గుడులు కట్టించె కంచర్ల గోపరాజు
రాగములు కూర్చె కాకర్ల త్యాగరాజు
పుణ్యకృతి చెప్పె బమ్మెర పోతరాజు
రాజులీ మువ్వరును భక్తిరాజ్యమునకు
అని అన్నారో ఆధునికకవి. ఆ మాటలు అక్షరసత్యాలు! ఈ మÖడు పాత్రలు పోషించిన నాగయ్యగారు ప్రాత్ణ స్మరణీయులు. ఈ పాత్రలకు నాందిగా వెలువడిన తొలి భక్తిరసదృశ్య కావ్యం ‘భక్తపోతన’ను అందించిన వాహినీవారు ప్రత్యేకించి కె.వి.రెడ్డిగారు నిత్యస్మరణీయులు.
“భక్త్యా భాగవతం జ్ఞేయం
న వ్యుత్పత్త్యా నటీకయా”
భాగవతాన్ని అర్థం చేసుకోవాýంటే భక్తి కావాలి. పాండిత్యం సరిపోదు.
విద్యావతాం భాగవతే పరీక్షా
విపత్తికాలే గృహిణీ పరీక్షా - అని కూడా చెబుతుంటారు. విద్వాంసులకు భాగవతం, కష్టకాలం స్త్రీలకు పరీక్ష అని. అలాంటి భాగవతాన్ని తెలుగు చేసి ఆబాలగోపాలాన్ని అలరించిన పోతన కవితాశిల్పం అనల్పమైనది. పోతన కవిత్వమే కాదు, ఆ మహనీయుని వ్యక్తిత్వమÖ హిమవన్నగమంత మహోన్నతమైనది - అందమైన తెలుగు భాషతో పరిచయం కావాలంటే భాగవతాన్ని అధ్యయనం చేయాలి. ఆదర్శమైన సాహితీమÖర్తిమత్వాన్ని తెలుసుకోవాలంటే పోతన చరిత్రను చదవాలి.
నిస్సంగుడై, స్వాభిమానంతో రాచరికాన్ని ఎదిరించి నిరాడంబరుడై జీవయాత్రను సాగించిన భక్తుడు, హాలికుడు పోతన! ఒకరి మెప్పుకోసం కావ్యం రాసినవాడు కాడు. భగవంతుని ఆనతితో రాసి భగవంతునికి అంకితం యిచ్చి, తన జన్మను చరితార్థం చేసుకొని మోక్షాన్ని పొందిన ధన్యజీవి.
కేవలం పోతన జీవితాన్ని, భాగవతరచనాయజ్ఞాన్ని సినిమాగా తీస్తే పండితులనే రంజింపజేస్తుంది గానీ పామరులను కాదు. అందుచేత పోతనకు ఇంచుమించు సమకాలీనుడైన శ్రీనాథుని, సర్వజ్ఞసింగభూపాలుని వ్యక్తిత్వాలను జత చేసినారు. పోతన - శ్రీనాథులు - ఇద్దరూ మహాకవులే! ఇద్దరి వ్యక్తిత్వాల్లో అనంతవైరుధ్యమున్నది - శ్రీనాథుని కృతులన్నీ నరాంకితాలు. అతను జీవితంలోని ఉజ్జ్వల ఘట్టాలన్ని రాచకొలువుకే సమర్పితాలు - ఇందుకు భిన్నం పోతన. అయితే వీరిద్దరిని బావ-బావమరుదులుగా, చిత్రించిన కథొకటి జనబాహుళ్యంలో ఉన్నది. ఇలాంటి గాథను రామనాథ్‌గారు సేకరించారు. ముదిగొండ లింగమÖర్తి, కె.వి.రెడ్డి, సముద్రాల పోతన జీవించిన సాంఘిక పరిస్థితులను స్వాతంత్య్రోద్యమకాలంలోని బానిసజీవనానికి అన్వయించి, సినీరచనను పరిపుష్టం చేశారు.
‘భక్త పోతన’ కె.వి.రెడ్డిగారు తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం. రామనాథ్ ఛాయాగ్రహణాన్ని, శేఖర్ శబ్దగ్రహణాన్ని నిర్వహించగా, చిత్తూరు వి.నాగయ్యగారు పోతన పాత్రలో జీవించి, సుస్వర సంగీతాన్ని సమకూర్చి చిత్రాన్ని ‘భాగవతసుధారస ఫలంగా’ అందించటంలో కృతకృత్యులయ్యారు.
ఇక సముద్రాలవారు, పోతన్నను ఆవహింప జేసుకొని మాటలు, పాటలు అందించారు.
ప్రతి ఒక్కనటి, నటుడు, సాంకేతిక నిపుణులందరూ, పోతన చిత్రాన్ని పవిత్రయజ్ఞంగా భావించి నిర్మించారు.
‘సుమంగళి’ చిత్రంలో వృద్ధవేషం వేయడానికి తటపటాయించినట్లే, పోతన వేషం వేయడానికి సంకోచించారు నాగయ్య - వృద్ధ పాత్రలనిస్తూ వాహినీ వారు తనను ప్రక్కకు నెట్టేస్తున్నారేమోనన్న భావనకు లోనయ్యారు. కె.వి.రెడ్డి ఎంతో పట్టుబట్టి ఒప్పించారు. షూటింగ్ మొదటి రోజున, నాగయ్యకు క్రాపింగ్ తీయించి, స్నానం చేయించి, గంటలో మేకప్ వేశారు- నాగయ్యమొగంలోని తేజస్సుకు లింగమÖర్తి, బి.ఎన్., కె.వి.రెడ్డితో సహా అందరూ విస్మయం చెందారు. కర్పూరహారతినిచ్చి కొబ్బరికాయ కొట్టారు- అని నాటి స్మృతులను ముదిగొండ లింగమÖర్తి ఓచోట నెమరువేసుకొన్నారు.
కథాసంగ్రహము :
మహాభక్తుడైన బమ్మెరపోతన ఏకశిలానగరనివాసి. అతని ధర్మపత్ని నరసమ్మ, సర్వజ్ఞసింగభూపాలుని కొలువులో విద్యాధికారియైన శ్రీనాథకవి సహోదరి. శ్రీనాథుని కూతురు శారద పోతన యింట్లోనే వుంటుంది. పోతన కుమారుడు మల్లన వ్యవసాయం చేస్తుంటాడు. పోతన నిత్యం రామనామ జపం చేస్తూ, ఆధ్యాత్మిక చింతనతో అడిగినవారికి అన్నంపెడుతూ నిరాడంబర జీవనం గడుపుతుంటాడు - అతని పేదరికాన్ని శ్రీరామచంద్రుడు కూడా పరీక్షించి, ఆశీస్సులందిస్తాడు.
శ్రీరాముని ఆనతితో భాగవతమును తెలుగులో వ్రాస్తుంటాడు. గజేంద్రమోక్షం ఘట్టంలో ‘అలవైకుంఠపురములో’ పద్యాన్ని శ్రీరాముడే పోతన రూపములో వచ్చి పూరిస్తాడు. దాంతో పోతనలో భక్తిబీజము, మహాభూజంగా ఎదుగుతుంది. పోతన కవితామాధుర్యాన్ని స్వయంగా అనుభవించిన శ్రీనాథుడు, సింగభూపాలునికి చెబుతాడు. భాగవతమును తనకు అంకితం చేస్తే పోతనకు కనకవస్తువాహనాలు, మాన్యాలు ఇవ్వాలని రాజు నిశ్చయించి, శ్రీనాథుని పోతన వద్దకు పంపిస్తాడు.
పోతన నిరాకరిస్తాడు. శ్రీనాథుడు ఎన్నివిధాలుగా చెప్పినా వినడు. చివరకు భార్య నరసమ్మ కూడా ప్రాధేయపడుతుంది. శ్రీనాథుడు కుపితుడై, తన కూతురు శారదను మల్లన్న కిచ్చేదిలేదని తనతో తీసికొని రావల్సిందిగా సైనికులను పంపిస్తాడు. సర్వజ్ఞసింగ భూపాలుడు రాజధిక్కారనేరం మోపి ‘భాగవతం’ తీసుకొని రావాల్సిందిగా సైనికులను పంపిస్తాడు. ఈలోపు శ్రీనాథుడు తన పరివారంతో వెళ్ళగా సీతమ్మతల్లి దయవల్ల అందరికీ భోజనం అమరుస్తుందా యిల్లాలు. పోతన భక్తికి, కవితాశక్తికి శ్రీనాథుడు మోకరిల్లుతాడు.
రాజు పంపించిన సైన్యము భాగవతాన్ని సంగ్రహించే ప్రయత్నం చేస్తారు. భాగవతమును కావలికాస్తున్న సుదర్శనచక్రము భటులకు బుద్ధి చెబుతుంది. ఆంజనేయుడు సైన్యాన్ని తరిమికొడతాడు - పోతనకు దేశబహిష్కరణ శిక్ష విధిస్తాడు రాజు. పోతన్న ఇల్లును కూలుస్తుంటే రాజుకు సమ్మెటపోటు లధికమవుతాయి.
రాజు తన తప్పు తెలుసుకొంటాడు. పోతన కాళ్ళమీద పడి శరణు కోరుతాడు. భాగవతమును శ్రీరామునికే అంకితము చేయమని కోరుతాడు. శారద మల్లన్నల వివాహం జరుగుతుంది. మేటి హీరో సిహెచ్. నారాయణరావు శ్రీరాముని పాత్రలో కనిపించడం విశేషం.
శ్రీరామభక్తి ప్రభావాన్ని పోతన లోకానికి ప్రచారం చేస్తుంటాడు.
భక్తపోతనలో జంధ్యాల గౌరీనాథశాస్త్రి శ్రీనాథునిగా, శివరాం మల్లనగా మాలతి శారదగా నటించారు. టంగుటూరి సూర్యకుమారి సరస్వతిగా అతిథి పాత్రలో కన్పిస్తుంది.
సాహితీ విశేషాలు :
‘భక్త పోతన’లోని పద్యాలన్నీ భాగవతము లోనివి. సముద్రాలవారు రచించినవి మొత్తం 12 పాటలు. ఇందులో
1. మా వదిన సుకుమారి...
2. ఆటలాడదు వదిన...
‘ఆటలాడదు - మా వదిన...’, పాటలో సిగముడవదు అన్న అర్థాన్ని స్ఫురింపజేయడానికి ‘నెరిగురువణు’ ముడువదు అని అరుదైన తెలుగు పదకోశాన్ని అందించారు. (నెఱులు అంటే వెండ్రుకలు కదా!)
‘వదినా-మరదళ్ళ’ సరసగీతాలు అపురూపగీతాలు. రామాలయం, వరకట్నం, మొదలైన చిత్రాల్లో మనకు యిలాంటి సాహిత్యం కనిపిస్తుంది. ఈ సాహిత్యానికి మÖలం మాత్రం సముద్రాల వారి కలమే!
‘భక్త పోతన’లో ప్రాచుర్యం గొన్నవి భక్తిగీతాలే.... ఆ గీతాలు :
1. సర్వమంగళ, రామా సీతారామా...
2. ననుపాలింపక...
3. పావనగుణరామా...
4. నన్ను విడచికదలకురా...
5. రామ, రామా సీతారామ...
ఈ గీత రచనలో వాగ్గేయకారుల ముద్ర ఉండటం విశేషం. ‘నను పాలింపగ’ గీతంపై త్యాగయ్య, ‘నన్ను విడిచికదలకురా...’, గీతంపై రామదాసు కీర్తనల ప్రభావమున్నది. వేదాంత వధూ హృదయ విహారా! వంటి సంబోధనలు సముద్రాల వారి ప్రయోగాలకు నిదర్శనాలు.
ఇకపోతే “మంచి సమయము రారా!” అన్న గీతం జావళి వంటిది.
‘మాతాపిత గురుదేవహిత’ గీతంలో మానవజాతికి ఉపయోగపడే, విలువలున్నాయి. ‘రాపూర్ణచంద్రికా...’ గీతంలో జలజాతికి చెందిన పద సంపద వున్నది.
‘భక్త పోతన’ సంభాషŸణలను, సముద్రాలవారు పకడ్బందీగా రూపొందించారు. పోతన, మల్లన, పాత్రలకు దేశీయతా విలువలు ఆపాదించటం విశేషం.
శ్రీనాథుడు నగలు చినీచీనాంబరాలు తెచ్చి పోతన కుటుంబసభ్యులకు ఇచ్చే సన్నివేశంలో పోతన నోట పలికించిన పలుకులు, దేశీయతా విలువలను ధ్వనించినవి.
“రైతుకు పీతాంబరాలకు చాలాదూరం... అంతేకాదు, సాటిరైతులకు కూడా దూరమవుతాం... కోటానుకోట్ల భారతీయులు కొల్లాయి గుడ్డతో తృప్తి పడుతుంటే, మాకు మాత్రం ఎందుకు sTÖ అలంకారాలు” అని పోతన నిరాకరిస్తాడు. నిజానికి పోతన కాలంనాటికి, భారతీయ భావన రాలేదు. కొళ్ళాయి గుడ్డ ప్రస్తావనతో గాంధీజీని గుర్తు తెచ్చారు. ‘భక్త పోతన’ చిత్రనిర్మాణం, స్వాతంత్య్రోద్యమకాలంలో సాగింది. అందుకే సమకాలీనసమాజ సంఘర్షణ, సముద్రాలవారి కలం నుండి ఖడ్గవిస్ఫులింగాల వలె మెరిశాయి. పౌరాణిక కథనంలా సాగే మహాభక్తుని జీవనగాథలో జాతీయోద్యమ దీప్తిని వెలిగించే ఆలోచన రావడమే సముద్రాల వారి గొప్పతనం.
అలాగే రాజాశ్రయాన్ని నిరాకరిస్తూ, రాజ్యాన్ని నిరసిస్తూ, విప్లవభావాలను వెలిబుచ్చే పోతన్న స్వాభిమానాన్ని చూపించారు మరోచోట. అంతేకాదు పోతన్న కొడుకు మల్లన్న కూడా తండ్రి సత్యాన్ని, వారసత్వాన్ని పుణికిపుచ్చుకొంటాడు. శ్రీనాథుడు ఓసారి పొలందున్నే మల్లన్న వద్దకు వచ్చి “హాలికులకు కుశలమా?” అని పరిహసిస్తాడు. అప్పుడు మల్లన వెంటనే
“కుశలమే... స్వదేశము, స్వస్థలము, స్వాభిమానము లేక దేశదిమ్మరులై... సర్వజ్ఞసింగభూపాలుర బానిసత్వము గౌరవమని... వారి ఆశ్రయము శాశ్వతమని, వారి కైవారము జీవితమని భావించి, వారి ఉన్మత్తగీతాలకు తాండవం చేసే పరభాగ్యోప జీవుల కుశలానికి లోటు వుండొచ్చు.. కానీ... వున్నవూరు, మన్ను ప్రజలు వున్నదానితో తృప్తి పడి, రత్నగర్భయైన భూమాతను గోమాతను సేవించి, జీవించే మా ధన్యజీవుల కుశలానికి ఏనాటికీ లోటుండదు”.... అని తీవ్రంగా జవాబిస్తాడు.”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి