మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2026, శుక్రవారం

నిత్య జీవితంలో మాంసాహార వినియోగం

ఈ రోజు నిత్య జీవితంలో మాంసాహార వినియోగం అనే అంశం ముఖ్యంగా ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిద్దాం. 

1.మాంసం అనే పదం అర్థం ఏమిటో తెలుసునా?

మహా భారత అనుశాసన పర్వంలో శ్రీ వేద వ్యాస భగవానుడు 116వ శ్లోకం లో ఈ విధంగా చెప్పుచున్నారు.. 

శ్లో. మాంస భక్షయతే యస్మాద్ భక్షయన్యే తమస్యహం

ఏతాన్ మాంసస్య మాంసత్వం అనుబుధ్ధస్య భారత 

అర్థం: హే భరతనందనా! ఏ ప్రాణి మాంసభక్షణము కొరకు ఇప్పుడు వధింపబడుతున్నదో ఆ ప్రాణి కూడా తనను వధించు మనిషిని భవిష్యత్తులో తప్పక వధించగలనని భావించును. ఇదియే మాంస శబ్ద అర్థం. 

2. ఇక మనుస్మృతి లో 5వ అధ్యాయం 55వ శ్లోకం గమనించండి.. 

శ్లో: మాంస భక్షయతా ఆముత్ర యస్య మాంసమిహద్మహం

ఏతాన్ మాంసస్య మాంసత్వం ప్రవదంతి మనీషణః 

ఈ లోకమున ఏ ప్రాణి మాంసమును మనిషి భక్షించుచున్నాడో ఆ ప్రాణి తిరిగి పరలోకములో ఆ మనిషి యొక్క మాంసమును తప్పక భక్షించును. ఇదియే మాంస నిర్వచనం. 

3. భక్త తుకారాం తన అభంగాలలో మాంసమును భక్షించువారిని గురించి ఏమన్నారంటే. 

మాంస ఖాతా హౌసకరీ బోడోని లైరీ దేవి 

కోణత్యాచి కరీల కింద జీవే జీవ నేణతి 

భావం: మÖఢులైన మనుషులు జీవముతో నున్న అమాయక పశువులను అమానుషంగా దారుణంగా హత్య చేసి దాని మాంసాన్ని తిని దుఃఖ భాజనమైన పాపపు పర్వతములను మోసుకుని జన్మ జన్మాంతరము దుఃఖిస్తున్నారు. తమ వంటి ప్రాణమే ఆ జీవులలో ఉన్నదని ఆ జీవులలోను వాసుదేవుడున్నాడని మÖడులైన జనుల ఎరగరు. 

4. న హింసాత్ సర్వభూతానీ మైత్రాయణ గతశ్చరేత్ నేదం

జీవిత మాసాద్య వైరం కుర్వీత కేనచిత్ (మహా భారత శ.ప.278) 

ఉత్తమ మైన మానవ జన్మను పొందిన మానవుడు మానవత్వంతో సకల ప్రాణుల పట్ల మైత్రీ భావన కలిగి ఉండవలెను. ఏ జీవిలోను వైరభావమును కలిగి వాటికి అపకారము కాని హింసను కాని చేయరాదు.

5. పుత్ర మాంసోపమం జానన్ ఖాదతే యో విచక్షణా మాంసం

మోహ సమాయుక్తః పురుషః సో అధమః స్మత (మహాభారతం) అను పర్వం 150ల్లో) 

తన పుత్రుని మాంసము ఇతర ప్రాణుల మాంసము కన్నా భిన్నము కాదనే సత్యం తెలిసికూడా, ఏ మÖర్ఖుడు జిహ్వా చాపల్యం చేత ప్రాణులను వధించి వాటి మాంసభక్షణ చేయునో వాడు నరాధముడు. అంతమే లేని వాని ఈ పాపమునకు నిష్క్రతి లేదు. 

6. సముత్పత్తించ మాంసస్య వధ బంధౌ చ దేహినాం

ప్రసమీక్ష నివర్తేత సర్వ మాంసభక్షణాత్యే (మనుస్మృతి 5-49) 

శుక్ర శోణితముల కలయిక వలన మాంసం ఉత్పన్నమగుచున్నది. అందువలన మాంసం అత్యంత నిందనీయమైనది. మÖఢుడైన మానవుడు ప్రాణులను నిర్దాక్షిణ్యంగా క్రూరంగా వధించి అట్టి మాంసమును పొందుచున్నాడు. నీచమÖ, నిందార్హమÖ ఐన ఈ క్రూర కర్మలను త్యజించిన వాడే పుణ్యాత్ముడు. 

7.శ్లో: అనుమంతా విశసీతా నిహంతా క్రయ విక్రsTÖ సంస్కర్తా 

చోపహర్తా చ ఖాదకశ్చేతి ఘాతుకః (మనుస్మృతి 5-5) 

జీవహింసను సమ్మతించువాడును, జీవములను సంహరించు వాడును, సంహరించిన జీవుల మాంసమును కొనువాడును, విక్రయించిన వాడును, వంటచేయువాడును, వడ్డించువాడును, భక్షించువాడును, వీరందరినీ ఘాతకులందురు. ఈ ఘాతకులు తమ ఈ పాప ఫలితములను అనేక జన్మ జన్మల యందు అనుభవించెదరు.. 

8. పరమ పవిత్రమైన ఈ దేహమును మనకు భగవంతుడు ధర్మ కార్యాలను చేయుట కొరకే ప్రసాదించాడు. అట్టి ఈ దేహమునందు అన్నమయ కోశంలో అగ్ని దేవుడు వైశ్వానరుడి రూపంలో ఉండి మనం స్వీకరించిన ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాడు. అలాంటి పరమ పవిత్ర ీVAమకుండం లాంటి మన కడుపును ఒక శ్మశానంగా మార్చి అందులో సజీవ జంతువులను చంపి వండి పడవేయు మానవులు ఘోరమైన ఘాతకులే కదా! వారి పాపములు ఎన్ని జన్మలకెన శమించవు. కావున జీవ హింస నిషిధము. 

చివరగా 

అహింసా పరమో ధర్మః 

అహింసా పరమో తపః 

అహింసా పరమో సత్యం 

యతో ధర్మ ప్రవర్తతే.. 

ప్రియ ఆత్మీయ బంధువుల్లారా.. మీరు వివేక వంతులు. మీరూ ఆలోచించండి. ఏది సమంజసమో ఏది శాస్త్ర సమ్మతమో ఏది సహేతుకమో ఏది సమర్థనీయమో మేధో మధనం చేయండి. తర్వాత ఆచరించండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి