108 = అష్టోత్తర శతం అర్ధం.
దైనందిన జీవితంలో మనం చేసే కార్యక్రమం లో భగవత్పూజ ఒకటి.. ఆ పూజ లో ఒక భాగంగా మనం భగవంతున్ని అష్టోత్తర శత నామావళి తో పూజిస్తాము. శ్రద్ధాభక్తులతో పూవులను అష్టోత్తర శత నామావళి సహితంగా అర్చిస్తాము. ఐతే ఈ అష్టోత్తర శతానికి అంటే 108 కి ఏమిటి ప్రాముఖ్యం? అంతరార్థం ఏమిటి? అని మనలో చాలా మందికి సంశయం కలగవచ్చు. ఆ సంశయ నివృత్తి కొరకు ఈ లఘు వ్యాసం. అవధరించండి.
108 లో ఒక్కోదానికి అర్థం ఉంది. ఒకటి అంటే భగవంతుడు ఒక్కడే. ఈ విషయం ఋగ్వేదం ఇలాచెప్పింది. “ఏకం సత్ విప్రా బహుధా వదంతి”- అంటే సత్యమైన భగవత్ తత్త్వం ఒకటే. ఆ తత్త్వం తెలుసు కున్న విప్రులు అంటే జ్ఞానులు దానిని అనేక విధాలుగా వ్యక్తం చేసారు..
0 సున్న అంటే జగత్తు. జగత్తు కి విలువ 0. జనించి గతించేదే జగత్తు.. అందుకే జగమేమాయ అన్నారు. కాబట్టే మాయామేయమైన ఈ జగానికి విలువ 0.
8. ఎనిమిది అంటే అష్ట విధ ప్రకృతులు కలిగిన జీవుడు. అంటే జీవునికి సహజంగా ఎనిమిది ప్రకృతులున్నాయి. అవి
1. పంచ జ్ఞానేంద్రియాలు
2. పంచ కర్మేంద్రియాలు
3. పంచ కోశాలు
4. పంచ వాయువులు
5. ఆంతరేంద్రియ చతుష్టయం
6. అవస్థాత్రయం
7. కాల త్రయం
8. అజ్ఞానం(అవిద్య)
ఈ సహజ అష్ట విధ ప్రకృతులతో ఉన్న జీవుడు (8) భగవంతున్ని (1) చేరాలంటే 108 సార్లు గురువు ఉపదేశించిన మంత్రాన్ని జపం చెయ్యాలి. అప్పుడు జీవుడు శూన్యమైన జగత్తును దాటి ఏకం సత్ ఐన భగవంతుని చేరతాడు.
8 ం1 = 9 కదా
పూర్ణ సంఖ్య
అప్పుడే మన జీవితం సంపూర్ణం. ఇది 108 లో ఉన్న రహస్యం. మన యిష్టదైవాన్ని 108 సార్లు జపించాలి.
ఆరోగ్యం భాస్కరాధిఛ్చేత్ శ్రియమిచ్చేత్ కృతాచనాత్ ధర్మార్థ మోక్షాయ
మాధవమ్ శివం జ్ఞాన మోక్షాయ చతుర్వర్ణాయ లలితాంబికామ్
భావం :
1 ఆరోగ్యం కొరకు సూర్యారాధన చేయాలి
2. ధర్మ అర్థ మోక్షాల కొరకు విష్ణువును పూజించాలి.
3. జ్ఞానం కొరకు శివుణ్ణి ప్రార్థించాలి
4. సభక్తికంగా ఆరాధిస్తే ఆరోగ్యం, ధర్మార్థ, జ్ఞాన మోక్ష ములన్నింటినీ అమ్మ లలితా దేవి ప్రసాదిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి