సీమంతం ఒక అవగాహన, మన జీవనం సుఖంగా, సంతోషంగా, మంగళకరంగా, ఆరోగ్యంగా ఆహ్లాదంగా కొనసాగాలని మన పెద్దలు షోడశ సంస్కారాలను ఏర్పాటు చేసారు. ఇవి వ్యక్తి యొక్క జననం నుండి మరణం వరకు ఆయా సందర్భాలలో జరుపబడే అవసరము, అనివార్యమÖ అయిన సంస్కారాలు అందులో ఒకటి సీమంతం”.
గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కొరకు, వేదనా రహిత సుఖప్రసవం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ సంస్కారం గృహస్తులు తప్పక ఆచరించాలని, ఇది ఒక సత్సాంప్రదాయమని, మనందరికీ తెలుసనుకుంటాను.. ఈ సంస్కారం ఒక వేడుకగా, ఉత్సాహంగా నిర్వహించడం అభిలషణీయం. ముదావహం. అయితే ఈ సంస్కారం లో ఎన్నో ఆరోగ్యకర, ఆధ్యాత్మిక విషయాలు నిక్షైప్తం చేయబడ్డివి.
సీమంతం అంటే సీమ G అంతం = సీమంతం. స్త్రీ నుదుటి మీద కనిపించే పాపిట సహస్రారం దగ్గర మొదలై నుదిటి మీద అంతమౌతుంది. ఈ స్థానంలోనే వివాహిత స్త్రీలు మంగళకరమైన కుంకుమను, దాని క్రింద బొట్టును ధరించి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా కనిపించటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సీమంత స్థానం తేజోవంతమైన స్థానం.
అక్కడ కుంకుమ - గంధం కలిపి వుంచటం వల్ల ఆతేజస్సు అంతర్ముఖమైతే ఆ స్త్రీ మÖర్తి వదనం పవిత్రతను సంతరించుకుంటుంది. గర్భిణీ స్త్రీలకు సాధారణంగా5, 7, 4వ నెలలో శుభ తిధి, శుభనక్షత్ర, శుభ లగ్నములలో (అష్టమి శుద్ధి కల లగ్నం) తారా బలము, చంద్ర బలము కలిగిన శుభముహూర్తాన బంధు మిత్రులతో కలిసి ఒక వేడుకగా చేసుకునే ఈ కార్యక్రమంలో మొట్టమొదట గర్భిణీ స్త్రీ భర్త ఈ లలాటం పై ఉన్న సీమంతం దగ్గర కుంకుమ మరియు గంధం అక్షితలను వుంచి దీవించాలి..
ఆ పిదప నూతన వస్త్ర స్వర్ణాభరణములతో ఆ స్త్రీ మÖర్తిని అలంకరించి, అభినందించి ఆశీర్వదించాలి. మృష్టాన్న భోజనముతో, నృత్య గాన వినోదములతో ఆ కాబోయే మాతృ మÖర్తిని ఆనందింపజేయాలి. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఆ స్త్రీకి శారీరిక మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఇది సుఖ ప్రసవానికి దోహదపడుతుంది. సీమంతం అంటే గ్రామ పొలిమేర 5నెల నుండి గర్భిణీ స్త్రీలు గ్రామ పొలిమేరను దాటరాదు..
సీమంతాన్ని శ్రీమంతంమని కూడా కొందరు అంటారు. శ్రీమంతం శ్రీమాత్రే కి పర్యాయపదంగా కల్పన చేసి ఆ స్త్రీ మÖర్తి ని గౌరవించడం. శ్రీ అంటే సంపద అని సౌభాగ్యమని లక్ష్మీ రూపమనీ, భావించి, అవన్నీ ఈ శ్రీమంత కార్యక్రమం ద్వారా అమ్మ కాబోయే ఆపన్న సత్వగర్భిణీ (స్త్రీ) కి కలగాలని ఆశించి, ఆకాంక్షించి, ఆపేక్షించి చేసే పోడశకర్మయే శ్రీమంతం...
ఈ సందర్భంగా లలితా సహస్రనామాలలోని అత్యంత రమణీయ కమణీయ నామం అవధరించండి
సీమంతం (Sవవఎaఅtష్ట్రaఎ)
శృతి సీమంత సింధురీ కృతి పాదాబ్జ ధూళికాయై నమః
శృతులు అంటే నాలుగు వేదాలు అమ్మాయిల వేషాలలో వచ్చి లలితా మాతాపాదాలకు వంగి నమస్కారం చేయగా ఆ అమ్మాయిల సీమంత సింధూరం అమ్మవారి పాదాలకు తగిలి మెరిసిపోయాయట. అలాంటి పాదాలకు మా నమస్కారము. గర్భిణీ స్త్రీ మÖర్తిని గౌరవించడం అభినందించడం ఆశీస్సులను అందజేయడం అనే ఒక షోడశ సంస్కారమే సీమంతం. గర్భిణి స్త్రీ మÖర్తి యొక్క ఐదవ నెలలో లేక తొమ్మిదవ నెలలో నిర్వహించే ఒక సాంప్రదాయ కార్యక్రమం.
సీమంతం అంటే గర్భిణి మరియు పుట్టబోయే శిశువు యొక్క ఆరోగ్యం, శ్రేయస్సు మరియు సురక్షితమైన ప్రసవం కోసం ఒక ప్రార్థనతో కూడిన ఆనంద వేడుక. ఇది స్త్రీ యొక్క మాతృత్వ భావనోదయాన్ని ఆనందంగా వేడుక గా జరుపుకోవడమే ! కొందరు “శ్రీమంతం”- అని కూడా అంటారు
శ్రీ అంటే లక్ష్మి
శ్రీ అంటే ఆయుష్షు
శ్రీ అంటే సౌభాగ్యం
శ్రీ అంటే సిరి సంపదలు అని వారి అభిప్రాయం
సీమంతం ఎలా నిర్వహించబడుతుంది?
ఈ సీమంత కార్యక్రమం సాధారణంగా ఒక ప్రత్యేకమైన సమయంలో ఒక సుమÖహర్తం లో గర్భిణి మరియు ఆమె ఆత్మీయ కుటుంబ మిత్ర సభ్యుల మధ్య హరోల్లాసంతో నిర్వహించబడుతుంది.
సీమంత కార్యక్రమంలో మొదటి అంకం “దోహదం”
దోహదం అంటే గర్భిణీ స్త్రీ మÖర్తి కి ఇష్టమైన కోరికను ఆమె భర్త సంతోషంతో నెరవేర్చడం.
రెండోది భర్త తన భార్య శిరో భాగాన పాపిడిని తీసి పాపిడి యొక్క అంతం దగ్గర అంటే నుదుటి పై భాగాన పవిత్ర కుంకుమను అలంకరింప జేసే సుమధుర మనోహర ఘట్టం.
ఐతే ఈ కార్యక్రమాన్ని సుస్వర మంత్రోచ్ఛారణలతో చేయాలని శాస్త్రవచనం
మంత్ర ద్వయం:
వనమాలి గదీ శార్ణీ శంఖీ చక్రీచ నందకీ
శ్రీ మన్నారాయణో విష్ణు వాసుదేవో అభి రక్షతు
కుంకుమం శోభనం దివ్యం
సర్వదా శుభమంగళ ప్రదం
ధారణే నాస్య శుభోదయం
శాంతి రస్తు సదా భవతి
అంటూ భర్త తన కుడి చేయి ఉంగరం వ్రేలుతో కుంకుమను తో సీమంతం దగ్గర అలంకరించే సమయాన బంధు మిత్రుల హర్ష ధ్వానాలే శుభ భావనల ఉషోదయమ్ వెలుగుతుందని శాస్త్ర శాసనం. ఇంతేకాదు గర్భ రక్షణార్ధం శ్రీ మహా విష్ణువు యొక్క పూజ కూడా చేయాలని శాస్త్రం చెబుతోంది.
ఇది మహా ఋషి వశిష్ఠుల వారు స్వయంగా చెప్పిన సూక్తం
వాశిష్ఠ సంహితోక్త శ్రీమహా విష్ణు పూజ.
నూతన మృత్తికా కుంభమున సువర్ణ విష్ణు ప్రతిమను స్థాపించి కులదేవత తో బాటు విద్యుక్తంగా అర్చనాదులను చేసి తదనంతరం ఈ శ్లోకాలను పఠించడం సర్వదా శుభకరం మంగళ ప్రదం.
శ్లో:1 పీతాంబర ధరం కృష్ణ వర్ణం శంఖ చక్ర గదాంబుజం
వైకుంఠ వాసినం విష్ణుం మృత్కుంభే స్థాపమేత్తతః.
శ్లో 2: విష్ణు స్వరూపం కనకేనా కృత్వా
తల్లింగమంతా రధ గంధె ఫ్రుష్పైః
వస్త్రా అక్షితై: ధూపదీప నైవేద్య తాంబూల ఫలైశ్చ సమ్యక్
శ్లో 3: విష్ణుం స్వదేవతా పూజాం
గర్భాణాం రక్షణాయచ
బ్రహ్మణాయ ప్రదాతవ్యాః
ప్రతిమా వస్త్ర సంయుతా
గర్భాణాం రక్ష ణాయచ
గర్భాణాం రక్ష ణాయచ
శుభం భవతు
శ్రీ మాత్రే నమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి