బి. సరోజాదేవి అంటే చారడేసి కళ్ళు, అందమైన రూపము, మురిపించే ముద్దు ముద్దు మాటలు, మంచి మంచి పాటలు...
జలకాలాటలలో కలకల పాటలలో....
చిటపట చినుకులు పడుతూ వుంటే .....
ఎంకొచ్చిందోయ్ మావా ఎంకొచ్చిందోయ్ .....
వాన కాదు వాన కాదు వరద రాజా ..... వంటి పాటలలో ఆమె నర్తిస్తుంటే వెండితెర జిగేల్మనేది. ప్రేక్షకులు ఈలలతో గోలచేసేవారు. ఆడపిల్లలు ఆమె కట్టుu£ట్టును అనుకరించేవారు.
ఆమె ప్రభావం ఎటువంటిదంటే ఇప్పటికీ పెళ్ళిసంబంధాలు సమయంలో ‘అమ్మాయి బి.సరోజాదేవిలా అందంగా ఉంటుంది’ అనే మాట పోలేదు.
తెలుగువారు మరచిపోలేని సినీ శిల్పసుందరి, కన్నక కస్తూరి, సుమధుర గీతాల సన్నజాజి పందిరి అయిన ఆ అందాల నటి పాఠకులతో ముద్దు ముద్దుగా పంచుకున్న జ్ఞాపకాల దొంతరలివి .....
నేను 1940వ సంవత్సరం జనవరి 7వ తేదీన బెంగుళూరులో పుట్టాను. నా మాతృభాష కన్నడమే అయినా కాన్వెంటులో చదవడం వల్ల ఇంగ్లీషు, ఇరుగుపొరుగుల వల్ల తెలుగు పరిచయముండేవి. నా అసలు పేరు బి.సరోజాదేవి ‘బి’ అంటే బెంగుళూరు. మా నాన్నగారి పేరు బైరప్ప. బెంగుళూరు సరోజాదేవి అన్నా, బైరప్ప సరోజాదేవి అన్నా బావుండదని బి.సరోజాదేవి గానే పిలిపించుకుంటున్నాను. అదే అందరికీ అలవాటు అయిపోయింది. మా నాన్నగారు పోలీసు డిపార్టుమెంటులో పెద్ద ఉద్యోగి. మొదట్నుంచీ కూడా మేం కాస్త ఉన్న వాళ్ళమే. నాకు ముగ్గురు అక్కయ్యలు.
నా కాన్వెంటు జీవితం చాలా హాయిగా గడిచిపోయింది. విమల అని నాకో ప్రాణ స్నేహితురాలు ఉండేది. ఆ అమ్మాయితో కలిసి ఆడుకోవడం, పాడుకోవడం... ఇదే జీవితం ఆ వయసులో. నాకు చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు చూడడమంటే పెద్ద ఇంట్రస్టు వుండేది కాదు. మా అమ్మా నాన్నలు తీసుకెళ్తే, అతి కష్టం మద వెళ్ళేదాన్ని. అయితే శాస్త్రీయ సంగీతాన్ని చాలా శ్రద్ధగా వినేదాన్ని. వినడమే కాదు కొంతకాలం సంగీతం, నృత్యం రెండూ ప్రాక్టీసు కూడా చేశాను. మరికొంత కాలం వీణ నేర్చుకున్నాను.
ఒకసారి ఏదో పోలీస్ ఫంక్షన్ జరిగింది. ఉన్నట్లుండి మా నాన్నగారు “బేబీ- ఈ సభలో నువ్వ పాడాలి” అన్నారు. ఆ మాట వినగానే ఉలిక్కిపడ్డాను. సభేమిటి? నేను పాడడమేమిటి? అని. అయినా ఎదురు చెప్పలేకపోయాను. ఒకటే భయం. కాస్సేపటికి నన్ను వేదికపైకి పిలిచారు. అటూ, ఇటూ చూసుకుంటూ సరాసరి స్టేజి ఎక్కి మైక్ ముందు నిలుచున్నాను. పాట ప్రారంభిద్దామని నోరు విప్పాను. ఆ భయానికి పెదవులు విడిపడ్డాయి కానీ, పాట బయటకొస్తేగా? ఎలాగో ధైర్యం తెచ్చుకుని మళ్ళీ ప్రయత్నం చేశాను. ఈ సారి పాట£చ్చింది గానీ, శ్రుతి తప్పింది! నాకుమతీ తప్పింది. ఆ పాట “అనార్కలీ” (హిందీ) సినిమాలోని ‘ఎ జందగీ’ అన్న లతాజీ పాట. ‘ఎ’ ఎక్కడో - ‘జిందగీ’ ఎక్కడో ఉన్నాయి! గొంతు జీరబోతోంది. అపస్వరాలు పడిపోతున్నాయి. నా కంగారు మరింత ఎక్కువైపోయింది. నా బాధ ఇట్లావుంటే, కింద ఆడియన్స్ ఓ అని గోల చేసేస్తున్నారు.
ఆ కామెంట్స్ వినగానే నాకు రోషమొచ్చేసింది. గొంతు సవరించుకున్నాను. ఈసారి సక్రమంగా సరైన శ్రుతిలో పాడేశాను. పాట అయిపోగానే అహుతులందరూ చప్పట్లు ‘వన్స్‌మోర’ అన్నారు. నేనుమాత్రం అవేమీ పట్టించుకోకుండా అందరికీ నమస్కారం చేసి గబగబా వచ్చి నా సీట్లో కూర్చున్నాను. ‘వాట బ్రదర్, మీ అమ్మాయి ఇంత బాగా పాడుతుందని మాకు ఎప్పుడూ చెప్పలేదే - సూపర్చ్. సింప్లీ మార్వలస్!’ అని అందరూ మా నాన్నగారిని అభినందిస్తుండగా, ఒకాయన మాత్రం నా దగ్గరకు వచ్చి - ‘నీ పేరు ఏమిటమ్మాయ్?’ అని అడిగారు. చెప్పాను. అడ్రసు అడిగి తీసుకున్నారు. ఆ మర్నాడు ఉదయం ఆయన మా నాన్నగారితో áమాట్లాడుతూ మా ఇంట్లో కనిపించారు. ఆయన ఎందుకొచ్చారో నా కర్థం కాలేదు. ఒకవేళ, వాళ్ళ అమ్మాయి పెళ్ళికేమన్నా నేను పాట కచేరీ చెయ్యాలేమో అనుకున్నాను. మా నాన్న నన్ను చూడగానే “ఆయన హ£న్నప్ప భాగవతారని, పెద్ద దర్శక నిర్మాత అట’ అన్నారు.
‘అయితే?’ అన్నాను నేను. ఆయన ‘కాళిదాసు’ అని ఒక సినిమా తీస్తున్నారట. అందులో నువ్వు వేషం వెయ్యాలట!
నేనా? వేషమా? సినిమాల్లోనా?
“నువ్వు అందంగా ఉన్నావమ్మాయ్ - గొంతు కూడా బావుంది. నీ చేత నటింపజేయడం కష్టం ఏమీ కాదు - నాదీ పూచీ!’ అన్నారాయన.
తర్వాత మా ఇంట్లో పెద్ద ఘర్షణ! మా నాన్న అమ్మ ఇద్దరూ నన్ను నటించమని ప్రోత్సహించారు. ఇంకా చెప్పాలంటే బలవంతంగా ఒప్పించారని చెప్పుకోవచ్చు. నేనేం చెయ్యగలను? ఒప్పుకున్నాను. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం కదా! నేను సినిమా తారను అవుతానని ఎన్నడూ ఊహించలేదు. కావాలని కలలూ కనలేదు. పైగా చిన్నప్పుడు సినిమాకు వెళ్లడమంటేనే చిరాకుగా వుండేది. వెళ్ళినా కూడా - ఏవైనా లవ్‌సీన్లు వస్తే గట్టిగా కళ్ళు మÖసుకునే దాన్ని! చెప్పొచ్చేదేమిటంటే - తర్వాత నేను నా నట జీవితంలో ఎన్నో రొమాంటిక్ పాత్రల్లో నటించాను. అదే జీవితంలో వుండే తమాషా.
హ£న్నప్ప భాగవతార్ ‘మహాకవి కాళిదాసు’ అనే కన్నడ చిత్రంలో కథా నాయకి విద్యాధరి పాత్ర నిచ్చారు. చిత్రం విజయవంతమై నాకు మంచి పేరు వచ్చింది. తెలుగులో నా మొదటి చిత్రం రిపబ్లిక్ ప్రొడక్షన్స్ సీతారాం గారి ‘పెళ్ళిసందడి’ (1959).
అందులో నేను ‘పింగ్లా’ పాత్ర ధరించాను. అప్పుడే ఎన్.టి.రామారావు గారు ‘పాండు రంగమహాత్మ్యం’లో కళావతి (వేశ్య) పాత్రకు నన్ను తీసుకున్నారు. నా మొదటి చిత్రం ‘పెళ్ళిసందడే’ అయినా ముందుగా విడుదలైంది మాత్రం ‘పాండురంగ మహాత్మ్యమే’ ఎన్టీఆర్ కలిసి ‘జగదేకవీరుని కథ’, ‘మంచి చెడు’, ‘దాగుడుమÖతలు’, ‘ప్రమీలార్జునీయం’, ‘శకుంతల’ వంటి విజయవంతమైన చిత్రాలెన్నింటిలోనో నటించాను. ఆయన సొంత పిక్చర్స్‌లో నాకు తప్పకుండా వేషమిచ్చేవారు.
‘సీతారామకల్యాణం’, ‘దానవీరశూరకర్ణ’ వగైరా ఎనఏటి చిత్రాల్లో నటించాను. అంతెందుT తెలుగులో నా చివరి స్ట్రెయిట్ చిత్రం రామారావుగార సొంత చిత్రం ‘సమ్రాట్ అశోక’ (1992). ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా పరిశ్రమకు డిక్షనరీ లాంటి వారు. యాభై ఏళ్ళ క్రితం ఎలా వున్నారో, ఇప్పుడు అలాగే ఉన్నారు. సెట్ పై ఆయనుంటే చాలా సరదాగా వుండేది. ఆయనతో కలిసి చాలా మంచి చిత్రాలు చేశాను. ‘పెళ్ళికానుక’ (1960), ‘ఆత్మబలం’, ‘అమరశిల్పి జక్కన్న’, ‘రహస్యం’ వంటి చిత్రాలు మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చినవి. ఇప్పటివరకూ నేను సుమారు 175 చిత్రాల్లో నటించాను. వాటిలో తెలుగు 26, తమిళం 94, హిందీ 15, కన్నడ 40 చిత్రాల్లో నటించాను.
తెలుగులో నాకు జయంతీ పిక్చర్స్ ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ (1963) అంటే చాలా ఇష్టం. అటు ఎన్‌టిఆర్, ఇటు ఎఎనఆర్‌లతో కలిసి ఒకేసారి నటించే భాగ్యం ఆ చిత్రంలో కలిగింది. అందుకే ఆ చిత్రమంటే నాకు ప్రత్యేకాభిమానం. నా కప్పటికి సరిగ్గా తెలుగురాదు. అయినా ముద్దు ముద్దుగా మాట్లాడేదాన్ని. ‘జగదేకవీరుని కథ’లో ‘హలా’ తర్వాత ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో సుభద్ర పాత్రలో ‘చిన్నన్నియ్యా’ అనే నా డైలాగ్ అప్పట్లో చాలా పాపులర్. నాకు తెలుగులో బాగా ఇష్టమైన దర్శకులు కె.వి.రెడ్డిగారు. వారికి నేనంటే చాలా అభిమానం. అలాగే మహామేధావి పింగళి నాగేంద్రరావు గారికి కూడా నేనంటే అభిమానమే.
ఇక చెప్పాలిం్సది నా తమిళ చిత్రా గురించి - ‘కచదేవయాని’ కన్నడ చిత్రం షూటింగ్ సమయంలో నాకు ఎం.జి.రామచంద్రన్ గారితో పరిచయభాగ్యం కలిగింది. ఆయనే స్వయంగా నా గురించి తెలుసుకుని తను నటించే చిత్రంలో నన్ను తీసుకోమని నిర్మాతలకు సిఫార్సు చేశారు. ఓహ్! నిజం ఆరోజు ఇప్పటికీ మరువలేక పోతున్నాను. ఎం.జి.ఆర్ గారు నన్ను సిఫార్సు చేయడమంటే మాటలా? ఆ రోజుల్లో ఎంజిఆర్ గారు ఎంత అందంగా ఉండేవారంటే బంగారు రంగు దేహచ్ఛాయతో ధగధగా మెరిసిపోతుండేవారు.
ఎంజిఆర్ గారితో నేను నటించిన తొలిచిత్రం ‘నాడోడి మన్నన’ షూటింగ్‌లో ఒక సంఘటన జరిగింది. నేను ధరిస్తున్న పాత్రను ఒక పెద్ద కొండచిలువ చుట్టుకోవాలి. అప్పుడు కథా నాయకుడు వచ్చి ఆ కొండ చిలువను చంపి నన్ను రక్షిస్తాడు. ఆ సన్నివేశానికి కావలసినట్టు ఒక పెద్ద కొండ చిలువను తీసుకొచ్చారు. నాకు దాన్ని చూడగానే భయమేసింది. ముచ్చెమటలు పోశాయి. అయినా భయాన్ని పైకి కనిపించనివ్వక ధైర్యంగా నిలుచున్నాను. అంతా నిశ్శబ్దం! పైనుండి పాముపడే ‘ఎఫెక్టు’కు ఎవరో ఆ కొండ చిలువను దభీమని నా పైకి విసిరారు. విసిరీ విసరటంతోనే ఆ సర్పం నన్ను చుట్టేసింది. అంతే! నాకు ఒంటిమీద సృహ లేదు. పది పది హేను నిమిషాలకు నేను కళ్ళు విప్పాను. నా చుట్టు మనుషులు. అందోళన పడుతూ కనిపించారు. ఒంటిమీద చూసుకుంటే పాము కనిపించలేదు. దిగ్గున లేచి కేకశాను. ఆ సంఘటనను ఇప్పుడు తలచుకున్నా శరీరం జలదరిస్తుంది. ‘నాడోని మన్నన’ తమిళంలో నన్ను తారా పథానికి చేర్చింది. ఒక్క ఎంజిఆర్ గారితోనే 26 చిత్రాలు చేశాను. శివాజీగణేశన్ గారితో ‘శభాష్ మీనా’, ‘పుదియ పరవై’, ‘భాగప్పిరవినై’, ‘ఆలయమణి’ వంటి సక్సెస్‌ఫుల్ పిక్చర్స్‌లో నటించాను. జెమినీ గణేశన్‌తో ‘కల్యాణ పరిసు’, ‘తేన్‌నువు’ వంటి చిత్రాలు చేశాను.
తెలుగులో, తమిళంలో రెండు భాషల్లోనూ సమాన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి రెండు వేరు వేరు కారణాలు నేనూహించగలను. తెలుగులో నాపై మంచి మంచి పాటలు చిత్రీకరింపబడ్డాయి. ‘నీవని నేనని తలచితిరా’ (పాండురంగ మహాత్మ్యం), ‘బైఠో బైఠో పెళ్ళి కొడుకా’ (పెళ్ళిసందడి), ‘వాడుక మంచెదవేలా’ (పెళ్ళికానుక), ‘జలకాలటలలో’ (జగదేకవీరుని కథ), ‘వానకాదు వానకాదు’ (భాగ్యచక్రం), ‘చిటపట చినుకులు’ (ఆత్మబలం), ‘కనులు మాటలాడునని’ (మాయని మమత), ‘రేపంతి రూపం కంటి’ (మంచి చెడు) వంటి ఎవరీగ్రీన్ సాంగ్స్. నా ముద్దు ముద్దు మాటలు వల్లే నేను తెలుగులో నిలuడ్డాను. అయితే తమిళంలో మహోన్నతమైన పాత్రలు వేశాను. ముఖ్యంగా శివాజీ గణేశన్ గారితో నటించిన ‘ఇరువర్ ఉళ్లం’లో ఆత్మాభిమానం గల టీచర్ పాత్ర లాంటి ఉదాత్త పాత్రల్లో నటించాను. ఈ చిత్రానికి తరువాయి భాగంలో మళ్ళీ ముప్పయి ఏళ్ళ తర్వాత వచ్చిన ‘వన్స్‌మోర’ చిత్రంలో కూడా శివాజీ గారితో నేనే నటించాను. తెలుగులో పాటలు, తమిళంలో కథలు గొప్పగా ఉండడంతో ఇంత గొప్పగా రాణించగలిగాను.
1963 సంవత్సరాన్ని నా జీవితంలో ఎన్నడూ మరచిపోలేదు. ఆ ఏడు ఢిల్లీలో జరిగిన ఓ సభకు అతిథిగా వెళ్ళాను. అక్కడ ఎవరో అందంగా ఉన్నారు’ అని ప్రశంసించారు. ఆ ప్రశంసకి నా హృదయం పరవశించి పోయింఇ. ఒక దేశ ప్రధాని నన్ను, నా అందాన్ని పొగిడిన సంఘటన నా జీవితంలో మధురమైన జ్ఞాపకం.
ఇక నా వ్యక్తిగత జీవితానికి వస్తే నేను సినిమా రంగంలోకి వచ్చిన పదేళ్ళకు 1-3-1967వ ఇంజనీర్ శ్రీహర్షతో నా వివాహం జరిగింది. ‘పెళ్ళవగానే సినిమాలు మానేసి హాయిగా కాపురం చేసుకో’ అంది మా అమ్మ. కానీ మా వారు ‘ఎందుకు మానడం? అది నీ వృత్తి. కంటిన్యూ చెయ్యి’ అన్నారు. ఆయన ఎంతో మంచి మనిషి. ఎన్నడూ ఒక్క షూటింగ్‌కు కూడా రాలేదు. ఎంత సంపాదిస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు అని ఎప్పుడూ అడగలేదు. అంత నమ్మకం, సంసారానికి పునాది నమ్మకమే కదా! తన భార్యకి ఒక వ్యక్తిగత హోదా ఉండాలనీ, ఆయన ఉన్నా లేకున్నా తన భార్యగా నేను ఎప్పుడూ గొప్పగా బతకాలనీ, పెద్ద పెద్ద భవంతుల్లో ఉండాలనీ ఆయన కోరుకునే వారు. 26.4.1986వ తేదీన గుండెపోటుతో మరణించారు. అదో పెద్ద షాక్ నాకు. మా వారు పోయిన తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ తాయ్ మేల్ ఆనై, అడిమైనిలంగు, పరంపరై వంటి చిత్రాల్లో నటించాను. ఆ మధ్య మÖడు నాలుగేళ్ళ క్రితం సాయికుమార్ పిక్చర్ ఒక దాంట్లో చేశాను. తర్వాత ‘గంగ యమున సరస్వతి’ వంటి సీరియల్స్ చేశాను. మంచి పాత్రý£స్తే సినిమాల్లోనే కాదు, టీవీల్లో కూడా చేస్తున్నాను. ఆర్థికంగా నాకు లోటు లేదు కాబట్టి వెయిట్ వున్న మంచి పాత్రలే చేస్తున్నాను.
నాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు. ఒక అబ్బాయి. భువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, అబ్బాయి గౌతమ్. వాళ్ళు కూడా ప్రయోజకులైన నా ప్రశాంతతను కాపాడారు. సో.... ఒక నటిగా, ఒక ఇల్లాలుగా, ఒక తల్లిగా ఏ విధంగా తీసుకున్నా నాది సంతృప్తికరమైన జీవితమే. ఇక మనిషిగా నేనేం చేశాను అని ప్రశ్నించుకుంటే నా భర్త పేరిట, నా కూతురు పేరిట ఎన్నో ఛారిటబుల్ ట్రస్టులు ఏర్పాటుచేశాను. మా అమ్మ పుట్టిల్లు ‘దశవర’ గ్రామంలో ప్రైమరీ, సెకండరీ పాఠశాలలు నిర్మించాను. బెంగుళూరు యÖనివర్సిటిలో మెరిట్ స్టూడెంట్స్‌కు ప్రతి ఏడాది స్కాలర్‌షిప్పులు ఇస్తున్నాను. ఏదో సాటి మనుషులకు సాయం.
1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ తీసుకున్నాను. ఇక ప్రాంతీయంగా అందుకున్న అవార్డులూ, సన్మానాలకూ లెక్కేలేదు. చేపట్టిన వృత్తి ఏదైనా సరే దాన్ని గౌరవిస్తూ, క్రమశిక్షణతో జీవించగలిగితే ఎవరికీ ఏ కష్టమÖ ఉండదనేదే నా సలహా! నేను రోజంతా బిజీగా వుండడానికే ప్రయత్నిస్తాను. సాయంత్రం ఆరు దాటాక మాత్రం కొంచెం సేపు ధ్యానం చేసుకుంటాను. అప్పటి నుంచి వృత్తిపరమైన వ్యాపకం ఏదీ పెట్టుకోను. ఇంటికొచ్చినా ఎవర్నీ కలవను. ఇక బెంగుళూరులో నా స్నేహితుల విషయానికొస్తే జయంతి, కృష్ణకుమారి నాకు దగ్గరగానే ఉన్నారు గనుక అప్పుడప్పుడూ వాళ్ళ ఇళ్ళకు వెÞ£్ళస్తుంటాను. ఇదీ నా జీవితం. మరో విషయంలో కూడా నేను అదృష్టవంతురాలినే. అదేమంటే ఇన్నాళ్ళ నా సినిమా జీవితంలో ఒక్క కట్టుకథగానీ, పుకారుగానీ, గాసిప్‌గానీ నాపై ఎవరూ అల్లలేదు. నిష్కళంకంగా జరుగుతోంది. నా జీవితం. అది నేను చేసుకున్న పుణ్యం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి