మహభారత కాలంనాడు యదు -వృష్టి భోజకుకుర - అందకం అనే చిన్నచిన్న రాజవంశాల వలే పాలమÖరు జిల్లాలో గద్వాల జటప్రోలు -వనపర్తి అనే ప్రసిద్ధ సంస్థానాల ప్రారంభం నాటికి జటప్రోలు ప్రాంతంలోని ఏల్లూరు సింగపట్నం కల్వకొలను పెద్ద మÖర్రూరు, చిన్నకుర్రూరు విశ్బాహ్మణులు ఆత్మకూరులోని చంద్రగడగట్టును, స్మార్త బ్రాహ్మణులు ఆవంచ గోరిట రాచూరు గ్రామాలను కన్నడులైన మద్వ బ్రాహ్మణులు వనపర్తి ప్రాంతంలోని జంగమయ్యపల్లె - బలిజెపల్లి, వీరయ్యపల్లె, మనిగిళ్ల గ్రామాలను జంగందొరలు పాలించానారు. ఆనంతరకాలంలో ఈ గ్రామాలన్ని ఆయాసం స్థానాలలో చేరిపోయినాయి. అటువంటి వానిలో లోకయ్యపల్లె కూడ ఒకటి. ఈ గ్రామం ప్రస్తుత నారాయణపేటకు మÖడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రభుత్వపు రికార్డులలో సంస్థానంగా నమోదు లేకున్నా ప్రజల నాలుక పై మాత్రం ప్రసిద్ధమైన సంస్థానంగా ఇప్పటికి నిటిచి ఉంది. ఈ సంస్థానం ప్రభువులు గూడ బ్రాహ్మణులే. వీరు తమను భరద్వాజ గోత్రుల మనియాదవులమని పర్నవీన్ వంశీయులమని చెప్పుకున్నారు. వీరి యింటి’ పేరు నసులవాయి వారు. వీరు స్వర్ణభైరవో పాసకులు.
బ్రాహ్మణులలో భరద్వాజగోత్రులకు మహాభారత కాలం నుండియే రాజకీయంలో సంబంధం ఉంది. భరద్వాజుని పుత్రుడైన ద్రోణుడు బీష్ముని పిమ్మట అయిదు దినాలు సేనాపతిగా ఉన్నాడు. అతని కొడుకు అశ్వత్థామను రణరంగంలో ఊరుభంగమైపడిన దుర్యోధనుడు స్వయంగా అభిషేకం చేసినేప్తిక ప్రళయానికి పంపినాడు. క్రీ.శ. 1295లో దేవగిరిని యాదవ ప్రభువు రామచంద్ర దేవుడు పాలించినాడు. అతని దండనాయకుడైన స్తాణుచమÖ పతి మగతలలో ఈశ్వరాలయానికి ఒక దానం చేసి శాసనం వేయించినాడు. దానిలో రామచంద్రదేవుని వంశం ఈ విధంగా చెప్పబడింది.
శ్లో. నాభేనారాయణనాభూ ద్విధాతాతనోర్మనుః
తదన్వయేసముద్భూతం-స్తితంయదుకులంభువి
నారాయణుని నాభికమలంలో బ్రహ్మపుట్టినవాడు. అతనికి మనువు ఆ మనువు నుండి యదువంశం పుట్టింది. ఆ వంశంలో భిల్లముడు అనేవాడు పుట్టినాడు. అతని కుమారుడు దుతుజైత్రుడు, జైత్రుని పుత్రుడుసింఘణుడు. అతని తనయుడు రెండజైత్రుడు. అతనికి కృష్ణుడు, మహాదేవుడు అని యిద్దరు కుమారులు కలిగినారు. ఈ మహాదేవుడే దేవగిరి నుండి కాక తిరుద్రమ దేవిపై దండెత్తి ఓడిపోయినాడు.
కృష్ణరాజుకుమారుడు రామచంద్రదేవుడు. ఇతని ఆస్థానంలోనే హిమాద్రి అనే పండితున్నాడు. అతడు చతుర్వర్గ చింతామణిని రచించాడు. మరాఠీ భాషకుడు మోడీ లిపిని కనిపెట్టినాడు. ఇతని కాలం క్రీ.శ. 1262-1289 అని చెప్పబడింది. ఈ రామచంద్రదేవుని పిమ్మట క్రీ.శ1689 లో ఓలకాయపల్లెను పాలించిన వెంకటనారాయణ బేదప్ తమకు దేవగిరి మగతలపరణాలున్నట్లు తన దానపత్రంలో దెలిపినాడు. ఈయన దాన పత్రాలన్ని ఆనాటి మోదీలిపిలోనే ఉన్నవి.. అంతేకాక రామచంద్రదేవుడు ఈ వెంకటనారాయణ ఇద్దరు కూడ యాదవులమనియే చెప్పుకున్నారు. ఆనాడురామచంద్రదేవునికి తిన్న పరగణాలే ఈనాడు గూడ వెంకటనారాయణ గారికి చెల్లుతున్నవి. కనుక ఈ లోకాయపల్లె ప్రభువంశం ఆ రామచంద్ర దేవుని శాఖయేని చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ శాక ఎప్పుడు ఏ కారణం చేత దేవగిరిని విడిచి పాలమÖరు జిల్లాలోని లోకయ్యపల్లెకు వచ్చిందో ఇక్కడికి వచ్చిన మÖలపురుషుడు మాత్రం ఎవరో తెలియదు.
యాదవ రామచంద్రదేవుడు తనను బ్రహ్మణుడనని చెప్పుకోలేదు. అయిన బ్రహ్మనుండి పుట్టిన వంశమే కనుక అతడు క్షత్రియత్వం అవలంబించిన బ్రహ్మణుడు. లోకాయపల్లెవారుకూడ తమను బ్రహ్మణులని గాని క్షత్రియులని గాని చెప్పుకున్నట్లు లేదు. వారు యాదవులం వర్నలీన్ వంశస్థులం అని మాత్రమే చెప్పుకున్నారు. మహారాష్ట్ర వీరులలో నానపర్నవీన్ ఒకడు కనిపిస్తాడు. వీరు వీరులు కనుక భైరవోపాసకులు తేవటంలో వింతలేదు. లోకాయపల్లెవారు తమ సోనార్ భైరవుని పుణ నుండి వెంట తెచ్చుకున్నారట. రూపధ్యాన రత్నావళిలో రిష్ట భైరవులు పిమ్మట ఈ స్వర్ణాకర్షణ భైరవుడు చెప్పిబడినాడు. ఇతడు దిగంబరుడు గాదు. హారికిరీట కుండల పండితుడు. స్వర్ణపటధారి కనుక దాదాపుగా విష్ణువుకు ప్రతిరూపంగా ఉంటాయి. వీరి సంస్థానమైన లోకాయపల్లెను కొందరు నాడు లోకాయతపల్లె. అంటున్నారు. కాని మన జిల్లాలో మత సంబంధమైన నామాలతో గ్రామాలురాదు. ఇది పూర్వం ఎక్కువగా అరణ్యభాగం కనుక స్థల జల వృక్ష వాచాకాలే ఎక్కువ. దాని నడుమ నడుచు వ్యక్తి వాచకాలు కొన్ని పునారావృతమైన అవి దేవతలు వెలసిన గాని ఆ మతస్థులు గాని కాదు. అవి ప్రజలు తమ యొక్క దైవాభిమానం చేత పెట్టుకున్న పేర్లు మాత్రమే. ఈ జిల్లాలోని వర్ధమానపురం వర్ధమాన మహావీరుని పేర మాయపురం (రంగాపురం) బుద్దుని తల్లి మాయాదేవి “పేర వెలసినవని చారిత్రకులభిప్రాయపడుతున్నారు. కాని ఇంతవరకు వర్ధమానపురంలో ఒక జైనావశేషం గూడ బయటపడలేదు.
ఇక గంగాపురంలోని తప్తకాలలో జైనమÖర్తులే బయటపడినవి కాని బౌద్దవశేషాలు కనిపించలేదు. వాస్తవానికి వర్ధమానపురమని కాక తిరుద్రుని హనుమకొండ శాసనంలో తపన ఇంతకు పూర్వపు శాసనాలలో ఆ పేరు కనిపించదు కనుక అవి వాస్తవానికి శబ్దసాదృశ్యమైన సంస్కృతి కారణం అనవలె. ఇదే కాక ఈ జిల్లాలోనే వడ్డవాని గ్రామాలు యింకా రెండు యున్నవి. ఇక గంగాపురానికి మాయపురముని తాత పిన్నమారాజు యొక్క శ్రీరామవిరూపాక్ష శాసనాలలో మాత్రం ఒక పర్యాయం కనిపిస్తుంది. దాని పిమ్మట రెడ్డి మల్లారెడ్డి గంగాపురం మహాత్మనంలో తప్ప మరెక్కడ ఆ పేరు కనిపించదు, కనుక లోకాయపల్లె నారాయణపేట వలె ఒక సామాన్యమైన వ్యక్తి వాచకమే గాని మతసంబంధ కాదని అనవలె. దీనిపేరు మొదటిసారిగా మనకు భాస్కర రాయల మొక్క లలితా సహస్రభాష్యంలో కనిపిస్తుంది. ఈ భాస్కరరాయలు గంభీర రాయల కుమారుడు. హరిహర రాయ సోదరులు మహారాష్ట్రలు. తమకు కుష్టు సంబంధమైన ఒక చర్మవ్యాధి ఉంది.
పుణ్యక్షేత్ర దర్శనం పుణ్య నదీ స్నానలకు బయలుదేరి మార్గవశంగా ఒక పుదీ జిల్లాలోని మÖల మళ్లకు వచ్చి ఆ రాత్రి అక్కడనే ఉండి మరునాడు గ్రామం వెలుపల గల ఒక మడుగులో స్నానం చేయగా వ్యాధి కొంత ఉపశమనం కనిపించింది.. దానితో వీరు గ్రామంలోనే కొన్ని దినాలు ఉండి పూర్తిగా స్వస్థులై ఇక ఈ జిల్లాలోనే ఉండదలచినారు. అప్పటికిది బీజాపుర రాజ్యంలో ఉన్నది. అందువల్ల అక్కడికి వెళ్లి ఆదిల్షాగారి కొలువులో తమ విద్యాపాటవాలు ప్రదర్శించి కొలువు సంపాదించుకున్నారు. అపుడొకసారి ఆ ప్రభువు గంభీరరాయలను మగతల పరగణౠకప్పం వసూలుకు పంపినాడు. అపుడాయన నారాయణపేటలో కొన్నినెలలున్నారు. అప్పటికాయన కుమారుడు భస్కరరాయులు పది పన్నెండేండ్ల పిల్లవాడు. ఆటలలో పడి అస్తమానం తిరుగుతూ ఉండగా ఒకనాడు తండ్రి కఠినంగా కోపించాడు. దానితో అతడు వేరుపడి తండ్రికి చెప్పకుండా యిల్లు విడిచి లోకాయపల్లెకు వచ్చిన సింహయజ్వండితుని ఆశ్రయించి పన్నెండు సంవత్సరాలు శుశ్రూషచేసి మహాపండితుడైనాడు. అనంతరం కొంత కాలానికి సౌభాగ్య భాస్కరం అనే లలిత సహస్ర భాష్యం వ్రాసి దానితో తన గుర్తింపు స్మరిస్తూ ఈ గ్రామం పేరు చెప్పినాడు. పరిశోధకులు ఈ భాష్య రచనకు క్రీ.శ. 1696 ప్రాంతమని నిర్ణయించినారు. కనుక విద్యాపరిశ్రమానంతరం గ్రంధ రచనకు మరో పది ఏండైనా ఎడం ఉంటుంది. అనుకుంటే ఆయన విద్యాసామప్తి 1686 పన్నెండేండ్లు గురు శుశ్రూష చేసినాడు కనుక అతని లోకాయపల్లె ప్రవేశం 1674 ప్రాంతం అవుతుంది. కనుక క్రీ.శ 1650 ప్రాంతం నాటికి ఈ లోకాయపల్లె ఒక సాంస్థానంగా మరియు విద్యాంసుల నిలయంగా ఉన్నదని చెప్పవచ్చు.
ఇక్కడి ప్రభువంశంలో నారాయణరావులు లక్ష్మమ్మలు చాలామంది ఉన్నారు. వారిని గురించి అనేకమైన కథలున్నవి. కాని ఏ కథ ఎవరికి చెందుతుందో తెలియదు. ఇక్కడ మొదటి నారాయణరావు క్రీ. శ. 1239 ప్రాంతం వాదని చెప్పబడుతుంది. ఈయన కాలం నాటికే నేటి నారాయణపేట లేదు. అక్కడ పళ్ల అనే చిన్నపల్లె ఆపల్లెలో నారాయణదేవ్ అనే ఒక సాధువు ఉన్నాడు. నారాయణరావుకు సంతానం కలుగ కదోక ఆయన వచ్చి ఈ సాధువునాశ్రయించగా అతడు నీ అక్కడ లక్ష్మీనారాయణ ప్రతిష్ఠ చేయి సంతానం కలుగుతుంది. అనా చెప్పినాడు. సాధువు యొక్క మాట ప్రకారం ఆయన అక్కడ లక్ష్మీనారాయణ ప్రతిష్ఠ చేయించగా ఆ స్వామి అనుగ్రహం వల్ల కుమారుడు కలిగినాడు లక్ష్మీనారాయణుని అనుగ్రహం వల్ల కలిగినాడు. కాబట్టి తల్లిదండ్రులు ఆ పిల్లవానికి మళ్లి నారాయణరావు అని పిలువబడి అక్కడ తమ యిష్టదైవం మరియు తండ్రిగారి పేరు వచ్చేటట్లుగా పళ్లకు నారాయణపేరు అని పేరు పెట్టి దాన్ని అభివృద్ధి పరచినాడు. కనుక ఈ తండ్రి కొడుకుల నడుమ ముప్పది సంవత్సరాల ఎడం అనుకుంటే ఇతని కాలం క్రీ.శ. 1407 ప్రాంతం అవుతుంది. లోకాయపల్లెను చెప్పిన పుడకుడి ప్రభువంశంలో పాటు వీరి అమాత్య వంశం మరియు పురోహిత వంశం గూడ చెప్పవలసివస్తుంది. క్రీ శ. 17 వ శాతాబ్దంలో నారాయణపేటలో బళ్లారి వాసేదేవాచారికి ఒక నారాయణాచారి అనే పురోహితున్నారు. వారిలో వాసుదేవాచారికి ఒక నారాయణాచారి క్రీ.శ. 1630 లో ఒక గుర్రం పరువు భూమిని యినాంగా యిచ్చినట్లు ఆవంశీయుడైన జయ వెంకటాచార్యులు తెలిపినాడు.
క్రీ.శ. 1689 లో వెంకటనారాయణరావు జూదవ్ అనే మరో ప్రభువు గుల్బర్గవాస్తవ్యులు, వేదశాస్త్ర సంపన్నులు, ఆయాచిత విఠలభట్టు పేత్రులు భైరవ భట్టు పుత్రులైనత్యం ఒక సోమయాజి మరియు విరల భట్టును పిలిచి తమ సంస్థానంలోహిత చింతకులుగా నిలుపుకొనా వారికొక భూదానం చేసినాడు. ఇదిమోదీలిపీలో ఉండి ఆ వంశీయుల దగ్గర ఇప్పటికి లి ఉంది. దానిలో వీరి రాజ్యంలో అప్పటికి ఊట్కూరు తాటికొండ- దేవగిరి బాదేపల్లి బూర్గుల-వెలిజాల-మగతల-ఎనుమనగండ్ల ఆవంచ అనే తొమ్మిది పరగణాలున్నట్లు చెప్పపడింది. కనుక ఈ దానపత్రంలోని దేవగిరి మగతల రాజ్యాలు వీరికి వచ్చి ఉండదవురినటానికి వీలుంది. కనుక దేవగిరి మగతల రాజ్యాలు వీరికి 13 వ శతాబ్దం నుండియే చెల్లుతున్నవి అనవచ్చు. ఈ వంశంలో లక్ష్మమ్మలు గూడ చాలానే అన్నారు.
మొదటి లక్ష్మమ్మగారు పర్నవీ సువంశానికి తల్లి అని కీర్తించబడింది. ఈమె ప్రతి ఏట కాశికి వెళ్లి విశ్వేశ్వరునికి దర్శనం చేసుకొని వచ్చేదట. చివరి దశలో వృద్ధురాలై వెళ్ల లేక స్వామిని తలచుకొని మీ దర్శనానికి రాలేననగా ఆ రాత్రి ఆమెకు విశ్వేశ్వరుడు కలలో కనిపించి నీవు నాదగ్గరకు రానక్కరలేదు. నేనే నీ దగ్గరకు వస్తానని చెప్పినాడు. అపుడామె తమ కుల పురోహితులను కాశికి పంపి విశ్వేశ్వర లింగాన్ని తెప్పించి తమ సమీపంలో కొండపై ఒక ఆలయం కట్టించి ప్రతిష్ఠ చేయించింది. వీరి కుల పురోహితులు ఔదుంబరులో ఆలయ నిర్మాణమంతా వారే చూసినారు. కనుక ఇపుడా ఆలయం వీరి పేరనే ఔదుంబరేశ్వరాలయం అని నిలిచింది. ఇది శివాలయమైన గర్భాలయానికి బయట ప్రక్కనే ఆలయం ఆలయం చుట్టు దశావతారాలు పెద్ద పెద్ద రేఖా చిత్రాలుగా తీర్చబడినవి. ఇది దీని ప్రత్యేకత ఈ ఆలయంలో సింహ తలాటాలది మరో ప్రత్యేకత జటప్రోలులోని సురభిదొరలు పులితలాట లాంఛనులు కనుక ఇక్కడి సింహతలాటాలను బట్టి వీరు సింహతలాటలాంచనులన వలె.
రెండవ లక్ష్మమ్మ గారు తిరుపతి వెంకటేశ్వరుని భక్తురాలు. ఆమె గూడ ప్రతి సంవత్సరం ఒకసారి తిరుపతికి వెళ్లి దచ్చేది. చివరి దశలో వృద్ధురాలైనని మ్రొక్కుకోగా స్వామి కలలో కనిపించి నీవు నా దగ్గర రానక్కరలేదు. నేనే నీ దగ్గరకు వస్తాను. ఏకశిలాపురంలో థలా నా రాతికి నా శంఖ చక్ర చిహ్నలేర్పడి ఉంటవి. అది నీ రాకకు గుర్తు వెళ్లి దర్శించుకొమ్మని చెప్పినాడు. ఆమె మరునాడు పురోహితుని వెంట తీసుకొని గుడికి వెళ్లి స్వామి వెలసిన రాతిని గుర్తించి దానికే మొదట ఒక చిన్న ఆలయం కట్టించింది. ఇదిపుడు పునరుద్ధరింపబడింది. స్థానికులే దేవుని తమ్మప్ప అని పిలుస్తున్నారు.
వీరి దగ్గర బోయనిపల్లె కరణాలు కరణాలుగా ఉన్నాయి. మÖడవ లక్ష్మమ్మగారు చాలా ధర్మాత్మురాలు, ప్రజలను కన్నబిడ్డలుగా చూచేది. ఆమె స్నానం చేసే అపుడు దినదినంకర కొంగారకుడ నిలచి వారి రాజ్యంలో ఆనాడెవరెవరు మరణించి నారో వారి పేర్ల తస్సంతా చదువవలసి ఉండేది. అపుడామె స్నానాంతరం కరణంగారు చదివే ఒక్కొక్క పేరుకు ఒక చెంబు వారిని తలచుకుంటూ తలపై పోసుకునేది. ఇక్కడి రాణులను గురించి ఇటువంటి ధార్మికమైన కథలింకా చాలా ఉన్నవి ఆకని వానిలో ఏవి ఎవరికి చెందినవో తెలియటం లేదు.
వీరిది నాంజీలలో తిమ్మాజీరావు ముఖ్యుడు ఈయన కాలంలో రుక్కమ్మ దొరసానిగారున్నది. ఏటా తిమ్మాజీరావు ఒక పర్యాయం కప్పం వసూలకు తమ పరిగణాలన్ని తిరిగేవాడు. ఇప్పటికింకా ఆ పంచ వీరి రాజ్యంలో లేదు. దాన్ని మధ్య ర పాలిస్తుండేవారు. కప్పం కట్టలేక దావాళా తీయగా అప్పటి నైజాం సర్కారు దీన్ని జడ్చర్లలొ వేలం వేసింది. ఆనాడు తిమ్మాజీరావు తమ పరిగణాలలో రకం వసూలు చేసేకొని తిరిగి వెళ్లుతూ జడ్చర్లలో ఉన్నాడు. అక్కడ ఆ పంచవేలం పాటు జరుగుతూ ఉండగా చూచి తాను ఒక పాట పాడినాడు. దానితో సవాల్ నిలిచిపోయి ఆ పరగణారితడుకొనవలసి వచ్చింది. వెంట కప్పం రుక్కమ్మ దొరగారికి విషయం చెప్పినాడు. ఆమె అది విని తల్లీ నేనది బుద్ధి పూర్వకంగా కొనలేదు. చూద్దామని ఒకపాటపాడినంతలో నెత్తినపడింది. కనుక కొనవలసివచ్చింది. ఇదవటండి ఇక పోరు ఈన్నిఉంచుకొంటిలేదా దానమైనా చేసుకొండి అనా అన్నది. కాదంటే తిరిగిచ్చినాడు. ఆమె దాన్ని చూసుకున్నది. అది ఆమె పేరులోనే కొన్నట్లున్నది. ఆమె అందుకాశ్చర్యపడి అయితే దీన్ని దానం చేయదలచుకుంటే ఎవరికో ఎందుకు మీ పంపం వారు మమ్ముల్ని ఎంతోకాలం విశ్వాసంగా సేవిస్తున్నారు గదా అందుకోసం ఇది నీకే దానం చేస్తున్నాను తీసుకొమ్మని ఆపరణగా తిమ్మాజీరావుకిచ్చింది. దానితో ఆనాటి నుండి తిమ్మాజీరావు కూడా ఒక ప్రభువైనాడు.
ఈ తిమ్మాజీరావు కుమారుడు రుక్కోజీరావు. అనంతర కాలంలో ఆవంచ పరగణాలో తండ్రి పేర తిమ్మాజీపేటను కట్టించి అక్కడ హనుమంతుని ప్రతిష్టించిన శిల్పాలే 1002 లో ఒక భూదానం చేసినాడు. ఇది క్రీ. శ 1580 నాటిది. రుక్కోజిరావు తండ్రియైన తిమ్మాజీరావు క్రీ.శ 1550 ప్రాంతం వాడౌతాడు. ఈ సంస్థానానికి చివరి పాలకురాలు మళ్లి లక్ష్మమ్మ దొరసానిగారే. ఆమెకు సంతానం కలుగలేదు. నాగర్ కర్నూలులోని పిప్పళ్ల వారు వీరికి సమీప బంధువులు కనుక లక్ష్మమ్మ గారు. పిప్పిళ్ల వారింటి నుండి మాధవరావు అనే బాలుని దత్తత తీసుకొని అతనికి రాజపట్టం కట్టింది. కాని ఈ దత్తును ఆనాటి నైజం ప్రభుత్వం అంగీకరించలేదు.
అంతేగాదు వీరు ఝాన్సీరాణి ఆంగ్లేయులతో పోరాడుతున్నపుడామె కంతర్గతంగా సహాయాన్ని అందించినారని కోపంతో వనపర్తి పెద్ద రామేశ్వరరాయులను వీరి పైకి ఉసిగొల్పగా అతడు క్రీ.శ.2-7-2859 నాడు ఈ సంస్థానంపై దండెత్తి దీన్ని వశపరుచుకున్నాడు. స్థానికులు ఈ సంస్థాన పతనానికి పలు రకాల కారణాలు చెబుతున్నారు. ఒక పర్యాయం ఉత్తరాది మఠాధికారి సత్య పరాక్రమస్వామి రాజవారి దర్శనార్థం రాగా అప్పటిది వాంజీ వెంకన్న గారు రాఘవేంద్ర మఠానికి చెందినవాడు కావటంచేత స్వామివారు కాకుండా కోటద్వారం మÖయించినాడట. అపుడు స్వామి వారేనుగును దిగి చిన్న ద్వారం గుండా నడిచి రాజ ప్రసాదం దగ్గరకు వెళ్లగా వెంకన్నగారు దీని తలుపులు గోడ మÖయించగా స్వామి తిరిగి వెళ్లి పోయినారట కాబట్టి అతని శాపం తగిలిందంటారు.
మరో పర్యాయం ఈ సంస్థానానికి అకులు కోలు మహారాజు నృసింహబానురాగా ఆయన స్వర్ణమోగ సిద్ధుడు కనుక వీరతనిని తమకామోగం తెలుపమని మÖడు దినాలు నిర్భందించి చాలా బాధిం చినారట. అందువల్ల ఆయన శాపం గూడ వీరికి తగిలిందంటారు. కారణం ఏదైతేనేం గాని ఈ సంస్థానం మాత్రం ప్రభువుల స్వయంకృతాపరాధం గానే కూలిపోయినట్లు తెలుస్తుంది.
ఈ సంస్థానం మÖడు వందల సంవత్సరాలు నిలిచిందని స్థానిక వృద్దులు చెప్పేవారు. కాని దేవగిరి యాదవరాజులను గూడ కలుపుకుంటే దీని ఆయుష్యం ఐదువందల వరకు పెరుగుతుంది. అయితే యింత దీర్ఘకాలం నిలిచినా ఆ సంస్థాన వారెవరు గూడ ఒక శాసనాన్ని వేయించక పోవటం ఆశ్చర్యం వేస్తుంది. వీరు శాసనాలు వేయించుకున్నా తమ పరిగణాలలో సన్నద్ధులు దానపత్రాలు మాత్రం బాగానే యిచ్చినారు. ఇనాం భూములన్ని పట్టాలయ్యే అపుడు వారి వారి పూర్వ పునాదులలో లోకాయపల్లే వారివి గుడ కొన్ని వచ్చినవని అప్పటి ఆర్డీవో జనార్దన్రెడ్డి గారు నాతో - చెప్పినారు. వారవన్ని ప్రభుత్వం యొక్క పుట్టుపూర్వత్తరాలపై ఈ ప్రభువులు స్థాపించిన గ్రామాలు నెలకొల్పిన అలయాలు మరియు చేసిన ధర్మకార్యలపై ఒక పరిశోధనను వెలికి తీసుకరావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి