మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2026, శుక్రవారం

అవశ్యాచరణీయ ధర్మాలు


మన సంస్కృతి నిరంతరం ప్రవహించే పవిత్ర గంగా నదిలాంటిది. ఆ నదిలో పుణ్య స్నానమాచరించగోరే పునీతులకు ఆవశ్యాచరణీయ ధర్మాలు మన వేదాల్లో అత్యద్భుతంగా వివరించబడ్డాయి. తైత్తరీయారణ్యకములో విశదము చేసిన మానవ ధర్మాలు... 

తైత్తరీయారణ్యకము:- 

01 సత్యం వద. ధర్మం చర. స్వాధ్యాయాన్మా ప్రమదః 

భావము:- సత్యమును పలుకుదుము గాక, ధర్మమును అనుష్ఠింతుముగాక స్వాధ్యాయము మరవకుండుముగాక. ఔన్నత్యమును పొందుదము గాక. 

02. ఆచార్యాయ ప్రియం ధనం ఆహృత్య ప్రజా తంతుం

మా వ్యవచ్చేత్సీః సత్యాన్న ప్రమదితవ్యం. ధర్మాన్నప, మదితవ్యం. 

భావము: - గురువునకు ప్రియమగు ధన మార్జించి యిచ్చిన పిమ్మట వంశము నిలుపుటకై గృహస్థ ఆశ్రమం స్వీకరించెదము గాక, 

సత్యమార్గమును విడనాడకుందము గాక. ధర్మ మార్గమును వీడకుందుము గాక. 

03. కుశలాన్న ప్రముదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం

స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నప్రమదితవ్యం. 

భావము:- కుశలమైన కల్యాణ కారకమైన కర్మల నుండి, సమృద్ధి నుండి, స్వాధ్యాయ ప్రవచనముల నుండి, తొలగి పోకుండా నిరంతరం వాటిని ఆచరింతము గాక.. 

04. దేవ పితృ కార్యాభ్యాం నప్రమదితవ్యం మాతృ దేవో భవ

పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. 

భావము:- దేవ పితృ కార్యములను విడువ కుందముగాక, తల్లిని, తండ్రిని, గురువును, దైవముగా భావింతుము గాక. అతిథిని దైవముగా భావించి గౌరవించెదము గాక, 

05. యాన్య నవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని, నో ఇతరాణి. 

యాన్య స్మాకర్ సుచరితాని తాని త్వయోపాస్యాని, నో ఇతరాణి. 

భావము:- నింద్యము కాని కర్మలను ఆచరింతుము గాక, నింద్య కర్మలు ఆచరింప కుందుము గాక. ఆర్యులు ఆచరించిన సత్ కర్మ లేవి యుండునో వాటినే ఆచరింతుము గాక, ఇతరములగు నింద్య కర్మలు విడిచి పెట్టుదుము గాక. 

06. ఏకేచాస్మచ్చేయాగ్ సో బ్రాహ్మణాః

తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం. 

భావము:- సత్ పురుషులైనవారు, మన శ్రేయస్సుకోరు వారు ఎవరో వారిని మనం గృహమునకు హృదయపూర్వకంగా ఆహ్వానించి సుఖాసీనులను జేసి, సేద తీర్చి వారి బోధనల సారమును గ్రహింతుము గాక. 

07. శ్రద్ధయా దేయం.. అశ్రద్ధయా దేయం. 

శ్రియా దేయం. ప్రియా దేయం. 

భియా దేయం. సంవిదా దేయం. 

భావం: గురువులకు ఏదైనా సమర్పించు నపుడు శ్రద్ధతో ఇవ్వవలెను. అశ్రద్ధతో నీయ రాదు. హెచ్చుగా ఇవ్వలేకపోయానే అనే భావంతో ఇవ్వవలెను. భయ భక్తులతో సంపదకు తగినట్లుగా ఇవ్వవలెను. 

08. అథ యది తే కర్మ విచికిత్సావా వృత్త చికిత్సా వా స్యాత్ అథా భ్యాఖ్యాతేషు యే తత్ర బ్రాహ్మణాః సమ్మర్శినః యుక్తా అయుక్తాః అలూక్షాః ధర్మ కామాః స్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః 

భావము:- ధర్మ సంశయము కలిగినప్పుడు ధర్మాధర్మ నిర్ణయ సమర్థులు, ఆచార్య పురుషులు, కర్మ స్వతంత్రులు, పరమ సౌమ్యులు, ధర్మ కాములు అగు మహానుభావు లెట్లాచరించిరో ఆయా సందర్భములలో అట్లే ఆచరింప తగును. 

09. ఏష ఆదేశః ఏష ఉపదేశః, ఏషా వేదోపనిషత్

ఏతదనుశాసనం, ఏవ ముపాసితవ్యం. ఏవ ముచైతదుపాస్యం. 

భావము:- ఈ పైన చెప్పినదే ఆదేశము. ఇదే ఉపదేశము, ఇదే వేద రహస్యము. ఇదే ఈశ్వరానుశాసనము. దీనిని ఆచరింతురు గాక. ఇదే ఆచరణీయం 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి