మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, అక్టోబర్ 2026, శనివారం

జోనాథన్ స్విఫ్ట్ ` గలివర్ ట్రావెల్స్ వయోజ్ టు లిల్లిపుట్

ఈ కథ ప్రారంభంలో గలివర్ గూర్చి అతని కుటుంబం గూర్చి ఉంటుంది. గలివరుకు చిన్నతనంనుండి సముద్రప్రయాణం అంటే ఇష్టం. ఇతను ఒక ఎస్టేట్ యజమాని కొడుకు. గలివరు సముద్రాలను చుట్టిరావాలని నిశ్చయించుకుంటాడు. ఆ ఉద్దేశంతో ఓడలను నడిపేశాస్త్రంను మరియు వైద్యశాస్త్య్రంను అభ్యసిస్తాడు. ఆ తరవాత ఓడలలోనే శస్త్రవైద్యుడుగా చేరుతాడు. కొద్దికాలం తరవాత ‘క్యాప్టెన్ ప్రిచర్డ్ (్పుaజూtaఱఅ జూతీఱcష్ట్రaతీd) కోరిక మేరకు గలివరు దక్షిణ సముద్రయాత్రకు బయల్దేరుతాడు.

మే నాలుగు 1699లో వారు ప్రయాణం అవుతారు. మొదట్లో వారి యాత్ర ఆనందంగా సాగుతుంది. కాని ఒకనాడు గాలివాన విపరీతంగా రావటంచేత వారి ఓడ సముద్రంలో చిక్కుకుపోతుంది. ఆశ్చర్యంగా గలివరు ‘లిల్లిపుట’ అనే ప్రాంతమును చేరుకుంటాడు. ఆ లిల్లిపుట్ వాసులు కేవలం ఆరు అంగుళాల ఎత్తుకలిగిఉంటారు. వారంతా చిన్నరూపంలో ఉంటారు. మనుషుల్లాగే వారిలో కూడా అసూయలు, కుట్రలు, అహంకారాలు, రాజకీయ కలహాలు ఉంటాయి. గలివరుకు ‘లిల్లిపుట’ రాజును అతని పరిపాలనను చూడగానే తన ఇంగ్లాండు ప్రభుత్వ పనితీరు గుర్తుకొస్తుంది. 

ఆ ప్రాంతవాసులు గలివరును చెరసాలలో బంధిస్తారు. కొద్దికాలం వరకు ఆ ప్రాంతవాసులు ఇతనిని కలుస్తుండడం ద్వారా అనేక విషయాల గూర్చి చర్చించుకున్న తరవాత కరుణతో ఇతనికి ఆదేశ భాష నేర్పించాలనుకుంటారు. అందుకోసం ఆరువందల మంది సేవకులనూ, ఆరుమంది పండితులను నియమిస్తారు. వారందరి నమ్మకాన్ని పొందటానికి గలివరు వారితో చనువుగా ఉంటాడు. వారందరితో కలిసి ఆడుకుంటాడు. వారిని తనపై ఆడుకోటానికి అనుమతిస్తాడు. గలివరు ప్రవర్తను చూసి కొన్ని నిబంధనలతో స్వేచ్ఛగా అనుమతిస్తారు. అతనిని బంధవిముక్తున్ని చేస్తారు. ముఖ్యంగా వారిని ‘బ్లెపుస్క’ (దీశ్రీవfuscu) వారి దండయాత్రనుండి రక్షించటానికి విడుదల చేస్తారు. ‘బ్లెపుస్క’ అనేవారు ఒక ఓడను సామ్రాజ్యంగా చేసుకొని జీవించే పొరుగురాజ్యంవారు. 

గలివరు లిల్లిపుట్ వాసుల జీవన పద్ధతులను వివరిస్తాడు. వారి జీవనపద్ధతులను సమాజ స్థితిగతులను తెలియజేస్తాడు. లిల్లిపుట్ వాసుల కంటిదృష్టి బహుగొప్పది. చాలకాలంనుండే అక్కడ పండితులున్నారు. గలివరు వారి రాతపద్ధతికి అమితాశ్చర్యం ప్రకటిస్తాడు. వారు యÖరప్‌వాసుల మాదిరిగా ఎడమనుండి కుడికి రాయరు, అరబ్బీ ప్రాంతవాసులు రాసే మాదిరిగా కుడినుండి ఎడమకు రాయరు. కనీసం చైనీయుల పైనుండి క్రిందికి రాసే పద్ధతిలో కూడ రాయరు. వారు ఒక మÖలనుండి మరోమÖలకు రాస్తారు. ఇంగ్లాండువాసుల చట్టం కన్నా మెరుగైన సమంజసమైన న్యాయపద్ధతులు వారు పాటిస్తారు. శిక్షలు కఠినంగా ఉంటాయి. పెద్ద తప్పుకు మరణశిక్ష విధిస్తారు. విద్యావిషయంలో వారి వారి ఆర్థికస్థోమతను బట్టి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారు. వ్యాపారస్తులు వారి పిల్లలకు వారి వృత్తిలోనే మెలుకువలు నేర్పుటకు పంపిస్తారు. బాలికలకు గృీVAపకారార్థం శిక్షణలు ఇప్పిస్తారు.

ఇట్లుండగా గలివరుకు వ్యతిరేకంగా ఆ రాజ్యంలో ఒక కుట్ర జరుగుతుంది. అతనికి గిట్టనివాళ్ళు అతనిపై నాలుగు రకాల అభియోగాలు మోపుతారు. మొదటిది, గలివరు ఆ రాజ్య ఆవరణలో మÖత్రం (Uతీఱఅవ) చేయడం దానిద్వారా వారు వెలిగించే మంటలన్నీ ఆరిపోవటం ఇది ఆ రాజ్య క్రమశిక్షణకు వ్యతిరేకం. రెండవది, గలివరు బ్లెపుస్క్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి అయిష్టతను ప్రకటించటం, తద్వారా యుద్ధంలో వారి ప్రముఖుడు చనిపోవటం, దానికి గలవరు కారణంగా అతనిపై అభియోగం తీసుకురావటం - మÖడవది గలివరు బ్లెపుస్క్ దేశ రాయబారితో స్నేహం చేయటం అతను లిల్లిపుట్ దేశమునకు శత్రువని తెలిసి తెలిసీ ఇలా చేయటం నేరంగా అ యోగము మోపుతారు. నాలుగవది గలివరు ‘బ్లెపుస్క’ రాజ్యమును ఒకసారి దర్శించాలని ప్రభువుయొక్క మౌఖిక (Uఅwతీఱttవఅ) ఆజ్ఞను తీసుకోవటం ఇలా నాలుగు రకాల అభియోగాలు గలివరుపై మోపడం జరుగుతుంది. గలివరు సంభవించబోయే అపాయం గుర్తెరిగి బ్లెపుస్క్ (దీశ్రీవfuscu) కు మర్యాద పూర్వక పర్యటనకు బయల్దేరుతాడు. అదృష్టం అడ్డుతగిలి తన ఓడ ప్రయాణికులు అడ్డుతగులుతారు. తను ఆవిధంగా తప్పించుకుంటాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి