1870 తరవాత కాలంలో తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప హాస్యనవల ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ దీని కర్త కందుకూరి వీరేశలింగంగారు. ఈయన ఆంధ్రప్రదేశంలోని సంఘసంస్కర్తలలో అగ్రగణ్యుడు. ఆనాటి ఆంధ్రదేశంలో నెలకొన్న సామాజిక పరిస్థితులను చూసి ఎంతగానో స్పందించాడు. సమాజంలోని మÖఢ విశ్వాసాలను హిందూ ధర్మంలోని కర్మకాండను ప్రజల అజ్ఞానాన్ని చూసి ఆందోళన చెందాడు. ముఖ్యంగా స్త్రీ అచివేతను నిరసించాడు. సంఘసంస్కరణనే ధ్యేయంగా గల ఈయనకు ఆంగ్లసాహిత్యంలో వచ్చిన ‘గలివరు ట్రావెల్స’ అనే వ్యంగ్యరచనను చదివి అందులో జొనాథన్ స్విప్ట్ సంఘసంస్కరణ నిమిత్తం సంఘంలోని కుళ్ళను కడిగేయాలని చేసిన ప్రయత్నం ఈయనకు ‘సత్యరాజా పూర్వ దేశ యాత్రలు’ అనే వ్యంగ రచనకు దారులు వేసింది.
కందుకూరి వీరేశలింగం ఉత్తమపురుషలోనే ‘ సత్యరాజా పూర్వ దేశ యాత్రలు’ లోని రెండు కథలను నడిపించాడు. ‘అడుమళయాళ’ దేశంలోని అన్నిపాత్రలు అన్ని సన్నివేశాలు కేవలం ఆనాటి మన సంఘంలోని స్త్రీపురుష సంబంధాలకు దర్పణం. మన సమాజంలోని పురుషాధిక్య సమాజానికి వ్యతిరేకంగా కందుకూరివారు స్త్రీ ఆధిక్య సమాజాన్ని కల్పించి అందులో పురుషులు పడుతున్న బాధల్ని వివరిస్తూ పండించిన హాస్యం అద్భుతం. ఇది పురుష సమాజాన్ని పరోక్షంగా అవహేళన చేస్తు కందుకూరివారు రచించిన వ్యంగ రచన.
‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ లో మొదటిభాగములోని ‘అడుమళయాళం’ కథను ఎనిమిది ప్రకరణలుగా చేసి ప్రతి ప్రకరణలలో ఎన్నో హాస్య సంభాషణాలను కల్పించాడు. ఆ హాస్యముతోపాటు వ్యంగ్యాన్ని కూడా పండించాడు.
మొదటి ప్రకరణములో సత్యరాజను ఇంగ్లీష్ బడులలో చేర్చుటకు వారి నాన్నగారు ఒప్పుకోరు. అలా చదవటం ద్వారా బ్రాహ్మణాచారాలు నశిస్తాయని, ఇంగ్లీషు చదువువల్ల క్రైస్తవ మతం స్వీకరించవలసి వస్తుందని ఓ మÖఢ విశ్వాసాన్ని మనకు తెలుపుట గమనించాలి. ‘భార్య రూపవతీ శత్రు’ అన్న పెద్దలమాటలు తనకు గుర్తుండినందులకే తాను కురూపి పిల్లనే వివాహం చేసుకుంటున్నట్లు సత్యరాజ విన్నవించుకుంటాడు. ఈ విషయంనాటి పురుషుల మనోవికారం ఎట్లాంటిదో తెలుపుతుంది.
రెండవ ప్రకరణలో సత్యరాజ ఒక పూట గూడికి (Hశీtవశ్రీ) వెళ్ళి తనకు ‘ద్వాదశిపారాయణకు శుచిగా వంటచేసి పెడుతావా?’ అని అడగడంతో ఆనాటి ఆచారాలు మనుషులలో ఎంత బలమైన ముద్రల్ని వేసినాయో తెలుస్తుంది. ఒక శూద్రుడికి వడ్డించిన తరవాత తిరిగి తనకు వడ్డించటానికి వచ్చిన ఆ పూటగూడివాన్ని తగలకుండ అన్నం చాలని సత్యరాజ లేచి చేయి కడుకుంటాడు. ఇది నాటి అంటరానితనాన్ని తెలియజేస్తుంది.
మÖడవ ప్రకరణలో సత్యరాజను తీసుకెళ్తున్న ఇద్దరి భటులతో ఇతని సంభాషణ నవ్వు పుట్టించేదిగా ఉంటుంది. ఆ ఇద్దరు భటులు ‘తూమీ భూబే’ అని సత్యరాజాను అడగడంచేత ఆయన తనపేరు అడుగుతున్నారని తన పేరును తెలుగులోనూ, హిందీలోనూ, సంస్కృతంలోనూ ద్రావిడభాషలలోను చెప్పటం ద్వారా కూడ వారికర్థం కాదు. వారు సత్యరాజును కోపంగా చూడడం చూసి తన పాండిత్య నిరూపనకు ఇది సమయం కాదని మౌనంగా ఉండటం అన్న సన్నివేశం నవ్వుకునేటట్లుగా
ఉంటుంది. వీధులగుండా స్త్రీలే కనబడటంచేత ఇక్కడందరు స్త్రీలే ఉంటారని వీరంతా గాలిలో పుట్టారని సత్యరాజ అనుకోవటం ఆయన అమాయకత్వాన్ని తెలుపుతుంది.
నాల్గవ ప్రకరణలో ‘అడుమళయాళం’ లో అందురు స్త్రీలే పరిపాలన చేస్తారని, పురుషులు కేవలం ఇంటిపనులు చేసుకుంటారని పురుషులను గూర్చి వర్ణించటంలో కందుకూరి వారు మనదేశ పురుషులను పరోక్షంగా హేళనచేయటం జరిగింది. పురుషులకు విద్య చెప్పటం ద్వారా చెడిపోతారని చెప్పటం ‘అడుమళయాళ’ లో ఒక వర్గంచేత చెప్పించి మన సమాజంలో స్త్రీ విద్యను వ్యతిరేకించే వారికి చురకలంటిస్తూ వ్యంగ్యంగా రచించాడు. ‘అడుమళయాళ’ ‘దేశంలో ‘పంధీó’ అను శబ్దం చేత భార్యలను పిలవటం అంటే యజమానురాలని అర్థం. భర్తను ‘భూదా’ అని పిలవటం ద్వారా సేవకుడని అర్థం రావటం ‘రండీ’ భాషయొక్క పద్ధతులు. అంటే స్త్రీని పురుషుని యజమానిగా చెప్పటం వ్యంగంగా జరిగింది.
సత్యరాజా ‘అడుమళయాళం’ దేశంలోని స్త్రీల అహాన్ని పెద్దరికాన్ని తెలియజేసే పుస్తకాల్ని కాల్చేస్తాడు. అట్లాంటి సంఘటనలు మన సమాజంలో స్త్రీని అణగదొక్కే భావాలు గలవారు చేసే పనిని కందుకూరి సత్యరాజ ద్వారా పరోక్షంగా ఎగతాళి చేస్తాడు. ‘మా దేశంలో పురుషులే స్త్రీలను కొట్టుదురు’ అని సత్యరాజు చెప్తే, ‘ఫాండీభంగీ’ నమ్మదు . అవి సత్యరాజ పరిహాసోక్తులనుకుంటుంది. దీని ద్వారా కందుకూరివారు పురుషులను ఎగతాళి చేస్తున్నారని తెలుస్తుంది. మనుస్మృతిని మను సిద్ధాంతాన్ని ఎగతాళి చేయటం మనుస్మృతి పట్ల కందుకూరి వారికి ఏమాత్రం గౌరవం లేదని తెలుస్తుంది. సత్యరాజ ‘ఫాండీభంగీరాణి’ కి మనుస్మృతిలోని ఈ శ్లోకం వినిపిస్తాడు.
“భార్యా పుత్రశ్చ దానశ్చ శిష్యో భ్రాతాచ సోదర:
ప్రాప్తాపరాధా స్తాడ్యా స్యు రజ్జ్వా వేణుదండేనవా”
అనగా భార్యను, పుత్రుని, సేవకుని, శిష్యుని, భ్రాతను, సోదరుడు, తప్పుచేసినప్పుడు త్రాటితోనైనను, వెదురు కఱ్ఱతోనైనను కొట్టవలయునని ఈ శ్లోకం యొక్క అర్థం వివరించటంలో కందుకూరి మను సిద్ధాంతములోని ఈ శ్లోకంను పరోక్షంగా వ్యతిరేకిస్తున్నాడు. ‘ప్రాప్తాపరాధా’ అని మÖలంలో ఉండినా (అంటే తప్పుచేసినప్పుడే శిక్ష దండన ఉండాలన్నది) మనవారికి ఎదుటివారిని కొట్టుట ప్రధానం కాని నేరము చెసిండా లేదా అన్నది ప్రధానం కాదని నేరము చేయకున్నా భార్యను కొట్టుట తమ గొప్పతనంగాను, మగతనంగాను భావించే మÖర్ఖులు ఉన్నారని కందుకూరి పురుషులను ఎగతాళిచేస్తూ చెప్పారు.
‘అడుమళయాళ’ దేశంలో పతివ్రతాధర్మంకు విరుద్ధంగా పత్నీవ్రతథర్మం ఉంటుందని చెప్పటం స్త్రీలు పురుషులను గదిలో పెట్టి తాళం వేసి బయటకెళతారని చెప్పటంలో కందుకూరి నాటి సమాజంలోని కొంతమంది పురుషులను ఎగతాళి చేస్తున్నాడు.
సత్యరాజ మను సిద్ధాంతంలోని శ్లోకంలో మొదటి బార్య తప్ప మిగతా పుత్రుడు, శిష్యుడు, దాసుడు, భ్రాతా, సోదరుడు అనువారందరు మగవాళ్ళే కనుక ఆ మొదటి పదాన్ని భర్తగా చేసి శ్లోకం చెప్పటం ధర్మమని సత్యరాజే దాన్ని భార్యగా చేసి చదివాడని ‘ఫాండీభంగీ రాణి’ ఆరోపిస్తూ తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నంలో మనకెంతో హాస్యంతో కూడిన చమత్కారం కనిపిస్తుంది.
కందుకూరి వీరేశలింగం ‘అడుమళయాళ’ దేశం ‘ఫాండీ భంగీ’ ద్వారా చదువు నేర్చుకోవటంచేత ఆమె ఆడ అయిన మగ అయినా దేశం వేరైనా గురుదక్షిణగా ఆయన ఆమె సేవ చేయటం ద్వారా నాటి నేటి శిష్యులందరికి గురుభక్తి తెలియజేశాడు. గురుశిష్యుల మధ్య ఉండవలసిన అన్యోన్యతను గురువుల పట్ల శిష్యులకు ఉండవలసిన భక్తి భావాన్ని చక్కగా తెలియజేశాడు.
ఐదవ ప్రకరణలో కందుకూరివారు పాండీ భంగీ చేత ఆలోచనాత్మక విషయాల్ని వ్యక్తం చేశాడు. ప్రకృతిరీత్యా స్త్రీలు బలహీనులు మరియు సుకుమారమైన దేహనిర్మాణం గలవారు కాబట్టి అట్లాంటివారు ఏ పనులు చేయకుండా కూర్చుని రాజ్యపరిపాలనకు సంబంధించిన విషయాలు ఆలోచించటం ఉచితమని పురుషులు బలమైనవారు కావటంచేత ఇంటా బయట వారే అన్ని పనులు చేయటం సముచితమని ‘ఫాండీ- భంగీ’ సత్యరాజకు తెలియజేస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకోలేని పురుషుల తెలివి ఎందుకని ‘ఫాండీ భంగీ’ ప్రశ్నించటంలో హాస్యముతోపాటు ఆలోచనను కలిగిస్తుంది.
మనదేశ స్త్రీలకు ఆభరణాల మీద ఎంత ఇష్టం ఉంటుందో అంతకంటే ఎక్కువ ఇష్టం ఈ దేశ పురుషులకు ఉంటుంది. వాటిని మీసాలకు గడ్డాలకు అలంకరించుకోవటం చూస్తే వారికి చదువు రానందున అలా చేస్తున్నారో లేకా ఆడవాళ్ళ పరిపాలనలో ఉండటంవల్ల మన ఆడవాళ్ళలా మారినారో కాని ఇది ఎంతో వ్యంగంగా కందుకూరి కల్పించారు. అంతేకాకుండా భార్యలు చనిపోయిన భర్తలు గడ్డం మీసాలు తీసేస్తారు. కాని తలవెంట్రుకలు తీయరు. దీనికి కారణం స్త్రీలకు కోపం వస్తే తలవెంట్రుకలు పట్టుకొని కొట్టడం సులభమని ఒక పాత్రచేత కందుకూరి చెప్పించటం హాస్యాన్ని పండించటం కొరకే అన్నది స్పష్టం. మనదేశ భోగ స్త్రీలలాగే అక్కడ భోగపురుషులుంటారు. వారు నాట్యంతో పాటలతో స్త్రీలను మురిపించి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. కొందరు స్త్రీలు భోగ పురుషులను సొంతం చేసుకొని ఉంచుకోవటం వింతగాను కాక హాస్యముగా ఉంటుంది.
మరికొంతమంది పురుషులు స్త్రీలను చూడగానే నడకన మార్చి సిగ్గుతో వయ్యారంగా తలలు దించుకొని ముసి ముసి నవ్వులతో ఇంట్లోకి వెళ్ళి దాచుకోవటం. 60 యేళ్ళు దాటిన స్త్రీలు సైతం తల రంగులతో పురుషులకై నిరీక్షించటం ఎంతో నవ్వును కలిగిస్తుంది. ఇది కందుకూరి హాస్యచతురతకు నిదర్శనం.
అంతేకాకుండా సమాజంలోని కొంతమంది పురుషులను ఈయన ఎగతాళి చేస్తూ ఈ సన్నివేశాన్ని కల్పించాడు. తమ ఇంట్లో బారŠ్యలున్నా ఇతర స్త్రీలను ఆశించే భర్తలను 60 యేళ్ళు దాటిన తల వెంట్రుకలకు రంగులు పూసి యువకుడిలా వేషధారణతో స్త్రీల కొరకు నిరీక్షించే పురుషులను భార్యను పిల్లల్ని వదులుకొని ఇతర స్త్రీలతో ఉండిపోయె మగమహారాజులను ఎగతాళిచేస్తు అట్లాంటి వారిని విమర్శిస్తూ వారి చర్యలను ఖండిస్తున్నాడు. అక్కడి పురుషులు వంటలు చేయటానికి ఇంటి పనులు చేయటానికి చూయించే శ్రద్ధ ఎంతో వŸ్యంగంగా ఉంటుంది.
ఆరవ ప్రకరణలో కందుకూరి మరెన్నో వ్యంగ సన్నివేశాలను హాస్యరస ప్రధానంగా కల్పించాడు. మనదేశంలో స్త్రీలు ఎన్ని నోములు చేస్తారో అంతకన్నా ఎక్కువ భక్తి ‘రండీ’ దేశ పురుషులలో కనిపిస్తుంది. ఆదివారం ప్రాతః కాలమున కందపిలకను (కందగడ్డ కుండే తోకను) సాయంకాలం పెండలపు దుంపను (ఆలుగడ్డ లాంటిది) పూజ చేస్తారు. సోమవారం మధ్యాహ్నము పప్పుగుత్తిని, సాయంకాలం రుబ్బురోలును పూజిస్తారు. ఇలా మధ్య మధ్య వచ్చే వ్రతాలతో మొత్తం సంవత్సరానికి ఏడువందల ముప్పై నోములు (730) చేయటం వారికి తప్పనిసరి. చెప్పకనే మనదేశ స్త్రీల అజ్ఞానాన్ని కందుకూరి వ్యంగ్యంగా చెప్పడంతోపాటు మనదేశ పురుషులే అలా చేయిస్తారని వారిని ఎగతాళి చేస్తున్నాడు.
మన సమాజంలోని స్త్రీలు చేయు నోములును ఖండించాడు. అర్ధంలేని పూజలను పరమార్థం తెలియని వ్రతాలను కందుకూరి నిరసించాడు. అజ్ఞానంతో కనిపించిన ప్రతిదాన్ని మొక్కుకుంటూ పోవటం భగవంతుడి పూర్వపరాలు తెలుసుకోకుండా నమ్మటం శోచనీయం. మÖఢ విశ్వాసాలకు మనసును మెదడును కట్టి పడేసే మానవజాతి పురోభివృద్ధికి ఆటంకంగా తయారైన స్త్రీల పూజావిధానం తెలియజేస్తూ అతి చక్కగా వ్యంగ్యంగా కందుకూరి ఈ సన్నివేశం చిత్రీకరించాడు. ఈ కల్పన స్త్రీ జాతిని మేల్కొలుపుటకే చేయబడ్డది. పూజల వ్రతాల పేరుతో స్త్రీ సమాజంలో తమ పాత్రనూ, పరోక్షంగా స్వేచ్ఛనూ కోల్పోతుంది. తద్వారా తాను మానసికంగా ఎంత వరకు ఎదగాలో అంతవరకు ఎదగలేక పోతుందన్న విషయాన్నే కందుకూరి పరోక్షంగా తెలియజేశాడు.
సత్యరాజ ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరినప్పుడు తనతోపాటు ఒకే ఒక ఉపాధ్యాయుడు ఆ పాఠశాలలో ఉంటాడు. ఆయనను సత్యరాజే ఇంటికెళ్ళి తీసుకురావాలి. తిరిగి ఇంటిదగ్గర వదిలి రావాలి. ఈ పరిస్థితి చూస్తే అక్కడి పురుషులు ఎంత స్వేచ్ఛను కోల్పోతున్నారో తెలుపుతూ వ్యంగ్యంగా మనదేశ స్త్రీలను పురుషులు అణగద్రొక్కే విధానాన్ని మన సమాజాన్ని ఉద్దేశించే కందుకూరి చెప్పారు.
‘అడుమళయాళ’ దేశంలో స్త్రీలు చనిపోతే వారితోపాటు బ్రతికిన పురుషులను కూడా సజీవంగా దహనం చేస్తారు. సత్యరాజ దానిని అమానుష చర్యగా ఖండించి అది ఎంత అన్యాయమో తెలియజేయటం ఆనాటి మన సమాజ ఆచారాలను పట్టుకు వ్రేలాడేవారికి చెంపదెబ్బగా కందుకూరి చిత్రీకరించాడు. ఈ దేశంలో పురుషులు విద్యనేర్చుకోవటం వారి వేదశాస్త్రాలకు, ధర్మశాస్త్రాలకు విరుద్ధమని అట్లా జరిగినట్టైతే దేశంలో సంక్షోభం సంభవిస్తుందని పురుషవిద్యా వ్యతిరేకులు ప్రచారం చేస్తారు. ఈ విషయం చెప్పటంలో కందుకూరి వీరేశలింగం మనదేశంలో స్త్రీ విద్యను వ్యతిరేకించే పురుషులను వారి శాస్త్రాలను పరోక్షంగా ఎగతాళి చేస్తాడు.
ఏడవ ప్రకరణలో మతగురువులను పోషించుటకు దేశంలోని స్త్రీలు వారి మÖడు నెలల జీతాన్ని ఇవ్వడం ఎంత అన్యాయమో సత్యరాజచేత కందుకూరి చెప్పించాడు. ఈ ప్రతీక ద్వారా మన సమాజంలో మత గురువులమంటూ వేషాలు వేసుకొని ప్రజలను మోసాలు చేసేవారిని వ్యంగ్యంగా పరోక్షంగా ఖండించాడు. మతాచారినులు తమ సేవకులుగా పురుషులను పెట్టుకోవడం మదŠ్యపానం, మాంసాహారం పురుషులతో సంభోగము మాములుగా జరిగే విషయాలని సత్యరాజ తెలుసుకుంటాడు. ఈ సన్నివేశ కల్పన ద్వారా మన సమాజంలో కొందరు మతాచారులు తెరచాటున గుట్టుగా చేసే పనులను బయటపెట్టారు. అట్లాంటివారిని వ్యంగ్యంగా వ్యతిరేకిస్తూ ‘అడుమళయాళ’ దేశంలోని మతాచారిణిలను ప్రతీకలుగా చెప్పాడు.
‘అడుమళయాళ’ దేశంలో పురుషుల దుస్థితి ఎంతో దీనంగా ఉంటుంది. పెళ్ళి అయిన స్త్రీ చనిపోతే ఆమె భర్త ముక్కును కోసేయటం ఇది ఆ దేశ సంప్రదాయం. ఇది కేవలం పురుషులను అణచటానికి స్త్రీలు తలపెట్టిన తప్పుడు కార్యం. ఈ సన్నివేశం ప్రతీకగా మన సంఘంలో పురుషుడు మరణిస్తే స్త్రీ ముక్కు కోయటం గుండు కొట్టించటం లాంటి పనుల వలన స్త్రీ ఎంత స్వేఛ్ఛను కోల్పోతుందో తెలియజేశాడు. ఇట్లాంటి ఆచారాలు పాటించేûవారిని విమర్శిస్తూ ఈ రచన ద్వారా వారికి జ్ఞానోదయం కలిగించాడు. సత్యరాజ పురుషుల విముక్తికై చేసే ప్రయత్నాన్ని కొందరు స్త్రీలు సహించక సత్యరాజను దేశలనుండి బహిష్కరించాలని చూస్తారు. ఈ ప్రతీక ద్వారా మన సమాజంలో సంఘసంస్కర్తలను బహిష్కరించాలని కొందరు చేసే కపట ప్రయత్నాన్ని బట్టబయలు చే యడమే కాకుండా నాడు సంఘసంస్కర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అందరికి తెలిసేటట్లు సత్యరాజ పాత్రచేత వివరించాడు.
ఎనిమిదవ ప్రకరణలో కందుకూరి చక్కని రచనాకౌశలాన్ని ప్రదర్శించాడు. పురుషుల హక్కుల గురించి వారి స్వేచ్ఛ గురించి సత్యరాజ రాజకీయ పాఠశాల ప్రాంగణంలో ఉపన్యాసిస్తున్నాడని తెలిసి స్త్రీపురుషులు అక్కడికి వస్తారు. సత్యరాజ ఉపన్యసించటానికి వస్తున్నప్పుడు కొందరు స్త్రీలు ఇలా సంభాషించుకుంటారు. ‘వంట ఇంట మÖలకు పడి ఉండక పురుషుడై వుండి సిగ్గువిడిచి సభకు వస్తున్నాడని కొందరు సభకు రావటమేకాదు ఇంతమంది స్త్రీల ముందు తలఎత్తుకొని ముచ్చిటించడానికి వచ్చాడని కొందరు. పురుషుడు సభలోకివచ్చి మాట్లాడడం దేశానికి అరిష్టమని కొందరు, ఇలా పురుషుల ఆటలు సాగనివ్వడం స్త్రీ జాతికి అవమానకరమని కొందరు ఇలా స్త్రీలు తమలో తాము ముచ్చటించుకోవటం అన్న ప్రతీక ద్వారా మన సమాజంలో పురుషుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా
ఉపన్యసించటానికి బహిరంగ ప్రసంగం చేయటానికి ఒక స్త్రీ ఉపక్రమిస్తే ఏమి జరుగుతుందో ‘అడుమళయాళ’ దేశంలో అట్లాగే సత్యరాజకు జరుగుతుంది. ఈ సన్నివేశం మన పురుషాధిక్య సమాజానికి ప్రతీక. సత్యరాజను ఉద్ధేశిస్తూ ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క విధంగా మాట్లాడడం ఎంత పాపమో మనదేశంలో ఒక స్త్రీని
ఉద్దేశిస్తూ ఒక్కొక్క పురుషుడు ఒక్కొక్క విధంగా మాట్లాడడం సున్నితమైన మనసుగల స్త్రీకి ఎంత కష్టమో గుర్తించాలని నాటి సమా జంలోని పురుషులను వ్యంగ్య మాటలతో కోరుకున్నాడు.
సత్యరాజ మాటల్లో చేతల్లో ఒక సంఘసంస్కర్తను కల్పించి అతడు చివరికి పొందే అవమానాలను బహిష్కరణలను కందుకూరి సత్యరాజను ప్రతీకగా తీసుకున్నాడు. ఇందులోని ప్రతి ప్రకరణంలో కందుకూరి సంఘ సంస్కరణ ఎంత గొప్పదో వ్యంగ్యంగా హాస్యాన్ని పండిస్తూ ‘సత్యరాజ పూర్వదేశ యాత్రలు’ లో చెప్పిన ‘అడుమళయాళ’ కథ నిదర్శనం.
లంకాద్వీపం’ కథలోని ఎనిమిది ప్రకరణలు కూడ హాస్యరసాన్ని, వ్యంగ్య సన్నివేశాలను పండించటానికి కల్పించినవే. మొదటి ప్రకరణలో ‘లంకాద్వీపం’ లోని మఱ్ఱిచెట్ల వర్ణణా, ఎలుకలాంటి చీమల వర్ణణా దూడ లాంటి కాకుల వర్ణణా ఉరుములాంటి కాకుల అరుపుల గూర్చి సత్యరాజ చేత చెప్పించటంలో కందుకూరి హాస్యాన్ని చక్కగా పండించాడు. పిల్లరాక్షసి సత్యరాజను అటూ యిటూ కదిలిస్తూ బొమ్మలతో ఆడుకుంటున్నట్లు సత్యరాజతో ఆడుకోవటం, దాని తల్లిదండ్రులు పిల్లిని చంకలో పెట్టుకున్నట్లు సత్యరాజను చంకలో పెట్టుకొని యజమాని దగ్గరకు తీసుకెళ్ళటం నవ్వు పుట్టించే విధంగా చిత్రీకరించాడు.
‘లంకాద్వీపం’ కథ రెండవ ప్రకరణలో జ్యోతిశ్శాస్త్రాలను జ్యోతిశ్శాస్త్ర పండితులను ఎగతాళిచేస్తూ తన అవిశ్వాసాన్ని ఎంతో వ్యంగంగా ప్రకటించాడు. లంకాద్వీపంలో ఉంటున్న కొందరు జ్యోతిశ్శాస్త్ర పండితులు సత్యరాజ ఎవరో ఎక్కడి వాడో చెప్పటంలో భిన్నాభిప్రాయాలు తెలియజేస్తారు. వారి పురాణాలననుసరించి సత్యరాజు మానవజాతివాడని వీరంతా చెట్లకు నిచ్చెనలు వేసుకొని ఎక్కుతారని ఇదే విషయాన్ని తమ శాస్త్రాలు ఘోషిస్తున్నాయని జ్యోతిశాస్త్ర పండితులు కొందరు తమ పాండిత్యాన్ని తెలుపుతారు. ఈ విధంగానే మరికొందరు జ్యోతిశ్శాస్త్ర పండితులు సత్యరాజ ఋషి అని ఇతను వాలఖిల్యాదుల జాతి వారని తపస్సుచేత ఈ చిన్నదేహన్ని ధరించాడని వీరు తమ శాస్త్రజ్ఞానాన్ని తెలియజేస్తారు. ఇట్లా జ్యోతిశ్శాస్త్ర పండితులు భిన్నాభిప్రాయాలు ప్రకటించటం ద్వారా వారి వారి శాస్త్రాలు ఎంతవరకు సమర్థనీయమైనవో ఆలోచించమని కందుకూరి విరేశలింగం నాటి ప్రజలను ఉద్దేశించి తెలియజేశాడు. నాటి మన సమాజంలో జ్యోతిశాస్త్ర పండితుల మధ్యగల భిన్నాభిప్రాయాలను దృష్టిలో ఉంచుకునే ఈ సన్నివేశాన్ని కల్పించాడు.
అందరు సత్యరాజను చిరుదేవతామÖర్తిగా కాలుస్తారు. ఇతనికి ఫలహారాలు కానుకలు సమర్పించుకుంటారు. ఇట్లాంటి ప్రతీకల ద్వారా మన సమాజంలోని మÖఢనమ్మకాలతో తమ విచక్షణాజ్ఞానం మరిచి గుడ్డిగా నమ్మే తత్వమును కందుకూరి వ్యంగ్యంగా చిత్రీకరించాడు. సత్యరాజ దగ్గర పూజారులుగా
ఉంటున్నవారు సత్యరాజకు వచ్చిన ఫలహారాల పట్ల మక్కువ ఉండి దేవతామÖర్తిగా కొలువబడే సత్యరాజపై లేకపోవటం ఆనాటి మనసమాజంలోని పురోహితులను ఎగతాళి చేస్తూ వారంతా భగవంతుని భక్తి కన్నా తమ భుక్తికే ప్రాధాన్యం ఇస్తారని తెలియజేశాడు.
ఒక వృద్ధస్త్రీ సత్యరాజను తమ కోడలికి మగబిడ్డ జన్మిస్తాడా, ఆడబిడ్డ జన్మిస్తుందా అని తెలుసుకొనుటకు రాగ ఆమె దర్శించిన సమయాన్ని బట్టి ‘లగ్నము రవి గురు చంద్రులు విషమరాశి నవాంశముల యందుండటం చేత మగబిడ్డ పుట్టునని’ సత్యరాజ చెప్పటం. అట్లాగే జరగటం చేత సత్యరాజకు జ్యోతిశ్శాస్త్రం మీద నమ్మకం. అది నిజముగా జరగటం తద్విరుద్ధంగా లంకాద్వీప జ్యోతిశ్శాస్త్ర పండితులు ఆడబిడ్డ పుడుతుందని చెప్పటం ఇలా రెండు విధాల జ్యోతిశ్శాస్త్రాల భిన్నాభిప్రాయలచేత ఈ జ్యోతిశ్శాస్త్రమే నమ్మదగినది కాదని వ్యంగ్యంగా చెప్పారు. ఇది మÖడవ ప్రకరణలో ఉంటుంది.
సత్యరాజ కోరిన విధంగానే మహాకాయుడు జ్యోతిశ్శాస్త్ర పద్ధతిలో జరుగుతీర్పు న్యాయస్థానానికి సత్యరాజను తీసుకెళ్లటం నాల్గవ ప్రకరణలో ఎంతో హాస్యముగా సాగుతుంది. సత్యరాజను ఒక బండికి ముందు భాగంలో త్రాళ్ళతో కట్టి అమ్మవారిని ఊరేగింపుకు తీసుకెళ్ళినట్లుగా తీసుకెళ్తుంటే జనమంతా పూజలు చేయటం అతడికి ఇబ్బందికరంగా జనం వంగి వంగి దండాలు పెట్టడం చూసి సత్యరాజ ఆందోళణతో వణకటం ఇక వారి చేతుల్లో తనపని అయిపోయిందనుకుంటాడు. సత్యరాజ బండి అటూయిటూ కదలటంచేత ఇక క్రిందపడి చస్తానని సత్యరాజ భయంతో వణకటం లాంటి ఈ సన్నివేశాన్ని చిత్రీకరించటంతో కందుకూరి గొప్ప హాస్యాన్ని పండించాడు.
సభాభవనంలో తీర్పులో రెండు భిన్నాభిప్రాయాలు రావటం తద్వారా జ్యోతిశ్శాస్త్ర పండితులు వారి వారి వాదనలు సమంజసమైనవేనని వాదించుకోవటంలో సత్యరాజ మహాకాయుడిని రెండు జ్యోతిశ్శాస్త్రముల మధ్య ఈ అభిప్రాయం ఏంటని అడగటం, అందుకు జ్యోతిశ్శాస్త్రంపై పరిపూర్ణ విశ్వాసం గల మహాకాయుడు ఇది స్వార్థంతో నిండిన బుద్దుల చేత ఏర్పడిన భేదమని, జ్యోతిశ్శాస్త్రమంతా ఒక్కటేనని చెప్పటంలో కందుకూరి రెండు విషయాలను ఇందులో ఎగతాళి చేసి చెప్పారు. ఒకటి జ్యోతిశ్శాస్త్రములు సత్యమైతే ఆ శాస్త్రపండితులు ఎలా అసత్యం ఆడతారని రెండవది మహాకాయుడికి జ్యోతిశాస్త్రం మీద ఉన్న అచంచలమైన గుడ్డి విశ్వాసం తెలుపుతుంది. ఈ రెండు మన సమాజంలో ఆనాడు కనిపించటంచేత జ్యోతిశాస్త్రమును, జ్యోతిశ్శాస్త్ర పండితులను జ్యోతిశ్శాస్త్రం మీద నమ్మకం ఉన్న వారిని వ్యంగ్యంగానే వీరందరిని వ్యతిరేకించాడు.
దేవతామÖర్తి అయిన సత్యరాజను సభాస్థలంలో ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడంద్వారా ఆయన అలసి నిద్రిస్తున్నప్పుడు ప్రజలంతా సత్యరాజ యోగనిద్ర పోతునట్లు సత్యాన్వేషణకు ప్రయత్నిస్తున్నట్లు తలవటం మానవ సమాజంలోని మÖఢజనులకు ప్రతీకగా చెప్తూ నాటి దొంగ స్వామీజీలు ఎట్లా బ్రతికి బట్టకట్టినారో తెలుపుతూ కందుకూరి వ్యంగ్యంగా చిత్రీకరించాడు.
ఆరవ ప్రకరణలో జ్యోతిశ్శాస్త్రంను వ్యతిరేకిస్తూ కందుకూరి చేసిన వ్యంగ ప్రసంగం ఆయనకు జ్యోతిశ్శాస్త్రం మీద ఉన్న అపనమ్మకాన్ని తెలియజేస్తుంది. జ్యోతిశ్శాస్త్రం సత్యమని కొందరు అసత్యమని మరి కొందరు వాదించుకోవటంచేత లంకాద్వీప ప్రజల మధ్య సత్యాసత్యాల నిరూపణ నిమిత్తం భవనంలో నిర్వహిస్తారు. జ్యోతిశ్శాస్త్రం అబద్దమని ఒక ఉపన్యాసకుడు తన దీర్ఘ ఉపన్యాసంలో ఆనాటి జనులనుద్దేశించి జ్యోతిశాస్త్ర పండితులు, మÖర్ఖ సిద్ధాంతులు పెట్టు ముహూర్తాలను తద్వారా జరుగు అనార్థాలను జనులకు విన్నవించుకుంటాడు.
వివాహాల కొరకు వధూవరుల జాతకం చూసి పెట్టు ముహూర్ధాలవల్ల ఎన్నిపెళ్ళిల్లు ఎంతమంది దంపతులు ఆనందంగా ఉన్నారో తెలుసుకోమని చెప్తాడు. గృహ నిర్మాణానికి మొదలుకొని గృహ ప్రవేశం వరకు సిద్ధాంతులు నిర్ణయించిన ముహుర్తానికే అన్నీ చక్కగా నిర్వర్తించి ఎంతమంది నేడు ఆనందంగా గృహజీవితం గడుపుతున్నారో ఆలోచించమని చెప్తాడు. ప్రయాణాలకు ముహూర్తాలు చూసుకొని ప్రయాణించేవారు ఎంతమంది సుఖప్రయాణం చేస్తున్నారు అన్న విషయం తెలుసు. కన్నబిడ్డకు పేరుపెట్టుకోటానికి కూడా హక్కును కోల్పోయి ఎవరో నిర్ణయించిన పేరు పెట్టుకొవటం ఎంత దుర్భలమైన దుస్థితో తెలిపాడు. కనీసం వంటికి కొత్త గుడ్డలు వేసుకొనుటకు, కొత్తనగలు ధరించటానికి కూడా మంచిదినమేదో తెలుసుకొనుటకు సిద్ధాంతులు నిర్ణయించిన దినానికొరకు ఎదురుచూడాలి. పొలం దున్నటానికి, విత్తనం చల్లటానికి కూడా మంచి ఘడియలు ఏవో సిద్ధాంతులనడిగే చేయాలి. పంటకోయడానికి ధాన్యం ఇల్లుచేరటానికి కూడా వారి అనుమతి కావాలి. ఏ వ్యాపారమైన ప్రారంభించటానికి ముహుర్తం నిర్ణయించటానికి అయ్యవార్లకు ఎంతో అంత సమర్పించుకోవాలి. ఇలా మనిషి పుట్టినప్పటినుండి చివరికి చచ్చేవరకు చచ్చిన తరవాత కూడ చేసే తద్దినం పిండా కూడు వరకు సిద్ధాంతుల ముహుర్తాలమీద మనిషి జీవితం ఆధార పడుతుంది. ఇది అజ్ఞానుల, అమాయకుల అవివేకతకు పరాకాష్ఠ.
జ్యోతిశ్శాస్త్రం పేరుమీద కొంతమంది చేస్తున్న బహిరంగదోపిడి. కొంతమంది సోమరిపోతులకు, వంచకులకు ఇది సులభంగా డబ్బు గడించే వ్యాపార మార్గం. నాటి జనంలో ఎక్కువ మందే ఇలాంటి విషయాల్లో ప్రగాఢ నమ్మకం కలిగి బానిసలుగా జీవితం గడిపారు. తమదంటూ ఏమి లేకుండానే ఉన్నదంతా పోగుట్టుకున్నారు. మÖఢ విశ్వాసం విజ్ఞానులను కూడా గొఱ్ఱెలుగా మార్చగలదు.
‘లంకాద్వీపం’లో రాకుమారి ‘త్రిజట’ పాత్ర చిత్రీకరణ ఎంతో హాస్యరసాన్ని పండించింది. రాక్షస రాకుమారి ‘త్రిజట’ సత్యరాజను ప్రేమిస్తుంది. ఒకనాడు రాత్రి సత్యరాజను పిల్లిద్వారా తన రాజమందిరానికి తెప్పించుకుంటుంది. తనను గాంధర్వ వివాహం చేసుకొని చరితార్థురాలిని చేయమని ‘త్రిజట” ప్రార్థిస్తుంది. అప్పుడు సత్యరాజ ప్రాణం పోయినట్లు తలచి తను ఈ రాక్షసిని పెళ్ళిచేసుకోవటం ఎట్లా జరుగుతుందని చింతిస్తూ ఎంతో విచారానికి గురియై అటూ యిటూ తిరగడం లాంటి పరిస్థితులను నవ్వును పుట్టిస్తాయి.
రాక్షసకన్యనైనా తనను పెళ్ళిచేసుకోవటం తప్పేమి లేదని సత్యరాజకు తెలుపుతుంది. మానవులు పూజించే దేవతామÖర్తుల గుట్టంతా తెలుసునని ‘త్రిజట’తో చెప్పించటం నాటి సమాజంలో భగవంతుని మీద మితిమీరిన నమ్మకాన్ని భక్తిని పరోక్షంగా పురాణాలను కందుకూరి తిరస్కరిస్తూ ‘లంకాద్వీపం’ కథలో త్రిజట పాత్రచేత మన దేవుళ్ళ గుట్టంతా బయట పెడతాడు. మందపాల మహార్షి ‘లావుక’ పిట్టతో సంభోగించి సంతానం కన్నాడని చెప్పటంలో ‘త్రిజట’ ఒక పక్షితో మహర్షికి సంబంధం ఉందన్న విషయం తెలుపుతుంది. ‘విభండక’ మహర్షి లేడిని పొంది ఋష్యశృంగుడను కొడుకును కన్నాడని ఇది ఒక జంతువుతో మహార్షికి ఉన్న సంబంధం అని తెలియజేసాడు. వాయుదేవుడు కేసరియను వానరుని భార్యవలన హనుమంతుని కన్నాడని చెప్పెను.
సూర్యభగవానుడు అశ్వమును పొంది యశ్వినులను కన్నాడని చెప్పెను. శ్రీకృష్ణభగవానుడు జాంబవంతుడను ‘భల్లూకా’ రాజు యొక్క పుత్రికను వరించెనని చెప్తాడు. దేవేంద్రుడు సూర్యుడు ఇద్దరు కూడా ఋక్ష విరజాడను మర్కటమును కామించి వాలీ, సుగ్రీవులను కన్నారని చెబుతాడు. ఇలా మన పురాణాల్లోని దేవతలందరి జీవితాలు రాక్షసజాతికి కూడ తెలిసినవని కందుకూరి వ్యంగంగా చిత్రీకరించాడు. ముఖ్యంగా హిందూ సమాజంలోని ప్రజల భక్తి విశ్వాసాలను విగ్రహారాధనను ఖండించాడు. ఈ విధంగా వివరించటంలో కాస్త తెలిసి తెలియని విధంగా యధార్థాలు కందుకూరివారు గమనించలేదేమో. దేవతా మÖర్తుల, మహర్షుల జీవితాలు కూడ ఇట్లానే ఉన్నాయనే చెప్పటం కోసం కావచ్చు. తద్వారా మానవులను వాస్తవ జీవితం గడపమని ప్రార్థించాడు.
‘త్రిజట’ కామంతో సత్యరాజ ఋషి కాకున్నా దేవతామÖర్తి కాకున్నా ఫర్వాలేదని ఎందరో మానవులు రాక్షసులను వివాహం చేసుకున్నవారున్నారనీ, భీముడు హిడింబియను రాక్షసితో సంభోగించి ఘటోత్కచుని కన్నాడని చెప్పెను. ప్రద్యుమ్యుడు వజ్రానాభదైత్యుని కూతురైన ప్రభావతిని పొంది పుత్రుని కన్నాడని చెప్పెను. అనిరుద్దుడు బాణాసుర కూతురైన ఉషాకన్యను వివాహం చేసుకునెనని కందుకూరి పురాణ పురుషులను, ఆదర్శ పురుషులను ‘త్రిజట’ రాక్షస కన్యచేత ఇలా పలికించి ఎగతాళి చేయటం కందుకూరి ఉద్దేశం. ఇక్కడ వ్యంగ్యంగా మనుషులందరిని ధర్మాధర్మాలను తెలుసుకోమని కందుకూరి ఉద్భోదించాడు.
“త్రిజట” చేత తను పొందిన దీనావస్థను చివరి ప్రకరణలో కందుకూరివారు ఎంతో హాస్యంగా చిత్రీకరించాడు.
ఇక్కడ మరోవిషయం గమనించాలి. వ్యాసమహర్షికి, మహర్షివాల్మీకి, భక్తపోతనకు గాని ప్రస్తుత పాఠ్య రచయితకు గాని లోక కళ్యాణం ప్రధానం కాని కథలు ప్రధానం కాదు. ఒకొక్క యుగంలో ఒక్కో విధంగా ధర్మం రక్షింపబడుతుంది. నేడు తప్పుగా భావించేదేదైనా కూడా నాడు ధర్మాధర్మాల విచక్షణను మానవజాతికి తెలపటానికే అన్నది వాస్తవం. ప్రతి యుగంలోను ధర్మం రక్షింపబడుతుంది. అందుకు చెప్పిన కథలుగానీ జీవితాలుగాని కేవలం ధర్మాన్ని రక్షించుకోటానికే. దేవతల జీవితాల్లోంచి మహార్షుల జీవితాల్లోంచి, మహాపురుషుల జీవితాల్లోంచి ఆదర్శవంతమైనదేదో దాన్నే స్వీకరించటం ఉత్తమం. కాని దాన్ని ప్రశ్నించటం వల్ల మనకు జరిగేదేదైనా అది తక్కువే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి