ఒక జాతి నాగరికత వికాసానికి పటిష్టమైన విద్యా పునాది అవసరం, విద్యాబోధనలో నిరంతరం అనుసరిస్తున్న మెలకువల ద్వారా, పద్ధతుల ద్వారా వివిధ నవీన మార్గాల ద్వారా ఆయా భాషలు సుసంపన్నమౌతాయి. మన దేశంలో సుమారు 1600 భాషలున్నా వాటిలో లిపి, సాహిత్యం ఉన్నవి దాదాపు 400 భాషలు వాటిలో భారత రాజ్యాంగం 18 భాషలనే ప్రాంతీయ భాషలుగా గుర్తించింది. దేశంలో హిందీ భాష తర్వాత అత్యధికులు మాట్లాడుతున్న భాష తెలుగే. “దేశ భాషలందు తెలుగు లెస్సా” అని అనిపించుకున్న మన తెలుగు భాష. గత ఐదు దశాబ్ధాలుగా పురోగమిస్తున్న తీరు తెన్నులను ఈ సదస్సు ద్వారా వివేచించి విశ్లేషించుకోవటం ఆహ్వానించదగ్గ విషయం. భాషాభివృద్ధికి మెరుగైన విధి విధానాలను రూపొందించటానికి ఈ సదస్సు దోహదం చేస్తుందని నమ్ముతున్నాను.
మానవుడు సంఘజీవి. సహజీవనంలో తన భావాలు ఇతరులకు తెలిపి ఇతరుల భావాలు తాను తెలుసుకుంటాడు. అందుకు సైగలు, సజ్జలు, సంకేతాలు, ధ్వని రూపకంగా, రాత రూపకంగా భాషను అనుసరిస్తాడు. స్థాన కరణ ప్రయత్నాల నుండి వెలువడిన అర్థవంతమైన ధ్వనులు సమాహరమే భాష అని చదువుకున్నాం. భాషకు మాట ప్రధానం. తరువాతే రాయటం. భాష వల్ల ప్రధాన ప్రయోజనం భావ ప్రకటన భాషలో ప్రతి శబ్దార్థానికి మధ్య ఉన్న సంబంధం సాంస్కృతిక, చారిత్రక సామాజిక సంఘటన నిర్దేశితమై ఉంటుంది. భాషలో పద నిర్మాణం అర్థనిర్ధారణ పరిణామం సామాజిక సంఘటనా పరంగా జరుగుతుంది. దీనికి ఆ భాష మాట్లాడేవారి (వ్యవహర్తల) సామాజిక, ఆర్ధిక, రాజకీయ వైజ్ఞానికాది రంగాల ప్రగతులు భాషా వ్యవహర్తల స్వేచ్ఛా స్వాతంత్య్రాలు దోహదపడతాయి.
ఆంగ్ల మాధ్యమ కళాశాలల్లో తెలుగు బోధన అనేక చర్చలకు దారి తీసే అంశం. మన రాష్ట్రంలో తెలుగును బోధనా మాధ్యమంగా ప్రాథమిక స్థాయిలో 1920 నుండి అమలు చేసారు. తరువాత 1968 నుంచి ఇంటర్ డిగ్రీ స్థాయిలో అమలు చేశారు. ఎందుకంటే మాతృభాషను నేర్పడమన్నది మానవుని ప్రత్యేకమైన సహజసిద్ధమైన లక్షణమని భాషాశాస్త్రజ్ఞుల అభిప్రాయం. సామాజిక వైజ్ఞానిక విషయాలన్నీ మాతృ భాషలో అభ్యసించే వ్యక్తి చాలా వేగంగా గ్రహించగలుగుతాడని వారి అభిప్రాయం. మాతృ భాషలో విద్యను నేర్చుకున్న వారిలో సృజనాత్మకత కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇలాంటి అనేక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం వల్లే మాతృ భాషలో విద్యా బోధన ప్రతిపాదన అమలుకు ప్రభుత్వాలు పూనుకున్నాయి. కాని అందుకు సరిపడ విధి విధానాలు రూపొందించి ఖచ్చితంగా అమలు చేసే విషయంలో మాత్రం వెనుకబడ్డాయనే చెప్పాలి.
ప్రపంచంలో అనేక దేశాలు తమ మాతృభాషలోనే బోధన కొనసాగిస్తున్నారు. అందుకు కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకొని విద్యను బోధిస్తారు. శాస్త్ర సాంకేతిక విషయాల్ని కూడా తమ మాతృభాషలకే అనువదించుకొని బోధిస్తారు. సైన్సెస్, సోషల్ సైన్సెస్, హ్యుమనిటాస్ మొదలగు స్కూల్స్ అన్ని మాతృ భాషలోనే ఉంటాయి. ఉదా? రష్యా, జపాన్ దేశాలు ఆ జాతి పౌరులకు వ్యవహారంలో ఉన్న తమ భాషలోనే విద్యా బోధన కొనసాగిస్తారు. తద్వారా విజ్ఞాన సారస్వమంత తమకు అర్థమయ్యే పద్ధతిలోనే ఉంటుంది. దానివల్ల విద్యార్థుల సామర్థ్యం పెరిగి గొప్పనమ్మకముతో జీవన విధానం కొనసాగిస్తారు.
ఆసియా దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో ప్రామణికమైన గ్రంధాలు ఆయా ప్రాంతీయ భాషల్లో లేకపోవడం వల్ల భారతీయ విద్యా విధానం ఆశించిన స్థాయిలో లేదని చెప్పాలి. సాంఘీక శాస్త్రాలలో సామాన్య శాస్త్రాలలో పురోగతి సాధిస్తున్నా శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నటువంటి అంశాలు పూర్తిగా ప్రాంతీయ భాషల్లోకి రాలేదు. ఆంగ్ల మాధ్యమ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆయా ప్రాంతీయ భాషల్లో లేని పదాలు అంటే శాస్త్ర సాంకేతిక అంశాలను తెలిపే పదాలు నేర్చుకోవటానికి అవగాహన చేసుకోవటానికి కష్టంగా ఉంది. తద్వారా విషయ సముపార్జన జరగవలసినంత జరగటం లేదు. బోధపడని అనేక విషయాల్ని కూడా బోధకుడు అవగాహన సామర్ధ్యంతోకాక ఉన్న పదాలను విషయాల్ని ఉన్నది ఉన్నట్లుగానే బోధిస్తున్నాడు.
ఆంగ్ల మాధ్యమలో చదువుతున్న విద్యార్థులకు తెలుగులో బోధన అన్నది నేడు సంక్లిష్టమైన కష్టతరమైన అంశంగా పరిణమించింది. ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు తెలుగు పదాలు అనేకం తెలియకపోవటం వల్ల ఆయా ఉపన్యాసకులు తెలుగు పదాల్ని ఇంగ్లీషులోకి అనువాదం చేసి పాఠాలు చెప్పటం వింత పరిణామం. ఉదా? రకరకాల మంచును తెలపడానికి ఆంగ్ల భాషలో అనేక పదాలున్నాయి. ఆంగ్లంలో dew, fog, frost, Ice, Mist. snow వంటి పదాలు కనబడతాయి కాని తెలుగులో మంచు, పొగమంచు, చలిమంచు అనే పదాలు మాత్రమే ఉన్నాయి. అట్లాగే ఆంగ్లంలో SUN అనే పదానికి సూర్యుడు, ఎండ అనే అర్థాలు ఉన్నాయి. ఆంగ్ల భాషలో ఎండలోని బేధాలను తెలుపటానికి వేరే పదాలు లేవు. కాని తెలుగులో ఎండ, వొడఎండ, మండుటెండ, పొద్దుటెండ, నీరెండ, మÖగెండ వంటి పదాలు లభ్యమవుతాయి.
అట్లాగే మతపరమైన అంశాలు బోధిస్తున్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురౌతాయి. ఉదా. క్రైస్తవుల్లో బాప్టిజం ఉంది. తెలుగులో ఈ ఆచారం లేదు. అయితే భావానువాదం వల్ల పవిత్రస్నానం అనే మాటను వాడాల్సి వస్తుంది. అలాగే హిందువుల్లో ఉపనయనం చేసుకునే ఆచారం ఉంది. వీరు యజ్ఞోపవీతం (జందెం)ను ధరిస్తాము. వీటిని ఆంగ్లంలోకి Thread Ceremony, Sacred Thread అని అనువాదం చేయాల్సి వస్తుంది.
అదేవిధంగా పుట్టుక, పెళ్ళి, కర్మకాండ, పుజా పురస్కారాదులు మతాచార నియమానుసారంగా జరుగుతాయి. హిందూ స్త్రీలు బొట్టుపెట్టుకోవడం, తాలిబొట్టు వేసుకోవడం సంప్రదాయం. కానీ ఆంగ్లభాషా సమాజ మతానుసారం ఆ ఆచారాలు లేనందున ఆంగ్లంలో ఆ భావాలను తెలిపేందుకు దేశ్యపదాలు లేవు. అలాగే ఆంగ్లభాష నియమానుసారం ఉన్న అనేక పదాలు భారతీయ భాషల్లో లేకపోవటం కూడా గమనించాలి. భారతీయ సమాజం అనేక ఆచార సంప్రదాయాలకు నిలయం. ఇందులో అనేక భాషలు, భాషా వ్యవహర్తలు, భిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన ఆచారాలు ఉన్నాయి. దేశ సంస్కృతిని తెలిపే భావాలకు మాత్రమే దేశ్య పదాలు ఉంటాయి. అన్య సంస్కృతి సంపర్కం వల్ల విలీనమవుతున్న నూతన భావాలను వ్యక్తం చేయడానికి ((Receipient Language)) ప్రతి గ్రహీత భాషలో పదాలు ఉండవు.
అట్లాగే తెలుగులో మామ, మేనమామ, చిన్నాన్న, పెదనాన్న అనే పదాలు ఆయా బంధుత్వ వాచకాలు కానీ ఆంగ్లంలో Uఅcశ్రీవ అనే పదం ఒక్కటే ఉంది. చిన్నమ్మ అత్తమ్మ, పెద్దమ్మ, మేనత్త పదాలకు బదులుగా Auఅt అనే పదమే ఉంది. అక్క, చెల్లి పదాలలో Sఱstవతీ అనే పదం అన్న తమ్ముడికి దీతీశీtష్ట్రవతీ అనే పదం వాడాల్సి వస్తుంది.
అదేవిధంగా వ్యాకరణాంశాల బోధనలో కూడా ఇలాంటి అంశాలు కొన్ని ఎదురౌతాయి. ఉదా. క్రియ (Vవతీb) విషయంలో వర్తమాన కాలాన్ని తెలపటానికి ఆంగ్లంలో present tense, present continue, present perfect, present perfect continue వాడతారు.
He comes
He is coming
He has come
He has been coming
ఈ వాక్యాలన్ని వర్తమానాన్ని చెప్పటానికి వాడటం జరిగింది. అట్లాగే భవిష్యత్ కాలాన్ని, భూతకాలాన్ని తెలపటానికి ఉన్నాయి. తెలుగులో ఇలాంటివి ఇట్లాలేవు.
ఆంగ్ల మాధ్యమ కళాశాలల్లో తెలుగులో బోధన జరుగుతున్న సందర్భాలలో ఇలా అనేక అంశాలు ఉపన్యాసకుల అనుభవంలోకి వస్తాయి. తెలుగు భాషను బోధిస్తున్న బోధకుడికి ఇతరేతర అంశాలపట్ల అవగాహన అవసరం.
భాషా వ్యవహర్తల సృజనాత్మక శక్తిపై ఆధారపడి భాషాభివ్యక్తి తీరులుంటాయి. సృజనాత్మతకు ప్రతిభ, ఉత్పత్తి, అభ్యసం కావాలి. తద్వారా భాషా సమాజంలో ఒకే భావాన్ని వ్యక్తం చేయడానికి అనేకపదాలు ఏర్పడుతాయి. భాషకు మార్పు సహజం. భాషలో ఏకరూపకత, స్థిరరూపం ఉండటం జరుగదు. ప్రపంచంలో ప్రతి వ్యవస్థ మారుతున్నది. భాష కూడా ఒక వ్యవస్థ. భాష సమకాలీన అవసరాలకు అనుగుణ:గా మారుతుంది. బోధన పద్ధతులు ఈ మార్పుకు అనుగుణంగా మారాలి.
నన్నయ భారత భాషకు శివకవులు, తిక్కన భాషకు అంతరం ఉంది. ఆ తరువాత కాలంలో వచ్చిన కవుల భాషకు మధ్య బేధం కనబడుతుంది. చిన్నయసూరి, కందుకూరి, గురజాడ, ఆధునిక రచయితల వచన రచనల్లో భాషా భేదాలు స్పష్టంగా ఉన్నాయి. కాలానుగుణంగా భాషలు మార్పులొస్తాయి. ఈ మార్పు కాలానుగుణంగా కొనసాగాల్సింది. ప్రపంచంలో ఏ భాష కూడా ఒక రాత్రిలో భాషా వికాసం జరుగలేదు. అంతర్జాతీయ ప్రాధాన్యం గడించిన పాశ్చాత్య భాషలు నిరంతరం ఆయా భాషా వ్యవహర్తల సాంకేతిక, వైజ్ఞానిక సాంస్కృతిక రంగాల ప్రగతులకు అనుగుణంగా మార్పు చెందుతాయి. నిఘంటువులు, వ్యాకరణ సూత్రాలు, భాషా ప్రయోగ కరపత్రాల ద్వారా పాశ్చాత్య భాషలు నిరంతరం మార్పు చెందుతున్నాయి. ఆ భాషల విస్తృతికి అమిత కృషి జరుగుతున్నది. తరుచు జరిగే విస్తృతి క్రోడీకరణల ఫలితంగా లిపి, వర్ణ, పద, వ్యాకరణాంశాల్లో విస్తృతి వైవిధ్యం కనబడుతున్నది. అందువల్ల భాషా వికాసం ఏక సంఘటనాత్మకం కాదు. పలుమార్లు వ్యవహార విస్తృతి, క్రోడీకరణల ఫలితంగా సాధ్యమౌతుంది. భారతీయ బోధన విషయంలో ఇలాంటి విస్తృతి క్రోడీకరణ జరగాలి. తద్వారా లోకానుగుణంగా మన భాషలో ముఖ్యంగా బోధన రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి.
తెలుగు భాష నిరంతరం ఆధునీకరణ చెందుతున్నది. ప్రయత్నంగానే ఆధునీకృతమవుతున్నది. దేశాయ శక్తుల ప్రభావం వల్ల సామాజికంగా పరిణమించిన పరిణామాలను సమర్థంగా, ప్రభావంతంగా, ప్రతిభావంతంగా అభివ్యక్తీకరించేందుకు భాష నిరంతరం ఆధునీకృతమవుతున్నది.
ప్రాచీన కాలంలో భాష ఆధునీకరణ సంఘాలు, సభలు లేవు. ప్రతి భావంతులైన కవులు తమ రచనల ద్వారా భాషను ఆధునీకరించారు. నన్నయ్య వ్యాస భారతాన్ని ఆధునీకరించి, సాహిత్య శైలిని రూపొందించారు. సంపన్నవంతం చేశారు. ఇది సుమారుగా 19వ శతాబ్దం ద్వారా సాగింది.
ఆంగ్ల భాషా సంస్కృతుల సంపర్కం వల్ల ఆంగ్ల విద్యా ప్రభావం వల్ల తెలుగుభాషలో, భావనలు నవ్యదృక్పథం వచ్చింది. ముఖ్యంగా ఆధునిక వచన రచనా శైలి పెంపొందింది. కందుకూరి వీరేశలింగం పంతులు ప్రారంభించిన సరళ గ్రాంధిక శైలి తెలుగు భాషను సులభతరం చేసింది. గిడుగు రామÖ్మర్తి, గురజాడ అప్పారావు గార్ల వ్యవహారిక భాషోద్యమం భాషను సులభతరం చేసి ఆధునిక వచనానికి, ఆధునిక తెలుగుకు బాటుల వేసింది. తెలుగు వచన రచనకు, తెలుగు ఆధునిక భాషగా రూపొందటానికి ప్రతిబంధకాలుగా ఉన్న అడ్డంకులను తొలగించింది.
ఆంగ్లమాధ్యమ కళాశాలల్లో తెలుగు బోధనకే కాక ప్రపంచీకరణ వైపు పయనిస్తున్న నాగరికతలు ఒక్కటవుతున్న ఆధునిక సందర్భంలో భాషను నవీన పద్ధతిలో నడిపించాలి. ఆధునిక సమాజంలో వివిధ రంగాలలో ఉత్పన్నమవుతున్న విజ్ఞానాన్ని సమర్థవంతంగా తెలపడానికి భాషను స్వయం సమృద్ధం చేయాలి. దీని కోసం భాషలో నూతన శైలులు, నిర్మాణాలు ఉత్పన్నం కావాలి. విద్యా, పాలన, వాణిజ్య, శాస్త్ర సాంకేతికాది రంగాలకు భాషా విస్తరించాలి. అందుకు తగినట్టుగా బోధనా భాష, అధికార భాష, వాణిజ్య భాష, శాస్త్ర భాష, సాంకేతిక భాష రూపొందాల్సి ఉంది. నూతన పదాలు, అభివ్యక్తులు ద్వారా తెలుగుభాష పదాలను పెంచాలి. కొత్త శైలులు, కొత్త రూపాలను, అక్షర లోపాలు లేని విధంగా ఉచ్ఛారణను ప్రమాణీకరించడం లిపుల రూపకల్పన జరగాలి. లిపి రూపాలు, పదాలు ఎంపిక, సంధి కార్యాలు, వాక్య నిర్మాణాలను సులభీకరించాలి. భాష సులభతరమైన ఆధునిక శాస్త్ర, సాంకేతిక, ఇతర సామాజిక రంగాల ప్రగతులను సమర్ధంగా వ్యక్తం చేసేందుకు భాషను సంసిద్ధం చేయాలి. భాష సామాజికావసరాల, ప్రయోజనాల దృష్టితో ప్రయత్న పూర్వకంగా తొందరగా సాధించాలి. సమకాలిన సమాజ భావాభివ్యక్తికి భాష సమర్థంగా, శక్తివంతంగా సమగ్రంగా రూపొందడం భాష ప్రాథమిక లక్షణం.
బోధన సామర్థ్యం పెంచటానికి సులభతరం చేయటానికి సాధించాల్సిన లక్ష్యాలు కొన్ని ఉన్నాయి అవి.
భాష గతంలో కంటే సులభంగా, సంక్షిప్తంగా నిర్దిష్టంగా తయారు కావాలి. వాచ్య లిఖిత శైలుల్లో అంతరం అంతరించాలి. అన్ని వర్గాల సగటు భాషీయులకు అర్థం కావాలి. ప్రాంత, వర్గ, వర్గమాండలికాల భిన్నత్వం నుంచి ప్రామాణిక భాష రూపొందాలి. సులభంగా అర్థమయ్యే పదాలను వ్యవహర్తలు ఉపయోగించేటట్లు చూడాలి. నూతన శైలులు, నిర్మాణాలు సులభంగా ఉంటూ, భాషీయుల ఆమోదం పొందాలి. వ్యవహారంలోని పదాలు, రూఢ్యార్థ పదాలు భాషలో చోటు చేసుకోవాలి. సమాజం అభివృద్ధి చెందేకొలది భాష కూడా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. నిరంతరం భాషలో వస్తున్న మార్పులను గుర్తించి తదనుగుణంగా భాషాభివృద్ధి జరుగాలి. ప్రపంచీకరణ వైపు కదులుతున్న అడుగులకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక విద్యా విషయాల్నీ ప్రాంతీయ భాషల్లోకి తీసుకురావాలి. సమర్ధవంతమైన ఆలోచనా విధానం రూపొందించుకోవాలి. బోధనా విధానంలో మార్పు రావాలి. విద్యార్థుల సామర్థ్యం పెరిగేటట్లు పాఠ్య పుస్తకాలను తయారు చేయాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి