మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2026, శుక్రవారం

సుభాషితాలు

దీపారాధన శ్లోకాలను పరిశీలిద్దాం. ఈ శ్లోకాలతో దీపాలను వెలిగించి సర్వ శుభములను పొందుదాము. 

శ్లో: దీపం జ్యోతిః పరం బ్రహ్మ శుభం కరోతి కళ్యాణం

సద్భుద్ధి ఆరోగ్యమైశ్వర్యం దీపం జ్యోతిః నమోస్తుతే 

భావం: శుభకరము, కళ్యాణ ప్రదమÖ అయిన జీవితాన్ని, సద్భుద్ధిని, ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే పరబ్రహ్మ స్వరూప దీప దివ్య జ్యోతీ, నీకు ప్రణామాలు. 

శ్లో: దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం జ్యోతిః జనార్దన 

దీపో హరతు మే పాపం దీపం జ్యోతిః నమోస్తుతే 

భావం: ఏ దీపజ్యోతి పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమో, ఏ దీపజ్యోతి జనార్ధనరూపుడె మన పాపములను హరించి, ఐహిక శుభములను ఆముష్మిక శుభములను అనుగ్రహించుచున్నదో ఆ దీపజ్యోతికి ప్రణమిల్లుతున్నాను. 

ఐహిక శుభములు. అనగా ఇహ లోకంలో లభించు సౌఖ్యములు. ఆముష్మిక శుభములు. అనగా మోక్షము. దానినే ముక్తి అనియు కైవల్యమనియు అందురు. 

విష్ణు సహస్ర నామాలలోని 107 వ శ్లోకం. అత్యంత రమణీయ మైన శక్తి వంతమైన శ్లోకమిది. 

నిన్నటి రోజున చెప్పిన ఆర్తో విషాణ్ణ శిథిలాశ్శ భీతావహులే కాక ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని శ్రద్ధ తో పఠిస్తే జన్మ మృత్యు జరా వ్యాధులలో కలిగే భయం తొలగిపోతుంది. ఆత్మ ధైర్యం ఆత్మ విశ్వాసం కలుగుతుంది. 

శ్లో: శంఖ బృన్నందకీ చక్రీ శార్జ ధన్వా గదాధరః 

రథాంగపాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః 

శ్రీ సర్వ ప్రహరణాయుధ ఓం నమః ఇతి 

భావం: ఈ శ్లోకం లో భీష్మ పితామహుడు విష్ణువైన శ్రీమన్నారాయుణుని తాను దర్శించుకున్న విధానాన్ని తెలియజేస్తున్నాడు. సర్వ ఆయుధములను ధరించి దివ్యభవ్య మంగళకర రూప తేజస్సుతో ప్రకాశించు ఆ దివ్య మÖర్తిని దర్శించి, ఆనంద పారవశ్య జనిత మనసుతో కీర్తించుచున్నాడు భీష్మ పితామహుడు.. 

పాంచజన్య” నామక శంఖమును ధరించినవాడు. 

నందక” అను ఖడ్గమును ధరించిన వాడు 

సుదర్శన” చక్రమును ధరించినవాడు 

శార్జం” అనే ధనుస్సు కలిగినవాడు. 

కౌమోదక నామక గదను ధరించినవాడు 

శతానందము అను రథమును చేతి యందు ధరించినవాడు. 

ఈ ఆయుధములేకాక సర్వప్రహరణ ఆయుధము లను అనగా సర్వ ప్రతికూల శక్తులను నశింపజేయు ఆయుధములను కలిగి సర్వశక్తి సంపన్నుడు, సర్వ సమర్థుడునూ, అయిన ఆ లోకత్రయాధిపతి విష్ణువుకి సర్వప్రహరణాయుధ ఓం నమః ఇతి అని హృదయపూర్వక నివాళులనర్పిస్తున్నాడు భీష్ముడు. 

ఓం” - అని సహస్ర నామ స్తోత్రం చివర ఉచ్చరిస్తూ విష్ణువు ఓంకార రూపుడని పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపమని నొక్కి వక్కానిస్తున్నాడు. 

సర్వ ఆయుధములను ధరించిన ఓ పరమేశ్వరా పరమపావనా  పరమ కళ్యాణ గుణాభరణా పరంజ్యోతీ స్వరూపా నీకు నమస్కారం. 

(ఆది శంకరులు వాఖ్యానానికి ఇది మదీయ స్వేచ్చానువాదం) 


విష్ణుమÖర్తి ఆభరణాలు పరికరాదులు వాని వివరములు 

1. ఆయుధములు 

1. శంఖము పాంచజన్యము 

2. చక్రము సుదర్శనము 

3. గద కౌమోదకి 

4. ధనుస్సు శార్జము 

5. ఖడ్గము నందకము 

6. రథము / తేరు శతానందము 

7. వాహనము గరుత్మంతుడు. 

8. సేనానాయకుడు .. విష్వక్సేనుడు 

దారకుడు 

2. గుఱ్ఱములు 

1 సైబ్య 2 సుగ్రీవ 3 పుష్ప 4వలాహకములు 

3.. ఆభరణములు 

1. తలపై కిరీటము 

2. చెవులకు మకరకుండలాలు 

3. కంఠమునందలి మాల: వైజయింతీమాల 

4. కంఠమునందలి వనమాల: తులసీమాల 

5. కంఠమునందు హారాలు 

6. వక్షస్థలమందలి పుట్టుమచ్చ : శ్రీవత్సము 

7. వక్షమునందలి మణి, కౌస్తుభము 

8. లక్ష్మీదేవి .. వృక్షము నందు నివాసము. 

9. దేహమున:సరిక్రొత్త పచ్చని పట్టుబట్టలు. 

10. దండలకు కడియాలుగా: అంగదములు 

11. భుజములకు: భుజకీర్తులు 

12 చేతులకు కంకణములు 

13. చేతులలో శంఖ చక్ర గదాలు 

14. చేతిలో పద్మము 

15. చేతిలోని మణి శమంతకము 

16. కటిప్రదేశమున మొలత్రాడు 

బంగారు అందెలు విశేషాలు 

కౌమోదకి 

1) కౌమోదకి = విష్ణుమÖర్తి గద పేరు 

ఉత్పత్తి కుం భూమిం మోదయతి హర్షయతీతి కుమోదకో విష్ణుః తన్యేయం కౌమోదకీ, భూమిని సంతోషింపజేయు విష్ణు సంబంధమయినది 

వ్యుత్పత్తి కో: మోదక: కుమోదకః= విష్ణుః, కుమోదకస్య ఇయమ్ కుమోదక ఇణ్ త. ప్ర. కుమోదకుని (విష్ణుని) ఆయుధము. 

2. కౌస్తుభము 

విష్ణువు వక్షఃస్థలమందలి మణి. వ్యుత్పత్తి-కుం (భూమిమ్) స్తుభ్నాతి = కుస్తుభః = సముద్రః కుస్తుభే భవః = కుస్తుభః- ఆణి - కౌస్తుభ : 

భూమిని ఆవరించి ఉన్నది అగుటచే సముద్రము కుస్తుభము అనబడును. అందు పుట్టినది. కౌస్తుభము 

3. పాంచజన్యము 

పాంచజన్యము విష్ణుమÖర్తి శంఖము, శ్రీకృష్ణుని శంఖము. 

వ్యుత్పత్తి: పంచజనః

పంచజనుడు అను రాక్షసుని ఎముకచే నిర్మింపబడుటచే దీనికి

ఈ వ్యవహారము 

4. శ్రీవత్సము = శ్రీమహావిష్ణువు వక్షమున ఉన్న ఒక సుడి/ మచ్చ 

5. శమంతకము: విష్ణువు హస్తమునందలి మణి., సత్రాజిత్తు శ్రీకృష్ణునకు 

సత్యభామతో పాటు సమర్పించిన ఒక మణి. 

6. భార్య లక్ష్మీదేవీ 

7. పరిచరులు 

సునంద, నంద, జయ, విజయ, జయంత, ప్రబల, ఉద్భల, కుముద, కుముదాక్ష, తార్ద్య పుష్పదంత, శ్రుతదేవ, సాత్వత, విశ్వక్సేన 

8. పాన్పు.... ఆదిశేషుడు 

9. లోకము ` వైకుంఠము 

10. భక్త సమÖహములు ` వైష్ణవులు 

11.భక్తులు : నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు పరీక్షిత్తు,

ధ్రువుడు, అంబరీషుడు.

అష్టభుజ విష్ణుమÖర్తి ఎనిమిది (8) చేతులలో ఉండే ఆయుధాలు:- 

చక్రం, ధనుస్సు, పద్మం, శంఖం, ఖడ్గం, పాశం, డాలు, గధాదండం. 

విష్ణు సహస్ర నామము లోని 1000వ నామం సర్వ ప్రహరణాయుధః.. కావున ఇంతటితో విష్ణు సహస్రనామాలు (1000) పూర్తి అవుతాయి.. 

ఈ నామం తర్వాత వచ్చే శ్లోకం. 

శ్లో: వనమాలి గదీ శార్జీ శంఖీ చక్రీచ నందకీ 

శ్రీ మన్నారాయణో విష్ణుః వాసుదేవో అభిరక్షతు 

ఈ శ్లోకాన్ని భీష్మ పితామహుడు చెప్పలేదు. ఇది ప్రక్షిప్తం. అంటే ఎవరో ఒక పండితుడు ఈ సహస్ర నామాలలో చేర్చాడు. అందుకే ఆది శంకరులు దీనిపై వాఖ్యానం చేయలేదు. 

స్వామి సుందర చైతన్యానంద వారు కూడా వ్యాఖ్యానించలేదు.. కానీ ఈ శ్లోకం మధుర భావ సమన్వితం. సహస్ర నామాలలో నుంచి అర్థవంతమైన శక్తివంతమైన మÖడు నామాలు తీసుకుని వాటి ద్వారా భగవత్ స్వరూప వర్ణనము, ధర్మ నిర్వహణముల గురించి తెలిపే ఈ శ్లోకం భగవద్భక్తులకు నిత్యపఠనీయంగా మారింది. 

ఈ శ్లోకాన్ని పఠిస్తూ కొంతమంది పెద్దవారు తమ ఆశీస్సుల నందజేస్తారు. అంతేకాదు ఈ శ్లోకాన్నిముఖ్యంగా ఆపదలందు, ఉపద్రవములందు, భయ భీతి సమయములందు భక్తి తో పఠిస్తూ రక్షించమని ఆ భగవంతున్ని నారాయణా, వాసుదేవా, విష్ణుదేవా అంటూ వేడుకోవడం వల్ల తమ తమ ఆపదలు, భయాలు తొలగుతాయని భక్తుల అచంచల విశ్వాసం. నమ్మకం. మరి ఈ శ్లోక భావాన్ని తెలుసు కుందామా

భావం: వనమాలీ అంటే తులసీ మాలను ధరించిన వాడు, శంఖ చక్ర గదా నందకము మొదలైన ఆయుధములను ధరించిన శ్రీమన్ నారాయుణుడైన విష్ణువు మమ్ము వాసుదేవుడై ఎల్లకాలము రక్షించుగాక... ఎంత గొప్ప భావం.. ఇందులో నారాయణ స్వరూప వర్ణన వుంది. విష్ణునామ ప్రస్తామన వుంది. వాసుదేవుని ధర్మ నిరతి ఉంది. 

శ్రీమాన్ అంటే శ్రీ తో కూడుకున్న వాడు... శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని తన హృదయమునందు వసింపజేసినందువల్ల నారాయణుడు శ్రీమన్నారాయణుడయ్యాడు. 

ఆ శ్రీమన్నారాయణుడే శంఖ చక్ర గద నందక మొదలగు ఆయుధములను ధరించి, వాసుదేవుడిగా మమ్ము సదా రక్షించుగాక.. అని  ఈ శ్లోక భావం. 

ఇప్పుడు విష్ణువు - నారాయణ వాసుదేవ పదముల విశ్లేషణ... అవధరించండి.. 

విష్ణువు... 

1. విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి”- యున్న వాడు.... 

2. విష్ణువంటే దేశకాల వస్తువులచేత పరిమితి లేనివాడు... 

3. విష్ణువంటే సర్వలోకాలను సృజించి తిరిగి వాటిని తన యందుంచుకున్నవాడు. 

4. విష్ణువనగా విశంతి”- గుణం కలవాడు. విశతి అనగా సర్వభూతములయందు ప్రవేశించిన వాడు. 

5. విష్ణువనగా విశంతి గుణము కలవాడు.  విశంతి అనగా సర్వ జీవులను తనయందు నిలుపు కున్న వాడు. 

నారాయణ పద విశ్లేషణ: 

నారాయణుడు అంటే 

1. నారయణము = నారాయణుడు 

నారము అనగా నీరు. అయణము అనగా శయనించుట. నీటి మీద శయనించువాడు. నారాయణుడు 

2. నారము = జ్ఞానం. 

అయణము సమృద్ధిగా కలిగినవాడు, జ్ఞానము సమృద్ధిగా కలవాడు నారాయణుడు - అందుకే గురు పరంపరా స్తోత్రం లో నారాయణ సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం - అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం  అంటూ నారాయణుడిని జ్ఞాన సంపన్న గురువు గా స్మరిస్తాము. 

వాసుదేవ పదవిశ్లేషణ 

1. వాసుదేవ అనగా వాసుదేవుని పుత్రుడు. 

2. అంతటా ఉన్న వాడు. అన్ని లోకాలలో వున్నవాడు వాసుదేవుడు 

3. అన్ని జీవులయందు వసించు వాడు వాసుదేవుడు 

4. అన్ని జీవులను సూర్య కిరణముల వలె రక్షణ చేయువాడు వాసుదేవుడు 

5. సమస్త దేవతలయందు విరాజిల్లువాడు వాసు దేవుడు. 

6. భువన త్రయంలో ఉన్నవాడు వాసుదేవుడు 

వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరం తపః

వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవః పరాగతిః 

వాసుదేవాత్మకం సర్వం జగస్థావర జంగమం

ఆ బ్రహ్మస్తంభ పర్యంతం తస్మాద్ అస్యాన్న విద్యతే 

వాసుదేవ పరా వేదా వాసుదేవ పరా మఖాః

వాసుదేవ పరా యోగా వాసుదేవ పరాక్రియాః 

వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః

వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరా గతిః 

బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే 

వాసుదేవ స్సర్వమితి న మహాత్మా సుదుర్లభః . 

శ్రీ మధ్భాగవతం వాసుదేవ శబ్దాన్ని అత్యంత మహిమాస్పదమని మంగళప్రదమని ప్రతిపాదించింది.. సమస్త యాగాలు సకల యోగాలు వాసుదేవునివే. సమస్త పనులు వాసుదేవ పరములే. జ్ఞానం వల్లనే కైవల్యం లభ్యమని అట్టి జ్ఞానం సర్వమÖ వాసుదేవ వాసుదేవ ప్రసాదిత జ్ఞానమే కైవల్య ప్రాప్తికి హేతువని పై శ్లోకాలలో చెప్పబడింది. 

ధర్మాచరణ వల్ల లభించే స్వర్గాదులన్నీ వాసుదేవ పరమే. వాసుదేవునికి సంబంధించని అంశం/విషయం ఈ విశ్వంలో లేనే లేదు. 

(1) వాసుదేవుడు” - అనే పదానికి సామాన్య అర్థం వాసుదేవుని కొడుకు(వాసుదేవస్య ఆయం) 

(2) వసు=పుణ్యములు.. దేవః = స్వయంగా ప్రకాశించు (దీప్యత ఇతి దేవః) ధర్మ సంస్థాపనార్థం చేసే కర్మల వల్ల లభించే పుణ్యముల వెలుగు తో వెలుగువాడు 

(3)వసతి అస్మిన్ జగతి ఇతి వాసు అంతటా వ్యాపించి ఉండువాడు. 

(4) వసంతి జగం అస్మిన్ ఇతి వాసుః.. విశ్వమంతా తనలో కలవాడు. 

(5) చిత్తమునకు అధిష్ఠాన దేవత వాసుదేవుడు. కావున చిత్తమునందు గల మందిరంలో వాసుదేవుడిని ప్రతిష్ఠ చేస్తే అంతఃకరణ శుద్ధి కలిగుతుంది. 

(6) జ్ఞానం కోసం ఎంతో కష్టపడి వలసి వస్తుంది.. ఆ కష్టాలేవీ పడకుండా జ్ఞానాన్ని పొందే సులభమైన ఏకెక్ష మార్గం వాసుదేవ నామ ధ్యానం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి