మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, అక్టోబర్ 2026, శనివారం

మాతృశ్రీ కడియంపాటి గురుగోవిందమాంబ జీవితచరిత్ర - పరిశీలన

డా. కపిలవాయి లింగమÖర్తి గారు శతాధిక గ్రంథకర్త, కవి, పరిశోధకుడు, రచయిత. రెండు తెలుగు రాష్ట్రాలలో పేరెన్నిక గన్నవారు.  వారు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలో అనగా కథ, వచనము, కవిత, పద్యము, ఉదాహరణము, కావ్యము, స్దలచరిత్రలు, దేవాలయ చరిత్రలు, జీవితచరిత్రలు, నవలా రచనలు చేసినారు. వారు రాసిన జీవిత చరిత్రలలో మాతృశ్రీ కడియంపాటి గోవిందమాంబ చరిత్ర కూడా ఒకటి.

ఈ గ్రంథము సులభశైలిలో ఉండి పాఠకులకు సులభంగా అర్థమవుతుంది. దీనిలో గోవింద మాంబ గారి బాల్యము, వివాహము వారు యోగినిగా మారిన విధానము అన్ని కనులకు కట్టినట్లుగా వర్ణించినారు. అచల సిద్ధాంతాన్ని గురించి సామాన్య జనులకు కూడా అర్థమయ్యే విధంగా వివరించినారు.

కపిలవాయి గారు తన  ముందుమాటలో ఆయా కాలాలలోని మహనీయుల జీవితాలు ఎవరైనా ఎరిగి గ్రంథస్థం చేస్తే అవి భావితరాల వారికి కరదీపిక లౌతున్నవి.  అటువంటి వారిలో ఈ చరిత్ర కూడా ఒక మిణుగురు.

అయితే చరిత్ర రాయటం అనేది కవిత్వం కాదు. కవిత్వమైతే తన ఊహబలంతో వ్రాయవచ్చు. కానీ చరిత్ర కట్ల కాదు. స్థల కాల ప్రమాణాలు వస్తువు ప్రమాణాల వసరం. వాటి కొరకు ఆయా వ్యక్తుల సమకాలికులో లేక కుటుంబీకులో ఉంటే వెళ్లి వారిని కలిసి ముచ్చటించి విషయం రాబట్టుకోవాల్సి ఉంటుంది.

ఇక అమ్మవారి చరిత్రను పరిశీలిద్దాము...

ఓంకారాచలపీఠా సంస్థాపకులు శ్రీశ్రీశ్రీ చెరుకూరిశివరామబ్రహ్మేంద్రస్వాములవారు.వారి సతీమణి శ్రీమతిసుబ్బమాంబగార్లు.అనుమునిగిరి వీరినివాసం.

ఈయన ఆయన దగ్గరకు వచ్చేశిష్యులకు అద్వైతంతోపాటు అచల ప్రబోధచేస్తుండేవారు. ఆయన శ్రీపోతులూరి వీరబ్రహ్మంగారికి సిద్దయ్యగారివలె. ప్రియశిష్యుడు మోల్కలూరి హుస్సేన్ దాసుగారు.  ఈ దంపతులకు ఒక శుభముహూర్తన ఆడశిశువుజన్మించింది. ఆమెకు గోవిందమాంబ అని నామకరణం చేసినారు. దినదిన ప్రవర్థమానంగా గోవిందమాంబ పెరగసాగింది.

చాలా మంది శిష్యులు శివరామబ్రహ్మేంద్రస్వాముల దగ్గర బ్రీVA్మపదేశం పొంది,అద్వైతం-అచలంగురించి ప్రశ్నించేవారు. వాటికి ఆయన సమాధానాలిస్తుండేవారు. వారి సంభాషణలు గోవింద మాంబ శ్రద్ధగావిని అవగతం చేసుకునేది. ఆవిధంగా బ్రహ్మజ్ఞానవిద్య కరతామలకమైంది.

పెళ్ళీడువయసు రాగానే శేషబ్రహ్మేంద్రులతో వివాహం వైభవంగా జరిపించినారు. వీరికి ఒక గోవిందమాంబకు కుమారుడు జన్మించినాడు. నామకరణోత్సవవేడుకలో శిశువుకు తాతగారు గురుబ్రహ్మం అనిపేరుపెట్టినారు. శ్రీమచ్చెరుకూరి శివరామబ్రహ్మేంద్రులు జీవ సమాధికొరకు సౌజన్య పత్రికప్రకటించి తేది14-9-95 భాద్రపదరోజు శనివారం సమాధి పొందినారు. సమాధి పొందేముందు శిష్యులనుద్ధేశించి మున్ముందు గోవిందమాంబ అనుమునిగిరిపీఠాన్ని ముందుకునడిపిస్తుందని సెలవిచ్చినారు. ఆవిధంగా ప్రథమపీఠాధిపతురాలుగా కడియంపాటి గురుగోవిందమాంబను శిష్యులు ఆదరించినారు. మళ్ళీ అద్వైత అచల పీఠానికి కేంద్రబిందువైంది.

మాతృశ్రీ కడియంపాటిగురుగోవిందమాంబ పీఠాన్నధిరోహించిన తర్వాత బోధలకై గ్రామాంతరాలకు వెళ్ళేది. పీఠానికి వచ్చె శిష్యులు అడిగిన సందేహాలు తీరుస్తూ, బ్రీVA్మపదేశం చేస్తూ పరాత్పర తత్వాన్ని ప్రబోధిస్తుండేది.

ఒకనాటి సాయంకాలంలో శిష్యులు గురుగోవిందమాంబను తల్లీ! ఈ సృష్టి ఎట్లా ఆవిర్భవించింది అనిఅడుగగా 

నాయనా!

శ్లో. నభూమీనజలంచైవ -న తేజోనచవాయవః నచంబ్రహ్మనచం విష్ణుః - నచనక్షత్ర తారకాః-

సర్వశూన్యనిరాలంబం -స్వయంభూ విశ్వకర్మణః-

ఈ సృష్టికి మొదలు సూర్యుడు గాని,చంద్రుడు గాని,గ్రహనక్షత్రాలుగాని,పంచభూతాలు ఏవీ లేవు. ఆమహాశూన్యంలో పరబ్రహ్మంఒక్కడేఉన్నాడు. ఆయన స్వయంభువు. ఆమహానుభావునికి విశ్వకర్మ అని మరొక పేరు.

ఒక్కడుగా ఉన్న అతనికి తాననేకం కావలె. అనగా సృష్టిచేయవలెనని సంకల్పంకలిగింది. ఆ మహాశూన్యంలోమొదట ఓంకారమనేప్రణవధ్వని ఉప్పతిల్లింది. అప్పుడు ఆకాశంనుండి వాయువు, వాయువు నుండి అగ్ని. అగ్నినుండిజలం, జలంనుండి ఈభూమి వరుసగా పుడుతూ వచ్చాయి అని శిష్యునికి తెలియజేసింది.

కనుక సృష్టిలోపుట్టింది ప్రణవం.అది ఆకాశంయొక్క గుణంకాగా దానినుండిపుట్టిన వాయువుకు శబ్దంతోపాటు స్పర్శ అనేగుణం అలాగే అగ్నికి శబ్ధసర్శలతోపాటు తేజస్సు అనగారూపం, జలానికి శబ్దస్పర్శరూపాలతోపాటు రసం అనేద్రవగుణం, భూమికి మొదటి నాల్గింటితోపాటు గంధం అనేగుణాలేరర్పచపడినవి.

ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే పంచభూతగుణాలకుమాత్రలని వ్యవహారం. పంచభూతాల సమిష్టికి ప్రకృతి అనిపేరు. ఈప్రకృతి సత్వం,రాజసం,తామసం అని త్రిగుణాత్మకం. అద్యసృష్టిశూన్యంనుండి యేర్పండినదిగదా!

శూన్యమంటే ఏమిటి? తామిస్రమే,అదికూడా సామాన్యమైన తామ్రిసం కాదు.మహా తామిస్రమనవలె. పంచభూత సృష్టి తామిస్రంతో ఏర్పడిందో ఈ పంచభూతాల్లో భౌతిక దేహాలసృష్టికూడ మళ్ళీ అట్లా తమోగుణంనుండియే పుట్టింది.

ప్రకృతిలో ఈ తామసాహంకారం అవిద్య, అజ్ఞానం అనిరెండుభాగాలుగా ఉంది. ఒక్కడైన పరబ్రహ్మంతాననేకం కావాలెననుకున్నాడు. కనుక అందుకుతననుతాను విభజించుకోవడానికి తనకొకశరీరం అవసరం అయింది. అతడు అవిద్య అనేదానిలోకి ప్రవేశించి నిర్గుణం బ్రహ్మంగాఉన్నాడు సగుణబ్రహ్మయైనాడు. 

సగుణబ్రహ్మమే తననుతాను విభజించుకున్నప్పుడు అనేక రూపాలుగా అయినాడు. కాని ఆరూపాల చేతమళ్ళీ రూపకల్పనజరుగలేదు. అదిచూచి అతడు రెండవసారి అజ్ఞానమనేప్రకృతిలో ప్రవేశించాడు.అప్పుడతడు జీవుడనబడినాడు. ఈజీవుడు తనశరీరాన్ని ప్రకృతితోకూడి విభజించుకోగా ఈ శరీరాలుగూడ పునరుత్పత్తి సమర్థమయి ఇక ఈ సృష్టి అంతావిస్తరించింది అని వీరాచార్యులుతోపాటుగల శిష్యబృందానికి తెలియజేసింది. అమ్మవారు గురుగోవిందమాంబ.

మాట్లాడుతూ ప్రియశిష్యులారా! ఇంద్రయాలు గుర్రం లాంటివి. శ్రీకృష్ణుడు గీతలోచెప్పినట్లువాటికి బంధాలు వేస్తేనే తప్ప మనచేతికిరావు. గోవుకు విశ్వాసం ఉంటుంది కాని గుర్రానికిఉండదు. 

అమ్మగారి దొడ్డవరం పర్యటనలో శిష్యులు తాళమేళాలతో పూజించినారు. అప్పుడే అక్కడకువచ్చిన గర్భవతి అమ్మాయి తండ్రి అమ్మా! మా అమ్మాయికి కొడుకా? కూతురా అనిప్రశ్నించగా పాపపుడుతుంది నాయనా! అబ్బాయి కావాలన్నా అమ్మాయి కావలన్నా పురుషునిదే ప్రధానపాత్ర అని స్త్రీలులేకపోతే పురుషులెక్కడ? అనిబోధచేసింది.

పురుషజన్మ ఎంతో విలువైనది.ఈజన్మ లభించినందున దీనిని సార్థకంచేసుకోవాలి దప్ప వ్యర్థం చేసుకోరాదు.అందుకే అద్వైతాన్ని చక్కగా సద్గురుబోధచే జన్మరాహిత్యానికి కారణభూతమౌతుంది. ఆమె అనుమునిగిరి చేరేవరకు అక్కడికిరాయచూరు లక్ష్మయ్యవచ్చినారు. ఉభయకుశలోపరి తదనంతరం అమ్మా! నాకుసాంఖ్యంగురించి వివరించండనికోరగా

నాయనా! సాంఖ్యమంటే ఆత్మజ్ఞానం. మనశరీరంలో ఇరువది నాలుగుతత్వాలున్నాయి. కనుక ఆ తత్వాలకు సంబంధిన జ్ఞానమని అర్థం ఉన్నది. మనదేహంలోని ఆ తత్వాలేవేవి? నాయనా మనదేహం పంచభూతాలతో ఏర్పడిందిగదా!  వానిలో మొదటి ఒక్కొక్కభూతం తలా రెండుభాగాలయింది.ఆ తర్వాత రెండవసగం నాలుగుభాగాల్లో కలిసింది.

అట్లా కలిసినప్పుడు భూమియొక్క మొదటి సగం గుదం అనే విసర్జనావయం ఏర్పడగా తక్కిన నాలుగుభూతాలతో కలసివరుసగా వదనం అనగా నోరు,చేతులు,కాళ్ళు, ఉపస్థ అనగా జననాంగలైన మర్మాంగాలేర్పడినవి.

జలభూతం నుండి మొదటిసగం రసం. తక్కిన నాలుగుభూతాలు కలిసిశబ్ద, స్పర్శ, రూప,గంధాలనేగుణాలేర్పడినవి. అగ్ని భూతముయొక్క మొదటిసగంలోనేత్రమేర్పడగా తక్కిననాలుగు భూతాలతో, శ్రోతం -త్వచం -జిహ్వ -    ఘ్రాణం అనే ఇంద్రియా లేర్పడినవి. వీటితోమనం ప్రపంచాన్ని తెలుసుకుంటాం కాబట్టి ఇవి జ్ఞానేంద్రియాలనబడినవి. వాయు భూతం యొక్క మొదటిసగంలో వ్యానం ఏర్పడగాతక్కిన నాలుగు భాగాలు నాలుగుభూతాలతో కలిసి సమాన -ఉదాన-ఆపాన -ప్రాణాలనేపంచప్రాణాలేర్పడినవి.

ఆకాశభూతంలోసగం అట్లాఉండగాతక్కినసగభాగం నాలుగైనాలుగుభూతాలతోకలిసి మనస్సు -బుద్ధి-చిత్తం- అహంకారం అనే అంతరేంద్రియచతుష్కమేర్పడినది. ఈ విధంగా ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదుపంచతన్మాత్రలు, ఐదు పంచప్రాణాలు, నాలుగు అంతరేంద్రియాలు అనే ఇరవైనాలుగుతత్వాలు కలిసి ఈ శరీరమేర్పడినది. 

ఈ తత్వాలన్ని స్వతంత్రాలు. ఇవిజీవుని యొక్కప్రమేయం లేకుండానే దేనిపని అదిచేస్తూ పోతుంటవి. కాబట్టి పై యిరువది నాలుగుతత్వాలను పరిశీలించి వానిలోదేన్ని పట్టుకుంటే మనకుముక్తి పొందగలమోదాన్ని తెలుసుకోవడమే సాంఖ్యం అనబడుతుంది.

అమ్మా! మీరిప్పుడుతెలిపిన ప్రంచీకరణంలోతత్వాత ఇరువైఐదు కావాలి. మిగతాఐదేమైనట్టు అని అడుగగా అది తర్వాత చెబుతా. మరీ జ్ఞానేంద్రయలతో, కర్మేంద్రియాల్లో వాటిలో ఏమౌతావు. వాటితో ఏ పనిచేయగలం. ముక్తి ఎలా పొందగలం. మరీ జీవుడు ఎట్లా ముక్తి పొందగలడు. చివరకు మిగిలేది జ్ఞానం దీనివల్లె ముక్తి పొందవలె. 

తల్లీ!మార్గాలలో ఆ మహావాక్యాలేమిటో సెలవియ్యండీ వినునాయనా! మహావాక్యాలుగూడ సగుణం, నిర్గుణం ఈరెండు వేర్వేరుగాఉన్నాయి. మొదటవానిని మహావాక్య చతుష్టయం, రెండవది మహావాక్యత్రయం అంటారు. 

అమ్మా! ఓలేకేం తండ్రీ! మొదటివి ఈదేహంలోని జీవుని గురించి తెలుపగా, రెండవది ఈ దేహాన్ని గురించి చెబుతవి. అవి చెబుతాను విను.

1.ప్రజ్ఞానం బ్రహ్మ - ఐతరేయోపనిషత్తు.

2.అహం బ్రహ్మాస్మి - యజుర్వేదం -బృహదారణ్యణకోపనిషత్తు.

3.తత్వమసి -సామవేదం -ఛాందోగ్యోపనిషత్తు.

4.అయమాత్మాబ్రహ్మ -అధర్వణవేదం -మాండూక్యోపనిషత్తు.

అమ్మా! జ్ఞానమనేది మనపంచీకరణలోదేకాదా! బ్రహ్మం ఇరవైఐదుతత్వాలలోనిది కాదంటారు కనుక అది బ్రహ్మమెట్లా అవుతుంది?  అయితే ఒక జ్ఞానమే గాదు ప్రజ్ఞానం అన్నప్పుడు దానిని కూడా విచారించవలె. గురువు రెండవసారి అయమాత్మబ్రహ్మ అనిచెబుతాడు.అప్పుడు శిష్యుడు మళ్ళీ దాన్నిగురించిగూడ విమర్శించుకోవలె. 

షట్‌చక్రాలు వివరణ

ఆధారచక్రంలో కుండలిని మÖడున్నరచుట్లు చుట్టుకొని అధోముఖమై నిద్రిస్తుంటుంది. సహాస్రారానికి ఊర్థ్వకుండలిని అనిమరొకపేరు. సాధకులు ప్రాణామయంలోని కుంభకంలో ఈకుండలిని మేల్కొల్పుతారు.అప్పుడు కుంభకంలో కలిగినవేడిమిని భరించలేక కుండలిని మెల్లగా ఒక్కొక్కచక్రాన్ని దాటుతూ సహస్రానికి చేరుతుంది. అప్ఫుడు సాధకుడు బ్రహ్మానుభవాన్ని పొందుతాడు. ఇది అందరికి సాధ్యం కాదు.

సాధకులకు వారి స్థితినిబట్టి కుండలిని

1.మణిపూరకంలో నిలిచినపుడుసాలోక్యం.

2.అనాహథచక్రంలో నిల్చినపుడు సామీప్యం.

3.విశుద్ధచక్రంలో నిల్చినపుడు సారూప్యం.

4.అజ్ఞాచక్రంలో నిల్చినపుడు సార్జ్యం = సృష్టి సంబంధం విడిపోవడం.

5. సహస్రారంలో నిలిచినపుడు సాయుజ్యం అనేముక్తులు వారికికరతామలక మౌతుంటవి.

1) మÖలాధారచక్రం - అధిపతిగణపతి -600 జపం.తత్వం పృధివి.మÖర్తులు - ఇంద్రియ నిగ్రహం.

2) స్వాధిష్టానం -అధిపతి - బ్రహ్మ -జపం `6000 వేలు. తత్వం -జల-మÖర్తులు- కామనిగ్రహం.

3) మణిపూరకం `అధిపతి -విష్ణువు -జపం ` 6000 వేలు. అగ్ని `తత్వం `మÖర్తులు` సార్జ్యం.

4) అనాహతం `అధిపతి` శివుడు `జపం `అధిపతి -6000 జపం`తత్వం వాయువు` మÖర్తులు` సాలోక్యం.

5) విశుద్ధ` అధిపతి`జీవుడు` జపం `1000` తత్వం ` ఆకాశం` మÖర్తులు `సామాన్యం.

6) ఆజ్ఞేయం ` అధిపతి -గురువు` జపం `1000` తత్వం ` సృష్టి` మÖర్తులు `సారూన్యం.

7) సహస్రారం ` అధిపతి -పరమాత్మ- జపం ` 1000` తత్వం ` పరమపదం `మÖర్తులు. సాయుజ్యం. 

మనయొక్క ప్రాణపక్షి లోపలికి వెళ్ళేటప్పుడు ”సో” అని వెలుపలికి వచ్చేటప్ప”హం” అనిలీలగా ధ్వనిస్తుంటుంది.

సోహంలోసః అహం అనే రెండుపదాలున్నవి. సఃఅనగా పరమాత్ముడు.అనేపురుషుడు. ఇతడు జీవుల యొక్కహృదయ కమలంలో నివసిస్తున్నాడు. కనుక అహం అనగా రెండుపెదవులు కలిస్తే”అమ్మా” అనిపలికినట్లు అతడే నేను అని ఉంటుంది. కనుక ఈ జీవుడంటే ఎవరో కాదు.మాయలో చిక్కిజీవుడనిపించుకుంటున్నాడు. గాని అతడా యొక్క పరబ్రహ్మమే. అందువల్ల మహావాక్యాలలోని “తత్త్వమసి”అనే వాక్యం తత్‌త్వం అసి.అదే అతడే నీవై ఉన్నావని శిష్యబృందానికి బోధిస్తుంది. ఇలా అమ్మవారి శిష్యులకు భోదలు చేస్తూ వారిని జాగృతం చేసినది.

అనుబంధం

ప్రస్తుతము అనుమునిగిరి ఓంకార అచలపీఠము, భైరవకోన త్రిముఖదుర్గాదేవి శక్తిపీఠాలకు, ప్రస్త్రత పీఠాధిపతులుగా శ్రీశ్రీశ్రీ రామడుగుగురు బ్రహ్మేంద్రస్వాములవారు. అచల ఋషీంద్రులు, పరిపూర్ణాచల రాజయోగి, రాజర్షివారి సహధర్మచారిణి, సాధ్వీమణి శ్రీమతి సుభాషిణిదేవి గార్లు వ్యవహరిస్తున్నారు. వీరి సంతానం శ్రీమతి రామడుగు గోవిందమాంబాదేవి, శ్రీమతి నిర్వికల్ప, కుమారుడు శివరామ దీక్షితులు, ధర్మపత్ని శ్రీమతి పుష్షలతాంబిక గార్లు వీరికి ఒక సుతుడు, ఒక తనయ. ఇద్దరు చిన్నకూతుళ్ళు శివైక్యం పొందినారు. ఇదీ ఇప్పుడు నడుస్తున్న చరిత్ర.

కవితాకళానిధి పరిశోధకపంచానన స్వర్గీయ మహాకవి బ్రహ్మశ్రీ డా.కపిలవాయి లింగమÖర్తిగారు శిల్ఫంగాని శైలి, సరళ సుందరంగా, మాతృశ్రీ కడియంపాటి గురుగోవిందమాంబగారి జీవితచరిత్రను అలవోకగా వ్రాసిన తీరు ప్రశంసనీయం.

ఫలశ్రుతిలో 

కం.గురుభక్తిగలిగియేసత్ 

పురుషుడు sTÖ పంచబంధములు క్రమమెల్లన్ 

మరువకజదీవినవ్రాసిన

గురుడొసగునఖండపదవికోరికలలరన్.

అని దీవించి శుభాశ్శీస్సులు అందరకి ఫలించుగాక!

శిష్యుల అభిప్రాయం ప్రకారం మొట్టమొదటి పీఠాధిపతురాలగా నియమింపబడిన మాతృశ్రీ కడియంపాటి గురుగోవిందమాంబగారు మోర్జంపాడులో సమాధిపొందినది. ఈ ఆశ్రమాధిపతి శ్రీ శివరామబ్రహ్మేంద్రులు. ప్రస్తుతం శ్రీశ్రీశ్రీ రామడుగు గురుబ్రహ్మేంద గురుచక్రవర్తి నేటికి అద్వైత అచలబోధ చేస్తు రెండు పీఠాలకు పీఠాధిపతిగా కోట్లశిష్యోద్ధరణతోపాటు, పీఠాల పరిపాలన కొనసాగిస్తున్నారు.

శుభమ్ భూయాత్


పద్మిని...నాట్యంలో అగ్రగామి దక్షిణాది తార...

తిరువాన్కూర్ సోదరీమణులుగా క్రిందటి తరంలో ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిలలో అందచందాలలోనూ, నటనలోనూ, నాట్యంలోనూ గూడా అగ్రగామియై, కేవలం తమిళ, తెలుగు సినిమా రంగాలకే పరిమితంగాక, హిందీ చిత్రసీమలోనూ ఒక వెలుగు వెలిగి, అంతటితో ఆగకుండా విదేశీ చిత్రాల్లో కూడా నటించిన దక్షిణాది తార పద్మిని. మొదట్లో ‘అభినయానికి లలిత, అందానికి నేనూ’ అన్నట్లుగా ఉండే పద్మిని ఆ తర్వాత నాలుగు భాషల్లో (తమిళం, తెలుగు, మలయాళం, హిందీ) అందరూ అగ్రశ్రేణి హీరోలతో నటించి విశేష గుర్తింపు పొందారు.ప ఈ సీనియర్ నటీమణితో కాసేపు...

నేను 1932 డిసెంబరు 14 వ తిరువనంతపురంలో పుట్టాను. మా న్నా తంగప్పన్‌పిళ్లెí, తల్లి సరస్వతీ అమ్మాళ్. మేము ముగ్గురు సోదరీమణులం. మా అక్క లలిత, ఆమె నాకంటే ఏడాది పెద్ద. మా చెల్లెలు రాగిణి. నాకంటే చాలా చిన్న. మా తర్వాత మాకు ఒక్కడే తమ్ముడు. చంద్రకుమార్. ఇతని కూతురే నేటి ప్రముఖ నటి, నర్తకి శోభన. మా తమ్ముడి తర్వాత అందరికన్న ఆఖరుది రాగిణి.

నేను గానీ, మా అక్కయ్యగానీ ఎవ్వరూ స్కూలుకు వెళ్లి చదువుకోలేదు. పంతులు గారే ఇంటికి వచ్చి, చదువు చెప్పేవారు. ఆ రోజుల్లో మాది ధనవంతులు కుటుంబం.  మాకు మలయాలో రబ్బరు తోటలుండేవి. మా అమ్మగారికి - నృత్యకళపై చాలా అభిమానముండేది.  అందుకే చిన్నప్ప్పుడే మా చేత నాట్యాభ్యాసం చేయించింది. తిరువాన్కూరు రాజాస్థాన నాట్యాచార్యులు గోపీనాథ్ గారు మాకు తొలి నాట్య గురువు. ఆయన మొదట మాకు కథాకళీ నృత్యం నేర్పారు. ఈ నృత్యం మా లలితకు చాలా ఇష్టం.

మా అక్కయ్యకు ఏడేళ్లు. నాకు ఐదేళ్లు వయస్సు వచ్చేటప్పటికే మేమిద్దరం నాట్యంలో నేర్పరులైపోయాం. మా మొదటి నాట్యప్రదర్శన తిరువాన్కూరు మహారాజా వారి సమక్షంలో జరిగింది. మహారాజావారి పుట్టినరోజు పండుగ రోజు. నేనూ, మా అక్కయ్య ఇద్దరం కలిసి రాధాకృష్ణ నృత్యం చేశాం.  నేను పసిసిల్ల కావటం చేత అక్కడి ప్రేక్షక సమÖహాన్ని చూసి, వేదిక మీదకు రాగానే భయపడి, చేతిలోని మురళిని వదిలేసి కొంత భయపడ్డాను. ఆ తర్వాత కొంత సేపటికి తేరుకొని చిన్నారి కృష్ణునిగా నాట్యం చేసి ప్రశంసలందుకున్నాను. 

అదే సమయంలో మా నాన్నగారు చనిపోవడంతో మమ్మల్ని పోషించే భారం, ఉత్తమ నృత్య కళాకారిణులుగా మమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత మా అమ్మగారిపై పడ్డాయి.  అప్పట్లో సంగీతం, నృత్యాలకు మంచి కేంద్రం చెన్నెí. మా అమ్మగారు మమ్మల్ని తీసుకుని 1944 లో చెన్నెí వచ్చేశారు.

అప్పటికే కుమారి కమల సినిమాల్లో నృత్యాలు చేస్తూ, బాల నర్తకిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ స్ఫూర్తితో మమ్మల్ని కూడా సినిమాల్లో చేర్చి అలా పేరు తెప్పించాలని అనుకున్నారు మా అమ్మగారు.

టి.కె.మహాలింగం పిళ్లెí గారి వద్ద భరతనాట్యాల్ని, ఉదయశంకర్ గారి వద్ద ఓరియంటల్ డాన్సులను అభ్యసించి నృత్యకళలో మంచి ప్రావీణ్యాన్ని పొందాము. ఆ రోజుల్లో చెన్నెíలో డాన్సుకు బాగా ఆదరణ ఉండేది. అంచేత మాకు చాలా త్వరగానే గొప్ప గీర్తి వచ్చింది. ఎక్కడిపడితే అక్కడ మా నృత్య ప్రదర్శనలు జరిగాయి. ‘తిరుమాన్కూరు సిస్టర్స’ అని ఓ డాన్సు ట్రూపు నటిపాం. అది చాలా ఏళ్లు కొనసాగింది. మేము సినిమాల్లో బిజీగా ఉండే రోజుల్లో ఆ ట్రూపున” సుకుమారి (సుప్రసిద్ధ నర్తకి, నటి) నడిపింది. చిన్న తనంలోనే నృత్యాలతో ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం పాý£్గన్నాం.  వార్‌ఫండ్‌కి వసూళ్ల కార్యక్రమంలో అప్పటికి మా నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా వుండేది.

1948 లో ఉదయశంకర్ గారు “కల్పన” అనే నృత్య ప్రధాన చిత్రం నిర్మిస్తూ నర్తకీమణులు కావాలని పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. దాన్ని చూసి మా అమ్మా మమ్మల్ని  తీసుకువెళ్లారు. అలా అదే మాకు మొదటి చిత్రం. ఈ చిత్రం బాగా పోలేదు. కానీ, మేము సినిమాల్లో  నాట్యతారలుగా బిజీ అయిపోయాము. తమిళంలో మేము మొట్టమొదటిసారిగా పక్షిరాజావారి “కన్నిక” అనే చిత్రంలో నటించాము.నీ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షక లోకం మమ్మల్ని బుక్ చేసుకున్నారు. దక్షిణభారత దేశమంతటా మా పేర్లు మారుమ్రోగాయి. చాలామంది తమ పిల్లలకు భరతనాట్యం నేర్పిచి మా పేర్లు పెట్టుకునేవారు. 

తెలుగులో మమ్మల్ని ఆదరించిన తొలి వ్యక్తి శ్రీమతి భానుమతీ రామకృష్ణ. ఆమె తమ “లైలామజ్ను” (1949) చిత్రంలో మాతో చక్కని నృత్యాలు చేయించారు. అప్పటికి రాగిణి కూడా పరిశ్రమలోకి వచ్చేసినట్టు గుర్తు.

వాహినీ పిక్పర్సు టెక్నీషియన్ కె.రామనాథ్ దర్శకత్వంలో పక్షిరాజా వారి “బీదలపాట్లు” (1950) చిత్రంలో నటించాము. అప్పటివరకూ కేవలం నృత్యాలకే పరిమితమైన మేము తొలిసారిగా పాత్ర ధారణ చేసింది ఈ చిత్రంతోనే. ఆ అవకాశాన్ని కల్పించిన రామనాథ్ గారు ఎప్పటికీ మాకు గుర్తుండిపోయే వ్యక్తి.  వారే గనక ఆ చిత్రంలో మాకు పాత్రలు ఇవ్వకపోయి వుంటే మేము కేవలం నృత్యతారలు గానే మిగిలిపోయే వాళ్లమేమో! ఆ వెంటనే రాగిణీ వారి “తిరుగుబాటు” (1950) లో చేశాం. 

తెలుగులో ప్రముఖ దర్శక నిర్మాత పద్మభూషన్ బి.ఎన్.రెడ్డి గారు “మల్లీశ్వరి” నిర్మిస్తూ మొదట ఆ టైటిల్‌కు నన్ను అనుకున్నారు.  అందుకే ఇంచుమించు నా పోలికలు కన్పించే వసుంధర (ఆమే తర్వాత నటిగా ఎంతో పేరొందిన కాంచన) ను చిన్నమల్లి పాత్రలకు బుక్ చేశారు. కానీ నాకు వాయిస్ డబ్బింగు చెప్పాల్సి రావడంతో రెడ్డిగారు భానుమతి గారిని తీసుకున్నారు. “మల్లీశ్వరి” నేను చెయ్యలేక పోవడం నా దురదృష్టమే గానీ, భానుమతి గారు చేసిన తర్వాత ఆ చిత్రాన్ని అంత బాగా నేనే కాదు, ఎవరూ చేయలేరనిపించింది.

అయితే “మల్లీశ్వరి” చేజారిన వెంటనే నాకు కథానాయిక అవకాశం వెంటనే వచ్చింది. ఆ అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్.ఎస్.కృష్ణన్ గారు. ఆయన ఎన్.ఎస్.కె. పేరుతో “పెళ్లికూతురు” చిత్రం నిర్మించి, అందులో కథానాయిక వేషం ఇచ్చారు. ఆ తర్వాత నేను నటించిన అన్ని భాషా చిత్రాలలోనూ కథానాయికగానే నటిస్తూ వచ్చాను. 

తెలుగులో అప్పటి ప్రముఖ హీరీలు ఇద్దరూ. నందమÖరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు. ఇద్దరితోనూ నేను నటించాను. ఇద్దరూ పరభాషా తారనైనా నన్ను తమ సొంత తారగా గౌరవించేవారు. రామారావు గారైతే మరీనూ. కృష్ణా పిక్చర్స్ వారి “అమ్మలక్కలు” (1953), “విజయగౌరి” (1955), “సంపూర్ణరామాయణం” (1958) చిత్రాల్లో ఎన్.టి.రామారావు గారి సరసన నటించాను. ఆ తర్వాత నేను తెలుగులో చాలా సంవత్సరాలు నటించలేదు. మళ్లీ ఎప్ప్పుడో “భక్తపోతన” (1966) చిత్రంలో భోగిని గానూ, బి.ఏ.సుబ్బారావు గారి “మోహినీభస్మాసుర” (1966) లో మోహినీ గానూ నటించాను. అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి “వసంతసేన” (1967) చిత్రంలో టైటిల్ పాత్ర పోషించాను. చేసింది తక్కువే అయినా తెలుగు ప్రేక్షకులకు నేనంటే ఓ గౌరవం ఉండేది. ఆదుర్తి సుబ్బారావు గారి “అసురసందేశం” (1954) చేశాను. తమిళ వెర్షన్ లేకుండా తెలుగులో నేను స్టెయిట్‌గా చేసిన మొదటి చిత్రమది.  

అయితే ఆ రోజుల్లో చాలా తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యేవి. అలా స్టెయిట్ పిక్చర్సు లేకపోయినా డబ్బింగు చిత్రాల ద్వారా కూడా తెలుగులో నాకు చాలా మంచిపేరు వచ్చింది. “సింగారి” (1951), “సాహసవీరుడు” (1956), “దేశింగురాజుకథ” (1960), “అమరదీపం” (1956), “విజయకోటవీరుడు” (1958), “వీరప్రతాప” (1958), “వీరపాండ్యకట్టu£మ్మన” (1959) “కత్తిపట్టినరైతు” (1961), “అనుమానం” (1961), “కన్యకాపరమేశ్వరి మహాత్మ్యం” (1961), “స్తీ జీవితం” (1962), “శ్రీవల్లీకల్యాణం” (1962), “ఏకవీరుడు” (1962), “రాణిసంయుక్త” (1963), “నిరపరాధి” (1969) తదితర చిత్రాల్లో నటించాను. ప్రముఖ నటగాయని టి.జి.కమలాదేవి నాకు ఎక్కువగా డబ్బింగు చెప్పేవారు.

నేను ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించాను. శివాజీగణేశన్ ఎం.జి.రామచంద్రన్, జెమినీగణేశన్‌లతో చాలా చిత్రాల్లో నటించాను. అయితే, శివాజీగణేశన్‌తో నటించిన చిత్రాలే నాకు చాలా మంచిపేరు తెచ్చిపెట్టాయి. “తిల్లానా మోహనాంబాళి” (1968), “తంగపదుమై” (1959), “దైవపిరవై” (1960), “అమరదీపం” (1956), “ఉత్తమ పుతిరన” (     ), “వియత్నాం వీడు” (1970) మొదలైన చిత్రాలు ఆయన సరసన నాకు మంచి పేరు తెచ్చిన చిత్రాలు.

ఇంకా “చిత్తి” (1966), “పెణ్‌దైవం” (1970), “వీట్టుమాప్పళ్లెí” (1973) మొదలైన చిత్రాలు తమిళ ప్రేక్షకులకు ఒకానొక  సందర్భంలో నన్నుర వాళ్లకు ఆరాధ్యదేవతను చేశాయి. ఏమైనా తమిళుల ఋణం తీర్చుకోలేనిది.

నా మాతృభాష మలయాళంలో కూడా “స్నేహసీమ” (1954), “అధ్యాపక” (1968), “అడిమగళ” (1969), “నొక్కెతదూరతు కణ్ణుంనాట్టు” (1984), “పూవేపూచూడనా” (1985), “వస్తుహర” (1990) తదితర చిత్రాలు చేశాను. ఆ చిత్రాలకు గాను అక్కడ ఎన్నో అవార్డులనందుకున్నాను. 

ఇక నేను ప్రముఖంగా చెప్ప్పుకోవాల్సింది నా హిందీ చిత్రాల గురించి - నేను చాలా తమిళ, తెలుగు చిత్రాల్లో నటించినా నా మొదటి చిత్రం “కల్పన” హందీ చిత్రమే కదా! అలా నేను మొదట హిందీ తారనే. చిత్రం ఏమిటంటే నా మొదటి చిత్రం “కల్పన” ను నిర్మించింది జెమినీ స్టూడియోలో కథానాయికగా నేను నటించిన మొదటి చిత్రం జెమినీ వారి చిత్రం. హిందీలో నేను కథానాయికగా నటించిన మొదటి చిత్రమÖ జెమినీ వారిదే. వాసన్ గారు “చంద్రలేఖ”, “నిషాన”, “మంగళ” మొదలైన చిత్రాలను నిర్మించి విజయ పరంపరలు సాధించిన రోజులవి. ఒకరోజు ఆయన నన్ను పిలిపించి, తను నిర్మింపబోయే “మిస్టర్ సంపత” అనే హిందీ చిత్రంలో నాయిక పాత్రకు నన్ను నిర్ణయించామని చెప్పారు. అప్పటికే నాకు హిందీ వచ్చు. కానీ అంతబాగా రాదు. అందుకని కొంచెం భయపడ్డాను. వాసన్ గారే నాకు ధైర్యం చెప్పారు. నన్నేర కథానాయిక పాత్రకు ఎన్నుకున్నామని తెలియజేశారు. “చంద్రలేఖలో రాజకుమారిని, పరిచయం చేశాs. మా మిస్టర్ సంపత్ చిత్రంలో పద్మినిని పరిచయం చెయ్యబోతున్నాము” అని నా ఫోటో వేసి ప్రకటనలిచ్చారు. ఆ విధంగా హిందీ చిత్రసీమలో నేను ప్రవేశించాను. “మిస్టర్ సంపత” నాకు హిందీ చిత్రరంగంలో మొట్టమొదటిదయింది. ఆ చిత్రం విజయవంతమైంది. u£ంబాయి నిర్మాతలకT నా నటన మీద నమ్మకం కలిగింది. ఆ తర్వాత హిందీ చిత్రాలోనూ నాకు మంచి అవకాశాలు రాసాగాయి. నేను సుమారుగా ముప్పెí హిందీ చిత్రాల్లో నటించాను.

నేను నాయికగా నటించిన మొదటి హిందీ చిత్రంలో మోతీలాల్ నాతో నటించారు. ఆయన సినిమా పరిశ్రమలో గొప్ప అనుభవజ్ఞుడు. మొదట్లో ఆయనతో నటించాల్సి వచ్చినపుడు చాలా భయపడేదాన్ని నేను.  నేను సంభాషణలు చెప్పేటప్ప్పుడు ఆయన చాలా దీక్షతో గమనించేవారు. అది నా మొదటి చిత్రం గదా! అందుకని నా ఉచ్ఛారణన” చాలా జాగ్రత్తగా చూసేవారు. నా ఉచ్ఛారణలోని తప్ప్పుల్ని సరిచేసేవారు. అలా కాదు ఇలా చెప్పాలి అని - ఆ సంభాషణ తను చెప్పి చూపించేవారు. మొదట్లో నేను ఏదైనా సంభాషణ చెబుతుఊ నటించేటప్ప్పుడు చేతులు ఎక్కువగా ఆడించేదాన్ని. ఆయన అలా చేస్తే హిందీ ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడరని నటన వేదిక మీద ప్రసంగంలా వుండకూడదని, స్తీలు నటనలో అణుకువ కన్పించాలని, చేతులు ఆడిస్తూ, మాట్లాడడం నటీమణులకు సరిపోదనీ చెప్పి ఆయన, నాలోని లోపాల్ని సరిదిద్దారు. ఆయన నాకు సలహా ఇచ్చేముందు నా దగ్గరికి వచ్చి తనో సలహా ఇస్తానని ఆ సలహా విని కోపం తెచ్చుకోనంటేనే తను సలహా ఇస్తాననీ అన్నారు. ఆయన అంతటి పెద్ద నటులైనా అందరికీ అంత గౌరవం ఇచ్చేవారు.

షమ్మీకపూర్ సెట్‌లోకి రాగానే సెట్ పెళ్లిపందిరిలా తయారయేది. అంత సందడి చేసేవారాయన. షూటింగ్  సమయంలో ఆయన ఎంత సీరియస్‌గా వుంటారో ఆ షాట్ ముగియగానే అత సరదాగా మారిపోయేవారు. జోక్స్ బాగా వేసేవారు. షమ్మీకపూర్ సెట్‌లో వుంటే, అక్కడ వుండే మిగిలిన వారు మÖతులు ముడుచుకుని కూర్చోలేరు. ఒకసారి ఒక ఫోటోగ్రాఫర్ “మీరు ఆడపిల్లల్లా పువ్వుల చొక్కా కుట్టించుకున్నారే!” అని అడిగారు షమ్మీకపూర్‌ను. “ఏం ఆడవాళ్లు మాత్రం ఫాంట్లూ అవీ వేసుకోవచ్చా? ఈ ప్రశ్నకు జవాబు అడిగి తెలుసుకుని రండి. ఆ తర్వాత మీ ప్రశ్నకు నేను జవాబు చెప్ప్పుతాను” అన్నారాయన. వాదించడంలో మంచి దిట్ట. ఆయన అదరితోనూ ఎంతో చనువుగా వుండేవారు. స్నేహితులకోసం ఎంతటి సహాయమైనా చేసే గుణం ఆయనలో ఉండేది.

సినిమా పరిశ్రమలో ఉన్న కొద్దిమంది పాడే నటులలో కిషోర్ కుమార్ ఒకరు. అసలు ఆయన నేపధ్య గాయకునిగానే పరిశ్రమకు వచ్చారట. సెట్‌లో ఆయననూ, ఆయన ప్రవర్తననూ మొదటిసారి చూసిన వారెవరైనా ఆశ్చర్యంతో నిశ్చేష్టులై పోయేవారు. కూచున్న కుర్చీలో వెనక్కి వంగి దబ్బున కింద పడిపోవడమో, వంద రూపాయల నోటుని పట్టుకుని పరపరా చింపెయ్యడమో వంటి చిలిపి పనులు చేసేవారు. కిషోర్‌కు ఆయన అన్నయ్య అశోక్‌కుమార్ గారితో కలిసి నటించమంటే చాలా భయం. అలా నటించాల్సి వస్తే ఒళ్లంతా చెమటలు పట్టేసేది.

పద్మశ్రీ వంటి ఎనోఊ్న గొప్ప గొప్ప అవార్డులు పొందిన అశోక్ కుమార్‌తో నటించడం నిజంగా నా అదృష్టం. “రాగిణి” (1958) అనే చిత్రంలో ఆయనతో కలిసి నటించాను. చెప్పాల్సిన సంభాషణలోని చివరిభాగాన్నే ఆయన తరువాత సంభాషణ చెప్పవలసిన వారికి చెప్పి, ఆ మాట ముగియగానే “మీ సంభాషణ చెప్పాలి” అంటారు. ఆ నటుడో, నటీమణో ఆ మాటకోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు. తీరా అశోక్ కుమార్ గారు ఆ మాటను మార్చేసి ఏదో మరో మాట అనేస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఆయనతో నటించే నటీనటులు కొంత తడబడడం కద్దు. ఆయనను అర్థం చేసుకున్నవారు నటనలోనే కాదు - సంభాషణల్లో కూడా ఆయన చతురులు. ఆయన మాట్లాడుతుంటే ఎంత సేపైనా వింటూ ఉండిపోయేవాళ్లం.

చెన్నెí పిటాడల్ స్టూడియోలో తయారైన “పాయల” (1957) హిందీ చిత్రంలోనే సునీల్‌దత్‌కు చెన్నెí వారి సినిమాల్లో పని చెయ్యడం ఆరంభమైంది. ఆ చిత్రంలో నేను సునీల్‌దత్ పక్కన హీరోయిన్‌గా నటించాను. ఆయన సాధారణంగా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. సెట్‌లో ఒక మÖలకు పోయి కూర్చునేవారు. చాలా బిడియపడే వారు. మేమందరం ఆయనతో సరదాగా మాట్లాడుతూ, నవ్వుతూ, కవ్విస్తూ ఆయన బిడియాన్ని పోగొట్టే వాళ్లం. ఏమిటో... వాళ్లందరూ పోయారు. మనసు చాలా ఒంటరిదై పోయింది.

“మహాభారత” అనే చిత్రంలో నేను దారాసింగ్‌తో నటించాను. ఆ చిత్రంలో ఆయన భీముడి పాత్ర ధరించారు. ఒక దృశ్యంలో ఆయన నన్ను రథంలోంచి ఎత్తి నేల మీద నిలబెట్టాలి. ఆ దృశ్యంలో నన్నొక పసిపాపను ఎత్తినట్టు ఎత్తి నేలమీద నిలబెట్టేశారు ఆయన. నేను ఆశ్చర్యపోయాను ఆయన దేహ దారుఢ్యాన్నీ, బలాన్నీ చూసి. ఆయన అభిమానుల్లో నేనొకతెను. ఆయన కుస్తీ పోటీలు చెన్నెíలో జరిగేటప్ప్పుడు నేను ఎంత బిజీగా ఉన్నా తీరుబడి చేసుకుని వెళ్లేదాన్ని. ఈ సంగతి ఆయనతో, ఆ సినిమాలో నటిస్తున్నప్ప్పుడు చెబితో ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన అందుకు చెప్పిన జవాబు నన్నుర మరింత ఆశ్చర్యపరిచింది.

“నేనూ మీ అభిమానినే. మీతో నటించాలన్నది నాకు చాలాకాలంగా వున్న కోరిక. అది నెరవేరింది” అన్నారాయన. దారాసింగ్  దేహం ఎంత దృఢమైనదో ఆయన మనసు అంత మెత్తగా ఉండేది.

హిందీ నటుల్లో నటనలో ఆరితేరిన చక్కని నటుల్లో రాజ్‌కుమార్ ఒకరని నా అభిప్రాయం. ఆయనతో “వాస్‌నా” అనే చిత్రంలో నటించాను. సెట్‌కు వచ్చారంటే ఆయన తన దృష్టినంతా తాను నటించవలసిన దృశ్యం మీదా, చెప్పాల్సిన సంభాషణ మీద మాత్రమే కేంద్రీకరించేవారు. చిత్రీకరణకు ముందు తను చెప్పాల్సిన సంభాషణను అనేకసార్లు చెప్పి చూసుకునేవారు.

రాజ్‌కుమార్ తనకు నచ్చిన సందేహాలను మనసులో దాచుకునేవారు కాదు. “ఈ సంభాషణ ఇలా ఎందుకు చెప్పమన్నారు? ఈ విధంగా ఎందుకు నటించమన్నారు” అని ఆయన దర్శకులను అడుగుతూనే ఉండేవారు. సంతృప్తికరమైన జవాబు వచ్చి, ఆయన సందేహం నివృత్తి అయ్యేదాకా దృశ్య చిత్రీకరణలోకి వచ్చేవారు కారు. తనకు తోచిన మంచి అభిప్రాయాలను తెలియజేయడంలో ఆయన వెనుకాడేవారు కాదు. “ఇక్కడ ఇలా ఉండేకన్నా ఇలా ఉంటేనే బావుంటుంది” అని సలహాలు కూడా ఇస్తూ వుండేవారు. ఆయన నటన చూస్తూ మైమరచి ఎన్సోసార్లు అలాగే నిలబడిపోయేదాణ్ణి నేను.

“వాస్నా” లో ఒక దృశ్యం ఉంది. దీపావళి రోజున వెలిగించిన దీపాలు మీద రాజ్‌కుమార్ మÖర్ఛవచ్చి పడిపోవాలి. ఆ దృశ్య చిత్రీకరణలో ఆయన నిజంగానే దీపాలమీద పడిపోయారు. నేను నిర్ఘాంతపోయాను. మొరక నటుడైతే దీపాల మీద పడుతున్నట్లుగా నటించి పక్కన పడేవారు చూసుకుని. నటనలో అంత శ్రద్ధ తీసుకుని నటించేవారు చాలా తక్కువమంది ఉంటారు. నటునిగా ఏ పని చెయ్యడానికైనా, ఎంత కష్టపడడానికైనా వెనుకాడేవారు కాదు ఆయన.

ఇక ధర్మేంద్ర గారితో కలిసి “కాజల” (1965) చిత్రంలో నటించాను. ఆకారంలోనూ, నడకలోనూ, భావ ప్రకటనలోనూ కథానాయకునికి వుండాల్సిన లక్షణాలన్నీ నూటికి నూరు పాళ్లూ ధర్మేంద్రలో వుండేవి. నాయికను ‘కౌగిలించుకున్నట్టు నటిస్తే చాలు’ అని దర్శకులు చెబితే చాలు. ఆయన నాయికను గట్టిగా కౌగిలించేసుకునేసేవారు. అయితే సంజీవ్‌కుమార్ గారి స్వభావం ధర్మేంద్ర స్వభావానికి పూర్తిఈగా వ్యతిరేకం. ఒక దృశ్యంలో హీరోయిన్ భుజం మీద చెయ్యి వేయవలసి వచ్చిందనుకోండి. డైరెక్టర్ వచ్చి ఆయన చేతిని తీసి, నాయిక భుజం మీద వెయ్యాలి. అంత సిగ్గు వుండేది ఆయనకు.

రాజేంద్రకుమార్ గారితో నేను మొదటిసారిగా “మేరానామ్‌జోకర” (1970) చిత్రంలో నటించాను. నాతో ఆయన ఎప్ప్పుడు మాట్లాడినా వచ్చీరాని తమిళంలోనే మాట్లాడేవారు. ఆయన చాలా నిగర్వి. తను పెద్ద నటుడిననీ, ప్రఖ్యాత హీరోననీ ఆయన భావించేవాడు కాదు. అందరితోనూ కలిసిపోయేవార. అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్లినపుడు తోటి నటీనటులకు కుర్చీలు వెయ్యడం, టీలు అందివ్వడం లాంటి పనులు ఆయన చెయ్యడం నేనెన్నో సార్లు చూసి వుంటాను.

1953 లో చెన్నెíలో తారల క్రికెట్ పోటీ జరిగింది. అందులో పాý£్గనడానికి రాజ్‌కపూర్, నర్గీసు వచ్చారు. మా చెల్లెలు రాగిణికి నర్గీస్ అంటే వెర్రి అభిమానం. మేమంతా రాజ్‌కపూర్, నర్గీస్‌లతో కలిసి ఫోటో తీయించుకున్నాం. అప్ప్పుడే నేను రాజ్‌కపూర్‌ను మొట్టమొదటి సారి చూడ్డం, మాట్లాడ్డం. ఆ తర్వాత రాజ్‌కుమార్, నర్గీస్ ఏ.వి.యం. వారి “చోరీచోరీ” చిత్రంలో నటించడానికి చెన్నెí వచ్చారు. అప్ప్పుడు వారితో నర్గీస్‌కు శిరోజాలంకరణ చేసే ఆమె కూడా వచ్చారు. ఆమెకు హోటల్‌లో గది దొరకనందువల్ల మా ఇంట్లో దిగారు. అప్ప్పుడు నర్గీస్ మా ఇంటికి తరచూ వచ్చేవారు. చాలాసార్లు మా ఇంట్లోనే మేకప్ వేసుకుని స్టూడియోకు వెళ్లేవారు. అలా రాజ్‌కపూర్‌తో కూడా సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన మా కుటుంబానికి స్నేహితులయ్యారు.

మా అక్కయ్య లలిత వివాహం జరిగిప్ప్పుడు రాజ్‌కపూర్‌న” కూడా ఆహ్వానించాము. ఆ వివాహానికి వచ్చిన రాజ్‌కపూర్ మా అమ్మగారితో  తన తరువాత చిత్రంలో నాకు కథానాయిక పాత్ర ఇద్దామనుకుంటున్నానని చెప్పారు.  మా అమ్మగారు అందుకు అంగీకరించలేదు. కానీ రాజ్‌కపూర్ పట్టుపట్టగా ఆలోచించి చెప్తానన్నారు మా అమ్మగారు. రాజ్‌కుమార్ తండ్రి పృథ్వీరాజ్‌కపూర్  గారికి మా అమ్మగారు చెప్పిన జవాబు తెలిసిందట. ఆయన ఫోన్ చేశారు మా అమ్మగారికి.

“రాజ్ తియ్యబోయే ఈ చిత్రం చాలా చక్కని కథాత్మక చిత్రం. అందులో మీ అమ్మాయికి ఇవ్వదలుచుకున్న వేషం చాలా మంచి వేషం. మీ అమ్మాయి ఈ చిత్రంలో నటించడానికి అనుమతి ఇవ్వండి” అని అడిగారాయన. మా అమ్మగారు సమ్మతించారు. అదే “జిస్‌దేశ్‌మే గంగాబెహతీహై” (1960). ఆ చిత్రంలో నటించేటప్ప్పుడే రాజ్‌కపూర్‌తో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది.

రాజ్‌కపూర్ గొప్ప కళాకారుడు, మేధావి. ఆయన రాత్రి పది గంటల తర్వాత ఆర్.కె.స్టూడియోలోని తన గదిలో కూర్చుని సిగరెట్టు కాలుస్తూ ఆలోచిస్తూ వుండేవారు, గబుక్కున ఓ పాటకు ట్యూన్ తడుతుంది. వెంటన హార్మోనీ తీసుకుని తనే మనసులోని ఆ బాణీని హార్మోనీ మెట్లమీదకి మళ్లించేవారు. దాని ఆధారంగా ఒక బాణీ చెయ్యమంటారు. అంతే వారి చిత్రానికి ఒక బాణీ సమకూరిపోయినట్టే.  ఇలా చాలా మటుకు పాటకు రాజ్‌కపూరే బాణీలు అందించేవారు. దాని ఆధారంగానే టూన్లు తయారయ్యేవి.  

స్టూడియోకు వచ్చినపుడు స్టూడియో గేటులోని ఘÖర్ఖా దగ్గరనుంచి, అక్కడ పనిచేసే పెద్ద అధికారి వరకూ అందరినీ సాదరంగా పలుకరించేవారు రాజ్‌కపూర్.

తనకు సంతృప్తి కలిగేదాకా రాజ్‌కపూర్ ఒకే దృశ్యాన్ని తిరిగి తిరిగి చిత్రించేవారు. ఏ సంతృప్తి మొదటి టేక్‌లోనే కలగొచ్చు. చాలా టేకులైనా సరే, కలగక పోనూవచ్చు. ఒకసారి ఒక దృశ్యంలో నేనూ, చంచల్ తాళయుక్తంగా అడుగులు వేస్తూ నృత్యం చెయ్యాలి.

చంచల్ నృత్యం చెయ్యడం ఆరంభించింది. ఒకటి, రెండు, మÖడు, పది, ఇరవై... ఇరవైసార్లు చిత్రీకరించినా రాజ్‌కపూర్ సంతృప్తి చెందలేదు. తిరిగి తిరిగి తీస్తూనే వున్నారు. చంచల్‌కు ఏడుపు వచ్చేసింది. ఆమె కాళ్లు రక్తమయం అయ్యాయి. ముప్ఫయ్యవసారి తీసింది ‘ఓకె’ అన్నారు రాజ్‌కపూర్. చాలా చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకునే వారాయన.  

అదే చిత్రంలోని ‘ఓ బసంతి...’ అన్న పాట చిత్రీకరన మధ్యప్రదేశ్‌లోని ఒక చోట జరిగింది. అక్కడంతా పాలరాళ్లు చెప్ప్పులు వేసుకుని నడిస్తే కాలు జారిపోతుది. పైన ఎండ పేల్చేస్తోంది. ఆ దృశ్యంలో నటించిన తర్వాత నా కాళ్లన్నీ వాచిపోయాయి.  షూటింగ్ ముగియగానే, వేడి నీళ్లు పెట్టించి రాజ్‌కపూరే స్వయంగా నా కాళ్లు కాపడం పెట్టారు. ‘నర్స’ లా నాకు సపర్యలు చేశారు. నేను వద్దని ఎంత వారించినా వినలేదు. “ఇప్ప్పుడు నువ్వు నా చిత్రంలో నటిస్తున్నావు. నీ కష్టాన్ని నా కష్టంగా భావించాల్సిన బాధ్యత నాకున్నది” అన్నారాయన.

ప్రతి చిత్రానికీ ‘టెస్టు’ తీసి చూస్తారు రాజ్. ఆ సినిమాలో నటించే ముందే నాకు నూటయాభై సినిమాల్లో నటించిన అనుభవమున్నది. ఆ సంగతి ఆయనకు తెలుసు. అయినా ఆ పాత్రకు నేను సరిపోతానా? అనే విషయం తేల్చుకోవడానికి ఒక టెస్టు తీసి చూడాలని చెప్పారు రాజ్. ఏమని గానీ, ఎందుకనిగానీ ప్రశ్నించడానికి వీళ్లేదు ఆయననను. కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉండేవారు. అలాగే రిహార్సలు వద్దని అనడానికీ వీలు లేదు. ఆయన మాటే అక్కడ చట్టం, శాసనం. దాన్ని ఎవరూ మార్చడానికి వీలు లేకుండా ఉండేది.

సెట్‌లో ఉన్నప్ప్పుడు అంత గంభీరంగా ఖచ్చతంగా ఉండే రాజ్ ను తీరికవేళలలో చూసినవారికి చిన్నపిల్లాడిలా కన్పించేవాడు. అందరితోనూ హుషారుగా కబుర్లు చెబుతూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవాడు. అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్లినప్ప్పుడు నటీనటుల పెట్టేబేడా తనే కార్లలో పెట్టబడం కాఫీలను అందించడం వంటివి చెయ్యడానికి వెనుకాడేవారు కాదు. సెట్ బయటకొస్తే, ఆయన అందరికి స్నేహితుడనే రాజ్ చాలా సందడైన వ్యక్తి. పాటలు పాడగలరు, నృత్యం చెయ్యగలరు, చక్కటి కథలు చెప్పగలరు. అయితే సెట్‌లోపల మాత్రం ఈ స్నేహితులంతా ఆయన ఆజ్ఞలను అక్షరాలా శిరసావహించాల్సిందే.

అయితే రాజ్‌కపూర్ అప్ప్పుడప్ప్పుడూ కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలుచేసేవారు. వాటిని భరించలేకపోయేదాణ్ణి. ఒకసారైతే నేను అమెరికాకు ఉన్నట్టుండి వెళ్లిపోవాల్సి వచ్చింది. అంత బాధపెట్టాడాయన. అదంతా గతం...

నేను ఒక అంతర్జాతీయ చిత్రంలోనూ నటించాను. ఇండియా-రష్యా సంయుక్త నిర్మాణం. అద్భుత కళాఖండంగా పేరొందిన హిందీ, రష్యన్, ఇంగ్లీషు భాషలలో నిర్మించిన “పరదేశి” చిత్రమది. ఈ చిత్రంలో ఎక్కువమంది రష్యన్ తారలే నటించారు. నాకు మాత్రం ఈ చిత్రం అన్ని దేశాల్లోనూ పేరు తెచ్చింది. నేను గ్లామర్ హీరోయిన్‌గా నటించిన చివరి చిత్రం రాజ్‌కపూర్ నిర్మించిన “మేరానామ్ జోకర” (1970). ఆ తర్వాత చాలా తమిళ, మలయాళ చిత్రల్లో అమ్మ, అమ్మమ్మ వేషాలు కూడా వేశాను. నేను నటించిన చివరి చిత్రం అరవిందన్ తీసిన “వస్తుహర” (మలయాళం). అరవిందన్ చివరి చిత్రం కూడా అదే.

1961 లో డా॥టి.కె.రామచంద్రన్ గారితో వివాహమయ్యింది. గురువాయÖర్ శ్రీకృష్ణాలయలో మా పెళ్లి జరిగింది. సినిమాల్లో వుంటూ బయటి వ్యక్తుల్ని పెళ్లాడిన తొలితారను నేనే. 1971 లో మా వారితో కలిసి అమెరికా వెళ్లిపోయాను. అక్కడ న్యూజెర్సీలో ‘పద్మినీ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స’ అనే పేరుతో శాస్తీయ నృత్యశిక్షణ సంస్థను ప్రారంభించాను. తర్వాత ఆ సంస్థకు న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్టాల్లో ఎనిమిది శాఖల్ని ప్రారంభించాను. అమెరికాలో అచ్చమైన భరతనాట్యం నేర్పే సంస్థలలో ఒకటిగా దానికి పేరుండేది. పెళ్లయిన తర్వాత అప్ప్పుడప్ప్పుడూ చెన్నెí వచ్చేదాన్ని. నాకు ఒక్కడే కొడుకు. ప్రేమానంద్. అమెరికాలో స్థిరపడి వార్నర్ బ్రదర్స్‌లో పని చేస్తున్నాడు. తను కూడా కొన్ని డాక్యుమెంటరీ చిత్రాలు తీశాడు.

1981 లో ఉన్నట్టుండి మా వారు పోయారు. ఆ విషాదంలో నుంచీ కోలుకోలేకపోయాను. అంతలోనే నా ప్రాణానికి ప్రాణమైన మా అక్కయ్య లలిత 21-11-1982 లో మరణించింది. ఆ తర్వాత మా చెల్లెలు రాగిణి పోయింది. ఆ విషాదాలు నా జీవితాన్ని మానసికంగా కృంగదీశాయి.

మా రాగిణి నటించిన చివరి చిత్రం “ఆలింగనం” (మలయాళం), తను చనిపోయేనాటికి డబ్బింగ్ మిగిలివున్నది. వేరే ఆర్టిస్టులతో డబ్బింగు వర్క్ పూర్తి చేద్దామని నిర్మాతలు ఆలోచిస్తుండగా నేను వద్దని చెప్పాను. అమెరికా నుండీ వచ్చి మా చెల్లెలు  పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాను. అదే మా రాగిణికి నేనిచ్చిన అంతిమ నివాళి.

మాకు నటవారసులు లేరు. అయితే ఆనందం కలిగించే విషయం మా తమ్ముడి కుమార్తె శోభన మా కళను అందిపుచ్చుకుని నటిగా, నర్తకిగా రాణించడం నాకు చాలా ఆనందాన్ని కల్గిస్తుంటుంది.

నేను మొదటి నుండీ కూడా అవార్డులకు దూరం. తమిళనాడు ప్రభుత్వం ‘కళైమామణి’ అవార్డు, ఫిలింఫేర్ సీనియర్ ఆర్టిస్టు అవార్డు, అమెరికాలోని భారత్ కళాచార్ సంస్థవారి ‘విశ్వకళాభారతి’ బిరుదు అందుకున్నారు. అయినా ఇవన్నీ లెక్క కాదు. తమిళ ప్రేక్షకులు నన్ను ‘నాట్యరాణి’ అని సంబోధిస్తూ గుర్తు చేసుకుంటుంటారు. నా దృష్టిలో అదే పెద్ద అవార్డు.

ప్రస్తుతం సినిమాలకు నాట్యానికి (వయసు రీత్యా) దూరంగా ఉన్నాను. ఇతర వ్యాపకాలేవీ లేవు. వైజయంతీమాల, రాజశ్రీ, సుకుమారి అప్ప్పుడప్ప్పుడూ పలుకరిస్తుంటారు. అయితే వ్యక్తిగతంగా నాకు బి.సరోజాదేవి అంటే చాలా ఇష్టం. నేను అమెరికా నుండి చెన్నెí వచ్చినపుడు అదేపనిగా బెంగుళూరు నుండీ వచ్చి నన్ను పలుకరించి వెళ్తుంటుంది. ఏదో నాట్యం కోసమని యాభై ఏళ్లముందు వచ్చిన మా ముగ్గురు సోదరీమణుల్ని ఇన్నాళ్లూ కడుపులో పెట్టుకొని కాపాడుకున్న చెన్నెí అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నా మిగిలిన జీవితాన్ని ఇక్కడే గడుపుదామనుకుంటున్నాను. 

(పద్మిని 24-09-2006 న చెన్నెíలో మరణించారు).


సుజాత.....సినీ మత్స్యగంధి

‘హైలో హైలెస్సా...’ అంటూ శంనుని మనసేగాక ఆంధ్రప్రదేశ్ లోకాన్నంతా జమునారాణి కంఠం సహాయంతో ఉర్రూతలూగించిన సినీ మత్స్యగంధి సుజాత.

సినిమా, నాటకం, గాత్రధారణ... ఈ మÖడు రంగాల్లోనూ విశేష ప్రతిభ కనబరచి ప్రేక్షక హృదయాల్లో ఇప్పటికీ ‘భీష్మ’ సుజాతగా నిలిచిపోయిన నిన్నటి తరం నటి సుజాతతో కాసేపు...

మా సొంతవూరు తెనాలి సమీపంలోని చినరావూరు. సూరయ్య, శ్రీమతి వెంకటరత్నమ్మ గార్లు నా తల్లిదండ్రులు. మాది మొదటి నుంచీ వ్యవసాయ కుటుంబమే! నాకు ఇద్దరు అన్నయ్యలు. వాళ్లకు చెల్లెలు నేనొక్కదాన్నే కావడంతో నన్ను చాలా గారాబుగా చూసుకునే వారు. మా అమ్మ కూడా నన్ను ఒక కళాకారిణిగా ఎదిగితే చూడాలని ఆశపడేది. అందుకే నాకు చిన్నప్పటి నుంచీ సంగీతం, నాట్యం నేర్పించాను. ఆ రోజుల్లో ఎం.ఎస్.శైవ అని ఓ నాట్యాచార్యుడుండేవారు. ఆయన దగ్గర నాకు నాట్యశిక్షణ ఇప్పించారు. ఆయన అప్ప్పుడు గుంటూరులో ఉండేవారు. ఆయన దగ్గర డాన్సు నేర్చుకోవడం కోసమనే నన్ను గుంటూరులో పెట్టారు మా అమ్మానాన్నలు. ఆ తర్వాత శైవా గారే తెనాలి రావడంతో ఇక నాకు సమస్య లేకుండా పోయింది. ఆయన దగ్గర కూడిచూడి డాన్సు నేర్చుకున్నాను. నా ఐదవ ఏటనే డాన్సు ప్రోగ్రామ్స్ ఇవ్వడం ప్రారంభించాను. నా అసలు పేరు సరోజిని. అయితే తెనాలిలో వి.సాంబశివరావు గారని ఉండేవారు. ఆయన నాట్యప్రదర్శనలు చూసి ముగ్ధులై, మా అమ్మానాన్నలతో మాట్లాడ ‘బేబీ సుజాత Ê పార్టీ’ అనే పేరుతో ఓ డాన్స్ ట్రూప్ పెట్టి నా పేరు సుజాతగా మార్చారు. 

నా విద్యాభ్యాసం అంతా తెనాలిలోని మునిసిపల్ గర్ల్స్ హైస్కూలులో సాగింది. ప్రముఖ సినీనటి ఊర్వశి శారద ఆ పాఠశాలలో నా సహాధ్యాయి. మేమంతా స్కూలు నాటకాల్లో చాలా చురుగ్గా పాý£్గనే వాళ్లం. ఓ సారి శకుంతల నాటకం వేస్తే, అందులో నేను దుష్యంతుడిగా నటించాను. శారద ఆశ్రమ బాలిక పాత్ర ధరించింది. నేను బాగా డాన్సు చేస్తానని పాఠశాలలో నన్ను బాగా చూసుకునేవారు టీచర్లు. నా 11వ ఏటనే నా నృత్యకౌశలాన్ని చూసి నాకు భువనగిరిలో నృత్య ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం వచ్చింది. వయసు చాలకపోయినా నెలకు రూ.300/-లు జీతంతో నేను భువనగిరిలో పనిచేశాను. మా అమ్మ, నాన్నలు నా ఉత్సాహాన్ని చూసి నాతో పాటే అక్కడకు వచ్చేశారు.

నేను తెనాలిలోనే ఫోర్త్ ఫారం వరకూ చదువుకున్నాను. ఆ బడిలోనే సరస్వతి గారని ఓ తెలుగు టీచరు ఉండేవారు. ఆమె కూతురికి నేను డాన్సు నేర్పేదాన్ని. ఆమెకు వినోదా సంస్థ అధినేత డి.ఎల్.నారాయణ గారు తెలుసు. ఆయన ఆ సమయంలో “సిపాయి కూతురు” అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అందులో వాంప్ వేషానికి తగిన యువతి కోసం అన్వేషిస్తూ తెనాలిలో ఎవరైనా ఉంటే చెప్పమని సరస్వతి గారిని అడిగారు. ఆమె ఆలోచించి చెప్తానన్నారట. ఆమె ఇదే విషయాన్ని మా ఇంట్లో చెప్పి నన్ను చెన్నెíకు తీసుకువెళ్ళమన్నారు. నాకు కూడా చిన్నప్పటినుండీ సినిమాలంటే ఇష్టమే! పైపెచ్చు జమునగారంటే విపరీతమైన ఆరాధన. ఆమె స్టెíల్‌ను అనుకరించేదాన్ని. జమునగారిని దగ్గరగా చూడాలని, ఆమెను అక్కా అని పిలవాలని తెగ ఆరాటపడేదాన్ని. సినిమాల్లోకి వస్తే ఆ కోరిక తీరుతుందేమోననే ఆశతో సినిమాలపై మోజు పడ్డాను. కానీ మా నాన్న, అన్నయ్యలు ససేమిరా కాదన్నారు. మా కుటుంబాల్లో తర్జనభర్జనలు జరిగాయి. ఎట్టకేలకు మా అమ్మగారి పట్టుదలతో సినిమాల్లో చేరడానికని చెన్నెí వచ్చాం. డి.ఎల్.నారాయణ గారు నన్ను చూసి మరీ చిన్నపిల్ల, మళ్లీ ఎప్ప్పుడైనా చూద్దాంలే అనేసి, ఆ పాత్రకు ఎల్.విజయలక్ష్మిని తీసుకున్నారు. ఆమెకూ అదే మొదటి సినిమా.

సరే ఇక ఏం చేద్దాం అని ఆలోచిస్తుండగా నాకు చిన్నతనంలో నాట్యం నేర్పిన ఎం.ఎస్.శైవ గారు అప్ప్పుడు చెన్నెíకే వచ్చేశారని తెలిసింది. మా అమ్మావాళ్లు ఇంకా బాగా నాట్యం నేర్చుకోమని వారి వద్ద చేర్చారు. సరేనని నేనూ డాన్సు కొనసాగించాను. శైవాగారి దగ్గరకు నాటకాల వాళ్లు, సినిమాల వాళ్లు అప్ప్పుడప్ప్పుడూ వచ్చిపోతుండేవారు. అలా ఓసారి నాగభూషణం గారు వస్తే, శైవగారు నన్ను వారికి సిఫారసు చేశారు. అలా ఆ నాటకంలో ఇందిర పాత్రకు నన్ను తీసుకున్నారు. ఆ పాత్రను నాకు ముందు శారద గారు వేసేవారు. నా తర్వాత వాణిశ్రీ గారు వేస్తూవచ్చారు. ఆ నాటకం నాకు మంచి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. ఈ నాటకం పాపులర్ కావడంతో అడపాదడపా సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అలా “భక్త అంబరీష” (1959) చిత్రంలో మొట్టమొదటిసారిగా ఈలపాటు రఘురామయ్య గారి సరసన శ్రీమహాలక్ష్మి పాత్రలో కన్పించాను. వెంటనే “దీపావళి” (1960) లో రంభగా చేశాను. ఆ తర్వాత నాగన్న అని ఓ నిర్మాత “నాగార్జున” (1963) అని ఓ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో తీశారు. ప్రముఖ కన్నడ హీరో రాజ్‌కుమార్ గారు అందులో అర్జునుడిగా వేశారు. కాంతారావు గారు శ్రీకృష్ణుడిగా వేశారు. అందులో నేను సుభద్రగా నటించాను. జి.వరలక్ష్మి గారు ఉలూచి వేషం వేశారు. ఆ సినిమా తర్వాత “కన్నకొడుకు” (1961) అనే చిత్రంలో రాజనాల సరసన నటించాను. ఆ పాత్ర కథానాయిక కిందే లెక్క. బి.ఏ.సుబ్బారావు గారు “భీష్మ” (1962) చిత్రంలో మత్స్యగంధి పాత్రను ఇచ్చారు. ఆ వేషానికి మొదట సత్యవతి (రచయిత అనిసెట్టి సతీమణి) గారిని అనుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల ఆమె విరమించుకుంటే ఆ అవకాశం నాకు లభించింది. అప్పట్లో నాకు పంటిమీద పన్ను ఉండేది. సుబ్బారావు గారు ఆ పాత్రకోసమనే ఆ పళ్లు బాగాలేదని దాన్ని కరిగించేసి, మళ్లీ ఏదో క్యాప్ వేసి చాలా శ్రద్ధ తీసుకున్నారు. ‘హైలో హైలెస్సా...’ పాట నా మీద చిత్రీకరించారు. జమునారాణి గారు ప్లేబాక్. ఆంధ్రదేశాన్ని అదరగొట్టేసిందా పాట. ఇప్పటికీ అభిమానులు నన్ను మీరు ‘భీష్మ’ సుజాత గదా అని గుర్తు పట్టి పలుకరిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వాలి (ఆర్టు డైరెక్టరు), హరిబాబు (మేకప్ మాన్) గార్లు చాలా శ్రద్ధతో సత్యవతి పాత్రను రూపొందించారు. ఎన్‌టి.రామారావు గారికి తల్లి వేషం. నాదేమో చిన్న వయసు. అయినా బి.ఏ.సుబ్బారావు గారు చాలా ధైర్యం చేసి ఆ పాత్ర ఇచ్చారు. నేనూ మంచి ఫెరఫామెన్సే ఇచ్చాను. ఈ సినిమా సెట్లోనే ఎన్.టి.రామారావు గారు “సుజాత గారూ! బాగా చేయండి. మంచి వేషం, మంచి పేరొస్తుంది” అని ఆయన స్టెíల్‌లో గంభీరంగా అన్నారు. ఆయన మాటే నిజమయ్యింది.  ఆ పాత్ర ఈనాటికీ తెలుగు సినిమా చరిత్ర పుటలలో నిలిచిపోయేంతగా నాకు మంచి బ్రేక్ ఇచ్చింది.

“భీష్మ” చిత్రం నాకు పేరైతే తీసుకువచ్చింది గానీ వెంటనే అవకాశాలు మాత్రం తీసుకురాలేదు. మరి ఖాళీగా ఉండలేం కదా. ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం గారి ట్రూపులో చేరి “శ్రీకాళహస్తి మహాత్మ్యం”, “శాంతినివాసం” నాటకాల్లో నటిస్తూ వచ్చాను. అదే విధంగా వల్లం నరసింహారావు, జి.వరలక్ష్మి, శారద మొదలైన వారితో ‘మనోహర’ నాటకంలో నటించాను. ఆ నాటకానికి నాకు చ ఆలా మంచిపేరు వచ్చింది. అప్ప్పుడే జి.వరలక్ష్మి గారు నటనలో మెళుకువలు ఎన్నో నేర్పారు. సంభాషణలు ఉచ్చరించే విధానం నేర్పారు.

ఇలా నాటకాల్లో బిజీగా ఉన్నరోజుల్లోనే కన్నడ చిత్రసీమలో మంచి అవకాశాలు వచ్చాయి. “గౌరి” అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించాను. ఈ చిత్రంలో డా॥షావుకారు జానకి గారు నాకు తల్లిగా నటించారు. ఆమెతో నటించడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఆమె తీరిక దొరికినప్ప్పుడల్లా ఇలా నటించాలి, ఇలా డైలాగ్ చెప్పాలి అని చెప్పించేవారు. నిజానికి ఆ వయసులో మాకు అవి లెసన్స్‌లాంటివి. ఇంకా “సతిశక్తి”, “రణధీర కంఠీరవ” తదితర కన్నడ చిత్రాల్లో నటించాను. తెలుగులో “మదనకామరాజుకథ” (1962), “పరువు ప్రతిష్ఠ” (1963), “బంగారుపక్షులు” ఆ రోజుల్లో చాలా పాపులర్. ఆ నాటకాన్ని ఓసారి చెన్నెí, వాణీమహల్‌లో ప్రదర్శించారు. నేను, మణిమాల అందులో హీరోయిన్లుగా నటించాం. ఇంకా అందులో ఎస్.వి.రంగారావు, శారద, రామృష్ణ మొదలైన వారంతా నటించారు. ఆ నాటకాన్ని చూసే వి.మధుసూదన రావు “వీరాభిమన్యు” (1965) లో అవకాశం ఇచ్చారు. మొదట ఆ పాత్రకు వాణిశ్రీ గారి ననుకున్నారు. కానీ ఆ సమయంలో ఆమె బిజీగా ఉండడంతో నన్ను తీసుకున్నారు. అభిమన్యుడు స్తీ రూపంలో ఉత్తరను సమీపించే పాత్ర అది. నాకు, కాంచనకు ఆ చిత్రంలో ఒక పాట కూడా ఉంది. ‘తాకిన చోట చల్లదనం...’ అనే పాట అది 

ఈ “పంజరంలో పక్షులు” నాటకంలోనే పిఠాపురం రాజావారి మనవడు ఎం.ఎం.కె.అప్పారావు గారు ప్లేబాక్ పాడారు. ఆ నాటక ప్రదర్శనకు పెట్టుబడి కూడా ఆయనదే. ఆయన నాటకంలో నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ పెళ్లితో నేను విజంగానే పంజరంలో పక్షినై పోయాను. రాజావారు నన్ను సినిమాలు మానేయమని ఆంక్ష విధించారు. అప్ప్పుడు “వీరాభిమన్యు” షూటింగ్ జరుగుతోంది. సినిమాలు మానేస్తున్నానని తెలిసి శోభన్‌బాబు గారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమన్నారు. సినిమాలు మానేస్తే చాలా కష్టాలు పడాల్సివస్తుందని చాలా దూరం చెప్పిచూశారు. కానీ నేను మానుకోవాలనే నిర్ణయానిచ్చేశాను. అ్పటికే, “వీరాభిన్ము” షూటింగు అయిపోయిన తర్వాత వాహినీ స్టూడియోలో అందరికీ చెప్పేసి, ఫ్లోర్ నుండీ వస్తూవస్తూ, ఇక సినిమాల్లోకి రాను, ఒకవేళ వచ్చినా ఏ అమ్మ వేషాలకో, బామ్మ వేషాలకో వస్తానేమోనను కుంటూ బాధతో వచ్చేశాను. పెళ్లితో సినిమా జీవితం పూర్తిగా ముగిసిపోయింది. అంత్ణపుర జీవితం, ఘోషా పద్ధతి... ఎవ్వరినీ కలిసేందుకు కూడా వీలుండేది కాదు. నాకేమో ఇంట్లో ఖాళీగా కూర్చోవడం మొదటి నుంచీ ఇష్టముండేది కాదు. 1967 లో నాకు ఒక కొడుకు పుట్టాడు. బాబుకు ఒకటిన్నర సంవత్సరం వయసు వచ్చాక ఇక అసలు ఇంట్లో ఉండలేకపోయాను. సరేనని ఎలాగో రాజావారిని ఒప్పించి ప్రాధేయపడి ఆంధ్రమహిళాసభలో బెనారస్ మెట్రిక్‌లో చేరాను. అక్కడే షావుకారు జానకి గారి కూతురు యజ్ఞప్రభ, ప్రముఖ సినీనటి శ్రీవిద్య నాకు క్లాసుమేట్సు, అక్కడ చదువుకుంటున్నప్ప్పుడే ఓ రోజు షావుకారు జానకి గారు తమ కూతురిని ఇంటి తీసుకువెళ్లడానికి కాలేజికి వచ్చారు. అక్కడే వాళ్లందరూ సినిమా నటి వచ్చిందని ఆవిడ ఆటోగ్రాఫుల కోసం, ఫోటోల కోసం ఎగuడ్డారు. అది చూసిన నాకు మళ్లీ ఒక ఆలోచన ప్రారంభమయ్యింది. ఈ వయస్సులో మనం చదువుకొని ఏం ఉద్యోగాలు చేస్తాం... సినిమా స్టార్‌లకి ఇంత క్రేజీ వుంటుందా? నేనూ ఒకప్ప్పుడు సినిమా నటినే కదా? అని అనుకున్నాను. మళ్లీ నాలో అణచబడి ఉన్న కళాపిపాస పైకి లేచింది. ఇదే విషయాన్ని మా వారితో చెప్పాను. వారు ససేమిరా కాదన్నారు. సరే బాబును మా అమ్మ, చూసుకుంటూ ఉండడంతో నేను సినిమాల్లో కాకపోయినా ఏదైనా ఉద్యోగమైనా చేద్దామనుకున్నాను. అలా వరల్డ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌లో రిసెప్షనిస్టుగా చేరాను. అలా ఆ అంత్ణపురం నుండీ బయటపడి కాస్త ప్రపంచాన్ని చూవాను. ఆ సమయంలోనే నా జీవితం ఊహించని మలుపు తిరిగింది. రాజావారి అశ్రద్ధ వల్ల కుటుంబం ఆర్థికపరమైన ఒడిదుడుకులకు లోనైంది. గడవడం కొంచెం కష్టమయ్యింది. ఆస్తిపాస్తులన్నీ కోర్టు వ్వవహారాల్లో చిక్కుకున్నాయి. ఇంచుమించు దిక్కుతోచని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో ఋష్యేంద్రమణి గారు నాకు చాలా ఓదార్పునిచ్చారు. సినామల్లోకి రావాలనే తపన ఉన్నా, ఫీల్డు టచ్ పోయింది కనుక అవకాశం కోసం చాలా శ్రమపడాల్సి వచ్చింది. చివరకు ఇల్లు గడవడం కోసం పాటల రికార్డింగుల్లో కోరస్‌గా కూడా వెళ్లాను. చాలా నిస్సహాయురాలినైపోయాను. రాజావారు ఇల్లు పట్టించుకోలేదు. మా అమ్మ, నేను, చంటి పిల్లాడు...ఒక స్తీగా నేఏం చేయగలను? ఒక్కసారి ఆ పరిస్థితిని ఇన్నేళ్ల తర్వాత ఊహించుకున్నా గుండె ఝల్లుమంటుంది. ఎందుకంటే సినిమా రంగం చాలా చిత్రమైన ప్రపంచం, నక్షత్రాలు రాత్రే కన్పిస్తాయి. అవి పగలు కూడా కన్పిస్తే, వాటికి విలువ ఉండదు. అందుకే కాబోలు నటీనటుల్ని  తారలన్నారు. ఈ తారలు తెరమీద కనిపించినంత సేపే విలువ, గౌరవం. ఆ తర్వాత ఏమీ వుండదు. నాకూ అలాంటి పరిస్థితే పరిశ్రమలో ఎదురయ్యింది. 

మళ్లీ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాను. వేస్టు ఫిలిం రాజు గారు “అమ్మమాట” (1972) లో రాజబాబుకు తల్లివేషం ఇచ్చి ప్రోత్సహించారు. ఆ సమయంలోనే ఎన్.టి.ఆర్. గారిని వెళ్లి కలిసి విషయమంతా చెప్పాను. ఆయన చాలా సహృదయంతో స్పందించి తన నిర్మాతలంతా నా గురించి చెప్పారు. ఎస్.డి.లాల్‌గారు “నాపేరే భగవాన” (1976), “నిప్ప్పులాంటి మనిషి” (1974), “నేరంనాదికాదు ఆకలిది” (1976), “అన్నదమ్ముల అనుబంధం” (1977) చిత్రాల్లో మంచిపాత్రలే ఇచ్చి మళ్లీ నా జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి దోహదపడ్డారు. ఆ పరంపరలోనే వరసగా సుమారు అరవై చిత్రాలు “తులాభారం” (1974), “చిన్ననాటి స్నేహితులు” (1975), “దొరలు దొంగలు” (1976), “నాలాగ ఎందరో” (1977), “చిరంజీవి రాంబాబు” (1978), “శ్రీరామపట్టాభిషేకం” (1978), “తిరబడ్డ తెలుగుబిడ్డ” (1988) తదితర చిత్రాలు చేశాను. తెలుగులో నా చివరి సినిమా “జగన్నాటకం” (    ).

ఇక నేను చెప్పాల్సింది ప్రముఖంగా నాటకరంగం గురించి... నేను కష్టాల్లో కూరుకుపోయి ఏమీ చేయలేని క్లిష్టపరిస్థితుల్లో నన్ను తల్లిలా ఒడి చేర్చుకుంది నాటకరంగం.  సినిమాల్లో వేషాలకోసం ప్రయత్నించి విసుగు చెంది వేసారిపోయిన సమయంలో గుడిమెట్ల గంగరాజు గారు నన్ను నాటకరంగంలోకి ఆహ్వానించారు. ‘చింతామణి’ నాటకంలో చింతామణిగా చాలా పరేరు తెచ్చుకున్నాను. సూరవరపు వేంకటేశ్వర్లు, కాళిదాసు పురుషోత్తం, పద్మనాభం, మాడా... ఇలా అందరితోనూ చింతామణిగా నటించి విశేషమైన కీర్తి, డబ్బు సంపాదించాను. చెదిరిపోయిన గూడును తిరిగి కట్టుకుని మళ్లీ ఓ మాదిరి స్థితికి వచ్చాను. సినిమారంగంలో ఒకసారి పడిపోతే మళ్లీ లేవడం చాలా కష్టం. అందుకే కెరీర్ విషయంలో గానీ, డబ్బు జాగ్రత్త విషయంలో గానీ చాలా పట్టుగా ఉండాలి. జీవితాన్ని తెగిన గాలిపటాల్లా చేసుకోకూడదు. పైగా ఓనాడు ఇండస్టీలో ఓ వెలుగు వెలిగి చివరి రోజుల్లో తిండికి జరక్క భిక్ష ఎత్తుకొన్న నటీమణులు నాకు తెలుసు. వాళ్లను నేను చాలా దగ్గరగా చూశాను కూడా. తారల తళతళల వెనుక ఎన్ని వెలవెలలుంటాయో! అందుకే శోభన్‌బాబు గారు ఎప్ప్పుడూ అనేవారు - “సుజాత గారూ! పది మందికి ఇస్తూపోతే ఏదో ఒకరోజు మన చెయ్యి ఆ పుచ్చుకునే వాళ్ల జాబితాలోకి వచ్చేస్తుందని!” అది ఫాలో అయ్యాను. అలా సినీ జీవితానికి రామారావు, నిజ జీవితానికి శోభన్‌బాబు గార్లు నాకు మార్గదర్శకులు.

“చింతామణి” నాటకనాన్ని ఆంధ్రదేశమంతా సుమారు 200 ప్రదర్శనలు ఇచ్చి ఉంటాను. దీని తర్వాత నాకు పేరు తెచ్చిన మరో నాటకం “బాలనాగమ్మ” గాండ్లసంగు వేసేదాన్ని. ఈ రెండు నాటకాల్ని ఎల్.పి. రికార్డులుగా కూడా ఇచ్చాను. లలితబాబు (భవానీశంకరుడు), నేను ఇచ్చిన చింతామణి ఎల్.పి., వల్లూరు వెంకటరామయ్యచౌదరి (మాయలమరాఠీ), నేను ఇచ్చిన బాలనాగమ్మ ఎల్.పి. ఈ రెండూ ఆరోజుల్లో ఆంధ్రదేశంలో మార్మ్రోగిపోయాయి. అదే విధంగా స్థానం ననరసింహారావు. టి.జి.కమలాదేవి గార్లతో కలిపి నేను, వాణిశ్రీ ‘చాణక్య చంద్రగుప్త’ నాటకాన్ని ఆడాము. ఆ రోజుల్లో సినిమాతారలు నాటకాల్లో వేస్తున్నారంటే జనం ఎగబడేవారు. అదుకేకోస్తా ప్రాంతంలోని పలు నాటకసమాజాలు మమ్మల్ని చాలా గౌరవంగా తీసుకువెళ్లేవారు. నిజానికి నా జీవితమంతా నాటకరంగంతోనే ముడిపడి ఉందని చెప్పవచ్చు. ఇక జమున గారి స్వంత ట్రూపులో “శ్రీకృష్ణతులాభారం” లో రుక్మిణిగా నటించాను. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. చిన్నప్ప్పుడు జమునగారిని చూసి చాలా దగ్గరగా వెళ్లి ఒక్కసారన్నా అక్కా! అని పిలవాలనుకునేదాన్ని కదా. ఆ కోరిక సినిమాలో తీరింది. “బంగారుమనసులు” (1973) చిత్రంలో ఆమెకు చెల్లెలుగా చేశాను. అయితే ఈ నాటకంలో జమున గారు సత్యభామ, నేనేమో రుక్మిణి గనుక ఆమెకు నాటకాల్లో నేను అక్కనయ్యాను. ఇది చాలా తమాషాగా ఉంటుంది.

మా “చింతామణి” నాటకమంటే భారతీరాజా గారికిచాలా అభిమానం. మేము ఎక్కడో నాటక  ప్రదర్శనలో ఉంటే చెన్నెíకు పిలిపించి మరో “కొత్తజీవితాలు” (1981) చిత్రంలో అంతర్నాటకంగా “చింతామణి” ప్రదర్శింపజేశారు. అంత పాపులారిటీ నాకు సినిమా రంగంలో రాలేదు. అయితే తొలి చిత్రం “భీష్మ” నాకు చిరునామాగా మారిపోవడం నా అదృష్టం.

ఇక ఆంధ్రదేశం నన్ను ప్రముఖంగా గుర్తు పెట్టుకున్న మరో చిత్రం “దానవీరశూరకర్ణ” (1977), ఎల్.టి.రామారావు గారు పిలిచి మరీ ఆ చిత్రంలో కర్ణుడి పెంపుడు తల్లి రాధ వేషం ఇచ్చారు. అందులో నాపై చిత్రీకరించిన ‘ఏ తల్లి నిన్ను కన్నదో...’ అనే పాట ఇప్పటికీ పాపులర్. తెలుగులో నా చివరి చిత్రం “జగన్నాటకం” (1991).

ఒక్క తెలుగు చిత్రాల్లోనే గాక “ఉతగం సుట్రియ వాలిబన”, “చిన్నపువ్వే మెల్లపేసు”, “పుదియగీతై” మొదలైన తమిళ చిత్రాల్లోనూ, “లవకుశ” అనే ఒరియా చిత్రంలోనూ నటించాను. కూటికోసం కోటివిద్యలన్నట్లు డబ్బింగులూ చెప్పాను. రాజసులోచన, సుకుమారి, మంజుల, సిల్కుస్మిత, కుయిలీ, జ్యోతిలక్ష్మి... ఇలా చాలామందికి తమిళం నుండే తెలుగులోకి వచ్చిన చిత్రాల్లో డబ్బింగ్ చెప్పాను. నేనూ స్వయంగా నాగమ్మ, పవిత్రబంధం, అక్క, మÖడుముళ్లబంధం మొదలైన తెలుగు సీరియల్స్‌లోనూ, శివమయం, కాలం, చిత్తి తదితర తమిళ సీరియల్స్‌లోనూ నటించాను. ఇంకా తమిళ సీరియల్స్ చేస్తూనే వున్నాను.

మా అబ్బాయి ఎం.వి.భానుప్రకాష్ కూడా సినిమా నటుడే. ఆ రోజుల్లో మేం వీనస్ స్టూడియో ప్రకప్కన ఉండేవాళ్లం. అలా చాలామంది నిర్మాతలు, దర్శకులు బాబు ముద్దుగా వున్నాడని చెప్పి సినిమాల్లో నటింప చేశారు. “పటిందల్లా బంగారం” (1971) తదితర చిత్రాల్లో మాస్టర్ భానుప్రకాష్ పేరుతో బాలనటుడిగా చిత్రసీమలో ప్రవేశించాడు. పెద్దయ్యాక “తలైవాసన”, “ఆశిక్కీలియే కోవమా” తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు. ప్రస్తుతం తమిళ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నాడు. అతడు బి.ఇ.మెకానికల్ ఇంజనీరిగు చదివినా నా నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్నందుకు సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం భాను, స్టూడియో ‘ఈ’ కంపెనీకి రీజనల్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. చెన్నెíలో ఇటీవల జరిగిన సిసిఎల్ ప్రాగ్రాంను కూడా మా వాడే నిర్వహించేవాడు. 

సాధారణంగా కళాకారులకు రిటైర్డ్‌మెంటు అనేది ఉండదు. మంచి అవకాశాలు వస్తే ప్రతి ఆర్టిస్తూ తప్పకుండా చేస్తాడు. నేనూ అంతే. చెన్నెíలో నా వరకూ వచ్చే ప్రతి పాత్రనూ ధరిస్తున్నాను. మా కొడుకు కోడలు (సునంద) తో హాయిగా ఉన్నాను. మా మనవరాలు (నమ్రత), మా మనవడు (రాజ్) ప్రస్తుత నా కాలక్షేపం. చాలు. ఈ జీవితం... చాలా సంతృప్తిగా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే నేనో పడిలేచిన కడలి తరంగం.  చెన్నెíలో శారద, రేవతి (మిసెస్ బౌనా), బెంగుళూరులో జయంతి నా స్నేహితురాళ్లు. వీళ్లతోటి నా కష్టసుఖాలు పంచుకుంటూ అన్ని విధాలా సంతృప్తిగా ఉన్నాను.


గీతాంజలి.....‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి...

ఆ పేరు వినగానే జ్ఞాపకాల పేటిక 50 ఏళ్ల నాటి లోపలి అరను తెరుస్తుంది. అంతరంగంలో ఓ ఆహ్లాద వీచిక. ఆనాటికీ ఈనాటికీ శ్రీరామనవమి ఉత్సవాల్లో, పెళ్లిపందిళ్లలో వీనులవిందు చేసే ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి...’ పాట వినీ వినగానే ముగ్ధుమోహన స్నిగ్ధ సుందరి సీతే కళ్లముందు ప్రత్యక్షమౌతుంది. ఎవరా సీత? 

చారడేసి కళ్లల్లో కనీ కనిపించని సిగ్గుý£లకబోస్తూ, పెదవుýపై విరిసిన దరహాసం బుగ్గల్లో ప్రతి ఫలిస్తుంటే బుగ్గన వేలు పెట్టుకుని, రఘురాముడెపుడు విల్లు విరిచి, తన చేత విరిమాల వేయించుకుంటాడని నిరీక్షించే సీత ప్రేక్షకులకు కనువిందు చేసే ఘట్టం ఎన్.ఏ.టి.వారి “సీతారామ కల్యాణం” చిత్రంలోనిది. కల్యాణ సీతగా మృదులావణ్య అభినయం ప్రదర్శించిన ఆ సీతే చిత్రనాయిక గీతాంజలి.

“డా॥చక్రవర్తి” (1964) లో కథకు కీలకపాత్ర అయిన చెల్లెలుగా, “ఇల్లాలు” (1965) లో పరస్పర విరుద్ధమైన రెండు పాత్రలు అద్వితీయంగా నటించిన అభినేత్రిగా, “అమ్మాయిగారు అబ్బాయిగారు” (1966) లో అతిక్లిష్టమైన పాత్ర అతి సునాయాసంగా చేసిన నటీమణిగా, ఒక పాతిక చిత్రాలలో ముప్ఫెí డాన్సులు లావణ్యంగా, నాజూకుగా, సరసంగా చేసిన నర్తకిగా తెలుగు ప్రేక్షకులకు నేటికీ గుర్తుండిపోయిన అభినేత్రి గీతాంజలి. తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణాధ్యాయానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఈమెతో కాసేపు...

నేను ఉమ్మడి కుటుంబం నుంచీ వచ్చాను. మాది చాలా పెద్ద కుటుంబం. శ్రీమతి శ్యామలాంబ, శ్రీరామమÖర్తి గార్లు మా తల్లిదండ్రులు. మేము మొత్తం నలుగురు అక్కచెల్లెళ్లం. ఒక తమ్ముడు. నా అసలు పేరు మణి. మా అక్క స్వర్ణతో కలిసి కాకినాడ సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో చదువుకునే దాన్ని. అక్కడే తొమ్మిదవ తరగతి దాకా చదువుకున్నాను.

మా నాన్నగారికి భరతనాట్యంటే చాలా ఆసక్తి. అందుకే మాకు కూడా చాలా చిన్నవయసులోనే ఆ కళ మీద ఆసక్తిని కలిగించారు. నాకు మÖడు సంవత్సరాల వయసు రాగానే నాట్యాభ్యాసం మొదలు పెట్టించారు. నేనూ, మా అక్కయ్య స్వర్ణా నాట్యం నేర్చుకునే వాళ్లం. నా నాలుగో ఏటి వరకూ మాకు లక్ష్మణరెడ్డి గారు నాట్యం నేర్పారు. ఆ తరువాత తంజావూరు శ్రీనివాసన్ దగ్గర శాస్తీయమైన భరతనాట్యం నేర్చుకున్నాను. ఆయన అప్పట్లో ‘గంధర్వ నాట్యమండలి’ అన్న పేరుతో ఒక నృత్య పాఠశాలను ఆరంభించారు. ఆ పాఠశాలలో మేము నాలుగు సంవత్సరాలు నాట్యాన్ని అభ్యసించి అక్కడి కోర్సును పూర్తి చేశాం. ఆ తర్వాత నాట్యప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాము. 

మా నాట్యప్రదర్శన చూసినవాళ్లంతా ఆశ్చర్యపోయేవారు. మేం స్టేజి ఎక్కితే దూరాన కూచున్న వాళ్లకు కనబడేవాళ్లం కాదు. అంత చిన్న పిల్లలం.  అలాంటిది - అడుగులు వేస్తూ, లయబద్ధంగా మేము భరతనాట్యం చెయ్యడం చూసి ఎంతో ముచ్చటపడేవారు  ప్రోత్సహించే వారు. ఎందరో ప్రోత్సహించబట్టే, మా నాన్నగారికి ఆ కళలో అంతటి ఆసక్తి ఉండబట్టే మేమీనాడు ఈ స్థితికి రాగలిగాం.  నన్ను సినిమాలలోకి తీసుకొని వచ్చింది కూడా ఈ నాట్యమే.  అందుకే నాట్యకళ అంటే ఇప్పటికీ నాకెంతో అభిమానం. 

‘సోల్జర్స్ సైలర్స్ బోట్స్‌మన్ షిప’ అన్న సంస్థలో అకసారి మేము నాట్య ప్రదర్శన ఇచ్చాము. ఆ సంస్థ చైర్మన్ ఉద్దండరామన్ గారు మమ్మల్ని ‘ఆంధ్రా సిస్టర్స’ గా ప్రశంసించారు. అప్పట్నుంచీ ఆ పేరుతోనే ఓ వెలుగు వెలిగాము. దాదాపు యాభై ప్రోగ్రాములు ఇచ్చివుంటాము. 

చదువును అశ్రద్ధ చెయ్యకుండా ఇంట్లో ఒక ట్యూటర్ని కూడా ఏర్పాటు చేశారు మా నాన్నగారు. ఇదంతా నాకు కంటకంగా వుండేది. స్కూలుకు వెళ్లాలి అనగానే రకరకాల జబ్బుల పేర్లన్నీ గుర్తు చేసుకుని మరీ చెప్పేదాన్ని. స్కూలుకు వెళ్లడం, అక్కడ చెప్పే పాఠాల గొడవ వినడమే బోరు అనుకుంటే ఇంటి దగ్గర వేరే, చదువుకు ట్యూటర్ని ఏర్పాటు చెయ్యడం నాకేం నచ్చలేదు. అయినా గోడు వినేవాళ్లెవరూ? 

అయితే ఒకందుకు స్కూలును మెచ్చుకునేదాన్ని. రోజూ పొద్దున్నే క్లాసులకు వెళ్లేముందు డ్రిల్లు చేయిచేవార. ఈ డ్రిల్లు క్లాసుకు మాత్రం హుషారుగా హాజరయ్యే దాన్ని. చదువుకెలాగూ ట్యూటరున్నాడు కదా - స్కూల్లో కూడా చదువే చెప్పాలా - ఇలా డ్రిల్లులు చేయించి ఆటలాడించి, వీలుంటే స్కూల్లోకి ఒకటో అరో సినిమాలు తెప్పించి చూపించి పంపెయ్యకూడదా అనిపించేది నాకు.

దైవవశాత్తూ నా స్కూలు జీవితానికి అచిరకాలంలోనే తాళం పడింది. ఓసారి మేమంతా కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుపతి బయలుదేరాం. ఎటూ, తిరుపతి వచ్చాం కదా, చెన్నెí కూడా చూసిపోదాం అని చెన్నెí వచ్చాం. అప్ప్పుడే సినిమాల్లో మమ్మల్ని ప్రవేశపెట్టాలని మా నాన్న గారికి కోరిక కలిగింది. 

సినిమాలలో వేషాలకని 1957 లో చెన్నెí వచ్చి మాకు ఆప్తులైన విజయకుమార్ (“దాంపత్యం” హీరో) ఇంట్లో దిగాము. మొట్టమొద ముఖానికి రంగు పూసుకున్నది “ఇరుమనం కలందాల్ తిరుమణం” (1959). ఈ తమిళ చిత్రానికి నిర్మాత కాకినాడ స్వస్థలమైన కాంచన (“చంద్రవంక”, “ఆడబిడ్డ” ల హీరోయిన్). ఇందులో నాయిక ఎం.ఎన్.రాజం చుట్టూ గంతులేసే గుంపులో గోవింద వేషం నాది. ఇలాంటిదే “శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం” (1960) చిత్రంలో వకుళాశ్రమ వాసిని పాత్ర కూడా. నర్తకిగా ఎదిగిన తర్వాత “భక్త అంబరీష” (1959) చిత్రంలో రాజశ్రీతో కలసి ‘నిను చూశాము మనసేసింది...’ అనే పాటకు మతంగ నాట్యం చేశాను. 

ఇలా సాగుతుండగా బి.ఏ.సుబ్బారావు గారు “రాణీ రత్నప్రభ” (1960) చిత్రంలో నేను భరతనాట్యం చేశాను. వాహినీలో ఆ సినిమా రషెస్ చూస్తున్న ఎన్.టి.రామారావుకు నా డాన్స్‌బిట్ బాగా నచ్చిందట. ఆయన వెంటనే ఆ డాన్సుకు మళ్లీ రివైండ్ చేసుకొని చూసి నా గురించి బి.ఏ.సుబ్బారావు గారిని వాకబు చేశారట. “వాళ్లది కాకినాడ. కొత్తగా వచ్చారు” అన్నారట సుబ్బారావు గారు. “అమ్మాయి బాగుంది. మొహంలో అమాయకత్వం ఉంది. సీత పాత్రకు నప్ప్పుతుంది. ఓసారి మన ఆఫీసుకు రమ్మని చెప్పండి” అన్నారట రామారావుగారు. అంతే... అలా “సీతారమ కల్యాణం” (1961) లో హీరోయిన్నయిపోయాను. ఆ చిత్రంలో కూడా నా పేరు మణి అనే ఉంటుంది. మొదటి సినిమా అనో ఏమో పెద్దాయన (ఎన్.టి.ఆర్.) నాకు వాయిస్ డబ్బింగు చెప్పించారు. ప్రముఖ నట గాయని టి.జి.కమలాచంద్రబాబు  గారు నాకు గాత్రదానం చేశారు. ఈ సినిమాలోనే మరో విశేషం కూడా ఉంది. మా అక్కయ్య స్వర్ణ ఇందులో శూర్పణఱ వేషం వేసింది. ఈ మహత్తర అవకాశాన్ని కలుగజేసిన బి.ఏ.సుబ్బారావు గారిని నేను ఎప్పటికీ మరచిపోలేదు.  

“సీతారామ కల్యాణం” షూటింగ్‌లో మొదట నేను చాలా బిడియంగా ఉండేదాణ్ణి. ఎందుకంటే అందరూ పెద్దపెద్దవాళ్లు... బి.సరోజాదేవి, ఛాయాదేవి... ఇలా. కానీ తర్వాత అýవాటైపోయింది. నా పాత్రకు కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ పెద్దాయనే దగ్గరుండి చూసుకునేవారు. నా నుదుట తిలకం దిద్ది “ప్రప్రథమంగా సీతమ్మ వారి పాత్ర ధరిస్తున్నారు. ఇక మీ జీవితంలో ఎటువంటి లోటూ ఉండదు” అని మనసారా ఆశీర్వదించారు. వారి మాట వృధా కాలేదు. ఇప్పటికీ ఆంధ్రదేశంలో శ్రీరామనవమికి ‘శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి...’ పాట తప్పకుండా వినబడాల్సిందే. ఆ పాటతో పాటు ప్రజలు నన్ను గుర్తుకు చేసుకోవాల్సిందే తప్పదు. నా అదృష్టమది. శ్రీరామనవమి ప్రజలు జరుపుకునేంత కాలం నేను అఖిలాంధ్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవినే!

రెండేళ్లపాటు ఎన్.టి.రామారావు గారు బ్యానర్‌లో పనిచేసేలా ఒప్పందం. దాని ప్రకారం “గులేబకావళి కథ” (1962) లో వీధి నాట్యం చేయక తప్పలేదు. అయితే ఆ మధ్యలో కూడా “మగవారి మాయలు” (1960) చిత్రంలో ‘అందాల సొగసుల రాధ...’ అన్న పాటకు అందాల సొగసుల అభినయమే చేశాను. 

ఎన్.ఏ.టి. లో ఉన్నంతకాలం సంభాషణలు, నృత్యం, నటన అన్నీ పెద్దాయనే నేర్పించారు. ముఖ్యంగా బిహేవియర్. ఈనాటికీ ఎవరిని ఉద్దేశించి అయినా సరే నా నోట ‘రా’, ‘పో’, ‘ఏమే’, ‘ఏరా’ ఇలాంటి మాటలు రాకపోవడానికి రామారావు గారే స్ఫూర్తి. ఎంత చిన్నవారినైనా ‘ఏమండీ’, ‘రండి... కూర్చోండి’ ఇలాగే మాట్లాడేవారు. అవే పద్ధతులు మాకూ నేర్పారు. అందుకు ఆయనకు నేను ఎప్పటికీ ఋణపడే ఉంటాను. 

మా కుటుంబంలో రామారావుగారు, త్రివిక్రమరావు గారు ఇద్దరూ చాలా వాత్సల్యాంగా ఉండేవారు. చనిపోయేంత వరకూ కూడా నేను ఎక్కడ కన్పించినా ‘సీతా!’ అనే పిలిచేవారు. మా అమ్మగారు చాలా చక్కగా వంట చేసేవారు.  సెట్స్‌లో ఉన్నప్ప్పుడూ మా నాన్నగారు క్వారియర్ తీసుకొస్తే అందరం కలిసి తినేవాళ్లం. ముఖ్యంగా పెద్దాయనకు మా అమ్మగారి చేతి వంటంటే చాలా ఇష్టం. మా ‘సీత’ ఇంటి నుంచి క్యారియర్ వచ్చిందంటే అందులో ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది అనే వారు. కోడి కూర, చేపల కూర మా అమ్మగారు చేశారంటే ఆయన వదిలేవారు కాదు.

1962 లోనే తమిళ చిత్రాలు “శారద” లో సోలో డాన్సు, “దైవత్తిన్ దైవం” (కె.ఎస్.గోపాలకృష్ణన్) లో చక్కటి పాత్ర. ఎస్.జానకి చక్కగా పాడిన పాటకు మంచి డాన్సు (కణ్ణన్ మబననిలై  వెంపటి సత్యం) చేశాను. ఇవి నాకు మంచిపేరే తేవడంతో నేను చాలా బిజీ ఆర్టిస్టు అయిపోయాను. తమిళంలో కూడా నా కెరీర్ గురించి ఎన్.టి.ఆర్. గారే చాలా శ్రద్ధ తీసుకున్నారు. నాకు అరవం సరిగా రాకపోతే ఫీల్డులో నిలదొక్కుకోవడం కష్టమని ఆయనే స్వయంగా ట్యూటర్‌ను పెట్టి ఆ భాష నేర్పించారు. ప్రముఖ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య గారు సంభాషణý తీరులో చక్కటి తర్ఫీదునిచ్చారు. అంటే దీనికొక కారణముంది - “సీతారామకల్యాణం” సమయంలో నేను చాలా దీర్ఘసమాసాలు చెప్పలేక పోయేదాన్ని. దీనిలో టేకులు మీద టేకులు తినేదాన్ని. ఒకసారైతే రామారావుగారు సెట్టుమీదే బాగా అరిచేశారు కూడా. నేను భయంతో వణికిపోయాను. బిగ్గరగా ఏడ్చేశాను. దీంతో రామారావు గారు మళ్లీ నన్ను అనునయించారు. మా నాన్నగారిని పిలిచి అలా బయటకు తీసుకువెళ్లి సరదాగా తిప్పిరమ్మన్నారు. అప్ప్పుడే కమలాచంద్రబాబు గారితో నాకు డబ్బింగ్ చెప్పించారు. దీంతో నాకు ట్యూటర్ అవసరమనిపించిందాయనకు.

1963-1964 సంవత్సరాలు. నా జీవితంలోఊ మరచిపోలేనివి. ఆ సమయంలోనే నాకు తొలిసారిగా హిందీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ‘పూర్ణా’ సుబ్బారావు గారితో ప్రముఖ దర్శకులు బాబూభాయి మిస్తీగారు ఒకసారి “మా హిందీ పిక్చర్‌లో నటించడానికి దక్షిణాది నటి కావాలి. ఎవరినైనా మీరు సూచించండి” అని అడిగారట. ఆయన నా పేరు సూచించారు. అలా బాబూభాయి మిస్తీగారి హిందీ చిత్రం “పారస్ మణి” (1963) లో మహీసాబ్ సరసన నాయికగా అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలో నటిస్తున్నప్ప్పుడు బాబుభాయి మిస్తీగారు “నీ పేరు మణి అని పెట్టారేంటి - చిత్రం పేరు మణి, నీ పేరు మణి. ఏం బాగా లేదు. అంచేత ‘గీతాంజలి’ అని నీకు నామకరణం చేస్తున్నాను.” అని నా పేరును మార్చారు. ఆయన పెట్టిన ‘గీతాంజలి’ పేరే నాకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. “పారస్ మణి” నా తొలి హిందీ చిత్రం. సుప్రసిద్ధ హిందీ సంగీత దర్శకులు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ల తొలిచిత్రం కూడా అదే. చెన్నెíలో ఆ రోజుల్లో సూరజ్ నారాయణ్ సిన్హా అనే హిందీ మాష్టారు ఉండేవారు. ఆయన దగ్గర హిందీ నేర్చుకుని సినిమాల్లో నా డైలాగులు నేనే చెప్ప్పుకున్నాను. 

ఆ తర్వాత “సంగ్రాం” (1965), “షంషీర” (1967), దారాసింగ్‌తో, “బలరాం శ్రీకృష్ణ” (1968) లో రుక్మిణి, “దో  కలియా” (1968) లో వేంప్, చివరగా “శంకర్ పార్వతి” (1970) దారాసింగ్‌తోనే చేశాను. ఈ “దో కలియా” ఏ.వి.యం. వారి “లేతమనసులు” కు రీమేక్. “బలరాం శ్రీ కృష్ణ” లో సావిత్రిగారు కూడా నటించారు. ఆ చిత్ర నిర్మాణమప్ప్పుడు సావిత్రిగారు ఆ ముంబై భోజనం తినలేకపోయేవారు. చెన్నెíకు ఫోన్ చేసి జెమినీగణేశన్ గారికి ఈ విషయం చెబితే ఆయన సావిత్రి గారు కోరిక  వంటలన్నీ తయారు చేయించి విమానంలో వచ్చి మాకు వడ్డించి వెళ్లేవారు. 

అప్పట్లోసే కన్నడంలో రాజ్‌కుమార్ గారి “బభ్రువాహన” చిత్రంలో గెస్టు ఆర్టిస్టుగా ఆయనతో పాటు ఓ పాటలో డాన్సు చేశాను. అప్పట్లోనే “తాయిన్ మడియిల”, “నెంజిరుక్కుంవరై”, “ఆసైముగం” తమిళ చిత్రాల్లో సహాయ పాత్రలూ, మెర్రీలాండ్ సుబ్రహ్మణ్యం గారికి నాలుగు మలయాళ చిత్రాల్లో హీరోయిన్ వేషాలు వేశాను. “కాట్టుమల్లిక” ఒక్క పేరే గుర్తుంది. రెండు విన్నెంటుతోనూ, రెండు మధుతోనూ. 

నాకు తెలుగులో మంచి పేరు తెచ్చిన చిత్రం “మురళీకృష్ణ” (1964). అందులో పిచ్చిదానిగా నటించాను. దాదాపు అదే సమయంలో మహానటులు అక్కినేని నాగేశ్వరరావు, డా॥కొంగర జగ్గయ్య గార్లు “పునర్జన్మ”, “మంచిరోజుý£స్తాయి” చిత్రాలలో ‘పిచ్చి’ వేషాలే వేశారు కానీ నేను చేసిందే వాస్తవికతకు దగ్గరగా ఉందన్న పేరు వచ్చింది. కానీ ఆ ఘనత అంతా పి.పుల్లయ్య గారిదే! “మురళీకృష్ణ” లో నా నటనను చూసి అన్నపూర్ణా వారి “డాక్టరు చక్రవర్తి” (1964) లో శారదగారు పోషించాల్సిన చెల్లెలి పాత్రను నాకు ఇప్పించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ చిత్రంలో నాపై చిత్రీకరించిన ‘పాడమని నన్నడగవలెనా...’ పాట నేటికీ సూపర్‌హిట్. పి.సుశీల గారి టాప్‌టెన్ సాంగ్‌లో ఒకటిగా నిలిచిపోయిందా పాట. ఇప్పటికీ చాలా ఫంక్షన్స్‌లో నేను కన్పిస్తే అప్పటి తరం ప్రేక్షకులు ‘చెల్లెమ్మా’ అని నన్ను ఇంకా అభిమానంగా పలుకరించడం “డా॥చక్రవర్తి” పుణ్యమే. అక్కినేని గారికే “మంచిరోజులు వచ్చాయి” (1972) చిత్రంలో కూడా సోదరిగా నటించాను.  

నా మొదటి కామెడీ వేషం, మొదట వేంపూ, కె.హేమాంబరధర రావు గారు వేయించినవే. “కలవారికోడలు” (1964), “వీలునామా” (1965). ఆ తర్వాత డజన్లకొద్దీ కామెడీ వేషాలు వేసినా నాకు నచ్చింది “దేవత” (1968) లోనిదే. ఈ చిత్రం నుంచే నేను పద్మనాభంతో నటించడం ప్రారంభించాను. రేలంగి-గిరిజలలాగా మా జంట పాపులరయ్యంది. ఆ తరువాత పద్మనాభం గారే తీసిన “పొట్టిప్లీడరు” (1966) లో, “మర్యాదరామన్న కథ” (1967) లో హీరోయిన్ అవకాశమిచ్చారు. ఇంకా “పూలరంగడు” (1967), “పవిత్రబంధం” (1971) వంటి చిత్రాల్లో మా జంటకు చాలా మంచిపేరు వచ్చింది. ఇక నాకు తెలుగులో మరో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ఇక నాకు తెలుగులో మరో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన చిత్రం “సంuరాల రాంబాబు” (1970). తమిళంలో “ఏదిర్ నిచ్చల” అనే చిత్రంలో మహానటి డా॥షావుకారు జానకి గారు చేసిన పట్టుమామి పాత్రను నేను పైచిత్రంలో చేశాను. ఆ పాత్రలో ‘పొరుగింటి మీనాక్షమ్మను చూశారా...’ అంటూ ఆండాళ్లుగా నేను ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచే ఉంటానేమో? ఆ పాత్రను చలా కష్టపడి చేశాను. చలం గారు నాపై ఎంతో నమ్మకంతో ఆ పాత్రను ఇచ్చారు. అంజలీదేవి, గుమ్మడి గార్లకు నేనంటే ప్రత్యేకాభిమానం. వాళ్లిద్దరికీ నేను “కాలం మారింది” (1972) మొదలైన అనేక చిత్రాల్లో కూతురుగా నటించాను. అందుకే వాళ్లిద్దరూ నన్ను కన్నకూతురిలాగే చూసేవారు. 

నేను చాలా సినిమాల్లో మంచి నృత్యాలే చేశాను. “పంతాలు పట్టింపులు” (1968) చిత్రంలో నేనూ, వాణిశ్రీ పోటీపడి నృత్యం చేశాం. అదే విధంగా “శ్రీరామకథ” (1968) చిత్రంలో చంద్రమోహన్‌తో కలిసి చేసిన రతీమన్మథుల నృత్యం కూడా నాకు చాలా మంచిపేరు తెచ్చిపెట్టింది. హీరాలాల్ గారు నృత్యదర్శకులు. చంద్రమోహన్‌లో మంచి పట్టుదల ఉండేది. నాకు డాన్సు వచ్చు - ఆ కారణంగా నాతో పోటీపడి డాన్సు చేయాలని షూటింగ్‌కి పది రోజుల ముందు నుంచి ఆయన డాన్సు ప్రాక్టీసు చేసి, రిహార్సల్లు చేసి షూటింగ్‌లో పాý£్గన్నారు. “ఆడజన్మ” (1970) తదితర చిత్రాల్లో మేమిద్దరం కలిసి నటించాం. ఆయన చాలా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ కలుపుగోలుగా ఉంటారు. హీరాలాల్ గారే నాకు, భారతికి కలిపి “అఖండుడు” (1970) చిత్రంలో ఓ అద్భుతమైన నృత్యం చేయించారు. ఇప్పటికీ నాకు నాట్యమంటే చాలా ఇష్టం. కొంచెం లావైన కారణంగా సాధన లేదు గానీ, పాత చిత్రాల్లోని నృత్యాలు చూస్తే  నాకు తెలీకుండానే పాదాలు నర్తించేస్తుంటాయి. ఇంకా “బంగారు తిమ్మరాజు” (1964) లో ‘నాగవల్లి కోనలోన...” (ఎ.కె.చోప్రా), “మహాబలుడు” (1967) లో ‘చూడండి మీకు నేను చూపిస్తాను...’ (శీను) వంటి చక్కని నృత్యాలు కూడా నర్తకిగా నాకు పేరు తెచ్చిపెట్టినవే. 

నా సినీ జీవితంలో ప్రముఖంగా చెప్ప్పుకోవాల్సిన మరో మంచి చిత్రం “ఇల్లాలు” (1965), ఎల్వీప్రసాద్ గారు ఓసారి ఆఫీసుకు రమ్మని నాకు కబురు పంపారు. వెళ్లాను. మరాఠీలో వచ్చిన ఓ చిత్రం ఆధారంగా హిందీలో నిర్మించిన “మేరే సాయా” చిత్రం చూపించారు. అందులో నాయిక (సాధన) ది ద్విపాత్రాభినయం. ఆ వేషాలు నీవు వేయాలన్నారు ప్రసాద్‌గారు. మేకప్ మాన్ హరిబాబు గారు చాలా చక్కగా మేకప్ వేశారు. ఈ పాత్రనే తమిళంలో (“ఇదయకమలం”) కె.ఆర్.విజయ చేశారు. తెలుగు, తమిళ చిత్రాలకు ఒకేసారి షూటింగ్ జరుగుతూ వుండేది. కె.ఆర్.విజయ, నేను పోటీపడి నటించే వాళ్లం. అంతకుముందు నర్తకిగా, హాస్యనటిగా, వేంప్‌గా పాత్రలు పోషించిన నాకు ‘ఇల్లాలు’ పాత్రనిచ్చి నా నటనా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పించారు. ఎల్.వి.ప్రసాద్ గారు. “ఈ చిత్రంలో ఒక మంచి ఉదాత్తమైన ఇల్లాలి పాత్ర పోషిస్తున్నావు. ఇక ముందు కామెడీ, వేంప్ పాత్రలు పోషించొద్దు” అని సలహా కూడా ఇచ్చారు. ఈ చిత్రంలో కథానాయకుడుగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించాల్సింది. కాల్‌షీట్ల సమస్యల వల్ల ఆయనకు కుదరక కె.వి.నాగేశ్వరరావు అనే ఓ నూతన నటుణ్ణి పరిచయం చేశారు. చిత్రం విజయవంతంగా నడిచివుంటే కథానాయికగా నాకు మంచి భవిష్యత్తు లభించి ఉండేదేమో? నా కెరీర్‌లో ఈ సినిమాకు పడ్డ కష్టం మరే సినిమాకూ పడలేదు. నా నటనకు ఎవరూ వంకలు పెట్టకపోయినా ప్రథమశ్రేణి హీరోయిన్‌గా నేను స్థిరపడక పోవడానికి కారణం “ఇల్లాలు” ఆడుతున్నప్ప్పుడే “వీలునామా” ఆడడం. అందులో పవివ్రత. ఇందులో పతితవ్రత. రెండూ ప్రేక్షకులు స్వీకరించలేకపోయారు. 

అందుకే ఆ రోజుల్లో హీరోయిన్ వేషాల కోసమే కూర్చోకూడదనుకున్నాను. తక్కిన వేషాలూ వేశాను. అదే సమయానికి “గూఢచారి 116” (1966) సినిమా వ్యాంప్‌గా నాకు మంచి ఇమేజ్ తెచ్చింది. ఇక ఆ తర్వాత “ఆటu£మ్మలు” (1966), “హంతకుý£స్తున్నారు జాగ్రత్త” (1966), “లేతమనసులు” (1966), “అవేకళ్లు” (1967), “u£మ్మలు చెప్పిన కథ” (1969), “బంగారు పంజరం” (1969)... ఇలా చాలా సినిమాలు చేశాను. ఆ సమయంలో ఊపిరి తీసుకునే వీలు లేనంత బిజీ అయిపోయాను. ఆదుర్తి సుబ్బారావు గారైతే నేను ఎప్ప్పుడు కన్పించినా “మిగతా వాళ్లకేవైనా వేషాలు మిగలనిస్తున్నానా” అని ఎగతాళి చేసేవారు.

నాకు ప్రముఖ కథానాయకుడు రామకృష్ణ గారితో 1973 లో వివాహం జరిగింది. మేమిద్దరం కలసి నటించిన తొలిచిత్రం “తోడూ-నీడ” (1965). ఆ తర్వాత “రణభేరి” (1968) మొదలైన పింజల సుబ్బారావు గారి చాలా చిత్రాల్లో నటించాం. మేమిద్దరం కలసి చాలా చిత్రాల్లో నటించినా, భార్యాభర్తలమౌతామని నేనెప్ప్పుడూ ఊహించలేదు. మేం కలసి నటించేటప్ప్పుడు కూడా ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఆయనే “ఏం గీతా బాగున్నావా?” అని అప్ప్పుడప్ప్పుడూ పలుకరించేవారు. అయితే ఎప్ప్పుడూ నన్ను ప్రత్యేకంగా చూస్తుండే వారు. అది నేను గమనించాను. అదే మా పెళ్లికి దారి తీసిందేమో? పెళ్లయ్యాక సినిమాల్లో నేను నటించకూడదని షరతు పెట్టారు రామకృష్ణగారు. నేనూ అంగీకరించాను. నాకు కూడా ఇద్దరం కష్టపడి, అలసిపోవడం అనవసరం అనిపించింది. 1975 లో బాబుశ్రీనివాస్ పుట్టాడు. బాబు పేరు మీదనే చెన్నెíలో ఓ ప్రివ్యూ థియేటర్‌ను ప్రారంభించాం. ఎన్.టి.రామారావు గారే దాన్ని ప్రారంభించడం నాకు సంతోషం కలిగించే అంశం. మా పెళ్లయిన తర్వాత రామకృష్ణగారు హీరోగా అగ్రశ్రేణికి ఎదిగారు. “నోము”, “పూజ”, “దొరలు-దొంగలు” ఇలా చాలా చేశారు. ఆ తర్వాత మేమే సొంతంగా “రామాపురంలో సీత” చిత్రం నిర్మించాం. అది ప్లాపయ్యింది. దాంతో చిత్రనిర్మాణం మానుకున్నాం.

పెళ్లయ్యాక జెమినీబాలన్ అభ్యర్థన కాదనలేక “కన్నవారి కలలు” (1974) చిత్రంలో తొమ్మిది నెలల గర్భంతో చివరి షాట్స్ ఇచ్చాను. అప్పటికి నా ఆఖరు చిత్రాలు “ఈ కాలపు పిల్లలు” (1976), “మంచిరోజు” (1977),. ఆ తరువాత మొరక కన్నడ చిత్రంలో కల్యాణకుమార్‌కి హీరోయిన్ వేశాను. బి.ఎస్.నారాయణ దాని డైరెక్టరు. మంచి వేషం కానీ ఆ చిత్రం (ప్రేమబంధన) విడుదల కాలేదు. 

ఆ తర్వాత నా మలి అధ్యాయం టి.వీ. సీరియల్సుతో ప్రారంభమైంది. “లేతమనసులు” లో నటించిన కుట్టిపద్మిని ఒకసారి గుడిలో కన్పించి నన్ను టీవీ సీరియల్స్‌లో నటించమని బాగా ప్రోత్సహించింది. ఆమె మాట కాదనలేక 1995 లో ఆమె నిర్మించిన “కిట్టిగాడు” లో నటించాను. ఆ తర్వాత బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు సినిమా రియల్ లెజండ్ డా॥భానుమతీ రామకృష్ణ గారు నిర్మించిన “అత్తగారి కథలు” లో కోడలిగా నటించాను. ఆ అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. భానుమతి గారితో కలిసి చేయడమంటే మాటలా? ఆ “అత్తగారి కథలు” షూటింగు సమయంలో ఎక్కువగా వాళ్లింట్లోనే ఉండేదాన్ని. ఆమె నన్నుర ‘గీతా’ అని ఎంతో ప్రేమగా పిలిచేవారు. భానుమతి గారితో నేను ఓ స్తీని గాక పురుషుణ్ణి చూసేదాన్ని. అంత ధైర్యం వుండేది ఆమెలో. ఆమె మంచి జాతక నిపుణురాలు.  ఎప్ప్పుడూ అదే పనిలో వుండేవారు. సోమవారం రోజు మౌనవ్రతం, ఉపవాసం కూడా! ఆ తర్వాత ఈటీవీలో స్నేహ, జెమినీలో అంతులేని కథ చేశాను.

ఇక నా జీవితంలో ఊహించని విషాదాలు మÖడు. చిన్నప్పటినుండీ మమ్మల్నందర్నీ కళ్లల్లో పెట్టుకొని కాపాడిన మా అమ్మగారు  “డాక్టర్‌చక్రవర్తి” సినిమా షూటింగులో మమ్మల్ని వదలి వెళ్లిపోయారు. ఇక్కడో విషయం చెప్పాలి. చెల్లమ్మా అంటూ మా అమ్మని సొంత చెల్లెల్లా చూసుకునే ఎన్.టి.రామారావు గారు ఏదో సిక్త్ సెన్స్ పనిచేసినట్లు మా అమ్మ పోవడానికి కొంచెం ముందే వచ్చారు. ఆవిడ పోయాక అలానే మÖడు గంటల పాటు కూర్చుండిపోయారు. “సీతారామకల్యాణ” మప్పటి రెండేళ్ల కుటుంబ బాంధవ్యం అంతలా నిలిచిపోయింది మరి. మా అమ్మగారు పోవడంతో నాకు జీవితంలో పెద్ద వెలితి ఏర్పడింది. ఎందుకంటే ఆమె ఉండేంత వరకూ నా జీవితంలో కష్టమంటే ఏమిటో ఎరుగను. ఇంట్లో వ్యవహారాలన్నీ ఆమే చక్కబెట్టేది. నాతో బాటు షూటింగ్‌లకు వచ్చేది. షూటింగ్‌కు వెళ్లేటప్ప్పుడు మాతోబాటు మా నాన్నగారైనా ఉండాలి, తనైనా కూడా ఉండాలని ఆంక్షలు పెట్టేది. మాకు ఫీల్డు బాగా అలవాటై అందరూ తెలిసి, గుర్తించినా సరే ఒక్కళ్లూ వెళ్లడానికి ఒప్ప్పుకునే వారు కాదు. మాకు సినిమాలు ఎందుకు? చక్కగా పెళ్లిళ్లు చేసేయాలని ఆరాటపడేవారు. అలాంటి మా అమ్మ పోవడం నాకు ఎవరూ భర్తీ చేయలేని వెలితి.

మీ అమ్మగారు పోయాక నాన్న మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. నా పెళ్లయిన ఆరేళ్లకు మనవడి ముద్దుమురిపాలు కూడా చూసుకున్నాక 1980 లో ఆయన మరణించారు. ఇది నాకు మరో విషాదం. అయినా మా వారి ఓదార్పుతో ఆ ద్ణుఖాన్ని కూడా దిగమింగుకున్నాను.

నెమ్మది నెమ్మదిగా మళ్లీ నటనపై దృష్టి సారించాను. సురేష్ ప్రొడక్షన్స్ “ప్రేయసిరావే” (1999) చిత్రంలో తల్లి పాత్రలో మళ్లీ వెండితెరపైకి వచ్చాను. ఈ సమయంలోనే రామకృష్ణ గారు క్యాన్సర్ వ్యాధితో 2001 లో మరణించారు. దీంతో నేను పూర్తిగా సుమారు మÖడేళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత మళ్లీ కొంతకాలానికి నన్ను నేను ఓదార్చుకుని కళామతల్లి ఒడిలోకి మళ్లీ వచ్చి సేద తీరాను. 2005 సంవత్సరంలో హైదరాబాదుకు చెన్నెí నుండి వచ్చేశాను. “పెళ్ళెíన కొత్తలో”, “గోపి, గోపిక, గోదావరి”, “ఆలయం”, “నేరము-శిక్ష” తదితర చిత్రాల్లో నటించాను.

ఇక చెప్పాల్సింది నా కొడుకు శ్రీనివాస్ గురించి. బాబు కూడా మా నటవారసత్వాన్నే పుణికి పుచ్చుకున్నాడు. సినిమా రంగాన్నే ఎన్నుకున్నాడు. తమిళంలో “కలర్స” అనే సినిమా చేశాడు. తెలుగులో కూడా “ఆదివిష్ణు”, “కోయిల” తదితర సినిమాలు చేశాడు. మా అబ్బాయి సినిమాల్లో తప్పక స్థిరపడతాడనే నమ్మకం నాకుంది. ఇన్నేళ్లు నన్ను, మావారిని ఎంతగానో ఆదరించి, అక్కున చేర్చుకున్న పరిశ్రమ, ప్రేక్షకులు అదేవిధంగా నా నటవారసుణ్ణి కూడా ఆదరించి ఆశీర్వదించాలని నా ఆకాంక్ష!


సంసారం’ పుష్పలత....కల నిజమాయెగా... కోరిక తీరెగా

ఇరవై ఏళ్ల క్రితమే సినిమాల్లో నటించాలనే కోరికతో కడప నుండి మద్రాసు పారిపోయి ‘కల నిజమాయెగా... కోరిక తీరెగా’ అంటూ వెండితెరపై అభినయించిన నటి పుష్పలత. కథానాయికగా అంతగా ప్రాచుర్యం పొందలేకపోయినా ‘సంసారం’ చిత్రంలో ‘మహానటి సావిత్రి’ స్థానంలో అక్కినేనికి జోడీగా నటించి అందరి దృష్టిలో పడ్డారు. పెళ్లి చేసిచూడు, చంద్రహారం, ఆడబిడ్డ, చెరపకురా  చెడేవు లాంటి మరికొన్ని చిత్రాల్లో నటించారు. కలకాలం నటించాలనే కల నిజం కాకుండానే సంసార సాగరంలో మునిగి ‘సంసారం పుష్పలత’ గా మిగిలిపోయారు. ఆమె తలపోతలే ఈ వారం జ్ఞాపకాలు....

మాది ద్రోణాచలం. మా ఇంట్లో మా బంధువులెవ్వరికీ సినిమా వాళ్లతో పరిచయాలు గాని, సంబంధాలు గాని ఏవీ లేవు. మేము రాయలసీమలోని కడపలో ఉండేవాళ్లం. నాకు చిన్నతనం నుంచీ సినిమాలో నటించాలని చాలా కుతూహలంగా ఉండేది. ఆ రోజుల్లో ‘బాలరాజు’ సినిమాలో అంజలీదేవి నాట్యం చేసిన ‘తీయని వెన్నెల రేయి... ఎడబాయని చిన్నెల హాయి...’ అన్న పాట అంటే నాకు ఎంతో ఇష్టం. ఇంట్లో చీటికి మాటికి నేను ఆ పాడుతూ డాన్స్ చేస్తుంటే మా వాళ్లందరూ తిట్టేవాళ్లు. కాని ఆ పాటే నన్ను మద్రాసు లాక్కెళ్లింది. నటిగా నాకు ప్రేరణ కూడా ఆ పాటే.

అదెలాగంటే, కడపలో నా స్నేహితురాý£కామె సినిమాల్లో వేషాలు వేస్తుండేది. ఆమె పేరు లీల. నా నృత్యాన్ని గమనించి ఆమె నన్ను కూడా సినిమాల్లో చేరమనేది. ఈ సంగతి మా అమ్మకు చెబితే “ఛీ... ఛీ... మన మరాఠీవాళ్లు సినిమాలో వేషాలెయ్యడం గౌరవం కాదు” అని మందలించింది. సరేనని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను (తాత్కాలికంగా).

ఒకనాడు నా స్నేహితురాలికి తంతి (టెలిగ్రాం) వచ్చింది. ఒక పిక్చరులో నటించడానికి బయలుదేరి మద్రాసు రమ్మని ఆమె నన్ను కూడా వెంట తీసుకుపోయి సినిమాల్లో చేర్చుతానంది. ఈ సంగతి ఇంట్లో చెప్పేసరికి చాలా గొడవైపోయింది. మా అమ్మ అరచిన అరుపులకు నాకు జ్వరమొచ్చేసింది. ఒకనెల షూటింగ్ జరిగాక నా స్నేహితురాలు కడపకు తిరిగి వచ్చింది. మా ఇంట్లో వాళ్లకు భయపడి, ఆమె నన్ను స్వయంగా కలుసుకోకుండా వాళ్ల పనిమనిషి చేత కబురు పంపుతూ వుండేది. మేము రహస్యంగా కలుసుకునే వాళ్లం.

ఒక పౌర్ణమి రోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగింది. మా అమ్మ నన్ను బీరువా సొరుగు లోంచి వెండి సామాను తీయమంది. నేను ఆ సామానుతో పాటు రెండు వేల రూపాయలు కూడా తీసి రహస్యంగా నా దగ్గరే పెట్టుకున్నాను. ఆ మరుసటి రోజే నా స్నేహితురాలు తిరిగి మద్రాసు వెళుతోంది. నేను మా వాళ్లకెవరికీ తెలీకుండా ఆమె వెంట మద్రాసు కొచ్చేశాను. అమ్మో...ఆ సంఘటనను ఇప్ప్పుడు గుర్తుచేసుకున్నా గుండె ఝల్లుమంటుంది. అప్ప్పుడు అదెంత పెద్ద నిర్ణయమో తెలీలేదు. 

నా దగ్గర ఉన్న డబ్బుతో నేనూ, నా స్నేహితురాలూ మంచి మంచి చీరెలూ, అవీ కొన్నాం. ఆ సమయంలో హాస్యనటుడు కస్తూరి శివరావు ‘పరమానందయ్య శిష్యులు’ (1950) తీస్తున్నారు. నా స్నేహితురాల్లు నన్ను శివరావు గారి ఆఫీసుకు తీసుకువెళ్లి నాకేదైనా వేషం ఇవ్వమని ఆయన్ను అడిగింది. నాకప్ప్పుడు పదమÖడేళ్లు. అంచేత నాకు తగిన వేషం ఏదీ లేదని శివరావు గారు చెప్పారు. కానీ నా స్నేహితురాలు ఏ చిన్న వేషమైనా ఇవ్వమని, డబ్బు కూడా అవసరం లేదని చెప్పింది. ‘పరమానందయ్య శిష్యులు’ లో ఆ విధంగా అతి చిన్న వేషమొకటి చేశాను. అదే నా మొదటి చిత్రం. ఆ పిక్చరు పూర్తి కాక మునుపే నేను తెచ్చిన డబ్బంతా అయిపోయింది. ఏం చెయ్యాలో తోచక ఇంటికి జాబు రాశాను. జవాబు రాలేదు. టెలిగ్రాం ఇచ్చాను. మా వాళ్లు ఇంటిల్లిపాదీ మద్రాసు వచ్చి వాలారు. వచ్చేటప్ప్పుడు తల తాకట్టు పెట్టి నాలుగువేల రూపాయలు వెంట తెచ్చారు కూడా.

నేను ప్రపంచ జ్ఞానం లేక బుద్ధిమాలిన పని చేసినప్పటికీ నాకు సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని అర్థం చేసుకుని మా అమ్మ సమాధానపడింది. మా వాళ్లంతా నాతో పాటే ఉండిపోయారు. ‘పరమానందయ్య శిష్యులు’ తర్వాత ప్రతిభావారి ‘స్వప్నసుందరి’ లో ఒక  దేవకన్య వేషం వేశాను. నామమాత్రపు వేషమే అయినా ఆ నాటికి అదే గొప్పగా అనిపించింది. పైపెచ్చు నన్ను విపరీతంగా ఆకర్షించిన ‘తీయని వెన్నెల రేయి...’ పాట తార అంజలీదేవిని దగ్గరగా చూసే అవకాశం కలిగిందని పరమానంద పడిపోయాను.

అప్ప్పుడే అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి హీరోహీరోయిన్లుగా లక్ష్మీరాజ్యం గారు ‘సంసారం’ సినిమా ప్రారంభించారు. ఎల్.వి.ప్రసాద్ గారు దర్శకులు. అందులో కొంతమంది కాలేజీ అమ్మాయిలలో నన్నూ ఒకరుగా బుక్ చేసుకున్నారు.  మేమంతా కథానాయిక సావిత్రితో కలిపి అక్కినేని గారిని టీజ్ చేస్తూ పాడే పాట ఒకటుంది. నేను చేసిన ఆ పాట రషెస్ చూశాక ఎల్.వి.ప్రసాద్ గారు అప్ప్పుడు అడయార్‌లో ఉంటున్న మాకు కబురు పంపించారు. వెళ్లాను, కొన్ని డైలాగ్స్ చెప్పించి డాన్స్ చేయమన్నారు. చేశాను. నాగేశ్వరరావు గారితో ప్రేమగా మాట్లాడుతున్నట్టు యాక్షన్ చేయమన్నారు. నాకు సిగ్గు, భయం అన్నీ ఒకేసారి వచ్చేశాయి. చెయ్యలేనని ఖచ్చితంగా చెప్పేశాను. అయినా లక్ష్మీరాజ్యం గారు ఒప్పించి, బుజ్జగించి మరీ చేయించారు.

ఇంకేముంది? అంతకుముందు సావిత్రి చేస్తున్న కథానాయిక వేషానికి నన్ను, నేను చేస్తున్న కాలేజ్ అమ్మాయి పాత్రకు సావిత్రిని మార్చేశారు. అప్పటివరకూ పావడా పరికిణీలో ఉన్న నాకు గబగబా చీరకట్టేశారు. హీరోయిన్‌వి అన్నారు. ఆ తర్వాత అక్కినేని గారిని ఉడికిస్తూ మేమందరం పాడే ‘టక్కుటక్కు టమకులబండి...’ అన్న పాటను నేను హీరోయిన్‌గా, సావిత్రి కాలేజీ గర్ల్‌గా షూట్ చేశారు.

‘సంసారం’ బ్రహ్మాండంగా హిట్టయంది. అంతవరకూ జానపద హీరోగా పేరుపొందిన అక్కినేని గారికి అదే తొలి సాంఘిక చిత్రం. అలా అక్కినేనికి మొదటి సోషల్ పిక్చర్ హీరోయిన్ నేను కావడం నా అదృష్టం. ఆ సినిమా ప్రింటు ఎక్కడా లభ్యం కాకపోవడం నా దురదృష్టం. ఆనాటి ప్రేక్షక హృదయాల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది ‘సంసారం’. అదే చిత్రం నా ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. సుసర్ల దక్షిణామÖర్తిగారి స్వరసారథ్యంలో జిక్కీ పాడిన ‘కల నిజమాయెగా...’ అన్న హుషారు పాట నాకు చాలా మంచిపేరు తెచ్చిపెట్టింది.

ఆ చిత్రం తర్వాత ఎల్వీ ప్రసాద్ గారే నన్ను ‘విజయా’ లో పర్మనెంటు ఆర్టిస్టుగా చేర్చారు. మÖడేళ్లు అగ్రిమెంటు. ఆ రోజుల్లో రూ.2500/-లు జీతం. సంవత్సరానికి 250 రూపాయలు ఇంక్రిమెంటు అలా ‘విజయా’ లో నేను ‘పెళ్లిచేసి చూడు’ (1952), ‘చంద్రహారం’ (1954) చిత్రాలు చేశాను. ‘పెళ్లిచేసి చూడు’ చిత్రంలో మహంకాళి వెంకయ్య సరసన నటఙంచాను. సూర్యకాంతం కూతురు వేషం. నేనంటే చాలా కోపంగా ఉండేది ఆమె. ఎందుకంటే ‘సంసారం’ చిత్రంలో నేనేదో సావిత్రిని తీయించేసి, కథానాయిక వేషం పొందానని ఆవిడ అనుకునేది. ‘సంసారం’ సమయం లోనే ఎల్.వి.ప్రసాద్ గారితో ఆ విషయంగా పోట్లాడింది కూడా. ‘పెళ్లిచేసిచూడు’ లో ‘భయమెందుకే చిట్టి భయమెందుకే...’, ‘ఎవడొస్తాడో చూస్తాగా...’ అన్న రెండు పాటలు బాగ పాపులరై నాకు మంచిపేరు సంపాదించి పెట్టాయి. ‘చంద్రహారం’ చిత్రంలో ఋష్యేంద్రమణి కూతురుగా వెర్రిబాగుల దానిగా చేశాను. ఆ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా టిపికల్ రోల్ అది. ఆ తర్వాత ‘ఆడబిడ్డ’, ‘చెరపకురా చెడేవు’ (1955) తదితర సినిమాల్లో చేశాను. ‘చెరపకురా చెడేవు’ చిత్రంలో రేలంగి గారి సరసన నటించాను. అందులో ‘ప్రేమో ప్రేమ...’ అన్న త్రీ స్టేజస్ సాంగ్ బాగా హిట్టయ్యింది. లైలా మజ్ను, పార్వతీ దేవదాసు, అనార్కలి సలీం.. ఈ మÖడు జంటల ప్రేమ. ఆ ఒక్కపాటలోనే వస్తుంది. కాస్టూమ్స్‌లో నేను, రేలంగి గారు కన్పించినట్టు గుర్తు.

ఆనాడు ఇన్‌కంటాక్స్ కట్టిన ఆర్టిస్టులలో నేనొకదాన్ని. షావుకారు జానకి, పద్మనాభం, జోగారావు... ఇన్‌కంటాక్స్ కట్టిన మిగతా ఆర్టిస్టులు. ‘సంసారం’ సినిమాను ‘జెమినీ’ అధినేత ఎస్.ఎస్.వాసన్ గారు తమిళ, హిందీ భాషల్లో తీస్తూ నన్ను హీరోయిన్‌గా వెయ్యమని ఆడిగారు. అప్పటికే విజయాతో అగ్రిమెంట్స్‌పై సంతకం చేసేశాను. దానితో వాసన్ గారు చక్రపాణి గారిని అడిగారు. ఆయన ఒప్ప్పుకుని రద్దుకు ఏర్పాట్లు కూడా చేసేశారు. అయితే ఎల్.వి.ప్రసాద్ గారు మా ఇంటి కొచ్చి “నిన్ను విజయాలో చేర్చింది నేను, ఇప్ప్పుడు అగ్రిమెంట్ రద్దుచేసుకుంటే నా మాట పోతుంది” అని పేచి పెట్టడంతో వాసన్ గారి ‘సంసారం’ మానుకున్నాను. ఎందుకంటే ఎల్.వి.ప్రసాద్ గారు నాకు దైవంతో సమానం.

ఆ తర్వాతే ‘చంద్రహారం’ చేశాను. విజయాలో ఉండగానే హిందుస్థాన్ పిక్చర్స్ అధినేత సి.బి.రాజరత్నం గారితో పెళ్లి అయింది. ‘చంద్రహారం’ టైమ్‌కి గర్భవతిగా ఉన్నాను. అదే సమయంలో డి.ఎల్.గారి ‘దేవదాసు’ లో పార్వతి పాత్రకు నన్ను అనుకున్నారు. అయితే ఆ పాత్ర సావిత్రికి దక్కింది. ఆ సినిమాతో సావిత్రి తారాపథంలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత మా వారు సినిమాలు వద్దనడంతో మానేసి నిజం సంసారంలో పడిపోయాను. నాకు ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి. వాళ్లని పెంచడమే సరిపోయింది. ఇప్ప్పుడు అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. మనవళ్లు, మనవరాళ్లతో చెన్నెíలో ప్రశాంతం జీవిస్తున్నాను.

సావిత్రి మహానటిగా తారాస్థాయిలో వుండే రోజుల్లో ఓసారి ‘విజయా’ లో జరిగిన కార్నివాల్‌లో కన్పించి “నటిగా నువ్వే నాకు స్ఫూర్తి. ఒకప్ప్పుడు నన్ను హీరోయిన్‌గా తీసేసి ఆ స్థానంలో నిన్ను పెట్టడం నాకు ఉక్రోషం తెప్పించింది. ఎన్ని రోజులు ఒంటరిగా ఏడ్చానో నాకే తెలీదు. నీలాగ చలాకీగా ఎందుకుండలేకపోయానని అద్దం ముందు కూర్చుని గంటల తరబడి ప్రాక్టీసు చేశాను” అంది. సావిత్రిని తలచకున్నప్ప్పుడల్లా నాకు ఆ విషయం గుర్తుకొస్తూ వుంటుంది. సావిత్రి చాలా గొప్ప నటి. ఆవిడ స్థానంలో నేనెలా హీరోయిన్‌నయ్యానో నాకే తెలీదు. ఏదైతేనేం ‘సంసారం’ పుష్పలతగా పేరు దక్కించుకున్నాను.


కమలాలక్ష్మణ్....కళాశిఖామణి

ఒక తరం ప్రేక్షక నాట్యాభిలాషులకు కమలంటేనే భరతనాట్యం - భరతనాట్యమంటేనే కమలగా ఉండేది. మొదట్లో కమలగా, అటుపిమ్మట కమలాలక్ష్మణ్ గా ఒక వంద చిత్రాల్లో నృత్యాల్ని, మరో పదిహేను చిత్రాల్లో విభిన్న పాత్రల్ని అభినయించాను. భూకైలాస్ చిత్రంలో ఎం.ఎల్.వసంతకుమారి ఆలపించిన ‘మున్నీట పవళించు నాగ శయనా...’ పాటకు ఆమె చేసిన నృత్యాభినయ ముద్ర అలనాటి తెలుగు ప్రేక్షకుల గుండెలపై నుండి చెరిగిపోలేదింకా, కళాశిఖామణి, సంగీత నాటక అకాడమీ పురస్కారంతో పాటు పద్మభూషణ్ అందుకున్నారామె. ప్రస్తుతం విదేశాల్లో స్థిరపడి, డెబ్భెí ఐదేళ్ల ముదిమిలో కూడా నృత్యశిక్షణలో నిమగ్నమై ఉన్న అసమాన కళాకారిణి కమల అందించే అపురూప జ్ఞాపకాలు ఈ వారం...

కావేరీనది సమీపంలో ఉన్న మా స్వస్థలం ‘మయÖరం’ లో (16-06-1934) పుట్టానట.  రాజం, రామమÖర్తి అయ్యర్‌లు మా అమ్మానాన్నలు. మా అమ్మకు సంగీతం, నాట్యం అంటే ప్రాణం, ప్రసిద్ధ గాయని కె.బి.సుందరాండాల్ వద్ద సంగీతం నేర్చుకున్నారట. సంగీతం కంటే నాట్యం పైనే ఎక్కువ మక్కువ చూపేదట తను. కుంభకోణం భానుమతి, తిరువీళిమలై సోదరీమణులు ఇచ్చే నాట్య ప్రదర్శనల్నిర ఇంట్లో తెలియకుండా వెళ్లి చూసి వచ్చేవారట. ఆమె శాస్తీయ నృత్యం నేర్చుకోవాలని ఎండ ప్రయత్నించినా సనాతన సంప్రదాయ కుటుంబపు కట్టుబాట్ల వల్ల నేర్చుకోలేక పోయింది. ఫలించని తన స్వప్నాల్ని నా ద్వారా తీర్చుకోవాలని ముచ్చటపడింది. దాంతో ఆ దిశలో అమ్మ విపరీతంగా నన్ను ప్రోత్సహించేది. 

నన్నో కళాకారిణిగా తీర్చిదిద్దాలనే అభిలాషతో, నా భవిష్యత్ గురించి ఆలోచించిన అమ్మానాన్నలు నా చిన్నతనంలోనే బాంబేకు వచ్చేశారు. నా చలాకీతనంతో హిందుస్థానీ, కర్నాటక సంగీతాలకు, కథక్ నృత్యానికి మÖడున్నరేళ్ల ప్రాయంలోనే శ్రీకారం చుట్టాను. లచ్చూ మహరాజ్ వద్ద కథక్ క్షుణ్ణంగా నేర్చాను. ‘సుందరప్రసాద’, శంభు మహరాజ్, నారాయణరావు వ్యాస్‌లు నా తక్కిన గురువులు. ఒక సందర్భంలో నా నాట్యాన్ని చూసిన సెంట్రల్ స్టూడియో ప్రొప్రయిటర్ చందులాల్ షా నాకు, నాలుగున్నరేళ్ల పాటు వరుసగా తనాఉ నిర్మించే చిత్రాల్లో నృత్యానికి సంబంధించిన దృశ్యాల్లో నటించే విధంగా అప్పట్లోనే నెలకు వంద రూపాయల కంట్రాక్టు నిచ్చి ప్రోత్సహించారు.

రంజిత్ మÖవీటోన్, బాంబే టాకీసు వాళ్లు నిర్మించిన ‘షాదీ’ (1941), ‘కిస్మత’ (1943) విజయభట్ నిర్మించిన ‘రామరాజ్య’ చిత్రాల్లో బాలనటిగా నటించి నాట్యం చేసినందుకు మంచి పేరు వచ్చింది. దాంతో నాట్యం ఇంకా బాగా నేర్చుకోవాలని ఉండేది. కానీ, అప్ప్పుడే మా నాన్నకి శాసూన్ మిల్సులో చేస్తున్న ఉద్యోగం పోవడంతో సంపాదన తప్పని సరై సినిమాల్లో నటించాల్సి వచ్చింది. అదీగాక మా తాతగారు పదవీవిరమణ చేసి మా మామయ్యలతో పాటు u£ంబాయి వచ్చేశారు. అందరం ఉమ్మడిగా ఉండటంతో నాపై సంపాదన భారం మరింత పెరిగింది. ఒకవైపు సంపాదించాýనే ఆరాటం, మరోవైపు నృత్య కళాకారిణిగా రాణించాలన్న తపన. రెండింటి పైనా దృష్టి నిలిపి ఒక దీక్షతో నాట్యారాధన చేశాను.

మదనపల్లి (చిత్తూరు) కి చెందిన ముత్తు కుమరప్ప పిళ్లయ్ వద్ద శిష్యురాలిగా చేరి భరతనాట్యం అభ్యాసం దాదాపు పూర్తి చేశాను. 1941 లో మా స్వగ్రామం మయÖరం వెళ్లి స్థానిక వినాయకాలయంలో అరంగేట్రం చేయడం గుర్తుంది. తర్వాత u£ంబాయిలో ఎక్కువ రోజులు ఉండలేదు. అప్పటికి రెండవ ప్రపంచ యుద్ధపు ఛాయలు కూడా మద్రాసుపైన లేపోవడంతో 1944 లో మద్రాసు వచ్చేసి జార్జిటౌన్‌లో నివాసం ఏర్పరుచుకున్నాం. అక్కడ వళుపూర్ రామస్వామి పిళ్లయ్ వద్ద భరతనాట్యంలోని మరిన్ని మెళకువల్ని నేర్చుకున్నాఉ. నిజమైన గురువుగా ఆయన్ని ఇప్పటికీ ఆరాధిస్తాను.

మొట్టమొదటి విదేశీ నృత్య ప్రదర్శన శ్రీలంకలో (1948) లో ఇచ్చాను. అప్పటికి నాకు పదిహేనేళ్లు కూడా నిండలేదు. ఆ ప్రదర్శన నేను ఆశించిన దానికంటే విజయవంతమైంది. దాంతో శ్రీలంకలోనే ఎక్కువగా ప్రదర్శనలు ఇచ్చాను. బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, అమెరికా, జపాన్, ఆస్టేలియా తదితర దేశాల్లో ప్రదర్శనలకు అవకాశం లభించింది. ఏ విదేశీ ప్రదర్శనకైనా నాకు తోడుగా, వెన్నుదన్నుగా అమ్మ రాజం వుండేది. నేను ఇచ్చిన ప్రదర్శనలలో చాలా భాగం భారత ప్రభుత్వం తమ ప్రతినిధిగా పంపగా ఇచ్చినవే. వీటిలో క్వీన్ ఎలిజబెత్ పట్టాభిషేక మహోత్సవంలో నృత్యం చేయడం. అదొక మధురమైన జ్ఞాపకం. నేను చేసిన ఆనాటి నృత్యం గురించి బ్రిటిష్ పత్రికలు ఎంతగానో ప్రశంసించి రాయడం ఇప్పటికీ మర్చిపోలేను.

నేను ఏ.వి.యం. వారి చిత్రాల్లో ఎక్కువగా నృత్యాల్ని చేసేదాన్ని స్వాతంత్య్రానికి పూర్వం వచ్చిన వారి ‘దామ్ ఇరువర’ అనే చిత్రంలో ‘ఆడువోమె పళ్లి పాడువోమ్...’ పాటకు నృత్యం చేశాను. తమిళ మధురకవి సుబ్రహ్మణ్య భారతి రాసిన పాటది. సినిమా విడుదలైనప్ప్పుడు అప్పటి పత్రికలు ‘నృత్యం చేస్తున్నప్ప్పుడు ప్రేక్షకులు కమలలో సుబ్రహ్మణ్య భారతీయార్ ఆత్మను చూశారు. కొందరు విప్లమ జ్యోతిని చూశారు. మరికొందరు స్వాతంత్య్రోద్యమాన్ని చూశారు. ఆ పాటకు కమల నృత్యం ఒక అద్భుతం. ఒక సంభ్రమం. ఒక ప్రభంజనం’ అంటూ రాసిన ప్రశంసలు నాకు ‘కలైమామణి’ అవార్డు అందుకున్నా కలగన్ని ఆనందాన్ని ఇచ్చాయి. 

ఆ తార్వత ‘పాలై విళక్కు’ చిత్రంలో కథానాయికిగా నటించాను. ఇక రన్నింగ్ రోల్సు విషయానికి వస్తే ‘నాచ్ ఘర’, ‘జ్వాలా’, ‘ఖట్ పుత్లీ’ చిత్రాల్లో చేశాను. నా ఆఖరి చిత్రం ‘చోరీ చోరీ’ (హిందీ), అందులో థిల్లానా నాట్యం వరకే పరిమితమైనా నేను పాత్ర ప్రాధాన్యత ఉన్న నాట్యాల్నే చేశాను. తెలుగులో ‘చరణదాసి’ లో ‘మరచితివో మనోరమణా...’ పాటకు, ‘శ్రీకృష్ణ తులాభారం’ (1958) లో పి.సూరిబాబు పాటకు (రంభపాత్రలో) నృత్యాలు చేశాను. అయితే నన్ను ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు గుర్తుంచుకున్న చిత్రం ఏ.వి.ఎం. వారి ‘భూకైలాస’ చిత్రం ‘మున్నీట పవళించు నాగ శయన...’ పాటకు చేసిన నృత్యం. ఆ పాటని సంగీత విదుషీమణి ఎం.ఎల్.వసంతకుమారి ఆలపించారు. నేను నటించి, నృత్యం చేసిన కొన్ని తమిళ చిత్రాలు తెలుగులో డబ్ అయి తెలుగు ప్రేక్షకులని అలరించాయి. నలభైల్లో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన ‘మీరా’ లో కృష్ణుడిగా నటించడం ఆన అదృష్టం.

ఆర్.కె.లక్ష్మణ్‌తో జరిగిన నా తొలి వైవాహిక జీవితం చేదు అనుభవాన్నే మిగిల్చింది. రచయితలు, చిత్రకారులున్న ఒక కళాకారుల కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్నందుకు ఎంతగానో మురిసిపోయాను.  ఒక కళాకారిణిగా నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని కలలు కన్నాను.  కానీ పెళ్లయిన తర్వాతే తెలిసింది - వివాహిత నాట్య ప్రదర్శనలు ఇవ్వడాన్ని పరువు తక్కువగా భావించే కుటుంబంలోకి వచ్చానని, అందువల్ల చాలారోజుల వరకు నా ప్రదర్శనలిచ్చి మానుకోవలసి వచ్చింది. నిజంగా ఆ రోజుల్ని ఇప్ప్పుడు తలచుకున్నా మనము కంపించిపోతుంది.  ఒడ్డున పడ్డ చేప పిల్లలా విలవిల్లాడాను. కాళ్లు ఊరుకునేవి కావు. చిరు సవ్వడికే పాదాలు కంపించేవి. కొన్నాళ్ల తర్వాత మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నాం. ఆయనతో విడిపోయాక నా ప్రదర్శనలకి ఏ అడ్డంకి రాలేదు. ఏడాదికి 200-300 ప్రదర్శనల్ని ఇచ్చేదాన్ని.

తర్వాత కొన్నాళ్లకి లక్ష్మీనారాయణన్ గార్ని పెళ్లి చేసుకున్నాను.  మాకు ఒక్కడే కొడుకు ‘జయానంద్ నారాయణ’ హెలికాప్టర్ మెయింటెనెన్స్ సప్లయ్ ఆఫీసర్‌గా యు.ఎస్.ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు.

సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత కొంతకాలం సినిమాల్లో నృత్య దర్శకురాలిగా పనిచేశాను. ‘దైవ తిరుమణం’ చిత్రంలో శ్రీదేవి, ‘వరువాన్ వడివేలన’ చిత్రంలో జయచిత్రలు చేసిన నృత్యాలకు దర్శకత్వం వహించాను. నృత్య దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చింది ‘చండ’ (మలయాళం), కెమెరామెన్ విన్సెంటు దర్శకత్వంలో వచ్చిన చిత్రమది.

ఆ తర్వాత సినిమా నృత్యాల్లో వస్తున్న పరిణామాలు నాకు మింగుడు పడలేదు. భరతనాట్యం బదులుగా కేబరే డాన్సులు వచ్చేస్తుంటే... ఆ మార్పును నేను జీర్ణించుకోలేక సినిమా కెరీర్‌ను వదులుకున్నాను.  

న్యూజెర్సీలో ‘భారత నాట్యాలయ’ డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నాను. కొరియోగ్రఫిలో, నృత్య నాటికల్లో కూడా తర్ఫీదు ఇస్తాను. అంతేకాక వారంలో కనీసం 500 మైళ్లు ప్రయాణించి నృత్యంలో శిక్షణ ఇస్తుంటాను. 

నాకు రాధ, వాసంతి అని ఇద్దరు చెల్లెళ్లు. వీరు కూడా మంచి నర్తకీమణులు. వాసంతి కొంతకాలం నాట్యాలు చేసి ఇప్ప్పుడు మానుకుంది. రాధ ఇప్పటికీ నృత్యప్రదర్శనలిస్తూనే ఉంటుంది. ఇద్దరూ చెన్నెíలోనే ఉన్నారు. ఇక్కడ జరిగే సంగీత నృత్యోత్సవాలోÊ్ల వీలునుబట్టి పాý£్గంటారు. మద్రాసు ప్రభుత్వం 1967-68 లో ఇచ్చిన ‘కళాశిఖామణి’, సంగీత సాగర్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ లాంటి అనేక పురస్కారాలతో పాటు 1970 లో భారత ప్రభుత్వం ఇచ్చిన ‘పద్మభూషన’ అందుకున్నాను. మద్రాసు వచ్చే ముందు పబ్లిసిటీ ఇవ్వను. మిత్రుల్ని శ్రేయోభిలాషుల్నిర కలవడం మినమాయించి, అభిమానుల్ని కలవడం కుదరడం లేదు. ప్రస్తుతం అమెరికా, భారతదేశాలలో నా దగ్గర భరతనాట్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కళాతృష్ణను తీర్చడమే నా లక్ష్యంగా పెట్టుకుని, ఆ దిశలో కృషి చేస్తున్నాను. 


ఎం. బాలయ్య....విలక్షణ నటుడు....నిర్మాత....

తెలుగు సినిమా పరిశ్రమలో అందరికీ సుపరిచితులు బాలయ్య. నటన పట్ల పెద్దగా ఆసక్తి కనబచక పోయినప్పటికీ, ఆయనలో దాగివున్న నటనా నైపుణ్యం, ప్రతిభ వెండితెర మీదకు ఆయన జీవితాన్ని నడిపించింది. 350 చిత్రాల్లో తన సహజ నటనను ప్రేక్షకుల ముందు ప్రదర్శించిన విలక్షణ నటుడు బాలయ్య. 76 ఏళ్ల బాలయ్య, సినీ నటుడుగా, నిర్మాతగా, కథా రచయితగా, దర్శకుడుగా అనుభవాలతో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి, సహృదయుడు. నిండుగా నవ్వడమే తప్ప, కోప్పడ్డం తెలీని ఈ అసాధారణ నటుడి జ్ఞాపకాలు ఈ వారం...

నేను 09-04-1930 న గుంటూరు జిల్లా, అమరావతి మండలం చావపాడు గ్రామంలో జన్మించాను.  శ్రీ మన్నవ గురవయ్య, శ్రీమతి అన్నపూర్ణమ్మ గార్లు నా తల్లిదండ్రుటు. మాది మొదటి నుండీ వ్యవసాయ కుటుంబం. నా యిద్దరు సోదరులు ఇప్ప్పుడూ అక్కడే వ్యవసాయం చూసుకుంటున్నారు. ఒక తమ్ముడు మైనింగ్ ఇంజనీరు.

చావపాడు u£త్తిగా చిన్న గ్రామం. ఆ కాలంలో చదువుకోవడానికి బడికూడా లేని వూరు.  అందుకని నేను పక్క వూళ్లో పైవేటుగా రెండో ఫారం వరకు చదువుకుని, 1942లో గుంటూరు హిందూ కాలేజీ హైస్కూలులో మÖడో ఫారంలో ప్రవేశించాను.  హాస్టల్‌లో వుంటూ శ్రద్ధగా చదువుకుని స్కూలు ఫైనల్ ప్యాసయ్యాను.

హైస్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో నాకు చదువు తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు.  గుంటూరులో చదువుకుంటూ, నేను సంవత్సరానికి ఏ ఐదో, ఆరో సినిమాలు చూసుంటాను. 1946 లో స్కూల్ ఫైనల్ పాసైన తర్వాత, నాకు చిన్న సమస్య వచ్చింది - మా వాళ్లందర్నీ విడిచిపెట్టి - దూరంగా మద్రాసులో చదువుకోవాల్సి వచ్చింది! ఐతే, ‘స్టాండర్డు’ కోసం, క్రమశిక్షణ కోసం, ప్రాపంచిక పరిచయాల కోసం నేను చెన్నెí ‘లయోలా’ కళాశాలలో ‘ఇంటర’ లో చేరాను. 1948 లో నేను ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో ప్యాసయ్యాను.

ఇంటర్ తర్వాత, నాకు ఇంజనీరింగ్ కాలేజీలోనూ, మెడికల్ కాలేజీలోనూ సీట్లు వచ్చాయి. నాకు డాక్టరు చదవడం పట్ల పెద్ద ఆసక్తి లేకపోవడంతో, ఇంజనీరింగ్‌లో చేరాను.  1948 నుంచి 1952 వరకు గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాను.

1948 వ సం॥లో ఒక విచిత్రం జరిగింది - ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నప్ప్పుడు నేను గనక ‘స్టేజి’ ఎక్కక పోయుంటే - నేను అనుకున్నట్లు ఇంజనీరుగానే వుండిపోయేవాడినేమో! మనం అనుకున్నదొకటైతే, దైవ నిర్ణయం ఇంకోవిధంగా వుండవచ్చు.  ఎవరే విధంగా అనుకుంటే ఆ విధంగా జరిగి తీరుతుందని ఎవరమÖ చెప్పలేం. కలెక్టరు అవుదామని కలలుగన్న వాడు స్కూలు టీచరు కావచ్చు, గుమాస్తాగా బ్రతుకుదామనుకున్న వాడు సామాన్య వ్యక్తిగానే వుండిపోవచ్చు.  ఈ మార్పులన్నీ పరిస్థితుల కాల ప్రభావాల వల్ల, విధి నిర్ణయానుసారం జరుగుతూ వుంటాయి.  అదే విధంగా నేను ఇంజనీరు అవుదామనుకుంటే సినిమా నటుడనయ్యానంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు!  తమిళంలో ఒక సామెత వుంది - తాను అనుకున్నదల్లా నెరవేరితే, మనిషి దేవుడు లేడంటాడట.

కాలేజీలో ఏదో సందర్భాన ఒక చిన్న నాటిక ప్రదర్శించాల్సి వచ్చింది.  మిత్రులంతా నన్ను ఉత్సాహం లేని నేను, ఆ భయం వల్ల  ససేమిరా ఒప్ప్పుకోలేదు. కానీ మిత్రుల ప్రోద్బలం నా పట్టుదలను గెలిచింది! ఆ నాటికలో ముఖ్యపాత్ర ధరించాను. ఆ ప్రదర్శనలో నేనేం జేశానో నాకు తెలీదు. ఆ రోజున నన్ను ఆ స్టేజి మీద చూసినవాళ్లకు నాలో సినిమా నటుడి లక్షణాలు ఏ మాత్రం కన్పించలేదు. కానీ ఒకే ఒక్క వ్యక్తికి మాత్రం బాగా కన్పించాయి.  అతని పేరు తాడి కృష్ణమÖర్తి. నాతోనే ఇంజనీరింగ్ చదువుకునే వాడు. ప్రదర్శన కాగానే నన్ను అభినందించిన ఒకే ఒక వ్యక్తి కృష్ణమÖర్తి.  

మా కాలేజి విద్యార్థులు ఒకసారి ఆచార్య ఆత్రేయ గారి ‘పరివర్తన’ నాటకం వేశారు.  ఆ నాటకం బాగుండాలని, తాపీ చాణక్య గారిని ఆహ్వానించి, నాటకాన్ని డైరెక్టు చెయ్యమని కోరారు. అప్ప్పుడే నాకు చాణక్య గారితో పరిచయమైంది.  అప్ప్పుడాయన “పల్లెటూరి పిల్ల” చిత్రానికి బి.ఎ. సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేస్తున్నారు.  ఆ తర్వాత నాకు ధైర్యం చెప్పి, నాటకాల్లో వేషాలు వెయ్యమన్నది కూడా చాణక్యగారే. మÖడో సంవత్సరంలో నేను తెలుగు సమితికి కార్యదర్శిగా ఎంపికయ్యాను. ఆ సంవత్సరం మళ్లా నాటకం వెయ్యాల్సి వచ్చింది.  ఆచార్య ఆత్రేయ దగ్గర ‘ప్రగతి’ అనే నాటకం రాయించాం. తొలిసారిగా అంతర్ కళాశాల నాటక పోటీలు పచ్చయ్యప్ప కళాశాలలో నిర్వహిస్తే అందులో మేం పాý£్గన్నాం. ఈ నాటకాన్నే చాణక్యగారే నడిపారు.  ఆ ‘ప్రగతి’ నాటకంలో నేను పారిశ్రామిక వేత్త పాత్ర వేశాను. నాటకానికి ప్రథమ బహుమతి వచ్చింది.  దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగి మంచి నాటకాలు వేయగలను అని అనుకున్నాను.

తర్వాత కూడా నేను కాలేజీ నాటకాల్లో పాý£్గన్నాను. 1952 లో నేను ఔ.జూ. (Uలిబీనీబిదీరిబీబిజి) డిగ్రీ తీసుకున్నాను.  మద్రాసు బాడ్వేలో వున్న సెంట్రల్ పాలిటెక్నిక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో, అసిస్టెంటు లెక్చరర్‌గా, ప్రప్రథమంగా 1953 లో ఉద్యోగంలో ప్రవేశించాను. ఎనిమిది నెలల పాటు ఆ ఉద్యోగం చేశాను. ఆ సంవత్సరంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు పైలట్ ఆఫీసరుగా సెలక్టయ్యాను కూడా, కానీ మిలిటరీ వాతావరణం, ముఖ్యంగా మా అమ్మకు నచ్చలేదు.  దాంతో ఆ లైను మానేశాను. సెంట్రల్ పాలిటెక్నిక్ నుంచి నేను కాకినాడ పాలిటెక్నిక్‌లో చేరాను. మÖడు సంవత్సరాల పాటు ఆ కాలేజీలోనే లెక్చరర్‌గా వున్నాను.  1955 మార్చిలో నాకు కమలాదేవితో వివాహం జరిగింది. మా శ్రీమతి ప్రముఖ కథా రచయిత్రి ఆర్.ఎస్. వసుంధరాదేవికి సొంత సోదరి.

సరే, అలా ఆ లెక్చరర్ ఉద్యోగం కూడా నాకు సంతృప్తి నివ్వలేదు. సొంతంగా నేను ఒక వర్క్‌షాపు పెట్టుకుని నడుపుకుందామనే ఆలోచన వచ్చింది.  ఆ తర్వాత సంవత్సరంలోనే ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను.  అనుభవం కోసమని, నేను మద్రాసు సుందరం మోటార్సులో చేరాను. అప్ప్పుడే ఎల్.వి.ప్రసాద్ గారు నన్ను పిలిచి ‘మÖవీటెస్టు’ చేశారు.  ఆ టెస్టు ‘ఉత్సాహకరమైన ఫలితాలను’ ఇచ్చింది.

మా బంధువు ఒకాయన రాయఘడ్ పంచదార ఫ్యాక్టరీలో జనరల్ మేనేజరుగా ఉండేవారు. ఆయన “ఖాళీగా వున్నావు గదా, ఇక్కడకొచ్చి కొన్నాళ్లు ఈ ఫ్యాక్టరీ అది చూద్దువు గాని రా” అని కబురు చేశాడు.  సరేనని నేను రాయఘడ్ చేరుకున్నాను.  నాకు తెలీకుండా నీడలాగా, సినిమా ఛాన్సు కూడా నా వెంటే రాయఘడ్ చేరుకుంది.

ఎల్.వి. ప్రసాద్ గారు తీసిన ‘మÖవీటెస్ట’ ను ‘ప్రతిభా’ సంస్థ అధినేత ఘంటసాల కృష్ణమÖర్తి గారు చూశారు. ఆయన వెంటనే నన్ను రమ్మని ఉత్తరం రాశారు. అప్ప్పుడాయన “దొంగలున్నారు జాగ్రత్త” నిర్మించబోతున్నారు. నాలో ఏ మాత్రం ఉత్సాహం కలుగలేదు.  ప్రతిభా వాళ్లు నాకోసం చాలా ప్రయత్నం చేశారు. 

1957 లో నేను తిరువత్తియÖర్ వర్క్‌షాపులో అసిస్టెంటు ఇంజనీరుగా జేరాను. నా ఉద్యోగాన్ని నేను చూసుకుంటూ పోయానే ÔŸప్ప ఆ సినిమా నీడను గమనించలేదు.  సినిమా ఆలోచన నా తలలో లేనే లేదు. ఆ తర్వాత ‘అనుపమా’ సంస్థ అధినేత కె.బి. తిలక్ గారు తమ తొలిచిత్రం “ఎం.ఎల్.ఏ.”లో ఒక పాత్రలో నటించమని అడిగారు. నేనే దాన్ని వద్దనుకున్నాను. 

1957 జూలైలో మళ్లీ నాకు పరిశ్రమ నుండి పిలుపు వచ్చింది.  ఈసారి చాణక్య గారు సారథి వారి తరపున పిలిపించాడు. నిలకడ లేని లైను - పెళ్లయి ఒక పాపకు తండ్రిని కూడ. ఇప్ప్పుడు సినీ రంగం వద్దులే అని సుతిమెత్తగా చెప్పాను. హీరో వేషం రావడం ఎంత అరుదైన అదృష్టమో వివరించారు. ఆఖరికి సరేనని ఒప్ప్పుకున్నాను. అలా 1957 లో నా చిత్రరంగ ప్రవేశం జరిగింది. సారథీ వారి “ఎత్తుకు పైఎత్తు” లో హీరోగా నటించాను.  ఇంజనీరు కావలసిన వాడు నటుడయ్యాడా? నటయోగం వున్నవాడు ఇంజనీరు అవుదామని ఆశించాడా? - నాకు అర్థం కాలేదు. 

“ఎత్తుకు పైఎత్తు” లో హీరోయిన్‌గా షావుకారు జానకి గారు చేశారు.  ఆ తర్వాత కథానాయకునిగానే “పార్వతీ కల్యాణం” (1958), “మనోరమ”, “భాగ్యదేవత” (1959), “చివరకు మిగిలేది”, “కుంకుమ రేఖ” (1960), “గుళ్లో పెళ్లి”, “కృష్ణప్రేమ” (1961), “మోహినీ రుక్మాంగద” (1962), “తల్లీ బిడ్డలు” (1963) చిత్రాల్లో నటించాను. వాటిల్లో సావిత్రి గారితో నటించిన “కుంకుమ రేఖ”, కృష్ణకుమారి గారితో చేసిన “మనోరమ” చిత్రాలంటే చాలా ఇష్టం. ప్రముఖ హిందీ గాయకుడు తలత్ మొహమ్మద్ “మనోరమ” లో నాకు చాలా మంచి పాటలు పాడాడు. ఆ రోజుల్లో తలత్ నాకు పాటలు పాడడాన్ని చాలా విశేషంగా చెప్ప్పుకునేవారు.  దానికి రమేష్ నాయుడు గారు సంగీత దర్శకుడు.

నేను మొదటి నుంచీ కూడా చాలా సున్నిత మనస్కున్ని, నాకు తెలిసి నేనెవరినీ ఇన్నేళ్ల ఇండస్టీలో ఎవర్నీ నొప్పించి ఎరుగను. నాలాంటి స్వభావమే డి.వి. నరసరాజు గారిది. వారి సాన్నిహిత్యమంటే నాకు చాలా ఇష్టం. ఆయనా ఈ మధ్య పోయారు. సరే... నే చెప్పేదేమిటంటే మొదటి నుంచీ కూడా ఏదైనా సంఘటన చూస్తే విపరీతంగా స్పందించే వాణ్ణి. ఆ స్పందనలో నుంచే నాలో కథా రచయిత పుట్టుకు వచ్చేవాడు. ఆ రోజుల్లో ‘తుఫాన’ అని ఓ పత్రిక వుండేది. ఆ పత్రికా సంపాదకులు ఏదైనా రచన ఇమ్మని అడిగితే, నేను స్పందించిన ఒక సంఘటననే ‘నలుపు-తెలుపు’ టైటిల్ లో పది సంచికలకు సీరియల్‌గా పంపాను. ఆ కథే నిర్మాత అయ్యాక అమృతా ఫిలిమ్స్ పతాకంలో తీసిన తొలి చిత్రం “చెల్లెలి కాపురం” (1971).

హీరో వేషాలు తగ్గిపోయాక, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగాను.  “పాండవ వనవాసం” (1965), “u£బ్బిలి యుద్ధం” (1964), “బభృవాహన” (1964), “రక్తసింధూరం” (1967), “నిండు మనసులు” (1967), “ఊరికి ఉపకారి” (1972), “చిరంజీవి రాంబాబు” (1978)... ఇలా సుమారు 200 చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగాను. అలా నటించిన చిత్రాల్లో “అల్లూరి సీతారామరాజు” (1974), “అంకుశం” (1992) చిత్రాలంటే నాకు చాలా ఇష్టం.

నటుడుగా వుండేటప్ప్పుడు ఎందుకనో కాస్త అసంతృప్తిగా3 వుండేవాడ్ని.  సినిమా రంగంలోకి అనవసరంగా వచ్చేశానా అని అనిపించేది. ఆ అసంతృప్తిని అప్ప్పుడప్ప్పుడూ మిత్రులతో అంటుండేవాడ్ని. అంతలో పర్వతనేని చంద్రశేఖరరావు (శ్రీ ఫిలిమ్స్), కాట్రగడ్డ శ్రీనివాసరావు (నవయుగ) గార్ల ప్రోత్సాహంతో ‘అమృతా ఫిలిమ’ స్థాపించి తొలిసారిగా “చెల్లెలి కాపురం” తీశాను.  ఆ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్లో స్వర్ణ నంది వచ్చింది. “చెల్లెలి కాపురం” సినిమా విడుదలైన రోజున నేను పొందిన థ్రిల్‌ను, అనుభూతిని నేనెప్పటికీ మరువలేను. దాని తర్వాత వరుసగా తొమ్మిది చిత్రాలు నిర్మించాను.  అందులో “ఊరికిచ్చిన మాట” (1981) చిత్రం దగ్గర నుంచి నేను నిర్మించిన చిత్రాలకు నేనే దర్శకత్వం వహించాను.  ఆ చిత్రానికి కూడా కాంస్య నంది వచ్చింది. అంతేగాకుండా ద్వితీయ ఉత్తమ కథగా అవార్డు గెల్చుకుంది.

మీకో నిజం చెప్పనా... నటుడు అనిపించుకోవడం కంటే, నిర్మాత అన్పించుకోవడంలోనే ఆనందం ఉంది. నిర్మాతగా నేనెంతో సక్సెస్ అయ్యాను.  ఒక సినిమాకు, అది ఏరకమైన సినిమా అయినా సరే, కథ అనేది చాలా ముఖ్యమైనదని నా నమ్మకం. “ఊనీలిజీలి రిరీ దీళి లీబిఖి తీరిజిళీ శినీబిశి బీబిదీదీళిశి లీలి బీళిజీజీలిబీశిలిఖి లీగి బి వీళిళిఖి రీశిళిజీగి”. ఒక మంచి కథ ఉన్నప్ప్పుడు అది చిత్రంలో ఎలాంటి లోపాన్ని కన్పించనివ్వదు అని సుప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు ఫ్రాంక్ కాప్రా అన్నాడు.  కథను ఎన్నిక చేసుకోవడంలో కూడా కొన్ని గమ్మత్తులు జరుగుతాయి.  మేం తీసిన “చుట్టాలున్నారు జాగ్రత్త” (1980) చాలా బాగా విజయవంతమైంది. దాన్ని ఏ.వి.ఎం. వాళ్లు రజనీకాంత్ హీరోగా “పోకిరి రాజా” అనే పేరుతో తమిళంలో తీశారు. అదే వంద రోజులు నడిచింది. హిందీలో తీయడానికి ఒక నిర్మాత మా దగ్గర హక్కులు కొన్నాడు.  కానీ వాళ్లు నిర్ణయించుకున్న దర్శకుడికి ఆ కథ నచ్చలేదు.  అందుకని “చుట్టాలున్నారు జాగ్రత్త” కథకు సంబంధించిన హక్కులను పద్మాలయాకు అమ్మేసి వేరే కథను వాళ్లు కొనుక్కున్నారు. పద్మాలయా వాళ్లు “చుట్టాలున్నారు జాగ్రత్త” కథను “మవాలీ” అనే పేరుతో హిందీలో తీసి విడుదల చేస్తే 25 వారాలు విజయవంతంగా నడిచింది. మా కథ కాదని వేరే కథను తీసుకుని నిర్మించిన చిత్రం ‘ప్లాప’ అయింది. 

1973 లో “నేరము-శిక్ష” అనే సినిమా మా అమృతా ఫిలింస్ పతాకం కింద నిర్మించాం. దానికి కె. విశ్వనాథ్ గారు దర్శకులు.  సినిమా పూర్తయి, తొలి కాపీ కూడా వచ్చిన రోజుల్లో నాకు బాగా కావాల్సిన వారి ద్వారా ఒక డిస్టిబ్యూటర్ వచ్చి చిత్రం చూశాడు. నాతో ఏ మాటా చెప్పకుండా వెళ్లిపోయాడు. తర్వాత మా స్నేహితుడు ఫోన్ చేసి “బాలయ్య గారూ! మీ చిత్రం వాళ్లకి నచ్చలేదట. మీరేమీ అనుకోకండి” అన్నాడు. “నేరము-శిక్ష” విడుదల తర్వాత విషయం అందరికీ తెలిసిందే గదా! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఎంత తెలివితేటలున్నా, ఎంత సినిమా పరిజ్ఞానం వున్నా, కొన్ని సందర్భాల్లో ప్రతి మనిషి పప్ప్పులో కాలు వేస్తుంటాడు.  విడుదలకు సిద్ధంగా వ్ను సినిమా చూసి కూడా మనం సరైన తీర్పు యివ్వలేక పోతుంటే - కథ మాత్రం విని ఇది మంచి సినిమా అవుతుందా? కాదా? అని  చెప్పడం ఎంత కష్టమో ఆలోచించండి.

నా వరకు నేను ఒక కథాంశాన్ని పట్టుకుంటే దాన్ని ఆరు మాసాలు నుంచీ సంవత్సర కాలం పాటు పిండి, పాకం పడతాను. అంతేగాక నా ఒక్కడి అభిప్రాయాలైతే గానుగెద్దులా ఒకే గాటిలో తిరుగుతా యేమోనని, నాకు హితులు, సన్నిహితులు అయిన వాళ్లను కూర్చోబెట్టి కథ వినిపించి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుని దాని ప్రకారం మార్పులు చేసుకుంటాను.  ముఖ్యంగా ఇంట్లో వాళ్లకు నచ్చేటట్లు చూసుకుంటాను.  నేను నిర్మించిన చిత్రాలను ఇదే పద్ధతిలో నిర్మించినవే.

అయితే ముందు తీసిన ఆరు చిత్రాలకు కె. విశ్వనాథ్, కె.ఎస్.ఆర్. దాస్, డి.ఎస్. ప్రకాష్‌రాజు, బి.వి.ప్రసాద్ వంటి అనుభవజ్ఞులు దర్శకత్వం వహించారు. వారి అభిప్రాయాల ప్రకారం కథల్లో మార్పులు, చేర్పులు చేశాను. తర్వాత నాలుగు చిత్రాలకు కథ, నేనే రాసుకుని చిత్రానువాదం డైరెక్షన్ చేశాను.

“పీపుల్ బిలో థర్టీ ఆర్ పూల్స్ అండ్ దోజ్ అబౌవ్ థర్టీ ఆర్ రాస్కెల్స” (ముప్ఫెí యేళ్లలో వున్న వారు మÖర్ఖులు, ముప్ఫెí ఏళ్ల పైబడిన వారు దుర్మార్గులు) అన్నాడొక ఇంగ్లీషు కవి. అంటే యుక్తవయస్సులో ఉన్నప్ప్పుడు సంఘసేవ, దేశోద్ధారణ అనే కొన్ని ఆదర్శాలతో మనిషి హృదయం నిండి ఉంటుంది.  ఉడుకు రక్తం ఉరకలేస్తూ వుంటుంది.  యుక్త వయసు దాటిందనుకోండి - పెళ్లవుతుంది, భార్య పిల్లలు. ఇలా కుటుంబ బాధ్యత నెత్తిన పడుతుంది. తన భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలి? అనే ఆలోచన వస్తుంది.  అప్ప్పుడా దేశసేవ, సంఘసేవ అనే ఆదర్శాలు గంగలో కలిసిపోతాయి.  అదే విధంగా నేను కొత్తగా చిత్ర నిర్మాణం మొదలు పెట్టినపుడు - సంఘ సంస్కరణ చేయాలి, దేశంలో వుండే ప్రజల్నంతా మన సినిమాలతో మంచి మార్గంలో ప్రయాణింప చేయాలి. ప్రతి చిత్రంలోనూ నీతి వుండాలి. ఇలా ఎన్నో ఆశయాలతో నిర్మాణం ప్రారంభించాను. ఆ వూపులోనే నా సినిమాల్ని ఏదో ఒక నీతిని దృష్టిలో పెట్టుకుని తీశాను.

“బాహ్య సౌందర్యం కంటే అంత్ణ సౌందర్యం గొప్పదని” చెల్లెలి కాపురంలో చెప్పాను. “మనిషికి మనసే సాక్షి / మనిషి విధించే కక్ష శిక్ష తప్పినా / మనసు విధించే శిక్ష తప్పదు / నేరానికి శిక్ష తప్పదు - తప్పదు” అని “నేరము-శిక్ష” లో చెప్పాను.  “సన్మార్గంలో సాధించిన స్వల్పం / సకల జనులు హర్షించే శిల్పం / పెడదారిన పొందిన పెన్నిథి / అడుగడుగున ఆపద సన్నిథి / ఇదే భిన్న మార్గాల వ్యధ అన్నదమ్ముల కథ” అని “అన్నదమ్ముల కథ” (1975) లో చెప్పాను.  ఇలా నీతులు చెప్ప్పుకుంటూ పోతే జనం వినడం మానేశారు. ఏదో విశ్రాంతి కోసం,  వినోదం కోసం, సినిమాలు చూడడానికి వస్తే నీతులు, నీతులు అంటూ విసుగెత్తిస్తున్నారని భావించారు. ‘మనకి నీతులు చెప్పడానికి వీళ్లకున్న అర్హత ఏమిటి?’ అని నిందిస్తున్నారు ప్రజలు.

ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్తాను - 

ఒక కాలేజీ వార్షికోత్సవ సభకు ఓ సినీ కవి ముఖ్య అతిథిగా పాý£్గన్నాడు. బ్రహ్మాండంగా నైతిక విలువల్ని గురించి ఉపన్యాసం ఇచ్చేశాడు.  విద్యార్థులందరూ ముగ్ధులై విన్నారు. కార్యక్రమం ముగిసింది. విద్యార్థులంతా ఆయన ఉపన్యాసం ధాటికి ఉత్తేజితులైపోయి స్వయంగా ఆయన్ను కలుసుకోవాలని ఆయన బస చేసిన విశ్రాంతి గృహానికి వెళ్లారు. వాళ్లు అక్కడికి వెళ్లే సరికి ఆ కవిగారు మద్యం సేవిస్తూ దర్శనమిచ్చారు. విద్యార్థులు ఆశ్చర్యపోయారు. మనసు ఉండబట్టలేక ‘సార్! కొద్దిసేపటి క్రితమే కదా మీరు మాకు ఎన్నో నీతులు చెప్పారు! మరి మీరేమిటి ఇక్కడ.... ఇలా... మద్యం సేవిస్తున్నారూ’ అని అడిగారు.

దానికి ఆయన ఇచ్చిన బదులు ఇది - “నాలుగు రోడ్ల కూడలిలో వుండే పలక చెక్క మీ వూరికి దారి చూపిస్తుంది గానీ, ఆ వూరికి తాను పోదు” అన్నాడు. నీతులు చెప్పే ప్రతివారూ వాటిని ఆచరించాలని గానీ, ఆచరిస్తారని గాని అనుకోవడం పొరపాటు. నీతుల్ని బోధిస్తూ చిత్రాలు నిర్మించడం వల్ల చేదు ఫలితాలు చవి చూశాను. నీతులు వెగటు పుట్టి జనం అలాంటి చిత్రాల్ని చూడడం మానేస్తారు.  ఫలితం చిత్రం బాగా ఆడదు. చివరకు నిర్మాత నష్టపోతాడు అనే నిజం అనుభవ పూర్వకంగా గ్రహించాను. 

ఈ కారణాల వల్ల - మేము కూడా వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రాలు నిర్మిస్తే మంచిదనే నిర్ణయానికొచ్చాం. అలా నిర్మించిందే “ఈనాటి బంధం ఏనాటిదో” (1971). ఆ చిత్రాన్నిర జనం బాగా ఆదరించారు. అంటే అధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు చిత్రాల ద్వారా ఆశించేది వినోదం మాత్రమే అన్న నిజం ఋజువైంది. అంటే నీతి లేకుండా చిత్రాల్ని నిర్మించాలని నా ఉద్దేశం కాదు. తియ్యని మాత్రలలో చేదు మందుని నింపి మనం మింగుతున్నట్లుగా వినోదం ప్రధానంగా తీసుకుని అందులోనే నీతిని ప్రబోధించే విధంగా చిత్రాలు నిర్మించాలన్న మాట.

కాలం మారింది, ప్రేక్షకుల అభిరుచులు మారాయి. పరిశ్రమలో కొత్త పోకడలు చోటు చేసుకున్నాయి. హీరో వర్షిప్ పెరిగింది. దాంతో మాలాంటి సీనియర్ నిర్మాతలు కొంత వెనకబడ్డాం. అయినా ఫరవాలేదు. పరిశ్రమలో మళ్లీ మంచిరోజుý£స్తాయనే నమ్మకం ఉంది. నేను నా సినిమాల్లో కూడా ఎప్పటికప్ప్పుడు కొత్తవారిని ప్రోత్సహిస్తూ వచ్చాను. సత్యేంద్రకుమార్ (నటుడు), రామచంద్రయ్య (కెమెరా), యోగానంద్ (కెమెరా), ఇక మా అబ్బాయి. తులసీరాం ప్రసాద్ (నటుడు)లకు మా చిత్రాల ద్వారానే తెరకు పరిచయం చేశాను.

సొంతంగా చిత్రాలు తీయడం మానుకున్న తర్వాత “తాజ్‌మహల”, “మల్లీశ్వరి”, “పెళ్లిసందడి”, “పెద్దరికం”, “అన్నమయ్య”, “మన్మథుడు”, “పెద్దన్నయ్య”, “వీధి” - ఇలాంటి చిత్రాలు చాలానే చేశాను. ప్రస్తుతం సుమంత్ కథానాయకుడుగా నటిస్తున్న “చిన్నోడు” చిత్రంలో నటిస్తున్నాను.  ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి.  అందరికీ వివాహాలయిపోయి మనవళ్లు, మనవరాళ్లు కూడా ఎదిగిపోయారు. ముగ్గురు మనవళ్లు విదేశాల్లో వున్నారు. ఒక నటుడుగా, నిర్మాతగా, వ్యక్తిగా ఈ డెభ్బెí ఐదేళ్ల తెలుగు చలన చిత్రరంగంలో7 పదుగురి దగ్గరా మంచి అనిపించుకున్నాను.  ఆర్థికంగా గానీ, ఆరోగ్యపరంగా గానీ నాకు ఎలాంటి బాధలు లేవు. ఇక మీదట కూడా రోజులు ఇబ్బంది లేకుండా గడిచిపోతే చాలు! అంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు.