మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2026, శుక్రవారం

అక్షర అభినందన ....సమర్పణం

పితృదేవతలే వచ్చిన వేళ 

దేవతలే వచ్చిన వేళ పులకించిన

మదిని మైమరపించాలి 

మల్లెలై నడిచొచ్చిన వేళ 

మీ అందరితో ఒక మాట చెప్పాలి 

ఆ మాటతో మీ మనసు పులకించాలి 

ఒకనాటి మన జన్మ భూమి 

మనకంతా అదొక కర్మభూమి 

నేడు నిరాశ్రితులకది ఆవాసమైతే 

మన స్వప్నం సాకారమే గద

అనురాగం అంబరమైతే 

ఆనందం అర్థవమే గద 

సంబరమే సంతసంఋ గద 

కలలన్నీ కన్నులజూడగా 

మనంబులో మధువే పారును 

నవ జీవన నవోదయమ్ములో 

కల హంసల కళావిలాసం 

అమరంగా ఆమని గీతం 

కుసుమమ్ముల కోమలి నృత్యం 

మనమందున మౌనరాగమై 

అలరించును అందరిలోన 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి