వెట్టిచాకిరీ కార్మికులు ఎక్కవగా బాతులు మేపేవారు, అలాగే సుబాబుల్ దుంగలు కొట్టేవారే ఎక్కువగా కనబడతారు అని గ్రామీణ పేదరిక నిర్మూలన యన్జీవోలో పనిచేసే రమేష్ చెబుతాడు. బాతులు మేపడానికి ఎక్కవగా పిల్లలను కార్మికులుగా ఎంచుకుంటారు. ఎందుకంటే తప్పించుకు పోయే బాతులను పల్లెలో పిల్లలు చురుకుగా పరుగెత్తి వాటిని గుంపులో కలుపుతారు. బాతు రైతులు ఎక్కువ ఎరుకల వారే వుంటారు. వీరు కూడా గిరిజనులే. వీరే యానాదులను కూలీలుగా, జీతగాళ్ళుగా పెట్టుకుంటున్నారు. ఇలా పని చేసే చోట వారికి కరెంట్ కాని సమయానికి భోజనం కాని ఉండదు.
నిర్బంధ కార్మిక వ్యవస్థ ఎలా విస్తరిస్తున్నదో పూర్తి వివరాలను సేకరించాలని సుప్రీంకోర్ట్ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ ఆదేశం ప్రకారం 1996 లోగా అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడ సర్వే నిర్వహించబడింది. అయితే ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో నిర్బంధ కార్మికులకు సంబంధించి ఒక కేసు కూడా లేదని, మరో మాటలో గుర్తించబడలేదని తేలింది. అయితే తదనంతరం 2004 సంవత్సరం వచ్చేటప్పటికి 37,988 మంది నిర్భంధ (వెట్టి చాకిరి) కార్మికులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించబడింది అని జవహర్‌లాల్ యÖనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ రవి యస్. శ్రీవాస్తవ “భారతదేశంలో నిర్బంధ కార్మికులు” అనే తన నివేదికలో పేర్కొన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు నిర్బంధ కార్మిక వ్యవస్థ మీద క్రమబద్ధమైన సర్వే జరగలేదు. నిర్భంధ కార్మికులు ఎక్కవ వ్యవసాయ మరియు వ్యవసాయేతర రంగంలో కొనసాగుతున్నారు. సాంప్రదాయ వృత్తులలో ఈ వ్యవస్థ వున్నప్పటికి అది చాలా తక్కువ స్థాయిలో వుందని కూడ ప్రొఫెసర్ శ్రీవాస్తవ చెప్పాడు.
అయితే ప్రస్తుత (2025) ఆంధ్ర ప్రదేశ్ నిర్భంద (వెట్టిచాకిరి) కార్మికుల విషయానికి వచ్చినపుడు గత రెండు సంవత్సరాలలో 402 మంది నిర్భంధ కార్మికులు రక్షించబడినప్పటికీ నిర్భంద కార్మికులుగా పని చేయించుకున్న యజమానులు కేవలం ఏడుగురి మీద మాత్రమే కేసు నమోదైనదని (ఖీI= చేయబడ్డవి) వెట్టిచాకిరి విమోచన సంస్థ సభ్యులు చెప్పారు. ఇలా జరగడానికి కారణం ఇప్పటికీ నిర్భంద (వెట్టి చాకిరీ) కార్మికులను గుర్తించి, రక్షించడానికి అలాగే వారికి పునరావాసం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ప్రామాణికమైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవడమే. మరో వైపు తమిళనాడు మరియు ఢిల్లీ రాష్ట్రాలలో నిర్బంధ కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించి దృఢమైన ప్రణాళిక వుంది అని వెట్టి చాకిరీ విమోచన సంస్థకు చెందిన కుమార్ చెప్పాడు.
ఎవరైన నిర్బంధ (వెట్టిచాకిరీ) కార్మికులచేత పని చేయించుకుంటే అటువంటి వారిపైన చట్ట పరమైన చర్యలు తీసుకుంటే వారికి మÖడు సంవత్సరాలు జైలు శిక్షపడుతుంది. కాని ఎంతమందికి శిక్షలు పడుతున్నాయనేది ప్రశ్న. నిర్బంధ కార్మికులను గుర్తించడానికి జిల్లా స్థాయిలో పర్యవేక్షించడానికి ప్రభుత్వ అధికారుల కమిటీ వుండాలని చట్టంలో స్పష్టంగా ఆదేశించబడింది.
ఇటువంటి కమిటి ఒకటి ప్రకాశం జిల్లాలో మాత్రమే వుందని కుమార్ చెప్పాడు. ఈ నిర్బంధ కార్మిక నిర్మూలణ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ, గిరిజన, సాంఘిక సంక్షేమం, కార్మికశాఖలో ఏ శాఖ అధికారిదో మేము ఖచ్చితంగా చెప్పలేమని ఆ శాఖల అధికారులు చెప్పారని కూడ కుమార్ వివరించారు.
నిర్బంధ కార్మికుల చేత పెట్టిచాకిరి చేయించుకోవడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని వెంకటేశ్వర్లు అన్నాడు. నిర్బంధ వెట్టి చాకిరి కర్మికులను గుర్తించి, రక్షించి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక నోడల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. నిర్బంధ కార్మికులు తమ బాధలు చెప్పుకోవడానికి ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నంబర్ సౌకర్యం కల్పించాలి. బహుశా ప్రత్యేక నోడల్ విభాగం, అలాగే టోల్ ఫ్రీ నంబర్ సౌకర్యం వుండి వుంటే అంకమ్మ తన కొడుకును పోగొట్టుకునేది కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి