మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, అక్టోబర్ 2026, శుక్రవారం

యోగి వేమన (1947)

వాహినీ ఫిలింస్ పతాకాన కె.వి.రెడ్డి దర్శకత్వంలో నిర్మించబడిన ‘యోగి వేమన’, నాగయ్య నట జీవితాన్నే మలుపుతిప్పి, వారిని “నటయోగి”ని చేసింది.

‘భక్త పోతన’ విజయం, కె.వి.రెడ్డిగారిని ‘వేమన’ చిత్రనిర్మాణానికి పురికొల్పింది. ‘త్యాగయ్య’ విజయం నాగయ్యగారిలో ఆధ్యాత్మిక చింతనకు పాదుకొల్పింది. ‘యోగి వేమన’లో మనకు నాగయ్యగారి రుషిత్వం స్పష్టంగా కనిపిస్తుంది.

రాజాశ్రయాన్ని నిరసించిన ప్రజాకవి, భక్త పోతన...

రాముని సన్నిధే పెన్నిధిగా భావించి, నాదోపాసన చేసిన ప్రజాగాయకుడు త్యాగయ్య

“రాళ్ళు దేవుళైè్ళతే రాసులు మింగునా?” అని ప్రశ్నోపనిషత్తును రూపొందించి సామాజిక చింతనతో ప్రబోధించిన ప్రజాకవి వేమన!

ఈ ముగ్గురిలోనూ మానవతాతీతమైన సాహిత్యశక్తి నిబిడీకృతమైనది. ఈ మువ్వురిలోనూ రాజ్యం పట్ల, భోగం పట్ల నిరసన వున్నది. ఈ ముగ్గురి జీవన చరిత్రలను దృశ్యకావ్యంగా, వెండితెరపైకి ఎక్కించటం తెలుగువారి అదృష్టం.

ఈ మÖడు పాత్రలను నాగయ్యగారు అద్వితీయంగా పోషించి ధన్యుýయ్యారు. ఈ మÖడు చిత్రాలకు సముద్రాలగారు అత్యంత ప్రతిభా పాటవాలతో రచన చేసి పుణ్యులైనారు.

ఆ రోజుల్లో ప్రభాత్ స్టూడియోస్ వాళ్ళు ‘సంత్ తుకారాం’ ‘సంత్ జ్ఞానేశ్వర’ ‘ఏక్‌నాథ’ చిత్రాలు నిర్మించారు. హిందీలో విష్ణుపంత్ పగ్నిస్, సంత్ తుకారాం పాత్రలో జీవించినట్లే, నాగయ్య వేమన పాత్రలో లీనమైనారు. 

‘స్వర్గసీమ’ చిత్రాన్ని వెండివెన్నెల వెలుగుýతో తీర్చిదిద్దిన మార్కస్ బార్‌ట్లే sTÖ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహించారు. టి.టి. అరుసు శబ్దగ్రహణాన్ని, ఎఫ్.నాగూర్ కళను నిర్వహించారు. వేదాంతం రాఘవయ్య నృత్యదర్శకత్వాన్ని వహించగా, నాగయ్యగారు, ఓగిరాల రామచంద్రరావుతో కలిసి సంగీతం అందించారు... న్యూటోన్ స్టూడియోలో తీసిన sTÖ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు సహాయదర్శకులుగానే కాదు, స్క్రీన్‌ప్లే రాయడంలో కె.వి.రెడ్డిగారికి సహకరించారు.

జనశ్రుతంలో ఉన్న రకరకాల గాథలను సేకరించి, కె.వి.రెడ్డిగారే కథను రూపొందించగా, సముద్రాల వారు మాటలు, పాటలు రాశారు. వేమన రాసిన కొన్ని పద్యాలను సందర్భోచితంగా వుపయోగించారు.

కథాసంగ్రహము :

అది కొండవీడు గజపతిరాజుల కాలం. మÖగచింతపల్లె ప్రాంతాన్ని పాలించే అనవేమారెడ్డి, వేమనకు సోదరుడు. అనవేమారెడ్డి భార్య  నరసమాంబ సాధ్వి. ఆ దంపతులిద్దరూ, దేవుణ్ని కొలుస్తూ మతాచారాలను, ప్రజావిశ్వాసాలను గౌరవిస్తుంటారు. కానీ వేమనకు వేటిలో నమ్మకం లేదు. ఆయన హృదయాన్ని ఆకర్షించినవారు ముగ్గురే! అన్నకూతురు జ్యోతి, వీధిలో వుంపుడుకత్తె మోహనాంగి, ఆంతరంగిక మిత్రుడు అభిరాముడు. కృత్రిమంగా బంగారం తయారు చేయాలని అభిరామయ్య ప్రయత్నిస్తుంటాడు. అది నెరవేరితే మోహనాంగి అవసరాలకు అక్కరకు వస్తుందని వేమన ఆశ.

మోహనాంగితోనే లోకంగా, శృంగారయాత్ర చేసే వేమన మానవత్వం వున్నవాడే. ఓసారి చలిలో వణికే ముసలిస్త్రీపై, గుడిలో అమ్మవారి ఉత్తరీయం తెచ్చి కప్పుతాడు. ఈ అపచారానికి అనవేమారెడ్డి నొచ్చుకొని, గుడిని సంప్రోక్షణ చేయిస్తాడు. ఇంట్లో జ్యోతితో ముచ్చటలాడే వేమన్నను నరసమాంబ మందలిస్తుంది. బాధ్యతతో అన్నగారికి సాయపడాలని కోరుతుంది. దేవాలయ సంప్రోక్షణ సమయంలో నరసమాంబ మెడలో గల నాగహారంపై మోహనాంగి కన్నుపడుతుంది. ఆ హారం కోసం వేమన్నను వేధిస్తుంది. వేమన్న సరేనని యింటికొచ్చేసరికి జ్యోతి జ్వరంతో బాధపడ్తు కన్పిస్తుంది. జ్వరం తగ్గేదాక వుంటాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఇంట్లోని నాగహారం తీసుకొని మోహనాంగికిస్తాడు. నరసమాంబ హారం కోసం వెదకగా తానే తీసుకొని వేశ్యకిచ్చానని చెబుతాడు. అది మహాసిద్ధులు అనుగ్రహించిందని, అనర్థాలు వాటిల్లక ముందే హారాన్ని తిరిగి తెచ్చివ్వమంటుంది. అభిరామయ్య మాయాజంగమ, దేవర వేషంలో వెళ్ళి, భయపెట్టి హారాన్ని తెచ్చియిస్తాడు.

ఈ సంగతులేవి అనవేమారెడ్డి దృష్టికి రావు, ఆయనను పన్నులు చెల్లించాలని రాజప్రతినిధులు ఒత్తిడి చేస్తుంటారు. తెల్లవారేసరికి మొత్తం చెల్లిస్తానని అంటాడు. కానీ వేమన అన్నఖజానలోని ప్రజాధనం తీసికెళ్ళి మోహనాంగికి కనకాభిషేకం చేస్తానని అనుకుంటాడు.

రాజప్రతినిధులు, అనవేమారెడ్డిని బందీగా తీసికెళ్తారు. వేమన తన తప్పు తెలుసుకుంటాడు. వదిన, జ్యోతి పిలుస్తున్నా వినిపించుకోకుండా, వేశ్య వద్దకు వెళ్ళి తన ధనాన్ని తిరిగి కోరుతాడు. గోడకు వేసిన సున్నం, సానికిచ్చిన సొమ్ము ఒకటేనని అంటారు తల్లీకూతుళ్ళు. అభిరామయ్యతో కలిసి, నిద్రహారాలు లేకుండా బంగారం సాధించాలని ప్రయత్నిస్తుంటాడు. జ్యోతికి జ్వరం తీవ్రమై, చిన్నన్న కోసం కలవరిస్తుంది. చివరకు వేమన పరశువేది సిద్ధించుకొంటాడు. ఇంటికి సంతోషంగా వస్తాడు. కానీ జ్యోతి కన్నుమÖస్తుంది.

వేమన నిర్వేదనకు గురై జననమరణాల గురించి తర్కిస్తుంటాడు. అన్వేషణలో పడి, గుట్ట, చెట్టు, పుట్ట తిరుగుతుంటాడు. వేమన సాధించిన బంగారంతో అనవేమారెడ్డిని విడిపించి అభిరామయ్య కూడా మిత్రుని కోసం వెతుకుతుంటాడు. ఓ శివాలయంలో, ఈశ్వరుడే సద్గురువై వేమనకు యోగరహస్యం బోధిస్తాడు. అభిరామయ్య వేమనను కలుసుకొని అతనిలో కొత్తతేజాన్ని చూస్తాడు.

కష్టపడి సాధించిన జ్ఞానామృతాన్ని ఊరూర ప్రజలకు పంచిపెట్టి జీవన పరమార్థాన్ని తేటతెల్లంగా వివరిస్తుంటాడు. జీవకారుణ్యం, సర్వమత సామరస్యం బోధిస్తాడు. మÖఢ విశ్వాసాలను నిరసిస్తాడు. దేశసంచారంలో వృద్ధుడై జీవసమాధికి నిశ్చయించుకొంటాడు.

ఈ వార్త అభిరామయ్య వల్ల తెలిసికొని, అనవేమారెడ్డి దంపతులు వృద్ధులైవుండి కూడా, వేమన వద్దకు వచ్చి అందరితోబాటు కడసారి దర్శనం చేసుకొంటారు. యోగివేమన అందరినీ ఆశీర్వదించి కొండగుహలో ప్రవేశిస్తాడు. 

Q ‘యోగి వేమన’లో నాగయ్యతో పాటు ముదిగొండ లింగమÖర్తి (అభిరామయ్య), ఆర్.రామిరెడ్డి (అనవేమారెడ్డి), యం.వి.రాజమ్మ (మోహనాంగి), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (శివయోగి), పార్వతీబాయి (నరసమాంబ), బేబి కృష్ణవేణి (జ్యోతి), బి.కాంతామణి (కోమలాంగి), ఎ.సీత (కనకాంగి), వి.లక్క్ష్మీకాంతం (కరణం), కె.దొరైస్వామి (అప్పన్న), సి.నాగేశ్వరరావు (అర్చకుడు) తదితరులు నటించారు.

సాహితీ విశేషాలు :

‘యోగి వేమన’ చిత్రంలో కీలకమైన సన్నివేశాలలో సముద్రాల యోగబలంతో సంభాషణలు రాశారా? అనిపిస్తుంది. జీవిత పరమార్థం కొరకు పరితపిస్తున్న దశలో, అతిగుప్తమైన ఆత్మవిద్యాను బోధించడానికి భగవంతుడే ఓ గురువు రూపంలో వస్తాడు. వీరిద్దరి మధ్యసంభాషణ ఆత్మవిద్యా రహస్యాన్ని తెలుసుకోగోరే సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేట్లుగా అందేట్లుగా, రూపొందించారు సముద్రాల.

ఉదాహరణకు ఈ సంభాషŸణ గమనించండి!

గురువు (భగవంతుడు) వేమనతో : అతిగుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను. సావధానుడవైవిను. రసాన్ని కట్టేస్తే కాని స్వర్గం కానట్టు... మనసును కట్టి వేస్తే కాని సత్యము కనిపించదు. మనసే మనబంధానికీ, మోక్షానికి కారణం... మనసును స్వాధీనం చేసుకొంటే గాని మనకు స్వాధీనం కానిదేమీ లేదు. ఆ సాధనే యోగమంటారు. (పతంజలి యోగసూత్రాలు ‘యోగ చిత్తవృత్తినిరోధ్ణ’) అని చెబుతున్నాయి. ఈ అంశాన్నే సముద్రాలవారు చెప్పారు.

సాంగయోగాన్ని సాధించి, చిత్తవృత్తులనడచి సమాధి స్థిరుడవైనపుడు నీ మనసుకి అనంత శక్తి కలుగుతుంది.

అని మోక్షానికి మొదటి మెట్టు చెబుతాడు.

నాస్తికుడు, వేశ్యాసంపర్కానికి అలవాటు పడిన వేమారెడ్డిలో ఆత్మజ్యోతి వెలిగించటానికి, భగవంతుని సంకల్పం ఎలా వున్నదో, సముద్రాల, కె.వి.రెడ్డి కలిసి మలచిన ఈ సన్నివేశం తెలియజేస్తుంది.

Q ‘యోగి వేమన’ చిత్రగీతాలలో అంగారమున్నది. శృంగారమున్నది. బంగారం వంటి భావుకత వున్నది.

‘కామిగాని వాడు మోక్షగామి కాడని’ తీర్మానించిన వేమనలో జీవపరిణామక్రమమÖ కన్పిస్తుంది.

వెలది, ‘ఆపరాని తాపం’ గురించి ‘అందాలు చిందేటి చిన్నారి జ్యోతి’ గురించి రాశారు. ‘ఇంతేనా జీవితసారమింతేనా’ అనే వైరాగ్య గీతం మొదలు వేదాతీతుడు వేమన అనే వేమన యౌగిక లక్షణాలు తెలిపే గీతం వరకు అన్ని పార్శ్వాలు స్పృశించారు.

ఈ చిత్రంలో గల 22 పాటలు పద్యాలలో సముద్రాలవారు రాసినవి మొత్తం పదకొండు గీతాలు. వీనిలో ఒక పద్యం కూడా వున్నది.

‘పాహిమహేశ’ అనే భక్తి గీతం పరమేశ్వరుని కరుణాదృష్టిని కీర్తిస్తుంది. “ఆపరాని తాపమాయెరా” - జావళిని పోలిన శృంగార యుగళగీతం. ‘వదýజాలరా’ అన్నది కూడా వలపుగీతమే.

ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాల్సివస్తుంది. వేమన పాత్ర జననమరణముల మధ్య భేదనకోసం, జీవనపరమార్థం కోసం, పరితపించేది. ఈ పరిక్రమంలో, భార్య, పిల్లలు, సంసారం, సుఖము, ద్ణుఖము వంటి దశలుంటాయి. స్త్రీవాంఛ నుండి ధనవాంఛ (బంగారం తయారి) నుండి మనసు మరల్చుకొని యోగ సాధనలో పడిపోయి సామాజిక తత్త్వవేత్తగా, వేదజ్ఞానిగా పరిణమించాడు. అందుకే పాటలన్ని విషయప్రధానాలే అయ్యాయి గాని కవిత్వప్రధానాలు కావు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి