వరలక్ష్మీ వ్రతాచరణ నిష్టా వరిష్ఠులై సభక్తికంగా అద్భుతంగా అద్వితీయంగా ఆత్మీయ బంధువులందరికి కనువిందు చేస్తూ వ్రతం విజయవంతంగా నిర్వహించిన మీకందరికీ, ఆ వరమహాలక్ష్మీ సకల సంపదలతో కూడిన సౌభాగ్యాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, అపరిమితమైన ఆనందాన్ని ప్రసాదించాలని మా సవినయ ప్రార్ధన.
వరలక్ష్మీ వ్రతం గురించి రెండు మాటలు మీతో పంచుకోవాలని ఈ సందేశ పరమార్ధం.
మన వైదిక సంస్కృతి, మానవాళికి సత్సాంప్రదాయాలను తెలియజేస్తూ సాధించవలసిన అంతిమ లక్ష్యం” కోసం విధి విధానాలను ఏర్పాటు చేసింది. అయితే ఆ అంతిమ లక్ష్యం ఏమిటి? అది సత్యమును తెలిసికొనుట యే సత్యం మినహా మరొకటి లేదు. ఆ సత్యం ఎలా తెలుస్తుంది? సత్కర్మాచరణ జనిత భక్తి వల్ల. మరి సత్కర్మాచరణ మంటే. నిత్య నైమిత్తిక కామ్య కర్మా చరణమే సత్కర్మాచరణం. అందులోని అంతర్భాగమే వరలక్ష్మీ వ్రతం. వ్రతం ఆవశ్యకతను ఈ శ్లోకం లో గమనించగలరు.
ప్రతేన దీక్ష మాప్నోతి దీక్ష మాప్నోతి ధర్మః ధర్మాత్
జ్ఞాన మాప్నోతి జ్ఞానాత్ మోక్షమాప్నోతి ఇతి సత్యం
వ్రతాచరణం వల్ల దీక్ష, దీక్ష వల్ల ధర్మం, ధర్మాచరణం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల మోక్షం లభిస్తాయి అని అర్ధం.
ఇప్పుడు వర లక్ష్మీ వ్రతం గురించి.
వర G లక్ష్మీం వ్రతం =వర లక్ష్మీ వ్రతం.
1.వర అంటే దేవతాదుల వలన పొందబడు కోరిక, బహుమానము, ఇంచుకంత ప్రియమైనదని అర్థం... (శబ్దార్థ చంద్రిక)
2. లక్ష్మీ అంటే లక్ష్యా ఇతి లక్ష్మీ అని ఋగ్వేదవచనం... అనగా జనులను (త్రనను ఆరాధించే జనులను) ఉద్దరించే లక్ష్యం కలిగిన దేవము అని అర్థం
3. వ్రతము అంటే ఉపవాసాది పుణ్య కర్మ (కార్యము)
ఇదియే వర లక్ష్మీ వ్రతంలోని పదాల అర్థం.
మనం నిత్యం జీవితం లో చేయవలసిన పనులు అంటే - కర్తవ్య కర్మలు” - మÖడు విధములు
1. నిత్య కర్మలు: సంధ్యా వందనం.. మాతృ పితృ ఇష్ట దేవతా వందనార్చన, ఉపాసనాది సహిత నిత్యాగ్ని హెమనిర్వహణ ఇత్యాది కర్మలు.
2 నైîమిత్తిక కర్మలు: ఒక నిర్దిష్ట నిమిత్తం తో కారణం తో చేసే కర్మలు గ్రహణ సమయాల్లో చేసే జప తప దానాదులు, శ్రాద్ధాది కర్మలు.
3. కామ్య కర్మలు: కోరికలు నెరవేరాలని, ఆపదలు తొలగి పోవాలని సంకల్పించి చేసే కర్మలు. ఉదా. వ్రతాలు, నోములు.
వ్రతాలు: సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మీ వ్రతం, ఏకాదశీ వ్రతం, చాతుర్మాస్య వ్రతం, కేదారేశ్వర వ్రతం ఇత్యాది.
నోములు: కేదారేశ్వర నోములు ఇత్యాది వ్రతం వల్ల కోరిన కోరికలు ఆ దైవం ప్రసాదిస్తాడని ‘ప్రగాఢ విశ్వాసం విశ్వాసో ఫలదాయి’ అని కదా శృతి వాక్యం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి