తెలుగు సినిమా పరిశ్రమలో అందరికీ సుపరిచితులు బాలయ్య. నటన పట్ల పెద్దగా ఆసక్తి కనబచక పోయినప్పటికీ, ఆయనలో దాగివున్న నటనా నైపుణ్యం, ప్రతిభ వెండితెర మీదకు ఆయన జీవితాన్ని నడిపించింది. 350 చిత్రాల్లో తన సహజ నటనను ప్రేక్షకుల ముందు ప్రదర్శించిన విలక్షణ నటుడు బాలయ్య. 76 ఏళ్ల బాలయ్య, సినీ నటుడుగా, నిర్మాతగా, కథా రచయితగా, దర్శకుడుగా అనుభవాలతో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి, సహృదయుడు. నిండుగా నవ్వడమే తప్ప, కోప్పడ్డం తెలీని ఈ అసాధారణ నటుడి జ్ఞాపకాలు ఈ వారం...
నేను 09-04-1930 న గుంటూరు జిల్లా, అమరావతి మండలం చావపాడు గ్రామంలో జన్మించాను. శ్రీ మన్నవ గురవయ్య, శ్రీమతి అన్నపూర్ణమ్మ గార్లు నా తల్లిదండ్రుటు. మాది మొదటి నుండీ వ్యవసాయ కుటుంబం. నా యిద్దరు సోదరులు ఇప్ప్పుడూ అక్కడే వ్యవసాయం చూసుకుంటున్నారు. ఒక తమ్ముడు మైనింగ్ ఇంజనీరు.
చావపాడు u£త్తిగా చిన్న గ్రామం. ఆ కాలంలో చదువుకోవడానికి బడికూడా లేని వూరు. అందుకని నేను పక్క వూళ్లో పైవేటుగా రెండో ఫారం వరకు చదువుకుని, 1942లో గుంటూరు హిందూ కాలేజీ హైస్కూలులో మÖడో ఫారంలో ప్రవేశించాను. హాస్టల్‌లో వుంటూ శ్రద్ధగా చదువుకుని స్కూలు ఫైనల్ ప్యాసయ్యాను.
హైస్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో నాకు చదువు తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. గుంటూరులో చదువుకుంటూ, నేను సంవత్సరానికి ఏ ఐదో, ఆరో సినిమాలు చూసుంటాను. 1946 లో స్కూల్ ఫైనల్ పాసైన తర్వాత, నాకు చిన్న సమస్య వచ్చింది - మా వాళ్లందర్నీ విడిచిపెట్టి - దూరంగా మద్రాసులో చదువుకోవాల్సి వచ్చింది! ఐతే, ‘స్టాండర్డు’ కోసం, క్రమశిక్షణ కోసం, ప్రాపంచిక పరిచయాల కోసం నేను చెన్నెí ‘లయోలా’ కళాశాలలో ‘ఇంటర’ లో చేరాను. 1948 లో నేను ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో ప్యాసయ్యాను.
ఇంటర్ తర్వాత, నాకు ఇంజనీరింగ్ కాలేజీలోనూ, మెడికల్ కాలేజీలోనూ సీట్లు వచ్చాయి. నాకు డాక్టరు చదవడం పట్ల పెద్ద ఆసక్తి లేకపోవడంతో, ఇంజనీరింగ్‌లో చేరాను. 1948 నుంచి 1952 వరకు గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాను.
1948 వ సం॥లో ఒక విచిత్రం జరిగింది - ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నప్ప్పుడు నేను గనక ‘స్టేజి’ ఎక్కక పోయుంటే - నేను అనుకున్నట్లు ఇంజనీరుగానే వుండిపోయేవాడినేమో! మనం అనుకున్నదొకటైతే, దైవ నిర్ణయం ఇంకోవిధంగా వుండవచ్చు. ఎవరే విధంగా అనుకుంటే ఆ విధంగా జరిగి తీరుతుందని ఎవరమÖ చెప్పలేం. కలెక్టరు అవుదామని కలలుగన్న వాడు స్కూలు టీచరు కావచ్చు, గుమాస్తాగా బ్రతుకుదామనుకున్న వాడు సామాన్య వ్యక్తిగానే వుండిపోవచ్చు. ఈ మార్పులన్నీ పరిస్థితుల కాల ప్రభావాల వల్ల, విధి నిర్ణయానుసారం జరుగుతూ వుంటాయి. అదే విధంగా నేను ఇంజనీరు అవుదామనుకుంటే సినిమా నటుడనయ్యానంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు! తమిళంలో ఒక సామెత వుంది - తాను అనుకున్నదల్లా నెరవేరితే, మనిషి దేవుడు లేడంటాడట.
కాలేజీలో ఏదో సందర్భాన ఒక చిన్న నాటిక ప్రదర్శించాల్సి వచ్చింది. మిత్రులంతా నన్ను ఉత్సాహం లేని నేను, ఆ భయం వల్ల ససేమిరా ఒప్ప్పుకోలేదు. కానీ మిత్రుల ప్రోద్బలం నా పట్టుదలను గెలిచింది! ఆ నాటికలో ముఖ్యపాత్ర ధరించాను. ఆ ప్రదర్శనలో నేనేం జేశానో నాకు తెలీదు. ఆ రోజున నన్ను ఆ స్టేజి మీద చూసినవాళ్లకు నాలో సినిమా నటుడి లక్షణాలు ఏ మాత్రం కన్పించలేదు. కానీ ఒకే ఒక్క వ్యక్తికి మాత్రం బాగా కన్పించాయి. అతని పేరు తాడి కృష్ణమÖర్తి. నాతోనే ఇంజనీరింగ్ చదువుకునే వాడు. ప్రదర్శన కాగానే నన్ను అభినందించిన ఒకే ఒక వ్యక్తి కృష్ణమÖర్తి.
మా కాలేజి విద్యార్థులు ఒకసారి ఆచార్య ఆత్రేయ గారి ‘పరివర్తన’ నాటకం వేశారు. ఆ నాటకం బాగుండాలని, తాపీ చాణక్య గారిని ఆహ్వానించి, నాటకాన్ని డైరెక్టు చెయ్యమని కోరారు. అప్ప్పుడే నాకు చాణక్య గారితో పరిచయమైంది. అప్ప్పుడాయన “పల్లెటూరి పిల్ల” చిత్రానికి బి.ఎ. సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేస్తున్నారు. ఆ తర్వాత నాకు ధైర్యం చెప్పి, నాటకాల్లో వేషాలు వెయ్యమన్నది కూడా చాణక్యగారే. మÖడో సంవత్సరంలో నేను తెలుగు సమితికి కార్యదర్శిగా ఎంపికయ్యాను. ఆ సంవత్సరం మళ్లా నాటకం వెయ్యాల్సి వచ్చింది. ఆచార్య ఆత్రేయ దగ్గర ‘ప్రగతి’ అనే నాటకం రాయించాం. తొలిసారిగా అంతర్ కళాశాల నాటక పోటీలు పచ్చయ్యప్ప కళాశాలలో నిర్వహిస్తే అందులో మేం పాý£్గన్నాం. ఈ నాటకాన్నే చాణక్యగారే నడిపారు. ఆ ‘ప్రగతి’ నాటకంలో నేను పారిశ్రామిక వేత్త పాత్ర వేశాను. నాటకానికి ప్రథమ బహుమతి వచ్చింది. దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగి మంచి నాటకాలు వేయగలను అని అనుకున్నాను.
తర్వాత కూడా నేను కాలేజీ నాటకాల్లో పాý£్గన్నాను. 1952 లో నేను ఔ.జూ. (Uలిబీనీబిదీరిబీబిజి) డిగ్రీ తీసుకున్నాను. మద్రాసు బాడ్వేలో వున్న సెంట్రల్ పాలిటెక్నిక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో, అసిస్టెంటు లెక్చరర్‌గా, ప్రప్రథమంగా 1953 లో ఉద్యోగంలో ప్రవేశించాను. ఎనిమిది నెలల పాటు ఆ ఉద్యోగం చేశాను. ఆ సంవత్సరంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు పైలట్ ఆఫీసరుగా సెలక్టయ్యాను కూడా, కానీ మిలిటరీ వాతావరణం, ముఖ్యంగా మా అమ్మకు నచ్చలేదు. దాంతో ఆ లైను మానేశాను. సెంట్రల్ పాలిటెక్నిక్ నుంచి నేను కాకినాడ పాలిటెక్నిక్‌లో చేరాను. మÖడు సంవత్సరాల పాటు ఆ కాలేజీలోనే లెక్చరర్‌గా వున్నాను. 1955 మార్చిలో నాకు కమలాదేవితో వివాహం జరిగింది. మా శ్రీమతి ప్రముఖ కథా రచయిత్రి ఆర్.ఎస్. వసుంధరాదేవికి సొంత సోదరి.
సరే, అలా ఆ లెక్చరర్ ఉద్యోగం కూడా నాకు సంతృప్తి నివ్వలేదు. సొంతంగా నేను ఒక వర్క్‌షాపు పెట్టుకుని నడుపుకుందామనే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత సంవత్సరంలోనే ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను. అనుభవం కోసమని, నేను మద్రాసు సుందరం మోటార్సులో చేరాను. అప్ప్పుడే ఎల్.వి.ప్రసాద్ గారు నన్ను పిలిచి ‘మÖవీటెస్టు’ చేశారు. ఆ టెస్టు ‘ఉత్సాహకరమైన ఫలితాలను’ ఇచ్చింది.
మా బంధువు ఒకాయన రాయఘడ్ పంచదార ఫ్యాక్టరీలో జనరల్ మేనేజరుగా ఉండేవారు. ఆయన “ఖాళీగా వున్నావు గదా, ఇక్కడకొచ్చి కొన్నాళ్లు ఈ ఫ్యాక్టరీ అది చూద్దువు గాని రా” అని కబురు చేశాడు. సరేనని నేను రాయఘడ్ చేరుకున్నాను. నాకు తెలీకుండా నీడలాగా, సినిమా ఛాన్సు కూడా నా వెంటే రాయఘడ్ చేరుకుంది.
ఎల్.వి. ప్రసాద్ గారు తీసిన ‘మÖవీటెస్ట’ ను ‘ప్రతిభా’ సంస్థ అధినేత ఘంటసాల కృష్ణమÖర్తి గారు చూశారు. ఆయన వెంటనే నన్ను రమ్మని ఉత్తరం రాశారు. అప్ప్పుడాయన “దొంగలున్నారు జాగ్రత్త” నిర్మించబోతున్నారు. నాలో ఏ మాత్రం ఉత్సాహం కలుగలేదు. ప్రతిభా వాళ్లు నాకోసం చాలా ప్రయత్నం చేశారు.
1957 లో నేను తిరువత్తియÖర్ వర్క్‌షాపులో అసిస్టెంటు ఇంజనీరుగా జేరాను. నా ఉద్యోగాన్ని నేను చూసుకుంటూ పోయానే ÔŸప్ప ఆ సినిమా నీడను గమనించలేదు. సినిమా ఆలోచన నా తలలో లేనే లేదు. ఆ తర్వాత ‘అనుపమా’ సంస్థ అధినేత కె.బి. తిలక్ గారు తమ తొలిచిత్రం “ఎం.ఎల్.ఏ.”లో ఒక పాత్రలో నటించమని అడిగారు. నేనే దాన్ని వద్దనుకున్నాను.
1957 జూలైలో మళ్లీ నాకు పరిశ్రమ నుండి పిలుపు వచ్చింది. ఈసారి చాణక్య గారు సారథి వారి తరపున పిలిపించాడు. నిలకడ లేని లైను - పెళ్లయి ఒక పాపకు తండ్రిని కూడ. ఇప్ప్పుడు సినీ రంగం వద్దులే అని సుతిమెత్తగా చెప్పాను. హీరో వేషం రావడం ఎంత అరుదైన అదృష్టమో వివరించారు. ఆఖరికి సరేనని ఒప్ప్పుకున్నాను. అలా 1957 లో నా చిత్రరంగ ప్రవేశం జరిగింది. సారథీ వారి “ఎత్తుకు పైఎత్తు” లో హీరోగా నటించాను. ఇంజనీరు కావలసిన వాడు నటుడయ్యాడా? నటయోగం వున్నవాడు ఇంజనీరు అవుదామని ఆశించాడా? - నాకు అర్థం కాలేదు.
“ఎత్తుకు పైఎత్తు” లో హీరోయిన్‌గా షావుకారు జానకి గారు చేశారు. ఆ తర్వాత కథానాయకునిగానే “పార్వతీ కల్యాణం” (1958), “మనోరమ”, “భాగ్యదేవత” (1959), “చివరకు మిగిలేది”, “కుంకుమ రేఖ” (1960), “గుళ్లో పెళ్లి”, “కృష్ణప్రేమ” (1961), “మోహినీ రుక్మాంగద” (1962), “తల్లీ బిడ్డలు” (1963) చిత్రాల్లో నటించాను. వాటిల్లో సావిత్రి గారితో నటించిన “కుంకుమ రేఖ”, కృష్ణకుమారి గారితో చేసిన “మనోరమ” చిత్రాలంటే చాలా ఇష్టం. ప్రముఖ హిందీ గాయకుడు తలత్ మొహమ్మద్ “మనోరమ” లో నాకు చాలా మంచి పాటలు పాడాడు. ఆ రోజుల్లో తలత్ నాకు పాటలు పాడడాన్ని చాలా విశేషంగా చెప్ప్పుకునేవారు. దానికి రమేష్ నాయుడు గారు సంగీత దర్శకుడు.
నేను మొదటి నుంచీ కూడా చాలా సున్నిత మనస్కున్ని, నాకు తెలిసి నేనెవరినీ ఇన్నేళ్ల ఇండస్టీలో ఎవర్నీ నొప్పించి ఎరుగను. నాలాంటి స్వభావమే డి.వి. నరసరాజు గారిది. వారి సాన్నిహిత్యమంటే నాకు చాలా ఇష్టం. ఆయనా ఈ మధ్య పోయారు. సరే... నే చెప్పేదేమిటంటే మొదటి నుంచీ కూడా ఏదైనా సంఘటన చూస్తే విపరీతంగా స్పందించే వాణ్ణి. ఆ స్పందనలో నుంచే నాలో కథా రచయిత పుట్టుకు వచ్చేవాడు. ఆ రోజుల్లో ‘తుఫాన’ అని ఓ పత్రిక వుండేది. ఆ పత్రికా సంపాదకులు ఏదైనా రచన ఇమ్మని అడిగితే, నేను స్పందించిన ఒక సంఘటననే ‘నలుపు-తెలుపు’ టైటిల్ లో పది సంచికలకు సీరియల్‌గా పంపాను. ఆ కథే నిర్మాత అయ్యాక అమృతా ఫిలిమ్స్ పతాకంలో తీసిన తొలి చిత్రం “చెల్లెలి కాపురం” (1971).
హీరో వేషాలు తగ్గిపోయాక, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగాను. “పాండవ వనవాసం” (1965), “u£బ్బిలి యుద్ధం” (1964), “బభృవాహన” (1964), “రక్తసింధూరం” (1967), “నిండు మనసులు” (1967), “ఊరికి ఉపకారి” (1972), “చిరంజీవి రాంబాబు” (1978)... ఇలా సుమారు 200 చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగాను. అలా నటించిన చిత్రాల్లో “అల్లూరి సీతారామరాజు” (1974), “అంకుశం” (1992) చిత్రాలంటే నాకు చాలా ఇష్టం.
నటుడుగా వుండేటప్ప్పుడు ఎందుకనో కాస్త అసంతృప్తిగా3 వుండేవాడ్ని. సినిమా రంగంలోకి అనవసరంగా వచ్చేశానా అని అనిపించేది. ఆ అసంతృప్తిని అప్ప్పుడప్ప్పుడూ మిత్రులతో అంటుండేవాడ్ని. అంతలో పర్వతనేని చంద్రశేఖరరావు (శ్రీ ఫిలిమ్స్), కాట్రగడ్డ శ్రీనివాసరావు (నవయుగ) గార్ల ప్రోత్సాహంతో ‘అమృతా ఫిలిమ’ స్థాపించి తొలిసారిగా “చెల్లెలి కాపురం” తీశాను. ఆ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్లో స్వర్ణ నంది వచ్చింది. “చెల్లెలి కాపురం” సినిమా విడుదలైన రోజున నేను పొందిన థ్రిల్‌ను, అనుభూతిని నేనెప్పటికీ మరువలేను. దాని తర్వాత వరుసగా తొమ్మిది చిత్రాలు నిర్మించాను. అందులో “ఊరికిచ్చిన మాట” (1981) చిత్రం దగ్గర నుంచి నేను నిర్మించిన చిత్రాలకు నేనే దర్శకత్వం వహించాను. ఆ చిత్రానికి కూడా కాంస్య నంది వచ్చింది. అంతేగాకుండా ద్వితీయ ఉత్తమ కథగా అవార్డు గెల్చుకుంది.
మీకో నిజం చెప్పనా... నటుడు అనిపించుకోవడం కంటే, నిర్మాత అన్పించుకోవడంలోనే ఆనందం ఉంది. నిర్మాతగా నేనెంతో సక్సెస్ అయ్యాను. ఒక సినిమాకు, అది ఏరకమైన సినిమా అయినా సరే, కథ అనేది చాలా ముఖ్యమైనదని నా నమ్మకం. “ఊనీలిజీలి రిరీ దీళి లీబిఖి తీరిజిళీ శినీబిశి బీబిదీదీళిశి లీలి బీళిజీజీలిబీశిలిఖి లీగి బి వీళిళిఖి రీశిళిజీగి”. ఒక మంచి కథ ఉన్నప్ప్పుడు అది చిత్రంలో ఎలాంటి లోపాన్ని కన్పించనివ్వదు అని సుప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు ఫ్రాంక్ కాప్రా అన్నాడు. కథను ఎన్నిక చేసుకోవడంలో కూడా కొన్ని గమ్మత్తులు జరుగుతాయి. మేం తీసిన “చుట్టాలున్నారు జాగ్రత్త” (1980) చాలా బాగా విజయవంతమైంది. దాన్ని ఏ.వి.ఎం. వాళ్లు రజనీకాంత్ హీరోగా “పోకిరి రాజా” అనే పేరుతో తమిళంలో తీశారు. అదే వంద రోజులు నడిచింది. హిందీలో తీయడానికి ఒక నిర్మాత మా దగ్గర హక్కులు కొన్నాడు. కానీ వాళ్లు నిర్ణయించుకున్న దర్శకుడికి ఆ కథ నచ్చలేదు. అందుకని “చుట్టాలున్నారు జాగ్రత్త” కథకు సంబంధించిన హక్కులను పద్మాలయాకు అమ్మేసి వేరే కథను వాళ్లు కొనుక్కున్నారు. పద్మాలయా వాళ్లు “చుట్టాలున్నారు జాగ్రత్త” కథను “మవాలీ” అనే పేరుతో హిందీలో తీసి విడుదల చేస్తే 25 వారాలు విజయవంతంగా నడిచింది. మా కథ కాదని వేరే కథను తీసుకుని నిర్మించిన చిత్రం ‘ప్లాప’ అయింది.
1973 లో “నేరము-శిక్ష” అనే సినిమా మా అమృతా ఫిలింస్ పతాకం కింద నిర్మించాం. దానికి కె. విశ్వనాథ్ గారు దర్శకులు. సినిమా పూర్తయి, తొలి కాపీ కూడా వచ్చిన రోజుల్లో నాకు బాగా కావాల్సిన వారి ద్వారా ఒక డిస్టిబ్యూటర్ వచ్చి చిత్రం చూశాడు. నాతో ఏ మాటా చెప్పకుండా వెళ్లిపోయాడు. తర్వాత మా స్నేహితుడు ఫోన్ చేసి “బాలయ్య గారూ! మీ చిత్రం వాళ్లకి నచ్చలేదట. మీరేమీ అనుకోకండి” అన్నాడు. “నేరము-శిక్ష” విడుదల తర్వాత విషయం అందరికీ తెలిసిందే గదా! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఎంత తెలివితేటలున్నా, ఎంత సినిమా పరిజ్ఞానం వున్నా, కొన్ని సందర్భాల్లో ప్రతి మనిషి పప్ప్పులో కాలు వేస్తుంటాడు. విడుదలకు సిద్ధంగా వ్ను సినిమా చూసి కూడా మనం సరైన తీర్పు యివ్వలేక పోతుంటే - కథ మాత్రం విని ఇది మంచి సినిమా అవుతుందా? కాదా? అని చెప్పడం ఎంత కష్టమో ఆలోచించండి.
నా వరకు నేను ఒక కథాంశాన్ని పట్టుకుంటే దాన్ని ఆరు మాసాలు నుంచీ సంవత్సర కాలం పాటు పిండి, పాకం పడతాను. అంతేగాక నా ఒక్కడి అభిప్రాయాలైతే గానుగెద్దులా ఒకే గాటిలో తిరుగుతా యేమోనని, నాకు హితులు, సన్నిహితులు అయిన వాళ్లను కూర్చోబెట్టి కథ వినిపించి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుని దాని ప్రకారం మార్పులు చేసుకుంటాను. ముఖ్యంగా ఇంట్లో వాళ్లకు నచ్చేటట్లు చూసుకుంటాను. నేను నిర్మించిన చిత్రాలను ఇదే పద్ధతిలో నిర్మించినవే.
అయితే ముందు తీసిన ఆరు చిత్రాలకు కె. విశ్వనాథ్, కె.ఎస్.ఆర్. దాస్, డి.ఎస్. ప్రకాష్‌రాజు, బి.వి.ప్రసాద్ వంటి అనుభవజ్ఞులు దర్శకత్వం వహించారు. వారి అభిప్రాయాల ప్రకారం కథల్లో మార్పులు, చేర్పులు చేశాను. తర్వాత నాలుగు చిత్రాలకు కథ, నేనే రాసుకుని చిత్రానువాదం డైరెక్షన్ చేశాను.
“పీపుల్ బిలో థర్టీ ఆర్ పూల్స్ అండ్ దోజ్ అబౌవ్ థర్టీ ఆర్ రాస్కెల్స” (ముప్ఫెí యేళ్లలో వున్న వారు మÖర్ఖులు, ముప్ఫెí ఏళ్ల పైబడిన వారు దుర్మార్గులు) అన్నాడొక ఇంగ్లీషు కవి. అంటే యుక్తవయస్సులో ఉన్నప్ప్పుడు సంఘసేవ, దేశోద్ధారణ అనే కొన్ని ఆదర్శాలతో మనిషి హృదయం నిండి ఉంటుంది. ఉడుకు రక్తం ఉరకలేస్తూ వుంటుంది. యుక్త వయసు దాటిందనుకోండి - పెళ్లవుతుంది, భార్య పిల్లలు. ఇలా కుటుంబ బాధ్యత నెత్తిన పడుతుంది. తన భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలి? అనే ఆలోచన వస్తుంది. అప్ప్పుడా దేశసేవ, సంఘసేవ అనే ఆదర్శాలు గంగలో కలిసిపోతాయి. అదే విధంగా నేను కొత్తగా చిత్ర నిర్మాణం మొదలు పెట్టినపుడు - సంఘ సంస్కరణ చేయాలి, దేశంలో వుండే ప్రజల్నంతా మన సినిమాలతో మంచి మార్గంలో ప్రయాణింప చేయాలి. ప్రతి చిత్రంలోనూ నీతి వుండాలి. ఇలా ఎన్నో ఆశయాలతో నిర్మాణం ప్రారంభించాను. ఆ వూపులోనే నా సినిమాల్ని ఏదో ఒక నీతిని దృష్టిలో పెట్టుకుని తీశాను.
“బాహ్య సౌందర్యం కంటే అంత్ణ సౌందర్యం గొప్పదని” చెల్లెలి కాపురంలో చెప్పాను. “మనిషికి మనసే సాక్షి / మనిషి విధించే కక్ష శిక్ష తప్పినా / మనసు విధించే శిక్ష తప్పదు / నేరానికి శిక్ష తప్పదు - తప్పదు” అని “నేరము-శిక్ష” లో చెప్పాను. “సన్మార్గంలో సాధించిన స్వల్పం / సకల జనులు హర్షించే శిల్పం / పెడదారిన పొందిన పెన్నిథి / అడుగడుగున ఆపద సన్నిథి / ఇదే భిన్న మార్గాల వ్యధ అన్నదమ్ముల కథ” అని “అన్నదమ్ముల కథ” (1975) లో చెప్పాను. ఇలా నీతులు చెప్ప్పుకుంటూ పోతే జనం వినడం మానేశారు. ఏదో విశ్రాంతి కోసం, వినోదం కోసం, సినిమాలు చూడడానికి వస్తే నీతులు, నీతులు అంటూ విసుగెత్తిస్తున్నారని భావించారు. ‘మనకి నీతులు చెప్పడానికి వీళ్లకున్న అర్హత ఏమిటి?’ అని నిందిస్తున్నారు ప్రజలు.
ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్తాను -
ఒక కాలేజీ వార్షికోత్సవ సభకు ఓ సినీ కవి ముఖ్య అతిథిగా పాý£్గన్నాడు. బ్రహ్మాండంగా నైతిక విలువల్ని గురించి ఉపన్యాసం ఇచ్చేశాడు. విద్యార్థులందరూ ముగ్ధులై విన్నారు. కార్యక్రమం ముగిసింది. విద్యార్థులంతా ఆయన ఉపన్యాసం ధాటికి ఉత్తేజితులైపోయి స్వయంగా ఆయన్ను కలుసుకోవాలని ఆయన బస చేసిన విశ్రాంతి గృహానికి వెళ్లారు. వాళ్లు అక్కడికి వెళ్లే సరికి ఆ కవిగారు మద్యం సేవిస్తూ దర్శనమిచ్చారు. విద్యార్థులు ఆశ్చర్యపోయారు. మనసు ఉండబట్టలేక ‘సార్! కొద్దిసేపటి క్రితమే కదా మీరు మాకు ఎన్నో నీతులు చెప్పారు! మరి మీరేమిటి ఇక్కడ.... ఇలా... మద్యం సేవిస్తున్నారూ’ అని అడిగారు.
దానికి ఆయన ఇచ్చిన బదులు ఇది - “నాలుగు రోడ్ల కూడలిలో వుండే పలక చెక్క మీ వూరికి దారి చూపిస్తుంది గానీ, ఆ వూరికి తాను పోదు” అన్నాడు. నీతులు చెప్పే ప్రతివారూ వాటిని ఆచరించాలని గానీ, ఆచరిస్తారని గాని అనుకోవడం పొరపాటు. నీతుల్ని బోధిస్తూ చిత్రాలు నిర్మించడం వల్ల చేదు ఫలితాలు చవి చూశాను. నీతులు వెగటు పుట్టి జనం అలాంటి చిత్రాల్ని చూడడం మానేస్తారు. ఫలితం చిత్రం బాగా ఆడదు. చివరకు నిర్మాత నష్టపోతాడు అనే నిజం అనుభవ పూర్వకంగా గ్రహించాను.
ఈ కారణాల వల్ల - మేము కూడా వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రాలు నిర్మిస్తే మంచిదనే నిర్ణయానికొచ్చాం. అలా నిర్మించిందే “ఈనాటి బంధం ఏనాటిదో” (1971). ఆ చిత్రాన్నిర జనం బాగా ఆదరించారు. అంటే అధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు చిత్రాల ద్వారా ఆశించేది వినోదం మాత్రమే అన్న నిజం ఋజువైంది. అంటే నీతి లేకుండా చిత్రాల్ని నిర్మించాలని నా ఉద్దేశం కాదు. తియ్యని మాత్రలలో చేదు మందుని నింపి మనం మింగుతున్నట్లుగా వినోదం ప్రధానంగా తీసుకుని అందులోనే నీతిని ప్రబోధించే విధంగా చిత్రాలు నిర్మించాలన్న మాట.
కాలం మారింది, ప్రేక్షకుల అభిరుచులు మారాయి. పరిశ్రమలో కొత్త పోకడలు చోటు చేసుకున్నాయి. హీరో వర్షిప్ పెరిగింది. దాంతో మాలాంటి సీనియర్ నిర్మాతలు కొంత వెనకబడ్డాం. అయినా ఫరవాలేదు. పరిశ్రమలో మళ్లీ మంచిరోజుý£స్తాయనే నమ్మకం ఉంది. నేను నా సినిమాల్లో కూడా ఎప్పటికప్ప్పుడు కొత్తవారిని ప్రోత్సహిస్తూ వచ్చాను. సత్యేంద్రకుమార్ (నటుడు), రామచంద్రయ్య (కెమెరా), యోగానంద్ (కెమెరా), ఇక మా అబ్బాయి. తులసీరాం ప్రసాద్ (నటుడు)లకు మా చిత్రాల ద్వారానే తెరకు పరిచయం చేశాను.
సొంతంగా చిత్రాలు తీయడం మానుకున్న తర్వాత “తాజ్‌మహల”, “మల్లీశ్వరి”, “పెళ్లిసందడి”, “పెద్దరికం”, “అన్నమయ్య”, “మన్మథుడు”, “పెద్దన్నయ్య”, “వీధి” - ఇలాంటి చిత్రాలు చాలానే చేశాను. ప్రస్తుతం సుమంత్ కథానాయకుడుగా నటిస్తున్న “చిన్నోడు” చిత్రంలో నటిస్తున్నాను. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అందరికీ వివాహాలయిపోయి మనవళ్లు, మనవరాళ్లు కూడా ఎదిగిపోయారు. ముగ్గురు మనవళ్లు విదేశాల్లో వున్నారు. ఒక నటుడుగా, నిర్మాతగా, వ్యక్తిగా ఈ డెభ్బెí ఐదేళ్ల తెలుగు చలన చిత్రరంగంలో7 పదుగురి దగ్గరా మంచి అనిపించుకున్నాను. ఆర్థికంగా గానీ, ఆరోగ్యపరంగా గానీ నాకు ఎలాంటి బాధలు లేవు. ఇక మీదట కూడా రోజులు ఇబ్బంది లేకుండా గడిచిపోతే చాలు! అంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి