మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, అక్టోబర్ 2026, శనివారం

సుజాత.....సినీ మత్స్యగంధి

‘హైలో హైలెస్సా...’ అంటూ శంనుని మనసేగాక ఆంధ్రప్రదేశ్ లోకాన్నంతా జమునారాణి కంఠం సహాయంతో ఉర్రూతలూగించిన సినీ మత్స్యగంధి సుజాత.

సినిమా, నాటకం, గాత్రధారణ... ఈ మÖడు రంగాల్లోనూ విశేష ప్రతిభ కనబరచి ప్రేక్షక హృదయాల్లో ఇప్పటికీ ‘భీష్మ’ సుజాతగా నిలిచిపోయిన నిన్నటి తరం నటి సుజాతతో కాసేపు...

మా సొంతవూరు తెనాలి సమీపంలోని చినరావూరు. సూరయ్య, శ్రీమతి వెంకటరత్నమ్మ గార్లు నా తల్లిదండ్రులు. మాది మొదటి నుంచీ వ్యవసాయ కుటుంబమే! నాకు ఇద్దరు అన్నయ్యలు. వాళ్లకు చెల్లెలు నేనొక్కదాన్నే కావడంతో నన్ను చాలా గారాబుగా చూసుకునే వారు. మా అమ్మ కూడా నన్ను ఒక కళాకారిణిగా ఎదిగితే చూడాలని ఆశపడేది. అందుకే నాకు చిన్నప్పటి నుంచీ సంగీతం, నాట్యం నేర్పించాను. ఆ రోజుల్లో ఎం.ఎస్.శైవ అని ఓ నాట్యాచార్యుడుండేవారు. ఆయన దగ్గర నాకు నాట్యశిక్షణ ఇప్పించారు. ఆయన అప్ప్పుడు గుంటూరులో ఉండేవారు. ఆయన దగ్గర డాన్సు నేర్చుకోవడం కోసమనే నన్ను గుంటూరులో పెట్టారు మా అమ్మానాన్నలు. ఆ తర్వాత శైవా గారే తెనాలి రావడంతో ఇక నాకు సమస్య లేకుండా పోయింది. ఆయన దగ్గర కూడిచూడి డాన్సు నేర్చుకున్నాను. నా ఐదవ ఏటనే డాన్సు ప్రోగ్రామ్స్ ఇవ్వడం ప్రారంభించాను. నా అసలు పేరు సరోజిని. అయితే తెనాలిలో వి.సాంబశివరావు గారని ఉండేవారు. ఆయన నాట్యప్రదర్శనలు చూసి ముగ్ధులై, మా అమ్మానాన్నలతో మాట్లాడ ‘బేబీ సుజాత Ê పార్టీ’ అనే పేరుతో ఓ డాన్స్ ట్రూప్ పెట్టి నా పేరు సుజాతగా మార్చారు. 

నా విద్యాభ్యాసం అంతా తెనాలిలోని మునిసిపల్ గర్ల్స్ హైస్కూలులో సాగింది. ప్రముఖ సినీనటి ఊర్వశి శారద ఆ పాఠశాలలో నా సహాధ్యాయి. మేమంతా స్కూలు నాటకాల్లో చాలా చురుగ్గా పాý£్గనే వాళ్లం. ఓ సారి శకుంతల నాటకం వేస్తే, అందులో నేను దుష్యంతుడిగా నటించాను. శారద ఆశ్రమ బాలిక పాత్ర ధరించింది. నేను బాగా డాన్సు చేస్తానని పాఠశాలలో నన్ను బాగా చూసుకునేవారు టీచర్లు. నా 11వ ఏటనే నా నృత్యకౌశలాన్ని చూసి నాకు భువనగిరిలో నృత్య ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం వచ్చింది. వయసు చాలకపోయినా నెలకు రూ.300/-లు జీతంతో నేను భువనగిరిలో పనిచేశాను. మా అమ్మ, నాన్నలు నా ఉత్సాహాన్ని చూసి నాతో పాటే అక్కడకు వచ్చేశారు.

నేను తెనాలిలోనే ఫోర్త్ ఫారం వరకూ చదువుకున్నాను. ఆ బడిలోనే సరస్వతి గారని ఓ తెలుగు టీచరు ఉండేవారు. ఆమె కూతురికి నేను డాన్సు నేర్పేదాన్ని. ఆమెకు వినోదా సంస్థ అధినేత డి.ఎల్.నారాయణ గారు తెలుసు. ఆయన ఆ సమయంలో “సిపాయి కూతురు” అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అందులో వాంప్ వేషానికి తగిన యువతి కోసం అన్వేషిస్తూ తెనాలిలో ఎవరైనా ఉంటే చెప్పమని సరస్వతి గారిని అడిగారు. ఆమె ఆలోచించి చెప్తానన్నారట. ఆమె ఇదే విషయాన్ని మా ఇంట్లో చెప్పి నన్ను చెన్నెíకు తీసుకువెళ్ళమన్నారు. నాకు కూడా చిన్నప్పటినుండీ సినిమాలంటే ఇష్టమే! పైపెచ్చు జమునగారంటే విపరీతమైన ఆరాధన. ఆమె స్టెíల్‌ను అనుకరించేదాన్ని. జమునగారిని దగ్గరగా చూడాలని, ఆమెను అక్కా అని పిలవాలని తెగ ఆరాటపడేదాన్ని. సినిమాల్లోకి వస్తే ఆ కోరిక తీరుతుందేమోననే ఆశతో సినిమాలపై మోజు పడ్డాను. కానీ మా నాన్న, అన్నయ్యలు ససేమిరా కాదన్నారు. మా కుటుంబాల్లో తర్జనభర్జనలు జరిగాయి. ఎట్టకేలకు మా అమ్మగారి పట్టుదలతో సినిమాల్లో చేరడానికని చెన్నెí వచ్చాం. డి.ఎల్.నారాయణ గారు నన్ను చూసి మరీ చిన్నపిల్ల, మళ్లీ ఎప్ప్పుడైనా చూద్దాంలే అనేసి, ఆ పాత్రకు ఎల్.విజయలక్ష్మిని తీసుకున్నారు. ఆమెకూ అదే మొదటి సినిమా.

సరే ఇక ఏం చేద్దాం అని ఆలోచిస్తుండగా నాకు చిన్నతనంలో నాట్యం నేర్పిన ఎం.ఎస్.శైవ గారు అప్ప్పుడు చెన్నెíకే వచ్చేశారని తెలిసింది. మా అమ్మావాళ్లు ఇంకా బాగా నాట్యం నేర్చుకోమని వారి వద్ద చేర్చారు. సరేనని నేనూ డాన్సు కొనసాగించాను. శైవాగారి దగ్గరకు నాటకాల వాళ్లు, సినిమాల వాళ్లు అప్ప్పుడప్ప్పుడూ వచ్చిపోతుండేవారు. అలా ఓసారి నాగభూషణం గారు వస్తే, శైవగారు నన్ను వారికి సిఫారసు చేశారు. అలా ఆ నాటకంలో ఇందిర పాత్రకు నన్ను తీసుకున్నారు. ఆ పాత్రను నాకు ముందు శారద గారు వేసేవారు. నా తర్వాత వాణిశ్రీ గారు వేస్తూవచ్చారు. ఆ నాటకం నాకు మంచి పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. ఈ నాటకం పాపులర్ కావడంతో అడపాదడపా సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అలా “భక్త అంబరీష” (1959) చిత్రంలో మొట్టమొదటిసారిగా ఈలపాటు రఘురామయ్య గారి సరసన శ్రీమహాలక్ష్మి పాత్రలో కన్పించాను. వెంటనే “దీపావళి” (1960) లో రంభగా చేశాను. ఆ తర్వాత నాగన్న అని ఓ నిర్మాత “నాగార్జున” (1963) అని ఓ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో తీశారు. ప్రముఖ కన్నడ హీరో రాజ్‌కుమార్ గారు అందులో అర్జునుడిగా వేశారు. కాంతారావు గారు శ్రీకృష్ణుడిగా వేశారు. అందులో నేను సుభద్రగా నటించాను. జి.వరలక్ష్మి గారు ఉలూచి వేషం వేశారు. ఆ సినిమా తర్వాత “కన్నకొడుకు” (1961) అనే చిత్రంలో రాజనాల సరసన నటించాను. ఆ పాత్ర కథానాయిక కిందే లెక్క. బి.ఏ.సుబ్బారావు గారు “భీష్మ” (1962) చిత్రంలో మత్స్యగంధి పాత్రను ఇచ్చారు. ఆ వేషానికి మొదట సత్యవతి (రచయిత అనిసెట్టి సతీమణి) గారిని అనుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల ఆమె విరమించుకుంటే ఆ అవకాశం నాకు లభించింది. అప్పట్లో నాకు పంటిమీద పన్ను ఉండేది. సుబ్బారావు గారు ఆ పాత్రకోసమనే ఆ పళ్లు బాగాలేదని దాన్ని కరిగించేసి, మళ్లీ ఏదో క్యాప్ వేసి చాలా శ్రద్ధ తీసుకున్నారు. ‘హైలో హైలెస్సా...’ పాట నా మీద చిత్రీకరించారు. జమునారాణి గారు ప్లేబాక్. ఆంధ్రదేశాన్ని అదరగొట్టేసిందా పాట. ఇప్పటికీ అభిమానులు నన్ను మీరు ‘భీష్మ’ సుజాత గదా అని గుర్తు పట్టి పలుకరిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వాలి (ఆర్టు డైరెక్టరు), హరిబాబు (మేకప్ మాన్) గార్లు చాలా శ్రద్ధతో సత్యవతి పాత్రను రూపొందించారు. ఎన్‌టి.రామారావు గారికి తల్లి వేషం. నాదేమో చిన్న వయసు. అయినా బి.ఏ.సుబ్బారావు గారు చాలా ధైర్యం చేసి ఆ పాత్ర ఇచ్చారు. నేనూ మంచి ఫెరఫామెన్సే ఇచ్చాను. ఈ సినిమా సెట్లోనే ఎన్.టి.రామారావు గారు “సుజాత గారూ! బాగా చేయండి. మంచి వేషం, మంచి పేరొస్తుంది” అని ఆయన స్టెíల్‌లో గంభీరంగా అన్నారు. ఆయన మాటే నిజమయ్యింది.  ఆ పాత్ర ఈనాటికీ తెలుగు సినిమా చరిత్ర పుటలలో నిలిచిపోయేంతగా నాకు మంచి బ్రేక్ ఇచ్చింది.

“భీష్మ” చిత్రం నాకు పేరైతే తీసుకువచ్చింది గానీ వెంటనే అవకాశాలు మాత్రం తీసుకురాలేదు. మరి ఖాళీగా ఉండలేం కదా. ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం గారి ట్రూపులో చేరి “శ్రీకాళహస్తి మహాత్మ్యం”, “శాంతినివాసం” నాటకాల్లో నటిస్తూ వచ్చాను. అదే విధంగా వల్లం నరసింహారావు, జి.వరలక్ష్మి, శారద మొదలైన వారితో ‘మనోహర’ నాటకంలో నటించాను. ఆ నాటకానికి నాకు చ ఆలా మంచిపేరు వచ్చింది. అప్ప్పుడే జి.వరలక్ష్మి గారు నటనలో మెళుకువలు ఎన్నో నేర్పారు. సంభాషణలు ఉచ్చరించే విధానం నేర్పారు.

ఇలా నాటకాల్లో బిజీగా ఉన్నరోజుల్లోనే కన్నడ చిత్రసీమలో మంచి అవకాశాలు వచ్చాయి. “గౌరి” అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించాను. ఈ చిత్రంలో డా॥షావుకారు జానకి గారు నాకు తల్లిగా నటించారు. ఆమెతో నటించడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఆమె తీరిక దొరికినప్ప్పుడల్లా ఇలా నటించాలి, ఇలా డైలాగ్ చెప్పాలి అని చెప్పించేవారు. నిజానికి ఆ వయసులో మాకు అవి లెసన్స్‌లాంటివి. ఇంకా “సతిశక్తి”, “రణధీర కంఠీరవ” తదితర కన్నడ చిత్రాల్లో నటించాను. తెలుగులో “మదనకామరాజుకథ” (1962), “పరువు ప్రతిష్ఠ” (1963), “బంగారుపక్షులు” ఆ రోజుల్లో చాలా పాపులర్. ఆ నాటకాన్ని ఓసారి చెన్నెí, వాణీమహల్‌లో ప్రదర్శించారు. నేను, మణిమాల అందులో హీరోయిన్లుగా నటించాం. ఇంకా అందులో ఎస్.వి.రంగారావు, శారద, రామృష్ణ మొదలైన వారంతా నటించారు. ఆ నాటకాన్ని చూసే వి.మధుసూదన రావు “వీరాభిమన్యు” (1965) లో అవకాశం ఇచ్చారు. మొదట ఆ పాత్రకు వాణిశ్రీ గారి ననుకున్నారు. కానీ ఆ సమయంలో ఆమె బిజీగా ఉండడంతో నన్ను తీసుకున్నారు. అభిమన్యుడు స్తీ రూపంలో ఉత్తరను సమీపించే పాత్ర అది. నాకు, కాంచనకు ఆ చిత్రంలో ఒక పాట కూడా ఉంది. ‘తాకిన చోట చల్లదనం...’ అనే పాట అది 

ఈ “పంజరంలో పక్షులు” నాటకంలోనే పిఠాపురం రాజావారి మనవడు ఎం.ఎం.కె.అప్పారావు గారు ప్లేబాక్ పాడారు. ఆ నాటక ప్రదర్శనకు పెట్టుబడి కూడా ఆయనదే. ఆయన నాటకంలో నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ పెళ్లితో నేను విజంగానే పంజరంలో పక్షినై పోయాను. రాజావారు నన్ను సినిమాలు మానేయమని ఆంక్ష విధించారు. అప్ప్పుడు “వీరాభిమన్యు” షూటింగ్ జరుగుతోంది. సినిమాలు మానేస్తున్నానని తెలిసి శోభన్‌బాబు గారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమన్నారు. సినిమాలు మానేస్తే చాలా కష్టాలు పడాల్సివస్తుందని చాలా దూరం చెప్పిచూశారు. కానీ నేను మానుకోవాలనే నిర్ణయానిచ్చేశాను. అ్పటికే, “వీరాభిన్ము” షూటింగు అయిపోయిన తర్వాత వాహినీ స్టూడియోలో అందరికీ చెప్పేసి, ఫ్లోర్ నుండీ వస్తూవస్తూ, ఇక సినిమాల్లోకి రాను, ఒకవేళ వచ్చినా ఏ అమ్మ వేషాలకో, బామ్మ వేషాలకో వస్తానేమోనను కుంటూ బాధతో వచ్చేశాను. పెళ్లితో సినిమా జీవితం పూర్తిగా ముగిసిపోయింది. అంత్ణపుర జీవితం, ఘోషా పద్ధతి... ఎవ్వరినీ కలిసేందుకు కూడా వీలుండేది కాదు. నాకేమో ఇంట్లో ఖాళీగా కూర్చోవడం మొదటి నుంచీ ఇష్టముండేది కాదు. 1967 లో నాకు ఒక కొడుకు పుట్టాడు. బాబుకు ఒకటిన్నర సంవత్సరం వయసు వచ్చాక ఇక అసలు ఇంట్లో ఉండలేకపోయాను. సరేనని ఎలాగో రాజావారిని ఒప్పించి ప్రాధేయపడి ఆంధ్రమహిళాసభలో బెనారస్ మెట్రిక్‌లో చేరాను. అక్కడే షావుకారు జానకి గారి కూతురు యజ్ఞప్రభ, ప్రముఖ సినీనటి శ్రీవిద్య నాకు క్లాసుమేట్సు, అక్కడ చదువుకుంటున్నప్ప్పుడే ఓ రోజు షావుకారు జానకి గారు తమ కూతురిని ఇంటి తీసుకువెళ్లడానికి కాలేజికి వచ్చారు. అక్కడే వాళ్లందరూ సినిమా నటి వచ్చిందని ఆవిడ ఆటోగ్రాఫుల కోసం, ఫోటోల కోసం ఎగuడ్డారు. అది చూసిన నాకు మళ్లీ ఒక ఆలోచన ప్రారంభమయ్యింది. ఈ వయస్సులో మనం చదువుకొని ఏం ఉద్యోగాలు చేస్తాం... సినిమా స్టార్‌లకి ఇంత క్రేజీ వుంటుందా? నేనూ ఒకప్ప్పుడు సినిమా నటినే కదా? అని అనుకున్నాను. మళ్లీ నాలో అణచబడి ఉన్న కళాపిపాస పైకి లేచింది. ఇదే విషయాన్ని మా వారితో చెప్పాను. వారు ససేమిరా కాదన్నారు. సరే బాబును మా అమ్మ, చూసుకుంటూ ఉండడంతో నేను సినిమాల్లో కాకపోయినా ఏదైనా ఉద్యోగమైనా చేద్దామనుకున్నాను. అలా వరల్డ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌లో రిసెప్షనిస్టుగా చేరాను. అలా ఆ అంత్ణపురం నుండీ బయటపడి కాస్త ప్రపంచాన్ని చూవాను. ఆ సమయంలోనే నా జీవితం ఊహించని మలుపు తిరిగింది. రాజావారి అశ్రద్ధ వల్ల కుటుంబం ఆర్థికపరమైన ఒడిదుడుకులకు లోనైంది. గడవడం కొంచెం కష్టమయ్యింది. ఆస్తిపాస్తులన్నీ కోర్టు వ్వవహారాల్లో చిక్కుకున్నాయి. ఇంచుమించు దిక్కుతోచని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో ఋష్యేంద్రమణి గారు నాకు చాలా ఓదార్పునిచ్చారు. సినామల్లోకి రావాలనే తపన ఉన్నా, ఫీల్డు టచ్ పోయింది కనుక అవకాశం కోసం చాలా శ్రమపడాల్సి వచ్చింది. చివరకు ఇల్లు గడవడం కోసం పాటల రికార్డింగుల్లో కోరస్‌గా కూడా వెళ్లాను. చాలా నిస్సహాయురాలినైపోయాను. రాజావారు ఇల్లు పట్టించుకోలేదు. మా అమ్మ, నేను, చంటి పిల్లాడు...ఒక స్తీగా నేఏం చేయగలను? ఒక్కసారి ఆ పరిస్థితిని ఇన్నేళ్ల తర్వాత ఊహించుకున్నా గుండె ఝల్లుమంటుంది. ఎందుకంటే సినిమా రంగం చాలా చిత్రమైన ప్రపంచం, నక్షత్రాలు రాత్రే కన్పిస్తాయి. అవి పగలు కూడా కన్పిస్తే, వాటికి విలువ ఉండదు. అందుకే కాబోలు నటీనటుల్ని  తారలన్నారు. ఈ తారలు తెరమీద కనిపించినంత సేపే విలువ, గౌరవం. ఆ తర్వాత ఏమీ వుండదు. నాకూ అలాంటి పరిస్థితే పరిశ్రమలో ఎదురయ్యింది. 

మళ్లీ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాను. వేస్టు ఫిలిం రాజు గారు “అమ్మమాట” (1972) లో రాజబాబుకు తల్లివేషం ఇచ్చి ప్రోత్సహించారు. ఆ సమయంలోనే ఎన్.టి.ఆర్. గారిని వెళ్లి కలిసి విషయమంతా చెప్పాను. ఆయన చాలా సహృదయంతో స్పందించి తన నిర్మాతలంతా నా గురించి చెప్పారు. ఎస్.డి.లాల్‌గారు “నాపేరే భగవాన” (1976), “నిప్ప్పులాంటి మనిషి” (1974), “నేరంనాదికాదు ఆకలిది” (1976), “అన్నదమ్ముల అనుబంధం” (1977) చిత్రాల్లో మంచిపాత్రలే ఇచ్చి మళ్లీ నా జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి దోహదపడ్డారు. ఆ పరంపరలోనే వరసగా సుమారు అరవై చిత్రాలు “తులాభారం” (1974), “చిన్ననాటి స్నేహితులు” (1975), “దొరలు దొంగలు” (1976), “నాలాగ ఎందరో” (1977), “చిరంజీవి రాంబాబు” (1978), “శ్రీరామపట్టాభిషేకం” (1978), “తిరబడ్డ తెలుగుబిడ్డ” (1988) తదితర చిత్రాలు చేశాను. తెలుగులో నా చివరి సినిమా “జగన్నాటకం” (    ).

ఇక నేను చెప్పాల్సింది ప్రముఖంగా నాటకరంగం గురించి... నేను కష్టాల్లో కూరుకుపోయి ఏమీ చేయలేని క్లిష్టపరిస్థితుల్లో నన్ను తల్లిలా ఒడి చేర్చుకుంది నాటకరంగం.  సినిమాల్లో వేషాలకోసం ప్రయత్నించి విసుగు చెంది వేసారిపోయిన సమయంలో గుడిమెట్ల గంగరాజు గారు నన్ను నాటకరంగంలోకి ఆహ్వానించారు. ‘చింతామణి’ నాటకంలో చింతామణిగా చాలా పరేరు తెచ్చుకున్నాను. సూరవరపు వేంకటేశ్వర్లు, కాళిదాసు పురుషోత్తం, పద్మనాభం, మాడా... ఇలా అందరితోనూ చింతామణిగా నటించి విశేషమైన కీర్తి, డబ్బు సంపాదించాను. చెదిరిపోయిన గూడును తిరిగి కట్టుకుని మళ్లీ ఓ మాదిరి స్థితికి వచ్చాను. సినిమారంగంలో ఒకసారి పడిపోతే మళ్లీ లేవడం చాలా కష్టం. అందుకే కెరీర్ విషయంలో గానీ, డబ్బు జాగ్రత్త విషయంలో గానీ చాలా పట్టుగా ఉండాలి. జీవితాన్ని తెగిన గాలిపటాల్లా చేసుకోకూడదు. పైగా ఓనాడు ఇండస్టీలో ఓ వెలుగు వెలిగి చివరి రోజుల్లో తిండికి జరక్క భిక్ష ఎత్తుకొన్న నటీమణులు నాకు తెలుసు. వాళ్లను నేను చాలా దగ్గరగా చూశాను కూడా. తారల తళతళల వెనుక ఎన్ని వెలవెలలుంటాయో! అందుకే శోభన్‌బాబు గారు ఎప్ప్పుడూ అనేవారు - “సుజాత గారూ! పది మందికి ఇస్తూపోతే ఏదో ఒకరోజు మన చెయ్యి ఆ పుచ్చుకునే వాళ్ల జాబితాలోకి వచ్చేస్తుందని!” అది ఫాలో అయ్యాను. అలా సినీ జీవితానికి రామారావు, నిజ జీవితానికి శోభన్‌బాబు గార్లు నాకు మార్గదర్శకులు.

“చింతామణి” నాటకనాన్ని ఆంధ్రదేశమంతా సుమారు 200 ప్రదర్శనలు ఇచ్చి ఉంటాను. దీని తర్వాత నాకు పేరు తెచ్చిన మరో నాటకం “బాలనాగమ్మ” గాండ్లసంగు వేసేదాన్ని. ఈ రెండు నాటకాల్ని ఎల్.పి. రికార్డులుగా కూడా ఇచ్చాను. లలితబాబు (భవానీశంకరుడు), నేను ఇచ్చిన చింతామణి ఎల్.పి., వల్లూరు వెంకటరామయ్యచౌదరి (మాయలమరాఠీ), నేను ఇచ్చిన బాలనాగమ్మ ఎల్.పి. ఈ రెండూ ఆరోజుల్లో ఆంధ్రదేశంలో మార్మ్రోగిపోయాయి. అదే విధంగా స్థానం ననరసింహారావు. టి.జి.కమలాదేవి గార్లతో కలిపి నేను, వాణిశ్రీ ‘చాణక్య చంద్రగుప్త’ నాటకాన్ని ఆడాము. ఆ రోజుల్లో సినిమాతారలు నాటకాల్లో వేస్తున్నారంటే జనం ఎగబడేవారు. అదుకేకోస్తా ప్రాంతంలోని పలు నాటకసమాజాలు మమ్మల్ని చాలా గౌరవంగా తీసుకువెళ్లేవారు. నిజానికి నా జీవితమంతా నాటకరంగంతోనే ముడిపడి ఉందని చెప్పవచ్చు. ఇక జమున గారి స్వంత ట్రూపులో “శ్రీకృష్ణతులాభారం” లో రుక్మిణిగా నటించాను. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. చిన్నప్ప్పుడు జమునగారిని చూసి చాలా దగ్గరగా వెళ్లి ఒక్కసారన్నా అక్కా! అని పిలవాలనుకునేదాన్ని కదా. ఆ కోరిక సినిమాలో తీరింది. “బంగారుమనసులు” (1973) చిత్రంలో ఆమెకు చెల్లెలుగా చేశాను. అయితే ఈ నాటకంలో జమున గారు సత్యభామ, నేనేమో రుక్మిణి గనుక ఆమెకు నాటకాల్లో నేను అక్కనయ్యాను. ఇది చాలా తమాషాగా ఉంటుంది.

మా “చింతామణి” నాటకమంటే భారతీరాజా గారికిచాలా అభిమానం. మేము ఎక్కడో నాటక  ప్రదర్శనలో ఉంటే చెన్నెíకు పిలిపించి మరో “కొత్తజీవితాలు” (1981) చిత్రంలో అంతర్నాటకంగా “చింతామణి” ప్రదర్శింపజేశారు. అంత పాపులారిటీ నాకు సినిమా రంగంలో రాలేదు. అయితే తొలి చిత్రం “భీష్మ” నాకు చిరునామాగా మారిపోవడం నా అదృష్టం.

ఇక ఆంధ్రదేశం నన్ను ప్రముఖంగా గుర్తు పెట్టుకున్న మరో చిత్రం “దానవీరశూరకర్ణ” (1977), ఎల్.టి.రామారావు గారు పిలిచి మరీ ఆ చిత్రంలో కర్ణుడి పెంపుడు తల్లి రాధ వేషం ఇచ్చారు. అందులో నాపై చిత్రీకరించిన ‘ఏ తల్లి నిన్ను కన్నదో...’ అనే పాట ఇప్పటికీ పాపులర్. తెలుగులో నా చివరి చిత్రం “జగన్నాటకం” (1991).

ఒక్క తెలుగు చిత్రాల్లోనే గాక “ఉతగం సుట్రియ వాలిబన”, “చిన్నపువ్వే మెల్లపేసు”, “పుదియగీతై” మొదలైన తమిళ చిత్రాల్లోనూ, “లవకుశ” అనే ఒరియా చిత్రంలోనూ నటించాను. కూటికోసం కోటివిద్యలన్నట్లు డబ్బింగులూ చెప్పాను. రాజసులోచన, సుకుమారి, మంజుల, సిల్కుస్మిత, కుయిలీ, జ్యోతిలక్ష్మి... ఇలా చాలామందికి తమిళం నుండే తెలుగులోకి వచ్చిన చిత్రాల్లో డబ్బింగ్ చెప్పాను. నేనూ స్వయంగా నాగమ్మ, పవిత్రబంధం, అక్క, మÖడుముళ్లబంధం మొదలైన తెలుగు సీరియల్స్‌లోనూ, శివమయం, కాలం, చిత్తి తదితర తమిళ సీరియల్స్‌లోనూ నటించాను. ఇంకా తమిళ సీరియల్స్ చేస్తూనే వున్నాను.

మా అబ్బాయి ఎం.వి.భానుప్రకాష్ కూడా సినిమా నటుడే. ఆ రోజుల్లో మేం వీనస్ స్టూడియో ప్రకప్కన ఉండేవాళ్లం. అలా చాలామంది నిర్మాతలు, దర్శకులు బాబు ముద్దుగా వున్నాడని చెప్పి సినిమాల్లో నటింప చేశారు. “పటిందల్లా బంగారం” (1971) తదితర చిత్రాల్లో మాస్టర్ భానుప్రకాష్ పేరుతో బాలనటుడిగా చిత్రసీమలో ప్రవేశించాడు. పెద్దయ్యాక “తలైవాసన”, “ఆశిక్కీలియే కోవమా” తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు. ప్రస్తుతం తమిళ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నాడు. అతడు బి.ఇ.మెకానికల్ ఇంజనీరిగు చదివినా నా నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్నందుకు సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం భాను, స్టూడియో ‘ఈ’ కంపెనీకి రీజనల్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. చెన్నెíలో ఇటీవల జరిగిన సిసిఎల్ ప్రాగ్రాంను కూడా మా వాడే నిర్వహించేవాడు. 

సాధారణంగా కళాకారులకు రిటైర్డ్‌మెంటు అనేది ఉండదు. మంచి అవకాశాలు వస్తే ప్రతి ఆర్టిస్తూ తప్పకుండా చేస్తాడు. నేనూ అంతే. చెన్నెíలో నా వరకూ వచ్చే ప్రతి పాత్రనూ ధరిస్తున్నాను. మా కొడుకు కోడలు (సునంద) తో హాయిగా ఉన్నాను. మా మనవరాలు (నమ్రత), మా మనవడు (రాజ్) ప్రస్తుత నా కాలక్షేపం. చాలు. ఈ జీవితం... చాలా సంతృప్తిగా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే నేనో పడిలేచిన కడలి తరంగం.  చెన్నెíలో శారద, రేవతి (మిసెస్ బౌనా), బెంగుళూరులో జయంతి నా స్నేహితురాళ్లు. వీళ్లతోటి నా కష్టసుఖాలు పంచుకుంటూ అన్ని విధాలా సంతృప్తిగా ఉన్నాను.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి