15. గోదారికి  ఏ  ఒడ్డయినా -   మన ఊరి కథ 

16. పారే గోదావరిలా  - రాధమ్మ పెళ్లి 

17. కురిసే వెన్నెల్లో - అందాలరాముడు 

18. ఒడుపున్న పిలుపు - సిరి సిరి మువ్వ

19. వే  వేలా వర్ణాల - సంకీర్తన 

20. ఎంత వలపో సాగరునిపై - ఛాయ

21. కొండగాలి తిరిగింది - ఉయ్యాలా జంపాల

22. వెన్నెల్లో గోదారి అందం - సితార

23. వెల్లువొచ్చి  గోదారమ్మ - దేవత

24. పాపి కొండల వెనుక - ఆడాళ్ళు మీకు జోహార్లు 

25. పున్నాగ తోటల్లో సన్నాయి - వియ్యాల వారి కయ్యలు 

26. ఉరకలై గోదావరి - అభిలాష 

27. నిన్నటి దాకా శిలనైనా - మేఘసందేశం 

28. నువ్వేనా సంపెంగ పువ్వున - గుప్పెడు మనన్సు 

29. పరవళ్లు తీసింది గోదావరి - ఊరికి సోగ్గాడు 

30. కొమ్మ కొమ్మకో సన్నాయి - గోరింటాకు 

31. గోదారి చీరకట్టే - సూర్యచంద్ర 

32. బద్దరగిరి రామయ్య - సీతారామయ్య గారి మనవరాలు 

33. పుష్కరాలు వస్తాయి -  గోదావరి పొంగింది 

34. నా పాట నీ నోట - మూగ మనసులు 

35. యాడనో కలిసింది - చిరంజీవి రాంబాబు 

36. గోదారి గట్టంట - గోపాల కృష్ణుడు 

37. పాడనా తెనుగు పాట - అమెరికా అమ్మాయి 

38. నడుమ కిన్నెరసాని - గోల్కొండ అబ్బులు 

39. గోదారి గట్టుమీద రాదారి - డాక్టర్ సినీ యాక్టర్ 

40. కొండా కోనల్లో లోయల్లో - స్వాతికిరణం 

41. ఈ నేలకు తెలుసు - పంచాయితీ 

42. పంట చేలో పాలకంకి - పదహారేళ్ళ వయసు 

43. ఎక్కడో చుసిన - మహా సంగ్రామం

44. గోదారి గట్టు కన్నా - కాలయముడు 

45. నిండు గోదారి కదా - నువ్వు లేక నేను లేను 

46. తేట తేట తెలుగులా - ప్రేమ నగర్ 

47. ఆడవే  జలకమ్ము లాడవే - విచిత్ర కుటుంబం  

48. ఎందరు ఏడ్చిన  - మరో సీత కథ 

49. ఎన్నెన్నో అందాలు - చంటి 

50. గగన సాక్షి గా - లైలా 

51. గోదారి వెన్నెల - పున్నమి చంద్రుడు 

52. గోదారి గట్టు మీద - సంక్రాంతికి వస్తున్నాం

53. గోదారి గట్టుపైన - రాజకుమారుడు 

54. గోదారి రేవు -  రుక్మిణి 

55. ఇది గోదారి దాటే వయసు - జగన్నాథ రధ చక్రాలు 

56. కిన్నెరసాన్ని వచ్చిందమ్మ - సితార 

57. కృష్ణమ్మ పెన్నమ్మ - వజ్రాయుధం 

58. కులం మతం కలపండి - గోదావరి పొంగింది 

59. మనసూగింది ఉయ్యాలాగా - అమ్మ కోసం 

60. నా మనసే గోదారి - అదృష్టవంతులు 

61. నా వాలు జడ కృష్ణవేణి - అమెరికా అల్లుడు 

62. నారి నారి నడుమ మురారి - యువరాజు 

63. నడక సాగితే రాదారి - ఇంటింటి భాగోతం 

64. నవ్వు వచ్చిందంటే కిల కిల - స్నేహం 

65. నీ దారి  నీదే - డబ్బు భలే జబ్బు 

66. పున్నమి లాగ వచ్చి పొమ్మని - జడగంటలు 

67. సన్నజాజి చెట్టు కింద - బ్రహ్మ పుత్రుడు 

68. సిన్నీ ఓ సిన్నీ - జీవన జ్యోతి 

69. సారీ సో సారీ - కన్నవారి కలలు

70. వానొచ్చే వరదొచ్చె - కొండవీటి సింహం 

71. కుక్కతోక పట్టి గోదారి - మానవుడు మహనీయుడు 

72. చందురూడు నిన్ను చూసి -  మంగమ్మ గారి మనవడు 

73. అందగాడా అందవేరా - ఘర్షణ

74. ఎప్పట్లా గోదావరి - గోదావరి పొంగింది 

75. గోదారి వరదల్లో - ఎదురీత

రామాయణంలో తారసపడే ప్రసిద్ధ ఋషులు ఎవరు #ramayanam #sages #guru #saints #srirama #mythology


 

25, జూన్ 2026, గురువారం

రాత్రి కలలో ఏవి కనిపిస్తే శుభసూచకం #dreams #results #shubam #DreamInterpretation #hindu #part 2


 

పద్నాలుగు లోకాల్లో ఎవరుంటారు #worlds #lokalu #universe #saints #deities #chaturdashabhuvanalu


 

చతుర్దశ (14) భువనాల్లో (ఊర్ధ్వ అధోలోకాలు) ఎవరెవరుంటారు?

పురాణాల ప్రకారం చతుర్దశ భువనాల్లో (ఊర్ధ్వ అధోలోకాలు) ఎవరెవరుంటారు?

భూలోకం

(మానవులు, జంతువులు, పక్షులు, చెట్లు ఇత్యాది సమస్త జీవరాశులు)

భువర్లోకం

(సిద్ధులు, చారణులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, మునులు, భూతప్రేతాదులు, రాక్షసులు, సూర్య, చంద్ర గ్రహాలు, దేవతాగణాలు)

సువర్లోకం (స్వర్గం)

(దేవతలు, అప్సరసలు, ఇంద్రుడు, ఇంద్రాణి, గంధర్వులు, యక్షులు, సిద్ధులు, అదిత్యులు, వసువులు, మరుత్తులు)

మహర్లోకం

(మహర్షులు, యోగులు, మునులు, సనకసనందనాదులు, భృగు, యజ్ఞకర్తలు, ధ్యాన నిస్టులు)

జనలోకం

(బ్రహ్మ మానస పుత్రులు, సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు, మహాయోగులు, జ్ఞానులు)

తపోలోకం

(వైరాగులు, మునులు, మహర్షులు, తపస్వులు, సిద్దులు, అయోనిజ దేవతలు , ప్రజాపతులు, సిద్ధ పురుషులు, వైభ్రాజులు, ప్రజాపతులు)

సత్యలోకం (బ్రహ్మలోకం)

(బ్రహ్మ, సరస్వతి, జ్ఞానులు,  మహర్షులు, సిద్ధులు, మునులు, యోగులు, తపస్వులు, బ్రహ్మ మానసపుత్రులు)

అతల లోకం

(మయుడు, బలాసురుడు, భవనాలు, దానవులు, బలి వంశీయులు, దైత్యులు)

వితల లోకం

(హటకేశ్వరుడు, భూతగణాలు, దానవులు, భవాని, గంధర్వులు)

సుతల లోకం

(బలి చక్రవర్తి, దానవులు, లక్ష్మీదేవి, బలిఅనుచరులు)

తలాతల లోకం

(మయాసురుడు, మాయావి దానవులు, అసురులు, రాక్షసులు)

మహాతల లోకం

(క్రూరమైన సర్పాలు, కాకోదరులు, నాగకులు, సర్పరాజాలు, కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేణుడు) 

రసాతల లోకం

(దైత్యులు, పణీయులు, రాక్షసులు, నాగకులు, మాయావులు, త్రిపురాసురులు, శిల్పి మయుడు)

పాతాళ లోకం

(దైత్యులు, రాక్షసులు, దానవులు, యక్షులు, వాసుకి, కాళికేయుడు, ధనంజయుడు, ఆదిశేషుడు, అనంతుడు, నాగరాజులు, సర్పాలు) 




చక్రతీర్థ మాహాత్మ్యము-ప్రబంధ ధోరణి

చక్రతీర్థ మాహాత్మ్యము-ప్రబంధ ధోరణి

పరిచయం:

శ్రీ కపిలవాయి లింగమÖర్తి గారంటే తెలియని వారెవరూ తెలుగు సాహితీ లోకాన ఉండరు. కవి, పండితుడు, చరిత్ర పరిశోధకుడు, అసంఖ్యాక గ్రంథ నిర్మాణదక్షుడు కపిలవాయి లింగమÖర్తిగారు. వీరు రచించిన “చక్రతీర్థ మాహాత్మ్యము” ఐదు ఆశ్వాసాలుగా, 360 గద్య పద్యాలలో వ్రాసిన చంపూ కావ్యము. ఇది స్థల చారిత్రక కావ్యము, క్షేత్ర మాహాత్మ్య కావ్యము. పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా) లోని పెద్దపల్లిలో గల శ్రీ బుగ్గ వేంకట రమణుని కోవెలలో వెలసిన శివకేశవులకు సంబంధించిన, గ్రామ ప్రజలలో ప్రచారంలో ఉన్న స్థల పురాణ కథలను ఆధారం చేసుకొని రూపుదిద్దుకున్నదే ఈ కావ్యం. స్థల పురాణ కథల నాధారంగా ఆయా క్షేత్రాలలో దేవుడు ఎలా వెలసినాడో, భక్తులకు ఎలా స్వప్నమున దర్శమిచ్చాడో, ఎలాంటి పూజలు, ఉత్సవములు జరుగునో, స్వామివారు ఎలాంటి లీలలను, మహిమలను చూపించారో ఈ క్షేత్రమాహాత్మ్య కావ్యాýలో వర్ణింపబడు చుండును. అద్భుతమైన వర్ణనలతో, చక్కని శబ్దార్థాలంకాలతో, మాండలిక పద ప్రయోగాలతో నిండుగా ఉండి, శ్రీ బుగ్గ వేంకట రమణుని మహిమలను కళాత్మకంగా వర్ణించడం ఈ కావ్యంలో కనిపిస్తుంది. 19.05.1980 రోజున నాగర్ కర్నూల్ లోని శ్రీ సీతారామ స్వామి ఆలయంలో “శ్రీ అవధూత బోధానందేంద్ర సరస్వతీ స్వాముల వారి అధ్యక్షతన జరిగిన బ్రాహ్మణ పరిషన్మహా సభా సమక్షమున బ్రహ్మశ్రీ తెలక పల్లె రామచంద్ర శాస్త్రిగారు ఈ కావ్యమునావిష్కరించారు. మరల నవంబర్ 2019న కపిలవాయి అశోక్ బాబు సంపాదకత్వంలో ఈ కావ్యాన్ని తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించింది.

కాశీఖండము, భీమఖండము, శ్రీకాళహస్తీశ్వరమాహాత్మ్యము, పాండురంగమాహాత్మ్యము వంటి వాటి లాగానే ఈ చక్రతీర్ధ మాహాత్మ్యము ఎలా ప్రబంధ ధోరణిలో సాగిందో వివరించే ప్రయత్నం చేస్తాను.

వర్ణనా కౌశలం

ప్రబంధములకు వన్నె తెచ్చే మరొక ప్రధాన లక్షణం అష్టాదశ వర్ణనలు. ఈ చక్రతీర్ధ మాహాత్మ్యములో కూడా ఈ వర్ణనా సౌందర్యం అడుగడుగునా కన్పిస్తూ ఆద్యంతము రమణీయంగా అభివ్యక్తమవుతుంది.

చారిత్రక పరిశోధన చేయుటలో సుదీర్ఘానుభవము గల శ్రీ కపిలవాయి లింగమÖర్తి గారు గ్రామ ప్రజల నోట విన్న చారిత్రకాంశాలను, స్వామి వారి మహిమలను ఒక అద్భుత వర్ణనాత్మక కావ్యముగా తీర్చిదిద్దినారు. కావ్యమంటేనే కథకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, వర్ణనకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. 

ఈ చక్ర తీర్థ మాహాత్మ్యములో కవి ఉహకు నికషోపలమైన` ప్రారంభమున చేసిన మత్య్సావతార, లక్ష్మీదేవి, సుదర్శన చక్ర, పాంచజన్య, దేవతా వర్ణనలు, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతు వర్ణనలు, పంటపొలాల వర్ణన, 

విష్ణుమÖర్తి వర్ణన, స్త్రీల వర్ణన, జాతర వర్ణన, మధ్యాహ్న, సాయంసంధ్య, వెన్నెల వర్ణనలు కావ్యానికి ప్రత్యేక శోభను తీసుకువస్తాయి. మచ్చునకు`

అవతారికలో సుకవిస్తుతి చేయుచూ

కచభరమెన్న సూరపుడు, కన్నులు పెద్దన, ముక్కు తిమ్మన

త్వచము బెడంగు నయ్యలుడు, పల్కు తెనాలి, గళంబుసంకుసా

ల, చనులు భట్టుమÖర్తి, యవలగ్నము మల్లనయైన, యా ప్రబం

ధ చతుర వాణి నాంధ్రిని ముదంబున సంస్తుతి జేసి యెంతయున్ (చూ.అశోక్ బాబు:31)

 ఎంత చక్కటి ఉహ! సరస్వతీదేవికి శరీరముగా మన కవులు ఎలా ఉన్నారో తెలియజేస్తుందీ పద్యం.

ఈ కావ్యంలో ఋతు వర్ణనలు చాలా అద్భుతంగా, ప్రబంధ కవుల ధోరణిలో ఉండడం మనం చూస్తాం.                    

ఉదాహరణకు` హేమంత ఈ ఋతు వర్ణన`

సింగపట్టణమందు జేరిన నరహరి

ఆదిలక్ష్మిని గూర్చి యాత్రపడియె

గట్టు తుమ్మెనగట్టు మెట్టి రామేశుండు

గౌరికై మనసిజు గాంచి యలిగె

కందూరి యందున గలుగురామస్వామి

యిందిరా దేవికై కందువారె

కారువంగపురాన గలుగు విశ్వేశుండు

అగజాత కోసమై సెగలనందె

తిరుమలాపురిలో కొల్వుదీరినట్టి

స్వామితనదేవి కోసమై సగమునయ్యె

యిన్నిటికి గూడ మొదటిదై యింపెసంగ

వేంకటేశుని కళ్యాణవేళ వచ్చె (చూ.అశోక్ బాబు:92)

చలికాలము ప్రవేశించింది. శివకేశవులు కూడా భార్యలతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారట. అయితే ఇది మహబూబ్ నగర్ స్థానిక దేవాలయాలలోని దేవుళ్ళ ప్రస్తావన తేవడం చారిత్రక స్థలపురాణానికి మరింత ఔచితీమంతంగా ఉంది, సరిగ్గా అదే సమయానికి వేంకటేశ్వరుని కళ్యాణ ఘడియలు వచ్చాయి అనడం సందర్భోచితం.

జాతర వర్ణన అత్యంత సహజంగా కన్నుల ముందు దృశ్యము కనిపించినట్లున్నది.


పాలపండ్లతోడ పందార చిలుకను

గొఱికి తినెడు కొడుకు గుఱ్ఱ కొఱకు

జాతరందుగొనియె సన్నని మొలత్రాడు

కట్టి మరియు నొక్క కన్న తల్లి (చూ.అశోక్ బాబు:97)


చిలుకలు బెండ్లు బత్తీ 

సలు పుట్నాల్  బొంగు లుప్ప్పుచవిగల సేగున్

విలుచక పొట్లా లింతిం

తలుగా గట్టించు కొంచు తరలి రిండ్లకున్ (చూ.అశోక్ బాబు:97)

గ్రామీణ ప్రజలు జాతరలో చేయు పనులు, వారి మాండలిక భాషా పదాలు సందర్భోచితంగా ఉన్నాయి.

వివిధ వృత్తుల వర్ణన: సుమతీ శతకకారుడు అప్పిచ్చువాడు, వైద్యుడు, ఏఱు, ద్విజుడు లేని ఊరిలో ఉండవద్దు అని చెప్పాడు. అలాగే కపిలవాయి లింగమÖర్తి గారు కూడా వివిధ వృత్తులవారు ఎలాంటి సేవలందిస్తారో, వారు లేకుంటే ఆ గ్రామములో అనేక రకాల పనులు ఆగిపోతాయని చెప్పారు. భూదేవతలు, వైద్యులు, కమ్మరి, వడ్ల బత్తుడు, కంచరి, సొన్నారి, సాలెవారలు, దర్జి, చాకివారలు, మంగలులు లేకపోతే నిత్యము ఊరిలో జరిగే కార్యక్రమాలు ఆగిపోతాయని చెప్పారు.(తృతీయ`10, 11 పుట:70)

ప్రబంధ ధోరణిలో సాగిన సాయం సంధ్యా వర్ణన చూస్తే`“కవయ:క్రాంత దర్శన:” అన్నమాట గుర్తుకు రాక మానదు. 

కుంకుమ పంకమల్కి తెఱగొప్ప మరిన్ మహిషాక్షి ధూపముల్

పొంకముతోడ నింపి కరముం జిరుదీపికలుంచె పశ్చిమా 

శాంకణమందనంగ నెఱసంజయు చీకటి చుక్కలున్ ప్రమో

దాంకురమై పయిం బయిని నంతట దోచె నభస్థలంబునన్(ప్రథమ`21, పుట:41)

16వ శతాబ్దమునాటి వర్ణననలకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నదిది. సాయం సంధ్య వేళలో గల ఆకాశము ఎరుపెక్కడం, సూర్యుడు చిరుదీపిక వలె ఉండటం వంటి ఉహ అమోఘం

అలాగే వెన్నెలను వర్ణిస్తూ` “వరిపిండియు, పేలాలుం తఱిపి పాలు సున్నమిలను తలదాచునటుల్ గురిపించె పండు వెన్నెల....” (ప్రథమ`23, పుట:41) అంటారు. పల్లెటూరిలో తఱచూ కన్పించే వాటిని ఉపమానాలుగా వాడటం గమనార్హం.

అలంకారములు:

కావ్య కన్యకు కథ శరీరమైతే, అలంకారములు అలంకారములు. శ్రీ కపిలవాయి లింగమÖర్తి గారు సందర్భోచితంగా వాడిన అలంకారములు కథకు మరింత శోభను కలిగిస్తాయి. ఈ కావ్యంలో శబ్దాలంకారాలతో బాటు ఉత్ప్రేక్ష, స్వభావోక్తి, శ్లేష, రూపక, ఉపమాది అలంకారాలు ప్రయోగించారు.

ఉత్ప్రేక్ష :

ఉత్ప్రేక్ష  అలంకారములో

ఉపమేయము ఉపమానంగా ఉహించబడుతుంది. ఉపమానము లోక ప్రసిద్ధమైనది కాకుండా ఉంటుంది. లేదా కేవల  కవి  కల్పితమై ఉంటుంది.  ఉపమేయ  ఉపమానములకు గల సామ్య  ధర్మము కేవలము కవి కల్పితమై ఉంటుంది.  ఇది వస్తు, ఫలముల నాశ్రయించి ఉంటుంది.(చూ.శ్రీనివాసరావు:170)

         అంత ప్రళయంబు ముగిసిన యవతరింప

గల పునస్‌సృష్టి కాద్యమై వెలసినట్టి

కమ్ర యోంకార నాదపు క్రమమనంగ

కొక్కొ రొకొయని తొలికోడి కూత వేసె (చూ.అశోక్ బాబు:42)

తెల్లవారుఝామున కోడికూయడం సహజం. కాని అది ప్రళయం తర్వాత మరల సృష్టి చేయునపుడు వినిపించే ఓంకార నాదమేమో అన్నట్లుగా తొలికోడి కూత ఉందనడం ఉత్ప్రేక్ష.

ఉపమ: 

ఉపమేయ ఉపమానముల ధర్మసాదృశ్యమును సుందరముగా వర్ణిస్తే అది ఉపమ(చూ.శ్రీనివాసరావు:136)

         వారికి దేవరకొండని

గారంబుల రాజధానిగా నొప్పారెన్

శ్రీరామునకు నయోధ్యా

తీరున దుర్భేద్య మగుచు దిక్తతి నుతమై (చూ.అశోక్ బాబు:86)

శ్రీరామునకు అయోధ్య ఎలా దుర్భేద్యముగా ఉందో సురభి వంశము వారికి రాజధానిగా దేవరకొండ ఉందని చెప్పడం బాగుంది.

రూపకము: 

గుణ సామ్యాన్ని బట్టి ఉపమేయోపమానములకు అభేదము చెప్ప్పుట రూపకము(చూ.శ్రీనివాసరావు:185)

గ్రామములో నిర్మించిన దుర్గము (కోట) నకు, దుర్గాదేవికి అభేదము వర్ణించడం చూస్తే భాగవతంలో పోతనగారు చిన్నికృష్ణునికి శివునికి అభేదం వర్ణించడం స్ఫురిస్తుంది.

తలపైని ముసిరిన బలునీలి మొగుళులు

విరిసివ్రేలెడు పెను వెండ్రుకలుగ

తలలెత్తి జూడంగ వలయు దంచనములు

నాకాశమున కెత్తు హస్తములుగ

బురుజులం బరగెడు పరశుకుంతాదులు

కరముల నాయుధోత్కరము గాగ

జిగురు సారంబులు జిలికి మేదించిన

మినుకులీనెడు గోడ మేనుగాగ

శత్రు సైరిభముల కెల్ల సత్తియనగ

దుర్గమును నిల్చిదొలగ దృగ్దోష సమితి

దుర్గనుత దంతికంబున తోరమైన

భక్తిచేత ప్రతిష్ఠించి ప్రజలు మెచ్చ (అశోక్ బాబు:72,73)

స్వభావోక్తి: 

ఉన్నదున్నట్లుగా కనులకు కట్టినట్లుగా సుందరముగా చేయు వస్తు వర్ణనము స్వభావోక్తి.(శ్రీనివాసరావు: 276) 

పుష్కరిణి త్రవ్వడానికి వచ్చిన ఉప్పరుల రూపము ఎలా ఉందో ఇలా వర్ణించారు కవి.

మొలను చెకుముకి సంచియు ముదుక కాసె

తల రుమాలున చుట్టపీకలను దోపి

భుజమునం గడ్డపారలు బొదలుచుండ 

నుప్పరులగుంపు గదలె నప్పప్ప యనగ (అశోక్ బాబు:60)

పుష్కరిణి త్రవ్వుచుండగా ఆవిర్భవించిన శివుని సహజ సుందర రూపాన్ని వర్ణించడంఅద్భుతంగా ఉంది. “తెల్లని పూతయున్...” (ద్వితీయ`56, పుట:64).

వస్తువు: 

ఈ ‘చక్రతీర్థ మాహాత్మ్యము’ కావ్యమున కథ సంక్షిప్తముగా, దేవేంద్రపురి, ఉపేంద్రపురి, నరేంద్రపురియను సన్యాసులు కలరు. దేవేంద్రపురికి విష్ణువు కలలో కనిపించి తన ఉనికిని తెలుపగా, ఉప్పరులతో త్రవ్వించిన బుగ్గ (నీరు ఉబికి రావడం) శ్రీవేంకటేశ్వరుని విగ్రహం, తెల్ల గుండ్రాయి (శివుడు) కన్పించాయి. తరువాత ఆలయ నిర్మాణం, పుష్కరిణి త్రవ్వడం, గ్రామనిర్మాణము, పుజావిధానములు వర్ణింపబడినాయి.

శివ కేశవాద్వైతము: శ్రీ బుగ్గ వేంకటరమణుని కోవెలలో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామితోబాటు, పుష్కరిణి త్రవ్వుచుండగా తెల్లటి గుండ్రాయి (స్వయంభూ లింగము) వెలువడినది. ఇలా శివకేశవుల ఆవిర్భావము, వారి ఏకత్వము ఈక్రింది పద్యంలో చక్కగా చెప్పబడింది.

శివుడు ఇలా చెప్పాడు`

ఏనెవ్వరొగాదు సుడీ

ఆ నల్లనివాడు నేను నారయ నొకటే

ఏ నతడై యతడేనై

మానుగ నిరురూపులట్లు మసలెదము సుమీ! (ద్వితీయ. 57, పుట:64)

ఛందస్సు:

చంపూ పద్ధతిలో 360 గద్య, పద్యాలతో రచింపబడిన కావ్యమిది. ఆశ్వాసాంతములలో పూర్వ కవులవలెనే ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము, వంశస్థవృత్తము, శాలినీ వంటి విశేష ఛందములే వాడబడినవి. కావ్యనామము సార్ధకమగునట్లు కావ్యాంతమున “చక్రబంధము” రచింపబడినది. ప్రబంధ కవుల రీతిలో “బంధ కవిత్వం” వ్రాయడం శ్రీకపిలవాయి లింగమÖర్తి గారి పాండిత్య ప్రతిభను తెలియజేస్తుంది.

సుత్రామాది నిలింప రక్షక్ష! తతస్ఫూర్తి ప్రభావిభిధా

మిత్రాఖ్యాన్వయరణ్య! భావుక యశస్వీ! కృష్ణమేఘోపమా!

క్షత్రప్రాభవమÖర్తి! నిత్య కమలాఖ్యాతి ప్రసంగాన్వితా!

ధాత్రీరక్షక! కామితార్థ సులభా! తాత్పర్యమానాబుధా!

పూర్వ కవుల ఛాయలు:

ఈ క్రింది పద్యం చూస్తే అచ్చం నన్నయ పద్యములాగానే అనిపిస్తుంది. 

“నుతజలపూరితంబులగు నూతులు నూరిటి కంటె సూనృత వ్రత! యొక బావిమేలు.....”(ద్వితీయ`12, పుట:54)

అలాగే పోతన గారివలె`

“కలయో వైష్ణవ మాయయో....”(ద్వితీయ`66, పుట:66)

ఇలా మనకు పూర్వ కవుల వంటి పద్యాలు అరుదుగా దర్శనమిస్తాయి.

ముగింపు:

క్షేత్రమాహాత్మ్య కావ్యమనదగిన, స్థల పురాణ కథను చక్కటి ప్రబంధ ధోరణిలో రచింపబడిన ఆధునిక కావ్యమిది. ఇటువంటి కావ్యములు నేటి ఆధునిక కవులు సమధికముగా రచించిన తెలుగు సాహితీ లోకానికి మీVAపకారము చేసిన వారలగుదురు.




సూర్యుని తోబుట్టువులు ఎంతమంది #sun #surya #siblings #brothers #sisters #lordsurya #hindu #astrology


 

24, జూన్ 2026, బుధవారం

బ్రహ్మశ్రీ డా. బొడ్డుపల్లి కాళిదాసు (ఆధ్యాత్మిక కుసుమాలు)

బ్రహ్మశ్రీ డా. బొడ్డుపల్లి కాళిదాసు (ఆధ్యాత్మిక కుసుమాలు)

బ్రహ్మశ్రీ డా. బొడ్డుపల్లి కాళిదాసు గారు ఆధ్యాత్మికా జగత్తులో వికసించిన ధృవతార. మాతా పిత సేవలో తరించిన ఒక ముద్దుబిడ్డ. ధార్మిక, సమాజసేవానిరతిలో నిరంతర కృషీవలుడు. దైవ చింతనలో తపస్వీ, వృత్తిపరంగా వైద్యుడైన ప్రవృత్తి పరంగా ఆధ్యాత్మికా ప్రపంచములో ప్రవచనా చక్రవర్తి.  మానవ సేవయే మాధవ సేవగా ఎంచిన నిస్వార్థ సేవా దురంధరుడు, పేదలపాటి పెన్నిది. 

మహాకవి కాళిదాసు నామదేయమును సార్ధకము చేసుకున్న మీVAన్నతుడు. వీరి కర కమలముల నుండి వెలువడిన ఈ పుస్తకంలో వారి మనోగతాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రీయ విజ్ఞానాన్ని మన కందరికి మకరందంలా పంచారు. ఈ విశాల విశ్వరూప తత్వాన్ని, హిందూమత వైశిష్ట్యాన్ని, ద్విజుడైన విశ్వబ్రాహ్మణుని ఉన్నత విశిష్ట ఔన్నత్య వ్యక్తిత్వాన్ని ప్రాపంచిక విశ్వమానవాళికి ఆవిష్కృతం చేసారు. 

హిందుమత విశ్వాసాలు, దైవారాధనల నియమావళి, ప్రదోష కాల శివాభిషేక ప్రాశస్త్యం, మంత్రశక్తి మహాత్యం, భగవంతుని ప్రసన్నము చేసుకొనే విలక్షణ సూత్రాల నియమావళితో, జీవితాన్ని చైతన్య వంతంగా, ఈ స్వాపి¾్నక జగత్తులో ఎలా సాధించగలమోనని నిరూపించారు. 

దేహమే దేహలయం: ‘అహం బ్రహ్మాన్ని’ అనే ఆది శంకరుని విశ్వవ్యాప్త అద్వైత సిద్ధాంతాన్ని వివరంగా వక్కాణించారు. ‘ఏకం సతివిప్రా బహుదా వదంతి” అను తత్వాన్ని జ్ఞానులు, దైవాన్ని అనేక ఆకారాలుగా ఆవిష్కరించారు. 

ఏ రూపంలో, ఏ విధంగా, ఏ ఏ సమయాలలో, నలు దిక్కుల, ఎక్కడ వ్రతాలు, జపాలు, తపాలు, ఆరాధనలు జరిగినా అవి అన్ని బ్రహ్మలో తరించేవే అనునానుడిని బహు చక్కగా వివరించారు. 

వివిధ స్వరూపాలలో నున్న దేవి, దేవతా మÖర్తుల ఆభరణాలు, ఆయుధాలు మరియు మానవ ఆంగాలలో నున్న దైవ స్థానాల నిక్షిప్తత, వాటి విశిష్టత, ప్రత్యేకత, ప్రయోజనాలు ప్రయోగాత్మకంగా, విశ్లేషించి, అనుమానాలకు, ఆలోచనలకు తావు లేకుండ వివరణ ఇచ్చారు. 

సామాజిక స్పృహ కలిగే విధంగా మననిత్య జీవితంలో ఉపయోగించే పసుపు, కుంకుమ మరెన్నో ఉపకరణాల ప్రయోజనం, కట్టు బొట్టు అలంకరణ ఆచరణ విధానాలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలు ఉన్నాయని అభి వర్ణించారు. 

నిత్య జీవితంలో సమాజ సగౌరవాన్ని పొందాలంటే కావలసిన విలక్షణమైన ‘వకార పంచకం’ లోనున్న అంశాలను సభ్య సమాజానికి విశదీక రించారు. వీటికి తోడుగా సమాజలో మంచి పేరు, పలుకుబడికి స్థానం కావాలంటే, “ప్రియ వాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతన తస్మాత్ తదేక వ్యక్తవ్యం వచనే కాదరిద్రతో’ అంటే అనుకూలతను అభివ్యక్త పరిచే అలవాటు అన్ని విధాల శ్రేయష్కరం అన్నది ఆర్యోక్తి.

శ్రాద్ధకర్మలలో మాంసాహారాన్ని నిషేధించి, ఆహింసా పద్దతిలో నివేదనలు, తర్పణాలు, దానాలు, అర్పిసే పితృ దేవతలు వాటిని, దివంగ తులకు ఏ రూపంలో నున్న వారికి అందించి తృప్తి పరుస్తారు అనే విషయాన్ని తేట తెÉల్లం చేసారు. 

తేనెలొలికె తెలుగు భాషలోని ఔన్నత్యాన్ని వినసొంపుగా, మనస్సునకు హాయిని, అహ్లాదాన్ని ఎంతో వినోదాన్నిస్తుందని ఉదాహరణాలిచ్చారు. ‘వసుదైక కుటుంబము’ లో నున్న విశాల హృదయ తత్వాన్ని, అనందాన్ని ఇంద్ర ధనుస్సు రూపంలో విరజిమ్మారు.

అమ్మకు ఆప్యాయతతో, మధురమైన అనుభూతుల తో, అనురాగ అనుబందాలతో అక్షరాంజలి ఘటించారు. మాతృ మÖర్తియందున్న భక్తి, ప్రేమానురాగాలు పాట రూపంలో, ‘మనస్సుకు  హత్తుకునే విధంగ ఉంది. 

గృహస్తు ధర్మంలోనున్న భాధ్యత, తోబుట్టువులతో నున్న ఆప్యాయత, ఆడపడుచులలోని అనురాగం, కుటుంబంలో జరిగే సీమంతం సంబరాలను అందంగా ఆవిష్కరించారు. సమాజానికి జాగరూకతగా, జీవిత సత్యాన్ని, అత్త ఉన్నకోడులుత్తమురాలుగా స్వీయానుభవముతో కొనియాడారు. 

సాంఘిక సేవా ధర్మంగా నిరుపేదలకు నిర్మించిన ఉచిత విద్యా ఆశ్రమ పాఠశాల ‘కారుణ్వ సింధు” కు అక్షరాభినందనలు కురిపించారు. మన సమాజంలో, ప్రాచీనులలో ఉద్దండులైన ప్రాజ్ఞులు, ఋషి పుంగవులు ఎందరో జన్మత: బ్రాహ్మణేñతరులై, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణులుగా నీరాజనాలందుకున్న వారి నామాలను స్మరించి వారికి వినయాంజలులు ఘటించారు. 

చివరిగా, సమాజానికి కనువిప్పు సందేశంగా ఆచరణీయ అంశాలను కొన్ని ఉద్ఘాటించారు. అందులోని సత్యం, ధర్మం, నీతి, నిజాయతి, నిస్కామక్రియలను ఆసక్తిగా ఆచరిస్తూ, భక్తి శ్రద్దలతో తల్లి, తండ్రులను సేవిస్తూ, కటుంబము, సంఘం పట్ల ఆదరణ కల్గి, ధార్మిక సేవా కార్యక్రమాలలో నిరంతరం పాల్గొంటూ ఆ భగవంతుని ఆశీస్సులతో తరించాలని ఆశించిన ప్రాజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు, శ్లాఘనీయుడు డా. బొడ్డుపల్లి కాళిదాసు గారు. 

వీరి రచన నేటి యువతరానికి సంస్కృతీ సాంప్రదాయాలను తెలిపే కరదీపిక. ఇంత చక్కని రచన అందించిన మా బావగారైన కాళిదాసు గారు ఆయురారోగ్యాలతో కలకాలం వర్థిల్లాలని మనసారా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాము. వీరి లేఖిని నుండి మరెన్నో ఇలాంటి రచనలు వెలువడాలని మా ఆకాంక్ష.

ఏ దిశలో దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి #deepam #direction #hindu #vastu #deeparadhana #temple #facts


 

వాస్తు ప్రకారం ఇంట్లో స్వస్తిక్ గుర్తు ఎక్కడ ఉండాలి #swastik #symbol #sign #swasticdesign #hindu #astrology #vastu


 

23, జూన్ 2026, మంగళవారం

భారతీయ సాహిత్యం- దళిత సంస్కృతి

 భారతీయ సాహిత్యం- దళిత సంస్కృతి

దళిత కవులు, రచయితలు తమ అస్థిత్వం కోసం, ఆత్మ గౌరవం కోసం కలాలతో కవాతు చేస్తున్నారు. అనాధిగా జరుగుతున్న దాడులను ఖండిస్తూ కలాలో సిరాకు బదులుగా ఆక్రోశాన్ని, ఆవేదనన్ను అన్నింటికి మించి కసిని నింపుకొని సాహిత్య క్షేత్రములో కొత్త కొత్త పంటలని పండిస్తున్నారు. తన ఉనికిని, మనికిని గుర్తించని వ్యక్తుల మీద, వ్యవస్థ మీద ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. మనిషిని మనిషిగా గుర్తించని మను మనుషుల మీద వారి మనస్తత్వం మీద తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. వర్ణవ్యవస్థ, దేవుడు, విధి, ఆత్మ, పునర్జన్మ, స్వర్గనరకాలు వంటి భావాలతో కూడుకున్న హిందూమతాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ భావాల కారణంగా ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అణచివేయబడిన వారుగా విషయాన్ని దళితులు గుర్తించారు. దళితుల విముక్తికోసం హిందూమత తాత్త్వికతను మౌలికంగా ప్రశ్నించిన చార్వాకులు, బౌద్ధ, జైనాలు వారి శాస్త్రీయ దృక్పథం, దళిత సాహిత్యానికి అవసరమైన తాత్త్వికతను అందించింది.

దళిత సాహిత్యం ప్రాచీనమైన, సాంప్రదాయక స్వభావం కలిగిన సామాజిక నిర్మాణాన్ని తిరస్కరిస్తుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి విలువలు ప్రాతిపదికగా నిర్మించబడే సమాజం పట్ల దళిత సాహిత్యం విధేయత కలిగి ఉంటుంది. స్థిరమైన అధికారాన్ని కొనసాగించే మనువాద సాహిత్యానికి ఇది వ్యతిరేకమైనది. దళితసాహిత్యం హేతువాద దృష్టిని కలిగి ఉండి పురాణ భావాలను, మత సిద్ధాంతాలు, అశాస్త్రీయభావాలు వంటివాటిని తిరస్కరిస్తుంది. వాస్తవిక ఆధారమైన భావాలతోనే సాహిత్యం ఉండాలంటుంది. 

సమాజంలో సంస్కరణభావాలు రేకెత్తించే సాహిత్యం ఒక సాధనంగా ఉపయోగపడాలని దళితసాహిత్యం భావిస్తుంది. సాహిత్యం కేవలం వినోదం కోసం కాదని సామాజిక చైతన్యం కలిగించాలని భావిస్తుంది. అందుకే కళకళకోసమే అనే సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ కళ సమాజం కోసమే అనే దృక్పథం నుండి మాత్రమే సాహిత్యాన్ని సృష్టించాలని దళిత సాహిత్యం అభిప్రాయపడుతుంది. ఇందుచేతే దళితసాహిత్యంలో దళిత అనుభవాల స్పృహ కనిపిస్తుంది. 

దళితసాహిత్యం అనుభూతి విశిష్టమైనది. జీవితాన్ని యధాతధంగా ప్రతిబింబించడం దాని లక్షణంగా కనిపిస్తుంది. ఈ లక్షణం సాహిత్యాన్ని సౌందర్యంతోను, ఔన్నత్యంతోను నింపుతుంది. అందువల్లనే మనం సామాజిక చైతన్యానికి, సౌందర్యాత్మకతకు మధ్య ఒక ప్రత్యేకమైన సమన్యయాన్ని దళిత సాహిత్యంలో గమనిస్తాం. 

కుల, మత, వర్గ, ఆర్థిక, రాజకీయ, ఆధిపత్య స్వభావం నుంచి మనిషికి స్వేచ్ఛను కలిగించే దిశగా సాగడం దళిత సాహిత్యం లక్షణం. అంటే ఇది కులరహిత వర్గరహిత సమాజ స్థాపనకు ఉద్దేశిస్తున్నట్లు భావించవచ్చు. దళిత దృక్పథంలో జీవితమే సాహిత్యం కాబట్టి, సాహిత్యానికి ప్రజలకు మధ్యగల ఖాళీని పూరించేదిగా దళితసాహిత్యం పనిచేస్తుంది. 

మానవతా వాదాన్ని వ్యతిరేకించే సాహితి సంస్కృతులపై దళిత సాహిత్యం నిర్విరామపోరాటం చేస్తుంది. మానవతా వాదం తన ప్రధాన ఇతివృత్తంగా దళిత సాహిత్యం ప్రకటించింది. అందుచేతనే మానవుడు కేంద్రంగా ఈ సాహిత్య సృజన జరుగుతున్నది. మానవుని కష్టసుఖాలలోపాలు పంచుకుంటూ అతనిలో విప్లవ చైతన్యం నింపడం ఇందులో చూడవచ్చు. ఇందుకోసం దళిత సాహిత్యం పీడితుల ఆశలు, ఆశయాలు, అనుభవాలు, అనుభూతులను చిత్రిస్తుంది. 

అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సామాజిక ఆర్థిక న్యాయంకోసం పోరాడడం దీని ప్రధాన లక్షణం. అందుచేతనే దళితసాహిత్యాన్ని వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటుగా పేర్కొన్నారు. ఉనికి కోసం అన్వేషించటం దళిత సాహిత్యంలో మరో లక్షణం. కాబట్టే దళితుల ఐక్యత అవసరాన్ని ఇది గుర్తించింది. ఈ గుర్తింపు దళితుల సామాజిక చైతన్యానికి స్ఫూర్తినిచ్చింది. దళిత సాహిత్యంలో రెండు విభిన్న చైతన్య స్రవంతులను గమనించవచ్చు. ఒకటి మితవాద స్రవంతి. మరొకటి అతివాద స్రవంతి దళిత అనుభవాల వ్యక్తీకరణతో పాటుగా, కులవ్యవస్థలోని అమానవీయత, దురభిమానాలను వర్ణిస్తూ, నూతన సామాజిక, సాంస్కృతిక చైతన్యాన్ని ఆశించడం మితవాద ధోరణిలో కనిపిస్తుంది. 

అతివాద స్రవంతిలో మాత్రం వ్యవస్థపై తిరుగుబాటు, హిందుమతత్త్వం విధించిన పరిమితులను ధిక్కరించే ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. హిందుమతం మౌలిక తత్వాన్ని, అది ప్రచారం చేసే కర్మ, పరమాత్మ, పునర్జన్మ వంటి భావాలను ఈ ధోరణి తీవ్రంగా నిరసిస్తుంది. ఈ తరహా కవులు తమ కవిత్వంలో ఉపయోగించే ప్రతీకలు, అలంకారాలలో సమాజ స్వభావం పట్ల వ్యక్తం చేసే అసహనం, నిరసన స్పష్టంగా కనిపిస్తుంది. అతివాద ధోరణి అధికంగా కవిత్వంలో ప్రతిబింబిస్తే, మితవాద ధోరణి ఎక్కువగా కథలలో, ఆత్మకథలలో ప్రతిఫలించడం గమనించవచ్చు. హిందుమత మౌలిక స్వభావ తిరస్కారం సామాజిక, సాంస్కృతిక మార్పు ఆశించడం అమానవీయత దురభిమానాల వర్ణన సమాజ స్వభావం పట్ల అసహనం ప్రస్తుత జీవితాన్ని తిరస్కరించడం వ్యవస్థపై తిరుగుబాటు, ధిక్కారం, సంస్కరణ అభివృద్ధి ఆకాంక్షించడం ఉంది. 

తిరుగుబాటు, ధిక్కారం జాషువ నుంచే మనం చూస్తాం. జాషువ “కసరి బుసకొట్టుట నాల్గు పడగల హైందవ రాజు” అని వర్ణవ్యవస్థ క్రూరత్వాని వెల్లడించాడు. అంతే కాదు 

“ముసలివాడైన బ్రహ్మకు బుట్టినారు 

నల్వురు కుమారులను మాట విన్నాముగాని 

పసరముకన్న హీనుడభాగ్యుడైన 

ఐదవకులస్తుడెవరమ్మా సవిత్రి” 

అంటూ పంచవవర్ణం పుట్టుక గురించి ప్రశ్నిస్తాడు జాషువా. అట్లాగే అస్థిత్వం ఆత్మగౌరవం కోసం కలేకూరి ప్రసాద్ “పిడికెడు ఆత్మగౌరవం కోసం” అనే కవితలో 

“ఇప్పుడు కరుడుకట్టిన భూస్వామ్యక్రౌర్యం 

నాగుండెలమీద నాగేటి కర్రులతో 

పచ్చబొడిసిన పేరు చుండూరు 

ఇక చుండూరు నామవాచకంకాదు సర్వనామం 

ఇప్పుడు ప్రతిగుండే రగిలే రాచపుండూరు 

నేను జనసమÖహాల గాయాన్ని గాయాల సమÖహాన్ని

తరతరాలుగా స్వతంత్రదేశంలో అస్వతంత్రుణ్ణి

అవమానాలకూ, అత్యాచారాలకూ 

మానభంగాలకూ, చిత్రహింసలకు గురై 

పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తిన వాణ్ణి

ధనమదాంధ, కులోన్మత్తుల రాజ్యంలో 

బతకడమే ఒక నిరసనగా బతుకుతున్నవాణ్ణి 

బతికేందుకు పదేపదే చస్తున్నవాణ్ణి

అంటూ ఆత్మగౌరవం కోసం బ్రతకటం కోసం దళితులు నిరంతరం ఎదుర్కొంటున్న హింసను ధిక్కార స్వరంతో వేదనాబరితంగా ఆవిష్కరించాడు. 

ఎండ్లూరి సుధాకర్ ‘దళితాయణం’ అనే ఖండికలో 

శంబూకుడు సింహాసనం మీద నుంచి 

నల్లసూర్యుడై నవ్వుతుంటే 

వర్తమానవాల్మీకి తన దళితాయణంలో 

మొదటి వాక్యం ఇలా రాశాడు. 

దళిత యుగం శంబూకునిరక్త స్వప్నం

అనే మాటల్లో రాజ్యాధికార స్వప్నం కనిపిస్తుంది. 

దళిత ధిక్కార స్వరానికి శివసాగర్ ‘నడుస్తున్న చరిత్ర’ కవిత ఒక గొప్ప 

ఉదాహరణ. అణగదొక్కిన పురాణ పాత్రలపై ప్రతీకారం తీర్చుకోవడం ఇందులో కనిపిస్తుంది. 

శంబూకుడు పెదాల మీద చిరునవ్వుతో 

రాముని వధిస్తున్నాడు 

ఏకలవ్యుడు ద్రోణుడి బొటనవేలును 

గొడ్డలితో నరుకుతున్నాడు 

బలి తన చిరుపాదాలతో వామనుణ్ణి 

పాతాళానికి తొక్కేస్తున్నాడు 

మనువు కళ్లల్లో సూదులు గుచ్చుకుని 

నాలిక తెగ్గోసుకుని 

చెవిలో సీసంపోసుకుని 

శ్మశానంలో దొర్లుతున్నాడు

అంటూ సాగే కవితలో ధిక్కార స్వర తీవ్రత కనిపిస్తుంది. 

ఇదే తీవ్రతా సతీష్ చందర్ ‘పంచమవేదం’ లో కనిపిస్తుంది. 

భాషా ఆప్రవీణులారా ఉలిక్కిపడకండి 

మీరుకుదిర్చిన చందోబద్దకావ్యాలను కాలదన్ని 

వర్ణ క్రమాలు వాడలకు వలసపోతున్నాయి 

పదాలకిప్పుడు నలుగు పెట్టాలి 

నూలు పోగులు లేకుండా నగ్నపరచాలి తరతరాలుగా సాహిత్య సృజన భాషా పాండిత్యం ఒక వర్గంవారి గుప్పెట్లోనే వుంది. దళిత సాహిత్య ఆవిర్భావంతో అది విముక్తి అయింది. అలాగే ప్రసాదమÖర్తి ‘అవధానిగారు అవధరించండి’ అనే కవితలో 

అక్షరం ఇప్పుడు 

కులంతక్కువ వాడి ప్రక్కలో 

కులుకుతోంది

అంటూ తన ధిక్కార స్వరాన్ని వినిపించాడు. 

జులూరి గౌరీశంకర్ మనుషులు వివిధ అంశాలనుంచి పుట్టారన్న అశాస్త్రీయతను ఎండగట్టాడు. 

అసలు ఏ వర్ణానికైనా 

జన్మస్థానమొక్కటే 

మనుషులు మనుషులుగా పుట్టుక 

మనువులై పుడితేనే ప్రమాదం 

కొందర్ని పాదాలనించి పుట్టించే ప్రమాదం 

మనిషి మనువైనప్పుడే జరిగింది 

అని మనిషి మనువైన దుర్మార్గాన్ని బహిర్గతం చేస్తాడు. 

నగేష్ బాబు తన దీర్గ కవిత ‘రచ్చబండ’లో 

ఇప్పుడు మాత్రమే కాదు 

ఇక వీచేగాలులం మేమే 

అవును ఇది కొత్తగాలే 

ఆకులు కాదు ఆత్మలువీస్తున్న గాలి

చెట్లుకాదు చేవదేలిన దేహాలు వీస్తున్న గాలి

ఇన్నాళ్లు పవిత్ర గ్రంథాల ఇనుపజాడీల్లో

మీరు భద్రంగా దాచిన బహుజన ప్రభంజనం

ఇన్నాళ్లు ఏమనుషుల్ని నిషిద్ధుల్ని చేసి 

అసింట అసింట అని జరిగిపోయారో 

ఏ మనుషుల్ని పనిముట్లని చేసి 

మీ పనులన్నీ చక్కదిద్దుకున్నారో 

ఏ మనుషుల్ని మీ బూటకాల చరిత్రకు 

యోజనాల దూరం ఉంచారో 

ఆ మనుషులే చరిత్రలు రాస్తున్నారు

అంటూ తన తిరుగుబాటు స్వరాన్ని వినిపించాడు. మరో చోట ఎండ్లూరి సుధాకర్ ఇలా అంటాడు. 

ఈ పంచ భూతాల తోలుదొలచి 

ఆకాశానికో మేకు / పాతాళానికో మేకు 

సప్త సముద్రాల మీద

చర్మాన్ని నానబెట్టిన నీకు ఆ సూర్యచంద్రులు

చెరో చెప్పూ కావాల్సిందే

ఆకలితోనో అవమానంతోనో 

తలవొంచుకుని 

నీ చర్మపుజోళ్ళు కుట్టుకుంటున్నతాతా 

ఈ ప్రపంచం / ఉంగటంగామారి 

నీ ముంగాలి బొట్టినేలిని

ముద్దుపెట్టుకోవాలని 

కలగంటున్నాను

అని చెప్పటంలో దళిత చైతన్యం కనిపిస్తుంది. 

ఈ దిశలో దళిత సాహిత్యం విస్తృతమైన కృషి చేసింది. దళితేతరులైన ఉన్నత వర్గాలు దళితుల గురించి ఆలోచించేట్లు చేసింది. దళితుల మానసిక దాస్య విమోచనం కోసం ప్రయత్నించడం దళితసాహిత్య మరో ప్రధాన లక్షణం. దళితులు, తామంతా ఒకజాతి అని గుర్తించేందుకు తమ వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకోగల చైతన్యాన్ని కలిగించేందుకు ఈ సాహిత్యం కృషి చేస్తుంది. నిజాయితీ విమర్శనాత్మక ధోరణి కలిగిన దళిత సాహిత్యం దళితులలో గల ఆత్మ న్యూనతా భావంపై దాడిచేసి వారు బానిస మనస్తత్వం నుండి విముక్తి చేసేందుకు సహకరిస్తుంది. దళిత సాహిత్యం జీవిత వైవిధ్యాలన్నింటిని విభిన్న కోణాలలో దర్శించే స్వాభావాన్ని కలిగి ఉండి జీవితాన్ని విప్లవీకరించే దిశగా పయనిస్తున్నది. 

కులవర్గ వైరుద్ధ్యాలతో నిండి ఉన్న ప్రాచీన హిందూ మార్మికతను బ్రద్దలు చేస్తూ, అందుకు ప్రతిగా ప్రత్యామ్నాయ సంస్కృతిని రూపొందించడం దళిత సాహిత్యం తన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం ప్రతిపౌరునికి అందించగల నూతన వైజ్ఞానిక వ్యవస్థ దళిత సాహిత్య ఆశ. 

దళిత సమస్యలను అర్థం చేసుకొని అందుకు కారణమైన వాస్తవాలను విశ్లేషించడం, ఆ సమస్యలసాధనకు ఉపకరించే సామాజిక, అభ్యుదయ శక్తులను ప్రోత్సహించటం, తద్వార శతాబ్దాలుగా అజ్ఞానంలో ఉంచబడిన వారిలో సామాజిక, రాజకీయ చైతన్యం కలిగించటం దళిత సాహిత్యం ప్రధాన లక్ష్యంగా భావించవచ్చు. 

సామాజిక అభివృద్ధిలో భాగంగా వ్యక్తి అభివృద్ధి కోసం, జాతి నిర్మాణం కోసం దళిత సాహిత్యం ప్రయత్నిస్తుంది. మానవతావాద దృక్పథంతో, విశ్వజనీన సౌభ్రాతృత్వం లక్ష్యంగా మొత్తం మానవజాతి అభ్యున్నతే ధ్యేయంగా దళిత సాహిత్యం సాగుతున్నది. 

వ్యక్తి సమాజంలో భాగమైనప్పుడు సామాజిక అంశాలు అతని వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. అలానే అతని వ్యక్తిత్వం కూడా సమాజంపై ప్రభావం చూపుతుంది. ఆ వ్యక్తి రచయిత అయితే ఆ రచయిత సృజించే సాహిత్యం సమాజంపై తన ప్రభావం చూపుతుంది. అందుచేత సాహిత్య అధ్యయనంలో రచయిత వ్యక్తిత్వం రచయితగా ప్రముఖపాత్ర వహిస్తుంది. సామాజిక స్పృహతో రచన చేయటం రచయిత బాధ్యత మాత్రమే కాదు. అది అతని విధి. సాధారణ రచయితకు దళిత రచయితకు ఆలోచనల్లో మాత్రమే కాకుండా అనుభవాలలో, వస్తువు, శైలి భాషలలో సైతం కనిపించే వైరుధ్యం వారి జీవన చిత్రణలో, పాత్రల చిత్రణలో కూడా కనిపిస్తుంది. 

దళితసాహిత్యం దోపిడిని, పీడనను వ్యతిరేకిస్తుంది. కాబట్టి దళిత రచయితలు దోపిడి వ్యవస్థకు చెందిన సామాజిక విలువలను అంగీకరించరు. దళితుల సాంస్కృతిక, సామాజిక, ఆర్ధిక, రాజకీయ అభివృద్ధి విషయంలో సాహిత్యానికి గల బాధ్యతను వీరు గుర్తించారని భావించవచ్చు. 

ఇదివరకే స్థిరపడిన సాహితీ విలువలను, ‘కళ, కళకోసమే’ అన్న సిద్ధాంతంపై ఆధారపడి జరుగుతున్న విమర్శ పద్ధతులను దళిత రచయితలు తిరస్కరించారు. కళ లేదా సృజన యొక్క విలువను గణించటంలో సాంప్రదాయక పద్ధతులను వీరు అంగీకరించలేదు. వీరు జీవితంలో, సాహిత్యంలో సాంప్రదాయక విలువలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 

దళిత రచయితలు దళిత సంస్కృతీ వారసత్వాలను, వాని ఔన్నత్యాన్ని స్థాపించే ప్రయత్నం చేయటం ద్వారా చరిత్రను సృష్టించదలచుకున్నవారు చరిత్రను విస్మరించకూడదు అన్న దానికి కట్టుబడినారు. సాహిత్యాన్ని వీరు వినోదంగా భావించలేదు. దళిత రచయితల మహాసభలో వీరు ఈ అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం. 

కవితా ప్రక్రియలో దళిత కవిత్వం అనేకమైన మౌలిక మార్పులను ప్రవేశపెట్టింది. జీవితం పట్ల స్పష్టమైన భావనలు కలిగిన దళిత కవిత్వం కవితాలోకం యొక్క పరిధులను విస్తృత పరిచింది. సాధారణ కవిత్వం గుర్తించని వ్యక్తిత్వాలను, జీవన విధానాన్ని దళిత కవిత్వం గుర్తించింది. అన్యాయాలను, అసమానతలను, సమర్ధించిన వారికి వ్యతిరేకంగా తన స్వరం వినిపించింది. దళిత జీవితంలోని సుఖ, దుఃఖాలు మొదటిసారిగా శక్తివంతంగా కళాత్మకంగా కవిత్వంలోనే వ్యక్తీకరించబడినాయి. దళిత జీవితానికి విధేయంగా ఉన్న కారణంగా దళిత కవిత్వంలో దళిత అనుభవాల ప్రతిఫలనం కనిపిస్తుంది. దళితకవి స్వీయ అనుభవాల నుండే పదాలు, ప్రతీకలు స్వీకరించి కవితా నిర్మాణం చేస్తాడు. 

దళిత కవిత్వం ప్రాధమికంగా మానవజీవితం కేంద్రంగా, సాగి కుల మత వర్గ జాతి ప్రాంతీయ పరిమితులన్నింటిని అధిగమించింది. దళిత కవిత్వంలో వ్యక్తీకరణ కేవలం వ్యక్తిగతమైనదిగా మాత్రమే కాకుండా విశ్వజనీనమైనదిగా ఉంటుంది. దళిత కవిత్వంలో సంభాషణ రూపంలో, వర్ణనాత్మకంగాను దళిత జీవితం వ్యక్తీకరించబడుతుంది. దళిత కవులు సామాజిక అమానవీయత గురించిన వార్తలను పత్రికలలో చదివి స్పందించి వాటికి కవితారూపం కల్పించటం దళితకవిత్వంలో సాధారణాంశం. మతం కంటే దేవతావిగ్రహాల కంటే, ఏ ఇతర భావాల కంటే కూడా మానవుడే విలువైన అంశంగా భావిస్తూ ఆ దిశగా సమాజ ఆలోచనలలో మార్పు తెచ్చేందుకు దళిత కవిత్వం ప్రయత్నిస్తున్నది. 

ఈ విధంగా సామాజంలోని నియంతృత్వ భావాల్ని, పోకడల్ని ఖండిస్తూ దళిత కవిత్వం మÖడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. 

చంద్రదోష పరిహారాలు ఏవి #చంద్రాష్టమం #చంద్రదశాకాలం #chandra #moon #dosham #remedies #hindu


 

ఏ రాశి వారు ఎలాంటి వ్యాపారాన్ని చేస్తే కలిసొస్తుంది #business #zodiacsigns #astrology #hindu #beliefs #spiritual


 

తిరుమల శ్రీవారికి జరిగే సేవలు ఏవి #వేంకటేశ్వరస్వామి కైంకర్యాలు #arjithaseva #tirumala #services #bakthi


 

భాగవత ప్రసాదము

భాగవత ప్రసాదము

ఇటీవలి కాలములో ఎక్కడ చూసినా సమాజంలో మనుషుల మద్య సామరస్యము లేకపోవటం, షర్షణలు, అల్లర్లు, దోపిడీలు, అణచివేతలు, ఇతరమతాలను దూషించటం, అవహేళన చేయటం, ఆ మతాలలోని విధివిధానాలను ఎగతాళి చేయటం, అవి తర్కవిరుద్దంగా ఉన్నాయని విమర్శించటం, వాటికి అనుసరిస్తున్న వారందరూ అజ్ఞానులు, మÖర్కులు అన్న విధంగా మాట్లాడడం పరిపాటి అయిపోయింది. 

టీవీలలో మరియు ఇతర ప్రసారమాధ్యములలో జరుగుతున్న చర్చలలో కూడా ఇదే దోరణి కనిపిస్తుంది. వీటివలన సమాజానికి ఏవిధమైన ప్రయోజనం లేకపోగా ఇప్పటికీ అంతంత మాత్రముగా ఉన్న మతసామరస్యము, పరమత సహనము మరియు లౌకిక తత్వాలకు ఇంకా విఘాతము కలిగి ఒక రకమైన ఘర్షణాపూరితమైన వాతావారణం నెలకొంటున్నది. 

సహజంగానే కొందరు కుటిల రాజకీయ నాయకులు పరిస్థితులను తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి తమ రాజకీయ అవసరాలు తీర్చుకొంటున్నారు. బాగా చదువుకొన్నవారు, మేధావులు కూడా తమకు తెలిసో, తెలియ కుండానో ఈ ట్రాప్‌లో పడిపోతున్నారు. వెరసి సామాన్య ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మనకు రాజ్యాంగం ఉన్నది. అందులో పౌరహక్కులు, పౌరభాద్యతలు, ప్రవర్తనానియమావళి, శిక్షాస్మృతి ఇలా అన్నీ ఉన్నాయి. నిభందనలున్నాయి. అలాగే ఇటు ఆధ్యాత్మికంగా చూసుకొన్నా మానవులకి నైతిక విలువలు, మార్గదర్శకాలు భోధించే అనేక గ్రంథాలున్నాయి. అలాగే ఎంతోమంది మహానుభావులు, సత్పురుషులు ప్రవచనాలు, సందేశాలు, జీవిత చరిత్రలద్వారా మనకు ఎన్నో మంచి విషయాలు భోధిస్తూనే ఉన్నారు. మతగ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు, ప్రభందాలు కోకొల్లలుగా ఉన్నాయి. స్వచ్చంద సేవాసంస్థలు అనేకం ఎన్నో రకాల సేవాకార్యక్రమాలు చేస్తూ వాళ్ళు చేసే సేవ ద్వారా మనకు సందేశాలు ఇస్తున్నారు. అనేకమంది మహానుభావులు తమ రచనల ద్వారా, జీవిత చరిత్రల ద్వారా అనేక మంచి సందేశాలు ఇస్తూనే ఉన్నారు. అందరూ తమ శక్తి అనుసారముగా వీటిని పాటిస్తున్నారు. ఇంత అవిరళకిృషి జరుగుతున్నా కూడా ఈ రోజున సమాజంలో ఇంత అనిశ్చిత పరిస్థితులు, ఘర్షణ వాతావరణాలు, అలజడి, అశాంతి, విద్వేషాలు, వినాశనాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ఆలోచించాలి. మనకున్న అపారమైన మానవ వనరులు ఆధ్యాత్మిక సంపదలు సక్రమంగా ఉపయోగించుకొని ఒక ఆదర్యప్రాయమైన, ఆనందమయమైన సమాజాన్ని నిధించుకోవాలి.

అన్నిమతాలలోకి, అన్నిమార్గాలలోని మంచిని మనం గ్రహించాలి. మనం నిజాయితీగా పరికించి, పరిశీలించి చూస్తే ఏమతము యెక్క లేదా ఏ సిద్ధాంతము యొక్క మÖల గ్రంథాలలో ఏ విధమైన లోపాలు, తప్పులు లేవు. ఉండవు. అవన్నీ మానవుల కళ్యాణము కోసమే ఏర్పాటు చేయబడ్డాయి. అయితే కాలాంతరములో వాటిని వక్రీìకరించి, కల్తీచేసి తప్పుగా ప్రచార ప్రసారాలు చేయటం వలననే అవి ఈ రోజున కొంత గందరగోళము, అయోమయాన్ని కలిగిస్తున్నాయి. అంతేతప్ప ఏమÖల సిద్ధాంతము చెడును ప్రభోదించదు. అసతాన్ని, అణచివేతను ప్రోత్సహించదు. ఏమతం తన అనుయాయులు అసత్యవాదులు, పరమత ద్వేషులు, భోగలాలసులు, తీవ్రవాదులు కావాలని కోరుకోదు. తద్వారా సమాజంలో అశాంతి ప్రబలి ఈ సమాజం ఒక భూతల నరకం కావాలని కోరుకోదు. అలాగే ఏ సిద్ధాంతం లేదా ఇజం యొక్క ప్రతిపాదకులు కూడా అలాంటివి కోరుకోరు. సమాజంలో మనుషులందరూ సమాన అవకాశాలను అందిపుచ్చుకొని, స్వేచ్చగా, ఆనందంగా అందరూ కలిసి మెలసి జీవించాలనీ కోరుకుంటారు. దానికోసమే అందరూ ప్రయత్నించారు. ప్రభోదించారు. ఆయా కాలమాన పరిస్థితులను బట్టి, అప్పటి సాంఘిక, సామాజిక, ఆధ్యాతిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ రకమైన సిద్ధాంతాలను, మతవిశ్వాసాలను, ఆచారవ్యవహారాలను ప్రతిపాదించారు. హిందూ మతంలోని ఆధ్యాత్మిక సిద్ధాంతాలను పరికించి చూసినా ఈ సకల చరాచర సృష్టిలో సర్వవ్యాపకుడు, సర్వమంగళకారి అయిన పరమేశ్వరుడు అందరినీ సమదృష్టితోనే చూస్తాడు. సర్వులకూ సమానమైన జ్ఞాన ప్రకాశాన్నే ఇస్తున్నాడు. సూర్యుడు ఈ సకల సృష్టికి తన ప్రకాశాన్ని ఎలా లక్షల జీవరాశులకు, ప్రకృతికి తన ప్రకాశాన్ని సమానంగా ఇస్తున్నాడో అలాగే పరమాత్మ సృష్టి అంతటికి తన జ్ఞాన ప్రసాదాన్ని సమానంగా పంచుతున్నాడు. ఏవిధమైన వివక్షతి చూపించడము లేదు. ఆ తత్వాలను సరిగా అర్దం చేసుకోలేక మనుషులే తమ సొంత కవిత్వాలు జోడించి, వక్రీకరించి విద్వేషాలు పెంచిపోషిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. అమÖల్యమైన ఆ జ్ఞాన సంపదని మనం సరిగ్గా అర్ధంచేసుకోవాలి. జీర్ణించుకోవాలి. ఆచరించాలి. 

అలా మనం అర్థం చేసుకొని ఆచరించిన వాటికి ఇతరులకు కూడా శివప్రసాదంలా పంచాలి. ఇలా చేయటంలోనే జీవనసాఫల్యం దాగి ఉంది. మనచుట్టూ ఉన్నవారికి మన జ్ఞానాన్ని, అనుభవాలను పంచుతూ వెళ్ళాలి. సమాజంలో అన్ని వర్గాల మధ్య సయోధ్య, సామరస్యము ఉండటం వలన మంచి వాతావరణము ఏర్పడుతుంది. తద్వారా సమాజం పురోగమిస్తుంది. అందరూ ఆనందంగా ఉంటారు. అందరూ కలిసి కట్టుగా జీవించగలుగుతారు. 

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలి. విద్యానైపుణ్యాలను పెంచటంతోపాటు సంస్కారాన్ని కూడా పెంచాలి. అటువంటి మంచి విద్యావిధానాన్ని రూపొందించుకోవాలి. అలాగే మన శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్న మంచి విషయాలను కూడా శ్రద్ధ్దగా అధ్యయనం చేయాలి. వాటిలోని మంచి విషయాలు గ్రహించాలి. జీవితంలో వాటిని ఆచరణలో పెట్టాలి. ఎప్పటికప్పుడు స్వయాన్ని సరిచూసుకొంటూ సరిచేసికుంటూ ముందుకు వెళుతుండాలి. పురోగతిని సాధించాలి. కాలం చెల్లిపోయినవి, ఈ రోజున ఉన్న పరిస్థితులకు సమంజసం కాని వాటికి, చాదస్తపు విధానాలను వదిలేయాలి. కొత్తదనాన్ని జవితాలలోకి ఆహ్వానించాలి. వైయక్తిక క్రమశిక్షణను అలవర్చుకోవాలి. నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి. పాతదంతా మంచిది కొత్తదంతా చెడ్డది అనే అపోహలను వదిలివేయాలి. పాతదైనా కొత్తదైనా మంచి అయిన దాన్ని గ్రహించాలి. చెడును వదిలేయాలి. మనకున్న స్వేచ్చ, స్వాతంత్రము ఇతరులకు కూడా ఉన్నాయని గ్రహించాలి. ఇతరుల మనోభావాలను దెబ్బతిసే అధికారం మనకు లేదని గ్రహించాలి. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి. సంయమనం పాటించాలి. ఈ విశ్వంలో ఏ ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు. ఒకేలా ఆలోచించరు. ప్రపంచము వైవిద్యం, వైరుద్యంతో కూడుకొన్నది. పరివర్తన చెందుతుంది. కాలానుగుణంగా విలువలు కూడా మారుతుంటాయి. ఆచారవ్యవహారాలు మారుతుంటాయి. పద్దతులు మారుతుంటాయి. అవసరాలు మారుతుంటాయి. అవసరాల ఆధారంగా ఆవిష్కరణలు జరుగుతుంటాయి. ఆవిష్కరణలు జరిగినప్పుడు వాటివల్ల కొన్ని సత్ప్రయోజనాలు ఉంటాయి. అలాగే కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి. కొన్ని సానుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయి. అన్నింటిని సమానంగా స్వీకరించాలి. క్షీరసాగర మధనంలో గరళం కూడా వచ్చింది. శివుడు దాన్ని గ్రహించి కంఠంలో నిలుపుకునే గరళకంఠుడయ్యాడు. తద్వారా శివుడు ఈ విశ్వానికి తానే మంగళాకారుడు అని నిరూపించాడు. శివుడంటేనే శుభకరుడు, మంగాళాకారుడు, కళ్యాణ కారుడు. ఇదే శివతత్వ్యం.

సృజనాత్మకత దేవుని యొక్క మరో రూపం. ఈ సృష్టి ఒకగొప్ప సృజనాత్మక అద్భుతం. కొన్ని వేల లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో ఏర్చి, కూర్చి, పేర్చి నిర్మించబడిన ఒక అద్భుత సౌధం. దీనికి ఏ దేవుడు. ఎవరి దేవుడు ఎన్ని రోజులలో ఎలా సృష్టించాడు అనేది అప్రస్తుతం. ఎంతో సృజనాత్మకమైన ఈ అద్బుతాన్ని అంతే సృజనాత్మకతతో అస్వాదించటమే అవసరం. ఈ అద్బతం జరిగినప్పుడు గుర్తించడానికి ఎవరులేరు. అద్భుతం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు గుర్తించాల్సిన అవసరము లేదు. ఇక దానిని ఆస్వాదించటమే. దానితో మమైకం కావడమే. ప్రకృతిలో మమైకం కావటం అంటే దేవునితో మమైకం అవ్వటమే. ఎందుకంటే ప్రకృతి కూడా దేవుని యొక్క ప్రత్యక్ష స్వరూపమే. అది దేవునిలో సగభాగం. ‘జగదః పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ’ పురుషుడు సగం. ప్రకృతి సగం. ప్రకృతి పురుషులు. పరమేశ్వరుడు సగం. పార్వతి సగం, పార్వతి పరమేశ్యలు ఇదేగదా  అర్ధనారీశ్వరతత్వం సృష్టి సంపూర్ణ స్వరూపం. దైవము మరియు శక్తి యొక్క కలిసిన స్వరూపం. దివ్యత్వము మరియు సహజత్వము యొక్క స్వరూపం. దివ్యత్వము ఎంత అవసరమో సహజత్వము కూడా అంతే అవరసం. దివ్యత్వమును. సాధించే క్రమములో సహజత్వాన్ని కోల్పోకూడదు. అపుడు కృత్రిమత్వము వచ్చేస్తుంది. జీవనం అసహజంగా, కృతికంగా మారుతుంది. ఇప్పుడు సమాజం దాదాపు ఇలాగే వుంది. ఇటువంటి సమాజంలో ఉంటూ కూడా మనం ప్రతక్షణం మనల్ని మనం తెలుసుకుంటు మెరుగుపరుచుకుంటూ, బలపరచుకుంటూ మన యొక్క బెటర్ వెర్సన్‌గా తయారవుతూ వెళ్ళడమే నిజమైన సాధన. అత్యంత క్రమశిక్షణతో శారీరకంగా, మానసికంగా ఎమోషనల్‌గా, ఇంకా ఇంకా బలిష్టంగా తయారవుతూ వెళ్ళడమే మన లక్ష్యంగా ఉండాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం, పౌష్టికాహారసేవనము, స్వాధ్యాయం, మనన చింతన, సేవ చేస్తూ అత్యంత ఉత్సాహవంతమైన, ఉల్లాసకరమైన ఙవితం గడపడమే మన లక్ష్యం కావాలి. ఇటువంటి మనుషులతో కూడిన సమాజమే అభ్యుదయం సాధిస్తుంది. అభివృద్ది చెందుతుంది. సామాజిక, రాజకీయ, కళా, సాంస్కృతిక రంగాలలో ఉన్న అందరూ శారీరకంగా, మానసికంగా ఎమోషనల్‌గా తమను తాము ధృడంగా తయారు చేసుకోవాలి. నైతికబలం ఉండాలి. 

ఈ సృష్టి ఒక యుగచక్రంలో తిరుగుతున్నది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇలా నాలుగు యుగాలుగా. ఇది పారమార్ధిక సత్యం కావచ్చు కాకపోవచ్చు కానీ ఇది వ్యావహారిక సత్యం. గడియారంలోని భాగాలుగా ఇది ఒకలెక్క కోసం ఏర్పాటు చేసుకొన్న విధానం కూడా కావచ్చు, సింబాలిక్ కావచ్చు, ఒకరోజును కూడా మనం ఇలా విభజించు కోవచ్చు. తెల్లవారి 3 గంటలకు బ్రహ్మముహూర్తంతో మొదలయి 9 వరకు కృత యుగం లాంటిది. ఇది శుద్దానుత్వికము లేదా సత్‌ప్రధాన సమయం. ధ్యానం, జపతపాదులు, వ్యాయామం, కాలకత్యాలు తీర్చుకోవడం, పూజాపునస్కారాలుa, స్వాధ్యయనం, శాస్త్రాధ్యయనం వీటిìకి 6 గంటల సమయం చాల అనుకూలమైనదిగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈ సమయంలో తప్పక చేయాలి. ఎంతో అవసరం కనుక క్రమం తప్పకుండా చేయాలి. ప్రతిరోజూ చేయాలి. అనివార్యంగా చేయాలి. ఇక 9 గంటల నుంచి మద్యాహ్నం మÖడు గంటల వరకు త్రేతాయుగం. ఇది కూడా సాత్వక యుగమే. ఉదారపోషణ కొరకు న్యాయమైన సంపాదన, కుటుంబ, సంస్థాగత, వ్యవస్ధాగత వ్యవహారాలు చక్కబెట్టుకోవటం ఈ సమయంలో ఇవి తప్పక చేయాలి. విద్యుక్త ధర్మనిర్వహణకి ఇది తగిన అనువైన సమయం. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇది ద్వాపరం. ఇది రాజోతమోగుణాల మిశ్రమం. వీటి సమతూకం పాటించాలి. ఈ సమయంలో సేవాకార్యక్రమాలు, సత్సంగాలు, ఇష్టాగోష్టులు, రచనావ్యాసంగం. కళా సాంస్కృతిక సేవ, పురాణ కాలక్షేపం, దేవాలయ సందర్శనము, భజనలు, కీర్తనలు, బందుమిత్రులను కలవటం, కుటుంబంతో గడపటం ఇవన్నీ ఈ ఆరుగంటల కాలంలో చేసుకోవాలి. 

ఇకరాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు ఇది కలియుగం. అయోమయ యుగం. మొదటి 18 గంటల వ్యాయామం వల్ల శరీరము అలసి పోయి విశ్రాంతి కోరుకుంటుంది. కాబట్టి ఈ సమయంలో నిద్రించాలి. మామÖలుగా అయితే రోజుకు 3, 4 గంటల నిద్ర సరిపోతుంది. కాని ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు, రద్దీగా ఉండే జీవిన విధానానికి అలసట ఎక్కువ వస్తుంది కాబట్టి ఆరు గంటల నిద్ర అవసరం. అనివార్యం. శౌనకాది మునులు కలి ప్రభావానికి  లోను కాకుండా ఉండడానికి నైమిశారణ్యం వెళ్ళిపోయినట్లు మనం ఈ కతి కలి ప్రాభావానికి లోనుకాకుండా నిద్రలోకి వెళ్ళాలి. ఈ కలికాలంలో అనగా రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య  ఎంత మెలకువలో ఉంటే అంత నష్టం. ఎన్నో వికృత కార్యాలు ఈ సమయంలోనే జరుగుతాయి. అవే మనకు నరక£ హేతువులుగా మారతాయి.

మన కష్టసుఖాలకు పూర్తి భాద్యత మనమే మనదే. వాటిని మన భుజాలపై వేసుకోవాలి. వాటికి ఎవరినీ బాధ్యులను చేయకూడదు. ఎందుకంటే ప్రతిదీ మన స్వయంకృతమే. మన పాపాల ఫలంగానే మనకు దుఃఖము వస్తుంది. మన పుణ్యఫలమే మనకు సుఖాన్నిస్తుంది. కాబట్టి ఎవరినీ నిందించి ప్రయోజనము లేదు. మనల్ని మనం సరిచూసుకోవటం. నరిచేసుకోవటం మాత్రమే మన చేతుల్లో ఉంది. ¹ఏది మనం చెయ్యాలి. ఇతరులను సరిచేసే పని మనదికాడు. వ్యవస్థ సరిగా నడవటం కోసం చిన్న చిన్న సూచనలు, సవరణలు మాత్రమే మనం ఇతరులకు ఇవ్వగలం. అది కూడా వాళ్ళు తెసుకోనంతవరకే. లేకపోతే అదికూడా చేయకూడదు. స్వపరివర్తనే విశ్వపరివర్తన అన్న సూత్రాన్ని సదా గుర్తుంచుకోవాలి. క్రమశిక్షణ అలవర్చుకోవాలి. ఇంద్రియ భోగాన్ని తగ్గించాలి. ఆహారంలో, వస్త్రంలో, నిద్రలో నియమం ఉండాలి. అత్యంత సాధారణంగా ఉండాలి. సాత్వికంగా ఉండాలను కొన్నప్పుడు సాత్వికాహారమే తినాలి. మీ శరీరం యొక్క శ్రమను బట్టి ఆహారం తీసుకోవాలి. మితంగా తినాలి. సాత్వికత్వాన్ని పెంచుకొంటూ వెళ్లాలి. శీతలంగా అయిపోవాలి. ఉద్రేకాలు, ఉద్వేగాలు బాగా తగ్గించుకోవాలి. ప్రపంచంలోని అన్ని విషయాలను ఎడాపెడా తెలుసుకొని మస్తకాన్నంతా కూడా విషయ సంగ్రహాలయంగా మార్చుకొనే ఆసక్తి తగ్గించాలి. తేనెటీగల ఆహారపు అలవాట్లు తెలుసుకోవటం అనేది సాధకుడికి ఏమాత్రం సహాయపడదు. విషయ పరిజ్ఞానము ఎక్కువ అవసరం లేదు. స్వ ఉన్నతికి తోడ్పడే విషయాలపై దృష్టి పెట్టాలి. ఎదుటి వానిలోని దైవత్వాన్ని చూడకుండా వాడిలోని దోషాలు మాత్రమే చూస్తా ఉంటే మనలోని దోములు ఎప్పటికి తొలగవు. అందరిలో దేవుడ్ని చూడటం అలవాటు అయ్యేంతవరకు ప్రతిమ పూజ చేయటంలో తప్పులేదుగాని జీవితాంతం ఉన్నతి సాధించకుండా అలానే ప్రతిమ పూజలు చేస్తూనే ఉండటం తప్పు. పై క్లాసుకు ప్రమోట్ అవుతూ వెళ్ళాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండకూడదు. నీలో జరిగే మార్పు, ఉన్నత నీకే అశ్చర్యం కలిగించేట్టు ఉండాలి. సాటి మనిషిలో దేవుడ్ని చూసే అలవాటు చేసుకోకుండా. జీవితాంతం ప్రతిమ పూజలు చేసుకుంటూ, సాటి మనుషులను ద్వేషించే వారు కొండంత కుంకుమ, లక్ష పత్రిలు, కోటి బిల్వ పత్రాలతో పూజలు చేసినా దేవుడు స్వీకరించడు.

కపిల మహర్షి సాధన క్రియా సప్తకం గురించి అద్భుతంగా వివరించారు. 

1. ఫలాభిలాష విడిచి పెట్టడం. 

2 శక్త్యానుసారం తన ఆశ్రమానికి తగిన ధర్మం చేయటం.

3. నిషిద్ద వ్యాపారాలను విడిచి పెట్టడం

4. దైవం తన ప్రయత్నానికి ఎంతిస్తే అంతలో తృప్తి పడటం. 

5. ఆత్మవేత్తలను సేవించడం - మంచి పుస్తకాలు తోడుంచుకోవడం

6. ధర్మార్థకామాల కోసం ఇంద్రియాలతో పని చేయించకపోవడం

7. మోక్ష ధర్మాల ఎడ ఆసక్తి కలిగి ఉండటs.

బ్రహ్మచార్యము, గృహస్తము, వానప్రశము, సన్యాసము ఇలా ఏ ఆశ్రమంలో ఉన్న వారికైనా పైన పేర్కొన్న సాధనా సప్తకాలు ఉపయోగపడతాయి. పైవాటితో పాటు ఇంకా కొన్ని విషయాలు మనకు సాధనకు సహకారం అందిస్తాయి. అవి. 

1. సాత్వకాహారము

2. సజ్జన సాంగత్యము 

3. దైహిగుణధారణ

4. ఉపవాసము

సాత్వికాహారము: సాత్వికాహరము వలన సాత్వికత్వము పెరుగుతుంది. బుద్ది స్పష్టంగా ఉంటుంది. సంకల్పుల శుద్ధి అవుతుంది. వికసిస్తుంది. దీనితో తత్వము స్పష్టముగా అవగాహనకు వస్తుంది. అవగాహనకు రాగానే ఆచరణలోకి కావటము మొదలవుతుంది. సాత్వికాహారము వలన అనవసర ఉద్వేగాలు, ఉద్రేకాలు కలుగకుండా శాంతిగా ఉంటుంది.

సజ్జన సాంగత్యము: సాదు సజ్జనుల సాంగత్యంలో ఉండటం వలన వారి యొక్క మంచిగుణాలు, స్వభావాలు, సంస్కారాలు మనకి అలవాటు అవుతాయి. అలాగే సాధనలో వారి సహయోగము, సహకారము మనకు అందుతాయి. ఆధ్యాత్మిక పురోగతికి అవి సహకరిస్తాయి. 

దైవీగుణ ధారణ:- దైవీగుణాలను ఆభరణాలుగా ధరించాలి - మన గుణాల ప్రభావము వలన మన సంభంద సంపర్కములో  ఉన్నవారంతా ప్రభావితం అవుతారు. తద్వారా మనకు సహయోగము ఇస్తారు. కనీసం అవరోధాలు కల్పించకుండా ఉంటారు. దైవీగుణాల వలన అంత:కరణం శుద్ది అవుతుంది. 

ఉపవాసము : భగవంతునికి దగ్గరగా నివాస ముండటమే ఉపవాసము. అలా భగవంతునికి దగ్గరగా ఉండటానికి అవసరమైన మితాహారం, జపం, తపం, ధ్యానం, నామస్మరణ, భజన, కీర్తన ఇవన్నీ ఉపవాసములోకే వస్తాయి. 

భాగవతంలో ధృవుడి చరిత్ర అత్యంత ప్రేరణ దాయకం, స్పూర్తి దాయకం. ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు, సునీతి, సురుచి. సునీతి బుద్ధిశాలి. సురుచి రూపవతి. ఉత్తానపాదుడికి సునీత వలను దృవుడు మరియు సురుచి వలన ఉత్తముడు అనే ఇద్దరు కుమారులు. 

ఉత్తానపాదుడు సునీతిని ఆదరించేవాడుకాదు. సురుచి వద్దే ఉండేవాడు. దృవుడికి అప్పుడు ఐదు సంవత్సరాలు. ఒక రోజు ఉత్తానపాదుడు సురుచితోకలిసి సింహాసనముపై ఆసీనుడయి ఉన్నాడు. ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉన్నాడు. అపుడు దృవుడు కూడా తండ్రి వద్దకు వచ్చి ఆయన తొడపై కూర్చోబోయాడు. సురుచి అతన్ని ఆపి ‘నీవు నా కొడుకువు కాదు. నీకు అర్హతలేదు అని లాగేసింది. దీనికి ఉత్తానపాదుడు కూడా స్పందించక మిన్నకుండిపోయాడు. అపుడు దృవుడు అవమానంతో తన తల్లి సునీతి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పాడు. తాను ఏమీ చేయలేనని తమ కర్మ అలా ఉందని ఆమె అన్నది. నువ్వు అర్హత సంపాదించాలంటే అరణ్యానికి వెళ్ళి విష్ణువు గురించి తపస్సు చేయమని చెప్పింది. దృవుడు అడవిలోకి వెళ్ళాడు. నారదుడు కనిపించి ‘నీవు బాలుడవు  అడవిలో కూృర మృగాలుంటాయి. నువ్వు తపస్సు చేయలేవు. ఇంటికి తిరిగి వెళ్ళిపొమ్మంటాడు. దృవుని దృఢ సంకల్పము చూసి ముచ్చటపడి తన శిష్యునిగా చేసుకొని నారాయణ మంత్రం ఉపదేశించాడు. ధృవుడు అత్యంత దీక్షతో తపస్సు చేయగా అంతిమంగా విష్ణువు ప్రత్యక్షం అయి దృవుడిని అనుగ్రహించాడు. తరువాత దృవుడు వేల సంవత్సరాలు రాజ్యం చేసి శరీరం త్యజించి తారామండలములో అన్నింటి కంటె పైన ధృవ మండలముగా అవతరించి కల్పాంతము వరకు చిరస్థాయిగా నిలిచాడు. తన అకుంటిత దీక్షతో తపస్సుతో విష్ణువుని సాక్షాత్కరింప చేసుకొని శాశ్వత కీర్తిని ఉన్నతిని పొందిన ధృవుడు ఆద్యాత్మిక మార్గంలో సాధకులందరికి ఆదర్ష ప్రాయుడు. దృవతారగా వెలుగొందాడు. దీక్ష, తపస్సు వలన ఏదైనా సాధ్యమని నిరూపించాడు. మన లక్ష్యం పట్ల అకుంటితమైన దీక్ష ఉంటే సాధించలేనిది లేదని లోకానికి చాటి దేవతల రాజయిన ఇంద్రుని కంటె ఉన్నత స్థితికి ఎదిగి ఇంద్రుడే తల ఎత్తి చూసేంత ఉన్నత స్థానానికి ఎదిగాడు. దృవతారగా వెలుగుతున్నాడు. 

ఆధ్యాత్మిక మార్గానికి సంభందించి అనేక తప్పు దోరణులు ఉన్నాయి. వాటి గురించి తెలసుకొని సరి చేసుకోవాలి. సక్రమంగా చేయాలి. కలియుగంలో యజ్ఞాలు ఫలించవు. ఇవి కేవలం కర్మకాండగానే పనిచేస్తాయి. యజ్ఞం వ్యాపారం. యజ్ఞంలో దేవతలకు హవిష్షులుగా ఇస్తే వారు దానికి తగిన ఫలితం ఇస్తారు. ఇది ఒకరకమైన వ్యాపారం. ప్రతివానికి, ప్రతి వ్యాపారానికి దాని నియమాలు దానికి ఉంటాయి. ఆ వ్యాపారం మనాకి నచ్చకపోతే వదిలేయాలి. వాక్కు, మనసు, మననం ఈ మÖడు సాధనల ద్వారా జ్ఞానాన్ని ఆర్జించాలి. స్వధర్మం చేయటం, స్వధర్మÛంలో దోషాలు లేకుండా చేయటం. ఇదే భగవంతుడికి మనం చేసే గొప్ప సేవ. మన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించటమే భగవంతుడికి మనం చేసే గొప్ప సేవ. అదే అసలైన మాధవ సేవ. ఈ కలియుగంలో యజ్ఞాలు, కర్మకాండ చేయకూడదు. అవి ఫలించవు. ఫలించకపోగా దానికి చేయటంలో దోషాలు మనల్ని నాశనం చేస్తాయి. అనేక ఇబ్బందుల పాలు చేస్తాయి. కలియుగంలో అసలు కర్మకాండల అవసరమే లేదు. అందరిలో పరమాత్మనుచూసే అభ్యాసం చేయాలి. విచక్షÁణతో ఉండాలి. 

ఒకసారి ఒక ఏనుగు మతి భ్రమించి మదం ప్రకోపించి అదుపు తప్పి జనం మీదకు వస్తున్నదట. దానిపై కూర్చున్న మావటివాడు అందరూ తప్పుకోండి ఏనుగు అదుపు తప్పింది అని గట్ట్టిగా అరుస్తూ ఏనుగును అంకుశంతో నియంత్రించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా అది అదుపులోకి రాకుండా జనం మీదకి దూసుకొస్తున్నదంట. జనం అందరూ భయంతో చెల్లాచెదురై పరుగెత్తుతున్నారట. అప్పుడు ఒకడు ఏనుగుకి ఎదురెల్లా డట: ఏనుగు వాడిని తొండంతో చుట్టి ఎత్తి విసరి దూరంగా పడేసి¾ందట. వాడికి బాగా గాయాలయి మÖర్ఛపోయాడట. చుట్టు ఉన్న వాళ్ళు కాస్త సపర్యలు చేశాక మెల్లిగా తేరుకున్నాడు. “ఏవయ్యా! నీకు బుద్దుందా? అదుపు తప్పిన ఏనుగు ముందుకెళ్ళి ఎందుకు నిలబడ్డావు” ? అని అడిగితే దానికతడు అందరిలోను, అన్నింటిలోను దేవుడున్నాడు అని ఇటీవల ఒక సాధువు చెప్పాడు. అందుకే ఏనుగులో దేవుడ్ని చూద్దామని ముందుకు వెళ్ళాను”  అన్నాడట. మరి దాని మీద కూర్చొన్న మావడివాడిలో దేవుడు లేడా? వాడు తప్పుకోమని అరుస్తూనే ఉన్నాడు గదా?” అనడిగితే అతను తెల్లబోయాడు. నిజమేగదా? ఇంత చిన్న విషయం నాకు తట్టలేదు అని వాపోయాడట. కొన్నిసార్లు మన విచక్షణలు అలా ఉంటాయి. ఒక ఉపదేశాన్ని తీసుకొన్నప్పుడు దానికి పూర్తిగా తీసుకోవాలి. బుద్ధి ద్వారా ప్రతిపాదించబడిన సిద్ధాంతాలు బౌద్ధనిద్దాంతాలు. అనుభవంలో లేనిది కూడా బుద్దికి అర్థం అవుతుంది. కాని ఆచరణలోకి రాదు. ఇటువంటి వారు రెంటికి చెడ్డరేవళ్ళు అవుతారు. ప్రపంచంలో చాలా మార్గాలున్నాయి. కానీ వాటిని పాటించే సామర్ధ్యము నీకుందా అని గ్రహించాలి. 

సాధనా పంచకం గురించి ఇలా వివరించారు. 

1. శ్రద్ధ` సత్యము పైన శ్రద్ద పెట్టటం 

2. శ్రద్ధతో భగవధర్మాలను వినాలి. 

3. విన్నదానిని ఆచరించటం - ఆచరణను చెక్ చేసుకోవటం 

4. ఆచరణ వల్ల కలిగిన అనుభవం ద్వారా తత్వవిచారణ

5 విచారణ వల్ల నిగ్గు తేలిన విషయం అర్దమయి దానిలో స్ధిరపడటం. దాని ప్రత్యక్ష ప్రమాణంగా నిలవటం

ఆద్యాత్మికత లేకుండా ప్రాపంచిక పురోగతికి అర్ధం లేదు. అలా పెరిగిన వారు అసురులు అవుతారు. ప్రాపంచిక పురోగతి మరియు ఆద్యాత్మిక పురోగతి సమాంతరంగా జరగాలి. మన పిల్లల్ని మనం అలాగే పెంచాలి. లేకపోతే ఇబ్బంది పడతాము. ఈ తరం వాళ్ళు వ్యాపార సూత్రాలు బాగా వంట పట్టించుకొంటున్నారు. కాని నైతిక విలువలు పాటించటం లేదు. 

ఒక దంపతులున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అలా 50 వేలు జీతం వస్తున్నది. అంతలో వారి తల్లిదండ్రులు 60 దాటి వారి వద్ద ఉండటానికి వచ్చారు. వారిని చూసుకోవాలంటే  ఇద్దరిలో ఒకరు ఉద్యోగం మానేయాలి. ఉద్యోగం పురుష  లక్షణం. అతడు మానేడు. ఆ అమ్మాయి మానేస్తే ఆదాయం 50 వేలు తగ్గిపోతుంది. ఖరీదైన విలాసవంతమైన ఇల్లు కొనాలని ప్రణాళిక వేసుకొని ఉన్నారు. వాయిదాలు కట్టాలంటే ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిందే. చాలా ఆలోచనాలు, చర్చలు, వాదోపవాదాలు అయిన తరువాత ముసలి వాళ్ళను ఇద్దరిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేశారు నెలకి 25 వేలు కట్టి. ఇంకా 30 వేలు మిగిలాయి. ఇంత అద్బుతమైన ఆలోచన వచ్చినందుకు జబ్బలు చరుచుకున్నారు. 

తమను వెంటాడుతున్న ఆ ముసలి వాళ్ళ జాలి చూపులను పట్టించుకోవటం లేదు. లేదు. పట్టుంచుకోనట్లు నటిస్తున్నారు ఒక్కరి జీతం 25 వేలతో కూడా బ్రతకొచ్చు అనే ఒక ఆప్షను ఉందని తెలియక కాదు. అలా సింపుల్ గా బతకటం ఇష్టం లేక చాతగాక ఈమద్య ఆ ముసలాళ్ళను చూడ్డానికి ఆ వృద్ధాశ్రమంకు వెళ్ళినపుడు వాళ్ళ దుఖం చూసి నాకు కడుపులో దేవినట్లయింది. ఎవరి లెక్కలు వాళ్ళని. ఎవరి తిక్కలు వాళ్ళవి. ఎవరి తిప్పలు వారివి. అందరికి ఒకే క్షమత ఉండదు. అందరికి ఒకే అర్హత ఉండదు. ఇచ్చేవాడి క్షమత. పుచ్చుకొనే వాడి అర్హత మీద ఈ ఇచ్చి పుచ్చుకోవటాలు ఆధారపడి ఉంతాయి. వేరు వేరుగా ఉంటాయి. 

ఒకసారి సాయిబాబా దగ్గరికి ఒకతను వచ్చాడట. కొన్ని రోజులుగా బాగా కడుపు నొప్పిగా ఉందని ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదని చెప్పాడట. అప్పుడు సాయి బాబా దగ్గర్లో అందు బాటులో ఉన్న గుపెÚ్పడు వేరు శనగ పప్పులు తీసి మంత్రించి అతనికిచ్చి తినమని చెప్పాడట. అతను అలాగే తిన్నాడట, చేత్తో చేసేసినట్లు నొప్పి తగ్గిపోయింది. ఇదంతా పక్కనే ఉన్న ఇంకొకతను చూసాడట. తరువాత అతనికి కూడా ఒకసారి కడుపు నొప్పి వస్తే అప్పుడు వేరుశనగ పప్పులు తిన్నాడట. దాంతో కడుపు నొప్పి ఎక్కువయి ఆసపత్రి పాలయ్యాడట. అందరికీ ఒకే మందు పని చేయదు. సొంత వైద్యము ఆసలే పని చేయదు. బుద్ధి ఆధారంగా పనిచేయటం వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. అన్ని సార్లు బుద్ది యొక్క డైరక్షన్‌లో పనిచేయ కూడదు. అతిగా తినటం వలన దాన్ని జీర్ణం చేయటానికి ఎక్కువ ప్రాణ శక్తి ఖర్చయిపోతుంది. తద్వారా అలసట వస్తుంది. మితంగా తింటే శక్తి వస్తుంది. అతిగా తింటే నీరసం వస్తుంది. ఎక్కవగా తింటే ఎక్కువ శక్తి రావాలి కదా? కాని అలా జరగదు. నీరసం వస్తుంది. నిద్రవస్తుంది. మత్తు వస్తుంది. బద్దకం వస్తుంది. సోమరితనం వస్తుంది. అందుకే సాధకులకు ముఖ్యంగా మితాహారం అవసరం. అనివార్యం. ముఖ్యంగా 60 దాటిన వారు మితంగా తినాలి. ప్రాణశక్తిని కాపాడు కోవాలి. ఆద్యాత్మమార్గంలో మనం చేస్తున్న మÖఢాచారాల వలన ఈ తరం వాళ్ళు మన ఆధ్యాత్మిక మార్గాన్నే ఏవగించుకొంటున్నారు. తద్వారా వాళ్ళు ఆద్యాత్మిక మార్గంలో నడవడానికి ఇష్ట పడటంలేదు. ఫలితంగా వారు భాతకంగా ప్రగతి సాగిస్తున్నారు. కాని ఆధ్యాత్మిక ప్రగతి సాధించటంలేదు. అందువలన వారి ప్రగతి సంపూర్ణము కావటంలేదు. కాబట్టి మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మÖఢాచారాలను, కర్మకాండనీ మనం వెంటనే వదిలి వెయ్యాలి. అర్దం లేని మÖర్తి పూజలు, యజ్ఞ యుగాలు, క్రతువులు, ఇవన్నీ వెంటనే మానివేయాలి. పురోహితుడికి డబ్బులిచ్చి మనల్ని పొగిడించుకోవటం నీచం. నారాయణుడిని కీర్తించాల్సిన నోటితో నరుడిని పొగడటం పురోహితుడికి తగదు. ఆద్యాత్మిక మార్గంలో నామస్మరణ  చేసుకొంటూ. ధ్యానం చేసుకొంటూ, మనన చింతన చేసుకొంటూ, శాస్త్రాధ్యయనం చేస్తూ, స్వయాన్ని పరిశీలించుకుంటూ, సాధన చేస్తూ ఉన్నతిని సాగిస్తూ అందరిలోను భగవంతుడ్ని చూడటం అలవాటు చేసుకోవటం. ఇది నిజమైన ఆద్యాత్మికత. అర్ధం లేని  చాదస్తపు ఆచారవ్యవహారాలను ఆచరించటం వలన ఏమి లాభం లేదు. ఉపయోగంలేదు. ఇది మన ఆద్యాత్మిక సంస్కృతి కాదు. కొన్ని ప్రాంతాలలో కొంత మంది అంటారు. ఏదైనా శుభకార్యం ముంగిళ్ళలో జరిగిడే మేము మేకల్ని కోసుకొని, కల్లు కుండలు తెచ్చుకొని ఇంట్లో అందరం కూర్చొని తాగుతాము అంటాము. చిన్న పిల్లలచేత కూడా తాగిస్తాము. ఇది మా సంస్కృతి అంటారు. ఇది తప్పు. అది సంస్కృతి కాదు. ఆచారం అనొచ్చు. వాస్తవానికి దానిని ఆచారం అని కూడా అనకూడదు. అలవాటు అని మాత్రమే అనాలి. సంస్కృతి అంటే మనల్ని సంస్కరించి ఉన్నతికి తీసుకెళ్ళేది. అంతేగాని మనల్ని పతనం చేసేది సంస్కృతి కాదు. వైయక్తిక క్రమ శిక్షణతో, సాధనతో, జ్ఞానసముపార్జనతో, ఆచరణతో, ఆదర్శంతో ప్రగతి సాధించేదే సంస్కృతి. అందుకు దోహదపడే అంశాలే సంస్కృతి అనబడుతుంది. మనల్ని పతనం చేసేది తిరోగమనం వైపు నడిపించేది సంస్కృతి కాదు. నిన్నటి కంటె ఈ రోజు, ఈ రోజు కంటె రేపు, రేపటి కంటె ఎల్లుండి ఇలా ప్రతి రోజు ప్రగతి సాధిస్తే మన యొక్క బెటర్ వెర్షన్‌గా తయారవుతూ ముందుకు వెళ్ళటమే సంస్కృతి.

త్యాగం చెయ్యకుండా, సాధన చెయ్యకుండా, ఎవరో మహాత్ముడు లేదా దేవుడు ఒక శుభముహుర్తంలో ఒక సాక్షాత్కారంతో  మనల్ని ఉద్దరించేస్తాడు అనేది కేవలం ఒక భ్రమ. అత్యాశ. అలా ఎప్పుడు జరగదు. ప్రయత్నం అనివార్యం. అవసరం. త్యాగమే పునాది. భగవద్భిన్నమైనదంతా త్యాగం చేయాలి. భగవంతునిపై ద్యాస పెట్టాలి. సంకల్పం దృడంగా ఉండాలి. ఎవరో మనమీద దయచూపాలి, జాలిచూపాలి అనుకోవటం అసహ్యకరమైన సంకల్పం. అటువంటి వారిని ఎవరు ప్రేమించŠరు. ఆనందంగా ఉన్న వారినే అందరు ప్రేమిస్తారు. ఏ దుఃఖం వచ్చినా దాని మÖలం నాలోనే ఉంది అని దానిని సరిదిద్దు కోవాలి. సరిచేసుకోవాలి. ప్రతి దుఃఖానికి మÖలం మనలోనేవుంది. మనలో ఉన్న దానికి సరిచేయకుండా అవతలది సరి అవ్వదు. ప్రతి దుఃఖానికి పేరు మన బుద్దిలో ఉంది. కామ, క్రోధ, లోభాలే మన దుఃఖానికి కారణం. మోక్షం, ఆనందం, ముక్తి ఇవి లక్ష్యాలు. చేసిన తప్పును ఒప్పుకొని సరిదిద్దు కోవటం దైవీగుణం. ఎప్పుడయితే తప్పుకు మÖలం నాలోనే ఉందని వెదుకుతావో అప్పుడే తప్పు జరగటం ఆగిపోతుంది. ధర్మాన్ని అపవిత్రం చేసినప్పుడు విష్ణువు రంగంలోకి దిగుతాడు. సంస్కారాలను శుద్ధి చేసుకోవటానికి ఈ శరీరం అవసరం. నియమించి పాలించేవాడే ఈశ్వరుడు. 

హిరణ్య కశిపుని అరాచకాలతో నిరీశ్వరవాదం పెరిగిపోయింది. ప్రహ్లాదుడికి తల్లి గర్భంలో ఉండగానే హరిభక్తి అబ్బింది. ప్రహ్లాదుడు తనకు రాక్షస విద్యలు భోదించ తల పెట్టాడు. గురువులకే సమస్త జ్ఞానము తానే భోదించారు. మనకు భౌతికవాదం  భోధించే వారికే తిరిగి ఆద్యాత్మికజ్ఞానం భోదించటమే తగిన విధి. అపుడు హిరణ్య కశిపుడు హరిభక్తిని ఆపకపోతే నిన్ను చం పేస్తాను అంటాడు. నా చావు నా చేతిలో నీ చేతిలో లేదు. నేను మాత్రం సత్యాన్ని వదలను అంటాడు. దండనాయకులను పిలిచి ఎలాగైనా ప్రహ్లాదుని చంపమంటాడు. వారు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా చంపలేకపోతారు. ప్రతిసారి ఒక అదృశ్యశక్తి ప్రహ్లాదున్ని కాపాడుతుంది. తన కొడుకునే చంపుకోవాల్సి వచ్చినందుకు హిరణ్యకశిపుడు బాధపడతాడు. అసలిదంతా ఎందుకు? నీ శ్రీహరిని చూపించు అంటే ప్రహ్లాదుడు చూపిస్తాడు. అపుడు శ్రీహరినే చంపేస్తే తన శత్రువు పోతాడని తన కొడుకు తనకు దక్కుతాడు అని హిరణ్యకశిపుడు ఆలోచిస్తాడు. నీ శ్రీహరిని చూపించు అని ప్రహ్లాదుడుని అడుగుతాడు. అన్నిచోట్లు ఉంటాడు అని చెబుతాడు. స్థంబంలో చూపించ మని సంభాన్ని విరగ్గొడతాడు. దాని లోంచి నరసింహ అవతారంలో విష్ణువు వచ్చి అతన్ని అతనికి బ్రహ్మ వరమిచ్చిన దానికి విఘాతం కలుగకుండా గోళ్ళతో చీల్చి సంహరిస్తాడు. అపుడు ప్రహ్లాదుడు విష్ణువును స్తుతిస్తూ స్తోత్రం చెబుతాడు. దానికి విష్ణువు ప్రసన్నమై నీక్కావలసిన వరం కోరుకోమంటాడు. నాకు నీపై ఉన్నది భక్తి. భక్తిలో కోరికలుండవు. ప్రేమ మాత్రమే ఉంటుంది అని ప్రహ్లాదుడు అంటాడు. అయినా, ఏదైనా కోరుకోమని విష్ణువు అంటాడు. అసలు నాకు ఎప్పుడూ ఏ కోరిక కలుగకుండా ఉండేలా వరమివá్వమని ప్రహ్లాదుడు కోరుకుంటాడు. అలాగే ఇస్తాడు. అయితే నేను నిన్న ఒక కోరిక కోరతాను అది నాకివ్వు అని విష్ణువు అడుగుతాడు. ఈ భూమండలాన్ని పాలించే నైతిక క్షమత నీకుంది. నువ్వు తప్పక లోక కళ్యాణం కోసం ఆలా చేయాలి అంటాదు. ప్రహ్లాదుడు దానికి అంగీకరిస్తాడు. అదే లోక కల్యాణం కోసమే. తరువాత ప్రహ్లాదుడు చాలా కాలం భూమండలాన్ని ధర్మానుసారంగా పాలించి విష్ణువులో కలిసి పోతాడు. మనకు తెలుసు. అన్ని దుఃఖాలకు మÖలం కోరికలేనని. అటువంటిది కోరికలే కలుగకుండా వరమివ్వమని కోరిన ప్రహ్లాదుడు ఎంతటి జితేంద్రియుడు. అంతటి నైతిక క్షమత కలిగి ఉండడం వలననే అతను విష్ణువు యొక్క ప్రియమైన భక్తుడయ్యాడు. ప్రహ్లాదుడు సమస్త మానవ జాతికి ఆదర్శప్రాయుడయినాడు. అలాగే భక్తులలో కూడా అగ్రగణ్యుడైనాడు భక్త ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి చరిత్ర చదువుతుంటేనే మనకు భక్తి పారవశ్యం కలుగుతుంది. శరీరం పులకరిస్తుంది, నిష్కామ భక్తికి నిదర్శనం. 

భాగవతం వినటం ఒక యోగం. యోగం అంటే కలయిక. భాగవతం చదువుతున్నప్పుడుగాని, వింటున్నప్పుడుగాని మనము పరమాత్మతో జోడించబడినట్టుగా భావిస్తాము. ఆ అనుభవం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందులోనూ భాగవతం వినిపిస్తున్న వక్త లేదా ప్రవచనకారుడు మంచి అనుభవ జ్ఞానముతో చెబుతున్నప్పుడు అది ఇంకా ఎంతో మధురంగా, హృద్యంగా ఉంటుంది. దృవుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, బలిచక్రవర్తి, అంబరీషుడు, గజేంద్రుడు, శ్రీకృష్ణుడు, నారదుడు, ఇలా ఏ ఎపిసోడ్ తీసుకొన్నా ఎంతో అద్బుతంగా ఉంటాయి. ఆ మహానుభావుల త్యాగం, తపస్సు, సేవ, దీక్ష వీటన్నింటిని సమిశ్రంగా మనకు సాక్షాత్కారం చేపిస్తుంది భాగవతం, ఇంకా ఎన్నో అద్బుతమైన సంఘటనలు, సన్నివేశాలు మన కళ్ళ ముందు సజీవంగా నిలబడతాయి. మన ఆధ్యాత్మిక సాహిత్యంలో భాగవతం ఒక అద్భుత, విశిష్ట గ్రంధం. మానవజాతికి ఇది చేసినంత మేలు ప్రపంచంలో ఏగ్రంధం చేయలేదు. ముఖ్యంగా మన భారతీయులకు ఇది ఒక గొప్ప పెన్నిది. భగవంతుని సన్నిది. దీని యొక్క పూర్తిప్రయోజనం మనం పొందాలి. వీలయినన్ని ఎక్కువసార్లు దీని యొక్క అధ్యయనం, మననం మనం చేయాలి. అందరితో చేయించాలి. ఎక్కడ భాగవత ప్రవచనాలు జరుగుతున్నా మన వంతు సేవ, సహకారం అందించాలి. ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పట్నుంచి దీనిని చదివించటం చేయాలి. వాళ్ళ సంస్కారాల నిర్మాణానికి మనం ఇతోదికంగా సహాయం చెయ్యాలి. దీని వలన వాళ్ళు ఒక సమగ్రమైన ఆలోచనా విధానాన్ని అలవరచుకొంటారు. భాధ్యత గల వ్యక్తులుగా ఎదుగుతారు. జ్ఞానయుక్తమైన ఆద్యాత్మిక జీవనం గడపగలుగుతారు. ప్రాపంచకపురోగతితోపాటు ఆధ్యాత్మక పురోగతి సాధించగలుగుతారు. ఈ రోజు ఇది సమాజానికి ఎంతో అవసరం. అనివార్యం. నా మటుకు నేను చిన్నప్పట్నుంచి ముఖ్యంగా నా పదహారవ ఏట నుంచి ఎక్కడ భాగవత ప్రవచనాలు జరిగినా నేను ప్రత్యక్షంగా వెళ్లటమో లేదా వివిధ మాధ్యమాల ద్వారా వినటమో, చదవటమం చేస్తు వచ్చాను. నా జీవితంలో ఇది చాలా ఉపయోగ పడింది. 

స్వధర్మానికి అవసరమైనంత వరకే ఇంద్రియ భోగం అనుభవించాలి. అపుడు స్థితి స్థిరంగా ఉంటుంది. స్వధర్మం మార్పులు గమనిస్తూ ఉండాలి. వెళ్ళిన కొద్ది ఆసక్తి తగ్గుతూ వెళ్ళాలి. వయసు పెరిగిన కొద్దీ ఇంద్రియ భోగాల వినియోగం తగ్గాలి. ఎక్కువ తింటే జీర్ణంకాదు. తక్కువ తింటే నీరసం వస్తుంది. సమతూకం ఉండాలి. లేకి అలవాట్లు తగిలించుకోవటం మంచిదికాదు. తగిలించు కుంటే అంత తేలికగా వదలవు. మన స్వధర్మానికి అవసరం అయిన వాటికి ధర్మబద్ధంగా పొందాలి. అవసరమైనంత మేరకే వినియోగించాలి. వయసొచ్చిన తరువాత పాతకోరికలు తీర్చుకొనే వారు మÖర్కులు. వయసు పెరిగిన కొద్దీ సింపుల్‌గా అయి పోవాలి. కోరికలు తగ్గిపోవాలి. వినియోగం తగ్గాలి. ధ్యానం పెరగాలి. సేవ పెరగాలి. భగవత్సంబంధŠŠ విషయులపై ఆసక్తి, సేవ పెరగాలి. మన స్థాయిని బట్టి, క్షమతను బట్టి, సామర్థ్యాన్ని బట్టి మనం చేయాలి. వయసు పెరిగే కొద్ది మన వినియోగం తగ్గించాలి. వితరణ పెరగాలి. ఇతరుల అవసరాలు తీర్చటంలో ఆనందŠము పొందాలి. మీ పిల్లలు, కుటుంబ సభ్యులు, పొరుగువారు వీళ్ళ తెలుసుకొని మరీ అవసరాలు తీర్చాలి. మీ అవసరాలు బాగా తగ్గించుకోవాలి. భౌతిక సంపదలు తగ్గించుకొంటూ ఆధ్యాత్మిక సంపదాలు పెంచుకుంటూ వెళ్ళాలి. పుణ్య క్షేత్రాలలో పుట్టినవారంతా గొప్పవారు కాదు. 

కొండŠ ప్రాంతాల్లో ఉండేవారికి తిండి తక్కువ. ఆరోగ్యం ఎక్కువ. మైదాన ప్రాంతాలలో ఉండేñ వారికి తిండి ఎక్కువ. ఆరోగ్యం తక్కువ. వయస్సు పెరిగే కొద్దీ స్వధర్మాన్ని పట్టుకోవాలి. భగవంతుడ్ని పట్టుకోవాలి. ప్రపంచ విషయాలలో ఎవరి తోను పోలిక పెట్టుకోకూడదు. ఆద్యాత్మికంగా ఇతరులతో పోల్చుకొని వారిని మించిన స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. పోలిక దుఃఖాన్నిస్తుంది. ఈర్ష్యను రేకెత్తిస్తుంది. ఆనందం యొక్క ఉన్నతత్వం మారిన కొద్ది వినాయోగం మారిపోతుంది. వానప్రస్త అవస్థలో చాలా సింపుల్గా ఉండాలి. ప్రాపంచిక విషయాలు వదిలేయాలి. రెండు పడవల మీదకాలు పెట్టం కుదరదు. ఉంటే శ్రీశైలంలో ఉండాలి. లేదంటే హైదరాబాదులో ఉండాలి. కాని ఒకేసారి రెండుచోట్లా ఉండటం కుదరదు.

పావనంగా అయ్యే ప్రయత్నం నిరంతరం చేస్తు ఉండాలి. ఎప్పుడూ ఆనందంగా ఉండటం ముఖ్యం. మిగతా విషయాలన్నీ అప్రస్తుతం. ఇంద్రియ భోగాలు ఎక్కువగా అనుభవించడం వల్లే దుఖాలు వస్తాయి. సింపుల్ లివింగ్ హై థిóంకింగ్. సాధారణంగా జీవించు. ఉన్నతంగా ఆలోచించు. ఇదే ఆధ్యాత్మికత. మన పనివాళ్ళ జీతాలు పెంచకుండా మన జీవితాల స్టాండర్డ్స్ ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్ళడం సమంజసంకాదు. మనం ఉన్న స్థానంలోనే మనం ఉన్నతిని సాధించడానికి కృషి చేయాలి. ఉన్న ఊళ్లో చేసే తపస్సు ఫలించదు. గుర్తింపు రాదు అంటారు. ఎవడిక్కావాలి గుర్తింపు? ఎవడి గుర్తింపు కావాలి? మనల్ని చూసేవాడు, గుర్తించేవాడు, మునల్ని ఆదుకొని పైకిచేరుకొనేవాడు పైవాడే. వాడు మనల్ని నిత్యం చూస్తూనే ఉంటాడు. కాస్తూనే ఉంటాడు. ఈ ప్రపంచంలోని దేహధారుల గుర్తింపులతో మనకు పనేమిలేదు. 

ఇది ప్రక్కువ పెడితే మనల్ని మనం నిజాయితీగా, నిష్పక్షపాతంగా పరిశీలించుకొంటూ, పరికించకుంటూ ఉంటే మన సాధన, స్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. మనల్ని మనం సరిచేసుకొంటూ లక్ష్యం వైపు పయనించాలి. మనలో ఉన్నది మనకు భిన్నంగా ఉన్నది ఒకటే. వేరుకాదు. లక్ష్యము ఎలా ఉంటే లక్షకాలు అలా ఉండాలి. లక్ష్యాలకు తగిన లక్షణాలు లేకపోతే లక్ష్యం ఎప్పుడూ దగ్గరవదు. ఇంకా ఇంకా దూరంగా జరిగిపోతూనే ఉంటుంది. సాధన చాలా తీవ్రస్థాయిలో ఉండాలి. అయితే అది సహజంగా ఉండాలి. యంత్రికంగా ఉండరాదు. యాంత్రికత్వం అసలు పనికిరాదు. లౌకికం, అలౌకికం ఎందులోనైనా యాంత్రికత్వం అసలు పనికిరాదు. సృజనాత్మకత ఉండాలి. అహంకారం అసలు ఉండకూడదు. 

ఈ సృష్టిలో నీ కంటే గొప్పది ఏదీ లేదు. నీకంటే తక్కువది ఏదీ లేదు. నీకు సమానమైనది లేదు. నీ స్థానం ప్రత్యేకం. అది యÖనిక్. నీకు ఎవరితో పోటీ లేదు. నీవు ఎవ్వరికి పోటి కాదు. అత్యంత వైరుద్యంతో, వైవిధ్యంతోనూ కూడిన నీ స్థానం ఈ సృష్టిలో  ప్రత్యేకమైనది. విశేషమైనది. నీ లక్ష్యం కూడా ప్రత్యేకమైనదే. కాబట్టి నీ లక్షణాలు కూడా ప్రత్యేకంగానే ఉండాలి. అదే ఆధ్యాత్మికత.

భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టం అత్యంత మనోహరం. అర్థవంతం. గజేంద్రుడు అనే ఏనుగు తన వేల మంది భార్యలతో ఒక మనోహరమైన సరోవరంలో దిగి భీభత్సం చేసేసి వినోదించాడు. మడుగంతా బురదమయం అయిపోయింది. పూర్తిగా విద్వంసము చేసేసాయి. అపుడు ఆ మడుగులో ఉన్న ఒక మొసలి ఇది చూసి విచారించి గజేంద్రుడికి బుద్ది చెప్పాలని నీటి అడుగున బురదలోనే వచ్చి గజేంద్రుడు యొక్క కాలు గట్టిగా పట్టు కొన్నది. గజేంద్రుడు బాధతో గట్టిగా అరిచాడు. ఈ సంఘటనతో గజేంద్రుడితో ఉన్న ఆడ ఏనుగులన్నీ సరస్సులోంచి బయటకి వెళ్ళిపోయాయి. గజేంద్రుడు తన శక్తి కొద్ది మొసలి నుంచి తనను తాను విడిపించుకోవటానికి విశ్వప్రయత్నాలు చేస్తాడు. కానీ అలవి కాలేదు. ఇది సహస్ర వర్షాల పర్యంతము జరిగిందట. గజేంద్రుడి శక్తి క్షీణించి పోతున్నది. చివరిగా గజేంద్రుడు భగవంతుడిని ప్రార్ధన చేసి ఆయన్ని పిలవటం మొదలు పెట్టాడు. మొసలి తన పళ్ళతో ఇంకా గట్టిగా కొరికింది. భాద ఎక్కువయింది. శక్తి ఇంకా క్షిణించి పోతున్నది. అంతిమంగా పరమాత్మ ఇక నాకు నేవే దిక్కు నీవే నన్ను కాపాడాలి అని శరణు వేడుకొన్నాడు. ఆ సమయానికి వైకుంఠములో జగన్మాతతో ఏకాంతంలో ఉన్న విష్ణువు తన భక్తుడి ఆర్తనాదాలు విని అతని శరణాగతికి మెచ్చి ఎలా ఉన్న వాడు అలాగే సిరికిం జెప్పక శంఖచక్రాయుధ·ములను ధరించక అలాగే కిందకు వచ్చి ఆ సరస్సులో దిగి మొసలిని పట్టుకొని పైకెత్తి దాని తలను నరికి గజేంద్రుడికి విముక్తి కలిగించాడు. అపుడు గజేంద్రుడు మొసలితో జీవన్ముత్య్రు పోరాటం చేసి అలసిపోయి డస్సిపోయి ఉన్నాడు. గజేంద్రుడు దగ్గరలో ఉన్న పుష్పాన్ని తొండంతో అందుకొని విష్ణువు పాదాల వద్ద ఉంచి ఆయన పాదాలపై తల ఉంచి శరీరం వదిలి విష్ణువులో ఐక్యం అయి పోయాడు. ఈ మొత్తం ఎపిసోడు మనం ఆద్యాత్మికంగా చూసినట్లయితే వికారాలనే మొసలిచే పట్టి పీడించబడుతున్న మనిషి తన సొంత ప్రయత్నము చేత దాన్నుంచి విడివడటానికి తీవ్ర ప్రయత్నం చేసినా కుదరక మొదటగా భగవంతుడి ప్రార్ధన చేసి తర్వాత ఆయా సంపూర్తి శరణాగతి వేడుకొని పూర్తిగా ఆయనకు సరెండర్ అయితే ఆయన స్వయంగా మన హృదయం అనే సరస్సులో దిగి వికా రాలినే మొసలిని పైకెత్తి తల నరికి మనకు వికారాల నుంచి విముక్తి కలిగించి మనకు మోక్షం ప్రసాదిస్తాడు. 

భాగవతంలో శ్రీకృష్ణుని జననం, ఆయన బాల్యం ఇదంతా అత్యంత మనోహరమైన ఘట్టం. దేవకి గర్భాన జన్మించిన కృష్ణుడు యశోద వద్దకు చేరాడు. ఆయనకు కృష్ణుడు అని పేరు పెట్టడానికి కారణం. కృష్ అనగా లాగేయటం. మనలోని వికారాలను, దుర్గుణాలను బయటికి లాగేసి మనల్ని పావనం చేసే వాడే కృష్ణుడు. మన దేహ భావనలను, వాసనలను పూర్తిగా తీసేసేవాడే కృష్ణుడు. 

అయితే మనం ఆయనను పూర్తిగా నమ్మి శరణు వేడు కోవాలి. ఆయన చాలా చిన్నవయసులోనే అనేకమంది రాక్షసులను చంపేశాడు. ఆ రాక్షనలు మనలోకి దుర్గుణాలను, దుష్ట సంస్కారాలకు చిహ్నం. తన దివ్య అలౌకిక సౌందర్యముతో, దివ్యచేష్టలతో అందరినీ ఆనంద పరవశులను చేసేవాడు కృష్ణుడు. యమునానదిలో కాళింది సర్పముపైకెక్కి దూకి అన్ని తలల మీదను నాట్యం  చేసి ఆ తలలలోని విషాన్నంతా బయిటికి లాగేసి దానిని విముక్తి జేసాడు. మనలోనికి భేదబుద్ది విషంలాగా శరీరమంతా వ్యాపించి ఉంటుంది. భేదబుద్ధి వలన మనలో కలిగే వాసనలు మనను విషతుల్యం చేస్తాయి. ఇదే అసలైన ఇన్‌ఫెక్షన్. మన శిరస్సుపైన అనగా మన బుద్దిలో పరమాత్మ నిలబడటానికి తావిస్తే ఆయన తాండవం చేసి మనలోని విషమంతా లాగేసి మనల్ని పావనం చేసి మనలో ఉన్న ఇన్‌ఫె¾క్షన్ తొలగించి వేస్తాడు. మనలోని భేదబుద్దిని బయటకు తోసేస్తాడు. 

యశోద కృష్ణుడిని రోటికి బంధించడం, ఆయన దాన్ని ఆనాయాసంగా తెంచేయడం అనే ఎపిసోడ్‌లో కూడా అర్థం దాగుంది. మనస్సనే కుండలో సాధన అనే కవ్వంతో చిలుకు తుండగా వెన్నలుగా ఆయన వచ్చాడు. ఆమె ఆయనని భగవంతుడిగా  గుర్తించలేదు. ఇంకా తన కొడుకే అనుకొన్నది. అపుడు ఆకుండను పగులకొట్టాడు. దానికి ఆమె కోపించి ఆయనని రోటికి కట్టివేయ టానికి ప్రయత్నించింది. ఎన్ని తాళ్లు చాలలేదు. యశోద వేదాద్యయనం చేయలేదు. జ్ఞానం లేదు. కాని తన యొక్క అవ్యాజ్యమైన ప్రేమతో శ్రీకృష్ణుడ్ని బందించగలిగింది. ఆమె ప్రేమ బలమైనది. సాదారణ స్త్రీకి భగవంతుడు భక్తి, వాత్సల్యము చేత బందింపబడ్డాడు. అటువంటి భక్తులను భగవానుడు తన లీలా వినోదంతో bంటర్‌టైన్‌మెంట్ చేస్తాడు. ఎంతసమయం దొరికితే అంత సమయం భగవన్నామ చేస్తూ ఉండాలి. నిరవధికమైన నిష్కామమైన స్మరణ చేస్తుండాలి. సకల బ్రహ్మాండాలను తన ఉదరంలో బంధించిన  పరమాత్మ తనంతట తానే ఉదరాన్ని వెనక్కి తీసుకొని ఆమెకు తనను బందించే అవకాశం ఇచ్చాడు. అలా భగవంతుడు మనము ముందు తీవ్ర ప్రయత్నం తరువాత ఆయనకు సరెండరు అయితే అయన మనకి సహకరించి మనల్ని గెలిపిస్తాడు. విముక్తి చేస్తాడు. అది మన ప్రయత్నం వల్లే అయ్యిందనే భావన కలిగించి మనల్ని ఆనందింప చేస్తాడు. ఆయన లీలలు యశోదకు అర్థం కాలేదు. ఇతను నా కొడుకు. చిన్ని బాలుడు. ఇతను ఇంత అసాధ్యమైన పనులు ఎలాచేస్తాన్నాడు అని ఒకసారి నందుడిని అడిగింది. ఆ విషయం నందుడికి కూడా తెలియదు. నందుడు చెప్పాడు. ఇతను సామాన్యుడు మాత్రం కాదు అన్నాడు. అవతార వురుషుని గుర్తెరిగి వ్యవహరించటం కొద్ది మందికే సాధ్యం. దానికి సుకృతం కావాలి. మనిషి శరీరంలోకి వచ్చిన దేవుడు వ్యవహరించానికి ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థలో మనుషులు కావాలి. అలా ఆయన ఏర్పరచుకొన్న మనుషులకి ఆయన లీలలు అరŠ్దం కావు. అర్హత ఉన్నవారికే అర్ధం అయ్యేవాడే దేవుడు. అర్హత లేనివారికి అర్థం కాదు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళ వ్యవహరం అలాగే ఉంటుంది. తన కార్యం ముగిసే వరకు అవతారపురుషుడు వాళ్ళను అలాగే ఉంచుతాడు. 

పళ్ళు అమ్మే ఆమె అడవిలో పళ్ళు ఏరుకొని వచ్చి అమ్ముతున్నది. కృష్ణుడు తన చిన్ని చేతులతో గింజలు తెచ్చి ఆమె తట్టలో వేసాడు. ఆమె తన తట్టలోని పళ్ళన్నీ ఇచ్చేసింది. తరువాత ఆమె పళ్ళ తట్ట దించి చూస్తే అందులో వెల కట్టలేని మణిమాణిక్యాలున్నాయి. ఆమె ప్రేమతో సేకరించినవి ఇస్తే ఆయన అమÖల్యమైనవి ఇచ్చాడు. మనము ఏదీ ఉత్పత్తి చేయలేదు. సేకరిస్తున్నాము అంతే. అలా సేకరించినవే మనము ఆయనకు సమర్పిస్తున్నాము. మన సొంతమంటూ ఏదీ లేదు. అదీ ఇవ్వటం లేదు. ఆయన సృష్టించినవే ఆయనకు ఇస్తున్నాము. ఆయన సృష్టించినవే ఆయనకు ఇస్తేనే ఆయన వాటికి వేలరెట్లు చేసి మనకి ఇస్తాడు. అదీ ఆయనదే.  మనం దానిని అందరికీ పంచాలి. లోభంతో దోచుకుంటే పాపం. దాచుకోవడమే పాపం. పదిమందికీ పంచడమే పుణ్యం. కృష్ణుడి లీలలు తెలుసుకుని కంసుడు అక్రూరుని ద్వారా ద్వారకకు రప్పించాడు. కృష్ణున్ని సంహరించడానికి అనేకమందిని నియమించాడు.  వాళ్ళందరికి కృష్ణుడు సంహరించాడు. కంసుడు సుమారు 24 ఏళ్ళŸగా వైరి భావంతో కృష్ణుడ్ని ద్వేషిస్తూ వచ్చాడు. అంతిమంగా కృష్ణుడు కంసున్ని సింహాసనం పైనుంచి కిందకు తోసి అతని గుండెలపై కూర్చుని పిడిగుద్దులు గుద్ది చంపేసాడు. కంసుడు శరీరం వదిలేటప్పుడు కూడా వైరి భావంతో కృష్ణుడ్నే ద్యానిస్తూ శరీరం వదిలాడు. అందుకే ముక్తి పొందారు. భాగవతమును నిత్య అధ్యయనం భాగంగా చేసుకోవాలి. సాధుకులకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నిష్కామ భక్తి కలుగుతుంది. జ్ఞానము అభివృద్ది అవుతుంది. భాగవతతత్వాన్ని అర్ధం చేసుకొనే సామర్థ్యం వస్తుంది. దాని వలన తత్వము యొక్క పూర్తి అవగాహన వస్తుంది. అలా అవగాహననకు వచ్చింది. ఆచరణలోకి వస్తుంది. ఆచారణలోకి వచ్చినపుడే అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి పూర్తిగా రా భగవత్ సాక్షాత్కారం చేయిస్తుంది. మనలోని మాలిన్యాలను తొలగిస్తుంది. పావనం చేస్తుంది. కాబట్టి దీనియొక్క నిత్యపారాయణ ఆధ్యాత్మికంగా ఎంతో అనుకూలం. భగవంతుడి యదార్థ స్వరూపాన్ని తెలుసుకొని, ఆస్వాదించి  ఇతరులకు కూడా దీనిని పంచటం కంటె గొప్ప కార్యం ఏమీ లేదు. కాబట్టి భాగవతం యొక్క నిత్య పారాయణం చేయటం, చేయించటం, భాగవత సప్తాహాలు ఏర్పాటు చేయడం, వాటికి సహకరించడం, వాటిలో పాల్గొనడం, భాగవతం పుస్తకాలు అందరికీ పంచడం, ప్రచారం చేయటం ఇలా ఇవన్నీ  ఎంతో పుణ్యకార్యాలుగా భావించాలి. భాగవత పారాయణము పట్ల మాకు ఆసక్తి కలిగించి, భాగవత పారాయణము, శ్రవణం, మననం, మీ ఆధ్యాత్మిక సాధనలో భాగంగా చేసుకోవాలి.