కళాత్మక దర్శకుడు బి.ఎన్.రెడ్డి ‘వాహినీ’ పిక్చర్స్ బేనర్‌పై తీసిన మొట్టమొదటి సాంఘిక చిత్రం, ‘వందేమాతరం’.
చిత్తూరు వి.నాగయ్యగారు హీరోగా నటించిన తొలిచిత్రమిది. అంతేకాదు నాగయ్యగారు సంగీతదర్శకత్వం వహించిన మొదటి సినిమా కూడా! బి.ఎన్.రెడ్డి రాసుకొన్న ‘మంగళసూత్రం’ నవలికకు సినిమా కథారూపం యిచ్చిన వారు రామ్‌నాథ్.
కె.వి.రెడ్డి sTÖ సినిమాకు చీఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, కమలాకర కామేశ్వరరావు సహాయ దర్శకుడు. ‘గృహలక్క్ష్మి’లో వ్యాంప్‌గా నటించి తన అందచందాలతో ప్రేక్షకులను మైమరపించిన కాంచనమాల యిందులో హీరోయిన్‌గా సాత్విక పాత్ర అభినయించి తెలుగువారి అభిమానాన్ని చూరగొన్నారు.
ఈ చిత్రంలో నాగయ్య, కాంచనమాలతో పాటు, కల్యాణి, శేషమాంబ, లక్క్ష్మీదేవి, దొరస్వామి, రాఘవన్, గౌరీపతి, కృష్ణమÖర్తి నటించారు. కె.వి.రెడ్డి కూడా కాలేజిస్టూడెంట్‌గా టెన్నిస్ రాకెట్‌తో కన్పించిన కాసేపు కామెడి పండించాడు.
ఈ చిత్రానికి మాటలు, పాటలు రాసిన సముద్రాలవారికి ఇది ముచ్చటగా మÖడవ చిత్రం.
తెలుగు చిత్రాల్లో నాయికానాయకులు పడే కష్టాలకు మÖలం రామాయణమే. అందుకు వందేమాతరం చిత్రం బీజం వేసింది. అది ‘ముత్యాలముగ్గు’, ‘కలియుగ రావణాసురుడు’, ‘కలియుగ సీత’, ‘లక్క్ష్మణరేఖ’ మొ॥ చిత్రాల్లో మరింత ప్రస్ఫుటంగా కన్పించింది - ‘వందేమాతరం’ చిత్రం పబ్లిసిటిలో ఇలా వుంది.
“కథానాయకి జానకి
కలియుగ జానకి
ఆమెను గాసిపెట్టిన అత్తగారియిల్లు మాడిమశానమైంది. ఆమెను మనసార ప్రేమించి ఆమెకై శోకించి జీవించిన రఘురాముడు ఆనందుడైనాడు.”
ఇందులో మాటలు ప్రేక్షకులకు చేరటమే కాద్క్ష్ము ప్రతి మాటకు సినిమా హల్లో ్ప్పుజిబిచీరీ పడ్తాయి. ఉదా॥ రాజబహద్దూర్ నోట వెలువడిన తమిళయాసతో మాటలే. రొంబ జాస్తిదా / ఇపుడు దావస్తున్న / గమ్మునరా /
చిత్రానికి నాగయ్యగారి రీరికార్డింగ్ అద్భుతం. కొన్నిచోట్ల పాశ్చాత్యసంగీత విధానాలతో నేపథ్యసంగీతాన్ని అందించారు. రఘు జానకి నగలు తీసుకొని బాధతో, ద్ణుఖంతో ఉద్యోగ ప్రయత్నం కోసం బస్తీ వెళ్ళే సందర్భంలో నేపథ్య సంగీతం వయొలిన్ వాద్యాలపై పలికించిన తీరు ఎంతో బాగుంటుంది.
కథాంశము :
‘వందేమాతరం’ టైటిల్ స్వాతంత్రోద్యమ కథాంశాన్ని చూపించదు. వరకట్న దురాచారం, నిరుద్యోగ పెనుభూతం sTÖ చిత్రకథకు మౌలికాంశాలు. పనిలో పనిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడివడాలనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రవాంఛ, నల్లమబ్బు చుట్టున్న వెండిరేఖలా కన్పిస్తుంది.
గ్రామీణ రైతు కుటుంబానికి చెందిన రఘుపట్టభద్రుడు. నిరుద్యోగి. దేశం పట్ల ప్రేమ, జీవితం పట్ల ఆదర్శ భావాలున్న అతను, సవతి తల్లి కట్నం ఆశను ఎదిరించి జానకి అనే అందమైన యువతి మెడలో తాళికడ్తాడు. భార్య రహస్యంగా యిచ్చిన నగలతో ఉద్యోగాన్వేషణలో పట్నం వెళ్తాడు. పలువురి వంచనకు లోనవుతాడు. చివరికి కూలీపని చేస్తుంటాడు. కాలేజిరోజుల్లో వందేమాతరం అన్న పేరు మీద అతను తీసుకొన్న లాటరీ టికెట్టుకు ఐదులక్షల నగదు బహుమతి అందుకొంటాడు. లక్షాధికారిగా అతను స్వగ్రామం తిరిగి వచ్చేసరికి భార్య కనిపించదు. రఘు ద్ణుఖంతో తిరిగి వచ్చి, సహాధ్యాయి జయతో కలిసి ఫ్యాక్టరీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాడు. రఘు జయల గురించి రకరకాల అనుకుంటుంటారు. బస్తీ చేరిన జానకి పూలమ్ముతూ రఘు జయలను చూసి అపార్థం చేసుకొని ఆత్మహత్యకు పాల్పడుతుంది. చివరికి అపార్థాలు తొలగి అందరూ ఒకటవుతారు.
ఈ సినిమా కోసం సముద్రాల 20 పాటలు, 3 పద్యాలు రాశారు. పర్‌ఫెక్షన్ కోసం అటు నటీనటుల్ని, ఇటు సాంకేతిక నిపుణుల్ని తన చాదస్తంతో హడలగొట్టే బి.ఎన్.రెడ్డి గారిని సముద్రాల మాత్రం ఆకట్టుకునే వారట. ఒకపాటకు ఇరవై వెర్షన్లు రాయించుకొని ఆచార్యుల వారిని కూడా ‘హమ్మో’ అనిపించారట. సంగీతం విషయంలో నాగయ్యగారికి దేశవిదేశాల గ్రాంఫోన్ రికార్డ్స్ వినమని తేలికగా వరసలు చేయాలని చెప్పేవారు బి.ఎన్.రెడ్డి. నాగయ్య రకరకాల సంగీతాలు విని నోట్స్ రాసి ట్యూన్ చేస్తే, సముద్రాల పాట రాసేవారు. “నేను ట్యూన్ చేస్తే ఆచార్యగారు పాట రాశారా? లేక ఆయన పాట రాస్తే నేను ట్యూన్ చేశానా? అన్నది చెప్పడం కష్టం. ఇద్దరి లోనుంచి రెండూ అలా కలిసివచ్చేవి” అని నాగయ్యగారు తమ స్వీయచరిత్రలో (పుట 79) పేర్కొన్నారు. ఎవరికి ఎక్కడ ఏ మాట నచ్చకపోయినా వెంటనే మార్చి అందరినీ సముద్రాల మెప్పించేవారట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి