1726 ప్రాంతంలో ఆంగ్ల సాహిత్యంలో వచ్చిన ఒక గొప్ప వ్యంగ రచననే (Satఱతీవ) ‘గలివరు ట్రావెల్స్. వ్యంగ రచనను (Satఱతీవ) ‘హాసŸ్యమైన’ ‘చమత్కారమైన’ రచనగా నిర్వచించవచ్చు. ఈ వ్యంగ రచన ద్వారా రచయిత వ్యక్తి యొక్కగాని వ్యవస్థ యొక్కగాని, సంస్థలయొక్కగాని లేక సమస్త మానవజాతినిగాని ఎగతాళిచేస్తూ, ఎత్తిపొడుస్తూ పరిహసిస్తూ, దూషణ చేస్తూ లేక అవహేళన చేస్తూ ఈ వ్యంగ రచనకు ఆయుధాలుగా వీటిని ఉపయోగిస్తాడు వ్యంగరచయిత. వీటన్నింటిని ఎంతో చాకచక్యంగా ఎంతో చక్కగా స్విఫ్ట్ వాడుకున్నాడు.
జొనాథన్ స్విఫ్ట్ యొక్క అద్భుత ఊహా కల్పననే ఇందులోని నాలుగు భాగాలుగా చెప్పిన కథాంశాలు. ఈ రచనా నిర్మాణానికి కావలసిన నేపథ్యాన్ని పరిశీలిస్తే ఇది ఒక అద్భుత వ్యంగ రచన అని చెప్పక తప్పదు. ఆ రోజుల్లో యాత్రాచరిత్రలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. కాబట్టి ప్రజలను ఆకర్షించేందుకు స్విఫ్ట్ ఈ ప్రక్రియను తీసుకున్నాడు. జొనాథన్ స్విఫ్ట్ ‘గలివరు ట్రావెల్స’ యొక్క ముఖ్య
ఉద్దేశం సంఘసంస్కరణ. ప్రజల పొరపాట్లను తెలియజేసి వారిని సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఇతను కోరుకున్నది మనుషులందరిలో మార్పు. వారి అభ్యున్నతికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని దాన్ని ఆశించే ఎంతో సాహసంతో ‘గలివరు ట్రావెల్స’ రచించాడు.
ఇంగ్లాండులోనే కాక యావత్తు ప్రపంచంలోను జరుగుతున్న చరిత్ర గతుల్ని మార్చే మతుల్లేని మనుషుల చర్యల్నీ ఖండిస్తూ ఖరాఖండిగా చేసిన రచన ‘గలివరు ట్రావెల్స’. ఇందులో నాలుగు భాగాల్లో నాలుగు భిన్న కథలను స్విఫ్ట్ చెప్పాడు. మొదటిది ‘లిల్లిపుట్ (Lఱశ్రీశ్రీఱజూut) రెండవది ‘బ్రాబ్డింగునాగు’ (దీ=OదీణIచీG చీAG) మÖడవది ‘లపుటా (LAPUTA), చివరిది నాలుగవది ‘ీVAన్మాన’ (HOUYAచీHచీవీS) ఈ నాలుగు కథలలోను మనకు ఎన్నో వ్యంగంతో కూడిన సంఘటనలు ఎగతాళి సందర్భాలు, హాస్య సన్నివేశాలు కనిపిస్తాయి.
‘గలివరు ట్రావెల్స’ లో జొనాథన్ స్విఫ్ట్ పరోక్షంగా, కథల ముసుగులో వ్యక్తులను, సంస్థలను పూర్తి వ్యవస్థను ధిక్కరిస్తాడు. మొదటికథలో లిల్లిపుట్ దేశ కోశాధికారిని, ‘ప్లీమ్నాప’ (ఖీశ్రీఱఎఅaజూ) ను వర్ణించటంలో చేసిన అవహేళన ఆనాటి ఇంగ్లాండు ప్రధాని ‘సర్ రాబర్ట్ వాల్పోల’ ను ఉద్దేశించింది. గలివరు ట్రావెల్స’ రచనలో ‘ణaఅcఱఅస్త్ర శీఅ a Tఱస్త్రష్ట్రt తీశీజూవ్ణ అన్న సమాసం ఎంతో చమత్కారకంగా వాల్‌పోల్ పరిపాలనను సంకేతిస్తూ చెప్పింది. అంటే వాల్‌పోల్ ప్రధానిగా పార్లమెంటులో విశ్వాసం పొందడానికి ఆయన వేసిన ఎత్తుగడలు చేసిన కుట్రలు ‘లిల్లిపుట’ కోశాధికారి ‘ఫ్లిమ్ నాప’ ద్వారా ఎగతాళిచేశాడు.
నాల్గో కథలో గుర్రాలలోని రెండు జాతులను గురించి చెప్తాడు. వాటిలో మొదటిది ‘యహూస’ (YAHOOS) జాతి. ఈ జాతి చెడు గుణాలకు హీనమైన పనులకు నిలయం. రెండవది ‘ీVAన్మాన’ (HOUYHచీHచీవీ) జాతి. ఇది మంచి అలవాట్లకు గుణాలకు నిలయం. మొదటి జాతి గుర్రాలకు ప్రతీకలుగా సమస్త మానవజాతిలోని చెడును. స్వార్థచింతనను, దుర్మార్గాన్ని ఆశ్రయిస్తూ జీవించే మానవులను విమర్శిస్తూ వారి మనుగడను చిత్రీకరిస్తూ తెలియజేశాడు. రెండవజాతి అయినటువంటి ‘ీVAన్మాన’ ను ప్రతీకలుగా చెప్తూ మానవత్వం మÖర్తీభవించిన మనుషుల మనుగడను చిత్రీకరించాడు. సత్యాసత్యాలకు, ధర్మాధర్మాలకు నీతి అవినీతులను పోల్చి ఏది ఉత్తమమార్గమో ఏరి మనిషికి ఉత్తమ మానవ జీవితాన్ని అందిస్తుందో చక్కగా వర్ణిస్తూ తెలియజేశాడు. ‘యహూన’ జాతి గుర్రాల కల్పన ద్వారా రాక్షసత్వం పశుత్వం వికృత ఆలోచనలతో జీవిస్తే వినాశనం తప్పదని మానవజాతిని హెచ్చరించాడు. ీVAన్మాన్ జాతి సృష్టిద్వారా మనిషి ఆలోచనలకు, మనసుకు, ఆత్మకు పరిశుద్ధత ఉంటే ఆనందకరమైన జీవితమే లోకంనిండా నిండుతుందని తెలియజేశాడు.
మొదటి కథ ఎక్కువగా రాజకీయాల్ని ఎగతాళి చేస్తూ చేసిన రచన. ఇంగ్లాండులోని రాజకీయాలు, రాజకీయ నాయకులు, ప్రభువులు, చక్రవర్తులు, చక్రవర్తినిలు మధ్య ఆలోచనాపరమైన ఘర్షణలు ఇంగ్లాండు అంతా వ్యాపించి ఉంటాయి. తద్వారా పరిపాలనలో సందిగ్ధత చోటుచేసుకుంటుంది. ఇక్కడ స్విప్ట్ తన వ్యక్తిగతమైన విషయాల్ని చెప్పాడు. తనను చర్చి ప్రభువుగా నియమింపకుండుటలో ప్రధాని వాల్‌పోల్ రాణి ‘అన్నె’ల రాజకీయం తెలుసుకుంటాడు. అందుచేత తను ఊహించిన ప్రభువు (బిషప్) నియామకం జరగలేదని మొదటికథలో ఆరు అంగుళాలు గల వ్యక్తుల్ని కల్పించి వారి రాజకీయాలకు ఇంగ్లాండు రాజకీయాలకు సంకేతిస్తూ ఎగతాళి చేస్తాడు.
రెండవ కథలో గలివరు ఇంగ్లాండు దేశం గూర్చి దేశప్రజలగూర్చి ‘బ్రాబ్డింగునాగు’ రాజుకు వివరిస్తాడు. గలివరు మాటలువిని ‘బ్రాబ్డింగ్‌నాగ’ రాజు’ గలివరు మాటలు వ్యతిరేకిస్తాడు. సైన్యంగాని ప్రభువులుగాని ప్రజాశ్రేయస్సును కోరి పరిపాలించాలని చెప్పటంలో స్విఫ్ట్ ఇంగ్లాండు దేశ రాజకీయ నాయకులకు పరోక్షంగా ఎగతాళితో కూడుకున్న హితాన్ని బోధిస్తాడు. స్విఫ్ట్ మÖడవకథలో ముఖ్యంగా ప్రత్యేక తరగతికి చెందిన ఫిలాసఫర్సును, శాస్త్రజ్ఞులను, విద్యావంతులను ఎగతాళి చేస్తూ ‘ప్రొజెక్టర్స’ (Pతీశీjవctశీతీs) వల్ల మానవుడు వాస్తవికతకు దూరంగా బ్రతకాల్సి వస్తుందని హెచ్చరిస్తూ చేసిన వ్యంగ రచనయే మÖడవకథ.
స్విఫ్ట్ నాల్గో కథలో సమస్త మానవాళిని ఉద్దేశిస్తూ వ్యంగంగా చెప్పినకథ. ఇందులో చెప్పిన ‘యహూన’. కేవలం ఇంగ్లాండు, యÖరప్ దేశాలకు పరిమితం కాకుండ సర్వమానవాళిలో ఉన్న హీనమైన గుణాలకు ప్రతీకలు. ‘ీVAన్మాన’ లు ‘యహూస’లో ఉండే చెడుగుణాలు సర్వమానవాళిలో ఉంటాయని గలివరును కలిసిన తరవాత అభిప్రాయబడ్డాయి. ‘యహూస’ లు క్రూరమైనవిగా పశుత్వంలో నిండుకున్నయిగా కామాంధులుగా, జిత్తులమారిగా మరియు తిండిపోతులై సోమరితనాన్ని కలిగుంటారని మానవజాతికి ‘యహూన’ ను ప్రతీకలుగా చేసి స్విఫ్ట్ అత్యద్భుతంగా చేసిన వ్యంగరచన ఈ నాల్గో కథాంశం. అంతేకాకుండా మానవుల యుద్ధతంత్రములు సర్వత్రా ఒకేలా ఉన్నాయని చెప్తాడు.
ప్రాముఖ్యం ఉన్న వృత్తులలో ఉంటున్న న్యాయవాదులు, వైద్యులు,
ఉపాధ్యాయులు, మంత్రులు ప్రపంచంలో అంతటా అవినీతిమయంగా మారారు అన్న విషయాన్ని గలవారు ీVAన్మాన్ జాతివారికి తెలియజేస్తాడు.
ఇక్కడ మనుషుల స్థితిగతులను ఆలోచన పద్ధతులను అన్నింటిని స్విప్ట్ వివరించాడు. ఒక్కచోట కాకుండా సమస్త భూలోకంలో· మానవ సంబంధాలన్నీ నమ్మలేనివిగా ఉన్నాయని చెప్తాడు. వృత్తులన్నింటిలో వ్యక్తులందరిలో మొత్తం మానవ వ్యవస్థలో ఉన్న లోపాలనన్నింటిని చక్కగా తెలియజేయటంతో పాటు ఎంతో అవహేళనను. వ్యంగ్యంను తన మాటల ద్వారా తెలియపరిచాడు. ‘ీVAన్మాన’లు ఇదంతా విని మనుషులకు ప్రకృతి సిద్ధంగా ఒక ఆలోచించే గుణం తప్ప మానవత్వం, దయ, స్నేహశీలత లాంటివి తెలియదని గ్రహించి మానవులు అంటే ‘యుహూన’ లేనని నమ్ముతారు. గలివరు వారి ప్రాంతంలో ఉండకూడదని అతనిని వారి ప్రాంతం నుండి పంపించి వేస్తారు.
ఈ సన్నివేశ కల్పన ద్వారా స్విఫ్ట్ మనషులందరికి ఒక హెచ్చరికను పంపినాడు. మంచి ఎన్నటికి చెడును తన చెంతకు చేరనీయదని తప్పకుండా తన్ని తగిలేస్తుందని ఈ కథ ద్వారా నిరూపించాడు. మంచితనం ముసుగులో బ్రతికే ప్రతివాడికి భంగపాటు తప్పదని హెచ్చరించాడు. ఈ అంశాలను స్విఫ్ట్ ఎన్నో ప్రతీకల ద్వారా సమస్త జనులందరిని ఎగతాళి చేస్తూ నాల్గో కథను ముగిస్తాడు.
రెండవ భాగంలో చెప్పిన ‘బ్రాబ్డింగునాగు’ కథలో ఎన్నో హాస్య సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. ‘బ్రాబ్డింగునాగు’ స్త్రీలు గలివరును ప్రేమించటం ఈ కథలో కల్పించిన గొప్ప హాస్య సన్నివేశం. సూక్ష్మ ఆకారంగల గలివరు వారి ప్రేమను ప్రాణసంకటంగా భావిస్తాడు. ఆ స్త్రీలు ఇతని పట్ల వ్యామోహంలో ఎన్నో భామాకలాపాలు చేయటం గలివరుకు ఇరుకున పడేసే సంఘటనలు ఎంతో హాస్యమును పుట్టిస్తాయి. వారి నుండి తప్పించుకొనుటకు గలివరు పడ్డ తిప్పలు వారిని చూసి భయంతో వణకటం లాంటి సన్నివేశ కల్పనలో స్విప్ట్ ఎంతో చక్కగా హాస్యరసాన్ని పండించాడు. అంతేకాకుండ ‘బ్రాబ్డింగునాగు’ దేశంలోని జంతువులు, పక్షుల, కీటకాల ఆకారవర్ణన ఎంతో హాస్యంగా ఉంటుంది. ఆ దేశ చీమలు మన ఎలుకలంత పెద్దవిగా ఉంటాయని చెప్పటంలో కుక్కలు మన ఏనుగులంతా పెద్దవిగా ఉంటాయని వర్షంలోని వడగండ్లు పెద్దరాళ్ళ మాదిరిగా ఉంటాయని కాకి అరుపులు ఉరుముల శబ్దంలా ఉంటాయని చెప్తాడు. వీటన్నింటిని చూసి గలివరు అనుభవించిన అనుభూతిని చెప్పటంలో స్విప్ట్ ఎంతో హాస్యాన్ని పండించాడు.
మÖడవ కథలో మనస్పూర్తిగా నవ్వుకునే సన్నివేశాలు మానవ ప్రవర్తనలోని వెర్రితనాన్ని గొప్పగా చిత్రీకరించాడు. ‘లపుటా’ ప్రాంత ప్రజలు ‘ప్రొజెక్టర’ ను ఉపయోగించి దోసకాయనుండి సూర్య కిరణాలు తయారు చేస్తారు. మానవ మలం నుండి తిరిగి మళ్ళీ ఆహారంగా మారుస్తారు. భవంతుల కప్పు మొదట నిర్మించి చివరికి పునాదులు నిర్మించి వ్రేలాడుతున్నట్లు నిర్మిస్తారు. సాలెపురుగుల నుండి సిల్క్‌ను తీస్తారు. మానవ మెదడుతో కాకుండా కేవలం యంత్రాల ద్వారానే పుస్తకాలు తయారు చేస్తారు. మాటల్లేకుండానే మనిషి యంత్రాలను ఉపయోగిస్తారు. ఇలా అనేక విషయాలు ‘లపుటా’ వాసులు చేస్తుంటారు. స్విఫ్ట్ ‘లపుటా’ ప్రాంతమును ప్రతీకగా చెప్తూ నాటి ఇంగ్లాండు యÖరప్, జపాన్ ప్రజలు చేస్తున్న వెర్రి ప్రయోగాలు వికృత ఆలోచనలను ఖండిస్తాడు. మనిషి వాస్తవాన్ని విస్మరించి తన ఉనికిని కోల్పోతున్నాడని హెచ్చరిస్తూ వారి ప్రయోగాలను ఎగతాళి చేస్తూ చురకలంటించే విధంగా వ్యంగ్యంగా మÖడవకథను తీర్చిదిద్దాడు.
ఈ విధంగా జొనాథన్ స్విప్ట్ నాలుగు భాగాలలో చెప్పిన నాలుగు కథలలోను ఎన్నో హాస్యమైన, వ్యంగ్యపరమైన విషయాలను తెలియజెప్పాడు. ఈ కథలద్వారా సమాజంలో ఉంటున్న సమస్యలను తెలియజేస్తూ అందుకు కారకులైనవారిని వ్యంగ్యంగా విమర్శిస్తూ కనువిప్పు కలిగే ప్రయత్నం చేశాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి