గద్య, పద్యాలు సాహిత్య విష్ణువు ఎత్తిన అవతారాలు. ఇంకా చెప్పాలంటే మోహినీ స్వరూపాలు. క్రమాన్ని పరిశీలిస్తే గద్యాన్నే ప్రథమంగా పేర్కొనవలసి ఉంటుంది. గద్య గంగ కథ, నవల, నాటకం, వ్యాసం, ఆత్మకథ, జీవిత చరిత్ర, సంభాషణ, పీఠిక వంటి పాయలుగా ప్రవహిస్తున్నది. రూపమేదయినా జీవలక్షణం చెడకూడదు. ఇక్కడ జీవలక్షణం అంటే రచనా సంవిధానం. ఆమాటకొస్తే గద్యం వ్రాయడం అంత సులభమేమీ కాదు. ‘గర్భం కవీనాం నికషం వదంతి’ అని ఆర్యోక్తి. కవుల రచనాశక్తికి గదŠ్యం గీటురాయి.
ప్రస్తుతాంశం వ్యాసం, విద్యార్థి నుండి విద్వాంసుడి వరకు విహార రంగమై వినుతికెక్కినది వ్యాసం. తెలుగు వ్యాసానికి దాదాపు 125 సంవత్సరాల వయసు. కాని ఇది నిత్యయవ్వన ‘వ్యాస’ శబ్దానికి ‘వ్యస్యతి తస్య భావః కర్మవా’ అన్నారు. ‘విస్తారము, ఏదేని యొక విషయమును విరివిగా వ్రాయుడు’ అని నైఘంటికార్థము.
విషయసేకరణ, విశ్లేషణ, నివేదనల త్రివేణీసంగమం వ్యాసం. ప్రతి మహాయుగానికి ఒక వ్యాసుడి చొప్పున ప్రస్తుతానికి 28 మంది వ్యాసులైనారు. కాని ‘తెలుగు వ్యాసు’ లెందరన్న గణనకు పూనుకొంటే లెక్క తప్పడం ఖాయం. కాని వీరిలో ఒక వ్యాసేశ్వరలింగం డా. కపిలవాయి లింగమÖర్తి గారు.
స్వయంకృషితో సాహిత్యంలో సాధికారతను సాధించినవారు లింగమÖర్తిగారు. ‘ పద్య, వచన, గేయము’ లతో త్రినేత్రయై భాసించింది వారి లేఖిని, కపిలవాయి వారి వ్యాస విలాసావిష్కరణమే ఈ వ్యాసాద్దేశ్యం. లింగమÖర్తి గారు దాదాపు 400 వ్యాసాలు వ్రాసినారు. వీటిలో ఆధ్యాత్మిక, చారిత్రక, భాషా, సాహిత్యాలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ వ్యాసాలు కొన్ని వార, మాస పత్రికలలో, ప్రత్యేక సంచికలలో ప్రవేశించినవి. కొన్ని గ్రంథాలుగా రూపమెత్తినవి. కొన్ని అసూర్వం పశ్యలుగా మిగిలిపోయినవి. ‘స్థాలీపులాక న్యాయం’గా వారి వ్యాసశైలిని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను.
వ్యాసము స్థూలంగా ‘ప్రవేశము, ప్రధానాంశము, పరిసమాప్తి’ అన్న విభాగాలుగా వింగడించబడింది. ఇది ‘త్రిభంగి’. ఈ క్రమములోనే కపిలవాయి వారి వ్యాసానుశీలనం చేద్దాం.
శీర్షికలు:
శీర్షిక ముఖానికి బొట్టు వంటిది. విషయసారమంతా శీర్షికలో ప్రతిబింబించాలి. లింగమÖర్తిగారి వ్యాస శీర్షికల్లో వైవిధ్యత తొంగి చూస్తుంది. ‘దేవుడలిగిపోయిన గుడి’, ‘దేవుని రక్షించండి’ వంటి శీర్షికలు పాఠకునిలో ఆసక్తిని రగిలిస్తాయి. ఈ కోవలోనివే ‘నన్నయగారి కేటు బంగారం’, ‘శ్రీనాధుని గవ్వచౌక’, పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి వారి ‘చెప్పలేదంటనక బొయ్యేరు!’ అన్న తత్త్వగీత పల్లవి శీర్షికగా పాదం మోపింది, గేయపాదమే కాదు ‘యాదేవీ సర్వభూతేషు’ అన్న శ్లోక పాదమÖ శీర్షికగా తలకెక్కింది. ఔచిత్యం వీడని జాడలతో సాగిన శీర్షికలున్నాయి. మచ్చుకు ‘నమక విభూతులు’ రుద్రాధ్యాయ సంబంధ వ్యాసమిది. అయితే దీనికి ‘నమక వైభవము’ అని కూడా పేరు పెట్టవచ్చు. కాని లింగమÖర్తి గారు ‘విభూతి’ ని పెట్టడంలో ఔచిత్యమున్నది. విభూతి శివ సంబంధమైనది కనుక సరిపోయింది. ఇంతేగాక ‘విభూతి’ అంటే ‘ఐశ్వర్యం’, ‘సంపద’ అన్న అర్థాలున్నాయి. ఈ అర్థంతోను, నమకాన్ని సమన్వయించుకోవచ్చు. కపిలవాయి వారికి శీర్షికల విషయంలో ఆలంకారిక దృష్టిమెండు. ఉదా: ‘ఆర్తత్రాణ పరాయణులు - ఆశ్వనీ దేవతలు’, ‘ప్రబంధాలు గీసిన పరమపద సోసాన పటం’, ‘భాగవత సృష్టి, ఒక దృష్టి’. ‘పాలమారు జిల్లా దేవాలయాలు’ అన్న గ్రంథŠంలోని వ్యాసాలకు కూర్చిన శీర్షికలలో వీరి ఆలంకారిక దృష్టి మరింత ప్రస్ఫుటముగా అగుపిస్తుంది.
ప్రవేశము:
వ్యాస ప్రారంభ వాక్యాలు పఠనాసక్తి కారకాలు, ప్రేరకాలు. లింగమÖర్తి గారి వ్యాస ప్రారంభం ఒక ప్రణాళికా బద్ధంగా ఉంటుంది. కొన్ని ఉదాహరణలను ఉటంకిస్తాను.
“మన వా్మఙయం గంగాయమునలవలె సంగీత సాహిత్యాలని రెండు ప్రధాన ధారలుగా సాగింది” (తొలి తెలుగు ఆకరాలు) ‘శ్రీరామగిరి క్షేత్రము’ ను గూర్చిన వ్యాసం ‘పాలమÖరు జిల్లాలోని దుందుభి నది మిక్కిలి ప్రాచీనమైనది. అంటూ ప్రారంభమవుతుంది. శబ్ద వివరణతో ప్రారంభమయిన వ్యాసాలున్నాయి. “స్థానం అనగా చోటు. ప్రస్థానం అనగా విశాలమైన ప్రదేశం” (నాలుగో ప్రస్థానం).
ప్రధానాంశము:
వ్యాస శరీరమునకు ఇది నాభి. రచయిత పరిశ్రమ ప్రదర్శనశాల, కపిలవాయి వారు వ్యుత్పన్నులు ‘విన్నంత, కన్నంత, తెలియవచ్చినంత తేటపరచే తావులు వారి వ్యాసాలు, పుస్తకాలను అవలోకించి, పెద్దల ద్వారా ఆలకించి ఎన్నో విషయాలను సేకరించారు. ఎవరి నుండి ఏ చిన్న విషయం విన్నా వెంటనే వ్రాసిపెట్టుకొనే వారు. అది రచయితగా వారి జీవలక్షణం. దీని అవసరమేమిటో ఒక సందర్భంలో వారే సెలవిచ్చారు. ‘ఎప్పుడైన మనం మన పెద్దవారితో విషయాలు విన్నదానిని నోట్ చేసి పెట్టుకుంటుండవలె. అది రచయితలైన వారికి ఎంతో అవసరం. అతనికిపుడు విన్నది ఇపుడు ఉపయోగపడకపోవచ్చు కాని అవసరమైననాటికది దొరకకుండా పోతుంది’ (సామాన్యులలో అసామాన్యులు).
కపిలవాయి వారి లేఖిని వ్యాసరూపంలో ఎన్నో చారిత్రకాంశాలకు పురుడుపోసింది. మరుగున పడిన ఎన్నో విషయాలను త్రవ్వితీసింది. ఒకనాటి సామాజిక దర్శనం చేయించింది. భాషా మర్యాదలను, సాహిత్యాంశాలను సాక్షాత్కరింపజేసింది. ‘సూతా’ వతారమెత్తి జరిగిన కథలనెన్నో విరÁచించింది. అలసటకు ఆమడదూరంలో ఉంటూ నిత్య చైతన్యశీలంతో సాగుతూ, ఆక్షరదీక్షను కొనసాగించింది.
విషయనివేదనలో భాగంగా ఎన్నెన్నో అంశాలను ప్రస్తావిస్తారు. వాటిలో కొన్ని : 1. తెలుగువారు సరస్వతిని వీణాపాణిగా రెండు రూపాలలో ఉపాసిస్తున్నారు. వీణాపాణి దక్షిణాది సరస్వతి . ఈమెకు సంగీత సరస్వతి అని పేరు. శుకపాణి కాషీర్మ శారద. ఆమెకు సాహిత్య సరస్వతి అనిపేరు. పోతన భాగవతంలో కాశ్మీర శారదనే నుతించినాడు. (గంగాపుర మాహాత్మ్యం - కావ్యావలోకనం).
2. రెడ్లు మొదట శైవులు. వేదాంత దేశికుల కాలం నుండి వైష్ణవం స్వీకరించారు. (గంగాపుర మాహాత్మ్యం - కావ్యావలోకనం)
3. శ్లేషాను ప్రాణితాలు కవులకు బాణుడు పెట్టిన భిక్ష. (మరుగునపడిన మన కవులు)
4. కాటుక పిట్టలు వ్రాలేచోట నిధులుంటాయని శకునశాస్త్రం చెపుతుంది.(గద్వాల ప్రభువంశం)
5. కడిమిలో నీరు కడిమి నేల కడిమి, బట్ట కడిమి, వసంతకడిమి అనే భేదాలున్నాయి. (వట్టెం కవి పండిత వంశాలు)
6. మహబూబునగరం క్రీ.శ. 1903-04 నడుమ జిల్లాగా చేయబడింది. (ఋషితుల్యుడు నూకల చంద్రయ్య గారు )
క్రొత్త విషయాలు:
వ్యాసాంతర్గతంగా ఎన్నో కొత్త విషయాలను తెలుపుతారు వీరు. రామాయణంలో దశరథుని భార్యయైన సుమిత్ర ఒక వైశ్య ప్రభువు కూతురట.(ఆధ్యాత్మ రామాయణం). ఆదిమ యుగంలోని గుర్రానికి గిట్టలు లేవట. దాని పాదం మామÖలుగా గోళ్ళతో ఉండేదట. (భాగవత సృష్టి - ఒక దృష్టి) “ పగటికి రెండువైపులా రాత్రి ఉడేదాన్ని ‘పక్షిణి’ అంటారు. ఇది ఆర్థరాత్రి నుండి మొదలవుతుంది. ఇపుడిది అంతర్జాతీయ దినంగా ఉంది” (భాగవత సృష్టి - ఒక దృష్టి). ఇలాంటివి చెప్పడం వల్ల పాఠకుడిలో ఆసక్తి జ్ఞానం పెరగడమే కాక, పరిశోధన వైపు దృష్టి ప్రసరిస్తుంది.
లోచూపు :
ఆయా సందర్భాలలో వారు ప్రకటించే విషయాలు వారి నిశిత పరిశీలనకు నిలువుటద్దాలు. ఇందులో వారి వ్యుత్పన్నత ద్యోతకమవుతుంది. ఉదా. “మంగల పల్లె జాతి వాచకం కాదు, వృక్షవాచకం, సంస్కృతంలో దీనిని ‘పింజీతకం’ అంటారు. ఇది వనమున ఉపయోగకరమైన ఓషధి ( వట్టెం నాడు - నేడు). “ యకారంబును వు, వూ, వొ, వో లును తెలుగు మాటలకు మొదట లేవు అని చిన్నయసూరి చెప్పినాడు. కాని ముహూర్త దర్పణం నామ నక్షత్ర విధిలో “ యేర్రనా యాచనామగ్ని.... యేల్లనా మÖల నక్షత్ర మిత్యుక్తం అన్న దాన్ని ఉదహరించి “ దీనిని బట్టి ఎల్లన అనే పేరు మనం స్వరంతో కాక యకారానికి ఏత్వంతో వ్రాయవలసి ఉంది” అని చెపుతూ పూర్వం వీధి బడుల్లో కూడా దీనిని ఇలా వ్రాయించే వారని తెలిపి తమ వివాదానికి బలం చేకూర్చారు (మహబూబ్‌నగర్ జిల్లా మాండలికం) ఒక ప్రసిద్ధ చాటువును (లింగనిషిద్ధ.. ) పేర్కొని ఇందులో ‘రామలింగ కవిలింగని’.. అన్న చోట రెండవ సారి ప్రయోగించిన ‘లింగ’ (కవిలింగని) శబ్దం శ్రేష్ఠతా వాచక సూచకమన్నారు. అంతేగాక “ఈ పదం శ్రేష్ఠతా వాచకంగా మరోచోట కవి నడిపించినట్లు లేదు” (కొన్ని తెలుగు చాటువులు - వాని విశేషాలు) అని పేర్కొన్నారు. నాగర లిపి అంతా లంబరేఖలు సరళరేఖల నాశ్రయించియే వర్ధిల్లింది.. తెలుగక్షరాలు నాగరి వలెగాక పూర్ణబిందువులు, ఖండ బిందువుల యొక్క సంయోగంతోనే ఏర్పడుతుంటవి. (తాళపత్రాలలో ప్రాచీన లేఖన స్వరూపం). సహస్రాక్షులై దర్శిస్తే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు సాధ్యం కావు.
సూక్తి సుధ :
‘సూక్తి’ అంటే మంచి మాట. లింగమÖర్తి గారి వ్యాసాలలో అక్కడక్కడ ఇలాంటివి నేత్రపర్వం కలిగిస్తాయి. ఉదా. కాపుకి కల్లం తీర్చటం, కమ్మరికి కదురు తీర్చటం పరీక్షా స్థానాలు (మరుగున పడిన మన మహాకవులు) ఈ వ్యాసం లోనే మరో చోట “సత్యం ఎంత మృదువో, ఎంత సుందరమో, అంత కఠినం కూడా” అంటారు. “.. శాస్త్రము, గనుక దానికి కావ్యవేషము దొడుగుట కష్టము (ఆత్మఎరుక), సాహిత్యం ఆత్మానందకరమయింది. వస్తువు విషయానందకరమయింది (మన భాష - దాని సామగ్రి), “కావ్య ప్రబంధాలలో అన్ని పద్యాలలో ఆవిత్వం ఉండదు (కొన్ని తెలుగు చాటువులు - వాని విశేషాలు).
భాషా సౌందర్యం :
లింగమÖర్తి గారి వ్యాసాలలో భాషావిశేషాలను దర్శింపవచ్చు. పద వ్యుత్పత్తులను ప్రస్తావిస్తారు. “పదర’ -అది భద్రశబ్ద భవము” (రాయనిగండి చెన్నకేశవాలయము). “అయిజ అయోధ్య అనే పేరుకు వికృతి (గద్వాల ప్రభువంశము). “జట లేక జడ అనగా నదియొక్క పాయ. ప్రోలు అనగా పట్టణం జటప్రోలు అనగా నదీతీరంలో గల పట్టణం అని అర్ధం... ఇలాంటి వెన్నో చూడవచ్చు.
తెలుగు నుడికారాన్ని అందంగా ఆవిష్కరించిన సందర్భాలున్నాయి. “చాటువులు చెప్పటం ద్వారా వారు కవిత్వాన్ని సామాన్యుల నాలుకకు పట్టించారు” (ప్రతికంఠం వారు). “ వత్సుడామె కన్నబిడ్డ£ గాకపోయినా ఆ దేవి పాలిండ్ల నెంగిలి చేశాడు” (శ్రీవత్ససగోత్రులు), “తొలుకారు యవ్వనం, ‘తెలివిగలిగిన పిండం’, ‘బట్టగట్ట నేర్చిన నాటి నుండి’, ‘గెలుగుకొని’ వంటి పద ప్రయోగాలను గమనించవచ్చు. ఈనాటి రచయితల రచనల్లో నానుడి ప్రయోగాలు ఎండాకాలపు నదులవుతున్నాయి.
సామెతలు :
సామెతలు విషయావగాహనను సులభతరం చేయడమేగాక మనసుకు గిలిగింతలు పెడుతాయి. కపిలవాయి వారి వ్యాసాల్లో వీటిని బాగా ఏరుకొనవచ్చు. ఉదా: ఆకలిగొన్న కరణం పావకవిలె లేసినాడని’ “ ‘మిన్నందిన వాని పొడవెంతన్నట్లుంది’. “దేవుని పెండ్లికి అందరు పెద్దలే”. వీటితో పాటు ‘నఖల్ కర్నేకోభి అఖల్ ీVAనా’ వంటి ఉర్దూ సామెతలు కూడా దొరుకుతాయి.
జాతీయాలు:
జాతీయాలు భాషా సంపదలో వెలకట్టలేని వజ్రహారాలు. ‘పాతచింతకాయ పచ్చడి’, “నల్లేరుమీద నడక”, “ఆషాఢభూతి”, “స్వస్తిచెప్పు” వంటి ప్రసిద్ధ జాతీయాలే కాకుండా పాలమÖరు జాతీయాలుగా చెప్పబడే “ఇటుకల రాయని గుర్రం”, “జిల్లేడు దూది”, “నత్తెల్లయ్య తుపాకీ,” “మంకుపట్టు”, “కాలు జాడించటం “, “ ముసలి చిలుక” వంటివి లింగమÖర్తి గారి వ్యాసాల్లో పొంగివస్తాయి.
న్యాయాలు:
వీరి వ్యాసాల్లో న్యాయాలు అక్కడక్కడా తళుక్కుమంటాయి. ఉదా: “స్థూలారుంధతీ న్యాయం”, “కదంబ పుష్పన్యాయం” వంటివి పేర్కొనవచ్చు.
అన్యదేశ్యాలు :
అన్యదేశ్య ప్రయోగాలకు వందల ఏళ్ళ వయసుంది. సామాజిక ప్రభావంతో వీటి వినియోగం అనివార్యమవుతుంది. కపిలవాయి వారి రచనల్లో ఉర్దూ, ఆంగ్ల పదాలు కలిసి నడిచిన తీరును చూద్దాం. ‘వంట ఇంటి లోనికి ఎవరూ వెళ్ళే మగ్దూరు లేదు” (కల్యాణ వేంకటేశ్వరుని కథ) ‘ సీతారామి రెడ్డి గారు శర్మ గారితో దూస్రీ చదివించి ఇమ్లా వ్రాయించి చూసి తీస్రీలో చేర్చుకున్నారు” (హనుమచ్ఛర్మ గారు - వారి షెర్వులు). ‘ఒక టూరిస్టులో వచ్చారి. కెనడియన్స్ ముగ్గురు, జపానీయులు ఇద్దరు, జర్మన్లు ముగ్గురు వచ్చారు’ (పాలెం చరిత్ర) ‘రావణుడు మాయలేడి అనంతరం తన ప్లాను ప్రకారం వచ్చి (ఆధ్యాత్మ రామాయణం)
ఈ విధంగా భాషాపరంగా లింగమÖర్తి గారి వ్యాసాలు విలువైనవని చెప్పవచ్చు.
చముత్కారాలు:
చమత్కారం పాఠకుని మనసును దోస్తుంది. ప్రసంగమైనా, రచనయైనా చమత్కారం లేకుంటే అది చప్పబడిపోతుంది. లింగమÖర్తి గారి చమత్కారాలను దర్శిద్దాం.
“పెంట్లవెల్లి ఆనాడు దొరలకు, దొంగలకు కూడా వ్యాపారకేంద్రంగా ఉండేదంటారు” (జటప్రోలు సంస్థానం)
“ఈ కవి తండ్రి తనను లక్ష్మీకటాక్ష వీక్షణాపాదిత విభవుడిగా చెప్పుకొన్నా ఇతనిపై అత్తగారి కన్ను దప్పి కోడలి కటాక్షం మాత్రమే సంపూర్ణంగా నిలిచింది. (పూదత్తు వారు)
వాక్యాలు:
వీరి వాక్య నిర్మాణంలో వైవిధ్యం గోచరిస్తుంది. చిన్న చిన్న వాక్యాలుంటాయి. “వారు స్మార్తులు”. “మÖడుదినాలు గడిచినవి. ఇంకా పండుగ సందడి తగ్గనే లేదు”... ఇలా సాగుతాయి. అలాగని అన్నిచోట్ల ఇదే విధానం సాగదు. ఈ వాక్యాన్ని చూడండి . “ ఆమె అన్నం మాత్రం వండి ఈ పూట కెలాగో పచ్చడితో దాటింటామని గరిట తీసుకొని జాడి దగ్గరకు వెళ్ళి యింత మామిడికాయ బయటికి తీసింది. (కల్యాణ వేంకటేశ్వరుని కథ). ఇదొక సుదీర్ఘ వాక్యం. రెండు మÖడు లైన్ల నుండి పది లైన్ల వరకు పేరాలు రూపుదిద్దుకొంటాయి.
ముగింపు:-
వ్యాసానికి ప్రాsంభమెంత ముఖ్యమో ముగింపు కూడా అంతే. లింగమÖర్తిగారి వ్యాసాల్లో చక్కని ముగింపు కనిపిస్తుంది. “నమక విభూతులు” అన్న వ్యాసాన్ని ముగిస్తు “అన్నిటిలో ఆ జగత్కరమైన ఈశ్వరుని దర్శించు అని ఈ నమకం తనను పఠించేవానికి ఒక మహత్తర సందేశానిస్తుంది” అంటారు. ఈ వ్యాసానికి ఇది సారవంÛతమైన వాక్యం. “ఋషితుల్యుడు నూకల చంద్రయ్యగారు” అన్న వ్యాసంలో పరిసమాప్తి పంక్తులీవిధంగా ఉన్నాయి. “మహనీయులు ఏది ఎందుకు చేస్తారో అది కాలం గడుస్తుంటే కాని అర్ధంకాదు” అని సార్వకాలిక సత్యాన్ని చాటారు.
వినయం:
లింగమÖర్తి గారిలో ఆహంకారం అనుమాత్రమైనా అగుపించేది కాదు. వారి వినయ స్వభావం వ్యాసాల ముగింపులో కూడా ప్రతిబింబిస్తుంది. “పెద్దలెవరైనా వ్యాసంలో మార్పులు, చేర్పులు సూచిస్తే కృతజ్ఞతతో దీనిలో చేరుస్తాను” (ఆక్షింతల వారివంశం).
కృతజ్ఞత :
కపిలవాయి వారిలో కనిపించే మరో సుగుణం కృతజ్ఞత. తమకు సమాచారాన్నందించిన వారిని తప్పక తలచుకొంటారు. విషయ తస్కరపతులు ఎక్కువౌతున్న కాలమిది. చాలామంది ఆయా విషయాలు ఎలా సేకరించారో చెప్పకుండా అంతా తమ ప్రజ్ఞయే అని చాటుకొనడం అనుభవంలోనిదే. కాని లింగమÖర్తి గారు దీనికి ఆపవాదుగా నిలుస్తారు. ఆయా విషయాలను తమకందించిన వారిని (వ్యాసము చివరన) తప్పక స్మరిస్తూ కృతజ్ఞతల నావిష్కరించడం వారి వ్యాసాల్లో చూడవచ్చు. ఇది అభినందనీయమే కాదు, అనుసరణీయం కూడా. ఉదా: “మార్చాల బాలకిష్టయ్య గారు నాకీ విషయం చెప్పినారు”. అని పాపకల్లు రాములు చెప్పేవాడు “ (దుందుభి ఏనాటిది?)
“నాకు అచ్యుత స్వామిని గురించి వట్టెం శ్రీరామచంద్రశాస్త్రి గారు, బంగారు శాస్త్రిని గురించి వెలుదండ రామేశ్వరరావు గారు వివరాలందించారు. (అచ్యుతయతి)
కపిలవాయి లింగమÖర్తి గారు తమ వ్యాసముల ద్వారా జిజ్ఞాసువులైన పాఠకులకు, వర్ధిష్ణువులైన రచయితలకు మీVAపకారం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి