మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

8, అక్టోబర్ 2026, గురువారం

పాతాళభైరవి

అనగనగనగనగా - ఉజ్జయిని అని ఒక నగరం. ఆ నగర పాలకుడికి ఒక్కతే కూతురు - ఇందుమతి. రాజుగారు, రాణిగారు, కూతురూ అంతే వాళ్ల కుటుంబం అయినా, ఆ కుటుంబంలోనే ఇంకొక ‘గందోళి’గాడున్నాడు - శీను. రాణిగారికి ముద్దుల తమ్ముడు. పనీ పాటా లేకుండా, “రాణీగారి తమ్ముణ్ణి” అని ఆవిడని అడ్డుపెట్టుకుని ప్రగల్భాలు పలుకుతూ అడ్డూ ఆపూ లేకుండా తిరుగుతూ వుంటాడు. పన్ను కట్టమని, దొరికినవాళ్ల దగ్గర దొరికినవి అందిపుచ్చుకుంటూ వుంటాడు. ఈ ప్రబుద్ధుడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యాలని రాణి గారికి ఉబలాటం. అందుమీదనే శీను కూడా ‘ఇందు’ మీద మనసుపడ్డాడు.

రాజుగారి కోటను ఆనుకుని పెద్ద ఉద్యానవనం. చెట్లు, మొక్కలు, పూలతో రమణీయంగా వుంటుంది. ఆ తోటలోనే ఒక మÖల వున్న చిన్న ఇంట్లో తోటని కాపలా కాసే రాముడు, అతని చెలికాడు అంజి - రాముడి తల్లీ కాపురం వుంటారు. రాముడి తల్లి తోటలోని పూలుకోసి మాలలు కట్టి అంతఃపురానికి అందజేస్తుంది. రాముడికి తోటేగాని, కోటలోకి ప్రవేశం లేదు. ఐతే రాముడు, నిక్కచ్చి ఐన మనిషి. అన్యాయాన్ని సహించడు. సాహసం చేయగల మొనగాడు; సాహసం చెయ్యాలన్న ఆలోచన గలవాడూ. పైగా మనిషి అందగాడు. ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాడు. గుండెబలం, కండబలం వున్నవాడు గనక, ఎందుకైనా మంచిదని సాముగరిడీలు అభ్యసిస్తూ వుంటాడు. ఇదే కథారంభం. మిత్రుడైన అంజి, రాముడు కర్రలతో సాము చేస్తూ వుంటారు. అంజి బక్కవాడు. గిరగిర తిరిగిపోతూ వుంటాడు. సాములో ఏ చిన్న దెబ్బ కొట్టినా, తూలిపోతూ పడిపోతూ లేస్తూ మళ్లీ రాముడితో తలపడుతూ వుంటాడు. శుభ్రమైన పని చేసుకోకుండా ఈ కొట్టుకోడాలు, కొట్లాటలూ తల్లి శాంతమ్మకి నచ్చవు. వాళ్ల సాము విద్యాభ్యాసాన్ని ఎదుర్కొని తిట్టింది. వాళ్ల చేతుల్లో వున్న కర్రలు తీసుకుని చెరో దెబ్బా వేసింది. అంజి కుయ్యో మొర్రో మన్నా రాముడు తల్లి కొట్టిన దెబ్బలన్నీ భరించాడు. పైగా, ఆమె ముందు వంగి వీపు చూపించి, “కొట్టవే కొట్టు” అన్నాడు. ఆమె విసిగిపోయి “ఓరి భగవంతుడా! ఒక కొడుకునిమ్మంటే ఈ రాక్షసుణ్ణి ఇచ్చేవేమిరా!” అంది నిస్సహాయంగా, కర్ర విసిరేసి. అంజిగాడు వెర్రి నవ్వు నవ్వాడు. ఈ ‘వెర్రినవ్వు’ వాడి అలవాటు. గులకరాళ్లు గిన్నెలో వేసి ఆడిస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలా నవ్వుతూ వుంటాడు. ఇద్దర్నీ చెవులు పట్టుకుని ఇంట్లోకి ఈడ్చుకెళ్తూ “రాజకుమారి వచ్చే వేళయిందిగాని, కొంపలో చావండి” అంది. అంజిగాడు కోయిల కూతలు మొదలు పెట్టాడు. “ఒరే అంజిగా! కూతలు కూసేవంటే పీక పిసికేస్తాను” అంది శాంతమ్మ.

అంతలో రాకుమారి, చెలులతో వనవిహారానికి వచ్చింది - పాటతో. 

బృందం : తీయని ఊహలు హాయిని గొలిపే

వసంతగానమె హాsTÖ

వసంతనాట్యమె హాయ్ హాయ్ ॥తీయ॥

ఇందు : చివురులదాగి  తీవెల నూగి

పూవులు ఘుమఘుమ నవ్వగా

వనియంతా పరిమళించెనే

మనసెంతో  పరవశించెనే ॥తీయ॥

ఇందు : గిలిగింతల చెరలాడి

చిరుగాలి సరాగము సేయగా

వనియంతా ఝల్‌ఝలించెనే

తనువెంతో పులకరించెనే ॥తీయ॥

ఇందు : క్రొత్తరాగమున కుహూ, కుహూ యని

మత్తిలి కోయిల కూయగా

వనియంతా రవళించేనే

నన్నెంతో మురిపించేనే ॥తీయ॥

పాట మధ్యలో రాముడు, అంజి, మొక్కల చాటు నుంచి రాకుమారిని చూశారు. ఆమె అందానికీ, సౌకుమార్యానికీ, పాటకీ రాముడు మైమరిచిపోయాడు. “ఒరే అంజీ! ఒక్కసారి రాజకుమార్తె పక్కన నిలబడితే చాలురా!” అన్నాడు ఆ మైకంలో. అంజి ఈసడిస్తూ “అమ్మరోయ్ అమ్మ” అన్నాడు. ఇద్దరూ మొక్కల మధ్య నక్కారు. శాంతమ్మ దాటి పోగానే, ఇద్దరూ తోడుదొంగల్లాగా - బయటికి పరుగెత్తారు.

ఆ ఊరి సత్రం ముందు బుర్రకథ లాంటి పాట ఒకటి జరుగుతోంది. చాలామంది జనం కూచుని వింటున్నారు.  

పల్లవి: ఇతిహాసం విన్నారా  ఆ 

అతిసాహసులే ఉన్నారా

హెచ్చరికో  హెచ్చరిక  హోయ్

హెచ్చరికో  హెచ్చరిక

1.చ॥ యక్షుల నిధులు అందరివండీ

ప్రక్షిప్తాలవి పాతాళంలో

రáక్ష వుంటవి లక్ష శక్తులు

దక్ష సాహసికె దక్కేనండోయ్ ॥ఇతి॥

2.చ॥ జగతి సాహసమె జయకథ కాగా 

యుగయుగానికొక కథానాయకుడు

జగన్మంగళము సాధించేనూ 

ప్రగల్భమణిగా వెలిగేనూ

శూలాగ్రానికి సూటిగ గురియై 

వ్రీలిన సాహస విక్రమార్కుడు

మట్టిబొమ్మలను మహా రణానికి

జట్టునడిపిన శాలివాహనుడు ॥హెచ్చ॥

విజయసాధనల వింతకథలతో 

ఉజ్జయినీ పురి నుజ్జ్వలించిరే ॥హెచ్చ॥

3.చ॥ నాటివారివలె నేటి వారునూ 

చాటగలరయా సాహసమంటూ 

ఘాటుఘాటుగా కథ నడిపింపగ 

నేటికెవడు మరి కథానాయకుడు. 

నీవా!........నీవా!..........నీవా..?!

ధీరుల గురించి, వీరుల గురించీ పాడుతూ “అతి సాహసులైన వారున్నారా?” అని ఆమె అడిగితే ప్రేక్షకజనం నుంచి ఒకడు - “ఉన్నాడున్నాడు! మా భలేరాముడున్నాడు!” అని ప్రకటించాడు - రాముడిని చూస్తూ. పాట పూర్తి కావడంతో పాటు - వెనకాల శబ్దం వినిపించింది. అందరూ అటు చూశారు. “రాణీ గారి తమ్ముడు! రాణీ గారి తమ్ముడు” అని వినిపించగానే అందరూ కాస్త ఉలిక్కిపడ్డారు. భటుల్ని వెంట బెట్టుకుని ఠీకు ఠాకుగా సత్రంలోకి ప్రవేశించాడు - రాణిగారి తమ్ముడు. “ఏమిటీ సంత?.. ఏం చేస్తున్నారు?” అని అధికార కంఠంతో అడిగాడు రాణిగారి తమ్ముడుగా శీను.

“ఏదో కాస్త వినోదంగా...” అంది ఆ గాయని. “వినోదం ఏమిటి - తప్ప్పు తప్ప్పు! ప్రమాదం... మహాపరాధం... పన్నిచ్చుకోవాలి...” అన్నాడు - ‘వినోదప్పన్ను’ రాజాజ్ఞ కాకపోయినా బావమర్దిగారి జులుం. ప్రతిదానికీ ‘తప్ప్పు తప్ప్పు’ అంటాడు - తను చేసేవి అన్నీ తప్ప్పుడు పన్లే అయినా! - అది ఆ తమ్ముడిగారి ఊతపదం. “పన్నిచ్చుకోవాలి-” అని భటులు ప్రేక్షకజనం మీద పడ్డారు. 

బామ్మర్దిగారు ఒకడిని తీవ్రంగా చూస్తూ “ఎవడివోయ్ నువ్వు?” అని అడిగాడు కఠినంగా. ‘కొత్తవాడిని’ అన్నాడు అతను. “కొత్తవాడు సత్రం వేపు రావడం ఏమిటి - తప్ప్పు తప్ప్పు!” అని దబాయించేసరికి, అది చూసి రాముడు తీవ్రంగా స్పందించాడు. అందరూ భయపడి వణికిపోతున్నారు. సైనికులు అందరి మీదా పడి, దొరికింది దోచుకుంటున్నాడు.

“నీదేవూరు?” అని ఇంకొకడిని అడిగాడు.

“పారశీకం”

“పారశీకం ఏమిటి తప్ప్పు తప్ప్పు... పరశోకం.. పరశోకం” అని ఇంకొకడిని చూశాడు. “టింగురంగాగా వుందే - తీసుకోండ్రా!” భటులు టోపీ లాక్కున్నారు. ఒక ముసలి వ్యక్తి - బిచ్చగాడిలా వున్నాడు. అతని దగ్గరకొచ్చాడు శీను. “ఏయ్ తాతా!... ఏయ్ తాతా!...” అని కాలితో తన్ని “నీదేవూరు?” అని గసిరాడు. “యాత్రికుణ్ణి”.

“యాత్రేమిటి యాత్ర - తప్ప్పుతప్ప్పు... పాత్ర తీసుకోండ్రా...” అతని దగ్గర వున్న అడుక్కునే పాత్ర లాక్కున్నారు భటులు.  

గాయనికి మండిపోతోంది... “ఛీఛీ... ఈ పోతరాజును తరిమి పెట్టలేరూ - ఎవరికీ సాహసం లేదూ?” అంది తీవ్రంగా. రాముడు అంతకంటె తీవ్రంగా గమనిస్తున్నాడు ఆ దబాయింపులు.

“ఏమిటే కటారున కస్సుమంటున్నావు? గూప్పగిలేను” అన్నాడు శీను ఆమె దగ్గరికి వెళ్తూ. ఈ లోపల అతని గూబే గుభేలుమంది. ఆ దెబ్బకి అటూ ఇటూ చూశాడు. “దొంగదెబ్బ కొట్టాడేమిటి? తప్ప్పు తప్ప్పు! ఎవడు వాడు?” అని అరిచాడు.

“ఒరేయ్ వీళ్లని చావదన్ని దోచుకున్నవన్నీ కక్కించండ్రా!...” అని సాహసంగా ఆనతిచ్చాడు తోటరాముడు.  భటుల మీద పడి దోచుకున్నవన్నీ తిరిగి లాక్కున్నారు ప్రజ. రాముడు రాణిగారి తమ్ముణ్ణి పట్టుకున్నాడు- “దౌర్జన్యం చేస్తావు?” అని, గిరగిర తిప్పబోయాడు.

“మీది కొస్తావేమిటి - తప్ప్పుతప్ప్పు! నన్ను చూసి జడవాలి! నేను రాణిగారి తమ్ముణ్ణి. వీర వీరశూరసేనుణ్ణి” అని అప్పటికే ఏడుపు మొహం పెట్టాడు.

“ఓహో... రాణిగారి తమ్ముడివా! దోపిడికి వచ్చావు!” అని నాలుగు దెబ్బలు వేశాడు రాముడు. జనం ‘ఆహా’ అంటూ నవ్వారు. శీనుకి ఏడుపు వచ్చేసింది. “నన్ను కొడతావేమిటి - తప్ప్పుతప్ప్పు!” అన్నాడు ఏడుస్తూనే.

“నువ్వు ఏడుస్తావేమిటి తప్ప్పుతప్ప్పు” అని ఎగతాళి చేశాడు అంజి. ‘పన్ను కావాలీ?” అంటూ రాముడు కొట్టడం, శీను “వొద్దు.. వొద్దు.. వదులు” అని ఏడవడం చూసి, అంతా గొల్లున నవ్వారు. శీను విదిలించుకుని పారిపోతూ - భటుల్ని పిలిచాడు. అప్పటికే అందరూ పారిపోయారు.

“అందరూ పరారయ్యారా... ఉండు - రాజుగారితో చెప్పి... తప్ప్పుతప్ప్పు... మా బావగారితో చెప్పి నీ తల తీయిస్తాను” అని ఏడ్చుకుంటూనే, పరుగెత్తాడు రాణిగారి తమ్ముడు తోక ముడుచుకుని. జనం అంతా రాముడి సాహసాన్ని అభినందించారు. అతని తల మీద పాగా పెట్టి - గౌరవించారు.

“కధానాయకుడి లక్షణం చూపించావోయ్! ఉజ్జయిని పరువు నిలబెట్టావు. విజsTÖభవ! దిగ్విజsTÖభవ!” అని గాయని రాముడిని అభినందించింది.

“కధానాయకుడికీ - జై” “భలేరాముడికీ జై” అని అందరూ జయజయ ధ్వానాలు చేశారు. రాముడు విజయగర్వంతో అందర్నీ ఆప్యాయంగా చూశాడు.

రాజుగారు, రాణీగారూ ముచ్చటగా చదరంగం ఆడుకుంటున్నారు. సుడిగాలిలా వచ్చాడు శీను - కొంప మునిగినట్టు అరుస్తూ.

“అక్కయ్యా! బావగారూ! రాజద్రోహులు కుట్ర చేస్తున్నారు.”

“ఎక్కడ్రా?” అంది రాణి.

“సత్రంలో అక్కయ్యా! తెగ విర్రవీగిపోతున్నారే - ఇక పన్నూ గిన్నూ ఇచ్చేది లేదుట. రాజెంత? రాణీ ఎంత? అంటున్నారు”.

ఆ మాటకి రాజుగారు ఆశ్చర్యపోలేదు; కంగారు పడలేదు. చిన్న చిరునవ్వుతో చూశాడు. ఎందుకంటే, ఈ శీను బావమర్ది కబుర్లు అన్నీ అతిశయోక్తులని తెలుసు; అతని పిరికితనమÖ తెలుసు.

“అలా చూస్తారేమండీ! వాళ్ల తలలు తీసి కోటగుమ్మానికి కట్టించక!” అంది రాణి ఆవేశంగా.

రాజుగారు తణుకు బెణుకూ లేకుండా - “రాణీ! ఎవరి తలలో, ఎందుకు తియ్యాలో అదైనా తెలియాలా?” అన్నాడు.

“చెప్పరా తమ్ముడూ. వింటారు”.

“తోటరాముడే!... తోట ముసిల్దాని కొడుకు. వట్టి కొండముచ్చు. మడ్డి మొహం. దొడ్డి కాళ్లు...” అంటూ చెప్పబోయి అటుచూసి ఆగాడు. ఇందు వస్తోంది. 

“ఏమిటి మామయ్యా! ఎవర్నలా పొగుడుతున్నావ్?” అంది.

“పొగడ్డం ఏమిటి - తప్ప్పుతప్ప్పు తిడుతున్నా”

“ఆ తోటరాముడు ఏం చేశాడో సరిగ్గా చెప్పరా!”

“ఇంకేం చెప్పనే అక్కయ్యా! వాడు రాజు కావాలిట. వాడి స్నేహితుడు అంజిగాడు మంత్రి కావాలిట. వాళ్లిద్దరూ జట్టుగాళ్లతో చేరి కుట్ర చేస్తున్నారు!”

“నువ్వు చూస్తూ వూరుకున్నావా మామయ్యా” అంది చిరునవ్వు చిందిస్తూ యువరాణి.

“ఊరుకున్నానూ! అల్లకల్లోలంగా చెల్లాచెదురు చేశాను. పారిపోయారు వెధవలు!” అన్నాడు ప్రగల్భాలతో చేతులు ఊపేస్తూ.

“మంచిపని చేశావ్!” అన్నాడు రాజు గారు నిదానంగానే.

“మా తమ్ముడు అబద్ధం చెప్పినట్టు చప్పరిస్తా రేమిటీ”

“నిజం బావగారూ! దైవసాక్షిగా. వాడిని పట్టి తెప్పించి చిత్రవధ చెయ్యాలి”.

“అవును ఇంతటితో పోనిస్తే ఎంతకయినా తెగిస్తాడు! వాడిని ఇప్ప్పుడే తెప్పించి ఉరి వేయిస్తాను” అంది రాణి.

“రాణీ!... నేను న్యాయం చేస్తాను వుండు!” అని రాజుగారు, ద్వారం వేపు చూస్తూ - “ఎవర్రా అక్కడ?” అని అరిచాడు. “నేను!” అనేసి వెంటనే నోరు మÖసుకున్నాడు శీను. ఇందుమతి కిసుక్కున నవ్వింది. మళ్లీ రాజుగారు ‘ఎవరక్కడ’ అని పిలవగానే ప్రతీహారి వచ్చి నించున్నాడు.

“ఎవరో ఆ తోటరాముడు, అంజి ఎలా వున్నవాళ్లని అలా పట్టి తీసుకురండి” అని ఆజ్ఞాపించాడు రాజు. ప్రతీహారి వెళ్లాడు.

తోటరాముడి కుటీరం అరుగు మీద కూచుని శాంతమ్మ కూనిరాగాలు తీస్తూ పూలమాల కడుతోంది.   తోటరాముడికి సన్మానం జరిగిన దుస్తులు, పాగాతో వచ్చాడు. వస్తూ మీసం కూడా అంటించుకున్నాడు. “పిన్నీ” అంటూ అంజి వచ్చాడు.

“పిన్నీ అని ఏ మొహం పెట్టుకుని వచ్చావురా! ఇంట్లో ఉండండ్రా అంటే ఎలా మాయమయ్యారు? ఏడీ వాడేడి?” అంది శాంతమ్మ.

నడక మార్చి చేతులు వూపుకుంటూ మారువేషంలో వచ్చాడు రాముడు. “శాంతమ్మా” అని పిలవగానే పెద్దమనిషి వచ్చాడని లేచి నించుంది భయంగా.

“మీ అబ్బాయెక్కడ?” అని అడిగాడు గంభీరంగా.

“లేడు. ఎక్కడికి వెళ్లాడో”

“అన్నం పెట్టావా?”

“పెట్టేను బాబూ”

“మÖడు పూటలా కడుపునిండా పెడుతున్నావా?”

“ఎందుకు పెట్టను బాబూ! అలా అడుగుతారేం?”

“వాడితో పాటు వీడికీ పెడుతున్నావా?” అన్నాడు అంజి అదే కంఠంతో తనని చూపించుకుంటూ అని వాడి ధోరణిలో గలగలా నవ్వేసరికి శాంతమ్మ ఆ పెద్దమనిషిని గుర్తు పట్టేసింది. “ఆరి భడవా! టక్కులు కూడా నేర్చావూ? ఎక్కడివిరా ఈ దుస్తులు” అని అడిగేసరికి, భటులు వచ్చి పిలిచారు.

“రాజుగారు మీ ఇద్దర్నీ పిల్చుకురమ్మన్నారు. రండి” అన్నాడు భటుడు ఆజ్ఞాపూర్వకంగా.

“రాజుగారు రమ్మనడం ఏమిట్రా! ఏం నేరం చేశార్రా?” అని శాంతమ్మ కంగారు పడింది.

“భయపడకు పిన్నీ... గౌరవించి పంపుతార్లే” అన్నాడు అంజి. 

“భయపడకమ్మా. ఇప్ప్పుడే వస్తాం” అని ఇద్దరూ భటులతో కదిలారు. 

భటులు రాముడినీ, అంజినీ తీసుకొచ్చారు.

“తోటరాముడు, అంజి వీరే ప్రభూ!” అన్నాడు భటుడు. రాముడి రూపాన్ని చూసి, రాజుగారు అబ్బురపడితే, పక్కనే కూచుని తమలపాకులకి సున్నం రాస్తున్న రాకుమారి ముచ్చటపడింది. రాముడు వినయంగా నమస్కరించాడు. పక్కనే నిలబడివున్న శీను అసహ్యంగా, కోపంగా చూశాడు రాముడిని.

“అంత ఠీవిగా నించోడం ఏమిటి - తప్ప్పుతప్ప్పు! తలవంచుకుని నించోవాలి” అన్నాడు దబాయిస్తూ.

“తలవంచుకోడానికి నేనేం తప్ప్పు చేశానని?” రాముడి ప్రశ్న. ఆ మాటకే రాజుగారు విస్మయపడి, “వీడా తోటరాముడు! ఎవరికినీ తలవంచని యువకుల సాహసమే లక్ష్మి ఉజ్జయినికి! మరి నా పరిజనమే ఇంత చూడముచ్చటగా 

వుంటే-”

“తర్వాత మెచ్చుకోవచ్చును గాని ముందు...” అని రాణిగారు ఆనతిచ్చింది రాజుగారికి.

“అవునవును. విచారణ జరగాలి కదూ! తిప్పలు పెట్టకుండా చప్ప్పున ఒప్ప్పుకుంటావా అబ్బాsTÖ!”

“నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా మహారాజా!” అని చేతులు కట్టుకుని అడిగాడు రాముడు మరింత వినయంగా.

“నిజమే చెప్పవోయ”

“సత్రంలో గలభా చేస్తుంటే ఆయన్ని కొట్టాను. నిజమే ప్రభూ” అన్నాడు రాముడు ధైర్యంగా. “అబద్ధం! నేను రాణిగారి తమ్ముణ్ణోయ్! నన్నే కొట్టానంటావ్!” అని దబాయించాడు శీను.

“మరి! కొట్టకేం చేస్తాను? రాణిగారి తమ్ముడినని, రాజుగారి బావమరిదినని అందర్నీ భయపెట్టి, వీరకథ వింటూ వుంటే వినోదానికి పన్ను తెమ్మని చిన్నాపెద్దా లేకుండా అక్రమంగా జనాన్ని పీడిస్తూ తమకూ తమ ప్రతిష్ఠకూ అవమానకరంగా ప్రవర్తిస్తూవుంటే, కొట్టాను. ముమ్మాటికి నిజమే ప్రభూ!” అని జరిగిన విషయం బయటపెట్టాడు నిక్కచ్చిగా. 

“ఆరు మాటలకి అబద్ధం. వీడు నన్ను కొట్ట లేదు, కొట్టలేడు కూడా!” అని భయపడుతూనే చేతులు అడ్డం పెట్టుకుని దబాయించాడు శీను. వెంటనే అంజి గలగలా నవ్వాడు. “కొట్ట లేకపోవడం ఏమిటి - తప్ప్పుతప్ప్పు! కొట్టగానే తమరు పారిపోయినప్ప్పుడు జారిపోయిన... తమ... పట్టుకుచ్చి టోపీ కిరీటం!” అని, అతగాడి టోపీ తీసి చూపించాడు అంజి - గలగల నవ్వి.

“అది నాదా!... కాదు!” అని దబాయించాడు శీను తన టోపీ చూసి. దూరంగా వున్న చెలులు కిసుక్కున నవ్వారు. సర్వం అర్థమైంది రాజుగారికి. వ్యంగ్యం జోడించి చిరునవ్వు నవ్వాడు. “రాణీ! ఏమిటిదంతా!” అనగానే, రాణికి తమ్ముడి వాళకం అర్థమై చరచరా నడిచి వెళ్లిపోయింది. ‘అక్కయ్యా’ అంటూ వెంటబడ్డాడు తమ్ముడు. 

“ఒరేయ్! అక్రమమైనా, అధర్మమమైనా శిక్షించేది మేము! మా అధికారంలో మీరు చెయ్యి చేసుకోరాదు. బుద్ధి కలిగి బ్రతకండి. పొండి” అని రాజుగారు హెచ్చరించినా, ఆ హెచ్చరికలోనూ మెచ్చుకోలు వుంది. 

“రాజుగారికి నమస్కరించి, యువరాణి వేపు తన్మయుడై చూసినా చిన్న నమస్కార బాణం వేసి, రాముడు వెళ్లాడు. వెంట అంజీ. రాముడి గంభీర సుందర రూపాన్ని తదేకంగా చూస్తూ వుండిపోయిన ఇందు వేపు చూసి “ఇందూ! న్యాయం చేశాను కదూ!” అన్నాడు రాజుగారు. ఇందు ఈ లోకంలో లేదు. తమలపాకుల మీద వేళ్లు సున్నం పూసేస్తున్నాయిగాని, దృష్టి రాముడు వెళ్లిన వేపే వుంది. రాజుగారు మళ్లీ “ఇందూ!” అని పిలిచి, ఈ లోకంలోకి రప్పించాడు. ఛట్టున గుర్తొచ్చి సున్నంతో నిండిపోయిన ఆకుల్ని రాజుగారికి అందించేసింది. ఆ ఆకుల్ని చూసిన రాజుగారికి కుమార్తె తన్మయం అర్థమై నవ్వుకున్నాడు.

తన వ్యవహారమంతా రాజుగారికి చెప్పేశాడని, అవమానంతో వేడెక్కిపోయి వణికిపోతున్న శీను - చెలికత్తెలతో వెళుతూన్న ఇందుకి ఎదురు వెళ్లాడు. “ఇందూ” అని పిలిచాడు గోముగా.

“ఏమిటి మామయ్యా?”

“తోటరాముడు నన్ను కొట్టాడంటే నమ్ముతావా!”

నవ్వేసి “అలాగేలే” అంది ఇందు.

“అలాగేలే ఏమిటి తప్ప్పుతప్ప్పు! శూర వీర ధీర సేనుడిని కొట్టాడంటే గొప్ప!”

“అలాగేలే” అని ముందుకు నడవబోయింది. 

“అలాగాలే ఏమిటి - తప్ప్పుతప్ప్పు!... గొప్ప కోసం కొట్టాడంటేనూ!” అని ముందుకురికాడు. మళ్లీ “అలాగేలే” అనేసి నవ్వుతూ వెళ్లింది ఇందు. చెలులు ఎగతాళిగా నవ్వడం చూసి, “అలాగేలే!” అని వెక్కిరించాడు శీను. 

రాకుమారికి తోటరాముడు ఎంతో బాగా నచ్చాడు. అతని రూపం ఆమె మనసులో గట్టిగా ముద్రించేసుకుంది. రూపమే కాదు, అతని ధైర్యం, అన్యాయాన్ని ఎదుర్కొనే సాహసం ఆమెను ఆకర్షించాయి. నిలువుటద్దంలో తన రూపాన్ని చూసుకుని మురిసిపోయింది. పెదవుల మీద ఆనంద సంగీతం తొణికిసలాడింది. 

“ఎవరికినీ తలవంచిన యువకుల సాహసమే లక్ష్మి ఉజ్జయినికి!” అని తండ్రి మెచ్చుకున్న మాట గుర్తొచ్చి - తలచుకుంది. ఆమె వెనకాలే వచ్చిన చెలి నళిని కూడా భలేరాముడిని పొగిడింది. ఇందు తన మనసులో రేగిన కలవరాన్ని అంతఃపురం మీద ప్రసరిస్తున్న వెన్నెలని అనుభవిస్తూ హాయిగా పాడుకుంది. తోటలో విహరిస్తున్న రాముడు కూడా తన మనోభావాన్ని గీతం రూపంలో అందుకున్నాడు.                         

ఇందు : కలవరమాయే మదిలో, నా మదిలో

కన్నులలోన కలలే ఆయే

మనసే ప్రేమమందిరమాయె ॥కల॥

రాము : కలవరమాయే - మదిలో, నా మదిలో

కన్నులలోన గారడి ఆయె

మనసే పూలమంటపమాయె ॥కల॥

ఇందు : నాలోయేమొ నవభావనగా 

మెల్లన వీణ మ్రోగిందీ

అనురాగాలే  ఆలాపనగా 

మనసున కోయిల కూసే ॥కల॥

రాము : నాలోయేమొ నవరసరాగం 

పిల్లనగ్రోవి ఊదిందీ

మోహాలేవో మోసులువేసీ 

ఊహాగానము చేసే 

కలవరమాయే మదిలో, నా మదిలో 

ఇందు : కన్నులలోన కలలే ఆయె 

మనసే ప్రేమమందిరమాయె

కలవరమాయె మదిలో, నా మదిలో 

రాము : కలవరమాయె మదిలో, నా మదిలో

రాకుమారి వచ్చేదారిలో రాముడు పూల ‘తివాచీ’ ఏర్పాటుచేశాడు. కుటీరం మధ్యలో వున్న ఊయల చుట్టూ పుష్పాలంకారాలతో తీర్చిదిద్దాడు. అదంతా గమనిస్తున్న అంజిని చూసి - “నిజం చెప్పరా! ఈ పూలపందిరితో ఈ తోటకంతా అందం రాలా?” అని అడిగాడు.

“ఎందుకు రాదయ్యా! మనసు కళగా వుంటే పని కూడా కళకళ్లాడుతూ వుంటుంది” అని ‘ఆహాహా’ అని ఉయ్యాల్లో కూచున్నాడు అంజి.

“అహఁహఁ... అక్కడ రాజకుమారి కూచోవాల్రా”

“పోనీ, ఇలా కూచుంటాలేవయ్యా” అని పక్కకి జరిగాడు అంజి. “అక్కడ మనం కూచోవాల్రా!” అన్నాడు రాముడు, అంజి ఆశ్చర్యపోయేలా. ఆశ్చర్యపోయిన అంజి - “అంటే?” అనడిగాడు వెర్రిమొహం వేసుకుని. “అంటే - మనం రాజకుమారిని పెళ్లి చేసుకుంటున్నామురా!” అన్నాడు రాముడు, అంతస్తులు, హోదాలూ, తేడాలూ మరిచిపోయి.

“అంటే?”

“అంటే, మనం ప్రేమించడం, మనం అంగీకరించడం అయిపోయింది”

“అంటే?”

“ఇంక రాజకుమారిదే భారం. అంటే...” అని చెప్పబోయేసరికి అంజి గలగలా నవ్వేశాడు. ఆ నవ్వుల మధ్య వచ్చింది నళిని. “అంటే - రాజకుమారి వస్తోందిగాని, ఎక్కడైనా ఊరేగండి” అంది తీవ్రంగా.

“నేను చస్తే ఇక్కడి నుంచి కదలను” అని పూల ఉయ్యాల మీద శయన విన్యాసం చేశాడు. “నేను చస్తే ఇక్కడ ఆగను” అని అంజి నళినితో తప్ప్పుకున్నాడు. రాకుమారి వచ్చి చూసేసరికి తన ‘కలల పురుషుడు’ కళ్లు మÖసుకుని పూలపాన్పు మీద కనిపించాడు. ఆనందంతో పరవశించినా, ఇష్టం లేనట్టు నళినిని పిలిచింది.

కళ్లు మÖసుకునే వున్న తోటరాముడు ఆనంద పారవశ్యంలో అన్నాడు: “రాజకుమారీ! నీ కోసం ఎంత తపించిపోతున్నానో నీ కెలా తెలుస్తుంది? నా ప్రేమ సందేశాన్ని నీకెలా పంపుకునేది? నీవు విహారానికి రాగానే నా ప్రేమనే పరిమళించమనీ పువ్వుల్ని అడిగాను. నా వలపునే వెదజల్లమనీ మలయ పవనాన్ని వేడుకున్నాను. నా అనురాగాన్నే తీయగా పాడమని కోయిలని బ్రతిమాలుకున్నాను. నీ సోయగానికి జోహారు చేశాను.”

తనని ప్రశంసలతో పులకితను చేస్తున్న కవితాభావం గ్రహించిన రాకుమారి - సిగ్గు ఆనందాల కలబోతతో పరవశించింది. కాని, సర్దుకుని “నళినీ” అని పిలిచి - ఏమీ ఎరగనట్టు “ఎవరే ఈ పురుషుడు?” అంది. “ఈ పురుషుడా!... ఏమోనమ్మా... ఎప్ప్పుడూ చూడలేదే!” అంది తనూ ఏమీ ఎరగనట్టు. “నోరు మÖసుకుని అవతలకి పంపించు” అంది ఇందు. నళిని పక్కనే ఉన్న చిన్న కూజాని తీసుకుని రాముడి తల మీద కొట్టబోతే - వెంటనే వారించింది రాకుమారి.

“ఓహో... విసరాలి కదూ” అని పూలచెండుతో విసురుతూ తలమీద దెబ్బ వేసింది. ఏమీ తెలియనట్టు రాముడు లేచాడు - “ఏమిటిది... ఎక్కడున్నాను?...” అన్నాడు అయోమయం నటిస్తూ. “ఆకాశంలో వున్నావుగాని అంతలకి నడువు” అంది నళిని. అప్ప్పుడే రాజకుమారిని చూసినట్టు రాముడు “ఓ!... రాజకుమారి! దయ చేయండి దయ చేయండి” అన్నాడు లేచి ఊయల చూపిస్తూ.

“ఏమిటీ భయం లేకుండా! ఇక్కడెందుకున్నావ్?” అని రాకుమారి గద్దించింది.

“నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా?” అన్నాడు వినయంగా రాముడు. ఈ మాట అనడం అతనికి అలవాటు. “నీ పెంకితనం నా దగ్గర కాదుగాని, నిజమే చెప్ప్పు!”

“ఈ పుష్పం తోటకంతా పరిమళం తెచ్చింది. మీకు కానుకగా ఇచ్చుకుందామని!” అని ఒక పుష్పాన్ని ప్రేమగా సమర్పించబోయాడు రాముడు.

“ఏమిటీ భయం లేకుండా! నీవూ నీ సాహసం” అని గదమాయించింది ఇందు. అంతలో శాంతమ్మ కేక వినిపించింది. మిత్రులిద్దరూ కంగారు పడి సర్దుకున్నారు.

“సుపుత్రా కొంప పీకరా అని, ఏం చేస్తున్నావురా ఇక్కడ?”

“ఏమీ లేదమ్మా” అని వంగాడు కొట్టమని. 

“ఓరి భగవంతుడా! ఒక కొడుకునిమ్మంటే ఈ రాక్షసుడిని ఇచ్చేవేమిరా?” అంది శాంతమ్మ తన ధోరణిలో. రాకుమారి వేపు తిరిగి - “తల్లీ రాజకుమారీ! ఏం చేసినా ఈ ఒక్కసారి కాపాడండి. ఒక్కగానొక్క కొడుకు. ఎపుడొస్తుందిరా నీకు బుద్ధి?” అంది. వెంటనే దూరంగా నిలబడిన అంజి అందుకున్నాడు - “పెళ్లి చెయ్యి పిన్నీ వెంటనే వస్తుంది” అని.

“ఆఁ ఆఁ...  ఇంకొకసారి ఇలాగే చేస్తే నిజంగానే అవుతుంది పెళ్లి! పదండి పదండి!” నిష్క్రమిస్తున్న రాముడిని చూసి, ఇందు మనసు తిప్ప్పుకోలేకపోయింది. ఆమె ఊహలో అతగాడే మెదుల్తున్నాడు.

ఆ రాత్రి నిండు పున్నమి వెన్నెల కాంతిలో మేడ మీద వసారాలో రాకుమారి విహరిస్తూ వుంటే - ఆ పిల్లగాలులు విరహం పెంచాయి. ఆనందంగా రాకుమారి పాడుకుంది. తోటలోని మొక్కల మధ్య వున్న నీటి ఊట వెన్నెల కాంతుల్ని ప్రతిఫలిస్తూ వుంటే - రాముడు కూడా పాట అందుకున్నాడు.

ఇందు : ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్రవీక్షణమో! ॥ఎంత॥

కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే...... 

నా మనసు మురిసెనే                                              ॥ఎంత॥ 

రాము : ఎంత లేత వలపులో, ఎంత చాటు మోహములో! ॥ఎంత॥

కన్నులలో కనినంతనె తెలిసిపోయెనే 

నా మనసు నిలిచెనే ॥ఎంత॥

ఇందు : ఈ జాబిలి, sTÖ వెన్నెల, ఈ మలయానిలము

విరహములో వివరాలను విప్పి చెప్పెనే! ॥ఎంత॥

రాము : ఓ జాబిలి, ఓ వెన్నెల, ఓ మలయానిలమా!

ప్రియురాలికి, విరహాగ్నిని పెంపుజేయరే!!          ॥ఎంత లేత॥

రాణి గారికి తమ్ముడిని ఎలాగైనా అల్లుడిని చేసుకోవాలని ఆరాటం. కాని, అమ్మాsTÖ ఒప్ప్పుకోదు. ఆయనా ఒప్ప్పుకోరు. ఐనా ఏదో ప్రయత్నం చెయ్యాలని ఆ మÖర్ఖుడిని అందంగా పెళ్లి కొడుకులా ముస్తాబు చేసి, రాజుగారి దగ్గరకి పంపింది. ఆ తెలివితక్కువవాడు రాజుగారి ఎదుట నించుని, తన రూపం చూపించి, మురిసిపోయాడు. ఆ వికార ఆకారాన్ని చూసి రాజుగారు నవ్వుకుని,

“రాణీ! నీ తమ్ముడు పెళ్ళికూతురవుతున్నాడేమిటి?” అన్నాడు.

“పెళ్లికూతురేమిటి తప్ప్పుతప్ప్పు! పెళ్లికొడుకుని బావా!”

“ఇవాళ మనం తాంబూలాలు పుచ్చుకుందాం. నేను మా తమ్ముని వేపు. మీరు మీ కూతురి వేపు” అంది రాణి గోముగా చూస్తూ.

“అలా ఆ మాటంటూ వుంటే ఎంతో ముద్దొస్తున్నావు రాణీ!” అన్నాడు రాజు వ్యంగ్యంగా నవ్వుతూ.

“మరి నా ముద్దు చెల్లించండి”

“ఎప్పటిదోయ్?”

“అబ్బా, పోండి! నా తమ్మునికి అమ్మాయినిచ్చి చేస్తారా?”

“దానికేం! అమ్మాయిని రానీ. దాన్ని కూడా కనుక్కుందాం”

“దాన్ని కనుక్కోడం ఏమిటి - తప్ప్పుతప్ప్పు! ఎద్దు నడిగి గంత కడతారేమిటి?” అని తర్కించాడు శీను.

“రాణీ! ఇక్కడో బెత్తం ఉంచుతా వుండు. తప్ప్పు అన్నప్ప్పుడల్లా నీ తమ్ముడికో చురక వేస్తూ వుంటాను”

“చురక లెవరికి నాన్నోయ” అంటూ వచ్చింది ఇందు.

“ఇందూ! నువ్వు చురుకైనదానివిగా, చప్ప్పున చెప్ప్పు! మీ అమ్మ నిన్ను మీ మామయ్యకిచ్చి చేసుకుంటుందట ఏమంటావ్?”

“అంత మోటుగా చెప్తే అది హేళన చేస్తుంది”.

“హేళన ఎందుకు చేస్తానే అమ్మా. నా స్వయంవరం ఇవాళ నుంచే మొదలు అనుకుంటాను. పోనీ వర పరీక్ష మామయ్యతోనే మొదలెడతాను - సరేనా మామయ్యా?”

అంతే! శీను పరవశించిపోయాడు. ఒంటి నిండా పొంగిపోయాడు. “అక్కయ్యా! చూశావే! ఇందు ఒప్ప్పుకుంది. నన్ను స్వయంవరం పరీక్షిస్తుందిట”.

“ఐతే చెప్పండి నాన్నగారూ! ఉజ్జయినీ రాకుమారిని కోరే వరుడు ఎటువంటివాడై వుండాలి?”

“వీరుడు, ధీరుడు, శూరుడు...” అని రాజుగారు చెబుతూ వుంటే - అందుకున్నాడు శీను. 

“అది నాపేరే. అదంతా నా పేరులోనే వుంది” అన్నాడు ఆనందంగా.

“ఇంకా నాన్నా?”

“విక్రమార్కుడిని మించిన గొప్ప సాహసం వుండాలి!”

“దానికేం - నాకు లక్ష వుంది” అని శీను మురిసిపోయాడు. ఇద్దరూ అతని నంగితనానికి నవ్వుకున్నారు.

“పోనీ తెలివిలోనైనా నెగ్గితే?” అని ఇందుమతి ఆట పట్టించింది.

“ఓ! తెలివి నా సొమ్ము. తైతక్కలాడిస్తా. ఏమడుగుతావో అడుగు!”

ఇందు వేళ్లు ముడుస్తూ - “ఒక పిల్లి... పిల్లి ముందు రెండు పిల్లులు... పిల్లి వెనక రెండు పిల్లులు... రెండు పిల్లుల మధ్య పిల్లి...” అని పొడుపు లెక్క చెప్పింది. చెబుతున్నప్ప్పుడల్లా తానూ వేళ్లు ముడుస్తూ లెక్క చేసేస్తున్నాడు - శీను.

“అన్నీ ఎన్ని పిల్లులు?” లెక్క చెప్పమంది ఇందు. శీను వేళ్లు తడబడుతూ వుంటే - రాణి అందుకుంది- “పెళ్లి మాట అడిగితే, పిల్లేమిటి పిల్లి? అపశకునంగా?” ఇందు పకపక నవ్వింది.

“వేళాకోళంగా వుందేం? రారా తమÖ్మ” అని రాణిగారు కోపంగా నిష్క్రమిస్తే శీను వెంట వెళ్లాడు. రాజుగారు, రాకుమారీ నవ్వుకున్నారు. రాజుగారు మొత్తానికి తాను సమాధానం కనిపెట్టిన వాడిలా మÖడు వేళ్లు చూపించి ‘సరేనా’ అన్నాడు. అవునంది ఇందు. రాణి వెంట వెళ్లిన శీను - ఇంకా వేళ్లు ముడిచి లెక్కలు వేస్తూనే వున్నాడు. “అక్కూ! ఇంతకూ ఎన్ని పిల్లులూ అని!” అన్నాడు.

“నోరు మÖసుకోరా బడుద్ధాయి. నీవూ నీ తెలివి! నాకు అవమానంగా వుంది”

“నన్నేం చెయ్యమంటావే అక్కూ!” అన్నాడు నంగిగా. 

“అది... ప్రేమిస్తేగాని పెళ్లి చేసుకోదురా... ప్రేమించి మనసైనా తిప్ప్పుకోరా!” అని అక్కుగారు తమ్ములుంగారికి సలహా పారేశారు. వెంటనే ఎగిరి గంతేశాడు శీను.

“ప్రేమా! ఇన్నాళ్లనుంచి చెప్పేవు కాదేమే అక్కూ!... ప్రేమయితే ఎంతయినా చేస్తానే అక్కూ! ఇక చూసుకో నా ప్రతాపం!” అని బయల్దేరాడు ఇందు కోసం.

ఇందు తోటకి వచ్చింది. ఆమె కళ్లు, కాళ్లూ రాముడి కోసం వెతుకుతున్నాయి. మొక్కల మధ్య నుంచి వాళ్ల ఇంటివేపు కూడా వెళ్లింది - ఏదో నళిని కోసం వెతుకుతున్నట్టు. కుటీరం దగ్గర నళిని కనిపించింది.

“ఇక్కడేం చేస్తున్నావే నళినీ?”

“నేనామ్మా... నిజం చెప్పమన్నారా... అబద్ధం చెప్పమన్నారా-”’ అంది రాముడిలా చేతులు కట్టుకుని గంభీరంగా.

“ఏమిటీ భయం లేకుండా!” అని ఇందు నళినిని తరిమింది. ఇద్దరూ పరుగెత్తి ఆగారు.

ఇందుమతి, నళినిని కొట్టబోతే - “ఆఁఆఁ... క్షమించాలి... తోటకంతా పరిమళం తెచ్చే పువ్వు” అని, తోటరాముడిలాగా పువ్వు తీసి ఇచ్చింది నళిని.

“ఇవాళ తోటంతా నిశ్శబ్దంగా వుందే” అంది రాకుమారి అటూ ఇటూ చూస్తూ.

“ఏముంది? నిన్న మీరు కసిరి కొట్టారా - భయపడి పిట్టలు పారిపోయి వుంటాయి!”

ఐతే, ఆ పిట్టలు పారిపోనూ లేదు, ఎగిరిపోనూ లేదు. రాముడు, అంజి ఇద్దరూ చెట్టు ఎక్కి కూచున్నారు కనిపించకుండా. అంతలో వచ్చాడు - శీను అడావుడి చేస్తూ. అక్కగారు ఇందుని ప్రేమించమందని - తన ప్రేమను ఒలక బోయడానికి “ఇందూ!... ఇందుమతీ!... అందూ ఇందునా ఎందున్నావే?” అంటూ తోటలో తిరుగుతున్నాడు.

“అదిగోనమ్మా - శబ్దం. ఇక సందడే సందడి” అంది నళిని, శీను రాకని గమనించి.

“నోరు మÖసుకో. ఎవరనుకున్నావ”.

శీను దగ్గర కొచ్చాడు - “నువ్వు ఇక్కడ వున్నావా ఇందూ! నీ కోసం తోటంతా గాలించాను... ఏయ్ నళినీ! మేం వచ్చినప్ప్పుడు నువ్వేమిటి ఇక్కడ? తప్ప్పుతప్ప్పు! ఈ పాటి చెలికత్తెతనం మాకూ చేతవు. పోపో...” అని గసిరి ఆమె చేతిలో వున్న పూలసజ్జ లాక్కున్నాడు. ఇందు వేపు సిగ్గు దొంతరలతో చూశాడు; గిలగిల తిరిగిపోతూ- “ఇందూ!... నీ మీదేం...” అన్నాడు. 

“ఏమిటి మామయ్యా”

“నీ మీద...”

‘ఏమిటి మామయ్యా నా మీద?”

“చూశావా! తెలుసుకోలేకపోయావు! నీ మీదేం... నీ మీద...” అంటు నసిగాడు.

“ఏమిటి మామయ్యా - నా మీద? మన్నా ధూళా?” 

“కాదు!...” అని మాట పెగలనీయకుండా పెదవుల్తో ‘ప్రేమ’ అన్నాడు... ఇందు అర్థం కానట్టుగా చూస్తే - పాపం తెలియదని - “ప్రేమ!” అన్నాడు. ఇందు పెదవులు చప్ప్పుడు చేసి కొట్టిపారేసింది. శీను అదిరిపోయాడు. “అదేమిటి ఇందూ! అలా అన్నావు. నా ప్రేమేమిటో ఎంతో - చూడుమరి!” అని పాట అందుకున్నాడు పూలస్పు్జ విసిరేసి. చెట్టు మీద వున్న ఆ పిట్టలు రెండూ ఆ ప్రదర్శన ఆట, పాటా చూసి ముచ్చట పడుతున్నాయి.

పల్లవి : వినవే బాలా  నా ప్రేమగోý

నిను కను వేళా నిలువగజాలా ॥వినవే॥

గుబుల్ గుబుల్‌గా  గుండెలదరగా

దిగుల్ దిగుల్‌గా  యిది యిదిగా ॥వినవే॥

చిరునవ్వు చాలే  చితెí్తపోతానే

మురిపిస్తే చాలే  మÖర్ఛేపోతానే ॥వినవే॥

జోడు గూడీ తోడిరాగం పాడుకొంటూ మేడమీదా 

పైడిబంగార్ తూగుటుయ్యాల్ వేడుకలరా-ఊగరావా

చెట్టాపట్టీల్ జడకోలాటం

తొక్కుడుబిళ్లా ఆడే నాతో తొక్కుడుబిళ్లా ఆడే నాతో

పాట పూర్తయే లోపల, చరచరా పాకుతూ పెద్ద పాము రాసాగింది. శీను గమనించలేదు. తన పాటలోనే వున్నాడు. పాము రాకుమారికి దగ్గరగా రాబోతే, “ఆఁ.. పాము!” అని రాముడు చెట్టు దూకి రాకుమారిని దూరంగా లాగేశాడు. అప్పటికీ తన్మయంలోనే వున్న శీనుని చూసి “పాము” అని అరిచాడు. అప్ప్పుడుగాని, శీను గమనించలేదు. అంతే! పాముని చూసి పరుగెత్తాడు. రాముడు పాము తోక పట్టుకుని, గిరగిర తిప్పి చంపేసి, ఓ మÖలకి విసిరేశాడు. అతని సాహసానికి, రాకుమారి అబ్బురపోయింది - ఒక పక్క గుండె కొట్టుకుంటున్నా. 

సర్పం రాకుమారి వేపు వచ్చిందని - అది దుశ్శకునంగా భావించి రాజుగారు ఆస్థాన జ్యోతిషుల్ని రప్పించాడు. జ్యోతిష్కులు రాకుమారి జాతక ప్రభావాన్ని పరిశీలిస్తున్నారు.

“పాము కనిపించడమే దోషం అంటారు. మీదికి రావడం మరీ భయంగా వుంది. ఈ విపరీతం ఎందుకు వచ్చిందో చెప్పండి జోశ్యులూ!” అడిగాడు రాజు - పక్కనే ఇందుమతీ వుంది.

“అమ్మాయివారి జాతకమంతా చిత్రవిచిత్రాలతో నిండి వుంది ప్రభూ! కాని...” అని ఆగాడు పండితుడు.  

“ఏమిటో నిర్భయంగా చెప్పండి”

“చూశారూ! వెంట శని పొంచి వున్నాడు. పన్నెండింట రవి నీచంలో వున్నాడు. ఎనిమిదింట విష దృష్టి స్థానంలో ఇంద్రుడు ఇంద్రజాల మహేంద్రజాలం చేస్తూ వున్నాడు...”

“ఫలితం ఏమిటో చెప్పండి జోశ్యులూ!”

“మరేం లేదు ప్రభూ. ఇప్ప్పుడు గ్రహస్థితే కాస్త వక్రంగా వుంది. బంధు వియోగం, దుష్టపీడనా... సూచనగా వున్నాయి అంతే!”

రాజుగారు నిరుత్సాహపడ్డారు. ఆయన ముఖంలో భయరేఖలు అలుముకున్నాయి.

“ఇందూ! విన్నావుగా తల్లీ. ఇప్పట్నుంచి నీ వెక్కడా బయట పోకూడదు. అంతఃపురంలోనే వుండాలి” అని కూతురు వేపు చూడగానే ఆమె తల ఆడించింది భయంగా. 

“అంతే ప్రభూ! కాస్త జాగ్రత్తగా వుండాలి” మిగతా జాతకమంతా అఖండ విజయవంతంగా వుంది” అని తేల్చాడు - పండితుడు. 

అది మాంత్రికుడి గుహ. భయానకంగా వుంది. మాంత్రికుడి రూపురేఖలు, వికృతాకారంగా వున్నాయి. అతని శిష్యుడు సదాజపుడు. నిత్యం ముఖం మీద గుడ్డ వేసుకుని, మాల తిప్ప్పుతూ జపంలో వుంటాడు. ఇప్ప్పుడూ అలాగే ఓ మÖల కూచుని జపం చేస్తూంటే, నేపాళ మాంత్రికుడు గద్దింపుతో పిలిచాడు. రెండు మÖడు పిలుపులతో గాని, శిష్యుడు తేరుకోలేదు. “ఏంగురూ!” అంటూ లేచాడు.

“సంజీవి సిద్ధం శాయరా!”

“ఎందుకు గురూ?”

“సిద్ధం శాయరా!” గద్దింపు ముదిరింది. సదాజపుడు సంజీవి తీశాడు. అది ఒక వేరు. దాని ప్రభావానికి పొగలు చిమ్ముతోంది. మాంత్రికుడు కత్తి చేతిలోకి తీసుకున్నాడు. వెలుగుతున్న హోమగుండంలో విభూతి చల్లుతూ - “హ్రాంఫట్!... శక్తీ ప్రసన్న! చాముండీ ప్రసన్న! కాపాలినీ ప్రసన్న” అని ప్రార్థించినా శక్తి సాక్షాత్కరించక, చేతిని నరుక్కున్నాడు. శక్తి ప్రత్యక్షమైంది.

“కాపాలికా! ఏమి నీ కోరిక?” అని ప్రశ్నించింది. “అన్ని విద్యలనూ ఇచ్చేది, అన్ని శక్తులనూ జయించేది- ఏది ఆ పరమశక్తి? దేవీ పలుకు!”

“పాతాళభైరవి!”

“ఆ శక్తి ఎక్కడ వున్నది? దేవీ పలుకు!”

“ఉజ్జయినికి ఉత్తరాన నగరి కోనలోన మంత్రాల మర్రి కింద భూగర్భంలో యక్ష నిక్షిప్తమై వున్నది”

“ఆ పరమశక్తి సిద్ధించే ఉపాయ మేది? దేవీ పలుకు!”

“నీ వంటి మంత్రసిద్ధుని గాని, లేదా మహా సాహసవంతుడూ, సన్మార్గుడూ ఐన ఒక యువకునిగాని, ఆ శక్తికి బలి ఇవ్వాలి” అని అంతర్థానమైంది ఆ దేవి. మాంత్రికుడికి మార్గం లభ్యమైంది. ఆనందంగా సదాజపుడిని పిలిచాడు. “దేవి పలికిందిరా... సంజీవి స్పర్శ శాయరా!” అన్నాడు. సదాజపుడు సంజీవి తెచ్చాడు. మాంత్రికుడు నరుక్కున్న చేతిని కలుపుకున్నాడు. సంజీవి స్పర్శ తగలగానే, చేయి తిరిగి అతుక్కుంది. ఒక్కసారి  చేతిని గట్టిగా విదిలించి, వికటాట్టహాసం చేశాడు మాంత్రికుడు.... ఇక, ఆ సాహసవంతుడి కోసం వెతకాలి. వాడిని పట్టి, ఆశలు చూపి, పాతాళభైరవికి బలి ఇవ్వాలి.

“మహా సాహసవంతుడు, సన్మార్గుడూ ఎక్కడరా ఆ యువకుడు?” అంటూ తన దగ్గర వున్న మంత్ర దూర్భిణిలో చూశాడు. “మహా సాహసవంతుడే! మనకొద్దు గురూ! కీడు మÖడేను” అని సదాజపుడు హెచ్చరించాడు. వాడికింకో ఆలోచన వచ్చింది. “మంత్రసిద్ధులు తమరే పనికొస్తారుగా గురూ!” అన్నాడు అమాయకంగా. 

“నోరు మÖయరా!” అని గదమాయించి, దూర దర్శన యంత్రంలో పరిశీలించాడు.

“అడుగడిగోరా... డింభకుడు...”

“ఎక్కడ గురూ?”

“ఉజ్జయినీ రాజకోట ప్రాకారం ప్రాకుతున్నాడురా” ఆ సమయంలో తోటరాముడు, రాకుమారి ఉద్యానవనం వేపు రావడం మానేసిందని, తట్టుకోలేక, ఆ రాత్రి కోట గోడ ఎక్కుతున్నాడు. వాడి సాహసం మాంత్రికుడికి అర్థమైపోయింది. తృప్తిగా నవ్వుకుని “పదరా... ప్రయాణం సిద్ధం శాయరా” అన్నాడు.

“వట్టి చేతులతో రాముగా గురూ” అన్నాడు సదాజపుడు నిరుత్సాహంగా బయల్దేరుతూ.

తోటరాముడు నిదానంగా, నెమ్మదిగా కోటలోకి దూకాడు. అంతఃపురం ప్రవేశించాడు. అక్కడక్కడా కాపలా వాళ్లు అప్రమత్తులై నిలబడి వున్నారు. తను వాళ్ల కంటపడకుండా, రాకుమారి శయనాగారం చేరాలి. అడుగులో అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు. 

రాకుమారి తన తల్పం మీద కూచుని, వీణ వాయిస్తూ వుంటే బయట శీను తన్మయుడై నిలబడి వింటున్నాడు. రాముడు నక్కి నక్కి వెళ్తున్నాడు. కంటపడగానే “దొంగ దొంగ” అని కేకలు వేసి, చెలుల్ని భయపెట్టాడు శీను. అట్నుంచి, ఇట్నుంచి కాపలా సైనికులు తరుముతూ వుంటే వాళ్ళతో యుద్ధం చేసి, చావగొట్టి తప్పించుకుంటున్నాడు. శీను తను చెయ్యవలసిన ప్రయత్నం తాను చేస్తున్నాడు. శీనుని ఒక్క చరుపు చరిచి, పరుగెత్తాడు రాముడు. రాకుమారి మందిరంలో ప్రవేశించాడు. ఇందు అతన్ని చూసి నివ్వెర పోయింది.

“నీవా! ఎలా వచ్చావు?” అని అడిగింది. 

“ప్రాణాలకి తెగించి వచ్చాను రాజకుమారీ” అన్నాడు అలసిపోయిన కంఠంతో.

“ఏం - ఏం అవసరం వచ్చిందని?” అంది తీవ్రంగానే.

“నిజం చెప్పమన్నావా - అబద్ధం చెప్పమన్నావా?”

“ఏమిటా అధిక ప్రసంగం? అబద్ధం ఎలా చెబుతావో చెప్ప్పు!”

“హాయిగా తోటలో పడివున్న వాడిని ఒక రాజకుమారి ప్రేమ పాశంతో బంధించి తెచ్చింది. ఇక్కడ పడేసింది” అన్నాడు రాముడు నిబ్బరంగా.

“ఓహో! ఐతే, ఈ రాజకుమారి శీఘ్రంగా వెళ్లమంటోందిగాని, మర్యాదగా వెళ్లు”

“ఐతే నిజం చెబుతా రాజకుమారీ. నిన్నెంత ప్రేమించానో నీకు తెలీదు. నీవు కనిపించకపోతే నా మతి పోయింది. ఏ పూలచెట్టు కదిలినా నీవు పిలిచావనే. ఏ కోయిల కూసినా నీవు పిలిచావనే. ఏ గాలి వీచినా, నీతో ప్రేమ డోలికల్లో ఊగుతున్నాననే. పరవశుడినై, పిచ్చివాడినై నిన్ను విడిచి వుండలేకపోతున్నాను”.

అంతలో తలుపు దబదబ చప్ప్పుడైంది. మందిరంలో వున్న ఇద్దరూ కంగారు పడ్డారు.

“ఏమిటిది?” అంది రాకుమారి భయంగా. 

“మీ మామగారు. నన్ను పట్టుకోడానికి సైన్యంతో వచ్చారు. వెళతాను” అని బయల్దేరబోతే -

“ఆగు! మహాధైర్యస్థుడివిలే. నీవు చేసిన నిర్వాకానికి తలకొట్టి ప్రాణం తీస్తారు తెలుసా?” అని అతన్ని ఆపింది ఇందుమతి.

“నీ ప్రేమ లేని ప్రాణం ఎందుకు రాజకుమారీ - వెళతాను” అని మొండికెత్తాడు రాముడు.

“నిజం చెప్తున్నా. నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు. నిన్ను కూడా రక్షిస్తాను - ఇలా దాక్కో!”

తలుపు దబదబ తీవ్రమైంది.

“నా ప్రాణాన్ని యాచించడానికి నేను రాలేదు. నీ ప్రేమ కోసం వచ్చాను. లేదంటే వెళతాను”

శీను చేతులు నొప్పి పుట్టేలా, తలుపు పగిలేలా బాదుతున్నాడు.

“ఏమిటా మÖర్ఖం... ఇలా దాక్కోమంటే” 

“నన్ను ప్రేమిస్తానంటే-”

“ముందు ఇలా దాక్కో”

రాముడు మొండిపట్టు వదలడం లేదు. “ప్రేమిస్తానంటే”... అన్నాడు.

“ఆఁ... ప్రేమిస్తాలే, దయచేసి ఇలా దాక్కో” అని తెర వెనక వున్న చోటు చూపించింది. రాముడు దాక్కున్నాడు. ఇందు వెళ్లి తలుపు తెరిచింది. నిద్రలోంచి లేచినట్టు నటిస్తూ బద్దకంగా - “ఏమిటి మామయ్యా! నిద్రంతా చెడగొట్టావు” అంది.

“నిద్రేమిటి - తప్ప్పుతప్ప్పు! భద్రంగా వుండాలి. భలేరాముడు గదిలో దూరాడు. ఎక్కడ?” అని అటూ ఇటూ చూశాడు శీను.

“ఏమిటి మామయ్యా! మేలుకున్నావా - కలవరిస్తున్నావా? వేసిన తలుపులు వేసినట్టే వుంటే, ఎవరు మాత్రం గదిలోకి ఎలా వస్తారు?”

శీను హేళనగా నవ్వి “అంతేనంటావ్... అంతే... ఎవరు లేరులే... ఎలా వస్తారు?... వేసిన తలుపులు వేసినట్టే వుంటే... అంతేగా...” అన్నాడు లోపల వున్నాడని కచ్చితంగా నమ్మి.

“అంతేగాక? నామాట మీద నమ్మకం లేదా మామయ్యా”

“నమ్మకం లేకపోవడం ఏమిటి - తప్ప్పుతప్ప్పు... గమ్మునపోతూ వుంటే...” అంటూ వెతుకుతునే వున్నాడు... “ఎవరు లేరులే ఎలా వస్తారు? వేసిన తలుపులు వేసినట్టే వుంటే?...” వ్యంగ్యంగా నవ్వుతూ, తెరలోకి దూరాడు. తిరిగివస్తూ వుంటే వీపు ఛెళ్లుమంది. “అమ్మో...”అని అరిచి, తమాయించుకుని - “ఎవరు లేరులే... ఏదో కాస్త వీపున పడినట్టు వుంటేనూ... అంతేగా!” అన్నాడు.

“అంతగాకపోతే ఇంత... ఏమిటి మామయ్యా ఇదంతా?”

“అవున్లే... ఎవరులేరులే... ఎలా వస్తారు... వేసిన తలుపులు వేసినట్టే వుంటే...” వ్యంగ్య ధోరణి వదల్లేదు... అటూ ఇటూ చూస్తూ బయటికి నడిచాడు. రాముడు బయటకొచ్చి - “నీకు చాలా బాధ కలిగించాను...” అని పువ్వు తీసి ఇస్తూ - “తోటకంతా పరిమళం తెచ్చే పువ్వు... వస్తాను”.

“ఆగు!” అని తలుపు అవతల చూసింది. పక్కనే నక్కి వున్న శీను కనిపించలేదు.

“ఇంకెన్నడూ ఇలాంటి సాహసం చెయ్యకు” అని హెచ్చరించి పంపింది. రాముడు రాగానే, శీను గట్టిగా పట్టుకుని - అరిచాడు. సైనికులు పరుగెత్తివచ్చి బంధించారు. అందరూ కలిసి రాముడిని కొట్టారు. రాముడు పట్టుబడ్డాడు.

“ఈడ్చు కెళ్లండ్రా వెధవని... రాజుగారి దగ్గరకి...” అన్నాడు విజయోత్సాహంతో - శీను. 

“నళినీ! ఏం జరుగుతుందో చూసిరావే!” అని ఇందు నళినిని పంపించింది. నళిని పరుగెత్తింది.

మహారాజావారు, రాణీవారూ వుండగా వారి ఎదుట నేరస్థుడిని నిలబెట్టారు. అర్ధరాత్రి వేళ అంతఃపురం ప్రవేశించిన ద్రోహిని బంధించ గలిగినందుకు వీరప్రతాపుడై నిలబడ్డాడు శీను.

“గోడ ఎక్కి మేడ మీదికి దూకాడు బావా. నన్ను చూసి పరుగెత్తాడు. భటులు, నేనూ వెంటబడి తరిమి తరిమి కొట్టి కొట్టి ఈడ్చుకొచ్చాం! తల తీయించండి!” అన్నాడు ఘనంగా, ధైర్యంగా శీను. 

“దొంగతనంగా అంతఃఉరంలోకి ఎందుకొచ్చావ్?... ఏం మాట్లాడవేం - ఎందుకొచ్చావ్?...” అని రాజుగారు నిలదీస్తూ వుంటే, మధ్యలో శీను ఏదో అనబోతే ‘నోర్ముయ’ అని గద్దించారు రాజావారు.

“నిజం చెప్పమన్నారా, అబద్ధం చెప్పమన్నారా మహారాజా!” అన్నాడు రాముడు వినయంగా, తన ధోరణిలో. రాజుగారు మండిపోయాడు. రాముడి చెంపలు వాయించాడు.

“జాగ్రత్త! తల తీయిస్తాను” అని హెచ్చరించాడు. “ఎందుకొచ్చావో చెప్ప్పు!” అని మళ్లీ అరిచాడు.

“రాజకుమారిని చూడాలనిపించి వచ్చాను” ఆలోగా రాణి ఏదో అనబోతే, ‘నోర్ముయ’ అని గద్దించాడు రాజు. తీవ్రంగా చూసి “వీడిని చెరసాలలో వెయ్యండి. పొద్దున్నే ఉరి తియ్యండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. భటులు తీసుకెళ్లారు. 

రాజుగారికి నిద్ర పట్టలేదు. ఆలోచనలో పడ్డాడు. “అమ్మాయికి ఆ సర్పగండమేమిటి? జ్యోతిష్యులు దుష్ట పీడ కలుగుతుందని చెప్పడమేమిటి... ఇవాళ ఈ అనర్ధమేమిటి? ఏమీ అర్థం కాకుండా వుంది”

“ఇంకా ఏం అర్థం కావాలి? తప్పకుండా వాడిని ఉరి తీయించండి! ఏ పీడా వుండదు” అంది రాణి.

రాజుగారికి భయంకరమైన స్వప్నం వచ్చింది. స్వప్నంలో మాంత్రికుడు లాంటి ఒక దుష్టుడు - ఇందుమతిని పట్టి లాగుతున్నాడు. వికటాట్టహాసం చేస్తూంటే, “నాన్నా... నాన్నా...” అని ఘోషిస్తోంది ఇందు. రాజు, దిగ్గున లేచి కూచున్నాడు. భయంగా చూశాడు. ఇందుమతి - తండ్రి ఎలాగు నిద్రలో వుంటాడని, కారాగారానికి వెళ్లింది. దగ్గరగా కూచుంది. 

“చూశావా - నీ సాహసం ఎంతవరకూ తెచ్చిందో... నాన్నగారు చాలా కోపంగా వున్నారు. తెల్లవారేసరికి తప్పక నిన్ను ఉరి తీయిస్తారు” అంది. రాజుగారు నెమ్మదిగా కారాగారం ప్రవేశించి, ఆ సంభాషణ వింటున్న సంగతి వాళ్లు గమనించ లేదు. ఎలాగైనా, ఇక్కడి నుంచి పారిపోయి, ప్రాణాలు కాపాడుకోమని ప్రార్థించింది.

“నిన్ను విడిచి ఎక్కడికి వెళ్లగలను రాజకుమారీ. నీ ప్రేమకి నోచుకోనప్ప్పుడు, ఈ ప్రాణం ఎందుకు? రాజాజ్ఞ ధిక్కరించి పిరికిపందలా ప్రాణం కాపాడుకోమంటావా రాజకుమారీ!... అమ్మనీ, నిన్నూ వదిలి ఎక్కడైనా హీనంగా తలదాచుకోమంటావా?” అన్నాడు పౌరుషంగా. “అయ్యో - ఏమిటీ మÖర్ఖం! నా మాట విను... వెళ్లు...” అంటూ వుండగా, “ఇందూ!” అని వినిపించింది. దిగ్గున చూసింది. తండ్రి! “నాన్నా! క్షమించండి...” అని, తన ప్రాణం కాపాడాడు - అతన్ని కాపాడాలని వచ్చాను - అంది దీనంగా. రాజుగారు  ఆలోచనగా చూశాడు.

“తోటరాముడూ! రాజకుమారిని ప్రేమించడమే ఘనకార్యం అనుకుంటు న్నావా? అందుకు తెగించడమే సాహసం అనుకుంటున్నావా? యోగ్యత, అర్హత విచారించుకోనక్కర్లేదా?... నీకేం భవనాలా, పల్లకీలా, పరివారమా?” అని అడిగాడు తీవ్రంగా.

“తమ ఆశీర్వాదం వుంటే అవన్నీ సంపాదించుకుని వస్తాను ప్రభూ!”

“అంత సామంతుడివైనప్ప్పుడు నా కుమార్తె ప్రశంస తీసుకురా. అంతవరకూ కోటవేపు కన్నెత్తి కూడా చూడకూడదు. పో”.

రాజుగారి ఆశీస్సు తీసుకుని, తల్లి దగ్గరికి వెళ్లాడు రాముడు.

“ప్రాణాలన్నీ నీమీద పెట్టుకుని బతుకుతూ వుంటే నన్నెందుకు ద్ణుఖపెడతావురా నాయనా! మహారాజు మంచివాడు గనక సరిపోయింది” అంది తల్లి ఏడుస్తూ.

“మహారాజు సాక్షాత్తు జనకమహారాజే పిన్నీ. ఉరి తీయకుండా ఎలా పంపించేశాడో చూడు” అని, పక్కనున్న అంజి అందుకున్నాడు.

“నీ పుణ్యం వుంటుంది. నువ్వు ఊరుకోరా అంజీ! మనం ఎంత మన బతుకెంత? ఆ భవనాలు, పల్లకీలు, పరివారాలు మనకెలా వస్తాయి నాయనా”.

“అదృష్టం వుంటే ఆకాశం నుంచి రాల్తాయి పిన్నీ. చూడు - రాజకుమారి స్వయంగా పట్టు పట్టిందంటే ఆహా! విజయలక్ష్మి వరించినట్టే కదూ!”

ఏదో ఆలోచన వచ్చి, రాముడు ఠపీమని తల్లి పాదాల మీద పడ్డాడు. “ఆశీర్వదించమ్మా - అన్నీ తీసుకొస్తాను. దేశాలు జయించుకొస్తాను” అన్నాడు ఆవేశంగా.

“పిన్నీ... విజయోస్తు అని దీవించు. నేను తధాస్తు అంటాను” అన్నాడు అంజి.

“ఆశీర్వదించమ్మా”

“ఏమని ఆశీర్వదించనురా?”

“శ్రీరామచంద్రుడంతటి వాడివై సీతామాలక్ష్మిని తెమ్మని... అను...” అని మాటసాయం చేశాడు అంజి. తల్లి అదే అంది; తథాస్తు అన్నాడు అంజి. 

“అంజీ! అమ్మ బంగారురా!” అని ఆనందపడిపోయాడు రాముడు.

సాహసవంతుడు ఎక్కడ వుంటాడో తెలుసుకున్న మాంత్రికుడు ఉజ్జయినికి వచ్చాడు. ఒక కూడలి చూసుకుని అక్కడ మంత్రాలు చదువుతూ జనాన్ని పోగు చేశాడు.

“మంత్రబలం చూపించేను; మనోబలం చూపించేను” అన్నాడు. వెంటవున్న సదాజపుడు ‘అవునవును’ అంటూ జనాన్ని ఉద్దేశించి, “నేపాళం మాంత్రికుడికి గిడిగిళ్లనండి, వందనాలనండి” అన్నాడు. జనం ‘వందనాలు’ అన్నారు. తోటరాముడు కూడా జనంలో చేరి ఆ వింత చూస్తుంటే, మాంత్రికుడు ఒక కన్ను వేశాడు. “యువకులంతా ముందుకురండి; యువతులంతా ముందుకురండి!... నడుములు వంగిన నాయకులంతా గడబిడ శాయక వెనక్కి వుండండి” అన్నాడు మాంత్రికుడు. యువకుల్లాంటి వాళ్లు ముందుకు రావడంలో రాముడు కూడా వచ్చాడు.

“ఐతే డింగరీ! జనం కోరేది మనం శాయడమా? మనం చేసేది జనం చూడడమా? ఏంరా డింగరీ!”

“మన కన్నే మన చెవే మన మాటే మన జనం. జనం అంతా నేనే, మనం కోరతాం మీరు శాయండి” అన్నాడు సదాజపుడు. అని - ఓ మంత్రం లాంటిది చెప్పాడు : “ఆగే గూగే, మోటాగీగూ! వీళ్లందరికీ టోపీలు పెట్టండి”.

“ఐతే చూడరా! హ్రాంఫట్!” అనగానే అందరి నెత్తి మీదా టోపీలు పడ్డాయి! ‘ఇంకేమి శాయవలెరా డింగరీ?”

“మీరూ, నేనూ, మా మీ మేమÖ - ఈ రాతిని కోతిని శాయండి” అనగానే, కోతిని చేశాడు. రాముడు దిగ్భ్రాంతుడై చూస్తున్నాడు. అంజిగాడు ఆశ్చర్యపోతున్నాడు. జనం సంతోషంగా ఆనందిస్తున్నారు.

“ఇంకేమి శాయవలెరా డింగరీ?” “ఆహా హూ హూ... హీహీ హిహ్హీ.... వీళ్లందరికీ వస్త్రాపహరణం చెయ్యండి!”

జనం భయపడ్డారు. ‘వద్దు వద్దు’ అని కేకలేశారు. “మనం ప్రజా బంధులం” అన్నాడు మాంత్రికుడు. “డూడీ డేడో డే డూడూ... ఈ కోతిని నాతిని శాయండి...”

“ఐతే చూడరా!... హ్రాంఫట్...” అనగానే ఆ కోతి ముసుగు వేసుకుని కూచున్న అమ్మాయిగా మారింది. జనం నివ్వెర పోతున్నారు.

“మహాజనానికి మరదలు పిల్లా! అందరూ బావలే!... గలగలలాడావే గజ్జెలకోడీ” అనగానే ఆ ‘మరదలు పిల్ల’ పాడుతూ నాట్యం చేసింది. 

పల్లవి : వగలోయ్ వగలూ, తళుకు బెళుకు వగలూ

బావలూ, మామలూ, బావలు మామలు, భామలూ

లాలలూ, లాలలూ, లలలు, లలలు, లలలూ 

సింగారి వీథంట మామ రంగేళి పిల్లంట బావ

కొంగు తాకిందంటె హై - హై

కొంగు తాకిందంటె   £”య్ కుయ్ కుయిలే ॥వగలోయ॥్

నీవెంట వస్తాను  ఆ” నీ జంట ఉంటాను  ఊ”

సై”యంటి బావా ఊ” అంటే మావా”

చెలీయనీ, భళీయనీ, సరేయనీ, చెలామణి

మీరంతనావెంట గుమిగుమి, గుమిలే

లాలలూ, లాలలూ, లలలు, లలలు, లలలూ ॥వగలోయ॥్

పాట కాగానే... ఎలా వచ్చిందో అలా మాయమైంది.... అంతలో వచ్చాడు శీను చిన్న పరివారంతో. చూశాడు. ఆ జనాన్ని పరికించాడు. ధీమాగా మాంత్రికుడిని పలకరించాడు. “ఓయ్, ఎవడవోయ్ నువ్వు?”.

“నేపాళం మాంత్రికుడు! నేపాళం మాంత్రికుడు!” అన్నాడు సదాజపుడు.

“నేపాళం మాంత్రికుడేమిటి - తప్ప్పుతప్ప్పు! భూపాళం పగిలేను ప్రమాదం. పన్నిచ్చుకోవాలి” అని రాణిగారి తమ్ముడి దర్పం చూపించాడు.

‘హ్రాంఫట్!’ అన్నాడు మాంత్రికుడు. అనగానే శీను రూపం స్త్రీ రూపానికి మారిపోయింది. ప్రజ వింతగా చూశారు. శీను తన ఆకారం చూసుకుని చిందులేశాడు.

తాళలేనె నే తాళలేనే

భామలారా ఓ యమ్మలార

ఇందరిలోను ఈ సొమ్ములేలే

నా నాధుడేడే శ్రీకృష్ణుడేడే

తాళలేనే నేతాళలేనే

తాళలేనే ఓయమ్మా

జేనే భామామణి

తడిగినతోం తడిగినతోం

తాళలేనే నే తాళలేనే...

సదాజపుడు తాళం వేశాడు. జనం ఈలలు వేశారు.

“మాంత్రికుడోయ్ మాంత్రికుడోయ్... నన్ను రక్షించు” అన్నాడు ఆడగొంతులో.

గలగలా నవ్విన అంజి, “మాంత్రికుడుగారూ! రాణీగారి తమ్ముడుగారండీ” అన్నాడు.

“మాకెవరైనా ఒకటే...” అని కాళ్ల మీద పడిన శీనుని చూసి, “బుద్ధి కలిగి వుంటావురా?” అని అడిగాడు మాంత్రికుడు.

“ఉంటా నుంటాను... నన్ను మామÖలు వీరుణ్ణి చెయ్యి”

“విద్యలు వినోదాలు కావురా. వివేకం కలిగి వుండు” అని మంత్రం చదివాడు దండం తాటిస్తూ. శీనుకి అసలు రూపం వచ్చేసింది. ఆనందంగా చూసుకున్నాడు. భయంభయంగా చూస్తూ పారిపోయాడు.

“ఒరే డింగరీ! మహా జనమంతా మన భక్తులు. ఎవరికేమి కావలెనో కోరుమురా! బహుమానాలు ఇస్తాం!” అని రాముడిని చూశాడు. రాముడు ఆత్రుతగా చూస్తున్నాడు. రాముడిని మాంత్రికుడు ఆకర్షించాడు. మాంత్రికుడిని రాముడు ఆకర్షించాడు.

“ఇదిగోరా - అక్షయ ఘటం. ఎవరికేమి కావాలో ఇప్పించుమురా” అని, ఒక పాత్ర లాంటిది తీశాడు.

“ఘాకం కాకే - కేకే కూకే... ఈ తాతయ్య కొక అరటి పండివ్వండి” అన్నాడు సదాజపుడు. 

మాంత్రికుడు పాత్ర దులిపి ‘అరటిపండు కావాలి” అనగానే అరటిపండు వచ్చింది. ముసలాయనకిచ్చాడు. సదాజపుడు మళ్లీ “వీడా వాడా మేమÖ యాగే! ఈ ముద్దుగుమ్మకి ఒక కుంకం భరిణె ఇవ్వండి” పాత్రలోంచి భరిణె వచ్చింది, ఆనందంగా ఇచ్చాడు. తన మాయలన్నీ రాముడు గమనిస్తున్నాడా లేదా అని మాంత్రికుడు అతన్ని చూస్తున్నాడు. రాముడు ఆశ్చర్యపోతున్నాడు. ఇదంతా ఆ పాత్ర మహిమ- అని పాత్ర వేపు చూస్తున్నాడు రాముడు.

“మన్నించాలి మహామాంత్రికా! నమస్కారబాణం! రేపో మాపో ఆషా పూషా... నాకో వంద వరహాలిప్పించండి” అన్నాడు అంజి మధ్యలో దూరి. 

“నచ్చినావురా! మెచ్చినానురా!” అని మాంత్రికుడు అంజిని చూసి, “వరహాలు కావాలి” అన్నాడు. వరహాలు వచ్చాయి. ఇచ్చాడు. అందరూ, “నాకూ నాకూ” అని ఎగబడుతున్నారు. మాంత్రికుడు అందరి చేతుల్లోకీ ఒంపుతున్నాడు. రాముడు అలాగే చూసి చూసి, ఒక్క ఉరుకున వెళ్లి మాంత్రికుడి చేతిలో వున్న పాత్రని లాక్కుని పరుగెత్తాడు. జనం విస్తుబోయారు. మాంత్రికుడు నివ్వెరపోయాడు. రాముడు ఆ పాత్రతో అడవి వేపు పరుగెత్తి - ఒకచోట ఆగి నోటికొచ్చిన అక్షరాలు పలికాడు - వరహాల కోసం.

“మోటా బాడా... మేమÖ యాగే...” అంటూ ‘మణులు కావాలి, మాణిక్యాలు కావాలి” అన్నాడు పాత్ర వేపు చూస్తూ. ఏమీ రాలేదు. పాత్ర మీద కొట్టాడు - ‘వరహాలు కావాలి’ అన్నాడు ఆవేశంగా. వికటాట్టహాసం చేస్తూ మాంత్రికుడొచ్చాడు.

“అందులో ఏముందిరా డింభకా! అంతా మా మంత్రశక్తిలో వుందిరా” అన్నాడు గడ్డం నిమురుకుంటూ. “తెలుసుకున్నానురా నీ మనసులోని మర్మమంతా! ప్రేమించావు కదరా ఉజ్జయిని రాజకుమారిని! భవనాలు, పల్లకీలు, పరివారాలూ తెస్తే కూతుర్నిస్తానన్నాడు కదరా రాజు!” ఉన్న విషయం అడిగాడు. అవునన్నాడు రాముడు.

“సన్మార్గుడివిరా డింభకా! సన్మార్గులకు సహాయపడడం మా వ్రతం రా, నీ కోరిక తీరే కీలకం చూపిస్తాను. సాహసం శాయగలవురా?”

“మీరేం చేయమన్నా చేస్తాను. ప్రాణమైనా ఇస్తాను”.

“భలే డింభకా భలే!... జై పాతాళభైరవి... వూ”... పదరా” అని ప్రయాణం కట్టించాడు మాంత్రికుడు. మంత్రముగ్ధుడై అనుసరించాడు రాముడు. గుట్టలు, కొండలు, అరణ్యాలూ దాటుతూ నడుస్తున్నారు.

ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు

అయ్యో పాపం పసివాడు

వేమరు దేవుల వేడుకొని, తన కొమరుని క్షేమం కోరుకొని; ఓ...

ఏమైనాడో  ఏమౌనో యని కుమిలే తల్లిని కుములుమని ॥ప్రేమ॥

ప్రేమ కన్నను పెన్నిధి ఏమని ఏమి ధనాలిక తెచ్చునని

భ్రమసి చూచు ఆ రాజకుమారిని నిముషమె

యుగముగ గడుపుమని ॥ప్రేమ॥

ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొని

ఏమి వ్రాసెనో అటు కానిమ్మని బ్రహ్మదేవునిదె భారమనీ ॥ప్రేమ॥

కీకారణ్యం. అంతా భయంకరంగా వుంది. ఎక్కడి నుంచో ఓ కేక వినిపిస్తోంది. ‘జై పాతాళభైరవి’ అని స్మరించాడు మాంత్రికుడు.

“ఇదేరా మంత్రాలమర్రి” అని భయపెడుతున్న ఒక వృక్షాన్ని చూపించాడు మాంత్రికుడు. వినిపిస్తున్న ఆ కేకను “ఆ శబ్దం ఏమిటి స్వామీ?” అని అడిగాడు రాముడు. 

“అదేరా పాతాళభైరవి. తీసుకుపొమ్మని పిలుస్తోందిరా!” రాముడికి దేనికీ భయం లేదు. ‘ఓ’ అని వినిపిస్తున్న కేకకి మాంత్రికుడు తుళ్లి పడుతున్నాడుగాని, రాముడు చలించడం లేదు. కేక వినిపిస్తున్నప్ప్పుడల్లా పాతాళభైరవిని స్మరిస్తున్నాడు మాంత్రికుడు. “ఎక్కడుంది?” అని అడిగాడు రాముడు ఆత్రుతగా.

“అనంత ఐశ్వర్యం ఇచ్చే నిక్షేపంరా. ఇక్కడ భూగర్భంలో వుంది. దారి చూపిస్తాను. చెదరక బెదరక చెట్టెక్కుమురా డింభకా!” రాముడు సాహసప్రియుడు. అనడమే తడవు - చెట్టెక్కాడు. పిశాచిలా నవ్వుతూ ఒక ఆకారం భయపెడితే కత్తి దూసి తోలేశాడు రాముడు. మాంత్రికుడు అభినందించాడు. “ఆ కొమ్మ వెంటే సూటిగా ఇక్కడికి రారా”.

మళ్లీ ఏదో అడ్డం పడితే, చిటికెలో పారదోలాడు రాముడు.

“భలే డింభకా భలే! సాహసివిరా. వరపుత్రుడివిరా.... పాతాళ బిలానికి మార్గం చేస్తున్నాను - చూడరా” అని మంత్రం పఠించాడు. భూమి బద్దలైంది. పెద్ద గొయ్యి ఏర్పడింది. మంటలు ఎగశాయి. చెట్టుకొమ్మ మీద వున్న రాముడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మాంత్రికుడు వికటాట్టహాసం చేశాడు.

“పాతాళభైరవి ప్రసన్నమవుతోంది. జయం కోరి మంటలో దూకరా!... సంకల్పం సిద్ధిస్తుంది... రాజకుమారి లభిస్తుంది. జయంకోరి మంటలో దూకరా!” అన్నాడు మాంత్రికుడు అనుమానంగా చూస్తున్న రాముడితో. రాజకుమారి అనగానే ఇంక ఆలోచన లేదు. మంటలో దూకేశాడు రాముడు. మంట చల్లారి, బిలం ఏర్పడింది. దభీమని భూగర్భంలో పడ్డాడు. వికటాట్టహాసం చేస్తూ అభినందించాడు మాంత్రికుడు. భూగర్భంలోని గుహలో అంతా అయోమయం. “స్వామీ! ఎక్కడున్నారు?” అని కేక పెట్టాడు రాముడు.

“వస్తున్నానురా డింభకా! భయపడకు” లోపలికి దిగి, “చూస్తివిరా మాయ” అన్నాడు మాంత్రికుడు.

“అంతా అయోమయంగా వుంది స్వామీ, ఎక్కడా దారి కనబడదే!”

“దారి చేస్తాను చూడరా!...” అని నాలుగడుగులు నడిపించాడు. లోపలికి వెళ్లే దారి మÖసుకుని వుంది. అక్కడో విగ్రహం వుంది - భయంకరంగా. అది తన u£డ్డును ఒక వేలితో చూపిస్తోంది. ఇంకో చేత్తో పక్కనే వున్న గదని చూపిస్తోంది. ఆ సైగ మాంత్రికుడికి అర్థమైంది. 

“ఇదే రా u£డ్డుదేవర! ఆ ఉక్కు గదతో u£డ్డును పగల మోదమంటోంది. ఆజ్ఞ శాయరా!”

తణుకు బెణుకూ లేకుండా, ఎంతో బరువుగా వున్న ఆ ఉక్కుగదను పైకి ఎత్తి u£డ్డు మీద బాదాడు రాముడు. “వూ”... బలంగా మోదరా” మÖడో దెబ్బకి పగిలింది. దారి ఏర్పడింది. “పదరా” అని రాముడిని ముందు పంపించి, తను వెనకాల వెళ్లాడు. అక్కడ దారిలో కత్తులతో వున్న చక్రాలు గిరగిర తిరుగుతున్నాయి. లోపలికి వెళితే అంతే!

“ఇదేరా కత్తుల ద్వారం. ఇందులో దూరి వెళితే పాతాళభైరవి సన్నిధికి చేరతాం. సాహసం శాయరా... సంకల్పం సిద్ధిస్తుంది... రాజకుమారి లభిస్తుంది”.

రాముడు నిర్భయంగా కత్తుల మధ్య నుంచి వెళ్లిపోయాడు. కత్తులు పూలమాలలై పడ్డాయి. మాంత్రికుడు వెనకాల వెళుతూ - పొగిడాడు. “రాజకుమారి నీదేరా” అన్నాడు.

“పెళ్లిదండలు చూస్తివిరా... దేవి పిలుస్తోంది - పదరా”

ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఎదురుగా పాతాళభైరవి విగ్రహం అంత ఎత్తున నిలబడి, కనిపించింది. మాంత్రికుడు పరవశించి, స్తుతించాడు....

“చూస్తివిరా దేవిని! మహాశక్తి. పాతాళభైరవి!... నేను మంత్రజపం చేసి, మాతను ప్రసన్నం చేస్తాను. నీవు ఆ పుష్కరిణిలో స్నానం చేసి శుచివైరారా. దేవి అనుగ్రహం శాయిస్తాను”.

రాముడు పక్కన వున్న పుష్కరిణి వేపు వెళ్లాడు. పుష్కరిణిలో దిగాడు. చిరుకత్తి నోటనే వుంచుకున్నాడు. దిగాడో లేదో, లోపలి నుంచి ఒక మొసలి వచ్చి, అతన్ని ఇంకా లోపలికి లాగింది. కాలు లాక్కుని, ముందుకు వస్తున్నా అది, మళ్లీ లాగేస్తోంది. రాముడు కత్తితో దాన్ని పొడిచి చంపేశాడు. ఆ మొసలి తన రూపం వదిలి, దేవతా రూపంలో ప్రత్యక్షమైంది.

“ధన్యోస్మి నరుడా! ధన్యోస్మి. నీ సాహసం వల్ల నాకు శాప విమోచనమైంది. నీ ఋణం తీర్చుకుంటాను. ఈ మాంత్రికుడు టక్కరి. నిన్ను పాతాళభైరవికి బలి యిచ్చి, అపూర్వ శక్తులు సాధించనున్నాడు. నీవే ఆ మాంత్రికుడిని దేవికి బలి యిస్తే దేవి నిన్నే కటాక్షిస్తుంది. విజయోస్తు నరుడా విజయోస్తు!” అని అసలు రహస్యం చెప్పి దేవి అంతర్ధానమైంది. రాముడికి మతి భ్రమించినట్టయింది. ఈ మాంత్రికుడిని నమ్మి ఇంత సాహసం చేసినందుకు, ఇదా వీడి కుట్ర? - ఇప్ప్పుడు - తన సాహసం చూపించాలి!

రాముడు నిదానంగా ప్రవేశించేసరికి - మాంత్రికుడు మంత్రాలు పఠిస్తూ భైరవిని స్తుతిస్తున్నాడు. రాముడు వినయంగా చేతులు కట్టుకుని నిలబడి - “స్వామీ” అని పిలిచాడు. “శుచిగా వచ్చావురా... దేవికి సాష్టాంగ నమస్కారం శాయరా” అన్నాడు మాంత్రికుడు... రాముడు మాంత్రికుడిని ఎలా పడగొట్టాలా అని ఆలోచిస్తూంటే - “సంకల్పం సిద్ధిస్తుంది, రాజకుమారి లభిస్తుంది” అని హెచ్చరించాడు. రాముడు, మామÖలుగా నమస్కరిస్తే - “అలా కాదురా, సాష్టాంగ నమస్కారం శాయరా... అనుగ్రహించమని దేవిని ప్రార్థించరా” అన్నాడు.

“దేవీ అనుగ్రహించు” అన్నాడు రాముడు కాస్త వంగి.

“వూ” - అలా కాదురా”

“వూ” - ఇంకెలా స్వామీ”

“నేను చూపిస్తాను చూడరా. ఇలా కూచుని, కాళ్లు, వక్షమÖ నేల మోపి, జై పాతాళభైరవి...” అని స్తుతిస్తూ మాంత్రికుడు సాష్టాంగ పడ్డాడు. ఇదే అదునుగా తీసుకుని, రాముడు కత్తి ఎత్తి మాంత్రికుడి తల నరికాడు! అంతే!... ఆలయంలోని గంటలు గణగణ మని మోగాయి. అమ్మవారి విగ్రహం బీటలు వారింది. రాముడు “జై పాతాళభైరవి” అని అరిచాడు... నిదానంగా ఆ విగ్రహం కూలిపోయింది. పాతాళభైరవి ప్రత్యక్షమైంది. రాముడు మొక్కాడు.

“నరుడా! ధైర్యేసాహసే లక్ష్మి! ఇదిగో నా శక్తి - అనుగ్రహిస్తున్నాను... ఇది నా ప్రతిమ. నన్ను ధ్యానించి, ఈ ప్రతిమను నెత్తికి ఆనించిన వారికి నేను ప్రత్యక్షమై అభీష్టము నెరవేరుస్తాను” అని ప్రతిమను రాముడికి అందజేసి, అంతర్థానమైంది దేవి. రాముడు ఆనందంతో మురిసిపోయాడు. ‘జై పాతాళభైరవి’ అని దేవిని ప్రసన్నం చేసుకున్నాడు.

“నరుడా! ఏమి నీ కోరిక?”

“నన్ను రాజకుమారుడిని చేసి, ఉజ్జయిని రాజకుమారి దగ్గర చేర్చు”

అంత్ణపుర ప్రాంతంలో రాజకుమారి, రాముడి కోసం ఆలోచిస్తూ అతని ఊహలో నిమగ్నమైంది. రాకుమారుడి రూపంలో రాముడు ప్రత్యక్షమై ‘దేవీ’ అని పిలిచాడు. ఆమె అతని రూపం చూసి నిర్ఘాంతపోయింది.

“ఆ” - నేనే ఇందూ” అన్నాడు ఆనందంగా.

“నువ్వా! ఎలా వచ్చావు?... ఇదంతా ఏమిటి? ఎలా వచ్చింది?”

“అంతా నీ ప్రేమ ప్రభావమే ఇందూ. ముక్కుకు సూటిగా వెళ్లాను. నక్కతోక తొక్కాను. కుక్కతోక దొరికింది. పట్టుకుని పాతాళంలో పడ్డాను. అక్కడ, దేవి ప్రత్యక్షమైంది. “దేవీ! రాజకుమారి మీద నా ప్రేమ నిజమే అయితే, రాజుగారు కోరినవన్నీ ఇచ్చుకో లేదా నా తల తీసుకో” అన్నాను. దేవి మెచ్చి, నాకో దివ్య శక్తి ఇచ్చింది. దాని ప్రభావమే ఇదంతా. ఇంక భవనాలో పల్లకీలో పరివారాలో - ఏం కావాలో మీ నాన్న మనల్ని అడుక్కోడం, మనం ఇచ్చుకోడం! సంతోషమేనా ఇందూ!”

ఇందు ఆనందంగా చూసింది. ఇద్దరూ పాడుకున్నారు.

రాముడు : ప్రణయ జీవులకు దేవివరాలే

కానుక లివియే ప్రియురాలా

హాయిగా మనకింకా స్వేచ్ఛగా హాయిగా

ఇందు : చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా

కలసి మెలసి పోదమోయ్ వలపుబాటలా ॥హాయిగా॥ 

రాము : నీ వలపూ, నా వలపూ పూలమాలగా

నీవు నేను విడివడనీ ప్రేమమాలగా ॥హాయిగా॥ 

ఇందు : కలలె నిజముకాగ కలకాలమొకటిగా 

తెలియరాని సుఖములలో తేలిపోవగా ॥హాయిగా॥

తెîల్లవారేసరికి - ఉద్యానవనంలో రాముడి ఇల్లు మారిపోయింది. అక్కడొక దివ్యమైన మహల్ వెలిసింది. మహారాణి, రాజూ అందరూ వసారాలోకి వచ్చి చూసి, అమితాశ్చర్యపోయారు.

“నిన్న లేదే! పొద్దునే ఎలా వొచ్చి పడింది ఈ మహల్?” అంది రాణి.

“చిత్రంగా వుందే” అన్నాడు రాజు. ఇంతలో గంధోళి గాడిలా వచ్చాడు శీను. “అక్కయ్యా! బావగారూ! ఉద్యానవనంలోకి శుత్రరాజు ఎవడో వచ్చాడు. భలేరాముడి ఇల్లు నేలమట్టం చేసి, పెద్ద మహల్ కట్టుకున్నాడు” అని వెర్రినవ్వు నవ్వాడు.

ఇంతలో పరిచారిక వచ్చింది. “మహారాజా! ఎవరో శ్రీమాన్ ఆంజనేయులుగారట - సపరివారంగా వచ్చి తమ దర్శనం కోరుతున్నారు” అని మనవి చేసింది.

ఎవరా అని రాజుగారు, రాణీగారూ మందిరంలోకి వచ్చారు. అంజి కొత్త రూపంలో వున్నాడు.

“జsTÖభవ! దిగ్విజsTÖభవ! మహాప్రభో! తమ ఆశీర్వాదం వల్లనే మా మిత్రుడు శ్రీ తోటరామచంద్ర, దేవీ ప్రసాదిత కీర్తిసాంద్ర, మన తోటలోనే తన పాత గుడిసె స్థానే చిత్ర విచిత్ర మాయామహల్ నిర్మించుకుని గృహప్రవేశం చేయుచున్న సందర్భంలో తమకు పంపుకున్న కానుకలు!” అని తన వెకిలినవ్వు నవ్వి కానుకలు చూపించాడు.

శీను నివ్వెరపోయాడు. “శత్రురాజు కాదూ! తోటరాముడా!... ఐతే ఎక్కడో ఎత్తుకొచ్చాడు. అక్కయ్యా! బావగారూ... ఇదంతా వట్టి దగా, మోసం!” అన్నాడు కసిగా.

“శీనూ”

“ఆ””

“నోరు మÖసుకో”

“ఈ కానుకలు ప్రభువులవారికి!... ఇవి రాణీవారికి... ఇవి రాజకుమారికి...” అని ఆయా కానుకలు అందజేస్తూ వెకిలినవ్వు నవ్వి - “ఇదీ... రాణీగారి సోదరులకు....” అన్నాడు ఆంజనేయులుగా మారిన అంజి.

“నాకేం అక్కర్లా! వట్టి మోసం!” అంది చిరచిర లాడుతున్న శీను ముఖం....

“శీనూ!”

“ఆ””

“నోరు మÖసుకో”

అలా అన్నప్ప్పుడల్లా రాకుమారి కిసుక్కున నవ్వుకుంటూనే వుంటుంది. అలాగే నవ్వింది.

“మహారాజా! తమరు సకుటుంబంగా వేంచేసి, మాయామహల్‌ను చూసి, మా చేతి విందు ఆరగించి, మమ్ము ఆశీర్వదించవలెనని మా మిత్రుని వేడుకోలు” అన్నాడు అంజి.

“తప్పకుండానూ. రాణీ! ఈ చిత్రమేమిటో చూడాలి” అని రాజుగారు 

అనగానే -

“చూడాలేమిటి - తప్ప్పు తప్ప్పు! పరీక్షించాలి అక్కయ్యా!” అని శీను 

అనగానే -

“శీనూ” అని రాజుగారు హెచ్చరించి, నోరు మÖసుకోమని చెప్పకుండానే నోరు నొక్కుకున్నాడు శీను.

అతి రమ్యమÖ, అత్యద్భుతమÖ అయిన ఆ దివ్య భవనంలో ప్రవేశించారు రాజుగారు, రాణీగారు అందరూ. ఆ శిల్పకళా వైభవానికి ఆశ్చర్యపోతున్నారు. అలా నడుస్తూ వుంటే - నాట్య ప్రదర్శన ఆరంభమైంది. మహారాజావారు ముచ్చటపడిపోయారు. అలా తీసుకెళ్లి ఇంకా మరికొన్ని ప్రదర్శనలు చూపించాడు రాముడు. ఐతే ఈ వైభవం, ఈ ఉత్సవం అంతా ఒక్కరోజులో ఎలా సాధ్యమైందనదే అందరికీ ఆశ్చర్యం! మధ్యలో అంజి, శీనుని ఆట పట్టించాడు. అందరూ ఆనందిస్తూ వుంటే శీను ఒక్కడే ఈర్ష్య పడిపోతున్నాడు.

“సంతోషించానురా అబ్బాయి - చాలా సంతోషించాను” అన్నారు రాజుగారు ఆనందంగా.

“అంతా తమ ఆశీర్వాదం మహారాజా!”

“చూశావా రాణీ, చూశావా ఇందూ! ఇక మామాట నిలుపుకోవాలి కదూ!” అని రాముడిని చూస్తూ “శుభ ముహూర్తం చూసి మా అమ్మాయిని మీకిచ్చి పెళ్లి చేస్తాను” అన్నాడు రాజు. రాణి అంత సంతోషించినట్టు లేదు. శీను అసలు సంతోషించ లేదు. అతని ఏడుపు మొహం చూసి, “పర్వాలేదు-ఏడవకు” అని ఎగతాళిగా బుజ్జగించాడు అంజి.

పురంలో వున్న పౌరుల్ని, రాముడి మిత్రుల్నీ అంజి స్వయంగా ఆహ్వానించాడు. కూడలిలో అందర్నీ చేరదీసి, “ఆర్యులారా, అగ్రజులారా! మీరందరూ వివాహ మహోత్సవానికి తప్పక దయచేయాలి. మన మిత్రుడు భలేరాముడు మరీమరీ చెప్పమన్నాడు”

“ఆంజనేయులుగారూ! మరి లగ్నం ఎప్ప్పుడన్నారు?” అని ఒక మిత్రుడు అడిగాడు.

అంజి ఆలోచించి, “జ్యేష్ట శుద్ధ ఆదివారం ఉత్తరా ఫల్గుణీ నక్షత్రయుక్త కర్ణాటక...” అని చెప్పబోతూ వుంటే “అహ”హ”... కర్కాటక” అని ఒకాయన సవరించాడు.

“ఆ”.. కర్కాటక లగ్నమున ఉదయం ఏడు ఘడియల యాభై ఐదు విఘడియలకు...” అన్నాడు తడుముకొంటూ. 

అంజి అంతటితో వూరుకోలేదు. ఎక్కడో మాల తిప్ప్పుతే కూచున్న సదాజపుడికి కూడా శుభవార్త అందించాడు. మాంత్రికుడి కంఠంతో సదాజపుని పిలిచాడు.

“ఒరే డింగరి! మెచ్చానురా తపసు! చాలించురా, లేరా డింగరీ...” అన్నాడు. సదాజపుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి, “ఏంగురూ” అన్నాడు. అంజి వెర్రినవ్వు నవ్వి - “మా మిత్రుడు భలేరామునికి రాజకుమారిని ఇచ్చి పెళ్లి చెయ్యబోతున్నార్రా” అని చెప్పగానే - ‘పెళ్లా’ అని ఆశ్చర్యపోయాడు - సదాజపుడు.

“నీవు కూడ విచ్చేయుమురా డింగరీ! అక్కడ వారీ వీరీ, అన్నం గిన్నం...”

“అయ్యో గురూ! ఏమైనావు గురూ... ఎక్కడున్నావు గురూ...” అంటూ పరుగెత్తాడు సదాజపుడు మాంత్రికుడి గుహకి. దూర్భిణి యంత్రంలో మాంత్రికుడు ఎక్కడున్నాడని చూశాడు. పాతాళభైరవి గుహలో చచ్చిపడి వున్న మాంత్రికుడిని చూసి, “అయ్యో గురూ!! ఎంత పని జరిగింది గురూ!... ఎలా అయిపోయావు గురూ!... వస్తున్నా గురూ!! వస్తున్నా...” అని సంజీవిని తీసుకుని పరుగెత్తాడు. “జై పాతాళభైరవీ...” అంటూ సంజీవిని, అతని తలకీ మెడకీ మధ్య స్పృశించాడు. అంతే! మాంత్రికుడికి మెలకువ వచ్చింది... పోయిన ప్రాణం తిరిగి వచ్చేసింది. “గురూ!.. బతికేశావు గురూ... గురూ... బ్రతికారు గురూ...” అన్నాడు ఆనందంగా. మాంత్రికుడు మత్తు నుంచి లేచినవాడిలా లేచి, ఎదురుగా వున్న సదాజపుడిని పట్టుకుని - “నన్నే మోసం శాయగలవురా!” అన్నాడు కోపంగా.

“నేను గురూ!... సదాజపుడిని గురూ! నీ శిష్యుడిని...”

“ఆ”... వాడేడిరా?”

“ఉజ్జయినిలో భవనం కట్టాడు గురూ! రాజకుమారిని పెళ్లాడుతున్నాడు గురూ!”

మాంత్రికుడికి మండిపోయింది. దిగ్గున లేచాడు. నమ్మించి వాడు చేసిన మోసానికి, తను పై ఎత్తు వెయ్యాలి. సదాజపుడితో బయల్దేరాడు.

ఉజ్జయినిలో అతివైభవంగా తోటరాముడికీ, రాకుమారి ఇందుమతికీ వివాహం జరుగుతోంది. దేశ దేశాల రాజులు, ప్రజలు విచ్చేస్తున్నారు. ఒక్క శీను దగ్గర తప్ప అంతటా ఆనందం విరాజిల్లుతోంది. కాని, రాముడి తల్లి మాత్రం దీనంగానే కూచుంది. “పిన్నీ పిన్నీ... పెళ్లి వారొస్తున్నారు. నువ్వింకా ఇలాగే కూచున్నావేంటి?” అన్నాడు అంజి.

“నేనెలా వుంటే ఏం నాయనా” 

“అదేమిటి పిన్నీ! నీవిప్ప్పుడు రాజమాతవి. రాణీగారిని నువ్వే సన్మానించాలి. చీని చీనాంబరాలు ధరించి, రత్నహారాలు అలంకరించుకుని, బంగారు ఉయ్యాల మీద ఊగుతూ...”

“ఏది శాశ్వతం నాయనా! నన్నిలా ఉండనిద్దూ. అంతలో పెళ్లికొడుకు కలిగించుకున్నాడు - “అమ్మా!నీవీ దుస్తులు వేసుకుని ఠీవిగా వుండకపోతే నేనీ పెళ్లి చేసుకోనే. అంతే!” అన్నాడు.

“ఓరి భగవంతుడా! ఓ కొడుకునిమ్మంటే” అని ఆమె అనబోతూవుంటే “ఇటువంటి మహారాజు నిచ్చావుకదురా” అని అంజి పూర్తి చేశాడు. 

ఇద్దరూ కలిసి శాంతమ్మని ఒప్పించారు. అంతలో మాంత్రికుడు, సదాజపుడూ ఉజ్జయినిలో ప్రవేశించారు. “గురూ! పెళ్లి జరిగిపోతోంది గురూ” అని ఏడుపు మొహం పెట్టాడు సదాజపుడు. మాంత్రికుడి కంటికి ఓ దృశ్యం కనిపించింది. వేదన పట్టలేక, శీను చెట్టుకి ఉరితాడు వేసి చావబోతున్నాడు.

“పెళ్లి జరిగిపోతోంది. ఇంక నేను బతికితేనేం చస్తేనేం - చస్తాను! చచ్చితీరతాను” అంటున్నాడు శీను ఏడుస్తూ...“అక్కూ - నేటితో మన ఋణం తీరిపోయిందే” అన్నాడు ఉరిలో తలపెట్టి - తాడు లాగుతూ. “అబ్బ... అబ్బ... ఇంత కష్టంగా వుంటే ఎలా చావడం?...” అని మళ్లీ ఆత్మహత్యాయత్నం సాగిస్తూ ‘కాస్త మెత్తగా వుంటే ఎలాగన్నా చావొచ్చు...” అని “చావకుండా ఎలా బతకడం? మా వంశం, కులం, మతం, గౌరవం అన్నీ చచ్చాయి. నేనూ చస్తాను. మిగలకుండా చస్తాను...” అని తల ఉరిలో పెట్టి బిగించుకుంటూ బాధపడుతున్నాడు.

అంతలో దగ్గరకొచ్చిన మాంత్రికుడు - “ఒరే మÖర్ఖా! పిరికిపందా! ఏం మునిగిందిరా ఆత్మహత్య చేసుకుంటున్నావు” అని అడిగాడు.

“కొంపే మునిగింది. రాజకుమారిని... తప్ప్పు తప్ప్పు... నా మేనకోడలిని... వెధవ తోటరాముడికిచ్చి పెళ్లి చేస్తుంటే వీరశూర శూరసేనుడు ఇంకా బతకడమా అని... చస్తాను. చచ్చి తీరతాను”.

“ఆగరా ఆగు! బ్రతికి యుండిన సుఖముల బడయవచ్చురా” అన్నాడు మాంత్రికుడు.

“సుఖములా!”

“ఆ రాజకుమారిని నీకే కడతానురా. దిగిరారా”

“వస్తున్నా” అంటూ మెడలో వున్న తాడుతోనే రాబోయి - “అబ్బ...” అని అరిచాడు నొప్పి పుట్టి - శీను.

“మీరు బ్రతిమాలుతున్నారు గనక చస్తున్నా... తప్ప్పు తప్ప్పు! వస్తున్నా”.

“జై పాతాళభైరవి” అని దూర్భిణి యంత్రం తీసి చూపించి, అందులో చూడమన్నాడు మాంత్రికుడు.

చూసి “మాయా మహల” అని అరిచాడు.

“చూడరా, చూడు”.

చూస్తూ వుంటే అతనికి కనిపిస్తున్నాయి “మాయా మహల్లో, పూజాగృహంలో, సంపుటంలో విగ్రహం...” కనిపించాయి. 

“ఆ... విగ్రహం! ఆ విగ్రహాన్ని తెచ్చి మాకివ్వరా. రాజకుమారినిచ్చి పెళ్లి చేస్తాను.

“పెళ్లా - నాకా... ఇక్కడ వుండండి... ఇప్ప్పుడే తెస్తాను...” అని పరుగెత్తాడు శీను. పెళ్లి మందిరంలో మంత్రాలు చదువుతూ వుండగా, శీను అతిథుల మధ్య నుంచి పెళ్లి పెద్దలా నడుస్తూ, అంజి కనిపిస్తే “ఆంజనేయులుగారూ... మనం బంధువులం...” అన్నాడు ఆనందం నటిస్తూ. నళిని కనిపిస్తే ఏదో సరసం ఆడాడు. మంత్రాలు సాగుతున్నాయి. ఎవరూ చూడకుండా తాను పూజాగృహంలో ్పు£రబడి, పాతాళభైరవి విగ్రహం తస్కరించాలి. అక్కడే కూచున్న శాంతమ్మని, ఏదో చెప్పి పంపించేశాడు. నెమ్మదిగా పూజాగృహంలోకి చొరబడి పాతాళభైరవి విగ్రహాన్ని తీసి దొంగచాటుగా బయల్దేరి బయటపడ్డాడు.

“అబ్బబ్బ!... ఏం కష్టం ఏం కష్టం! పద్మవ్యూహం చీల్చుకొచ్చాను. ఎలాగైతేనేం - జై పాతాళభైరవి” అని తెలియకుండా ఆ విగ్రహాన్ని తలకి తాకించాడు. ఇంకేం - పాతాళభైరవి ప్రత్యక్షమైంది. “నరుడా! ఏమి నీ కోరిక?” అని అడిగింది. శీను బిత్తరపోయాడు. “ఎవరు నువ్వు? ఏమిటీ వేషం అమ్మోరులాగ?” అని అడిగాడు. ఆమె మళ్లీ అదే అడిగింది. “కోరికా? తప్ప్పు తప్ప్పు! పరస్త్రీవి... పరస్త్రీవి...” అంటూ పారిపోయాడు. ఐనా ఆమె విడిచి పెట్టలేదు. మళ్లీ అక్కడ ప్రత్యక్షమై మళ్లీ అదే అడిగింది. శీను తత్తర పడిపోయాడు - భయంతో. ఆమె మాయమైంది! “అరె! అంతా మాయగా వుందే... ఆ”... ఈ టక్కులు నాకు తెలుసులే. ఈ u£మ్మ కొట్టేద్దామనా నీ ఎత్తు? నువ్వు రాముడి పక్షంగా” అనడం ఏమిటి ఆమె మళ్లీ ప్రత్యక్షమై “ఏమి నీ కోరిక?” అంది. “కోరికా! తప్ప్పు తప్ప్పు!... నీకోదండం గాని, ముందు నువ్వు పో, పో...” అని గసిరాడు. పాతాళభైరవి మాయమైంది. అంతలో మాంత్రికుడు సమీపించి, “తెచ్చావురా?” అన్నాడు. ఇచ్చాడు ప్రతిమను. అందుకుంటూ వికటాట్టహాసం చేస్తే, శీను కూడా విజయోత్సాహంతో వెర్రినవ్వు నవ్వాడు. 

“ఇక చూడరా నా మహిమ! రాజకుమారిని ఇప్ప్పుడే తెప్పిస్తాను... నేను చెప్పినట్టు శాయరా... అక్కడికి పో”.

శీను సందేహం, భయం రెండూ పడుతూ, ఉరితాడున్న చెట్టు దగ్గరికి వెళ్లాడు - మాంత్రికుడి గద్దింపుతో.

“తూర్పుగా తిరుగు” అన్నాడు. శీనుకి తూర్పేదో పడమరేదో ఏం తెలుసు?... అడ్డదిడ్డంగా అటూ ఇటూ తిరుగుతూ వుంటే - వూ”- ఇటు” అని చూపించాడు మాంత్రికుడు. ఏం జరుగుతుందో, ఏం చేస్తాడోనని భయంతో అటు తిరిగాడు.

“చెవులు పట్టుకో”

“నావా?”

“వూ”! కళ్లు మÖసుకో... మÖసుకోరా... రాజకుమారిని స్మరించు...”

“రాజకుమారి... రాజకుమారీ!” అంట రకరకాలుగా మంత్రం జపించినట్టు జపించాడు శీను. జపిస్తూనే వున్నాడు భక్తుడిలాగ.

“జై పాతాళభైరవి” అని మాంత్రికుడు ప్రతిమని తలకి తాకించడంతో, పాతాళభైరవి ప్రత్యక్షమై - “నరుడా ఏమి నీ కోరికా?” అంది - అదే తన పాట అన్నట్టు.

“ఉజ్జయినీ రాకుమారిని వెంటనే ఇక్కడికి తీసుకురా!”

అంతే! శోభాయమానంగా వున్న పెళ్లి మంటపంలో, సరిగ్గా తాళి కట్టేవేళకి, పీటల మీద నుంచి పెళ్లి కూతురు అదృశ్యమైంది! మంటపం నిర్ఘాంతపోయింది. రాముడు తాళి జారవిడిచాడు. పెళ్లి పీటల మీద రాకుమారి ఎలా కూచుందో అదే విన్యాసంలో, మాంత్రికుడి ముందు ప్రత్యక్షమైంది!.. ఒక్కసారి ఎదురుగా భయంకరంగా వున్న భీకరాకారం చూసి, కెవ్వుమని కేక పెట్టి, మÖర్ఛపోయింది. శీను చూసి, “ఇందూ!” అని పిలిచాడు - ఆత్రుతగా.

“వూ”... కళ్లు మÖసుకునే వుండరా. నీ పనే పూర్తి చేస్తున్నానురా...” అని పాతాళభైరవిని స్మరించాడు. ఆమె వచ్చింది. కోరిక అడిగింది.

“నన్ను... నా శిష్యుని... ఈ మిఠారిని, మాయా మహల్‌తో సహా నా స్థలానికి చేర్చు”

అంతే! అంతా ఆమె మహిమ!... మొత్తం అడిగినవన్నీ వచ్చేశాయి. శీను కళ్లు తెరిచేసరికి, ఎవరూ లేరు... “మోసం! మోసం!... ఇందూ...” అని కేకలు పెట్టి తల్లడిల్లిపోయాడు శీను. 

అంత దివ్యవమైన మాయా మహల్ అంతర్ధానమైంది... అంతకుముందు ఆ చోటు ఎలా వుందో అలా, అదే రూపానికి వచ్చింది. మాయతో వచ్చిన నూతన వస్త్రాలు, అలంకారాలూ అన్నీపోయి, అందరూ సాధారణ స్థితికి వచ్చేశారు. రాముడు బిత్తరపోయి నించున్నాడు. రాణి ద్ణుఖం పట్టలేకపోయింది.

“ఎంత ద్రోహం చేశావురా! ఏదిరా నా కూతురు? ఏం గారడీ చేశావో చెప్పరా. మాకెక్కడ దాపురించావురా? ఈ జిత్తులమారి వెధవని నమ్మ వద్దని మొదట్నుంచీ నేను మొత్తుకుంటూనే వున్నాను. నామాట విన్నారూ! చివరికి నా బంగారుతల్లిని పొట్టన పెట్టుకున్నాడు... వీడు మనిషి కాడు. రాక్షసుడు! నీ మాయలు, గారడీలు... మామీద... మామీద ప్రయోగిస్తావా?... నా కూతురేమైందో చెప్ప్పు!... చెప్ప్పు!... అని నిలదీసింది - శోకభారంతో. రాజుగారు కూడా అదే అడిగాడు. 

“చెప్పవేంరా మహారాజు అడుగుతూవుంటేనూ...” శాంతమ్మ కూడా అదే అడిగింది.

ఎక్కడో ఆలోచిస్తున్న రాముడు, “విగ్రహం పోయిందమ్మా.... విగ్రహం పోయింది” అన్నాడు నిస్పృహతో.

“విగ్రహమా! విగ్రహం అంటాడేమిటి - నా కూతురేమైందో చెప్పరా శనిగ్రహమా!”

అంతలో భోరున ఏడుస్తూ వచ్చాడు శీను - “అక్కయ్యా... అక్కయ్యా” అంటూ.

“ఏమిట్రా” అంటే చెప్పడు. ఏడుస్తున్నాడు. “ఏం జరిగిందో చెప్పరా” అని రాణి గద్దించింది.

“అక్కయ్యా! మన ఇందుని మాంత్రికుడు ఎత్తుకుపోయాడు అక్కయ్యా” అని బావురుమన్నాడు.

“ఎవడ్రా! ఏ మాంత్రికుడురా?... ఏం జరిగిందో సరిగ్గా చెప్పరా ఏబ్రాసి గాడిదా” అని రాజుగారు తిడితే -

“నేపాళ: మాంత్రికుడు బావా” అన్నాడు. రాముడు ఒక్కసారి, దిగ్గుమని పోయాడు. “నేపాళ మాంత్రికుడా!” అన్నాడు. “ఆ”... వాడే... ఆంఫట్టు...”

“వాడిని నేను చంపేశానే! ఎలా వచ్చాడు?”

“ఎలా వచ్చాడో నాకేం తెలుసు? పూజ చేసుకోడానికి u£మ్మ తెచ్చి పెట్టమంటే, మాయా మహల్ నుంచి నేనే తీసుకెళ్లి ఇచ్చాను. జై పాతాళభైరవి అన్నాడు. ఇందు వచ్చింది. మాయ చేసుకుపోయాడు!”

“ఎంత పని చేశావురా” అని తిడుతూ రాణిగారు శీనును బాదింది. శీను లబోదిబోమన్నాడు - అమ్మో అంటూ.

“రాణీ! ఏమిటిదంతా? ఎవర్ననీ ఏం ప్రయోజనం! జోస్యం నిజమైంది! అన్నాడు రాజు.

“మహారాజా! నా కంఠంలో ప్రాణం వుండగా రాజకుమారి ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. ఆశీర్వదించండి”.

“అలాగే నాయనా... వెళ్లిరా. నా కూతుర్ని నాకు దక్కించు”.

‘ధైర్యే సాహసే లక్ష్మీ’ అనుకున్నాడు కాబోలు బయల్దేరాడు రాముడు, అంజితో సహా. ఎక్కడుందని? ఎక్కడ వెతకాలి? అంతా అయోమయం!

మాంత్రికుడు, రాకుమార్తెను గదిలో బంధించాడు. పాతాళభైరవి ప్రతిమ తన చేతికి లభ్యమైంది గనక, ఇంకే చింతా లేదు. రాకుమారిని తన దానిగా చేసుకోవడమే కర్తవ్యం.

“సదాజపా” అని పిలిచాడు మాంత్రికుడు తన సౌందర్యాన్ని చూసుకుంటూ.

“ఏం గురూ?”

“అమ్మణి ఏం చేస్తోందిరా?” అన్నాడు గోముగా.

“రోసం చేస్తోంది గురూ”

“ఏలరా!”

గడ్డం నిమురుకుంటూ, రాకుమారి వున్న గదిలోకి ఆనందపరవశుడై వచ్చాడు మాంత్రికుడు.

“మÖర్ఛలోనే ముద్దొచ్చావే బుల్ బుల్! ఆనందంలో నన్ను ముంచివేసినావే! ఇక దిగులు మానవే బుల్ బుల్. అలంకారం శాయవే!... భోజనం శాయవే... సంబరం శాయవే బుల్ బుల”.

“నన్నెందుకిలా పీడిస్తారు? కనికరం లేదూ? నేను మీకే అపకారం చేశాను?” అని అడిగింది ఇందు శోకంతో.

“అపకారం కాదే బుల్ బుల్! ఆడ మొగం ఎరగని ఈ మంకు మాంత్రికుని గుండెలో వలపురేపి, వసంతగాలి వీచావే బుల్ బుల్... బలవంతం శాయనీక, రసవంతంగా నన్ను వరించి, వశ్యం కావే బుల్ బుల్...”

“ఛీ! నీచుడా! నిన్నా నేను వరించేది? నా ప్రాణం పోయినా నీకు వశ్యం కాను”.

“ఒరె ఒరె ఒరె వారికత్తె! నువ్వెంతే? నిన్ను మించిన మోహినీ ఢాకినీ మహాశక్తుల్నే వశం చేసుకున్నానే - అనుకుంటే రాళ్లనీ రప్పల్నీ u£మ్మల్నీ కూడా వశ్యం శాయగలనే... చూడవే... హ్రాంఫట్...” అనగానే చిన్న తల్పం కదిలి ముందుకు వెళ్లింది.

“చూస్తివే నా మహిమ! నిన్ను సింగారం చేస్తానే బుల్ బుల్... సరసంలో శటం బటం నాకు పసందు కాదే. మర్యాదగా నీ మనసు నావైపు మళ్లించుకోవే బుల్ బుల్...”

- అని రాబోయాడు మాంత్రికుడు - ఇందు చీదరించుకుంది.

రాముడు, అంజితో బయల్దేరాడు. మాంత్రికుడి స్థలం పట్టుకోవాలి. మాయమహల్ ఏ పక్కకి ఎగిరి, ఎక్కడ వాలిందో తెలుసుకోవాలి. రాకుమారిని ఏ మందిరంలో దాచోడో కనుక్కోవాలి... తిరుగుతున్నారు, ఎండనక వాననక.

పల్లవి : కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖినీ

1.చ॥ : పెండ్లిపీటపై ప్రియ నెడబాయ గాలిమేడలూ గారడికాగా

కలకాలమును కర్మను దూరుచు కలగా బ్రతకడమేనో ॥క॥

2.చ॥ : వెదకి వెదకి ఏ జాడ తెలియక హృదయమంతా చీకటిగా

ఎంత పిలిచినా పిలుపే అందక చింతిలి తిరగడమేనో ॥క॥

3.చ॥ : పులివాతను బడు బాలహరిణియై చెలి ఎచ్చటనో చెరపడగా....

జాలిలేని ఆ మాయదారికే బలిగా చేయడమేనో ॥క॥

కొండలు, కోనలు అన్నీ తిరిగి తిరిగి వెతికి వెతికి, వేసారిపోయాడు రాముడు. నిరుత్సాహంగా కూలబడిపోతే, అంజి ధైర్యం చెప్పాడు.

“మిత్రమా! ఏమిటిది!... అబ్బే... ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు. మరిచావుటయ్యా! ఇలా చూడు! కథానాయకుడు కన్నీరు పెట్టుకోరాదు సుమా!”

“ధైర్యం, సాహసం ఉంటే మాత్రం ఏం చెయ్యగలంరా? ఆ మాంత్రికుడు ఎక్కడికి పోయాడో - రాజకుమారిని ఎక్కడ చెరuట్టాడో!”

“అన్నీ తెలుస్తాయి. నువ్వు ఈ పండు తిని, హాయిగా నిద్రపో. నీ రాజకుమారి ఎక్కడ వున్నదీ నేను కలగని, పొద్దునే చెబుతా - ఏం?” అని పిల్లవాడిని బుజ్జగించి నిద్రపుచ్చినట్టు పడుకోమన్నాడు. అలసి సొలసి వున్నాడేమో, రాముడు అంజి మాట విన్నాడు. 

రాకుమారిని నిలువునా అలంకరించుకోమని ఆభరణాలు పంపించాడు మాంత్రికుడు. దాసీలు పళ్లాలతో తెచ్చిన ఆ నగల్ని రాకుమారి - ఒక్క తోపు తోసింది. 

“ఏమిటీ పీడ? పోతారా పోరా?” అని గసిరి దాసీల్ని పంపించేసింది. దాసీలు ‘నీకర్మ’ అన్నట్టు చూసి, తలుపు తీసి వెళ్లిపోయారు. రాకుమారి, అన్నం, పానం, స్నానం ఏమీ లేకుండా నిస్సహాయురాలై కూలిపోయింది.

వేసివున్న తలుపు వేసినట్టుగానే వున్నా - మాంత్రికుడు తలుపులోంచి ప్రవేశించాడు. దిగులుగా కూచున్న రాకుమారిని చూసి, ఓ నవ్వు నవ్వాడు.

“రోసంతో నీ అందం రేగుతోందే బుల్ బుల్ - నా మోహం చెలరేగుతోందే బుల్ బుల్... గయ్యాళి శాయక, వయ్యారంగా నన్ను వరించవే బుల్ బుల్...”

“ఛీ నీచుడా! నిన్నా వరించేది? నీ జడలు, నీ గడ్డం, నీ బుద్ధి - నీ వంటి జీంబోతుని పశువులు, పిశాచాలు కూడా వరించవు.”

మాంత్రికుడు నిలువునా మండిపోయాడు. గయ్ మని అరిచాడు - “ఏమిటే కూస్తావ్? నీవు వరించిన ఆ బికారి రాముడు నన్ను మించిన వాడటే?”

“ఆ”- ముమ్మాటికీ. అతని ముందు నీవెంత? నేను అతన్ని మనసారా ప్రేమించాను. నీ మాయలు, మంత్రాలూ నా మనసుని తిప్పలేవు.”

“వాడిని ప్రేమించి నన్ను ధిక్కరించావుటే ధగిడీ!... ఐతే, చూడవే - వాడిని ఇప్ప్పుడే నీ కళ్లముందే ఏం చేస్తానో...” అని పాతాళభైరవిని స్మరించాడు. ‘ఏమి నీ కోరిక?’ అంటూ ప్రత్యక్షమైంది దేవత.

“ఈ ధగిడి ప్రేమించిన ఆ తోటరాముడు ఎక్కడ వున్నా సరే నవనాడులూ కట్టి తెచ్చి ఇక్కడ పడవేయి”.

అంతే! అక్కడ నిద్రలో వున్న రాముడు మాయమై మాంత్రికుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మందిరం కంపించినట్టు వికటాట్టహాసం చేశాడు - మాంత్రికుడు. “చూస్తివే ధగిడీ” అన్నాడు. బంధింపబడ్డ రాముడిని చూసి, దిగ్గున లేచింది ఇందు. “రామÖ రామÖ...” అంటూ అతని దగ్గర కొచ్చింది - ద్ణుఖంతో. కిందపడి వున్న రాముడి కట్లు విప్పబోయింది. మాంత్రికుడు గర్జించి, “ఈ ధగిడిని అవతలకి లాగండి” అన్నాడు తీవ్రంగా. దాసీలు లాగబోతే, ఇందు విడిపించుకుంటూ మళ్లీ రాముడిని సమీపించబోయింది - దాసీలు లాగేశారు.

“ఇప్ప్పుడు చెప్పవే బుల్ బుల్... మర్యాదగా నన్ను వరిస్తావా - వీడి పంచప్రాణాలూ తియ్యమన్నావా?” ఇందు భయంతో వణికిపోతూ “రామÖ రామÖ...” అంటోంది. 

“మర్యాదగా వరిస్తావా - వీడిని చిత్రవధ శాయమన్నావా?”

“నాకేం పర్వాలేదు. భయపడకు ఇందూ” అన్నాడు రాముడు ధైర్యంగా.

“అయ్యో - అలా హింసించకండి.... మీ పుణ్యం వుంటుంది... మీ కాళ్లు పట్టుకుంటాను” అంది ఇందు, తన ఎదుటే రాముడిని బాధలు పెడుతూవుంటే.

“కాళ్లు కాదే బుల్ బుల్... కరగ్రహణం శాయవే!”

“నీచుడా! దూరంగా వుండు”.

“ఇంకా మిడిసిపాటే నటే?” 

“కావాలంటే నన్ను చంపండి! నన్ను కాల్చేయండి”.

“అదెట్టాగే - నువు నా గుండెవే, నువ్వుండాలే బుల్ బుల్. ఈ రాత్రికి గడువిస్తాను. పొద్దున్నే పెళ్లికూతురువై నన్ను వరిస్తావా, సరి - లేదా, బ్రహ్మరుద్రులు అడ్డం వచ్చినా వీడిని దేవికి బలి యిస్తాను”.

“నీతరం కాదు కదా, నీ తాత తరం కూడా కాదురా పిరికిపందా!” అన్నాడు రాముడు. 

మాంత్రికుడికి పౌరుషం హెచ్చింది - “ఈ పశువును ఈడ్చుకుపోయి గుహలో పడేయండి. పొద్దున్నే బలికి సిద్ధం శాయండి” అని, పరివారానికి ఆనతిచ్చాడు. రాముడు గుహలో పడ్డాడు. 

“ఇప్పటికైనా బుద్ధిగా మనసు మార్చుకోవే బుల్ బుల్...” అని నిష్క్రమించాడు మాంత్రికుడు.

అక్కడ అడవిలో ఒక తిన్నె మీద ఒంటరిగా నిద్రిస్తున్నాడు అంజి. పక్కన వుండవలసిన రాముడు లేడని వాడికి తెలీదు. కాని, ఒక ఎలుగుబంటి వచ్చి అంజిని తడిమింది. తడముతున్నది రాముడే అనుకున్నాడు - అంజి కళ్లు తెరవకుండా - “ఉండవయ్యా - నీ గురించి కలలుకంటూ వుంటే - ఏమిటయ్యా నువ్వు?” అని చూశాడు - ఎలుగుబంటి! ఒక్కసారి బావురుమన్నాడు; కంగారుగా “మిత్రమా!” అంటూ అటూ ఇట పరుగెత్తాడు - ఎలుగుబంటిని తప్పించుకుని పారిపోయాడు. ఆ పారిపోవడం మహారణ్యంలో పడ్డాడు.

అక్కడ రెండు భూతాలు తగువు లాడుకుంటున్నాయి. 

అక్కడ ఒక శాలువా, ఒక జత చెప్ప్పులూ వున్నాయి. శాలువా నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరూ ఘర్షణ పడుతున్నారు.

“ఒరే నిన్ను మింగేస్తానురా” అన్నాడు ఒక భూతం.

“నేను నిన్ను మింగేస్తానురా” రెండో భూతం.

వాడికి చిన్న తెలివి పుట్టింది. “ఒరే, నువ్వు నన్నూ నిన్ను నేనూ మింగేస్తే ఇద్దరం మిగలం కదట్రా!” అని సత్యం తెలుసుకుని నవ్వుకున్నారు. అంతలో దూరంగా చెట్ల మాటున అంజి వస్తున్నాడు.

“నరవాసన! నరవాసన” అని పసిగట్టాయి భూతాలు.

“ఆ”... ఒరే పెద్దా! నరులు చాలా తెలివిగలోల్రా - మన తగువు ఆడు తీర్చగలడ్రో”

“మరి వాడు చెప్పినట్టు వింటావ్?”

“ఆ”... ఐతే వాడిని పిలుద్దాం వుండు!” అని, ‘ఓహోహో’ అని కేక పెట్టారు.

దూరం నుంచి “మిత్రమా!” అంటున్నాడు అంజి. “మిత్రమా” అనగానే “ఓ” అని బదులు పలికాయి భూతాలు. అంజికి కనిపించకుండా నవ్వాయి. “మిత్రమా! ఎక్కడా...” అంటూ అంజి వస్తున్నాడు.

“మిత్రమా!... చివరికి ఇక్కడికి చేరావుటయ్యా - ఇక్కడంతా దిక్కుమాలిన భూతాలు”. అంజిని దగ్గరకు రానిచ్చి భూతాలు రెండూ మీద పడ్డాయి. అంజిని ఎత్తి కుదేశాయి.

“భయపడకురా నరా! తలబుర్రలో తెలివుంటే నిన్నేం చెయ్యంరా”

“తెలివాండీ... తలబుర్రంతా వుందండి” అన్నాడు అంజి వణికిపోతూ.

“చూడ్రా - ఇవి మాయ చెప్ప్పులు” అని ఒకడంటే “నేనే సంపాదించాను” ఇంకోడన్నాడు. ‘ఏయ’ అంటే ‘ఏయ’ అనుకున్నారు.

“ఒరే! ఈ చెప్ప్పులు తొడుక్కుని ఎక్కడుండాలంటే అక్కడ చిటికెలో వుంటాంరా”

“ఒరేయ్ - ఇది మాయ శాలువ! ఇది కప్ప్పుకుంటే ఓరికీ కనపడవు”.

“ఈ రెండు మాయా వస్తువుల్ని ఇద్దరం కలిసే సంపాదించాం. ఇద్దరం పంచుకోవాలి”.

“ఒరేయ్ - ఈ రెంటిలో ఎవరికి ఏది రావాలో తెలివిగా తీర్పు చెప్ప్పు!”

“తీర్పా! నిబ్బరించకుండా జవాబు చెబుతారాండీ?” అన్నాడు అంజికాస్త ధైర్యం వచ్చి.

“అడగరా నరా” అని భూతాలు గద్దించాయి.

“మీరు నిజంగా భూతాలేనండీ?”

“అవున్రా నరా!” 

“ఐతే భూతాలకి బుద్ధి లేదన్నమాట నిజమేనండి” బూతాలకి కోపం వచ్చి గట్టిగా అరిచాయి.

“అయ్యో ఆగ్రహించకండి. ముళ్లు గుచ్చుకోకుండా చెప్ప్పులు, చలి వేయకుండా శాలువా! ఇంతే. ఇంకెందుకూ పనికి రావివి...” అని తేల్చాడు అంజి, తలబుర్రలోని తెలివి ఉపయోగించి.

“ఒరే నరాధమా! వీటిలో మహిమ లేదంటావురా?”

“లేదు... లేదు...”

“తొడిగి చూడ్రా తెలుస్తుంది”

అంజి వేసిన పాచిక చెల్లింది. వెంటనే చెప్ప్పుల్లో కాళ్లు పెట్టి - “ఆ చెట్టు దగ్గరకి వెళ్లాలి” అన్నాడు - వెళ్లి వాలాడు. భూతాలు సంతోషించాయి. “మళ్లీ మా భూతాలు గార్ల దగ్గరకి వెళ్లాలి” అన్నాడు - ‘రయ’ మని వచ్చి వాలాడు. “దాని మహిమ తెలిసింది కదురా” అన్నట్టు వాళ్ల నవ్వులు, ‘మహిమ తెలిసింది’ అని  అంజి నవ్వులతో - అరణ్యం నవ్వింది. ‘బాగుందే’ అని అంజి మెచ్చుకుంటే - ‘మరేం అనుకున్నావురా నరాధమా!” అన్నాడు భూతం. “మరి శాలువా సంగతి కూడా చూడనివ్వండి” అని శాలువా తీసి కప్ప్పుకున్నాడు అంజి. “ఇప్ప్పుడు నేను కనబడుతున్నానా” అని ఆనందంగా అడిగాడు, “లేదురా లేదు”.

కాళ్లకి చెప్ప్పులున్నాయి. శాలువా కప్ప్పుకున్నాడు. ఇంకేం - ఈ రెండూ పట్టుకుని పారిపోతే, మిత్రుడు రాముడి ఉనికి తెలుస్తుంది.

“ఇక నేను తీర్పు చెబుతాను, మీ పేర్లేమిటి?”

వాళ్లేవో చెప్పారు.

“మీరింక దెబ్బలాడకండి. కటకటా, బెకబెకా... హాయిగా వుండండి. పిట్టిపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు కటకటా - నాకు పని వుంది. మా మిత్రుని దగ్గరకు వెళ్లాలి. సెలవు... టకటకా... బెకబెకా...” అంటూ మాయమైపోయాడు. భూతాలు రెండూ ఒకర్నొకరు నిందించుకుని కొట్టుకున్నాయి.

మాంత్రికుడి గుహలో రాముడిని తాళ్లతో కట్టి, నేల మీద పడేశారు. అశక్తుడై పోయాడు. తాళ్లు విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నా తనవల్ల కావడం లేదు. దాహంతో గొంతు ఎండిపోయింది. “దాహం... దాహం” అని అరిచాడు. పక్కనే వున్న సదాజపుడు జపంలో వున్నాడు.

“ఒరేయ్... నీళ్లివ్వరా...”

“నీళ్లు కావాలీ?... రాజకుమారి వద్దూ?... వెధవ” అని ఎగతాళి చేసి, నీళ్లు తెచ్చి అతని నోటికి దూరంగా పెట్టి తాగమన్నాడు.

“నీకు అభయం ఇస్తున్నానురా... నీళ్లు అందించురా” అంటున్నాడు రాముడు.

“ఓరి పిడుగా! నీ ప్రాణాలు నా అరచేతిలో వుంటే నాకే అభయం ఇస్తావు? బలే... బలే రాముడివంటే నువ్వే... తాగు...” అన్నాడు సదాజపుడు నీళ్లపాత్ర దూరంగానే పెట్టి. రాముడు ప్రయత్నించేలోగా, ఆ పాత్ర పైకి ఎగిరింది. సదాజపుడు ఆశ్చర్యంగా చూసి, పాత్రని తెచ్చి కింద పెట్టాడు. వాడికి ఈ మాయ అయోమయంగా వుంది. పాత్ర పైకి వెళుతోంది మళ్లీ. ఆలోగా, వొంటి మీద దెబ్బలు పడ్డాయి. కింద పడ్డాడు. రాముడు పకపక నవ్వాడు.

“నవ్వుతావురా, నవ్వు... రేపు అమ్మవారికి బలి ఇచ్చేటప్ప్పుడు నవ్వురా...” అన్నాడు ఏడుస్తూ. మÖల వున్న ఓ కర్ర లేచి, దభీ దభీ మని సదాజపుడిని మోదింది. పడ్డాడు. అంజిగాడి వెర్రినవ్వు వినిపిస్తోంది... “మోసంగురో... మోసంగురో...” అంటూ స్పృహ తప్పాడు సదాజపుడు.

‘మిత్రమా!’ అంటూ అంజి రాముడి దగ్గరకొచ్చి, కట్లు విప్పి నీళ్లు ఇచ్చాడు. రాముడు ఆశ్చర్యపడ్డాడు; ఆనందపడ్డాడు. ‘ఎలా వచ్చావు?’ అని అడిగాడు. తను సంపాదించిన చెప్ప్పులు, శాలువాల గురించి చెప్పాడు అంజి. శాలువా అతని మీద కప్పి - “నువ్వు రాజకుమారి దగ్గర కెళ్లు. నేను మాంత్రికుడి భరతం పడతా” అన్నాడు. 

‘డింగరీ, లేరా’ అంటూ వాడి దుస్తులు వేసుకున్నాడు, మొహం మీద గుడ్డ కప్ప్పుకున్నాడు, మాల చేతిలోకి తీసుకున్నాడు అంజి.

దాసీలు రాకుమారికి హిత బోధ చేస్తున్నారు.

“ఇలా బిర్ర బిగుసుకుని కూచుంటే తప్పేదేం లేదమ్మా. నిన్ను చూస్తే జాలేస్తుంది... రాసకూతురివిగందా, నీ ముచ్చట్లు తీరాల. మా గురువుగారిని పెళ్లాడితే హాయిగా వుంటావు. లేకపోతే నీ జీవానికి ఆ కుర్రోడు ఉసూరుమని చావాల”.

“మీ అలంకారం ఇంకా పూర్తికాలే? గురువుగారు పిలుస్తున్నారు” అంటూ ఇంకో దాసి వచ్చింది. దాసీలు మళ్లీ చెప్పారు “మర్యాదగా మా గురువు గారిని ఏలుకో. లేకపోతే వాడిని దేవికి బలి యిస్తారు. నిన్ను బలవంతాన పెళ్లి చేసుకుంటారు. రెండిందాలా చెడకూ” అని హెచ్చరించి వెళ్లారు దాసీలు.

రాకుమారికి ఏం చేయాలో పాలు పోలేదు. ఈ మాంత్రికుడు అన్నంత పనీ చేస్తాడు. తనకి ఆత్మహత్యే శరణ్యం! తన వజ్రపునగ తీసి, వజ్రాన్ని పగలగొట్టి, నీళ్లలో కలిపి తాగబోయింది. సరిగ్గా సమయానికి రాముడు వచ్చి - “ఇందూ! ఏమిటా సాహసం? నేను వచ్చాగా... అలా చూస్తావేం ఇందూ. నేనే ఇందూ. ఇంకా అనుమానమేనా?... చూడు!” అని కొరడా దెబ్బలు తిన్న తన ఒళ్లు చూపించాడు. ఇందు నమ్మింది. ‘రామÖ’ అని అతని మీద వాలిపోయింది. 

“నేనొచ్చాగా! ఇంకేం భయం లేదు... ధైర్యంగా వుండు...” వెక్కి వెక్కి శోకిస్తున్న ఇందును అనునయించాడు. “మన అంజి వచ్చి నన్ను విడిపించాడు. ఈ శాలువా కప్ప్పుకుంటే మాయమవుతావు. ఈ చెప్ప్పులు తొడుక్కుంటే ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళతావు. మీ నాన్నగారు, అమ్మగారు నీ కోసం తల్లడిల్లి పోతున్నారు. ముందు నువ్వు వెళ్లు...”

“మరి నువ్వు రామÖ?”

“నేను మాంత్రికుడిని చంపి, పాతాళభైరవిని తెస్తాను. లేకపోతే మనకి చాలా అపాయం. ముందు నువ్వు వెళ్లు.... ఇంకా ఏమిటి ఇందూ ఆలోచిస్తావు?”

“నిన్ను ఇలా విడిచిపెట్టి నేను వెళ్లలేను రామÖ! నీతో పాటే నేనూ. ఇద్దరం కలిసే వెళదాం”.

“సరే, నువ్వు ఇది కప్ప్పుకో. మాంత్రికుడిని ఎలా చంపుతానో చూడు”.

మాంత్రికుడు తన మందిరంలో చిందులు తొక్కుతున్నాడు. పక్కనే వున్న భృత్యులతో - “ఏడిరా సదాజపుడు? ఇంకా ఆ గుహలో ఏమి అఘోరిస్తున్నాడురా? వాడిని బలికి సిద్ధం శాయించి, వెంటనే రమ్మనండిరా”.

భృత్యులు వెళుతూవుండగా సదాజపుడి రూపంలో వున్న అంజి ఎదురయ్యాడు.

“చిన్నగురూ! గురువుగారు u£బ్బలెడుతుండారు. వెళ్లండి. మేం వెళ్లి అతన్ని బలికి సిద్ధం చేస్తాం” అన్నాడొక భృత్యుడు.

“ఏడిశారు! మీరు సిద్ధం చేసేదేమిటి? శాయవలసిందంతా నే చేసే వచ్చా. మీరిక్కడే కూచోండి. నేను గురువుగారితో మాట్లాడి వస్తాను” అని బయల్దేరి, మాంత్రికుడి మందిరానికి వచ్చాడు. మాంత్రికుడు నిలువుటద్దంలో తన అందాన్ని చూసుకుని మురిసిపోతున్నాడు.

“ఏం గురూ!” అన్నాడు అంజి.

“ఏం చేసుకు వచ్చావురా డింగరీ, వాడి మదం అణిగిందా, ఇంకా అలాగే పేల్తున్నాడా?”

“దండం దశగుణం భవేత్ గురూ. కొవ్వు కరిగి వాడు దారికొచ్చాడు గాని...”

“ఇంకా కానీ ఏమిట్రా?”

“అక్కడ ఇంకేం లేదు గురూ. అమ్మణి మిమ్మల్ని వరించాలీ అంటే...”

“అంటే ఏమి శాయవలెరా డింగరీ?” 

“మీరు కూడా రాముడిలాగే కనిపించాలి గురూ” 

“అలా కనిపించడానికి ఇప్ప్పుడు అడ్డమేమిరా?”

“గడ్డమే గురూ!”

మాంత్రికుడు ఒక్కసారి మండిపడ్డాడు.

“ఆగ్రహించకండి గురూ. మీ అందానికి తోడు ఆ గడ్డం ఒక్కటీ లేకపోతే మీరు సాక్షాత్తు మన్మథ మొలకలా వుంటారు. అప్ప్పుడు అమ్మణి చూస్తే గురూ, మీ ఒళ్లో వాలదుటండీ?

“కాని మన మంత్రశక్తులన్నీ గడ్డంలేనే వున్నాయి. ఇది తీస్తే ఎలారా?”

“అన్ని శక్తుల్నీ మించిన పాతాళభైరవి తమ వశమై వుండగా, ఇంకా ఈ శక్తులుండాలా గురూ?”

మాంత్రికుడు ఆనందంగా నవ్వి - “నిజమురా. సూక్ష్మ బుద్ధి వైతివిరా డింగరీ... మా అమ్మణిని కూడా ఉషారు శాయరా. నేను సింగారం చేసుకుని వస్తాను”.

“అలాగే రండి గురూ”.

మాంత్రికుడు పకపకమని నవ్వాడు. అంజి బయల్దేరి వెళుతూ వుండగా, దారిలో భృత్యులు సంతోషంగా చిందులు వేస్తున్నారు. వాళ్లకి ఏదో చెప్పి, సెలవిచ్చేశారు పోండి అని తరిమేశాడు.

రాముడు తృప్తిగా భోజనం చేశాడు. “కడుపు నిండా భోంచేసి ఎన్నాళ్లయిందో! ఇప్ప్పుడు వాడు కాదు  గదా వాడి బాబు లాంటి వాళ్లు నూరు మంది వచ్చినా హతమారుస్తాను”.

అంతలో ఎవరో వస్తున్న అలికిడి అయింది.

“శాలువా కప్ప్పుకో. జాగ్రత్త” అని ఇందు మీద శాలువా కప్పి కనిపించకుండా చేశాడు. తాను పాన్పు మీద పడుకుని, నిలువునా కప్ప్పుకుని, ద్ణుఖిస్తున్నట్టు నటించాడు. అంజి ప్రవేశించి - “రాకుమారిగారూ” అని పిలిచాడు.

“ఛీ - నిన్ను వరించను పో” అన్నాడు రాముడు స్త్రీ కంఠంతో.

“రామ రామ... అమ్మగారూ! నేనండి... అంజిగాడిని...”

“అంజిగాడివా! మిత్రద్రోహీ! నీ మిత్రుడిని ఏం చేశావు?”

“శివ శివా... అదేంమాట తల్లీ. నా మిత్రుడిని ఇక్కడికే పంపించానే. మీ పాదాల సాక్షిగా...” అని కాళ్లు పట్టుకోడానికి చూడగానే రాముడి పాదాలు కనిపించి, గొల్లుమని నవ్వాడు...” సరేగాని అమ్మగారు ఎక్కడ?”

“శాలువా, చెప్ప్పులూ ఇచ్చేసి మన వూరు పంపించేస్తానురా”.

“మంచి పని చేశావయ్యా. నేను వాడి గడ్డం తీసేయించి వచ్చా. దాంతో వాడి మంత్రశక్తులన్నీ ఫా... కాని, పాతాళభైరవిని ఎక్కడ దాచాడో తెలియలా”.

“u£డ్డులోనే పెట్టుకుని తిరుగుతున్నాడు” అంది రాకుమారి అదృశ్యంగా.

“ఆ”... వదినగారు కూడా వీడితో కలిసి ఆడిస్తున్నారూ... మరి ఎలాగయ్యా ఆ విగ్రహం లాక్కోడం?”

“చూస్తావుగా... వరించానంటాను... దగ్గరకి వస్తాడు... ఇలా జరుగుతాను... ఇక్కడ కూర్చుంటాడు. అలా పట్టేస్తాను...” అనగానే, “నేను ఇలా లాగేస్తాను” అన్నాడు అంజి.

గడ్డం తీసేసిన మాంత్రికుడు ఆనందంగా ప్రవేశించాడు. రాముడు తల్పం మీద పడుకుని, నిండుగా కప్ప్పుకున్నాడు.

“అమ్మణిగారూ! మీరు మా గురువుగారిని చూశారంటే, అలా... అలా... మÖర్ఛపోతారు. నలుడు, కుబేరుడు కూడా మా గురువుగారి ముందు బలాదూరు” అన్నాడు అంజి, మాంత్రికుడి రాకను పొగుడుతూ. మాంత్రికుడు మురిసిపోయాడు.

“అదేమో, ఆయన గడ్డం చూస్తే నాకు భయం వేస్తుంది” అన్నాడు రాముడు రాకుమారి కంఠంతో.

“గడ్డం తీసివేశానే బుల్ బుల్... నీకు పసందు శాయడానికి నా శక్తులన్నీ ధారపోశానే బుల్ బుల్...” అని దగ్గరకు రాబోయాడు, రాముడు కాళ్లు దగ్గరకు లాక్కున్నాడు.

“ముట్టుకుంటే ఏమే బుల్ బుల్... చూడవే బుల్ బుల్...” అని బతిమాలాడు మాంత్రికుడు.

“బుల్ బుల్ గారూ! మీరు మా గురువు గారిని వరించారంటే, ఏం చెయ్యమన్నా చేస్తారు”.

“అవునే బుల్ బుల్... కన్నెత్తి చూడవే బుల్ బుల్... కనికరించి మాట్లాడవే బుల్ బుల్... కావలసిన వరాలు కోరవే బుల్ బుల్...”

“పాపం రాముడిని విడిచిపెట్టేస్తారా?” అని గోముగా అడిగాడు రాముడు.

“ఓ... రాముడేమిటీ - సర్వం వదులుతానే బుల్ బుల్ - సదాజపా!”

“వదిలేసినట్టే గురూ” అన్నాడు అంజి, ఉన్న విషయం అర్థం కాకుండా.

“నించున్నారు - ఇలా కూర్చోండి” అని మర్యాద చేశాడు రాముడు. 

మాంత్రికుడు ఆనంద, మోహాల పరవశంతో పక్కనే చేరి, “చూస్తివిరా డింగరీ” అన్నాడు. “నే చెప్పలా గురూ!” అన్నాడు అంజి.

ఆలోపల సదాజపుడికి మెలకువ వచ్చింది. లేచాడు. చూసుకున్నాడు. తన దుస్తులు లేవు. “మోసం గురూ” అంటూ బయల్దేరాడు.

“ఏమి కావాలో కోరుకోవే బుల్ బుల్...” అంటున్నాడు మాంత్రికుడు.

“అమ్మణిగారూ, గురువుగారు మీ పాదాల దగ్గర కూచున్నారు... బాగా చూడండి”

సదాజపుడు “మోసం గురూ” అంటూ వచ్చాడు. మాంత్రికుడు నిర్ఘాంతపోయాడు. “మోసం గురూ” అని అంజి; “మోసం గురూ” అని సదాజపుడు ఒకరినొకరు చూపించుకుంటున్నారు. మాంత్రికుడికి మతి పోయింది. ‘ఆంఫట’ అన్నాడు. మంత్రం పని చేయలేదు.

“గడ్డమేది గురూ?” అని అడిగాడు సదాజపుడు.

“క్షవరమయింది గురూ” అన్నాడు అంజి. మాంత్రికుడు మంటతో రెచ్చిపోయాడు. మళ్లీ గట్టిగా ‘ఆంఫట’ అన్నాడు.

“శక్తి లేదు గురూ” “ఓడిపోయారు గురూ” అంటున్నారు ఇద్దరూ.

“ఏమిటీ మోసం? దగా” అని అరిచాడు మాంత్రికుడు.

“మోసం లేదు మీసం లేదు.. మీరిలా రండీ...” అని పిలిచాడు రాముడు. 

“ఎవడవురా నీవు?” అని గద్దించి, కప్ప్పుకున్న కంబళి లాగబోయాడు - రాముడు ఛట్టున లేచి, “చూశావా ఎవరో” అన్నాడు ఉత్సాహంగా. మాంత్రికుడు ఏడవలేక నవ్వినట్టు గట్టిగా నవ్వి - “నన్నే మోసం శాయగలర్రా. నా శక్తులన్నీ పోయాయని విర్రవీగుతున్నార్రా?... చూడండి” అని పాతాళభైరవిని తీశాడు. “కాల్చి భస్మం చేస్తాను” అని అరిచాడు. అంతలో ప్రతిమను కిందికి కొట్టేశాడు రాముడు. మాంత్రికుడు అందుకోడానికి లంఘించాడు. రాముడు మీద పడ్డాడు. ఇద్దరి మధ్యా యుద్ధం. విగ్రహం కోసం పోట్లాట. మధ్య మధ్యలో అంజి చేష్టలు... నవ్వులు... ఆనందం... మాంత్రికుడు దెబ్బ తింటున్నాడు. విగ్రహాన్ని తీసి అంజి ‘జై పాతాళభైరవి’ అన్నాడు. ‘నరుడా! ఏమి నీ కోరిక?’ అని అడిగింది దేవి ప్రత్యక్షమై. “మా అందర్నీ ఈ మహల్‌తో సహా ఉజ్జయినికి చేర్చు” అని అంజి అనగానే మాయామహల్ పైకి లేచి, ఎగరడం ప్రారంభమైంది. యుద్ధం సాగుతోంది. మాంత్రికుడుని కిటికీ దగ్గరకు తోసి, కిటికీ లోంచి భూమ్మీదకి విసిరేశాడు రాముడు. అంతే! మాంత్రికుడి ఘట్టం ముగిసింది.

ఉజ్జయినిలో అందరూ కలిశారు. ‘నాన్నా’ అంటూ ఇందు తల్లిదండ్రులను కౌగిలించుకుంది. అందరూ ఆనందబాష్పాలు రాల్చారు. శీను కూడా ఆనందంగా ‘వచ్చావా ఇందూ’ అన్నాడు. రాముడి దగ్గరకి వెళ్లి “సోదరా! ఇందుని ఎలా తెచ్చావు? ఆ ఆంఫట్‌ని చంపేశావా?” అని అడిగాడు.

“ఓ! చంపేశాను”

“మిగలకుండా చంపేశావా? అక్కయ్యా, బావగారూ! మన ఇందూని సోదరునికే ఇచ్చి పెళ్లి చేదాం”.

“అంతకంటేనా?”

పెళ్లి బాజాలు మోగాయి. వైభవంగా తోటరాముడుకీ, ఇందుమతి అనబడే రాజకుమారికీ - వివాహం జరిగింది. అక్షింతలు, పూలమాలలతో వధూవరులు ఉక్కిరి బిక్కిరయ్యారు. రాముడు విగ్రహం తీసి, పాతాళభైరవిని స్మరించాడు.

“నరుడా! ఏమి నీ కోరిక?”

“దేవీ! మహారాజుగారి అభీష్టం ఏమిటో నెరవేర్చు” 

“దేవీ! మా రాజ్యం సుభిక్షంగా, మా ప్రజలు సౌఖ్యంగానూ వుండేట్టు అనుగ్రహించు!”

“తథాస్తు”

అంతలో అంజి కలిగించుకున్నాడు - “దేవీ! నాదొక చిన్నకోరిక. ఈ కథ చూచినవారికీ, చూచినవారి దగ్గర విన్నవారికీ సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించేట్టు అనుగ్రహించు తల్లీ”.

దేవి “తథాస్తు” అంది అందరినీ ఆశీర్వదిస్తూ. అంతా శుభమయమై సమాప్తమైంది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి