జటప్రోలు సంస్థానం ప్రభువులు వెలమలు. వీరి యింటిపేరు సురభివారు. వీరు రేచర్లగోత్రులు. వీరి మÖలపురుషుడు బేతాళనాయడు. ఇతడు ఈనాటి నల్లగొండ జిల్లాలోని ఆమనగంటి నివాసి.
ఇతని వంశంలో పదమÖడవ తరంవాడు మాదానాయడు. అతడీనాటి అచ్చంపేట తాలూకాలోని గోదలు పరగణాను పాలిస్తుండేవాడు. మాదానాయుని కుమారుడు కుమారమాదానాయుడు. ఇతని కాలంనాటికీ నాటి అచ్చంపేట తాలూకాకు గోదలుసీమ అనిపేరు. అది ఆనాడొక పరగణా. కుమార మాదానాయడు దాన్ని పాలిస్తుండేవాడు.
ఆనాటి విజయనగర ప్రభువు అళియరామరాయలు. ఆ కాలంనాటికి ఈ భూభాగం వారి రాజ్యంగానే ఉండేది. అందువల్ల అళియరామరాజు కుమారమాదానాయని శౌర్య పరాక్రమాలకుసంతసించి క్రీ.శ. 1508లో అతనికి కొత్తకోట, జటప్రోలు, సూగూరు పరగణాలు పారితోషికంగా యిచ్చినాడు. ఈ సంస్థానాన్ని మొత్తం 14 మంది ప్రభువులు క్రీ.శ. 1948 వరకు అనగా 440 సంవత్సరాలు పాలించినారు. ఈ ప్రభువులలో10మంది వారసులు కాగా నలుగురు మాత్రం దత్తువచ్చినారు.
కుమార మాదానాయడుకు మల్లినాయుడు అని మరొకపేరు. ఇతనికి పెద్దినాయడు, మల్లభూపతి అని యిద్దరు కుమారులు కలిగినారు. పెద్దినాయడు తండ్రి పిమ్మట రాజ్యానికివచ్చి తమ్ముని గోదలుసీమకు నియమించి తాను జటప్రోలుకు వెళ్లిపోయినాడు. ఆనాటినుండి క్రమంగా యిక జటప్రోలు అభివృద్ధి అయి ఒక సంస్థానంగా రూపొందింది. కాని యిది రాజధానిగా స్థిరంగా నిలువలేదు. రాజధాని యిక్కడినుండి పదేపదే కదిలింది.
జటప్రోలు కృష్ణాతీర గ్రామం. ఇక్కడ ఒక చిన్న పిట్టవాగు గ్రామం మధ్యనుండి పారుతు ఊరిని రెండుగా విభజించి కృష్ణలో కలుస్తుంది. ఈ వాగు పెంట్లవెల్లి, తూముకుంట మొదలైన గ్రామాలపైనుండి వస్తుంది. కనుక జటప్రోలుకు, పెంట్లవెల్లికి ఈ వాగునుబట్టియే గ్రామనామాలేర్పడినవి.
జట లేదా జడ అనగా నదియొక్కపాయ. ప్రోలు అనగా పట్టణం కనుక జటప్రోలు అనగా నదితీరంలోగల పట్టణం అని అర్థం. దీనికీ పేరు కృష్ణానదీతీరంలో ఉండటం చేతను ఈ నదివల్లను రెండువిధాలగూడ సార్ధకమవుతుంది.
పెద్దినాయని కుమారుడు మల్లభూపతి. ఇతని కొడుకు పెద్దమల్లభూపతి. ఇతని కుమారుడు ముమ్మడిమల్లనాయడు. ఇతని ఆస్థానంలో ఎలకూచి బాలసరస్వతి ఉండేవాడు. మల్లభూపాళీయం అనబడే భర్తృహరి సుభాషితత్రిశతి అనువాదం ఇతని కాలంలోనే రచింపబడింది.
ఇతనికి రామారాయుడు, కుమారమల్లనాయుడు, మాధవరాయడు అనే ముగ్గురు కుమారులు కలిగినారు.తండ్రిపిమ్మట పెద్దవాడైన రామారాయుడు రాజ్యానికి వచ్చినాడు. కాని అతడు జటప్రోలులో నిలువలేదు. రాజధానిని చిన్నమర్రూరికి మార్చుకుని అక్కడినుండి పాలించినాడు. జటప్రోలు సీమలో చిన్నమర్రూరు మిక్కిలి ప్రాచీనగ్రామం.
క్రీ.శ. 13-4-660 నాడు పశ్చిమ చాళుక్యవంశానికి చెందిన మొదటి విక్రమాదిత్యుడు మర్రూరు నుండి వంగూరువాటి విషయంలోని ఈవరంకల్లు (వీపనగండ్ల)ను శివమండల దీక్షా సందర్భంలో సుదర్శనాచార్యులనే ఒక పండితునికి సర్వకర పరిహారంగా దానం చేసినాడు.
రామారాయని పిమ్మట అతని తమ్ముడు కుమారమల్లానాయడు సింహాసనానికి వచ్చి మళ్ళీ జటప్రోలునుండి పరిపాలన సాగించినాడు. అతని పిమ్మట రెండవ తమ్ముడు మాధవరాయలు రాజ్యానికి వచ్చినాడు. ఈ వంశంలో యితడు చెప్పదగిన ప్రభువు. జటప్రోలులో మదనగోపాలస్వామి మందిరం, మంచాలకట్టలో మాధవస్వామిఆలయం కట్టించినాడు. వసుచరిత్రకు ప్రతిగా చంద్రికాపరిణయం రచించినాడు.
ఇతనికి నారాయణరావు, తిరుమలరావు, నరసింగరావు అనే ముగ్గురు కుమారులు కలిగినారు. తండ్రి పిమ్మట నారాయణరావు సింహాసనానికిరాగా ఈ కాలంలో తమ్ముడైన తిరుమలరావు బెక్కెంలో అన్నగారికి ప్రతినిధిగా నిలిచినాడు. ఈ కాలంలో నరసింగరావు చిన్న మర్రూరులో నిలిచి నారాయణరావుగారి పిమ్మట ఆయన మళ్లీ జటప్రోలుసీమను చిన్నమర్రూరు నుండియే పాలించినాడు.
ఇతని కుమారుడు చిన్న మాధవరావు. తండ్రి తరువాత సింహాసనానికి వచ్చి రాజధానిని పెంట్లవెల్లికి మార్చినాడు.
వనపర్తి సంస్థానంలో యాపర్ల, జటప్రోలు సంస్థానంలో పెంట్లవెల్లి ఈ రెండు కృష్ణాతీర గ్రామాలు. యాపర్లలో నది విశాలంగా ఉండి నెమ్మదిగా పారుతుంది కాబట్టి అది అరిగిలి ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉండేది.పెంట్లవెల్లికి కృష్ణ మÖడు పరువులు. అక్కడివారు దాన్ని మంచాలకట్ట దగ్గర దాటేవారు. అక్కడ వేసవిలో కృష్ణను కాలినడకతోనే దాటే వీలుండేది.
ఈ కారణంగా ఆ కాలంనాడు యాపర్ల మరియుపెంట్లవెల్లి రెండుపెద్దవ్యాపార కేంద్రాలుగా అభివృద్ధి పొందినవి. ఆ కాలంలో కొల్లాపురం సంస్థానానికెల్లా పెంట్లవెల్లిదే పెద్ద అంగడి. అక్కడ మంగళవారంనాడు సంత సాగేది. అక్కడి వ్యాపారులకు అంగడినాడు కొన్నబండ్లవారి లెక్కలన్నీచూచి డబ్బుసరిపెట్టేనాటికి మళ్లీరెండవ అంగడి వస్తూనే ఉండేదట.
పెంట్లవెల్లి విశేషించి వెండి బంగారం వ్యాపారాలకు ప్రసిద్ధిగా
ఉండేది. ఆనాటి ప్రజానీకం పెంట్లవెల్లిలో బంగారం వాసన గొడుతుందనే వారు.పెంట్లవెల్లి వెండి అంటే పూర్వం ఎవరైనా కన్నులు మÖసికొనేవారు. అనగా అక్కడ అంత నమ్మకంగా ఉండేదని అర్ధం.
పాలమÖరు జిల్లాలో క్రీ.శ. 1916లో రైలు ప్రారంభమయింది. కనుక జడ్చర్లకు రైలు వచ్చేనాటికి అక్కడ sTÖనాటి కాంటా వ్యాపారం లేదు. అయితే జడ్చర్ల కంటే ఎంతో మొదలే పెంట్లవెల్లి వర్తకులక్కడ కాంటావ్యాపారం ప్రారంభించినారు. కాబట్టి ఈ జిల్లాలోని దక్షిణభాగంయొక్క భర్తీ అంతా ఆనాడు పెంట్లవెల్లికె వెళుతుండేది. వ్యాపారరీత్యా ఆనాడు పెంట్లవెల్లిలో దొరకని వస్తువుండదనేవారు.
నిజాం రాష్ట్రానికి క్రీ.శ. 1880 పిమ్మట హ్యాంకిడ్‌దొరపోలీసు జనరల్ ఇన్‌స్పెక్టర్‌గా వచ్చినాడు. ఈయన రాష్ట్రంలో ఉన్న పేరుచెందిన డాకూలందరిని సమీకరించి ఈనాటి లింగాలలో సెటిల్‌మెంటేర్పాటుచేసి అక్కడ ఉంచిన వారికందరికి ఉదయం సాయంకాలం ఠానాలో హాజరియిచ్చే ఏర్పాటు చేసినాడు.
అయితే అప్పటి దొంగలు సామాన్యులుగారు. కన్నుండగానే కనుపాపను తీసేవారట. వారు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఠానాలో హాజిరి యిచ్చి దొంగతనానికి వెళ్లి వారెంత దూరంలో దొంగతనం చేసినా ఆ సొత్తునదే రాత్రి పెంట్లవెల్లికి చేర్చి అమ్ముకొని తెల్లవారేవరకు మళ్లీ యిల్లు చేరుతుండేవారట. ఈ విధంగా పెంట్లవెల్లి ఆనాడు దొరలకు, దొంగలకు గూడ వ్యాపారకేంద్రంగా
ఉండేదంటారు.
చిన్నమాధవరావు పెంట్లవెల్లికి తన రాజధానిని మార్చి దాని అభివృద్ధి కొరకు, మాధవరాయలు జటప్రోలు కొఱకు పాటుపడి అక్కడ ఈనాటి కేశవాలయం మరియు శివాలయం కట్టించినాడు.తండ్రిపేర నరసారాయనిపేట స్థాపించినాడు. అక్కడ పెరుమాండ్ల చెఱువు వేయించి దానిక్రింద అన్ని వర్గాలవారికి వృత్తులను కల్పించినాడు. శేషభట్టరు సింగారాచార్యులచే శూద్రస్మ ృతి వ్రాయించి దానిని కృతి పొందినాడు. ఇంకా అనేకమైన ధర్మకార్యాలు చేసినాడు.
ఈ చిన్నమాధవరావు కుమారుడు బారిగడుపులరావు. ఇతనికాలంలో ఆలేరు, పెద్దపల్లి దొరలు సర్కారుకు తమపేష్కష్‌బాకి పడి యితనినాశ్రయించగా ఈయన వారికి చెల్లించి వారి మఖ్తాలు మళ్లీ వారికి నిలిపినాడు. కానీ ఇతనికి సంతానం కలుగలేదు. అందువల్ల యితనితో పెద్దినాయని వంశం ఆగిపోయింది.
బారిగడుపులరావు తమజ్ఞాతులైన మల్లినాయని వంశంనుండి లింగాలనుండి, పెద్దరామరాయలను దత్తుతీసుకొన్నాడు. ఇతడు మళ్లీ జటప్రోలునుండి పాలించినాడు. ఇతని కుమారుడు రాజాజగన్నాథరావు. ఇతనికి మళ్ళీ సంతానం కలుగకపోగా ఓరుగల్లు మండలంలోని పాకాల తాలూకాలోగల గురిజాలనుండి వెంకటలక్ష్మారావును దత్తుతీసుకోగా ఈయన ఎల్లూరునుండి జటప్రోలుసీమను పాలించినాడు.
ఈయన అక్కడుండగా ఇతనిపై మగతలనుండి నాగనగౌడు దండెత్తగా అతనిని ఓడించి ఆ చిహ్నంగా ఇతడు కొల్లాపురంలో ఇపుడున్న కోటను కట్టించినాడు. అంతవరకు దానికి కొలుములపల్లె అని పేరు. ఆయన తాను కొత్తగా కోటకట్టించిన పట్టణం లక్ష్మీనివాసం కావలెననే భావనతో దానికి కొల్లాపురం అని పేరుపెట్టి క్రీ.శ. 1840 నుండి కొల్లాపురాన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఈ విధంగా క్రీ.శ. 1508లో ప్రారంభమైన జటప్రోలు సంస్థానానికి 280 సం.రాల పిమ్మటగాని ఈనాటి కొల్లాపురం రాజధాని పట్టణం కాలేదు.
కొల్లాపురంలోని ఈనాటి అమరేశ్వరాలయం ఈ వెంకటలక్ష్మారావే కట్టించినాడు. ఇతనికి గూడా మళ్ళీ సంతానం కలుగలేదు. అందువల్ల అతడు తమ జన్మ గ్రామమైన లింగాల నుండి వెంకటజగన్నాథరావును దత్తుతీసుకున్నాడు. ఇతడు క్రీ.శ. 1851 నుండి 54 వరకు మాత్రమే రాజ్యంచేసినాడు.
ఇతనికి గుఱ్ఱప్పందేలపై ఎక్కువ మోజు ఉండేది. బెంగుళూరు, మద్రాసు రేసుల్లో చాలాసార్లు గెలిచినాడు. దైవభక్తికూడా యితనికి బాగానే ఉండేది. సింగపట్నం నృసింహస్వామికి ఆలయంకట్టించి ీVAసదుర్గం క ృష్ణమాచార్యులతో ఆ స్వామిపై ‘నృసింహవిలాసం’, మదనగోపాలస్వామిపై ‘మదనగోపాల మహత్యం’ కావ్యాలను వ్రాయించి అతనిని గొప్పగా సన్మానించినాడు.
ఇతనికి గూడా సంతానం కలుగలేదు. అందువల్ల ఈయన యాచమనాయని వంశస్థులైన వెలుగోడునుండి నవనీతకృష్ణయాచేంద్రుని క్రీ.శ. 1879లో దత్తుతీసుకుని అతనికి తమ తండ్రిపేర వెంకటలక్ష్మారావని పేరుపెట్టినాడు.ఈయనకు పట్టణాభివృద్ధిపై మిక్కిలి శ్రద్ధ ఉండేది. అందువల్ల వీధులన్నీ చక్కగాతీర్చి కట్టించినాడు. అంతేకాక కొల్లాపురంలో తండ్రిపేర జగన్నాథబాగ్ అనే తోట, సింగపట్నంలో, తాతగారిపేర మరోతోటను వేయించినాడు.అమరేశ్వరునికి రథోత్సవం కూడా ఏర్పాటుచేయించినాడు.
ఈయనకు కూడా సంతానం కలుగలేదు కనుక ఇతని మరణానంతరం రాణివెంకట రత్నమాంబ తమ భర్త యొక్క తండ్రి వంశంనుండి బొబ్బిలి రాకుమారుడు జగన్నాథరావును దత్తుతీసుకున్నది. ఇతని కాలంలోనే భారతదేశానికి స్వాతంత్య్రంవచ్చి సంస్థానాలన్నీ స్వతంత్రభారతదేశంలో లీనమైనవి.
జటప్రోలు సంస్థానం: గతశతాబ్దిలో ఈ జిల్లాలోని సంస్థానాలలో గీర్వాణభారతికి కొన్ని అక్షంతలుచల్లి ఇంతపత్రినిబెట్టి హారతులెత్తి పూజించిన కవిపండిత కుటుంబాలెన్నో ఈ జిల్లాలో ఉన్నవి. అట్టివారిలో కొల్లాపురం సంస్థానంలో అక్షింతలవారిదొకటి.
జగమెరిగిన పండితులైన ఈ వంశీయులు కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల తాలూకాలోగల హరివరంనుండి sTÖ జిల్లాలోనికి కాలు పెట్టినారు. ఈ వంశంలో సుబ్బాశాస్త్రిగారు ప్రముఖుడు. ఆయన తన పాండిత్య బలంతో సుబ్బాత్రయంలో ఒకడై నిలచినాడు.
సుబ్బాశాస్త్రి గారి తండ్రి సింగరశాస్త్రిగారు గొప్ప పండితుడు. ఆనాటి విద్వత్సభలన్నింటిలో ఉత్తమోత్తమ బహుమతులందుకున్నాడు. ఆయన అనంతరం సుబ్బాశాస్త్రిగారొకపుడు గద్వాలకువెళ్లి తమ తండ్రిగారి బహుమతిని తమకిమ్మనగా అదివిని రాజావారు నవ్వి మీరు మీ తండ్రిగారంత పండితులైనపుడు అలాగే యిస్తామన్నారు. ఆ మాటలువిని ఆయన పండిత పుత్రుడనిపించుకోవట మిష్టంలేక పౌరుషపడి యింటికి వచ్చి ఆ రాత్రే భార్యకు, తల్లి గారికి చెప్పకుండ యిల్లు విడిచి కాశీకివెళ్లి చంద్రనారాయణ భట్టాచార్యులనే పండితుని సేవించి నాలుగేండ్లలో తర్క వేదాంత పూర్వోత్తర మీమాంసలలో ఉద్ధండుడైనాడు.
కాశీవాసఫలమాయన కేకసంథాగ్రాహిత్వాన్ని ప్రసాదించింది. విద్యానంతరం గురువుగారిని సెలవడగగా ఆయన యితని ప్రతిభను చూచి మీరొకరు పండితులైతేచాలునా! నా కుమారునికిగూడ నాలుగక్షరాలు చెప్పగూడదా” అన్నాడు. అదివిని ఆయన తన పయనం మానుకుని మరో నాలుగేండ్లక్కడనే ఉండి గురువుగారి కుమారుని తనంతవానిని చేసి తండ్రిగారి సముఖంలో అతనిని వాదాలలో గెలిపించి గురువు ఋణం తీర్చుకొని యిల్లు చేరినాడు.
ఇల్లు చేరిన పిమ్మట శాస్త్రిగారు గద్వాల, ఆత్మకూరు సంస్థానాలలో భూరిసత్కారాలు పొందినాడు. వీరికృతి ‘భాష్యార్థ రత్నమాల’. అది వ్యాస సూత్రాలకు గల శంకరభాష్యం సుబోధం చేయటానికి చేసిన రచన. దీనిలో పూర్వపక్షాలు సిద్ధాంతాలు అన్ని ఆర్యావృత్తాలలోనే ఉంటవి. ఆచార్య శంకరుడు ఆర్యాంబా శివ గురువుల పుత్రుడు కనుక శాస్త్రిగారు ఆర్యావృత్తాన్నెన్నుకొని ఈ కృతికౌచిత్యం చేకూర్చినాడు. వీరికి సీతారామ శాస్త్రి, సింగర శాస్త్రి అని యిద్దరు కుమారులు కలిగినారు. వారిలో సింగర శాస్త్రి మళ్లీ పెద్ద పండితుడై, కవియై తండ్రిగారివలె ఆత్మకూరు, గద్వాల, వనపర్తి సంస్థానాలలో సన్మానాలు పొందటమే కాక, కడపలోని వేదాంతసభకు కొంతకాలం పరీక్షాధికారిగా కూడ పనిచేసినాడు.
పల్లావారు :
ఈ జిల్లాలో అక్షంతల వారు, పల్లావారు, మామిళ్లపల్లి వారు, వెలిదండవారు ఒకే గోత్రానికి చెందుతారు. అంతేకాక ఈ కుటుంబాల వారందరూ పండితులు. పల్లా వారిలో మొదట చెప్పదగినవాడు నారాయణాధ్వరిగారు, ఆయన
సంస్క ృతాంధ్రాలలోను సంగీత సాహిత్యాలలోను దిట్ట. సోమయాగం చేసి సోమయాజియైనాడు. ఆయనతో ఈ యాగం చేయించినవాడు తాడూరు శేషశ్రౌతి నారాయణాధ్వరి. రామోపాసనలో మునిగి తేలి చివరి దశలో తురీయాశ్రమం స్వీకరించి తన పేరును కృష్ణానందుడని మార్చుకున్నాడు. ఈయన రామోత్సవరత్నాకరం, రామోపాసనా పద్ధతి అనేకృతులు ఆరాధ్యశాఖలో అపూర్వం మరియు అనుపమమైన కృతులు. ఇవి చక్కగా పునర్ముద్రింపదగినని.
నారాయణాధ్వరిగారికి పురుష సంతానం లేదు. ఆయన కూతురిని అనంత పంతుల సీతారామ సిద్ధాంతిగారికిచ్చినారు. ఈయన శివరాజ బహద్దూరు ఎస్టేటులోని సింగంపల్లి నివాసి, అగ్రహారికుడు. అందుచేత ప్రజలీయనను సింగంపల్లి సిద్ధాంతి అని అన్నారు. ఈయన స్వగ్రామం విడిచి కలువకుర్తిలోనే ఉండేవాడు. ఈ సిద్ధాంతి గారు కోనసీమ మరియు రాజమండ్రిలో చదివి జ్యోతిషంలోని గోళాధ్యాయంలో దిట్టయై అనంతరం ముప్పదేండ్లు పరిశ్రమించి ముప్పదేడు ఉపపత్తులతో ‘భూభ్రమణ భ్రాంతినిరసనం’ అనే సిద్ధాంత గ్రంధం రచించినాడు. దీనికి ‘జ్యోతిష తత్వ ప్రదీపిక’ అని పేరు. ఇది పితాపుత్ర సంవాద రూపంగా రచింపబడిన కృతి. వీరి కుమారుని పేరు శివరామసిద్ధాంతి. వీరు మొదట దీనికి భూభ్రమణ భ్రాంతి నిరసనమనే పేరు పెడుదామనుకొన్నారట కాని అది ఆంగ్లేయులకాలం. భూభ్రమణ సిద్ధాంతాన్ని మొదట కనిపెట్టి ప్రచారానికి తెచ్చింది వారే. కాబట్టి భూభ్రమణ భ్రాంతి నిరసనమనే పేరు ఆ కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకమని భయపడి ‘జ్యోతిషతత్వ ప్రదీపిక’ అని పేరును మార్చినాడట. ఇది ఆనాటి కాల పరిస్థితి. ఈ గ్రంథం ఆనాడు పలువురి మన్ననలందింది.
సీతారామసిద్ధాంతి గారు తర్కంలో బాగా ఆరితేరినవారు కనుక ఎవరినీ పడనిచ్చేవారుగారు. చివరి దశలో వీరి మామ నారాయణాధ్వరిగారు కలువకుర్తిలోనే ఉండి అక్కడనే సమాధి చెందినాడు. వీరి సమాధి నక్కడ సిద్ధాంతిగారే కట్టించినారు గాని అదిపుడులేదు. పల్లావంశంలో మరో చెప్పదగిన పండితుడు కడుకుంట్ల పాపాశాస్త్రిగారు. ఆయన ఉభయభాషాకవి “భారత సంగ్రహం’ అనే పన్నెండు గుచ్ఛాల కావ్యం రచించినాడు. చిన్న వయస్సులో పద్దెనిమిదేండ్లకే గతించినాడు. ఈ వంశంలో మరో ప్రముఖుడు కేతేపల్లి చంద్రశేఖర శాస్త్రిగారు, ీVAసదుర్గం కృష్ణమాచార్యులు, పురాణం నరసింహాచార్యులుగారలు కొంతకాలం సంసారం చేసిన పిమ్మట ఆశ్రమ స్వీకారం చేసి దేవాధిపతులుగా వెళ్ళినారు. కాని వారు ప్రధమంలోనే కొంతకాలం విరూపాక్ష పీఠాధిపతులుగా ఉండి తదనంతరం గార్హస్థ్యం స్వీకరించి ఎందరికో విద్యాదానం చేసినారు. రస నిరూపణం, శంకరపూజ, సవినాయక నవగ్రహార్చన పద్ధతి వీరి కృతులు. కాని ఇవేవి ముద్రణ కాలేదు. ఈ వంశంలో ఏదుట్ల వెంకట కృష్ణయ్యగారు మరో పండితుడు. కవి మరియు తాత్వికుడు. ప్రాచీనాధునిక సమన్వయంలో ప్రతిభాశాలి, సంస్క ృతంలో ఈయన చాటు శ్లోకాలు చాలానే ఉన్నవిగాని అవేవి గ్రంధరూపం ధరించలేదు.
వెల్లాలవారు - గత శతాబ్దిలో తమ కీర్తిప్రతిష్ఠలతో జటప్రోలు సంస్థానాన్ని వెల్లవేసిన వారిలో వీరొకరు. ఈ వంశీయులు పదారవ శతాబ్ది ప్రధమపాదం దాటిన పిమ్మట తమ జన్మభూమియైన వెల్లాల నుండి దేశాటనానికి బయలుదేరి మొదట మా జిల్లాలోని ఆలంపురంచేరి అక్కడ కొంతకాలం నిలిచి పండిత సత్కారాలు పొంది, అక్కడినుండి జటప్రోలుకు వచ్చినారు. వీరు స్మార్తులు, భరద్వాజసగోత్రులు. అయ్యవారి పల్లెలో నివసించినారు. ఈ వంశంలో ఎందరో పండితులున్నారు. ఈ వంశంలో జ్యోతిష్య పండితులెక్కవ. వారిలో మొదట తెలిసినవాడు ఎల్లాజోస్యులు. ఆయన ఎల్లలులేని పండితుడు. జీవించినంత కాలం పంచాంగ గణనం చేసినాడు. ఈయన దగ్గర ఎందరో ఆ విద్యను నేర్చుకొని తమ పంచాంగాలలో ఇతనిని గొప్పగా స్తుతించినారు. ఎల్లాజోస్యుల పిమ్మట చెప్పదగినవాడు వేంకట సోమయాజులు. ఈయన అీVAబలనాథీయమనే జ్యోతిషగ్రంధాన్ని రచించినాడు.
ఈ వంశంలో అందరికంటే గొప్పగా చెప్పదగినవాడు అభినవ కాళిదాస బిరుదాంచితుడైన త్య్రంబికశాస్త్రిగారు. ఈయనగారి ‘భాగవత చంపువు’ ప్రసిద్ధం. దానిలో ఇతడు తనను పార్వతీ దేవికి మÖడవ బిడ్డడని చెప్పుకున్నాడు. ఈ చంపువుకు పక్షధరీయం అక్కయ్యశాస్త్రిగారు “రత్నావళి” అనే వ్యాఖ్యను రచించి దానిలో “పక్షధరీయం” తనకు నామాంతరమని తెలిపినాడు. ఈయన తన వంశం పేరు చెప్పుకున్నా ఎల్లాజోస్యులను మరియు త్య్రంబకశాస్త్రిని స్తుతించినాడు. కాబట్టి ఇతడు వెల్లాల వంశీయుడే అని పరిశోధకుల మతం. ఇతనిది ‘త్యర్థి’ గూడ ఒకటి ఉందటగాని అది లభించలేదు. ఈ వంశీయులు తాము అభినవ కాళిదాసు వంశీయులమని, అక్కయ్యగారికి శిష్యులమని చెప్పుకోవటానికి గర్విస్తారు.
ఈ వంశంలో మరోకవి ఉమామహేశ్వరశాస్త్రిగారు. ఈయన పక్షధరీయం అక్కయ్య గారి శిష్యుడు. ఇతని తత్వచంద్రిక ప్రసిద్ధం. ఇది రామానుజుల శ్రీ భాష్యవిమర్శనం. ఇదేకాక ఈయన ఇంకా అద్వైత కామధేనువు, పాణినీయ వాదనక్షత్రమాల, విరోధవరూధిని, వేదాంత సిద్ధాంతసారం, సంతాన దీపిక అనేకృతులు రచించినాడు.
ఈ వంశంలో గత శతాబ్దిలో సదాశివశాస్త్రిగారు మళ్లీ చెప్పదగిన పండితుడు. కొల్లాపురంలోని ఆస్థాన పండితుడు. వీరికవధానం శేషశాస్త్రిగారు వేలు విడిచిన మేనల్లుడు. బాల్యంలో అతనితో కలసి కాశికి వెళ్లి విశ్వనాథŠ భట్టాచార్యుల చెంత ఆరేండ్లు చదువుకొని భాష్యాంత వైయాకరణియై తర్కాలం కారాలు కూడ చదువుకొని యిల్లు చేరినాడు.
అవధానం శేషశాస్త్రిగారు బాల్యంలోనే ‘కన్యకాంబా చంపుపు’ రచించి ముద్రింపించినాడు. సదాశివ శాస్త్రిగారి కృతులలో శాస్త్ర గ్రంథాలు మరియు చరిత్ర లెక్కువ. వీరు రాజస్థానంలో తమ పాండిత్యబలం చేతనే స్థానం కల్పించుకున్నారు. కనుక ఆ కాలంలో వీరికి మరియు సమకాలికులకు ఎప్పుడు ఏదో ఒక వాదముండేది. ఆ ఘర్షణలే వీరిని ఒక రచయితగా చేసినవి. వీరికృతులలో విమర్శలే ఎక్కువ. వానిలో త్రిరాత్ర, దశరాత్రా శౌచనిర్ణయం, స్త్రీ పునర్వివాహనియమం, ధర్మశ్రాద్ధ నిర్ణయం, ఖండనాభాస నిరాసనం అనేవి మాత్రమే సంస్క ృత రచనలు, తక్కినవన్ని తెలుగు రచనలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి