మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

10, అక్టోబర్ 2026, శనివారం

బాలరాజు (1948)


ప్రతిభా పిక్చర్స్ అధినేత ఘంటసాల బలరామయ్య నిర్మించి, దర్శకత్వం వహించిన ‘బాలరాజు’ - తెలుగు సినిమాకు తొలి గ్లామర్ టచ్ నిచ్చి, ప్రేక్షకుల్ని థిóయేటర్ వైపు పరుగులు తీయించింది. అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు సినీజీవితాన్ని మలుపుతిప్పింది.

అప్పటివరకూ మÖడుపదుల వయసు దాటిన హీరోల చిత్రాలే ఎక్కువగా వచ్చాయి. అంతా ఓ సంప్రదాయ పద్ధతిలో వెళ్ళే కథలే! ‘బాలరాజు’ ఆ ధోరణిని మార్చింది. కథాకథనంలో స్పీడ్ పెంచింది. సంగీత, సాహిత్యాలతో ప్రేక్షకుల్ని మైమరపించింది. 

అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఏడవ చిత్రం ‘బాలరాజు’ ఆయన విజయపరంపరలో మొట్టమొదటి ఘన విజయం సాధించి అతన్ని తారాపథాని కెత్తింది sTÖ చిత్రమే. ఈ చిత్రంతో పాపులర్ హీరో అయ్యాడు. అంతేకాదు ‘బాలరాజు నాగేసర్రావు’ అన్నది వ్యవహారనామం అయిపోయింది. ఈ చిత్రం చూసే అన్నపూర్ణ నాగేశ్వరరావును పెళ్ళిచూపులు చూసిందని అక్కినేని వారే ఓచోట (ఈనాడు 26.2007) చెప్పుకున్నారు.

ఘంటసాల, అక్కినేనికి తొలిసారి నేపథ్యగానం చేసింది ‘బాలరాజు’ లోనే. వీళ్ళిద్దరూ సినిమాలోకి రాకముందు నుంచే గుడివాడ నాటకసమాజంలో కలిసి నటించారు. పల్నాటి యుద్ధంలో కలిసి పాడారు. మద్రాసులో కొన్నాళ్లు కలిసి ఉన్నారు. బాలరాజులో ‘చెలియా కనరావా’ పాట పాడేటప్పుడు, పక్కన ఎస్.వరలక్క్ష్మిది తనదీ ఒకే శ్రుతిలో ఉండటం, తన గాత్రంలో స్త్రీత్వం ధ్వనించడం అక్కినేనికి నచ్చలేదు. అప్పటికే నేపథ్యగానం రావడంతో, తను పాడటాన్ని విరమించుకొన్నాడు. “స్వీయ లోపమ్ము నెరుగుటే పూర్ణవిద్య” అని గాలిబ్ కవి మాటలు గుర్తొచ్చాయి వారికి. నిర్మాత బలరామయ్యతో ‘ఘంటసాలతో పాడించండి’ అని కోరి పాడించుకొన్నారు.

‘బాలరాజు’ చిత్రానికి కథ, మాటలు, పాటలు సముద్రాల వారు అందించగా, గాలి పెంచల నరసింహారావు సంగీతం సమకూర్చారు. వీరికి జి.వి.రావు (జి.వెంకటేశ్వరరావు) పేరుతో ఘంటసాల సహాయకుడిగా పనిచేశారు. సి.ఆర్.సుబ్బురామన్, రీరికార్డింగ్ నిర్వహించారు. వీరిద్దరూ కొన్ని బాణీలు కూడా చేశారు.

ఛాయాగ్రహణాన్ని సి.శ్రీధర్, శబ్దగ్రహణాన్ని వి.మీనాక్షి సుందరం, కళను ఎస్.వి.ఎస్.రామారావు, కూర్పును టి.ఎం.లాల్, నృత్యాన్ని వేదాంతం రాఘవయ్య నిర్వహించారు. ప్రతిభాశాస్త్రి (గీతరచయిత వెన్నెలకంటి తండ్రి) ప్రొడక్షన్ చీఫ్‌గా పనిచేశారు.

‘బాలరాజు’ చిత్రంలో అక్కినేని, ఎస్.వరలక్క్ష్మీ హీరోహీరోయిన్లు. అంజలీదేవి చిత్రం మొదటి భాగంలో మోహినీగా నటించి, (తీయని వెన్నెలరేయి...) నర్తించారు, వీరితో పాటు కస్తూరి శివరావు, జి.సదాశివరావు, ఎం. ఎల్.నారాయణ, జి.నారాయణరావు, బి. సీతారాం. ఎస్ కృష్ణయ్య, జి. సుబ్బారావు, కృష్ణవేణి, సి. రాజారత్నం తదితరులు నటించారు.

ప్రముఖ కథా రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రిగారితో సముద్రాలకు ‘పల్నాటి యుద్ధం’ చిత్రంతో మొదలైన సాహితీబంధం, sTÖ చిత్రంతో మరింత బలపడింది. కథా రూపకల్పనలో మల్లాది వారి ప్రమేయమే ఎక్కువ. మన జానపద కథల్లో పసల బాలరాజు అనే కథ వుంది. దానికి మరోకథను జోడించి మల్లాది, సముద్రాల, ప్రయాగ నరసింహశాస్త్రి కలిసి ముప్పేట గొలుసుగా అల్లిన కథే బాలారాజు...

పాటల రచనలో కూడా మల్లాది వారి ప్రభ నల్లని మబ్బు చుట్టు వెండిగీత వలె ప్రసరించింది. “దేవుడయ్య దేవుడు..., ఒకరినినాన వేసావ్..., గూటిలో చిలకేదిరా...” పాటల్ని ప్రయాగవారే సేకరించారు. ఇందులో ఓ బుర్రకథను కూడా మెరుగులుదిద్ది ప్రయాగవారే పాడారు.

కథాంశం :

కథాంశానికి వస్తే - యక్షకన్య ఓ యక్షుడితో ప్రేమలోపడుతుంది. ఈవిషయం తెలిసికొన్న ఇంద్రుడు భూలోకంలో మానవులై పుట్టండి అని శపిస్తాడు. ఆ యక్షుడు బాలరాజై, ఆ యక్షిణి సీతగా పుడ్తారు. బాలరాజుకు గతజన్మ గుర్తుండదు. సీత మాత్రం గతజన్మ ప్రేమను గుర్తు తెచ్చుకొని వెంటాడుతుంది. దేవతలు అనేక పరీక్షలకు గురి చేస్తారు. స్వర్గానికి రప్పించే ప్రయత్నం చేస్తారు. చివరికి ఆ జంట, సురలోకం కన్న భూలోకమే మిన్న అని నిర్ణయించుకొని సుఖంగా వుంటారు.

కథాసంగ్రహం :

మోహిని ఓ దేవకన్య. అలకాపురికి చెందిన యక్షుడిని ప్రేమిస్తుంది. మోహినిని దేవవేశ్యగా మార్చాలని ఇంద్రుడి ఆలోచన. మోహిని నిరాకరిస్తుంది. ఇంద్రుడు కోపించి, ఆమెను భూలోకంలో పుట్టి, ఫలించని ప్రేమతో అల్లాడమని శపిస్తాడు. యక్షుడిని ప్రేమనెరగని కఠినాత్ముడవై పుట్టమని అంతకుముందే శపించాడు.

యక్షుడు, వెలమవారింట్లో బాలరాజుగా, మోహిని కమ్మనాయుడి నాగటిసాలులో సీతగా అవతరిస్తారు. సీతవల్ల కమ్మనాయుడికి సిరి కలసి వస్తుంది. ఆమెకు పెళ్ళిచేస్తే ఆమెతోనే సంపదపోతుందని భయంలో పడి, ఆమె పెళ్ళివూసే ఎత్తడు. అతిలోక సౌందర్యవతియైన ఆమెను, మగాళ్ళ దృష్టిలో పడకుండ ఒంటిస్తంభం మేడ కట్టించి ఉంచుతాడు. ఓ రోజు బాలరాజు మేడ పక్కగా వెళ్తుంటే సీత చూస్తుంది. ఆ రాత్రి పశువుల మందను విడిచి, బాలరాజు పిల్లనగ్రోవి వాయిస్తుంటే సీత, మైమరచి, మేడదిగి తనను ప్రేమించమని కోరుతుంది. బాలరాజు తిరస్కరించి వెళ్ళిపోతాడు. అతన్నే అనుసరిస్తుంది సీత. సీత తల్లిదండ్రులు కలవరపడి వెతికి వేసారి పోతారు. ఎలావచ్చిందో అలానే వెళ్ళిందనుకుంటారు.

బాలరాజును ఓచోట కలుస్తుంది సీత. దాహం అంటే వాననే కురిపిస్తుంది. ఆమె దయ్యమని మళ్ళీ భయపడ్తాడు. కోపంతో ఓ షావుకారుకు కుదవపెట్టి అన్నం ఆరగిస్తాడు.  ఆసెట్టిని విడిపించుకొని సీత బాలరాజు వెంటపడుతుంది. ఏడుస్తూ ప్రాధేయపడుతుంది అగ్నిదేవుని అనుగ్రహం పొందుతుందేకాని బాలరాజు మనసులో ప్రేమ పుట్టించలేకపోతుంది. ఆ రాత్రి దొంగలు వచ్చి సీతను ఎత్తుకెళ్తారు. బాలరాజు సీత జాడలో వెళ్తాడు.  ఓ మునీశ్వరుని శాపానికి గురై పాముగా మారతాడు.

సీత, పామురూపంలో వున్న బాలరాజును తీసుకొని తీర్థయాత్రలు చేస్తుంది. ధనుష్కోటిలో, మళ్ళీ బాలరాజుగా మారుతాడు. ఆ యిద్దరూ ఓ శెట్టి పంచన చేరుతారు. శెట్టి బాలరాజును ఈటెతో కొట్టి చంపి, సీతను చెరచబోతాడు. అశ్వనీ దేవతలు సీతకు సంజీవని మÖలిక యిస్తారు. దాంతో బాలరాజును బ్రతికిస్తుంది సీత.

సీత సంగతులు తెలుసుకున్న ఇంద్రుడు, వేటగాడి వేషంలో వచ్చి నిర్బంధిస్తాడు. మళ్ళీ అదృశ్యమై  మాయా సీత రూపంలో వచ్చి బాలరాజును కలుస్తాడు. అసలు సీత సంజీవని మాలను విసరివేయగా బాలరాజు చనిపోతాడు. 

సీత ఆగ్రహంతో ఇంద్రుని శపించబోతుంది. శచీదేవి పతిభిక్ష కోరినా వినదు. చివరకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై బాలరాజును బ్రతికించి దేవేంద్ర లోకానికి ఆహ్వానిస్తాడు.

ఆ స్వర్గం కంటే sTÖ భూతలస్వర్గమే  మేలని, సీత బాలరాజులు కోరుకొని సుఖంగా ఉంటారు.

సాహితీ విశేషాలు:

‘బాలరాజు’ జానపద చిత్రమైనప్పటికీ పురాణ పాత్రలు ప్రధాన పాత్ర వహించాయి. ఈ చిత్రంలో ఇంద్రుడే  ప్రతి నాయకుడు. ప్రేమ విషయంలో సంఘర్షణను చెప్పారు. దేవతలైన, యక్షులైన, మానవులైన - ఎవరైనప్పటికి స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అనివార్యమని, ప్రేమే శాశ్వతమని అంతర్లీనమైన సందేశం కనిపిస్తుంది.

దేవలోకం భూలోకంల మధ్య తిరిగిన ఈ కథకు ప్రాణం పోసింది స్క్రీన్‌ప్లే. ఆ తరువాత సంభాషణలు.. సముద్రాలవారు ఆయా పాత్రలకు అనుగుణంగా భాషను యాసను వాడారు.

బాలరాజు, మాండలికాల్లో మాట్లాడితే సీత దేవభాషలో భాషిస్తుంది. ఎప్పటిలాగే ఆనవాయితీగా సముద్రాలవారు సందర్భానుసారంగా సామెతలు, జాతీయాలు వుపయోగించారు. ఉదాహారణకు :

1 దేవేంద్రా! నీ ప్రాణాలు దక్కించడానికి ప్రాణాలు తలనుండితోకకు వచ్చాయి. అని (శివుడు)క్లైమాక్స్‌లో అంటాడు. అలాగే

2. బిగిస్తే తెగుద్ది...... (శివరావుతో అతని సహచరి)

  3. ఇనాళ్ళూ గాలినే భోంచేశావు (పామునుండి బాలరాజుగా మారినప్ప్పుడు సీత, నాగజ్యోతి స్వభావం అర్థమయ్యేట్లు పలికింది.)

4.  పిచ్చివాడి చేయిరాయిలాగా ఏదో ఒక్కసారి తగిలింది” (ఆకలేస్తున్న బాలరాజు సీతను మహిమలు చూపించి అన్నం తెమ్మని ఆదేశించినప్ప్పుడు)

5.  ఏటికెదురీదుతున్నావు (శివాలయంలో సీత బాలరాజుతో)

ఇక sTÖ చిత్రం తాలూకు పాటల తోటలో, ఎన్నో పరిమళ పారిజాత పదబంధాలు తేనెలూరు తెలుగును కలుపుకొని, వికసించాయి.

మిఠారి (విలాసవతి, యువతి)

మొయిలుభామ (మబ్బు కన్నె)

ముంజేతి మురుగులు (కంకణాలు)

కుదవపెట్టడం (తాకట్టు)

వరాలకూన

గునాలగున్న

దూసరి (గడ్డి)

తెంపరి (సాహసి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి