కందుకూరి వీరేశలింగం ఏప్రియల్ 16, 1848లో రాజమహేం ద్రవరంలో జన్మించాడు. నాలుగేళ్ళ వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. పెదతండ్రిగారు ఇతనికి చదువు సంధ్యలు చెప్పించారు. తన పన్నెండవ సంవత్సర వయస్సు నుండి ఇతిహాసాలను, వేదాలను, రఘువంశం లాంటి కావ్యాలను చదవటం ప్రారంభించాడు. ఉన్నత విద్యాభ్యాసం తరవాత కొద్దికాలం ఉపాధ్యాయుడిగా కూడ పనిచేశాడు. 1874లో ‘వివేకవర్ధిని’ అను పత్రికను ప్రారంభించాడు. స్త్రీల విద్యాభివృద్ధికి తన పత్రికలో ఎన్నో వ్యాసాలు రాశాడు. 1876 లో ‘హాస్యసంజీవిని’ అను ఒక హాస్యచలోక్తులతో కూడిన మాసపత్రికను ప్రారంభించాడు. తన పత్రికలల్లో స్త్రీల విద్యను, సంఘంలోని మÖఢనమ్మకాలను గూర్చి ఎక్కువ వ్యాసాలు రాసేవాడు. వితంతువు పునర్వివాహాలకొరకు 1874 లో ఒక సంఘంను స్థాపించాడు. వీరేశలింగం బాల్యవివాహాలను నిర్ద్వందంగా ఖండించాడు. 1881 సెప్టంబరు 11వ తేదిన మొదటి వితంతు పునర్వివాహం ఇతడి సమక్షంలోనే జరిగింది. ఇలాంటి పునర్వివాహాల నిమిత్తం ఇతను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.
ముప్పైవేల రూపాయలు పోగుచేసి ‘వితంతు పునర్వివాహసంఘం’ ఒకటి స్థాపించి ఎందరినో వితంతువులకు తిరిగి పెళ్ళిల్లు చేశాడు. ఎందరో బ్రాహ్మణ ఛాందసులు ఇతనిని కొట్టటానికి సంఘం నుండి బహిష్కరించటానికి ప్రయత్నించారు. ఒక సంఘానికి లేదా దేశానికి స్త్రీవిద్య ఎంతో ముఖ్యమని నమ్మేవాడు. ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి స్త్రీవిద్యా ప్రాముఖ్యతను చాటిచెప్పాడు. అందుకోసం ‘సతీహిత బోధిని‘ ‘సత్యవతిచరితం’ ‘చంద్రమతి చరితం’ ‘సత్య సంజీవిని’ ‘పత్నీహితసూచిని’ మరియు ‘దేహరోగ్య ధర్మబోధిని’ లాంటి పత్రికలను ప్రారంభించాడు.
అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1893లో ఇతని సంఘసేవకు గాను ‘రావు బహుద్దూరు’ అనే బిరుదు చేత సత్కరించింది. దాదాపు మొత్తం విద్యార్థిలోకాన్ని తన ఉపన్యాసాలచేత ఆకట్టుకొని తన వెంబడి నడిపించాడు. ఇతను ‘సంఘసంస్కరణ సంఘం’ కు “దక్షిణ హిందుదేశ బ్రాహ్మణ సంఘం’ లకు అధ్యక్షులుగా ఉన్నాడు. ఇతను ‘ఇండియన్ ప్రోగ్రెస’ అనే మాసపత్రికకు ముఖ్య సలహాదారుడుగా ఉన్నాడు. 1907 లో రాజమహేంద్రవరంలో స్త్రీల కోసం 12,000/- రూపాయలతో ఒక సత్రం నిర్మించాడు.
కందుకూరి అచ్చతెలుగులో మహాభారతం రాయాలని సంకల్పించి ‘ఆంధ్రభాషా సంజీవిని’ అనే పత్రికలో సభాపర్వం నుండి ప్రారంభించాడు, కాని మధ్యలోనే ఆ ప్రయత్నం మానుకున్నాడు. 1874 లో పూర్తిచేయబడని చిన్నయసూరిగారి ‘నీతిచంద్రిక’ గద్యభాగమును పూరించాడు. 1978లో ‘గోల్డ్ స్మిత’ గారి ‘వేకర్ ఆఫ్ వేక్ ఫీల్డు’ ను తెలుగులోకి అనువదించటానికి ప్రయత్నించి మొదటి రెండు మÖడు అధ్యాయాల తర్వాత వదిలివేశాడు. తెలుగువారికి ఆంగ్లకథ తెలుగు అనువాదంలో నచ్చదని ‘రాజశేఖర చరిత్ర’ అను పుస్తకాన్ని ఆ తరవాత రాశాడు.
ఇది చెప్పుకోదగ్గ ఆంగ్లానువాదం కాదు. ఎందుచేతనంటే ‘వేకర్ ఆఫ్ వేక్ ఫీల్డ’ కు అంత సంబంధించింది ఉండదు. కేవలం హిందూసంఘంలోని మÖఢనమ్మకాల నిర్మూలన కొరకే రాజశేఖర చరిత్ర ఉద్దేశించింది. ఇది మొదట్లో ‘వివేకవర్థిని’ లో ధారావాహిని’గా (సీరియల్) వచ్చింది. ఆ తరువాతే పుస్తకంగా అవతరించింది. ఇదే 1887 లో ‘అదృష్ట చక్రం’ గా ‘ (ఖీశీతీtuఅవ్ణs wష్ట్రవవశ్రీ ) గా తిరిగి ఆంగ్లంలోకి క్రైస్తవ మిషనరీలు అనువదించాయి. చిత్రాల రూపంలో ఈ కథను సందేశాత్మకంగా అనువదించటం జరిగింది. ఈ పుస్తకానికి సెప్టెంబరు 6వతేది 1887 నాడు ఆనాటి జనరల్ ‘మెక్ డోనాల్డ’ ముందుమాటను రాశాడు.
1885 లో కందుకూరివారు సంస్కృత నాటకం ‘మాళవికాగ్నిమిత్రం’ ను తెలుగులో అనువదించారు. తరువాత ప్రసిద్ధ ఆంగ్ల రచయిత ‘షిరిడన’ గారి నాటకాల్ని తెలుగులో 1891 లో ‘ప్రభోదచంద్రోదయం’ ‘రాగ మంజరి’ ‘కళ్యాణకల్పవల్లి’ లాంటి అనువాద గ్రంథాలను రాశాడు.
కందుకూరి పురుషాధిక్య సమాజాన్ని ఖండిస్తూ 1891లో ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ అనే పూర్తి పురుషాధిక్యత సమాజానికి వ్యతిరేకంగా రాశాడు. ఇది జొనాథన్ స్విప్ట్ గారి ‘గలివరు ట్రావెల్స’ ను పోలిన కథగా రాశాడు. 1895లో సరియైన చిత్రాలతో సమగ్రమైన భూగోళశాస్త్రాన్ని రాశాడు.
వీరేశలింగం ‘సత్యవాది’ అను వారపత్రికను ఆంగ్లంలోను తెలుగులోను ప్రారంభించారు. 1905 జనవరి 5వతేదిన తన నివాసంలోనే ఒక బాలికోన్నత పాఠశాల నిర్మించాడు. 1906 డిసెంబరు నెల 16వ తేది ‘హిత కారిణి’ అను ఒక సంఘం స్థాపించాడు. 1894లో ‘జీసస్ జీవిత చరిత్ర’ ను అనువదించాడు. ఇది 1913 లో పూర్తి చేశాడు. సరళమైన భాషలో ఆంగ్లరచయిత ల్యాంబ్ గారి పదహారు కథలను తెలుగులో అనువదించాడు. ఇవి కేవలం స్త్రీల మనోల్లాసంకై అనువదించిన కథలు.
తెలుగుసాహిత్యంలో ‘రాజబహద్దూర’ గా ‘గద్యÛతిక్కన’ గా ‘దక్షిణ విద్యాసాగరుడి’ గా ‘నవయుగ వైతాళికుడి’ గా కందుకూరి వీరేశలింగంగారు తెలుగువారికి చిరస్మరనీయులు.
సంఘసంస్కరణ నిమిత్తం 1881-1890 మధ్య ఎన్నో పత్రికలు ముద్రించాడు.
1. ‘చమత్కార రత్నావళి’, ‘రాగమంజరి’ లాంటి నాటకాలు ఆంగ్లం నుండి అనువదించాడు.
2. ‘రత్నావళి’, ‘మాళవికాగ్నిని మిత్రం’ సంస్కృతం నుండి ‘ప్రహ్లాద నాటకం’, ‘దక్షిణగోగ్రహణము’, ‘సత్యహరిచంద్ర నాటకం’ లాంటి సంఘసంస్కరణ నిమిత్తం ఆయన ముద్రించిన పుస్తకాలు.
రచనా దృక్పథం
మన సమాజంలో పేరుకుపోయిన మÖఢ విశ్వాసాలను, దురాచారాలను తొలిగించాలనే ధ్యేయంతో వీరేశలింగం ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’ అను కల్పిత యాత్ర చరిత్రను రచించాడు. ఇది ఆంగ్లంలోని ‘గలివర్ ట్రావెల్స’ ను పోలినది. ‘గలివర్ ట్రావెల్స’ లో ‘జొనాధన్ స్విఫ్ట’ నాటి ఇంగ్లాండు దేశంలోని అవినీతి రాజకీయ, సామాజిక పరిస్థితులను వివరిస్తూ ఈ రచన చేశాడు. సంఘసంస్కరణనే ధ్యేయంగా, ప్రజాక్షేమమే లక్ష్యంగా నాడు కందుకూరి ఆంధ్రదేశంలోని మÖఢవిశ్వాసాలను వివరిస్తూ ’సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ అను యాత్రచరిత్రను రచించాడు.
కందుకూరి మొదటినుండి కూడ సంఘసంస్కరణనే ధ్యేయంగా కలవాడు. మన సమాజంలో స్త్రీని ఆటవస్తువుగా చేసి ఆమె స్వేచ్ఛను హరించి, స్త్రీని బానిసగా చూసే పురుషాధిక్య సమాజానికి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో దీన్ని రచించాడు. జ్యోతిశ్శాస్త్రం మీద అపార నమ్మకంతో తమల్ని తాము తక్కువ చేసుకొని జ్యోతిశ్శాస్త్ర పండితులచే తుల్లో కీలుబొమ్మలై జీవించేవారికి మేల్కొలుపుగా “లంకాద్వీపం” రాసాడు. జ్యోతిశ్శాస్త్ర పండితులను జ్యోతిశ్శాస్త్రీయతను తిరస్కరిస్తూ శాస్త్రపండితుల గుట్టు రట్టు చేస్తూ రాశాడు. కందుకూరి ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ ద్వారా నాటి సమాజంలోని రెండు ప్రధానాంశాలను వెలికి తెచ్చాడు. ఒకటి స్త్రీ సమస్య రెండు జ్యోతిశాస్త్రంపై ప్రజల మÖఢవిశ్వానం. స్త్రీస్వేఛ్ఛ ప్రధానాంశంగా ఈ రచనలో ‘అడుమళయాళం’ అను కథను ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ ప్రథమభాగములో చెప్పాడు. రెండవభాగంలో ‘లంకాద్వీపం’ అను కథద్వారా జ్యోతిశ్శాస్త్రం మీద ప్రజలకు గల మÖఢవిశ్వాసాలను తెలియజేస్తూ మనిషి బానిస బ్రతుకును వివరించాడు. ఈ రెండు కథలద్వారా కందుకూరి ఆంధ్రదేశంలోని మÖఢవిశ్వాసాలను, దురాచారాలను తుద ముట్టించాలని ప్రయత్నించాడు. ‘గలివర్ ట్రావెల్స’ కథను చదివి జొనాథన్ స్విఫ్ట్ ఆశించిన సంఘసంస్కరణను తెలుసుకున్నాడు. సంఘసంస్కర్తగా ఆ రచనకు ప్రభావితుడైనాడు. మన సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను రూపుమాపటానికి పూనుకున్నాడు. అందుకు ‘సత్యరాజా పూర్వ దేశ యాత్రలు’ అను ఒక వ్యంగ రచన ద్వారా ఆనాటి దురాచారాలను బట్టబయలుచేశాడు.
స్త్రీ స్వేఛ్ఛను కోరుకుంటూ, స్త్రీని అడుగడుగున అణగదొక్కే పురుషుల దమననీతిని ఖండించాడు. స్త్రీకి పరిపూర్ణ స్వేచ్ఛనూ, పురుషుడితో సమాన స్థాయిని కలిగించాలని తపించాడు. ఒక వ్యంగరచన ద్వారా సంఘంలోని దుర్మార్గాలను, దుర్నీతిని ప్రతిఘటిస్తూ ‘సత్యరాజు పూర్వదేశ యాత్రలు’ అను రచన చేశాడు. పురుషుల వంచనకు బలియైన అబలల ఆవేదననే ఈయన రచనకు ప్రేరణ. స్త్రీల విముక్తే ఈయన ధ్యేయం. రెండవభాగంలో అట్లాగే
సిద్ధాంతుల మోసానికి బలియై కడుపు కాలినా జ్యోతిశ్శాస్త్రం మీద గుడ్డి నమ్మకంతో తమల్ని తాము వంచించుకునే అమాయకులను ఉద్దరించాలని ఈ రచనకు పూనుకున్నాడు.
జ్యోతిశ్శాస్త్రం పేరుమీద జరిగే అన్యాయాలను వ్యతిరేకించాడు. అమాయకుల తెలియనితనాన్ని ఆసరగా చేసుకొని జ్యోతిశ్శాస్త్ర పండితులు చేస్తున్న మోసాల్ని, దోపిడిని అరికట్టాలనే ధ్యేయంతో ఈ రచన చేశాడు. సంఘంలో స్త్రీకి ఒక న్యాయం, పురుషుడికి ఒక న్యాయం ఉండరాదని ప్రకృతిసిద్ధంగా ఇద్దరు ఒక్కటేనని నిరూపించాడు. పురుషుడి ఆధిపత్యంలో స్త్రీ అనుభవించే బాధలను ‘అడుమళయాళం’ కథ ద్వారా తెలియజెప్పాడు. నిరంతరం స్త్రీని తమ చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని ప్రయత్నించే పురుషులకు కనువిప్పు కలిగేటట్లుగా స్త్రీ ఆధిపత్య సమాజం ఒకటి కల్పించి అందులోని పురుషులు పడుతున్న బాధలను తెలియపరచాడు. ఎక్కడ స్వేఛ్ఛకు ఆటంకం ఉంటుందో అక్కడ తెగింపు ఉంటుందని ఆ తెగింపులోనుండే తిరుగుబాటు మొదలౌతుందని తెలపటమే కందుకూరి వారి ధ్యేయం.
ప్రకృతిపరంగా స్త్రీపురుషులు ఇద్దరూ సమానులే. స్వార్థ చింతనతో మానవత్వం మరచి సాటి మానవులను పీడించే పెద్దమనుషుల బండారం బయటపెట్టాలనే కందుకూరివారు పూనుకున్నారు. తనుకు అనుకులంగానే న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాల్నీ రూపొందించుకొని శాసించే నాటి పురుషాధిక్య సమాజాన్ని తిరస్కరిస్తూ ధిక్కరించాడు. అజ్ఞానంతో మÖఢఛాందసులు స్త్రీని వంచనకు గురిచేసినప్పుడు దాన్ని చూడలేక అట్లాంటివారిని సమÖలంగా నాశనం చేయాలనే ధ్యేయంతోనే ఈ రచనకు పూనుకున్నాడు వీరేశలింగం.
పేదవాడిని మరింత పేదవాడిగా మార్చే దురాచారాలను వెలికితీసి ఖండించాలన్న ధ్యేయంతోనే రెండవకథ ‘లంకాద్వీపము’ లో జ్యోతిశ్శాస్త్ర పండితులను వారి దురాగతాలను నిలువరించాడు. తాతముత్తతలనుండి వారసత్వంగా వస్తున్న జ్యోతిశ్శాస్త్రంద్వారా ప్రజలెంత మోసపోతున్నారో తెలియజేశాడు. పుట్టినప్పటినుండి చచ్చేవరకు అన్నిపనులకు ముహూర్తాలు చూసుకొని పనిచేయటం అలవాటైంది. ఇట్లాంటి అలవాట్లచేత మనిషి స్వశక్తిని మరచి జ్యోతిశ్శాస్త్రం మీద ఆధారపడి తమశక్తులను నిర్వీర్యం చేసుకోవటం శోచనీయం. జ్యోతిశాస్త్ర పండితులు నిర్ణయించిన సమయానికే పనులు చేయాలని అమాయకంగా నమ్మే మనుషులంతా బానిస బ్రతుకులు బతుకుతున్నామని తెలుసుకోరు. జ్యోతిశ్శాస్త్ర పండితులు చేయించే కర్మకాండలకొరకు తమ ఆస్తుల్ని పోగుట్టుకుంటారు. అమాయకుల తెలియనితనాన్ని సొమ్ము చేసుకుంటూ జీవితాన్ని సాగించే జ్యోతిశ్శాస్త్ర పండితులను విరేశలింగం ఖండించాడు.
ఏ శాస్త్రమైనా మనిషి పురోగతికి, లోకకళ్యాణానికి ఉపయోగపడాలి కాని మనిషిని మభ్యపెట్టి మాయచేసి సొమ్ము చేసుకోకుడదు. నాటి సంఘంలో జ్యోతిశ్శాన్ని పండితుల మోసాన్ని బయట పెట్టాలన్న ధ్యేయంతో కందుకూరి వీరేశలింగం రెండవకథలో ప్రధానాంశంగా జ్యోతిశ్శాస్తం చెప్పాడు. తద్వారా జనుల్లో ఉన్నటువంటి మÖఢవిశ్వాసాలను తుడిచిపెట్టాడు.
ఇందులోని రెండు కథలద్వారా కందుకూరి వీరేశలింగం ప్రజాసంక్షేమ కాంక్షను, సంఘసంస్కరణ ధ్యేయాన్ని చూడచ్చు. సంస్కర్తల యొక్క ధ్యేయం ఎప్పుడు మానవ అభివృద్ధిని కాంక్షించే ఉంటుంది, ఉండాలి...
రచనా నేపథ్యం
నాడు సమాజంలో అనేక దురాచారాలు ఉండినవి. స్త్రీని అనేక రకాలుగా వంచించేవారు. స్త్రీకి విద్యాబుద్దులు చెప్పించేవారు కాదు. చిన్న వయస్సులోనే స్త్రీలకు వివాహాం చేయటం లేదా పిల్లల్ని అమ్ముకోవటం జరిగేది. కొంతవరకు కన్యాశుల్కం ఆతరవాత కాలంలో కొంతవరకు వరకట్నము సమస్యలు స్త్రీ
ఉనికికే ప్రమాదం అయ్యాయి. ఆడపిల్లల్ని ముసలివారికి ఇచ్చి వివాహం చేయటం నాటి సమాజంలో ఒక పెద్ద దురాచారం. స్త్రీలకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా పెద్దల చేతుల్లో కీలుబొమ్మలా మనుగడ సాగించేవారు. పురుషుడు చెప్పింది చేయటం తమ ధర్మంగా స్త్రీలు భావించేవారు.
కొంతమంది పురుషులు స్త్రీలను లోపలనుండి బయటకు రానిచ్చేవారు కాదు. నాలుగు గోడల మధ్య స్త్రీని బంధించి ఉంచేవారు. పురుషుడు బయటకు వెళ్ళేముందు స్త్రీని గదిలో వుంచి తాళం వేసి వెళ్ళేవాడు. పురుషుడు అనేక స్త్రీలతో తిరగడం న్యాయంగా ఉండేది. కాని స్త్రీ విషయంలో మాత్రం అది పెద్ద తప్పుగా భావించేవారు. భర్త చనిపోతే భార్య కూడా తమతోపాటు చావాలన్నది ఉండేది. దినినే సతీసహగమనం అనేవారు. ఒకవేళ బ్రతికున్నా స్త్రీ తెల్లని గుడ్డలు ధరించి గుండు చేయించుకొని అలంకరణకు దూరంగా ఉండేది. పురుషుడి విషయంలో మాత్రం తద్విరుద్ధంగా ఉండేది. భార్య మరణిస్తే పురుషుడు మరో వివాహం చేసుకోవటం, తను ఇష్టం వచ్చినట్లు జీవించటం జరిగేది. పురుషుడికి బహు భార్యత్వం ఉండేది. చిన్నతనంలోనే ముసలివాడిని పెళ్లి చేసుకోవటంచేత స్త్రీ అనేక ఇబ్బందులకు గురి అయ్యేది. ముసలిభర్త మరణిస్తే చివరివరకు పసుపుకుంకుమలకు, సుఖసంతోషానికి దూరంగా సంఘంలో దీనంగా బ్రతుకు సాగించేది. చదువు నేర్చుకొనుటకు ఇష్టం ఉన్నప్పటికి అది ఆకాలంలో స్త్రీకి తీరని కోరికగానే ఉండేది. స్త్రీ చదువు నేర్చుకొని చేసేది ఏమిలేదని భావించేవారు. చదువు చెప్పించటం శుభసూచకం కాదని తర్వాత అనేక విధాలుగా అరిష్టం జరుగుతుందని నమ్మేవారు.
స్త్రీని కేవలం వంటింటికి మాత్రం పరిమితం చేసేవారు. స్త్రీ చదువు శాస్త్ర విరుద్ధమని, స్త్రీ చదువుకుంటే లోకంలో కష్టాలు నష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని నమ్మేవారు. పురుషుడికి ఒక భోగవస్తువుగానే నాటి స్త్రీ జీవించేది. స్త్రీ పుట్టుకనుండి చివరిశ్వాసవరకు పురుషుడి ఆదిపత్యానికి గురై స్వేచ్ఛాజీవితానికి దూరంగా, బానిసగా జీవించేది. ప్రతి వయసులో స్త్రీని వంచించే పురుషులు నాటి సమాజంలో కనిపిస్తారు. స్త్రీని అబలగా మార్చి తమ ఇష్టానుసారం స్త్రీని వాడుకోవటం జరిగేది. పురుషుడి అజ్ఞానానికి అహంకారానికి స్త్రీ అనేక విధాలుగా బలి అయ్యేది. స్త్రీని యంత్రంగా మార్చి ఆమె ఆలోచనశక్తిని సమాధిచేశారు. పురుషుడి పెద్దరికంలో స్త్రీ శక్తిని గుర్తించేవారు కాదు.
ప్రకృతిపరంగా స్త్రీ పురుషులు ఇద్దరు సమానం అన్న విషయం కాలరాచారు. స్త్రీ ఎందుకు పనికి రానిదిగా చేసి కొందరు వారి బలహీనతలను కప్పిపుచ్చుకున్నారు. ఈ విధంగా స్త్రీ అనేక రకాలుగా దోపిడికి లోనై ఎదుటివారికి ఆటవస్తువుగానే మిగిలిపోయింది. ఇట్లాంటి సందర్భంలోంచే కందుకూరి స్త్రీ విముక్తి కొరకు కంకణ బద్ధుడైనాడు. సమాజంలో స్త్రీ దుస్థితిని గురించి పట్టించుకోని స్త్రీలకై, స్త్రీలస్వేచ్ఛకై తాను ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించాడు. అందులో ఒకటి ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ అను రచన.
నాటి సమాజంలో స్త్రీ దుస్థితి ఇలాగుంటే జ్యోతిశాస్త్ర పండితుల తీరు మరో విధంగా సమాజాన్ని పీడించేదిగా ఉండేది. భూమి మీద తామ దేవుళ్ళుగా తమ వాక్కు భగవంతుని వాక్కుగా ఉండాలనే ఛాందస సిద్ధాంతులు మరో ప్రక్క సమాజాన్ని దోచుకుతింటూ సంఘ పురోభివృద్ధికి ఆటంకంగా తయారు అయ్యారు. నాడు సమాజంలో జ్యోతిశ్శాస్త్రం మీద, జ్యోతిశ్శాస్త్ర పండితుల మీద జనానికి అమిత విశ్వాసం ఉండేది. అమాయకులని అనేక విధాలుగా జ్యోతిశ్శాస్త్ర వేత్తలు ప్రలోభ పెట్టేవారు.
కొత్త బట్టలు ధరించడానికి ప్రజలు జ్యోతిశ్శాస్త్ర పండితుల అనుమతి, ముహూర్తం కోరేవారు. పిల్లలు పుడితే నామకరణానికి ముహూర్తాలుండేవి. చదువు చెప్పించటానికి సరియైన సమయాన్ని జ్యోతిశ్శాస్త్ర పండితులు
నిర్ణయించేవారు. ఇల్లు కట్టడానికి, వ్యాపారం మొదలెట్టడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, శోభనాలు చేసుకోవటానికి, గృహప్రవేశానికి జ్యోతిశ్శాస్త్ర పండితుల అనుమతి కోరేవారు. వారు నిర్ణయించే ముహూర్తాలు ప్రజలకు ప్ర ధానమై ఉండేవి. పొలంకొనటానికి, విత్తనం చల్లటానికి, పంటకోయటానికి కూడా జ్యోతిశ్శాస్త్ర పండితుల ముహూర్తం చూసుకొనేవారు. రోగికి మందులు కొనడానికి, రోగి చస్తే కర్మలు చేయటానికి కూడ ముహూర్తాలు చూసుకొని పనులు మొదలెట్టేవారు.
ఇలా దైనందిన జీవితంలో మనిషి అన్ని పనులకు సిద్ధాంతుల మీద ఆధారపడడం వారుచేయమన్న కర్మకాండలు చేయటం తప్పనిసరిగా అయ్యింది. పండితులు చెప్పినట్లు చేయటం, వారు చెప్పినట్లు జరగని యెడల తామే క్రతులలో ఏదో లోపం చేశామని తలవటం జనానికి పరిపాటైంది. తమ ఆస్తులకు మించి కర్మకాండలో డబ్బులు ఖర్చు పెట్టడం, తద్వారా అడుక్కుతినే పరిస్థితి ఎదురుకావడం చాలా సార్లు జరిగేది.
జ్యోతిశ్శాస్త్ర పండితుల ముహూర్తాలవల్ల ప్రజలకు నష్టము జరిగినా వారిపట్ల జనానికి అంచంచలమైన విశ్వాసం ఉండేది. మనిషి ఎంత
ఉన్నతుడైనా ఇలా అనేక విధాలుగా జ్యోతిశ్శాస్త్ర పండితులపై ఆధారపడి బానిస బ్రతుకుకు అలవాటైనాడు. సమాజంలో అమాయకులను మభ్యపెట్టి తమ కడుపు నింపుకోవటం జ్యోతిశాస్త్ర పండితులకు పరంపరగా వస్తున్న ఆచారం. తమ స్వేచ్ఛను, తమ హక్కును కోల్పోయి కేవలం జ్యోతిశ్శాస్త్రం మీద ఆధారపడి నష్టపడే జనం నాటి సమాజంలో ఎక్కువగా ఉండేవారు. మనదంటూ ఏది లేకుండా అంతా పండితులచేతనే పండితుల ద్వారానే చేయించటం మనిషి అజ్ఞానానికి పరాకాష్ట. కూడు గుడ్డకు లేనివాడు సహితం అప్పులు చేసి పండితులచేత ముహూర్తాలు నిర్ణయించుకోవటం, భారమైన క్రతులను నిర్వహించుటకు పూనుకొనటం నాటి మానవ అజ్ఞానానికి, మÖఢవిశ్వాసానికి దర్పణం. అనేక విధాలుగా జ్యోతిశ్శాస్త్ర పండితులు అమాయక జనాన్ని ప్రలోభపెట్టి పీడించి తమ జీవితం గడుపుకునేవారు. కందుకూరి వీరేశలింగంకు ఇట్లాంటి సంఘటనలు ఎదురయ్యాయి. జ్యోతిశ్శాస్త్రం ద్వారా, జ్యోతిశ్శాస్త్ర పండితులద్వారా నాటి జనం ఎంత గొఱ్ఱె బ్రతుకు బ్రతుకుతున్నారో తెలుసుకొని జరుగుతున్న నష్టాన్ని మోసాన్ని బట్టబయలు చేయాలని తలిచాడు. ఒక పండితుడు నిర్ణయించిన ముహూర్తానికి మరో పండితుడు నిర్ణయించిన ముహూర్తానికి మధ్య తేడాల్నీ జనానికి తెలియజేయాలనే “సత్యరాజా పూర్వదేశ యాత్రలు”లో రెండవ భాగంలో ‘లంకాద్వీపం’ ను కల్పించాడు.
1. స్త్రీని అణగదొక్కే సాంఘిక దురాచారాన్ని.
2. జ్యోతిశ్శాస్త్రం మీద జనానికి ఉన్న మÖఢవిశ్వాసాన్ని
నాటి సమాజంలోని రెండింటి దుస్థితిని నేపథ్యంగా కుందుకూరి ఈ రచనను చేశాడు. ఒక సంఘసంస్కర్త ఎట్లాంటి పరిస్థితులను చూసి బాధపడతాడో అట్లాంటి పరిస్థితులను రూపుమాపటానికి ఎంతటి త్యాగానికైనా సిద్దమౌతాడన్నది ‘సత్యరాజా పూర్వదేశ యాత్ర’ లే నిదర్శనం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి