తులనాత్మక సాహిత్యంలో పరిశోధన చేయవలసిన పరిశోధకుడికి ఏ రెండు సాహిత్యాలపైనైనా అవగాహణ ఉండాలి. అట్లుకాకున్నా ఒకే భాషాసాహిత్యంలోనైనా సరే ఒకే అంశాన్ని నిర్వహించుటలో సాహిత్యం భిన్నాభిప్రాయంతో భిన్నకోణాల్లో వెలువడినప్పుడు ఆ భిన్నత్వం ఎందుకు? ఎట్లా? ఎక్కడ? అన్న విషయాలను విశ్లేషిస్తూ కూడ అందులోని సామ్యాన్ని తులనాత్మకంగా పోల్చి చెప్పవచ్చు. అంటే ఉభయ సాహిత్యాలలోని విశిష్టాంశాలు క్రోడీకరించి చెప్పటం.
ఆంగ్ల, తెలుగుసాహిత్యాలతో కాస్త పరిచయం ఉన్నటువంటి నన్ను తులనాత్మక సాహిత్య అధ్యయన విభాగంలో చేరటం మంచిదని సూచించి అనేక అంశాలు నాతో ప్రస్తావించి చివరికి జొనాధన్ స్విఫ్ట్ ‘గలివర్ ట్రావెల్స’ ను తెలుగులోని కందుకూరి ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ అను రచనను తులనాత్మకంగా పరిశీలించమని తెలియజెప్పి నన్ను ముందుకు నడిపించారు ‘గురూజీ’ ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు. యం. ఏ., ఆంగ్లసాహిత్యం చదివేటప్పుడే ‘గలివర్ ట్రావెల్స’ కథాంశం నాకు సుపరిచతమే. అందుకే ఈ పరిశోధన అంతకష్టంగా జరగలేదు.
‘గలివర్ ట్రావెల్స’ కు అనువాదంగా ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ చెప్పుకుంటారు. కాని ఇది యదాథతంగా కథానువాదం కాదు. కేవలం
Stతీuctuతీవ aఅd fతీaఎవ మాత్రమే గ్రహించి రచించిన రచన. కథల రూపకల్పనలో ఇద్దరు వైవిద్యమైన కథలనే ఎన్నుకున్నారు.
‘గలివర్ ట్రావెల్స్ ‘ లోని నాలుగు భాగాలలో చెప్పిన నాలుగు కథలు నాటి ఇంగ్లాండు దేశంలో ఉన్నటువంటి సమస్యలకు దర్పణాలు. మొదటిభాగంలో రాజకీయాలలో పెరుగుతున్న అవినీతిని తెలియజేస్తూ, రెండవభాగంలో నాటి సమాజంలో పెరుగుతున్న అన్యాయాలను తెలియజేస్తూ కథ నడుస్తుంది. మÖడవ భాగంలో మితిమీరిన శాస్త్రపరిజ్ఞానంతో మనిషి మనుగడకు కలిగే ముప్పును తెలియజేస్తూ, నాలుగో భాగంలో ఉత్తమమైన జీవితం ఎట్లా ఉంటుందో మంచి చెడులను పోల్చుతూ కథ నడుస్తుంది.
‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ లోని రెండు భాగాలలో చెప్పిన రెండు కథలు ఆనాటి మన సమాజంలోని రెండు ప్రధాన సమస్యలకు దర్పణం. మొదటిభాగంలో స్త్రీ సమస్యలను తెలియజేస్తూ పురుషాధిక్య సమాజానికి విరుద్ధంగా స్త్రీఆధిక్య సమాజం కల్పించి పురుషులకు గుణపాఠంగా ఈ కథ నడుస్తుంది. రెండవభాగంలో జ్యోతిశ్శాస్త్రం మీద జనులకు గల మÖఢవిశ్వాసాన్ని తెలియజేస్తూ ప్రజలను మేల్కొలిపే ఉద్దేశంతో ఈ కథ నడుస్తుంది.
పై వివరణ ద్వారా ఈ రెండు రచనలలో రచయితలు ఆయా దేశాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారీరచనలు చేశారు. కాని ‘గలివర్ ట్రావెల్స’ కు ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ అనువాదం కాదు. ఇది కేవలం రచనా నిర్మాణంలో మాత్రమే అనుకరణగా ఉంది. ఈ రెండు రచనలు సంఘసంస్కరణ కొరకే రచింపబడ్డాయి.
మరోవిషయం ‘యాత్రచరిత్ర ‘లు రెండు రకాలుగా చెప్పుకుంటారు. ఒకటి వ్యక్తి యొక్క వాస్తవ యాత్రానుభవం. రెండు కల్పించి యాత్ర చేస్తున్నట్లు చెప్పటం. ఈ ప్రక్రియల ముఖ్యఉద్దేశం రచయిత చూసింది, చూసినది అనుభవయోగ్యమై ఆ అనుభవాల్ని భద్రపరుస్తూ పాఠకలోకానికి ప్రయోజనకరంగా రూపొందించటమే. కాని నా పరిశోధాంశంలోని రెండురచనలు కల్పితయాత్ర చరిత్రలే.
రచయితలు ఇద్దరు కూడ తమ తమ రచనలలో వారి ఈ రచనలు రెండూ యాత్ర చరిత్రలుగానే చెప్పుకున్నారు. నాడు యాత్ర చరిత్ర ప్రక్రియకు ఎక్కువ ఆదŠరణ లభించింది కనుకనే తాను ఈ ప్రక్రియ ద్వారానే ‘గలివర్ ట్రావెల్స’ రాశానని జొనాథన్ స్విఫ్ట్ చెప్పుకున్నాడు.
ఈ రచనలలో ఇద్దరు రచయితలు సంఘసంస్కరణ కొరకు చూయించిన తెగువ, ఆరాటం మనకు రచనంతా కనిపిస్తుంది. ఆయా సమాజంలో
ఉన్నటువంటి దురాచారాలను నిర్మూలించటానికి వీరిద్దరు ప్రతి అక్షరాన్ని ఎక్కుపెట్టిన తీరు శ్లాఘనీయం. ‘గలివర్ ట్రావెల్స’ లో జొనాథన్ స్విఫ్ట్ నాటి సమాజంలోని ప్రతి సమస్యను ఎంత క్షుణ్ణంగా పరిశీలించాడో తెలుస్తుంది. ఆయన అన్నిచోట్ల ఉన్నటువంటి లొసుగులను ప్రజలకు ఎంతో స్పష్టంగా తెలి యజెప్పాడు. అట్లాగే కందుకూరి ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ ద్వారా నాటి మన సమాజంలోని దురాచారాలను తెలుసుకొని వాటివల్ల జరిగే అనర్ధాలను ప్రజలకు తెలియజెప్పటానికి ఎంతో ప్రయత్నించాడు. ఈ విధంగా రెండు రచనలు సంఘసంస్కరణకు, లోకకళ్యాణానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
ఈ పరిశోధనలో మొత్తం ఐదు ప్రధాన అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో తులనాత్మక సాహిత్యం గురించి వివరించాను. తులనాత్మక సాహిత్య అధ్యయన క్షేత్రంలోకి ఏఏ విషయాలు వస్తాయో చెప్తూ తులనాత్మక సాహిత్య అధ్యయన పరిధిని, చారిత్రక నేపథ్యాన్ని వివిధ నిర్వచనాలలో వివరించటానికి ప్రయత్నించాను.
రెండవ అధ్యాయంలో రచయితలిద్దరి జీవితాలను తెలుపుతూ వారు సాహిత్యరంగానికి చేసిన కృషిని చెప్పాను. ముఖ్యంగా వీరిద్దరు వారి వారి సమాజాలను ఉద్దరించటానికి చేసిన ప్రయత్నం ఇందులో ప్రధానాంశంగా చెప్పాను.
మÖడవ అధ్యాయంలో రచనలను స్థూలంగా పరిచయం చేశాను. ‘గలివర్ ట్రావెల్స’ లోని నాలుగు భాగాలలో చెప్పిన నాలుగు కథలను ‘సత్యరాజా పూర్వదేశ యాత్రలు’ లోని రెండుభాగాలలో చెప్పిన రెండు కథలను సూక్ష్మంగా చెప్పాను.
నాల్గవ అధ్యాయంలో ఇతివృత్తాల నిర్వహణలో రెండు రచనలను తులనాత్మకంగా పరిశీలన చేశాను. ఐదవ అధ్యాయంలో ఈ ఇద్దరి రచయితలు వారి రచనలలో నిర్వహించిన వ్యంగ్యాన్ని, దానితోపాటు హాస్యాన్ని ఏ విధంగా పండించారో తెలియజేశాను. ఈ విధంగా నా పరిశోధన ఐదు అధ్యాయాలతో ముగుస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి