నాన్న గారు ! అమ్మ గారు మీకు పాదాభివందనం! మన నూతన గృహప్రవేశం ఎప్పుడో తెలియజేయగలరని విన్నపం..
సమాధానం: శుభం భవతు. అలాగే చెప్తాము. సావధానంగా వినండి మన నూతన గృహానికి ప్రవేశ ముహూర్తము..(ఊహా జనితం)
శార్వరీ నామ సం:
ఉత్తరాయణం (గృహప్రవేశానికి ఉత్తమం)
శిశిర ఋతువు (ఉత్తమ ఋతువు)
మాఘమాసం (మాస శుద్ధి)
శుద్ధ పంచమి (తిధిశుద్ధి)
గురువారం(వార శుద్ధి)
అనురాధ నక్షత్రం (నక్షత్రం శుద్ధి)
వృషభ చక్ర శుద్ధి,
కలశ చక్రశుద్ధి కలిగి ఉన్న ముహూర్తంలో,
చతుర్థ, అష్టమ, దశమ శుద్ధులు కల కన్యా
స్థిర లగ్నంలో (స్థిరలగ్నం ఉత్తమం)
బ్రహ్మ ముహూర్త సమయమైన 4గం: లకు
1. గోమాత దూడ సహితంగా ముందు నడువగా,
2. మంగళ వాయిద్యాలు మారు మ్రోగుతూ వెళుతూ, వారిని అనుసరించి
3. పురోహిత బృందం పూర్ణ కలశం తో వేద మంత్రోచ్చరణలతో రాగా,
4. నేనూ మీ అమ్మ మన ఇంటి దేవతా విగ్రహాలను తీసుకుని నడుస్తూ వస్తూవుంటే.
5.మన ఇంటి ఆడపడుచులందరూ పట్టు వస్త్ర-స్వర్ణాభరణ భూషితులై సంతోషాంతరంగులై మంగళకర పూజాది ద్రవ్యములను
చేతబూని కదిలి వచ్చే శుభ మంగళకర వేళ
6. సుస్వర వేద మంత్రాల ఘోష లో గృహ ప్రవేశం చేయగలము..
గమనించవలసిన విషయాలు:
1. తిధి, వార, నక్షత్ర లగ్న, వృషభ, కలశ చక్ర, శుద్ధి గల మంచిదైన బ్రహ్మ ముహూర్తం
2. గోమాత.
3. వేద పండితులు.
4. ఇంటి ఆడపడుచులు.
5. మంగళ వాయిద్యాలు.
అమ్మా.. నాన్న గారు చాలా మంచి విషయాలు తెలిపారు.
గృహప్రవేశానికి మంచి ముహూర్తంతో బాటు ఇంటి ఆడపడుచులు కూడా అవసరమన్న విషయం ఇప్పుడే తెలిసింది. ఎందుకు వారికి అంటే ఆడపడచులకు అంత ప్రాధాన్యం, అంత ప్రాముఖ్యత ఇవ్వడం. దయచేసి అన్యధా భావించక తెలుప గలరు..
సమాధానం: చాలా మంచి ప్రశ్న వేసారు.. మన ఇంట్లో పుట్టిన అమ్మాయిలు
1. మనకూ మన కుటుంబానికి సౌభాగ్యాన్ని ప్రసాదించడానికి మనింట జనించిన అమ్మ వారి ఆశీర్వాద రూపాలే ఆడపడచులన్న విషయం ముందుగా మనం గ్రహించాలి..
2.“వివాహానంతరం వారు వారి అత్త గారి వంశాన్ని నిలబెట్టి, తన సత్సంప్రదాయ సంస్కార సభ్యతలతో మెట్టినింటికి మహత్తర గౌరవాన్ని, పుట్టినింటికీ కీర్తిని తెచ్చే అమృత హృదయులు ఆడపడచులు”-అన్న విషయం కూడా మరువ రాదు.
ధన్యవాదాలు! అమ్మా నాయన గారు అయితే మీ ఈ వ్యాఖ్యానానికి ఆధారం, శృతి స్మృతి ఇతిహాస ప్రమాణం ఏమనా వున్నవా? దయచేసి తెలుపగలరు..
సమాధానం: ప్రమాణాలు ఉన్నాయి. శ్రీ మద్రామాయణ లో వాల్మీకి మహర్షి, కుటుంబం గురించి చెబుతూ ఈ 10 మంది కుటుంబం లో తప్పక వుండాలని అన్నాడు. అప్పుడే అతడు కుటుంబీ అని పిలవబడతాడని చెప్పాడు..
మాతా పితా స్నుషే పిత్రా
పుత్రీ పత్ని అతిధి స్వయం
దశ సంఖ్య: కుటుంబీవ
విష్ణు నోక్తం ద్విజోత్తమా.. (అయోధ్యా కాండ)
భావం: కుటుంబీ అంటే కుటుంబ యజమాని అంటే గృహస్థుడు... అతని కుటుంబంలో పది మంది ఉండాలంటే. వారు..
1. తల్లిదండ్రులు.......2
2. గృహస్థుడు ... గృహిణి.. 2
3. ఇద్దరు కొడుకులు....... 2
4. ఇద్దరు కోడళ్ళు......... 2
5. కూతురు...1
6. అతిధి.... 1
7. మొత్తం...... 10
వీరంతా కుటుంబ సభ్యులే. ఇందులో పుత్రిక ఎప్పటికీ ఆ కుటుంబం సభ్యురాలే, వివాహం జరిగినా కూడా ఆమె ఆ కుటుంబ సభ్యురాలే.. అంతేకాదు ఆ కుటుంబంలో జరిగే అన్ని శుభకార్యాలలో ప్రథమ తాంబూలం ఆమెకే. గృహప్రవేశం సమయంలో నిండు బిందెతో గంగా జలం తెచ్చి ఆమె నే మొదట ఇంటి గడప కడిగి గృహప్రవేశం చేయిస్తుంది. అంతేకాదు పాలు పొంగించేది కూడా ఆమెనే. ఆడపడుచే ఎందుకు అంటావేమో. ఇంతకు ముందే చెప్పినట్టు అమ్మవారి కరుణా కటాక్ష లబ్ధ విభవమే మన ఆడపడచులు. మనుస్మృతి ఏమంటుందో పరికించండి.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
యత్రైతాస్తున పూజ్యంతే సర్వాస్త తాఫలాః క్రియాః
శోచంతి జామయో యత్ర వినశ్యత్యాశు తత్కులం
నా శోచంతి తు యత్రైతా వర్ధతే తద్ది సర్వదా
(అధ్య: 56 శ్లోకం 57 శ్లో. )
భావం: ఈ రెండు శ్లోకాలలో స్త్రీ మÖర్తులను ఆర్య అని జామయ అని సంబోధించటం గమనార్హం. ఆర్య అంటే గౌరవనీయులని జామయా”- అంటే ‘ ఆడపడచులన్న అర్థం వుంది..
ఏ గృహం నందు స్త్రీలు, అనగా తల్లి, భార్య కూతురు, కోడలు గౌరవింపబడుదురో ప్రేమించబడుదురో ఆదరింపబడుదురో అట్టి గృహమున దేవతులు స్వేచ్ఛగా సంతోషంగా విహరింతురు. సుఖ సంతోషములు చక్కగా విలసిల్లును. అట్లుగాక ఏ గృహమునందు స్త్రీ మÖర్తులు గౌరవింపబడరో, ప్రేమాభిమానాలకు నోచుకోరో ఆ గృహమునందు ఎన్ని ధర్మ కార్యాలు నిర్వహించినను అంతయÖ నిష్ప్రయోజనమే.
ఆ గృహమునందు దుఃఖ దారిద్య్రములు తాండవించును. తుదకు అట్టి గృహము నశించి పోవును. కావుననే మనం మన ఆడపడుచులను సదా గౌరవిద్దాం. అభిమానిద్దాం. ఆదరిద్దాం. మన గృహాలలో సుఖ సంతోషాల చల్లని వెన్నలలను కురిపిద్దాము. మనువు చెప్పిన మరో రెండు అద్భుత శ్లోకాలు అవధరించండి!
శ్లో:జామయో యాని గేహాని శపంత్యా ప్రతి పూజితా
తాని కృత్వా హతానీవా వినశ్యంతి సమంతతః
తస్మాదేతాస్పదా పూజ్య భూషణాచ్చాద వాశనిః
భూతికామై నరేర్నిత్యం సత్కారే మాతృ వేషుచ..
భావం: తోడబుట్టిన స్త్రీ తమకు పుట్టింటి నుండి ఆహ్వానములు కాని ప్రేమ పూర్వకమైన ఆదరములు కాని లభించలేదని మిగుల దుఃఖింతురో ఆ పుట్టిల్లు నిత్య దు:ఖబాధితమగును. సుఖ శాంతులు మృగ్యమై పోవును. కావున శ్రేయస్సును, సుఖ సంపదలను కోరుకొను గృహస్తుడు, గృహిణి తమ ఇంటి యందు జరుగు సమస్త శుభ కార్యములకు తమ తమ ఆడపడుచులను తమ ఇళ్ళకు హృదయపూర్వకంగా ఆహ్వానించవలెను. వారికి నూతన వస్త్ర స్వర్ణాభరణాదులతో మృష్టాన్న భోజనముతో సత్కరింపవలెను.
ఇది ఎల్లప్పుడూ నిరంతరం నిరాటంకంగా జరుగునట్లు గృహస్థుడు, మరీ ముఖ్యంగా గృహిణియు చూడవలెను. ఆమె గౌరవ మర్యాదలతో, ప్రేమాభిమానాలతో తన ఆడపడుచుల హృదయములను గెలుచుకోవలెను. ఇది కుటుంబముల మధ్య వారధిగా పరిణమించును. ఈ సత్సాంప్రదాయ జనిత సదాచారమే వడిబియ్యం పోయడం.
ప్రస్తుతకాలంలో భారత ప్రభుత్వం ఆడపడుచులకు కూడా పురుషుల తో సమానంగా ఆస్తి హక్కు కల్పించడం ఈ విషయాన్నే మరింత బలపరుస్తుంది.. ఇది పూర్తిగా నా స్వంత అభిప్రాయం. మనుస్మృతి, రామాయణ ఇతిహాసములను చదివి వాటిని ఆధారంగా తీసుకుని వ్రాసిన లఘు వ్యాఖ్యానం. మన బొడ్డుపల్లి కుటుంబంలో ఆడపడుచులను సదా ప్రేమించి అభిమానించి, గౌరవించే అపూర్వ సత్సాంప్రదాయం తరతరాలుగా వస్తున్న విషయం మీకందరికీ అవగతమే..
మా పితృ దేవులు.. తేజో, ధైర్య, సత్య, ధర్మ, కర్మా చరణ ధార్మికత్వాది గుణ వరిష్ఠులు... జీవన పర్యంతం తోడబుట్టిన ఆడపడుచులను అతులితము అనంతము, అవ్యక్తమÖ, ఆపూర్వమÖ అయిన ప్రేమాభిమానాలతో ఆదరించి అందరికీ ఆదర్శంగా నిలిచిన మీVAన్నత వ్యక్తిత్వ సంపన్నులు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి