రాజసులోచన డాన్సుకు భోజనమే మానుకొనిపోయినా బసులో హాజరుపడ్డా, అయినా
మోజుదీర్ల టైము కొద్ది ముఖమగు పళ్ళా!
... అని కె.శివారెడ్డి వంటి కవులు ఆశుకవిత్వాలు చెప్పి ఆరాధించారు. ఆమె నృత్యాలు, నటన చూసిన ఆ తరం ప్రేక్షకులెవరూ రాజసులోచనను మరచిపోలేరు. ఆమె చిత్రాల్లో ఉందంటే తప్పకుండే ఏదో సందర్భంలో నృత్యం ఉంటుందనే భావన ప్రేక్షకుల్లో ఉండేది.
తెలుగు చలనచిత్ర స్వర్ణయుగానికి చెందిన అలనాటి అందాల తార రాజసులోచన కేవలం హీరోయిన్‌గానే గాకుండా ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు ధరించారు. నటిగా ఆమె ఎంతటి ప్రసిద్ధురాలో, నర్తకిగా కూడా అంతే సుప్రసిద్ధురాలు. కళ్ళతో నర్తించి భావాన్ని పండించగల నేర్పు ఉన్న అతి కొద్ది మంది కళాకారుల్లో రాజసులోచన ఒకరు.
నటిగా ఐదు దశాబ్దాలు (1953-2003) పూర్తి చేసుకున్న శ్రీమతి రాజ సులోచనతో మాట్లాడితే దొర్లిన జ్ఞాపకాలు దొంతరలివి...
‘నా స్వస్థలం విజవాడ. నేను 1934 ఆగస్టు 15వ తేదీన పుట్టాను. మా నాన్నగారు భక్తవత్సలం నాయుడు గారు రైల్వే జనరల్ మేనేజర్‌కి పి.ఏ.గా ఉండేవారు. మా అమ్మ పేరు దేవికమ్మ. నేను విజయవాడలో మేనమామ ఇంట్లో పుట్టినా పెరిగినదంతా మద్రాసులోనే. అటు మా అమ్మ వైపువారు, ఇటు మా నాన్నవైపు వారు అందరూ రైల్వే డిపార్టుమెంటుకు అంకితమై పోయినవారే. మా తాతగారు స్టేషన్ మాస్టర్, మా మేనమామ సత్యం నాయుడు ట్రావెలింగ్ టికెట్ కలెక్టర్, మరొకరు ట్రాఫిక్ మేనేజర్ - ఇలా అందరూ రైల్వే ఉద్యోగులే. రైల్వే ఉద్యోగికి రైలు లాగానే ఒక ఊరని స్థిరం లేదు. అలా మా వారంతా మద్రాసు రైల్వేలో ఎక్కువగా ఉండడం వలన మేమÖ మద్రాసులోనే ఉండిపోయాం. ఆ రోజుల్లో మేం జార్జిటౌనులో ఉండేవాళ్ళం. నేను మా అమ్మ నాన్నలకు ఒక్కతినే సంతానం. దాంతో అతి గారాబంగా పెరిగాను.
నాకు మÖడో ఏట పంతులు గారిని పిలిపించి అక్షరాభ్యాస చేయించారు. ఇంట్లో గారాబంగా పెరిగిన నాకు స్కూలు జైలులాగా కనిపించేది. స్కూల్లో కూర్చున్నట్లే కూర్చుని, ఉన్నట్లుండీ సడీ చప్పుడూ లేకుండా ఇంటికొచ్చేదాన్ని. మా టీచర్‌కు నేనంటే చాలా ఇష్టం. ఉదయాన్నే ఆయన మా ఇంటికొచ్చి నన్ను తీసుకుని వెళ్ళేవారు. కాని మధ్యలో ఎవరైనా కనబడి ఆయన్ను పలకరిస్తే, ఆయన మాట్లాడుతూ నిలబడితే - చాలు, నేను చాలా నేర్పుగా వేలు వదిలించుకుని తుర్రుపిట్టలా ఇల్లు చేరుకునే దాన్ని. ఇహ మా మాష్టారు అవస్థ చెప్పలేను - ఏ కారు కింద పడ్డానో, ఏ దొంగ ఎత్తుకెళ్ళి పోయాడో... ఇలా గాభరా పడుతూ ఇంటికొచ్చేవాడు. నేను అప్పటికే ఇంటికొచ్చేసి మా మేనత్త ఇంద్రాణమ్మ చీర చెరగులో దాక్కొనేదాన్ని. నేను ఈ రోజు ఈ స్థితికి రాగలిగానంటే ఆవిడ పాత్ర ఎంతో ఉంది. నన్నో మణిపూసగా తీర్చిదిద్ధింది. మా అత్తయ్యే.
రెండో ప్రపంచ యుద్ధంలో మద్రాసుపై బాంబులు వేస్తారని వదంతులు రావడంతో మద్రాసంతా ఖాళీ అయిపోయింది. అయితే మా నాన్న మాత్రం మద్రాసు వదిలి రావడానికి ఇష్టపడలేదు. అప్పటికి మా నాన్న రిటైరైపోయారు. మా ఇల్లు జార్జిటపున్ నుంచి ట్రిప్లికేన్‌కు మార్చారు. ఆ సమయానికే మా మేనమామ కూడా రైల్వే ఉద్యోగం నుంచి రిటైరై ఏదో ఇన్సూరెన్స్ కంపెనీకి మేనేజర్‌గా ఉండేవారు. ఆయన నాటకాల ప్రియుడు. ఆయన “సుగుణ విలాస సభ” అనే నాటక సమాజాన్ని నడిపేవాడు. ప్రతినెలా ఆ సభ తరపున రెండు మÖడు నాటక ప్రదర్శనలు తప్పక జరిగేవి - నేను ఆ నాటకాలను మా మావయ్యతో పాటు తప్పక హాజరయ్యేదాన్ని ఆ నాటకాలు ఇంటికొచ్చిన తర్వాత, ఆ నాటకంలో విన్న పాటలు పాడుతూ, డాన్స్ చేసేదాన్ని. తర్వాత తర్వాత గ్రామ్‌ఫోన్ రికార్డు పెట్టి నాట్యం చేసేదాన్ని. అప్పటికింకా నాకు గురువులేడు.
మÖడో సంవత్సరంలో స్కూలుకెళ్ళడం మానేసిన తర్వాత మా అత్తయ్య పుణ్యమా అని నాకు ఐదేళ్ళు వచ్చేవరకూ స్కూలు బాధే లేదు - అయితే మా అత్తయ్య ద్వారా గుణింతాలు, ఎక్కాలు, బాల రామాయణం అన్నీ స్కూలు కెళ్ళకుండానే నోటికొచ్చేశాయి. ఆ తర్వాత సి.ఎస్.ఎం.గర్ల్స్ స్కూలు అని ఒకటుండేది. అందులో రెండో తరగతిలో చేరాను. ఆ స్కూల్లో టీచింగ్ అంతా అరవంలోనే జరిగేది. తెలుగువాళ్ళం ఏడెనిమిది మంది మాత్రమే ఉండేవాళ్ళం. అక్కడ నవమణి అని ఒక క్రిస్టియన్ మాకు క్లాసు టీచర్‌గా ఉండేది. ఎందుకో తెలీదుగానీ ఆమెంటే నాకు చాలా భక్తి, గౌరవం. ఆరాధనా భావం ఉండేవి. ముఖ్యంగా ఆమె చెప్పే బైబిల్ పాఠాలు నా మనసును ఆ మతం వైపుకు మళ్ళించాయి. నేను గూడా ఆ నవమణి టీచర్‌లా మొహంమీద u£ట్టు పెట్టుకోగూడదని ఆలోచించేదాన్ని. కానీ ఇంట్లో వాళ్ళు తంతారని భయం. అంటే అప్పటికాలం అలా ఉండేది. మగ పిల్లలకు కూడా మొహం మీద u£ట్టు కంపల్సరీ. సరే నేను మాత్రం u£ట్టు పెట్టుకునే ఇంటి నుంచి బయలుదేరి గడపదాటి వీధిలో అడుగుపెట్టగానే, నవమణి మేడమ్ మీద భక్తికి నిదర్శనంగా ఆ u£ట్టు చెరిపేసుకొనేదాన్ని. అయితే, అది ఎంతోకాలం సాగలేదు. ఇంట్లో వాళ్ళ నుచి దాగనూ లేదు. నా వీపు విమానం మోతయ్యింది. ఏమైనా నాకు చదువుమీద శ్రద్ధాభక్తుల్ని కలిగించింది నవమణి టీచరే. ఇవాళ నేను నటిగా పేరు పొందడానికి ఆనాడు ఆమె ఇచ్చిన చేయÖతే చాలావరకూ కారణం.
పాఠశాల వార్షికోత్సవంలో నన్ను రంగస్థలం మీదకు ఫస్టు పంపించి నవమణి టీచరే. ఆమె ప్రోత్సాహంతోనే నాలుగో తరగతిలో మంగమ్మ శపథం (వసుంధరా దేవి నటించినది) లోని పాట రికార్డుకు డాన్స్ వేసి ప్రశంసలు పొందాను. అయితే అంతవరకూ నేను నృత్యాన్నిగాని, నటననుగాని ఎవరివద్దా నేర్చుకోలేదు. నాట్యం నాటకాలు చూసి నేర్చుకున్నాను. నటన నవమణి మేడమ్ ప్రోత్సాహం వల్ల నేర్చుకున్నాను.
అటు మా నవమణి మేడమ్ ఇచ్చిన ప్రోత్సాహం, ఇటు స్కూలు వార్షికోత్సవంలో వచ్చిన ఆశీస్సులు, నాలో నాట్యాన్ని అభ్యసించాలనే కోరికను బలం చేశాయి. కాని మా ఇంట్లో వాళ్ళు అందుకు అంగీకరించలేదు. “మన ఇంటా వంటి లేదు మన వంటివారికి తగదు...” అని, “అంతగా అయితే సంగీతం నేర్చుకో, చెప్పిస్తాం...” అని సలహా ఇచ్చారు. సలహా ఇవ్వడమే కాదు, మా ఇంటికి దగ్గరే ఉన్న పంకజం గారనే మÖ్యజిక్ టీచర్‌తో మాట్లాడి నా చేత సరిగమలు పలికించారు. నా సంగీతం కోసం మా ఇంట్లోనే కొంత భాగం ఖాళీ చేసి పంకజం గారికిచ్చి ఇంట్లోనే పెట్టుకున్నారు.
ఎంత చేసినా నా మనసు సంగీతాన్ని ఇష్టపడలేదు. కళ్ళు మÖసినా డాన్సే, కళ్ళు తెరిచినా డాన్సే. శ్రుతి కలవలేదు. స్వరాలు పలకలేదు. పంకజం గారికి కోపమొచ్చేసింది. “అమ్మాయ్, నీకు పాట రాదంటే రాదమ్మా, ఏ ఫిడేలో వీణో’ నేర్చుకుంటే నీ శ్రమా ఫలిస్తుంది. నాకూ శ్రమ తప్పుతుంది” అనినాతో చెప్పింది, అదే విషయం మా ఇంట్లో వారితోన చెప్పేసింది.
అదే సమయంలో మా మేనమామ కొడుకు పెళ్ళి జరిగింది. ఆ సందర్భంగా ప్రఖ్యాత విద్వాంసురాలు బెంగుళూరు నాగరత్నమ్మగారి ఫీడేలు కచ్చేరి జరిగింది. ఆమె కచ్చేరి విన్న తర్వాత, మా ఇంటిల్లిపాదీ నాకు ఫిడేలు నేర్పించాలన్నారు. దానికి పంకజం టీచర్ సపోర్టు. వయొలిన్ చిట్టిబాబు రోజూ ఇంటికి వచ్చి ఫిడేలు నేర్పేవారు. ఇంత జరిగినా నాలో నాట్యంపై అభిలాష అణగారిపోలేదు. ఎలాగైనా సరే డాన్స్ చెయ్యాలి కాని ఎలా. ఇంట్లో నాన్నను ఒప్పించాలంటే భయం. ఎలాగైనా సరే పంకజం టీచర్‌నే అడుకున్నాను. ఆమె కాదనలేదు. ఇంతలో “బేతాళఉళగమ’ అనే తమిళ సినిమాను చూశాను. అందులో తిరువాన్కూరు సిస్టర్స్ (లలిత, పద్మిని) చేసిన నృత్యాలు నన్ను మరీ ఆకర్షించాయి. ఇక డాన్స్ నేర్చుకోకుంటే బతకలేను అనే స్థితికొచ్చాను. నా బాధను అర్థం చేసుకున్న పంకజం టీచర్ మా ఇంట్లో వాళ్ళకి చెప్పింది. ప్రయోజనం కనిపించలేదు. దాంతో నాకంటే కూడా పంకజం గారిలోనే పట్టుదల పెరిగింది. ఎలాగైనా సరే నన్ను ప్రఖ్యాత నర్తకిగా చూసి తీరాలనుకున్నది. ఇంట్లో మా అమ్మకు తప్ప మరెవ్వరికీ తెలీకుండా నన్ను “సరస్వతీ గాన నిలయం’లో డాన్స్ స్టూడెంటుగా చేర్చింది. ఆ సరస్వతి గాన నిలయాన్ని లలితా టీచర్ అనే ఆవిడ నిర్వహిస్తూ ఉండేది. ఆమె మా పంకజం టీచర్ చాలా క్లోజ్ ఫ్రెండు. అక్కడ చేరిన కొద్దిరోజుల్లోనే నేను లలితా టీచర్‌కు ప్రియ శిష్యురాలినై పోయను.
ఇంట్లో వాళ్ళకు తెలీకుండా సరస్వతీ గాన నిలయానికి వెళ్ళి రాసాగాను. అర్థరాత్రి అందరూ నిద్రపోయేటప్పుడు లేచి ప్రాక్టీసు చేసేదాన్ని. ఇంట్లో వాళ్ళకు తెలిస్తే ఏమంటారో? మా పంకజం టీచర్‌కు మాట£స్తుందేమోనని ఒకటే భయం. ఏమైతేనేం, ఒకనాడు ఆ రహస్యం ఇంట్లో తెలిసిపోయింది. చేసేది లేక మా నాన్న కూడా మా దారికే వచ్చాడు. కానీ ఒక షరతు పెట్టారు- “నువ్వు వయొలిన్ వదలటానికి వీల్లేదు. చదువు మానటానికి వీల్లేదు. రోజూ ట్యూషన్‌లో చదువుకోవాల్సిందే, వాటిలో ఏ ఒక్కటికీ ఇబ్బంది లేకుండా నృత్యం నేర్చుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు.” అన్నారు మా నాన్న. నేను డాన్స్ నేర్చుకోవడానికి వాళ్లు ఒప్పుకోవాలేగానీ ఏం చేయమన్నా చెయ్యడానికి సిద్ధమయ్యాను. ఉదయం ట్యూషన్, పగలు స్కూలు, సాయంత్రం వయొలిన్, వారినికి మÖడుసార్లు డాన్స్ క్లాసులు... ఇలా ఉండేది నా బాల్యం. ఆటపాటల్తో గడపాల్సిన బాల్యం చదువులతోనూ, సాధనతోనూ గడిచిపోయింది.
సరస్వతీ గాన నిలయానికి నేనెంతో ఋణపడి ఉన్నాను. ఏదో డబ్బు పుచ్చుకుంటున్నాం గదా ఏదో చెప్పాలి అనే ధోరణి అక్కడ ఉండేది కాదు. ప్రతి విద్యార్థిని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు. ప్రతి విద్యార్థినికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడమేగాక, మాతో నెలనెలా నగరంలోని వివిధ ప్రదర్శనల్లో, జాతీయ కార్యక్రమాల్లో పాý£్గనేలా చేసేవారు. నేను అటువంటి వాటిల్లో ఎన్నిట్లోనే పాý£్గన్నాను. ఆర్.ఆర్.సభలో ఆండాళ్ కల్యాణం. కాంగ్రెసు సభలలో శివలీల, కురవంజి, త్యాగరాజు నౌకాచరిత్రల్లో ముఖ్య పాత్రలు ధరించి ప్రత్యేక బహుమతులు అందుకున్నాను.
నేషనల్ గర్ల్స్ హైస్కూల్‌లో మÖడో ఫారం చదువుకుంటుంటే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈడొచ్చిన పిల్ల, ఇంకా బయటికి రావడమేమిటని బంధువులు ముఖాన అనకపోయినా చాటుమాటున అనసాగారు. ఇక అన్నిటికీ స్వస్తి చెప్పమన్నారు ఇంట్లో వాళ్లు. అప్పటికే నేను డాన్స్‌లో డిప్లొమా హోల్డర్‌ని. అరంగేట్రం జరిపింతర్వాత మానేయాలనుకున్నాను. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమÖర్తి టి.ఎల్.వెంకట్రామయ్యర్ ముఖ్య అతిథిగా పాý£్గనగా మద్రాసులోని హిందూ హైస్కూలు హాలులో తొలిసారిగా నృత్యప్రదర్శన నిచ్చాను. ఈ డాన్స్ ప్రోగ్రామ్ తర్వాత అటు స్కూలుకు, ఇటు డాన్స్‌కు ఏకకాలంలో మంగళగీతం పాడేశాను.
అయితే నేను ఇంట్లో కూర్చుని టైమ్ కిల్ చేయదలచుకోలేదు. నేర్చుకున్న విద్యను మరో విధంగా సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. ఒక చిన్న నాట్య విద్యాలయాన్ని ప్రారంభించి నాకంటే చిన్న పిల్లలకు నృత్యంలో శిక్షణ ఇవ్వసాగాను.
ఇదే సమయంలో సరస్వతీ నిలయంలో నా సహాధ్యాయిని అయిన తాsబరం లలిత ట్రూప్ నుంచి బయటికొచ్చి సొంతంగా ఒక ట్రూప్‌ను ప్రారంభించింది. ఆమె ఓ కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా నన్ను నృత్య ప్రదర్శనకోసం ఆహ్వానించడంతో ఇంట్లో తెలీకుండా వెళ్ళి డాన్స్ చేశాను.ఆ సమయంలోనే కె.ఎన్.ఆర్. ప్రొడక్షన్స్ మేనేజర్ అయిన డాన్సర్ రామÖ్మర్తి నన్ను చూశారు. అప్పుడు గుబ్బి కర్ణాటక ఫిలింస్ వారు ‘గుణసాగరి’ అనే చిత్రాన్ని కన్న, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. కొత్త నటిని పరిచయం చేయాలని వారు దేశమంతా గాలిస్తున్నారట. డాన్సర్ రామÖ్మర్తిగారు నా గురించి దర్శకుడు హెచ్.ఎల్.ఎన్.సిన్హాకు చెప్పారు.
సిన్హాగారు వెంటనే నా వివరాలు సేకరించి, మా నాన్న గారితో సినిమాలో నటించే విషయం గురించి అడిగారు. మొదట ఒప్పుకోకపోయినా చివరికి ఆ చిత్ర నిర్మాత గబ్బి వీరన్న గారి బలవంతం మీద అంగీకరించాను. “గుణసాగరి” నిర్మాణం 1951లో ప్రారంభమైనా అది 1953లో గాని విడుదల కాలేదు. 1952లో గుణసాగరి తాలూకు రషెస్‌ను నిర్మాత,దర్శకుడు అయిన శ్రీ కె.ఎస్. ప్రకాశరావు గారు చూడడం జరిగింది. గబ్బి కర్నాటక ఫిలింస్ బసవరాజు గారు నన్ను రికమెండ్ చెయ్యడంతో తొలిసారిగా “కన్నతల్లి” (53) అనే ద్విభాషా చిత్రంలో (తెలుగు, తమిళం) చిన్న పాత్ర ఇచ్చారాయన. అందులోనూ డాన్సర్ పాత్రే! పన్నెండు నిమిషాల పాటు సాగే వీధిభాగోతం అంటే యక్షగాన శైలిలో ఉండే పాటలో నటించాను. నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమÖర్తిగారి సరసన నటించానందులో.
అంటే 1953లోనే తొలిసారిగా కన్నడ, తమిళ, తెలుగు, మÖడు భాషల్లోనూ ఒకేసారి సినిమా రంగంలో ప్రవేశించాను. నేను చిత్రరంగానికి వచ్చి ఐదు దశాబ్దాలు నిండాయి.
“కన్నతల్లి” ప్రివ్యూ చూసిన నాటి సారథీ వారి పర్మనెంట్ డైరెక్టర్ తాపీచాణక్య నాకు “అంతా మన వాళ్ళే” (54) చిత్రంలో నృత్య పాత్రనిచ్చారు ఎస్.వి.రంగారావు సరసన నటించానదులో. ఆ చిత్రాన్ని చూసిన ఆర్.నాగేశ్వరరావు (దొంగరాముడు ఫేం) నన్ను భాస్కర్ ప్రొడక్షన్స్‌కు సజెస్ట్ చేశారు. ఫలితంగా నేను భాస్కర్ వారి “చెరపకురా చెడేవు” (59), “రేపు నీదే” (57) చిత్రాల్లో నటించాను.
నాకెందుకనో తెలుగు సినిమాల్లో నటించడానికి కొంతకాలం భయంగా ఉండేది. అందుకు కారణం జనతా వారి “పరివర్తన” చిత్రంలో ఒక వ్యాంప్ పాత్రకు ఎంపికైన నన్ను తెలుగు ఉచ్ఛారణ సరిగా లేదని చివరి క్షణంలో వద్దన్నారు. తర్వాత ఆ పాత్రను సురభి బాలసరస్వతికిచ్చారు.
నేను హీరోయిన్‌గా నటించిన మొదటి చిత్రం “సొంత ఊరు” (56). అందులో ఎన్.టి.రామారావుగారు హీరోగా వేశారు. ఆ చిత్రానికి నిర్మాత ఘంటసాల గారు.
“సొంతవూరు” తర్వాత నాటి అగ్రహీరోలందరి సరసనా హీరోయిన్‌గా చేశాను. కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, జంపన, విఠలాచార్య, కె.బి.తిలక్ ఆదుర్తి లాంటి దిగ్గజాల దగ్గర పనిచేశాను.
హీరోయిన్ చేస్తూనే మరోపక్క వాంప్ పాత్రలు (జయభేరి, తోడికోడళ్ళు), హాస్యపాత్రలు (మాంగల్యబలం), గెస్ట్‌రోల్స్ (పాండవవనవాసం) వేశాను. ఆ రోజుల్లో హీరోయిన్లం కాబట్టి అదే స్థాయి వేషాలు వేయాలనుకునే వాళ్ళం కాదు. పాత్రముఖ్యం. అంకితభావంతో నటించాలనే తపన పడేవాళ్ళం. అంతేగానీ నటించే పాత్ర చిన్నదా, పెద్దదా అని చూసే వాళ్ళంగాదు.
ఇక నేను హీరోయిన్‌గా అక్కినేని సరసన “ఇద్దరు మిత్రులు” (61), “శాంతినివాసం” (60), రామారావు సరసన “పెంకిపెళ్ళాం” (56), “వాల్మీకి” (63), “రాజమకుటం” (61), కాంతారావు సరసన “గుండెలు తీసిన మొనగాడు” (), “ఖైదీ కన్నయ్య” (62), కొంగర జగ్గయ్య సరసన “రేపు నీదే” (), “భాగ్యరేఖ” (59) వంటి చిత్రాల్లో నటించాను.
ఇక హిందీలో ‘బహార’, ‘నయాఆద్మి’, ‘చోరీచోరీ’ మొదలైన చిత్రాల్లో నటించాను. అశోక్ కుమార్‌తో ‘సితారోంసే ఆగే’ చిత్రంలో నటించి హిందీలో మంచి పేరు తెచ్చుకున్నాను.
ఇప్పటివరకు నర్తకిగా, వాంప్‌గా, హీరోయిన్‌గా, క్యారెక్టరు ఆర్టిస్టుగా ఇలా పలుభూమికల్లో సుమారు 300 చిత్రాల్లో నటించి ఉంటాను. తెలుగులో నా చివరి చిత్రం డా.డి.రామానాయుడు ‘తోడికోడళ్ళు’ (94), తమిళంలో టి.రాజేందర్ నిర్మించిన ‘ఎంగవీట్టు వేలన’.
నేను నటిగా ఎన్ని చేసినా, సినిమాల్లో సైతం నేను చేసిన నృత్యాలే నాకు సంతృప్తినిచ్చాయి. అప్పటి చిత్రాల్లో నాట్యాం మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగించే విధంగా ఉండేది. ఆశ్లీలతకు, అసభ్యతకు తావులేకుండా, కుటుంబసమేతంగా ఆస్వాదించతగ్గ శృంగారం ఆచిత్రాల్లో కనిపించేది. ఈనాటి వెగటు పుట్టించే నృత్యాలు చూసి ఆ రోజులను తలచుకుంటే మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. అంజలీవారి “సువర్ణసుందరి” (57)లో హీరో జయంత్ శాపవశాత్తు స్త్రీగా మారినప్పుడు రాకుమారికి నేను ‘జయంతి’ వేషంలో నేర్పిన థిల్లానా, ‘జయభేరి’లో ‘నీ వెంత నెరజాణ వౌరా’, ‘పెంకిపెళ్ళాం’ ()లో ‘ఆటలు సాగునటే’, ‘కాళహస్తిమహాత్మ్యం’ (54)లో ‘చాలు చాలు నవమోహనా’, ‘వెలుగునీడలు’ (61)లో ‘పాడవోయి భారతీయుడా’ పాటకు గీతా ఆర్ట్స్ శేషాచలం చెట్టియార్, ముక్కామల కలసి నిర్మించిన ‘ఋష్యశృంగ’ (61)లో నేను చేసిన నృత్యం నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే ‘పాండవ వనవాసం’ (ఉరుకులు పరుగుల దొర) చిత్రంలోని నాట్యం కూడా నాకు చాలా ఇష్టం. నృత్యం చేయడానికి ఎంత కష్టమైనా భరించే దాన్ని. రాజ్యం పిక్చర్స్ ‘హరిశ్చంద్ర’ (56) సినిమాలో మాతంగి కన్యలలో ఒకరిగా నేను నటించాను. అయితే అంతకు ముందు ‘సొంతవూరు’ చిత్రం షూటింగ్‌లో నా కాలి వేలు తెగడంతో చాలా నొప్పిగా ఉండేది. అయినా మంచి డాన్స్ ఒకటి చేయాలి అనడంతో నొప్పి గాలికెగిరిపోయింది. బేండేజ్‌తోనే ‘హరిశ్చంద్ర’ షూటింగ్‌లో పాý£్గన్నాను. ఆ మాతంగి కన్యల నృత్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే స్కిన్ కలర్ సాక్స్‌లోంచి నా బేండేజ్ కనిపిస్తుంది. అలా రిస్క్ అయిన పటించుకునే వాళ్ళం కాదు.
నృత్యానికి నేను మొదటి ప్రాధాన్యత ఇస్తాను. నటిగా ఎంత పేరొచ్చినా నృత్యాన్ని వదలకూడదని ఆనాడే నిర్ణయించుకున్నాను. 1950 ఆ ప్రాంతాల్లో మద్రాసు సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన వేదాంతం సత్యనారాయణశర్మ నాట్య ప్రదర్శన నన్ను విపరీతంగా ఆకర్షించింది. ‘స్త్రీ’ వేషంలో ఆయన చేసిన ‘భామా కలాపం’ ప్రబావం నాపై ఎంతో ఉంది. 1957లో ‘తోడికోడళ్ళు’ చిత్రం వంద రోజుల పండుగకు ఆంధ్రదేశం వచ్చి ఒక వేదిక మీద కూచిపూడి నృత్యాన్ని చూసి తన్మయత్మం పొందాను. ఎలాగైనా అది నేర్చుకోవాలని భావించి సి.ఆర్.ఆచార్యులు, వెంపటి చినసత్యంగార్ల దగ్గర పట్టుదలతో నేర్చుకున్నాను. కథాకళిలో కలామండలం మాధవన్, కథక్‌లో విష్ణు వయస్ చాల్కర్, ధర్వా కృష్ణకుమార్, భరతనాట్యంలో లలిత, దండాయుధ పాణి పిళ్ళై, వెస్ట్రన్‌లో మేడమ్ విక్కీల దగ్గర శిక్షణ పొందాను. హావభావ ప్రదర్శన మెలుకువలు నేర్పించి మాత్రం పసుమర్తి కృష్ణమÖర్తి గారు. 1970లో కథక్ నృత్యాన్ని బ్రిజ్ మహరాజ్ బాణి అయిన లక్నో శైలిలోనూ, గోపికృష్ణ బాణి అయిన జైపూరి శైలిలోనూ ఒకేసారి నేర్చుకున్న తొలి కళాకారిణిని నేనే, అలాగే నేను ్పుపాన్‌లో రెండు మాసాలు ఉన్నప్పుడు జపనీస్ డాన్స్‌ని కూడా అభ్యసించాను.
మార్చి 25, 1960...... నా జీవితంలో ఒక మరపురాని దినం. ఆ రోజే నేను జపాన్‌యాత్ర వెళ్ళాను. ఆ సమయానికే టోకియోలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరుగుతోంది. టోకియోలో నేను జపనీస్ డాన్స్ విశేషమైన పడవ సరంగు నృత్యాన్ని నేర్చుకున్నాను. నేను టోక్యోలో ఉండగానే, దేశముఖ్ దంపతులు వచ్చారు. దుర్గాబాయి గారు నేను టోకియోలోనే ఉన్నానని తెలుసుకుని నన్ను ఇంటర్నేషనల్ హౌస్‌లో విందుకు ఆహ్వానించారు. ఆ సందర్భంలో నేను టోకియోలో నేర్చుకున్న జపాన్ ఐటమ్‌ను ప్రదర్శించాను. అనంతరం నాకు జపనీయులు వారి జాతీయ దుస్తులైన ‘కిమోనా’ నిచ్చి గౌరవించారు. నా రాకను పురస్కరించుకుని టోకియోలోని నేషనల్ టెలివిజన్ వారు నా ఇంటర్వ్యూను ప్రసారం చేశారు. ఆ ఇంటర్వ్యూ నిజంగా చెప్పుకోతగ్గదే. నాకు వారి భాష రాదు. వారికి నా భాష రాదు. అందుకని ఇద్దరి భాషలను అర్థం చేసుకుని ఇంగ్లీషులోకి తర్జుమా చేసుకుని తర్వాత జపాన్ భాషలో ప్రసారం చేశారు. టోకియోలో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాý£్గన్నాను. అక్కడే ఆల్‌ఫ్రెడ్ హెచ్‌కాక్‌తో పరిచయమైంది.
టోకియో నుంచి సైగాన్, కంబోడియా, అనంతరం సింగపూర్ ఇలా అన్ని దేశాలు పర్యటించాను. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సైగాన్ స్టూడియోను సందర్శించిన తొలి దక్షిణ భారత నటిని నేనేనట. నన్ను చాలా గౌరవంగా చూసుకున్నారు. అందుకు గుర్తుగా ఆ స్టూడియో యజమానులు నా పాదముద్రలను వాళ్ళ స్టూడియో ఆవరణంలోని సిమెంట్ ఫలకంపై పొందుపరిచారు. ఇది నాకు దక్కిన అపూర్వ గౌరవం.
నాట్యాన్ని పదిమందికీ నేర్పించి ఆ కళకు మహోన్నత స్థానాన్ని కల్పించడమే నా ధ్యేయం. అందుకే మద్రాసులో 1962లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రాన్ని స్థాపించాను. ఈనాటికీ దిగ్విజయంగా నడుస్తోంది. కూచిపూడి నాట్యకళ నేను పుట్టక పూర్వమే ఉన్నా దాన్ని తమిళనాడంతటా ప్రదర్శనల ద్వారా ప్రచారంలోకి తెచ్చాను. 1961-62 ఆ ప్రాంతాల్లోనే నేను అర్థనారీశ్వర నృత్య నాటికను రూపొందించాను. ప్రముఖ రేడియో సంగీత దర్శకుడు మల్లిక్ దానికి సంగీతం సమకూర్చారు. అప్పటి వరకూ ‘అర్థనారీశ్వరి’ని నృత్య నాటికగా ప్రదర్శించిన వాళ్ళు లేరు. ఆ ఘనత నాకే దక్కింది. 1963 సెప్టెంబరులో పద్మావతీ శ్రీనివాసకల్యాణం నృత్య నాటికను తమిళంలో ఉడుమలై నారాయణ కవితో రాయించి, మా పుష్పాంజలి బృందంతో ప్రదర్శించాను. దాన్నే తెలుగులో సముద్రాల జూనియర్‌తో రాయించి తిరుపతిలో నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సమక్షంలో ప్రదర్శించాం. భరతనాట్యం, కూచిపూడి నృత్య రీతుల్లో రామాయణం, భామాకలాపం, గొల్లకలాపం, మారియమ్మ జ్ఞానఫలం, అష్టలక్క్ష్మీ వైభవం మొదలైన రూపకాలన్నీ దేశ విదేశాల్లో ప్రదర్శించాం. బ్రిటన్, అమెరికా, జపాన్, దక్షిణాఫ్రికా మొదలైన దేశాల్లో విస్తృతంగా ప్రదర్శనలిచ్చాం. అలాగే ‘సింహనందిని’ అనే నృత్య రూపకాలన్నీ రూపొందించాను. తడిబట్టపై ముగ్గులాంటి పదార్థాన్ని వేసి దానిపై నృత్యం చేసినప్పుడు ఆ బట్టపై పడిన క్రమమైన పద గతులతో సింహం ఆకారం రావడం ఆ నృత్యం ప్రత్యేకత. 1986 జనవరిలో హైదరాబాదులో జరిగిన ఫీల్మోత్సవ్ ప్రారంభ సందర్భంలో ‘పంచనదుల’ విశిష్టతను చాటుతూ డా.సి.నారాయణరెడ్డి రాసిన గీతానికి రాధ, భానుప్రియ, రమ్యకృష్ణ మొదలైన వారందరితో బాటు నలభై మంది నా శిష్యురాళ్ళతో భరతనాట్యం, కూచిపూడి, కథక్, జానపదాల మేలుకలయికలతో నాట్యాన్ని రూపొందించాను. ముఖ్యంగా ఆ రోజుల్లో తారలకు అంటే నాకేకాదు ఎవరికీ స్టేజి అంటే చిన్న చూపు ఉండేదిగాదు. సినిమాల్లో బిజీగా ఉన్నాకూడా అవకాశం ఉన్నప్పుడల్లా స్టేజీమీద మా పాత్రలు మేం పోషించే వాళ్ళం.
ఇక నా వ్యక్తిగత జీవితంలో మలుపు తిప్పిన ఘట్టం - సి.ఎస్.రావు గారితో నా ప్రేమ వివాహం. అవి నేను రాజశ్రీ పిక్చర్స్ ‘శాంతినివాసం’లో హీరోయిన్‌గా చేస్తున్న రోజులు. ఆచిత్రానికి సి.ఎస్.రావు గారు దర్శకులు. ఆయన సెట్‌మీద ఎప్పుడూ సీరియస్‌గానే ఉండేవారు. అయినా నేను మాత్రం అదేమీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుని వెళ్లిపోయేదాన్ని. ఓ రోజు శాంతినివాసం షూటింగ్ పేకప్ అయ్యాక ఆయన నాతో పర్సనల్‌గా మాట్లాడాలన్నారు.
“సులోచనా! నేనంటే నీకు భయం లేదా?” అని గంభీరంగా అడిగారు. నేను “ఎందుకు భయం” అన్నాను. పోనీ నేనంటే “నీకు ఇష్టమేనా?” అని అడిగారు. నేను “మీరంటే నాకు గౌరవం” అన్నాను. “నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్ళి చేసుకుంటాను” అన్నారు. నాకు తలగిర్రున తిరిగి పోయింది. కొంతకాలం మౌనంగానే ఉండిపోయాను. సి.ఎస్.రావుగారికి అప్పటికే పెళ్ళయింది. కన్నాంబ గారి కూతురు రాజేశ్వరి ఆయన భార్య. వారికి ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. ఇదంతా ఆలోచించిన నేను ఒక పట్టాన నిర్ణయానికి రాలేకపోయాను. అయితే రావుగారి నిర్ణయంలో మార్పు రాలేదు.
ఒకరోజు ఏదో సెట్టుమీద కలిశారు. నాకు ఒకటే దడ. అయిపోయింది నా పని. ఎడాపెడా వాయించేస్తారు. ఎన్నితిట్లు తిడతారోనని భయపడి పోయాను. ఆమె షూటింగ్ అయినపోయిన తర్వాత రూంకు రమ్మన్నారు. నేను ఏమో అయిపోతుందని ప్రిపేరై పోయాను. కానీ నేను ఊహించిన విధంగా జరగలేదక్కడ. ఆమె ఎంతో తాపీగా “అమ్మాయ్! నువ్వు రావును పెళ్ళిచేసుకో! కుర్రవాడు యోగ్యుడు, తెలివైనవాడు. అతనితో జీవితం గడిపే రాత నా కూతురికి లేదు. అంతా రుణానుబంధం. వారిద్దరికీ రాసి పెట్టిలేదు. నిన్ను కోరుకుంటున్నాడు మా అల్లుడు. యోగ్యుడైన భర్త లభించడం కంటే కావలసిందేముంది. ఆలోచించకుండా వివాహం చేసుకో!” అని మనసారా ఆశీర్వదించారు. ఆ రోజున ఆమె తన చల్లని హస్తాలతో నా తల నిమరడం ఇన్నేళ్ళ తర్వాత తలుచుకున్నా హృదయం చెమ్మగిల్లుతుంది. ఆ క్షణాలు నేను ఇప్పటికీ మరువలేను. అమా మా పెళ్ళికి కన్నాంబగారే కారకులు, ప్రేరకులు. మేమిద్దరం 1963 మేలో గురువాయÖరులో పెళ్ళి చేసుకున్నాము. ఆ తర్వాత పిల్లలూ.... వారి పిల్లలూ.... బాధ్యతలూ ఇవన్నీ మామÖలే.
రావుగారిని పెళ్ళి చేసుకున్న తర్వాత ఆయన దర్శకత్వంలో ‘ప్రచండ భైరవి’ (65), ‘మామకు తగ్గ కోడలు’ (69), ‘ఏకవీర’ (), ‘గ్రామ దేవతలు’ (68), మొదలైన చిత్రాల్లో నటించాను.
‘పుష్పాంజలి’ సంస్థలోనేగాక నేను ఒక సినిమాకు కూడా నృత్య దర్శకత్వం వహించాను. ఆ చిత్రం ‘చిన్నారిపాపలు’ (68) ప్రముఖనటి సావిత్రిగారు దాన్ని లేడీ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతోనే రూపొందించడం వలన ఆ చిత్రానికి డాన్స్ డైరెక్టరుగా పని చేయవలసి వచ్చింది.
ఈ చిత్రంతో సినిమాలకు నృత్యం దర్శకత్వం చేసిన తొలి మహిళగా పేరు సంపాదించాను. అలాగే ‘మహాకవి కాళిదాసు’ () చిత్రంలో నా పాటకు నేనే వీణ వాయించుకున్నాను. వీరమాచనేని సరోజిని, పి.లీల, సావిత్రి, జమున, ఇలా అందరం మహిళలమే పని చేశామా చిత్రానికి. ఆ తర్వాత కూడా నన్ను చాలా మంది సినిమాలకు నృత్య దర్శకురాలిగా పనిచేయమన్నారు. నేను ఒద్దనుకున్నాను. డాన్స్ చేయడం తప్ప సినిమాలకు కంపోజ్ చేయడం నా కిష్టం ఉండదు నాట్య వేదికపై నలభై నిమిషాలు చేసే బామాకలాపం నృత్యాన్ని సినిమాకోసం పది నిమిషాలకు కుదించడం ఏమంత రసస్ఫూర్తినివ్వదని నా అభిప్రాయం. అందుకే సినిమాలకు పనిచేయడమంటే నా మనసు అంగీకరించదు.
1970లో అమెరికా వెళ్ళి దాదాపు సంవత్సరం పాటు గడిపిన సమయంలో అక్కడ కొన్ని డాన్స్ ప్రోగ్రాములిచ్చాను. అక్కడే డాన్స్ స్కూలులో భారతీయ నృత్యాన్ని నేర్పించే ఇన్‌స్ట్రక్టర్‌గా ఉద్యోగం చూసుకున్నాను. ఆ సమయంలో ఇండియా రావడం, ‘మోసగాళ్ళకు మోసగాడు’ (71) చిత్రంలో ఓ క్లబ్ సాంగ్ (హీరాలాల్ డాన్స్ డైరెక్షన్)లో పాý£్గనడం జరిగింది. ఆ సినిమా టైంలో భలే సంఘటన జరిగింది. ఏదో గెస్ట్ రోల్ అంటున్నారు కదా అని అంగీకరించాను. దొంగల గుంపు దగ్గర చేసు ఆ డాన్స్‌కు నాకు ఇచ్చిన డ్రస్సును చూడగానే దడ పుట్టింది. చాలీచాలని ఆ దుస్తులతోనే డాన్స్ చేయక తప్పలేదు. ప్రేక్షకులు ఎక్కడ నన్ను అపార్థం చేసుకుంటారోనని భయపడ్డాను. అయితే అలా జరగలేదు. అలాంటి డాన్స్‌లే నిండుగా ఉండే కాస్ట్యూమ్స్‌తో సుమారు 20 చిత్రాల్లో చేశాను.
డ్రస్సులో కాకుండా అభినయంలోనే అప్పడంతా శృంగారాన్ని ప్రదర్శించేవారు. ఆ కాలంలో మనకు సురభి బాలసరస్వతి, లక్క్ష్మీకాంత, కుచలకుమారి వంటి వారు వాంప్‌లుగా నటించినప్పటికీ అది చాలా పరిమితంగా ఉండేది. మా పుష్పాంజలి సంస్థ కేవలం కళారాధనకే గాకుండా సంఘ సేవకు కూడా ఇతోధికంగా తోడ్పడింది. జాతీయ రక్షణనిధికోసం నేను మా ట్రూప్‌తో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో పర్యటించి సుమారు 75 ప్రదర్శనలిచ్చి పది లక్షల రూపాయలు సేకరించాను. కాకినాడ గర్ల్స్ హైస్కూలు, కేసరీ హైస్కూల్, హనుమంతరాయ గ్రంథాలయం వంటి భవనాల నిర్మాణ సహాయార్థం ముప్పై అయిదు వేల నుంచి ఇరవై అయిదు వేల దాకా పోగుచేసి ఇచ్చాం. వేలూరు కాలేజికి లక్ష రూపాయలు ప్రదర్శనల ద్వారా సేకరించి ఇచ్చాను. జాతీయ కరువునిధి, డిపెన్స్‌ఫండ్ మొదలైన సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం స్టార్ నైట్స్‌లో పాý£్గని నాట్య ప్రదర్శనలిచ్చి విరాళాలు సేకరించాం.
1984లో తమిళనాడు ప్రభుత్వం నాకు ‘కలైమామణి’ బిరుదునిచ్చింది. 1986, 1988 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నాను. అయితే జీవితంలో నేనెప్పుడూ నాకిది కావాలి అని పనిచేయలేదు. అనుకోకుండా సినిమా నటినయ్యాను. నర్తకిగా, నటిగా ఇంకా కొనసాగుతున్నాను. మంచి భర్తని, మంచి పిల్లలను పొందాను. నాకీ తృప్తి చాలు. ఇలా అంటే మరో సంఘటన గుర్తుకొస్తుంది. 1969లో ఒకసారి రాజమండ్రిలో నృత్య ప్రదర్శన ఇచ్చాను. నా డాన్స్ అయిపోగానే లైట్స్ ఆఫ్ చేశారు. స్టేజీమెట్లు ఒక వైపు ఉంటే ఆ చీకట్లో నేను మరోవైపు దిగబోయి క్రిందపడిపోయాను. ఆ సమయంలో నాకాలు ఫ్రాక్చర్ అయంది. అక్కడ నన్ను హాస్పిటల్ చేర్చారని తెలిసి జనం గుంపులు గుంపులుగా వచ్చారు. ఊరంతా నాకోసం కదలి వచ్చిందా అని అనిపించింది. నన్ను మద్రాసుకి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు కన్నీటితో చ్చిన వీడ్కోలు నేనిప్పటికీ మరువలేను. నేను చనిపోతే ఎల ఉంటుందో నాకు తెలీదుకాని, ఆ సంఘనటలో బ్రతికుండే నా చావుని నేను చూసుకోగలిగాను. అయినా ఒకటిమాత్రం స్ఫురణకొచ్చింది. నాకీ తృప్తి చాలు - అంతేగానీ ఇంకా ఏవో అవార్డులు రావాలని, రప్పించుకోవాలనే కాంక్ష నాకు లేదు.
ఇక నేటి సినిమా ఎటు వెళుతుంతో తెలియడం లేదు. శాస్త్రీయ సంగీతాన్ని, శాస్త్రీయ నృత్యాన్నీ బ్రతికించుకోవాలి. ఆ రెండింటినీ విస్మరించకుండా ప్రాముఖ్యతనిచ్చే సినిమాలు రావాలని ఆకాంక్షిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి