మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, అక్టోబర్ 2026, శనివారం

నిత్యజీవితంలో స్వధర్మాచరణము

దూర దృశ్య శ్రవణ యంత్ర పరికరం వాడుక లోకి వచ్చిన తర్వాత  మొత్తం ప్రపంచం  మన అర చేతిలో వచ్చినట్లుగా అనిపించింది. ఇదొక గొప్ప విప్లవం! ఈ పరికరం లోని అంతర్భాగమైన వాట్సప్ ద్వారా కొన్ని సందేశాలను మన బంధుమిత్రులకు పంపేవాళ్ళం. మరీ ముఖ్యంగా కరోనా కరాళ నృత్యం చేస్తూ మనందరినీ గృహ నిర్బంధంలో బంధించిన సమయాన బంధు మిత్రులతో ఫోన్ లోనే మాట్లాడుతూ సందేశాలను ఆశీస్సులను, అభినందనలను పంచుకునేవాళ్ళం.

ఆ సమయంలో మొదలైన ఈ రచన, క్రమంగా ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళింది. మన దేశ  అత్యున్నత సంస్కృతి సభ్యతలను సంప్రదాయాలను, ఆధ్యాత్మిక చింతనా విశిష్టతను మన నవతరమైన యువతరానికి తెలియజేయమని చాలా మంది  విజ్ఞప్తి చేశారు.

 ఆ విజ్ఞప్తికి సాకారం కల్పించేందుకు చేసిన ప్రయత్న ఫల స్వరూపమే ఈ వ్యాస మందార మంజరి. అనుబంధ చతుష్టయ నియమాల ప్రకారం మొదట ఈ వ్యాసాలకు “అధికారి”- ఎవరంటే  సనాతన ధర్మ విలువలను తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ అధికారే.వారికి ఒక ప్రాథమిక అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నమే ఈ రచనలు.

రెండవది ఈ వ్యాస కదంబంలో చర్చించిన “విషయము”- మన సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని తెలియజేయడం. అపూర్వమైన  భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని  కాపాడుకోవాల్సిన అవసరం, భాద్యత నవ యువతరానిదేనని వక్కాణించి చెప్పడం.

మÖడవది సంబంధం.. ఇక్కడ ప్రస్తావించిన అంశాలన్నీ శృతులు,  స్మృతులు, పురాణాలు, ఇతిహాసాల నుండి గ్రహించినవే. ఇందులోని విషయాలు ఆత్మ జ్ఞానానికి సంబంధించినవే.

నాల్గవది ప్రయోజనం. ఈ వ్యాసాలను చదివి తమ నిత్య జీవితంలో సనాతన ధర్మాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించ గలిగితే వ్యాస ప్రయోజనం నెరవేరిందని, నా ఈ కృషి ఫలించిందని భావిస్తాను.

ఈ వ్యాస మందారానికి  తమ అమÖల్యమైన  అభిప్రాయ మకరందాన్ని  అద్దిన కవి పండిత వరిష్ఠులు, రచయిత, పరిశోధకులు, విమర్శకులు, అమృత హృదయులు, సభా సామ్రాట్ శ్రీమాన్ రంగాచార్యులు గారికి నమస్సుమాంజలి.

ఈ గ్రంథానికి ఆశీస్సులందించిన పూజ్యులు మా పినతండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు. నాపై అక్షరాభిమానం కురిపించిన మా కుటుంబసభ్యులందరికీ  ప్రేమపూర్వక ఆశీస్సులు.

నా రచనలు వాట్సప్ లో వుంటే వాటికొక పుస్తక రూపం ఇవ్వడం కొరకు ఎంతో శ్రమించిన అశోక్‌బాబుకు మనఃపూర్వక ధన్యవాదాలు. వారు శ్రధ్ధతో అక్షర దోషాలను సవరించి ఈ వ్యాస మందారాన్ని సింధూర వర్ణ రంజితంగా చేసారు. వారికి  శ్రీ సాయి అనుగ్రహ ఆశీర్వాదాలు  లభించాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి