మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, అక్టోబర్ 2026, శనివారం

జొన్నలగడ్డ వెంకట రమణ మూర్తి

నా పూర్తి పేరుజొన్నలగడ్డ వెంకట రమణ మూర్తి. నేను 20.08.1933న శ్రీకాకుళం జిల్లా లకులాం అగ్రహారంలో జన్మించాను. జొన్నలగడ్డ వేంకట శివరామమూర్తి, శారదాంబ దంపతులు నా తల్లిదంరడులు. మేం మొత్తం ఐదుగురు సోదరులం. ప్రఖ్యాత రంగస్థల, సినీనటులు జె.వి.సోమయాజులు మా అన్నయ్యేనని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. ఇంకా నా మరో సోదరుడు శ్రీరామమÖర్తి కూడా రంగస్థల నటుడే. మేమంతా నాటకరంగంపై ప్రకాశించడానికి మా అమ్మగారే స్ఫూర్తి. ఆమె మంచి పండితురాలు. పై పెచ్చు నాటక పిపాసి. మేము ఎక్కడ నాటకం ఆడినా ఆమె తప్పకుండా వచ్చేది. ప్రదర్శన ముగిసేవరకూ ఉండి, కళాకారులందరికీ మా ఇంట్లోనే భోజనాలు పెట్టేది. అంతేగాదు, ఆ అన్నం వడ్డించేటప్పుడు, మేం రంగస్థలం పై ఎలా నటించిందీ, ఎవరు బాగా నటించారు, ఎవరుగా బాగా నటించలేదు... ఇవన్నీ ముచ్చటించేది అలా మా అమ్మగారి ప్రోత్సాహం, సద్విమర్శలే నన్ను ఓ కళాకారునిగా తీర్చిదిద్దాయి.

నేను తొలిసారిగా ముఖానికి రంగు పూసుకుంది మా హై స్కూల్లో. నా పదమÖడోయేట 1946లో ‘ఇంట్లో ఈగ’ అనే నాటికను ప్రదర్శించాను. ఆనాటికను చూడ్డానికొచ్చిన మా డి.ఇ.వో నాకు వందరూపాయలు నగదు బహుమతి ఇచ్చారు. 

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 1947 ఆగస్టు 14 అర్థరాత్రి పదకొండు గంటలకు ‘విధి నిర్ణయం’ అనే నా రెండో నాటికను ప్రదర్శించాను. పదకొండు గంటలకు సరిగ్గా పన్నెండు గంటలకు పతాకావిష్కరణతో ముగుస్తుంది. అది. ఆ నాటికలో నేను కథానాయకుడ్ని. సుమారు పదిహేను ఉపన్యాసాలు చెప్పారు. సరిగ్గా పన్నెండు గంటలకు నేను కళాశాల ముందర నాటినజాతీయ పతాకాన్ని ఆవిష్కరించే సమయానికే, ఢిల్లీలో ఎర్రకోటపై జవహర్‌లాల్ నెహ్రూ మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. అది నాకు చాలా ఆనందాన్ని కలిగించే సంఘటన. (ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాయిలో అంతర్‌కళాశాల నాటకాల పోటీల్లో ఆచార్య ఆత్రేయ రచించిన ‘విశ్వశాంతి’ నాటికం ప్రదర్శించి, బహుమతి పొందాను.) తర్వాత నాటకాల్లో బిజీగా వున్నా చదువునూ నిర్లక్ష్యం చేయలేదు. విజయనగరం మహారాజా కళావాలలో ఇంటర్మీడియట్‌లో బంగారు పతకాన్ని పొందాను. తర్వాత బై.పి.సి పూర్తి చేశాను. 1955లో శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తూనే ఆంధ్ర నాటక కళాపరిషత్తులో పోటీలో పాý£్గన్నాను. నాకు నాటకరంగంలో ప్రత్యక్ష, పరోక్ష గురువు మా అన్న జె.వి.సోమయాజులు గారే. (అదెట్లాగంటే మా అన్న పాý£్గనే నాటకాలన్నీ రిహార్సల్సుతో సహా అన్నీ చూసేవాడ్ని. దానికి మా అన్న ఒప్పుకునేవారు కాదు. ‘చిన్నపిల్లవాడివి, ఫో, చదువుకో...’ అని పంపేసేవారు. నాకేమో ఆడ్రామాలు చూడాలని తెగ ఉబలాటం. అందుకే  మా అన్న రిహార్సల్స్‌కు రాకముందే అక్కడికి చేరుకుని, అక్కడి కళాకారులకు టీలు, కాఫీలు అందించే మిషతో అక్కడ ఉండిపోయేవాడ్ని. మా అన్న వచ్చి ‘నీవెందుకు అఘోరించావ’ అని కసురుకున్నా ‘చిన్నవాడు చేదోడు వాదోడుగా పనికి వస్తాడంటూ’ వాళ్లంతా నచ్చచెప్పేవారు. సరేనని మా అన్న కూడా ఏమీ అనేవాడు కాదు. అలా వాళ్ల రిహార్సల్సు, నాటకాలు అన్నీ పరిశీలించడం వల్ల నటన పట్ల అవగాహన, అభిమానం పెంపొందించుకుని sTÖ మాత్రం కాగలిగాను.

నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే విజయనగరంలో “కవిరాజ్ మెమోరియల్ క్లబ” అనే ట్రూపును స్వంతంగా మొదలు పెట్టాను. మల్లాది విశ్వనాథకవిరాజ్ ప్రఖ్యాత నాటక రచయిత ఆయన ఎన్నో నాటకాలు రచించాడు. ఆయన నాకు చాలా సన్నిహితుడు. 1949లో కవిరాజ్ మరణిస్తే, ఆయన జ్ఞాపకార్థం నేను ఓ ట్రూప్ ప్రారంభించి నాటకాలాడించాను. భమిడిపాటి గారి ‘నా మాటే నెగ్గింది’ విశ్వనాథ గారి ‘దొంగాటకం’ వంటి నాటకాలలకు దర్శకత్వం వహించడమే గాకుండా, స్త్రీ పాత్రలువేసి ప్రశంసలందుకున్నాను. 1950లో బళ్లారి రాఘవ నాటకోత్సవంలో ‘దొంగాటకం’కు ఉత్తమ ప్రదర్శన, ఉత్తమనటి అవార్డు అందుకున్నాను.)

1955లో నేనూ, మా అన్న ఇద్దరం ఉద్యోగరీత్యా శ్రీకాకుళం చేరుకున్నాం. అంతవరకూ విజయనగరంలో ‘కవిరాజ మెమోరియల్ క్లబ” స్థాపించి మంచి అనుభవం సంపాదించి ఉన్నాం గనుక ఏదో ఒకటి చేయాలి? ఏం చేయాలి? నటరాజ కళాసమితిని ప్రారంభించాలి.

(ఆ పక్క ఇంట్లోనే, వెల్లంకి హనుమంతరావు అని ఉండేవారు. ఆయనింట్లో, కొంతమంది యువకులు రోజూ సాయంత్రం ఆఫీసుల నుండి తిరిగి వచ్చాక రాత్రి బాగా పొద్దు పోయేదాకా పేకాట ఆడుకుంటూ ఉండేవారు. ఆ వూళ్లో అంతకాన్న కాలక్షేపం లేదు. విజయనగరం నుండి వచ్చిన మాకు కొత్త ఊళ్లో ఏం చెయ్యాలో తోచలేదు. పేకాటలో చేరడానికి మనసొప్పదు. కానీ రోజూ వాళ్ల దగ్గరే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాళ్లం.

ఒకనాడు లోకాభి రామాయణంలో నాటకాల ప్రసక్తి వచ్చింది. వాళ్లందరూ కూడా విజయనగరంలో మా నాటకాలు చూసినవాళ్లే. “మీరిప్పుడు ఏమీ నాటకం ఆడడం లేదా?” అని ఒకరన్నారు. “కొత్త ఊళ్లో వాళ్లు మటుకు ఏం చెయ్యగలరు” అని మరొకరన్నారు. “పోనీ ఈ ఊళ్లో వాళ్లను కూడగట్టుకొని ఏదైనా నాటకం ఆడరాదా!” అని ఇంకొకరు. అందులో ఒక పెద్దాయన, హరిహరరావుగారు, “వాళ్లకి ఈ ఊళ్లో ఎవరు పరిచయం ఉన్నారు పాపం! మనమేమో రోజు పేకాట తప్ప ఇంకొక జోలికి పోం! పోనీ- నాదో సలహా - ఇలారోజూ ఇన్నేసి గంటలు చీట్లపేకలో వృధా చేసేబదులు, మనం వాళ్లతో చేతులు కలిపి, అందరం కృషి చేస్తే ఈ ఊళ్లో మంచి నాటకసంస్థ వెలిసే అవకాశం ఉంది గదా! అది మనకు పేరూ తెస్తుంది. ఈపేకాట మానినట్టౌతుంది” అన్నారు. అంతే ఆ ముహూర్తంలోనే చీట్లపేకలు మానేశారు. “నటరాజకళాసమితి” ఆవిర్భవించింది. ఆ ఊళ్లో అప్పటికే యంగ్‌మెన్స్ డ్రమెటిక్ అసోసియేషన్ అనే సంస్థ పేరుతో నాటకాలాడుతున్న రావికొండలరావు, జగన్నాధరావు, ధర్మారావు మొదలైన వాళ్లంతా తమ సంస్థను నటరాజ కళాసమితిలో విలీనం చేశారు.

నాటక ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే అవి) కొన్ని నాటకాల్ని ఎక్కడ ప్రదర్శించాలి? రంగస్థలాలు లేవు. సినిమా థియేటర్లు నాటకాలకివ్వరు. ఇచ్చినా, ఆ అద్దె భరించలేం. ఆరుబయట రంగస్థలం నిర్మించే శక్తి లేదు. చివరికి సినిమాహాలు వాళ్లని ఒప్పించి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రదర్శన ఇస్తే, వాళ్లకి ఇబ్బంది ఉండదని ఆంజనేయటాకీసు ప్రొప్రయిటరు పసగాడ సూర్యనారాయణగార్ని అర్థించాం. ఆయన దానికి అంగీకరించారు. (అంతేగాకుండా “మీరందరూ బాధ్యత గల ఉద్యోగస్థులు. మీరేమి డబ్బు సంపాదించడం కోసం నాటకాలాడడం లేదు. మరి మీరంతా మనవూరికి మంచి పేరు తేవడానికి పూనుకున్నారు గదా! అందుకని మాహాలుకు అద్దె ఏమీ ఇవ్వక్కర్లేదు” అన్నారు. అంతకంటే ఇంకేం కావాలి? నెలకో నాటకం ఆడాలని నిశ్చయించుకున్నాం. 19.05.1955లో మా మొదటినాటకం డి.వి.నరసరాజుగారి “నాటకం”. జిల్లాకలెక్టరు పి.సి.జేమ్స్‌దొరగారి అధ్యక్షతన “నాటకం” దిగ్విజయంగా ప్రదర్శించాం. ఒక్కసారిగా ఊరంతా గుప్పుమంది ఊళ్లో పెద్దపెద్ద వాళ్లంతా మేం అడగకుండానే సహాయం చెయ్యడం మొదలు పెట్టారు. జేమ్స్‌దొరగారు మానాటక ప్రదర్శనకు సంతోష పడిపోయి, ఏ సహాయం చేయడానికైనా సిద్ధమన్నారు. కలెక్టర్స్ ఫండ్ లోంచి నూటపదహార్లు విరాళం కూడా ఇచ్చారు. ఏ పనీ లేకుండా ఖాళీగా వున్న నాకు వెంటనే ఉద్యోగం ఇచ్చారు.

రెండో నెల “కప్పలు” (ఆత్రేయ) ప్రదర్శించాం. తర్వాత ఆ ఊళ్లో ఉన్న మÖడు సినిమా హాళ్ల యజమానులూ ఒక్కోనెల ఒక్కోహాల్లో ప్రదర్శించుకోమన్నారు. ఇకనేం వరసపెట్టి నాటకాలు ఆడాం. ఇక అసలు కృషి ప్రారంభమైంది. వరసగా నాటకం, కప్పలు, కాళరాత్రి (ప్రU్యశ్రీరామమÖర్తి), కీర్తిశేషులు (భమిడిపాటి), మనిషిలో మనిషి (ప్రఖ్య శ్రీరామమÖర్తి) వంటి నాటకాలన్నీ ఆడాం. ఆ సంవత్సరమే అక్టోబరులో హైదరాబాదులో ఆంధ్రనాటక కళాపరిషత్ 19వ సమావేశపు పోటీలకు “కాళరాత్రి” తీసుకు వెళ్దాం అన్నారు. చాలామంది మిత్రులూ, పెద్దలూ ఖర్చులకి పోగు చేసి ఇచ్చారు. సరే అంటే సరే అని బాగా కృషి చేసి హైదరాబాద్ వెళ్లాం. అక్కడ “కాళరాత్రి”కి ఉత్తమ ప్రదర్శన బహుమతి, నాకు ఉత్తమనటుడి బహుమతి వచ్చాయి. శ్రీకాకుళం శ్రీకాకుళమే ఉత్సవం చేసుకుంది. శ్రీకాకుళం ఢంకా హైద్రాబాదులో మోగించారు అని ప్రశంసించారు. తర్వాత “పంజరం” (అవసరాల సూర్యారావు), “కుక్కపిల్ల దొరికింది” (రావికొండలరావు) వంటి నాటకాలన్నీ ఆంధ్రనాటక కళాపరిషత్తులో ప్రదర్శించి, చాలా బహుమతులందుకున్నాం.)

ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని గొప్ప బహుమతులు అందుకున్నా గురజాడ అప్పారావుగారి “కన్యాశుల్కం” ప్రదర్శించడమంటేనే నాకు మహాప్రీతి. చిన్నప్పుడే నా దృష్టి కన్యాశుల్కం నాటకం మీద పడింది. (తొమ్మిదో ఏట నుంచే భారత, భాగవతాలతో మా అమ్మ వల్ల పరిచయం. పన్నెండో ఏట కొవ్వలి వారి నవలల్ని తెగ చదివేసాను. తర్వాత కన్యాశుల్కంలో ఒక సీను చదివాను. ఎక్కడో గుర్తులేదు. అప్పుడర్థమైంది నాకు, వ్యావహారిక భాషలో రాయడం ఎంత కష్టమో! కానీ అది ప్రదర్శించవచ్చుననే ఆలోచన నాకప్పటికిలేదు. అసలు నేను ఇంకా నాటకరంగంలో ప్రవేశించనేలేదు.

1946లో నాటకరంగంలో ప్రవేశించాక నాకు ప్రపంచమంతా నాటకరంగంలాగే కనిపించేది. ఇరవై నాలుగ్గంటలూ నాటకాల ద్యాసే. 1949లో “దొంగాటకం” ప్రదర్శించినప్పుడు మొదటిసారిగా “దర్బార” కర్టెన్‌కు స్వస్తి చెప్పాం. ఇంట్లో గోడలు తెల్లగా ఉంటాయి కనుక తెల్ల కర్టెన్ వాడి, రెండు కాలెండర్లు తగిలించి నాటకం ఆడాం. మంచి ప్రోత్సాహమే లభించింది.) 1946లో మహారాజా కళాశాల టీచర్లు కొంతమంది ‘కన్యాశుల్కం’లో ఉత్తరం సీను వేశారు. మొత్తం నాటకం వెయ్యకుండా, ఒక సీను వేశారు. ఏం బాగుంటుంది అని అడిగితే ఎవరో కళాకారుడు మొత్తం నటకం ఎవరూ వెయ్యలేర్రా! ఇది అలెగ్జాండరు గుర్రం - ý£ంగదు. కానీ ఆ నాటకం మీద ఉండే గౌరవం కొద్ది ఒక సీనో, అరసీనో వేస్తూ గురజాడ వార్ని స్మరించుకుంటూ ఆనందిస్తున్నాం” అన్నారు.

నేను వెంటనే మొత్తం నాటకం చదివాను. చదవడమంటే ఒకసారి కాదు, వందసార్లు. ఇది మొత్తం వెయ్యలేం గానీ ఒకరకంగా కథ అర్థమయ్యేంత వరకూ కుదించి వేయవచ్చనిపించింది. పైగా ఆయనన్నారే ఈ నాటకం అలెగ్జాండర్ గుర్రమని, అది నా మనసులో నిలిచపోయిది. ఎలాగైనా మనమా గుర్రాన్ని ý£ంగదీసుకోవాలనే పట్టుదల ఎక్కువైంది.

జోగారావు (కరటక శాస్త్రి ఫేం), లక్షణమÖర్తి, నేను ముగ్గరం రోజూ చర్చించుకునే వాళ్లం. అలా రెండేండ్లు పైగా గడిచాయి. ఏదో - తోచినట్టు ‘ఎడిటింగ’ చేసేవాళ్లం. రాత్రుళ్లు గురజాడ వారి ఇంటి అరుగుమీద కూర్చోని ఆయన్ని ప్రార్థించేవాడ్ని. ఏదైనా ఒకదారి చూపించవయ్యా అని.

అర్థరాత్రి పూట వెళ్లి, u£ంకులు దిబ్బ మీదే u£ంకులు దిబ్బసీను చదివే వాళ్లం. పాత్రల స్వభావాలు, అగ్ని హోత్రావధాన్లు ఎట్లా ఉండేవాడు, ఆ కట్టూu£ట్టూ, మాటలతీరు ఇవన్నీ ఆగ్రహారం బ్రాహ్మణుల వెంటబడి తిరుగుతూ గమనించేవాళ్లం. విజయనగరంలో గొప్ప గొప్ప చదువరులుండేవాళ్లు. సాయంకాలం పూట వాళ్లందర్నీ కలిసి చర్చించేవాళ్లం. తర్వాత గురజాడ గారి సమకాలీకులు ఎవరైనా బతికున్నారా అని విచారించి, అడిదం రామారావు (ఆడిదం సూరకవి మనవడు)గారు ఉన్నారని విని, ఆయన్ను చూడడానికి వెళ్లాను. తలుపు తట్టాను. నిక్కరూ షర్టూ వేసుకుని ఉన్న నన్ను చూసి, ఆయన భార్య కాబోలు “ఎవరు కావాలి నాయనా” అని అడిగారు. “అడిదం రామారావు గారున్నారా” అని అడిగాను. “లేదు బాబూ స్కూలుకి వెళ్లాడు”. ‘రామారావు గారంటే చాలా ముసలాయన అనుకున్నానేను’ “ఓహో! అలాగా! ఆయనైతే ఉన్నారు” అని లోపల్నుంచి “ఎవరూ” అని ధ్వని. “మీకోసం ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు - ఏం వ్యవమారమోగాని” అన్నారామె.

లోపలికెళ్లాను. ఓ తొంభై ఏళ్లు పై బడ్డ వృద్దుడు. మంచం మీద ఉన్నారు. లేవలేక పోతున్నారు. “ఏం కావాలిరా అబ్బాయ” అని అడిగారు. “గురజాడ అప్పారావు గారితో మీకు పరిచయముందని విని, చూద్దామని వచ్చాను సార”

“ఎందుకూ!”

“వారు రాసిన కన్యాశుల్కం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని సార్. మీరు వారి స్నేహితులు గనుక, నాటకం గురించి ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినపుడు మీతో చర్చించిన కొన్ని విషయాలేమైనా ఉంటాయేమోనని వచ్చాను సార” అన్నాను. 

“నీకెందుకూ ఇప్పుడా చర్చ!” అన్నారు. “ఆ నాటకం మేం వేద్దాం అనుకుంటున్నామండి” “ఏం వేషం వేస్తావురా!”, “గిరీశం వేద్దామనుకుంటున్నానండి”. నన్ను మళ్లీ ఎగాదిగా చూశారు. “గిరీశం నువ్వా, ఇంకో పదేళ్ల పోతే గానీ నువ్వు పనికిరావే” అన్నారు. “నిజం అనుకోండి. పదేళ్ల తర్వాతే వేస్తాను. కాని అప్పటికి మీరు ఉండరు కదా!” అన్నాను. అని వెంటనే నాలిక్కరుచుకున్నాను.

“ఔరా! దుష్టుడా!” అన్నారు నవ్వుతూ “అందుకని ఇప్పుడే విషయాలు సేకరిద్దామనుకున్నావుట్రా వెధవా! ఆ” ఇంతకి ఏమిటీ నీ సందేహాలు” అని అడిగారు. 

ఏవో కొన్ని అడిగాను. ముఖ్యంగా కన్యాశుల్కం కథకు గిరీశం పాత్ర అంత అవసరం లేకపోయినా ఎందుకు అంత పెద్ద పెద్ద డైలాగులు రాసి పాత్రను పెంచారు. గిరీశం కేవలం ఒక దగుల్భాడీ అని ఆయన భావిస్తే, కథకు అంత అవసరం కాక పోయినప్పుడు ఇంత ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదు కదా! ఇచ్చినపుడు ఆ పాత్రకు కూడా ఒక రకంగా మంచి ముగింపు యివ్వొచ్చుకదా! “డామిట్ కథ అడ్డం తిరిగింది” అని ఉండాలికదండీ. ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయంతోనే కదా, నాటకం ప్రారంభం అయింది? విజయనగరంలో అతడి పాపం పండి, ఆ వూరు ఒదిలే పరిస్థితి గదా! ఏం చెయ్యాలో తోచనిస్థితిలో వేంకటేశాన్ని చూడగానే వచ్చిన ఉపాయంతో వీడితో వీడి ఊరికి ఉడాయిస్తే మన బాధలన్నీ పోతాయి. అట్నుంచి నరుక్కురమ్మన్నాడు” అని గదా పారిపోయింది. మళ్లీ నాటకమంతా అయిం తర్వాత మళ్లీ మొదటికి తెచ్చేకన్నా - సంఘంతో బాటు గిరీశాన్ని కొంత సంస్కరించి, ఆ బుచ్చమ్మతో అతను సుఖంగా ఉన్నాడన్న సూచన ఇస్తే ఈయన సొమ్మేంబోయింది. పైగా, గురజాడ వారి ఆశయం విధవావివాహం గూడా నెరవేరేదిగదా!” అన్నాను.

“గిరీశం బుచ్చమ్మని మాత్రం మోసం చేసి పారిపోడా” అన్నారు. “డెబిటూ, క్రెడిటూ సీను స్వగతం గదండీ. గిరీశం ఎంత మోసగాడైనా, పై వాళ్లందరి దగ్గరా ఎన్ని డౌలు మాటలు మాట్లాడినా తన దగ్గర తాను అలా చేసుకోడు గదా! అక్కడ స్వగతంలో ‘sTÖ బుచ్చమ్మను చెడగొట్టడానికి ప్రయత్నం చెయ్యకూడదు. కనుక కొత్త దారీ కొంత న్యాయమైన దారీ తొక్కాలి. దీన్ని ఒప్పించి పెళ్లి చేసి కొంటినట్టాయినా కీర్తీ, సుఖమÖ గూడ దక్కుతాయి” అని గురజాడ గారే అనిపించారు గదండీ పైగా ఆఖర్లో రుబ్బురోలు దగ్గర ‘నీ చెల్లెలు పెళ్లి తప్పిపోవాలంటే ఒకటే మార్గం. అది నాతో లేచిరావడమే” అని బుచ్చమ్మ మనసుకు నచ్చే విధంగా చెప్పి కథలో ఆశించినదానికి ఉడతాభక్తిగా సాయం చేశాడు గదా! అలాంటి వాడ్ని కేవలం కథలోకి తీసుకురాకుండా ఔట్ సైడర్‌గానే వదిలేసారేమో అనుకుంటున్నాను” అన్నాను.

ఆడిదం రామారావుగారు చాలాసేపు కళ్లుమÖసుకొని ఉన్నారు. తర్వాత “ఒరే! నువ్వెవ్వడివో గానీ, పదేళ్ల తర్వాత, నిజంగా గిరీశం వేస్తావురా. ఇవాళ నీ కొచ్చిన సందేహాలు ఎలాంటివంటే ఆ సందేహాలు వచ్చిన వ్యక్తికి అనుభవంతో పాటు వాటి సమాధానాలు కూడా వాటంతట అవే దొరుకుతాయి. మీరు నాటకం తప్పకుండా ఆడతారు. కాని నువ్వన్నట్టు చూడ్డానికి నేనుండన్రా” అన్నారాయన. అలా వారి ఆశీర్వచనంతో తిరిగి వచ్చాను.

తర్వాత ఓ రోజు మా అన్న (సోమయాజులు) మా ఇంటి వీధి అరుగు మీద కూర్చుని కొంత మంది గ్రామ కరణాలూ, మున్సబులతో మాట్లాడుతున్నారు. అప్పటికి ఆయన ఉద్యోగం “విలేజ్ ఆఫీసర్ల ఎస్టాబ్లిష్‌మెంట్ క్లర్క”. ఆ గ్రామ కరణాల విషయాలకు మా అన్నయ్య సమాదానాలు వింటున్నాను. వాళ్లెలా మాట్లాడితే sTÖయనా అలాగే మాట్లాడుతున్నారు. కొంచెంసేపు విని మైమరచిపోయాను. అదంతా ఇది వరకు ఎక్కడో విన్నట్టుగా అనిపించింది. వెంటనే స్ఫురించింది. కన్యాశుల్కంలో రామప్పంతులు మాటలే అని. ఆ గ్రామ కరణాలూ, మునసుబులు అందరూ కన్కాశుల్కం చదివినట్టే అందులో మాటలో మాట్లాడుతున్నారు. వాటి సమాధానాలు ఇంచుమించూ అటో ఇటోగానే ఉన్నాయి. 

వెంటనే మా అన్నతో “నువ్వు రామప్పంతులు వేస్తే బాగుంటుంది. రామప్పంతులు డైలాగులు నాకు యివాళ అర్థమయ్యాయి. అన్నాను. తర్వాత రిహార్సల్సు ప్రారంభం అయ్యాయి.) చివరికి 20.04.1953న హస్తబల్ హాలు (విజయనగరం)లో బళ్లారి రాఘవ నాటకోత్సవాలలో దాన్ని మొదటి సారిగా స్త్రీ పాత్రలూ మగవాళ్లే వేశారు. ‘పంచ విగ్గీయం’ అని నామకరణం చేసుకుని మాలో మేమే నవ్వుకునే వాళ్లం. ఆరోజు ప్రేక్షకుల్లో ప్రముఖ స్త్రీ పాత్రధారులైన స్థానం నరసింహారావు, దాడిగోవిందరాజులునాయుడు గార్లు వున్నారు. ప్రదర్శనానంతరం వాళ్లు మేకప్ గదుల్లోకి వచ్చి మమ్మల్నందర్నీ ఆశీర్వదించారు. (ఆ రోజు వచ్చిన ప్రోత్సాహంతో, కొన్ని స్త్రీ పాత్రలు వేయించి, ఆర్నెల్లు రిహార్సల్సు చేసి మళ్లీ 1954లో చీపురు పల్లిలో ప్రదర్శించాం. తర్వాత నటరాజ కళాసమితి ప్రారంభంతో రెండో కార్యక్రమంగా 1955లో ప్రదర్శించాం. ఇది మÖడో ప్రదర్శన అయినా సమితి తరపున మొదటి ప్రదర్శన. నాతో పాటు (గిరీశం), సోమయాజులు (రామప్పంతులు), బీరకాయల రామదాసు (వెంకటేశం), వెంకట అప్పారావు (మధురవాణి). లక్క్ష్మణమÖర్తి (లుబ్ధావధార్లు), వేదులు జగన్నాధరావు (అగ్నిహోత్రావధాన్లు), డి.వి.యస్.ఆర్. జోగారావు (బుచ్చమ్మ) మొదలైన వాళ్లంతా సుమారు ముప్ఫై అయిదేళ్లు “కన్నాశుల్కం” నాటకం ఆడి పేరు తెచ్చుకున్నారు. నటరాజకళాసమితి మిగతా నాటకాలాడుతూ వున్నా కూడా కన్యాశుల్కం నాటకప్రదర్శనల్ని ఆపలేదు. కన్యాశుల్కం మా స్వంతం అనిపించుకునేంత ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించ్చాం. నిజానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాలలో కన్యాశుల్కం నాటకం ఒకటి రెండు ప్రదర్శనలివ్వని సంవత్సరం లేదు. గురజాడ వారి శతజయంతికి కన్యాశుల్కం ప్రదర్శించి ఆ మహాకవికి అంజలి ఘటించే అదృష్టం కలిగింది.) 

ఆ తర్వాత సమితి తరపున సుమారు నాలుగువందల సార్లు ప్రదర్శనలిచ్చాం. వృత్తి నాటక సమాజాలకిది గొప్పకాకపోవచ్చు గానీ, ఒక ఔత్సాహిక సమాజం ఒకే నాటకాన్ని పాతికేళ్లకు పైబడి అన్ని ప్రదర్శలివ్వడం సామాన్యంగా జరిగేపని కాదు. ఇది మాకు లభించిన గొప్పవరం. పైగా నేను ఆనాటి నుండీ ఈనాటి వరకూ, స్వీయదర్శకత్వంలో గిరీశం పాత్రే వేస్తున్నాను. ఇది నాటక చరిత్రలో అపూర్వమని నేను భావిస్తున్నాను. కేవలం ఆంధ్రదేశంలోనే గాక, అంతరాష్ట్రాలలో, విదేశాలలో కూడా వివిధ ట్రూపులతో సుమారు వెయ్యిసార్లు కన్యాశుల్కం ప్రదర్శించాను.

ఆ రోజుల్లో ఎంతో గొప్ప సినిమాలు వస్తున్నా, సరే సినిమావాళ్లు కూడా నాటకాల్ని విపరీతంగా అభిమానించే వాళ్లు. అలా మేం ప్రదర్శిస్తున్న “కాళరాత్రి” నాటకానికి హాజరైన సినీ ప్రముఖుల ద్వారా ఎల్.వి.ప్రసాద్‌గారి దృష్టి నాపై పడింది. ఆయన నన్ను పలిచి మాట్లాడి, మేకప్‌టెస్ట్ చేయించి, సినీరంగానికి పనికివస్తానని నిర్ధారించుకున్నారు. తను తీస్తున్న చిత్రంలో ఒక పాత్రనిచ్చారు. కానీ ఆ చిత్రం రూపకల్పన దాల్చకపోవడంతో, ఆయన తన మేనల్లుడైన కె.బి.తిలక్ గారికి నన్ను సిఫారసు చేశారు. తిలక్‌గారు తమ “ఎం.ఎల్.ఏ” చిత్రంలో గిరిజ గారి సరసన నాకో ప్రధానపాత్ర నిచ్చారు. అదే నా మొదటి చిత్రం. (19.09.1957న విడుదలైన ఎం.ఎల్.ఏ. నాకు మంచిపేరుతో పాటు, మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. నిజానికి అప్పుడు నా దృష్టి అంతా నాటకాల మీదే వుండేది. సినిమాల పట్ల పెద్ద ఆసక్తి ఏమీ ఉండేది కాదు. అలా యాధృచ్ఛికంగానే సినిమాలోకి వచ్చాను. 

అనుపమ సంస్థలో నటించిన తర్వాత వెంటనే ‘రాజశ్రీ’ వారు పిలిపించి “శభాష్‌రాముడు” (59), “మంచిమనసుకు మంచిరోజులు” (58) చిత్రాల్లో కథానాయకుడితో సరితూగే ప్రాధాన్యత గల పాత్రý£చ్చాయి. ఆ తర్వాత 22 చిత్రాల్లో హీరోగా నటించాను.

“బావమరదళ్లు”, “పెళ్లిమీద పెళ్లి” (కృష్ణకుమారితో  59), “పెళ్ళితాంబూలం” (జమునతో 62), “అత్తా ఒకింటి కోడలే” (దేవికతో 58), “ఆశాజీవులు” (రాజసులోచనతో 62), “మంచిచెడు” (శారదతో) మొదలైన చిత్రాలన్నీ నేను హీరోగా నటించినవే. ఇదంతా సినీరంగంలో నా ప్రాధమిక విజయం.

1971లో అన్నపూర్ణ వారి “అమాయకురాలు” చిత్రంలో ఊర్వశి శారద సరసన నటించాను. నేనా చిత్రంలో ఓ మోసగాడి పాత్ర ధరించాను. నన్ను అంతకౄరంగా ప్రేక్షకులు చూడలేకపోయారు. నా జీవితంలో అదే సమయానికి మరో అవాంతరం సంభవించింది. 1971లోనే నటుడు చంద్రమోహన్, నేను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. చంద్రమోహన్ తప్పించుకోగలిగాడు గానీ, కారూ, నేనూ బాగా నలిగిపోయాం. నా కుడికాలుకి పెద్దగాయమైంది. ఒక సంవత్సరం తొమ్మిది నెలలకాలం చేతి కర్రలు లేకుండా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో సుమారు ఐదేళ్లు పరిశ్రమకు దూరమయ్యాను. మళ్లీ మనుషుల్లో కలిసే ఆశలేని పరిస్థితుల్లో- “మానసికంగా నీవు బలవంతుడవైతే, నీకేం ఫర్వాలేదు, ఏదో ఒక వ్యాపకం కల్పించుకో” అని డాక్టర్లు యిచ్చిన సలహా మేరకు తాపీచాణక్యగారి “తారాశశాంక” నాటకాన్ని ప్రదర్శించడానికి ఆ కర్రల సయాయంతోనే పూనుకున్నాను. ఆ నాటకం సుమారు ముఫ్పై ప్రదర్శనలిచ్చాను. మధ్య మధ్య “కన్యాశుల్కం” కూడా వేశాను. అలా నాటకాలే నాకు మళ్లీ నడవడం నేర్పాయి. ఏమైనా, ఎన్ని కష్టనిష్ఠూరాలెదుక్కోవాల్సి వచ్చినా, నేను మళ్లీ ఇలా సినిమారంగంలో నిలదొక్కుకున్నా నాటక కళాసరస్వతి అంటేనే నాకు ప్రత్యేక అభిమానం.

(నేను సినిమారంగంలో మంచి ఫైలులో వున్న సమయంలో కూడా నాటకాలు విస్మరించలేదు. అవసరమైతే నాటకాల కోసం సినిమాలు ఒదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మద్రాసులో ఉండేటప్పుడు కూడా కొన్ని కొత్త నాటకాలు రాయించాను. ఆరుద్రగారి చేత “కాటమరాజు కథ” రాయించి, సుమారు 24 వేల రూపాయలు ఖర్చు చేసి 1962 డిసెంబర్‌లో ప్రదర్శించిన ఆత్మసంతృప్తిని నేను ఎన్నటికీ మరచిపోలేను. ఆ నాటకం నా జీవితంలో ఒక మలుపుకు నాంది వాచకం పలికింది కూడా. దాదాపు పదహారు సెట్లు గల కాటమరాజు కథ ఆనాడు శ్రీకాకుళం జిల్లాలో నాలుగు ప్రదర్శనలిచ్చి, నాలుగున్నర లక్షల రూపాయలు వసూలు చేసి జాతీయ రక్షణనిధికి సమర్పించాను. “కాటమరాజు” చాలా పెద్ద నాటకం 17 పెద్ద పాత్రలు, 22 చిన్న పాత్రలు వాటిని అతి సమర్థవంతంగా నిర్వహింపజేస్తూ చాలా మంచిపేరు తెచ్చుకున్నాను.

అట్లాగే మల్లాది వెంకట కృష్ణశర్మ గారి “సప్తపది” నాటకాన్ని సుమారు 65 ప్రదర్శనలిచ్చి వుంటాను. మా ట్రూప్‌కు అది చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది.)

మా మిత్రులంతా ఎవరెవరు ఏ వూళ్లో ఉన్నా సరే, సంవత్సరంలో కనీసం అయిదారుసార్లు అందరం మద్రాసులో కలిసేవాళ్లం. కొన్నాళ్ల పాటు నాటకాలు ప్రదర్శించి తిరిగి ఎవరి ఉద్యోగలకు వాళ్లు వెళ్లి పోయేవాళ్లం. కొత్త నాటకాలు కుదరకపోతే పాత నాటకాలే కొత్త ఊళ్లలో వేస్తూ వచ్చాం.

సినిమాలకు సంబంధించిన ఓ మధుర జ్ఞాపకం.... ఇందాకా చెప్పడం మరచిపోయాను- 1968వ సంవత్సరంలో భారత రాష్ట్రపతి వి.వి.గారి కుమారుడు వరాహగిరి వెంకట శంకరగిరి నిర్మాణ దర్శకత్వంలో సైగా మÖవీస్ పతాకంలో “ది ఎపిసిల” అనే ఇంగ్లీషు చిత్రంలో నేను నటించాను. వాయిస్ ఆఫ్ అమెరికాలో న్యూస్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్న గోపాలకృష్ణన్, అప్పటికి పదోతరగతి, చదువుతున్న కుమారి జయలలిత (నేటి తమిళనాడు ముఖ్యమంత్రి), సంధ్య (జయలలిత తల్లి) మొదలైన వారంతా అందులో నటించారు. కేవలం పదహారు రోజుల్లో నిర్మించిన ఆ ఇంగ్లీషు చిత్రం మద్రాసు రాజకుమారి టాకీసులో విడుదలైంది. ఇంగ్లీషు చిత్రంలో హీరోగా నటించిన దివ్యానుTభూతిని నేను ఎప్పటికీ మర్చిపోలేను.

కాలికి దెబ్బతగిలిన తర్వాత, హీరో వేసాలు మానేసాను కదా, మళ్లీ 1976లో కె.ఎస్.రామిరెడ్డిగారు “అనురాగాలు” చిత్రంలో వేషమిచ్చి, సినిమాలోకి పున్ణప్రవేశింపజేసారు. అదే సంవత్సరం కె.విశ్వనాధ్‌గారి “సిరి సిరి మువ్వ” చిత్రంలో చాలా బరువైన పాత్ర పోషించడంతో మళ్లీ నాకు డిమాండు పెరిగి నేటివరకు సుమారు రెండు వందల చిత్రాల్లో నటించాను. ఆ పరంపరలో “మరోమలుపు” (), “ఆకలిరాజ్యం” (81), “మరోచరిత్ర” (78), “మనవూరి పాండవులు” (). “సప్తపది” (), “కాంచనగంగ” (84), “గోరింటాకు” (మహానటి సావిత్రి సరసన) వంటివి చెప్పుకోదగ్గవి.

ఒక్క తెలుగులోనే గాక నాలుగు తమిళచిత్రాలు, ఒక కన్నడచిత్రం, ఒక మలయాళచిత్రంలో నటించాను. “ఈశ్వరఅల్లా” (98), “మానవుడు దానవుడు” (), “లగ్నపత్రిక” (), “శివాని” () ఈ మధ్యకాలంలో నేను నటించిన చిత్రాలు.

సినిమాలు తగ్గిపోయినా, నాటకాలు అప్పుడప్పుడు వేస్తూనే వున్నాను. ఈ మధ్యకాలంలో దూరదర్శన్ కార్యక్రమాలలో చాలా బిజీగా వున్నాను. 1995లో కన్యాశుల్కం నాటకాన్ని దూరదర్శన్‌లో ప్రదర్శించాను. ఆ టీ.వి. నాటకానికి కూడా నేనే స్వయంగా దర్శకత్వం వహించాను. అది దూరదర్శన్‌లో 19 ఎపిసోడ్స్‌గా ప్రసారమయ్యింది. నేను నటించిన “కన్యాశుల్కం” కందుకూరి విరేశలింగంగారు రచించిన “రాజశేఖరచరిత్ర” నాటకాలు దూరదర్శన్‌లో ప్రసారం కావడం నా జీవితంలో రెండు మైలురాళ్లుగా నేను భావిస్తుంటాను. ఇంకా దూరదర్శన్‌లోనే “డామిట్‌కథ అడ్డం తిరిగింది”, “నమోదయం” అనే సీనియల్స్‌లో నటించాను. హిందీ సీరియల్ “జీవనసరిత”కు నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు వహించాను. అందులో సీనియర్ నటి భారతి సరసన నటించాను. ఇంకా “ఆంధ్రప్రదేశ్‌లో ఆరు పుణ్యక్షేత్రాలు అనే డాక్యుమెంటరీని హిందీలో రూపొందించాను. 

ఆ మధ్య టీ.వీ. సీరియల్స్ మధ్యలో మళ్లీ నాటకాలతో బిజీ అయిపోయాను. తానా వారి నాటకాన్ని అమెరికాలోని ఇరవై ముఖ్యనగరాల్లో ప్రదర్శించాను. ఈ మధ్య సి.యస్.రావు గారు రచించిన “మళ్లీ ఎప్పుడొస్తారు”, డి.విజయభాస్కర్‌గారు రచించిన “గాంధీ జయంతి” నాటకాల్ని ప్రదర్శించాను. అందులో గాంధీ పాత్రపోషణ కోసం నియమబద్ధంగా వుండి గాంధీ పాత్రకు సరైన న్యాయం చేశాననే అనుకున్నాను. ఎందుకంటే కళాకారుడికి అంకిత భావం ముఖ్యం.)

ఇక నా కుటుంబ విషయాలకు వస్తే, నాకు 04.06.1955న సూర్యకుమారితో వివాహమయ్యింది. మాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, అందరికీ పెళ్లిళ్లైపోయాయి. మా అమ్మాయి, ఒక అబ్బాయి కెనడాలో ఉన్నతోద్యోగాలలో స్థిరపడ్డారు. నేను నా భర్య మాత్రం ఇక్కడే (హైదరాబాదు) వుంటూ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను.

అటు నాటకాలలోగానీ, ఇటు సినిమాలలోగానీ నేను ఎప్పుడూ నిజాయితీగానే వున్నాను. దర్శకులు కూడా నా స్వభావానికి తగిన పాత్రలే ఇచ్చి గౌరవించారు. కానీ ఇన్ని సినిమాలలో నటించినా, నాకు అత్యంత ప్రీతి పాత్రమైన గిరీశం పాత్రను మాత్రం సినిమాలలో వేయలేదనే కొరత కొరత గానే వుండి పోయింది. అదిమినహాయిస్తే కళారంగంలో నాకో స్థానాన్ని, ఈ జీవితానికో సార్థకతను సంపాదించుకున్నాను. ఆ తృప్తే నాకు చాలు. నాటకరంగమే నా శ్వాస, నా ధ్యాస, నా జీవితం అన్నీను. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి