ప్రపంచవ్యాప్తంగా ఈనాడు తులనాత్మక సాహిత్య అధ్యయనానికి అధిక ప్రాముఖ్యం ఉంది. స్థూలంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ భాషలలోని సాహిత్యాలను తులనాత్మకంగా పరిశీలించి తేల్చిన నూతన అంశాలను తులనాత్మక సాహిత్యం అనవచ్చు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అధిక ప్రాముఖ్యత ఉన్న సాహిత్యశాఖలలో తులనాత్మక సాహిత్య అధ్యయనశాఖ ఒకటి. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాహిత్యంలో కొత్తదనం కనిపిస్తుంది. దాదాపు అన్నిభాషా సాహిత్యాలలో వివిధ కాలాలలో పరిణామాలు కనిపిస్తూనే ఉంటాయి. భాషాసాహిత్యాలలో పరస్పర ప్రభావం ఉంటుంది. అట్లాంటి ప్రభావాన్ని పరిశీలించి సామ్యభేదాలు చూపడం తులనాత్మక పరిశీలనలో ఒక భాగంగా ఉంటుంది.
తులనాత్మక పరిశీలన వలననే ప్రాచీన సాహిత్యకాలం నుండి ఆధునిక సాహిత్యకాలం వరకు పరస్పరం ఎన్నో ప్రక్రియలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ సాహిత్యాల అభివృద్ధి, వికాసం వివిధ సాహిత్యాల పరస్పర ప్రభావంవల్లనే సాధ్యమవుతుంది. సాహిత్య వికాసంకాని, అభివృద్ధికాని భిన్న భాషాసాహిత్యాల తులనాత్మక పరిశీలనవలనే సాధ్యమవుతుంది. భాషలు వేరైనా ఆ భాషాసమాజంలోని వ్యక్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటికి ప్రతిస్పందించిన తీరులో పోలికలు ఉండవచ్చును. కాబట్టి ప్రపంచ భాషలలో ఏవైనా రెండు భాషాసాహిత్యాలను తులనాత్మకశాఖలో వివిధ కోణాలనుండి పరిశీలించవచ్చును.
సాధారణంగా తులనాత్మక అధ్యయనం ఒకేభాషకు చెందిన రెండు గ్రంథాలనుకాని లేక రెండు వేరు వేరు భాషలకు చెందిన గ్రంథాలనుకాని గ్రహించి తులనాత్మక అధ్యయనం చేయవచ్చు. అప్పుడాగ్రంధాలు ఏకకాలానికికాని, భిన్నకాలాలకుకాని చెంది ఉండవచ్చు. సాధారణంగా ఆ రచనలలో భేద-సాదృశ్యాలను పొలుస్తూ ప్రత్యేక అంశాలను ఎత్తిచూపడం జరుగుతుంది. ముఖ్యంగా తులనాత్మక అధ్యయనంలో రెండు రచనలలో వస్తుగతంగానూ, రచనానేపధ్య పరంగానూ లేదా ఏదో ఒక విలువను, ఒక సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని తులనాత్మక పరిశీలన సాగుతుంది.
ఒక సాహిత్యం ఆ సంస్కృతితో సంబంధం కలిగి ఉంటుంది. తులనాత్మక సాహిత్య పరిశీలనలో సాహిత్యాలతోపాటు సంస్కృతుల అధ్యయనం అవసరముంటుంది. తులనాత్మక అధ్యయనం చేసే సాహిత్య పిపాసకులకు ఆయా సాహిత్యాల పూర్వపరాలతో పాటు సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలలో పరిచయం అవసరం.
తులనాత్మక సాహిత్యం - నిర్వచనం
ఒక వస్తువును మరొక వస్తువుతోకాని ఒక విషయాన్ని మరొక విషయంతోకాని పోల్చి పరిశీలించటాన్ని తులనాత్మక పరిశీలన అనవచ్చు. దీనిని సాహిత్యానికి అన్వయిస్తే రెండు లేక అంతకంటే ఎక్కువ భాషలలోని సాహిత్యాలను పోల్చి పరిశీలించి చేసే అధ్యయనాన్ని తులనాత్మక సాహిత్యం అనవచ్చు. స్థూలంగా చెప్పాలంటే రెండు భాషలలోని సాహిత్యాలలో ఉన్నటువంటి విశిష్టాంశాల గుర్తింపే తులనాత్మక సాహిత్యం.
టిఎస్ ఎలియట్ అభిప్రాయంలో తులనాత్మక సాహిత్యం అంటే ‘పోల్చిచూడటం, విశ్లేషణ అనేవి విమర్శకునికి ముఖ్యమైన సాధనాలు. పోల్చిచూడటంలోని మెళుకువలు సాహిత్య విమర్శకుని విశ్లేషణ మÖల్యాంకన ప్రక్రియలో భాగమవుతాయి. అంటే ఒక రచనను అనుశీలించేటప్పుడు విమర్శకులు తరుచుగా అదేభాషలోని లేదా ఇతరభాష లోని అట్లాంటి రచనలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతారు’ అని అంటాడు.
ఠాగూర్ యొక్క అభిప్రాయంలో తులనాత్మక సాహిత్యం అంటే “విశ్వసాహిత్యం”. అసలు సాహిత్యం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదని చెప్పే ఠాగూర్ అభిప్రాయాన్ని ఆర్ ఎస్ పథక్ ఇట్లా వివరించాడు. ‘మానవులు నివసించే స్థలాలమొత్తం అనటం ఎట్లా సరికాదో సాహిత్యం అనేది కూడా కేవలం ఏ కొందరు వ్యక్తుల రచనల మొత్తం కాదు. కాని చాలామంది సాహిత్యాన్ని ఈ దృష్టితోనే చూస్తారు. ఇటువంటి సంకుచితమైన ప్రాంతీయ భావనను వదిలిపెట్టి సాహిత్యంపట్ల ఒక సమగ్రమైన దృష్టిని అలవరుచుకోవాలి. ఏ ఒక్కరి రచన అయినా విశ్వజనీనమైన మానవ మేధ యొక్క సృజనలోని భాగమే అని, ఆ విశ్వజనీనమైన సృజన ఆయా వ్యక్తులద్వారా విశ్వసాహిత్యంగా అభివ్యక్తమవుతుంది అని గ్రహించాలి. ఈ విషయాన్నే =S. PATHAఖ ఇలా వివరిస్తారు.
ఇంగ్లీషులో తులనాత్మక విమర్శకుడిగా వీATHజుఔ A=చీOLణ ని చెప్పుకోవచ్చు. ఈయన “ప్రతి విమర్శకుడు ఒక గొప్ప సాహిత్యానికి వారసుడై
ఉండాలి. దాన్ని అతడు చక్కగా అధ్యయనం చెయ్యాలి. దానితోపాటుగా మరొక సాహిత్యాన్ని గురించి కూడా తెలుసుకొని ఉండటం మంచిది” అని చెప్పాడు. ఈ విషయాన్నే =S. PATHAఖ ఇలా వివరిస్తారు.
=.ఖ. ణHAఔAచీ అభిప్రాయంలో తులనాత్మక సాహిత్యం అంటే “ఒక సాహిత్య గ్రంథాన్ని ఇంకొక సాహిత్య గ్రంధంతో పోల్చటం. అందుకు ఒకే ప్రక్రియకు చెందిన రెండు గ్రంథాలను గ్రహించి వాటిలోని నిర్మాణాన్నికాని, శైలినికాని తాత్విక దృష్టినికాని పోల్చి చూడవచ్చు. ప్రపంచంలోని ఏ రెండు భాషలలోని సాహిత్యాన్ని అయినా గ్రహించవచ్చు’ ఈ విషయాన్నే =.ఖ. ణHAఔAచీ ఇలా వివరిస్తారు.
రిమార్క్ అభిప్రాయంలో ‘తులనాత్మక సాహిత్యం ఏదో ఒక దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇది రెండు సమాజాలమధ్య సాహిత్యాల పరమైన సంబంధాన్ని మాత్రమే కాక విశ్వాసాలు, కళలు, తాత్విక చింతన, చరిత్ర, సామాజికాంశాలు, మతం మొదలైన రంగాలలో ఆ సమాజాల విజ్ఞానాన్ని కూడా తెలియచేసేది తులనాత్మక సాహిత్యం’ ఈ విషయాన్నే =S. PATHAఖ ఇలా వివరిస్తారు.
్పు. AచీAచీణA=AవీAవీ “ఉభయ సాహిత్యాలలోని విశిష్టాంశాలు క్రోడీకరించి ఏర్పర్చుకున్న సమిష్టి వినూత్న విమర్శ సూత్రల వ్యాఖ్యానమే తులనాత్మక సాహిత్యం’
భాషలు వేరైనా ఆ భాషాసమాజంలోని వ్యక్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటికి ప్రతిస్పందించిన తీరులలో పోలికలుండవచ్చును. కాబట్టి ప్రపంచభాషలలో ఏవేని రెండు భాషాసాహిత్యాలను తులనాత్మక అధ్యయనంలో వివిధ కోణాలనుండి పరిశీలించవచ్చును.
డా. నాగేంద్ర గారి అభిప్రాయంలో ‘తులనాత్మక సాహిత్యం అనేది భిన్న జాతులకు సంబంధించిన విభిన్న సాహిత్యాల అధ్యయనం”
ప్రొ. పొగెనెట్ అభిప్రాయంలో ‘ఒక రచయిత యొక్క రచనలోని వినూత్న అంశాలను వెలికితీని ఆ రచయితను ఆశ్చర్యపరిచే అంశమే తులనాత్మక సాహిత్యంలోని ప్రధానాంశం’
తులనాత్మక సాహిత్య పరిధి ఆయా సాహిత్యాలలోని వివిధ అంశాలను పరిశీలించటంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఒక సాహిత్య సృష్టికి లేక రూపకల్పనకు ఆ సాహిత్యం అనేక విషయాల సమ్మేళనంగా ఉంటుంది. తులనాత్మక సాహిత్యానికి ఒక నిర్దిష్టమైన సిద్ధాంతం లేకపోయినా నిర్దిష్ట అధ్యయన పద్ధతులున్నాయి.
తులనాత్మక సాహిత్యాన్ని నిర్వచించటం కొంత కష్టసాధ్యమైనపనే! ఎందుచేతనంటే తులనాత్మకత ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా అన్న విషయపరిజ్ఞాన సముపార్జన అంత తేలికకాదు. Sష్ట్రakవsజూవaతీ అర్థం కావాలంటే మనకు Sశీజూష్ట్రacశ్రీవs, జుuతీఱజూఱdవs లాంటి మహానుభావుల గ్రీకు సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసి ఉంటుంది.
అనేక విధాలుగా తులనాత్మక సాహిత్యం గురించి ప్రాచ్య, పాశ్చాత్య పండితులు దీనిని ఒక అధ్యయనంగా రూపొందించుటకు అనేక కోణాలనుండి పరిశోధనలు చేస్తున్నారు.
(ఱఱ). తులనాత్మక సాహిత్యం - చారిత్రక నేపథ్యం
ప్రపంచ సాహిత్యంలో తులనాత్మక పరిశీలన మొట్టమొదట 1816 లో ప్రారంభమైనది. నేడు విశ్వవ్యాప్తంగా వివిధ దేశాలలో తులనాత్మక సాహిత్య అధ్యయనం ప్రపంచ సాహిత్యంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఒక ప్రత్యేక అధ్యయన క్షేత్రంగా ప్రాధాన్యత పొందుతున్నది.
ఎస్ ఎస్. ప్రవార్ 1973 లో లండన్‌లో ప్రచురింపబడిన తన ్పుశీఎజూaతీatఱఙవ శ్రీఱtవతీaతీy Studఱవs: Aఅ Iఅtతీశీductఱశీఅ అన్న పు స్తకంలో “1816 లో ప్రపంచ సాహిత్యంలో తులనాత్మక సాహిత్య పరిశీలన ప్రారంభమైనది. ఇది ఒక ప్రత్యేక అధ్యయన క్షేత్రంగా రాణించగలదు’ అన్న అభిప్రాయం వ్యక్తంచేసాడు.
1821 లో అంపేర్ అనే జర్మన్ సాహిత్య విమర్శకుడు హిస్టారిక్ ఆఫ్ కంపేరి (Hఱstశీతీఱc శీf cశీఎజూaతీవవ) అనే మాటను మొదటిసారిగా వాడటం జరిగింది. తరువాత 1829 లో ఫ్రెంచిలో వాలెమన్ (VALLజువీAచీ) అనే రచయిత “లిటరేచర్ కంపేరి (శ్రీఱtవతీatuతీవ cశీఎజూaతీవవ) అనే మాటను సాహిత్యరంగంలో ప్రయోగించిన మొదటివాడు. ఈ పదాన్ని మొదటగా ఫ్రెంచివారు ఎక్కువగా ఆదరించారు. ఫ్రెంచి రచయిత ఫ్రెజర్ (ఖీ=జ్గుO=) తన ‘గోల్డెన్ బో’ (GOLణజుచీ దీOఔ) అనే గ్రంథంలో ప్రపంచ పురాణగాథలను సమీక్షించాడు. ఇందులో భాగంగానే ‘రివ్యూ డి లిటరేచర్ కంపేరి’ (=వఙuవ ణవ శ్రీఱtవతీatuతీవ cశీఎజూaతీవవ) అనే ఫ్రెంచి పత్రికను ప్యారిస్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించాడు. ఆ తరువాత వచ్చినటువంటి ‘హర్వార్డ’ (HA=VA=ణ) ‘యాలే’ (YALజు), ‘ప్రిన్సిటన’ (P=Iచ్పుీజుTOచీ) ‘చికాగో’ (్పుHI్పుAGO), ‘బోస్టక’(దీOSTAచీ) ‘ఫిలడెల్ఫియా (PHILAణజుLPHIA) లాంటి విశ్వవిద్యాలయాలు తులనాత్మక సాహిత్యాన్ని ఒక అధ్యయన క్షేత్రంగా ప్రారంభించాయి.
1848 లో ఇంగ్లీషులో మాథ్యూ ఆర్నాల్డ్ (వీATHజుఔ A=చీOLణ) తులనాత్మక సాహిత్యం అనేపదాన్ని ప్రయోగించటం జరిగింది. సాహిత్య బోధనలో శాస్త్రీయతకోసం అన్వేషిస్తూ అర్నాల్డ్ ఆ స్ఫూర్తి తోనే ‘కంపేరెటివ్ లిటరేచర్ (cశీఎజూaతీatఱఙవ శ్రీఱtవతీatuతీవ) అనే మాటను వాడినాడు. అంటే సాహిత్యానికి సంబంధించిన శాస్త్రీయతకు మరో పేరుగానే ్పుశీఎజూaతీatఱఙవ Lఱtవతీatuతీవ అనే అర్నాల్డ్ ఉద్దేశం. అదే విధంగానే అతని పదప్రయోగం జరిగింది.
19 వ శతాబ్దంలో అర్నాల్డ్ వాడిన cశీఎజూaతీatఱఙవ శ్రీఱtవతీatuతీవ అనే పదం ఆంగ్లసాహిత్యంలో పెద్ద దుమారం రేపింది. cశీఎజూaతీatఱఙవ శ్రీఱtవతీatuతీవ ను వ్యతిరేకించినవారు లేవనెత్తిన అంశాలు :
1. ప్రపంచంలో ఏ వ్యక్తి cశీఎజూaతీatఱఙవ దృష్టితో శ్రీఱtవతీatuతీవ ని సృష్టించడు.
2. ప్రతి రచనకు ఒక ప్రత్యేకమైన విశిష్టత స్వయం ప్రతిపత్తి ఉంటాయి. ప్రతి రచనను ప్రత్యేక రచనగానే పరిగణించాలి, పరిశీలించాలి. కాని దానిని మరో దానితో పోల్చటం (cశీఎజూaతీవ) చేసి చూడటం అనేది అశాస్త్రీయమైన విషయం.
3. సాహిత్యం అంటే ఏదైనా ఒక భాషలో వెలువడ్డ ఒక సృజనాత్మక రచన అని అర్థం. ఒక సృజనాత్మక రచనపై, సృజనాత్మకంగా రాసిన మరో రచన కూడా సాహిత్యం కావచ్చు. సాహిత్య లక్షణాన్ని ప్రధానంగా నిర్దేశించేవి భాష, సృజనాత్మకత. ఈ రెండింటితో సంబంధం లేకుండా cశీఎజూaతీatఱఙవ శ్రీఱtవతీatuతీవ ఎలా వస్తుంది? కనుక ఈ ప్రతివాదన అతార్కికమైనది.
ఈ విధంగా ఆంగ్లసాహిత్యంలోని కొందరు విమర్శకులు దీన్ని తుర్పారబట్టారు. అయినప్పటికీ ఆ తరువాత వచ్చిన పండిత విమర్శకులు దీన్ని బాగా ఆదరించారు.
1848 లో మొట్టమొదటిసారిగా ఆంగ్లసాహిత్యలోకంలో cశీఎజూaతీatఱఙవ శ్రీఱtవతీatuతీవ అన్న మాటను అర్నాల్డ్ ఉపయోగిస్తే దీన్ని ఒక అధ్యయన క్షేత్రంగా గుర్తింపు తీసుకురావటానికి కృషి చేసినవాడు H.వీ. POSచీATTజు. 1886 లో ఈయన తన పుస్తకానికి cశీఎజూaతీatఱఙవ శ్రీఱtవతీatuతీవ అనే పేరు పెట్టి ఆ మాటను బహుళ ప్రచారంలోకి తెచ్చాడు. తరువాత H.వీ. POSచీATTజు 1901 లో కంటెంపరరీ రివ్యూ (cశీఅtవఎజూశీతీaతీy =వఙఱవw) అనే పత్రిక 79 వ సంచికలో ‘ది సైన్స్ ఆఫ్ కంపారేటివ్ (Tష్ట్రవ Scఱవఅcవ శీf ్పుశీఎజూaతీatఱఙవ) అనే వ్యాసాన్ని ప్రచురించి ఈ కొత్త అధ్యయనానికి శాస్త్రీయతను, స్పష్టతను సమకూర్చిపెట్టాడు.
మధ్యయుగాన ఇంగ్లీషులో మొట్టమొదటి సారిగా ్పుశీఎజూaతీatఱఙవ శ్రీఱtవతీatuతీవ అన్న పదం లాటిన్ లోని ్పుశీఎజూaతీatఱఙవ పదం నుండి నిష్పన్నమైనది. ఈ విధంగా ్పుశీఎజూaతీatఱఙవ శ్రీఱtవతీatuతీవ అనేది విశ్వ వ్యాప్తంగా వివిధ రూపాలలో వికాసం పొందుతూ స్థిరరూపం సంతరించుకున్నది.
(ఱఱఱ). తులనాత్మక సాహిత్యం - బహుభాషా ప్రాంతం
భారతదేశంలో తులనాత్మక సాహిత్యానికి ఒక గొప్ప అవకాశం ఉంది. భారతదేశం భిన్నభాషాసాహిత్యాలకు మÖలం. వివిధములైన భాషా ప్రాంతాలుగల భారతదేశంలో వస్తున్నటువంటి సాహిత్యం భిన్నమైనదిగా
ఉంటుంది. వాటిలోని భేద సాదృశ్యాలను చెప్పటంలో తులనాత్మక సాహిత్య ఆవశ్యకత మెండు. భిన్న జాతులు, భిన్న సంస్కృతుల మధ్యగల సంబంధ భాందవ్యాలు పెరిగి ఒక ప్రాంత భాషాసాహిత్యం మరోప్రాంత భాషాసాహిత్యానికి ప్రేరణగా మారొచ్చు.
భారతదేశం భిన్న సంస్కృతులకు, భిన్న సాహిత్యాలకు ఆలవాలం. ప్రాచీనకాలంలో భారతీయ సాహిత్యం ఎక్కువగా సంస్కృత ప్రభావంతో సాగినట్లే, ఆధునిక కాలంలో సాహిత్యం అంతా ఎక్కువగా ఇంగ్లీషు సాహిత్య ప్రభావంతో సాగుతున్నదని చెప్పవచ్చు.
1989 లో నిర్మలా జైన్ ప్రచురించిన తన పుస్తకమైన ‘కంపారేటివ్ లిటరేచర్ : ది ఇండియన్ కాంటెక్ట్స’ అన్న పుస్తకంలో ఇలా అన్నాడు. ‘ఏదో ఒక భాషను కాని ఏదో ఒక సాహిత్యాన్ని కాని, భారతీయత అనే ముద్రతో సంభావించలేము, ఎంతో కొంత సంస్కృతం మాత్రమే అచ్చమైౖన భారతీయతకు ప్రాతినిధ్యం వహిస్తుందనుకోవాలి’. అని భారతీయ భాషాసాహిత్యాలలో సంస్కృత ప్రభావం అనివార్యమని చెప్పాడు.
1972 లో సిసిర్ కుమార్‌దాస్ తన ‘లిటరేచర్ ఎ హిస్టారికల్ పెర్స్‌పెక్టివ’ అన్న వ్యాసంలో ‘పారశీక భాష ప్రభావం భారతీయ భాషలలో అక్కడక్కడ కనిపించిన కొంకణి భాషపై మాత్రం అధిక ప్రభావం కలిగిఉంది’ అని అన్నారు.
మన భారతీయ భాషలలో ఇతర భాషల ప్రభావం ఉంటుంది. పారశీక అరబ్బీ భాషల ప్రభావం ఉందని చెప్పటానికి శ్రీనాథుడు తన ‘హరవిలాసం’ లో ‘కుశిమీరన్ సురధారణ నిండుకొలువై కూర్చున్నచో.’ అని ప్రయోగించాడు.
ఈనాడు మన భారతీయ భాషా సాహిత్యాలన్నింటిలో ఇంగ్లీషు ప్రభావం ఉంది. ఇండో- ఇంగ్లీషు భాషాసాహిత్యాలుగా ప్రత్యేక రూపాన్ని సంతరించు కుంటున్నాయి. తులనాత్మక సాహిత్య పరిశీలన కొన్ని భారతీయ భాషాసాహిత్యాల మధ్య జరుగుతున్నప్పటికి ఎక్కువగా ఇండో- ఇంగ్లీషు సమ్మేళనంలోనే జరుగుతున్నవని చెప్పవచ్చు.
మన భారతదేశంలో తులనాత్మక అధ్యయనశాఖ మొదటి ప్రపంచయుద్ధం తరువాత ప్రారంభం అయ్యిందని చెప్పవచ్చు. దీని వెనుకున్న అనేక కారణాలలో ప్రధానంగా చెప్పుకోవలసింది ఆనాటి మానవ సంస్కృతి వికాసం, సాహిత్యాభివృద్ధి ప్రధానం. తెలుగుభాష సాహిత్యంలో తులనాత్మక పరిశీలన ఖచ్చితంగా ఎక్కడ ప్రారంభమైనదో చెప్పలేం. ఆచార్య దివాకర్ల వెంకటావధానిగారు నన్నయ్యపై ‘కాళిదాసు’ ప్రభావాన్ని పరిశీలించారని మొదటిసారిగా తెలుస్తుంది. తెలుగులో సంప్రదాయ సాహిత్యంపై జరిగిన పరిశోధనలు అన్నీ సంస్కృత సాహిత్యంలో తులనాత్మక పరిశీలనలోనే జరిగాయి. కొత్తపల్లి వీరభద్రరావుగారు ఆంధ్ర - ఆంగ్లభాషలను తులనాత్మకంగా పరిశీలించిన వారిలో ప్రథములు. “తెలుగు సాహిత్యంపై - ఆంగ్ల ప్రభావం” అన్నది వారి తులనాత్మక దృష్టికి నిదర్శనం. ఈ విధంగా భారతీయ భాషలన్నింటిలో తులనాత్మక సాహిత్యం ఎంతో జరుగుతుంది.
తులనాత్మక సాహిత్యం - అధ్యయనంలోని అంశాలు
తులనాత్మక సాహిత్య అధ్యయనంలో ప్రధానమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని నాలుగు ప్రధాన విభాగాలుగా చేసి నేడు తులనాత్మక సాహిత్య అధ్యయనం జరుగుతుంది.
సాంస్కృతిక మొదటి విభాగంలో ప్రేరణ, స్వరూపం అను రెండు పద్ధతులవల్ల తులనాత్మక సాహిత్య అధ్యయనం సాగుతుంది. అంటే ఒక రచన మరో రచనకు ఏవిధంగా కారణమైతుందో ఏఏ అంశాల ప్రేరణ ఒక రచనకు మÖలమవుతుందో తెలుస్తుంది.
అట్లాగే ‘స్వరూపం’ కేవలం ఒక రచన యొక్క స్వరూపం ను మాత్రమే స్వీకరించి అట్లాగే ఆ రచనను తలపించే విధంగా రచనసాగితే అది ఎట్లా? ఎందువల్ల? అన్న విషయాలు తులనాత్మక సాహిత్య అధ్యయనంలో ప్రధానాంశాలుగా పరిశీలన సాగుతుంది.
రెండవ విభాగంలో ట్రెండ్ (ధోరణి) మÖవ్‌మెంట్ (గమనము) తులనాత్మక అధ్యయనంలో ఈ రెండు ప్రధానాంశాలు. ఒక రచనా ధోరణి, గమనము మరో రచనా ధోరణి గమనములతో పోలికలు ఉంటాయి. అంటే ఆయాకాలాలలో వస్తున్నటువంటి ట్రెండ్, మోమెంట్స్ ఆయా రచనలపై ప్రభావం కలిగి వుంటాయి. వివిధ రచనలలో ఉంటున్న ఈ అంశాలను అధ్యయనం చేయటం తులనాత్మక సాహిత్య క్షేత్రంలో ప్రధానంగా ఉంటాయి.
ఇంగ్లాండు దేశంలో వచ్చినటువంటి ‘రెనేసాన్స’ సాంస్కృతిక పునరుజ్జీవనం దాదాపు ప్రపంచం అంతా ఒక నూతన ధోరణిగా ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం వ్యాపించింది. అట్లాగే ‘రొమాంటిసిజమ’, ‘కాల్పనికవాదం’ (రియలిసమ్) ‘వాస్తవికవాదం’ లాంటి ధోరణలు తులనాత్మక అధ్యయన క్షేత్రంలోనే పరిశీలించవచ్చు. పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల అనేక నూతన ధోరణలు, గమనాలు మన సాహిత్యాలలో కనిపిస్తాయి.
మÖడవ విభాగంలో లిటరరీ జన్‌రస్ పద్ధతులు ఈ సాహిత్య పరిధిలో పరిశీలించే అంశాలు. ఎటువంటి రచన రూపకల్పనకైనా కొన్ని పద్ధతులుంటాయి. అట్లాంటి పద్ధతుల పరిశీలన ఇందులోని భాగం.
చివరి విభాగంలో ‘మోటివ్స’ హేతువులు, థీమ్, విషయం, అంశాలపై తులనాత్మక సాహిత్య అధ్యయనం సాగుతుంది. మోటివ్స్, థీమ్స్ ఈ రెండూ విషయ ప్రాధాన్యతను తెలుపుతూ హేతువులను అన్వేషిస్తాయి. ప్రస్తుతం నా పరిశోధనాంశం మొదటి విభాగంలోకి వస్తుంది. కందుకూరి విరేశలింగంగారి ‘సత్యరాజా పూర్వదేశయాత్రలు’ ‘జొనాథన్ స్విఫ్ట్ గలివరు ట్రావెల్స’ కు అనువాదం కాదు. కందుకూరి వీరేశలింగం గలివరు ట్రావెల్స్ రచనకు ప్రేరణ పొంది ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ రచించాడు. ఇది కేవలం స్వరూపం మరియు ఆకృతికి సంబంధించినది. కథలను యధాతంగా స్వీకరించలేదు. మన సమాజానికి అనుగుణమైన కథలనే చెప్పటం జరిగింది. నిర్వహణలో మాత్రమే జొనాథన్ స్విఫ్ట్‌ను అనుసరించటం జరిగింది. ఈ రెండు రచనలు ఆయా సమాజాలకు ప్రతిబింబాలు. ఈ రెండు రచనల ఫ్రేమ్ (చట్రము) ఒక్కటే. కాని అందులో కూర్చిన విషయం మాత్రం ఆయా సమాజాలకు అనుకూలమైనదిగా కొనసాగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి