“నవ్వడం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం” అన్నారు పెద్దవారు.
నిజమే, నవరసాల్లోనూ హాస్యం గొప్పది. శృంగారం మనిషిని ఆనందింపజేస్తుంది. కానీ, హాస్యం అట్లాకాదు. జ్ఞాపకం చేసుకున్నప్ప్పుడల్లా నవ్వుకునేలాగా రంజింపజేస్తూనే ఉంటుంది. తెలుగులో అరుదైన ఈ హాస్యరసాన్ని పండించిన సాహిత్యకారులు, కళాకారులు పరిమితంగానే వున్నా వారి ప్రభావం మన గుండెల విÖద ఇంకా బలంగానే వుందనేది వాస్తవం. తెలుగు సినిమాలను తలచుకోగానే మనకు నవ్వును తెప్పించే హాస్యనటుల్లో పద్మనాభం ఒకరు.
ఆయన కమెడియన్! కామెడీ హీరో! అతను క్యారెక్టర్ ఆర్టిస్టు, కామెడీవిలన్... నిర్మాత, దర్శకుడు, గాయకుడు ఇలా బహుముఖలుగా భేషనిపించుకున్న అరుదైన నటుడు పద్మనాభం. తన 60 సంవత్సరాల నటజీవితంలో ఏకధాటిగా అనేక సంవత్సరాలుగా హాస్యప్రధాన పాత్రలే పోషించి మెప్పించిన పద్మనాభం.... తన నట ప్రస్థానం గురించి చెప్ప్పుకున్న కాసిన్ని కబుర్లివి....
నా పూర్తిపేరు బసవరాజు వెంకట పద్మనాభరావు! నేను రాయలసీమకు చెందినవాణ్ణి. కడపజిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం మా స్వగ్రామం. నేను ఆగష్టు20 1931లో పుట్టానున కరణం బసవరాజు వెంకట శేషయ్యగారు మానాన్న గారు మాఅమ్మ శాంతమ్మ. మానాన్న మావూరి కరణంగా పనిచేసేవారు ఆయనకు నాటకాలంటే మహాయిష్టం. ఏవో వేషాలు కూడా వేసేవాడు. అలాగే మాఅవ్వ సుబ్బమ్మ ఆమె బాబా భక్తురాలు మంచి గాయకురాలుకూడా అలా నాన్న నుండి నటన, అవ్వ నుండి పాట రెండూ నాకు అబ్బాయి చిన్నప్ప్పుడు చదువు విÖద ధ్యాస వుండేదికాదు. ఎంతసేసు పాటలూ, పద్యాలు ఇదీ నా కాలక్షేపం. ఆరోజుల్లో వేమÖరి గగ్గయ్య పాటలు పద్యాలు నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆయనను ఎక్కువగా అనుకరించేవాడిని. అలా సింహాద్రిపురంలో అతి కష్టం విÖద ఐదోతరగతి గట్టెక్కాను మా ఊళ్లో సినిమా టెంటు వచ్చాక అందులో కామెడీ సీన్లను అనుకరించి వూరివాళ్లముందు ప్రదర్శించడం, స్కూల్లో పాటల్లో ఫస్ట్‌ప్రైజ్‌లు పొందడం, మిమిక్రీ వంటివి నా నటనకు గట్టి పునాదులు వేశాయి. నా మÖడో ఏటనే ‘కోరి భజింతును గోవిందుని మది నారదముని ముఖన” అంటూ కపిలవాయి రామనాథశాస్త్రి పాడిన పాటను పాడేవాన్ని. మావూళ్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ చెన్నకేవనాయుడు ప్రోత్సాహంతో నా ఆరేళ్ల వయస్సులోనే (1937) చింతామణి నాటకంలో బాలకృష్ణుడుగా నటించారు. అదే నా తొలి రంగస్థల అనుభవం.
1943లో ఫస్టుఫారం చదువుకోసం నేను నా ఈడువాడే అయిన మా బాబాయ్ సుదర్శనరావు ఇద్దరం ప్రొద్దుటూరు వచ్చాం. స్కూల్లో చేరినా, మేవిద్దరం స్కూలుకెళ్లేదేలేదు, వారాలు చేసుకుంటూ సినిమాల వెంట తిరిగేవాళ్లం. మేము ప్రొద్దుటూరు స్కూల్లో చేరేనాటికి అక్కడ “కృష్ణప్రేమ” చిత్రం ఆడుతోంది. పి.శాంతకుమారి, సూర్యకుమారి, భానుమతి, అద్దంకి ప్రధానతారాగణంగా వున్న ఆ చిత్రంలోని ప్రతిపాట, మాట మాకు కంఠస్థమైపోయింది. చిత్తూరు వి.నాగయ్యగారి ‘భక్తపోతన’ సుమారు నలభైసార్లు చూశాం. నేనూ, మా సుదర్శనం కలిసి ఆ సినిమా పాటల్నే అందరి దగ్గరా పాడేవాళ్లం, ఒకనాడు మా ఇద్దరికీ సైకిల్ కొనుక్కోవాలనిపించింది. అసలు సైకిల్ కొనాలన్న కోరికే నా జీవితాన్ని మలుపు తిప్పింది.
సైకిల్ ఎలా కొనుక్కోవాలి? ఏమైతే అదే అయిందిలే అనుకుని బెంగుళూరు రైలెక్కాం. అక్కడ జనాలకు పాటలు వినిపించి డబ్బు సంపాదించాలని మా ఆలోచన. కానీ కన్నడ భాష వాళ్లది. దాంతో మా ప్రయత్నం నీరుగారిపోయింది. సరే తరిగీ మా వూరు వెళ్లిపోదామనుకున్నాం. అక్కడే స్టేషన్‌లో మాకు ఆంధ్రప్రభ దినపత్రిక కనబడింది. మద్రాసు వెలింగ్‌టన్ టాకీసులో “కృష్ణప్రేమ” 90వ రోజు అనే ప్రకటన నన్ను ఆకర్షించింది. మద్రాసులో వున్న ఆర్టిస్టుల్ని కలిసి, పాటలు పాడి వినిపించి, వాళ్లని ఇమిటేట్ చేసి మెప్పించి ఒకసైకిల్ కొనేయాలని మా కనిపించింది. వెంటనే ఎర్రగుంట్లలో మద్రాసు వెళ్లే రైలెక్కేసాం. చేతిలో టిక్కెట్టులేదు, జేబులో కాణీ లేదు. రైలులో పాటలు పాడుతుంటే తలా ఇంతిచ్చారు. టిక్కెట్టు కలెక్టరు వచ్చినపుడు బెర్తుల కింద దాక్కోమని సలహా ఇచ్చి మమ్మల్ని కాపాడారు. ఆ ప్రయాణీకులంతా. ఎట్టకేలకు ఏ బెడదా లేకుండా మద్రాసులో వచ్చి పడిపోయాం. ఇప్పుడేం చేయాలి అనే ప్రశ్న. “కన్నాంబ గారింటికి వెళదాం పద” అన్నాడు మా సుదర్శనం. మహానటి కన్నాంబ మా ఇద్దరికీ ఆరాధ్యదైవం. ఎందుకంటే మా ఏడవ ఏట “చండిక” చిత్రాన్ని పులివెందుల టూరింగ్‌టాకీస్‌లో చూశాం. అప్పటి నుండి మాకు ఆ వెంటేనే భక్తి, గౌరవం, ఆరాధన అన్నీనూ. “డూ యÖనో కన్నాంబాస్ హౌస్?” అని కనిపించిన ప్రతి వారినీ అడుగుతూ, వాళ్లేమి చెబితే అది విని నడుచుకుంటూ వెళ్లాం. కానీ ఎక్కడా ఆమె ఇల్లు మాత్రం మాకు దొరకలేదు. కానీ కొంతసేపు నడిచాక ‘జెమినీ స్టూడియో’ కన్పించింది. ప్రాణాలు లేచి వచ్చినట్లయింది మాకు. అక్కడ నానా తంటాలు పడి ఆమె విలాసం కనుకున్నాం. ఆమె ఇంటికెళ్లాం, ఆమె శాంతంగా పలకరించటంతో మా సైకిలు విషయం చెప్పాం. ఆమె దగ్గర మాకొచ్చిన ఆట, పాట అన్నీ ప్రదర్శించేసాం. “సుమంగళి” చిత్రంలోని ‘దయామయముగ నీ మది దేవా’ అనే చిత్తూరు నాగయ్య గారి పాట తకూడా వినిపించాం. ఆమె చాలా ముచ్చటపడి ఆ పూట భోజనం పెట్టింది. “కుర్రాడు బాగున్నాడు బాగా పాడుతున్నాడు చూడండి ఈ అబ్బాయిని?” అని ఆమె భర్త కడారు నాగభూషణం (శ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్ అధినేత)గారికి పరిచయం చేశారు. అప్పుడాయన “పాదుకాపట్టాభిషేకం” () తీస్తున్నారు. అలా రెండు నెలలు వారి ఆస్థానంలోనే ఉండిపోయాం. దాసరి కోటిరత్నం, కె.రఘురామయ్య, సి.ఎస్.ఆర్, అద్దంకి వంటి ఆర్టిస్టులందరూ నటిస్తున్నారా చిత్రంలో. అందరితో సరదాగా కాలం గడుపుతూ, ఓ పాట పాడే అవకాశం సంపాదించానందులో. గుహుడు పడవ దాటించే పాట అది.
“పడవెళ్లి పోతోంది వడివడిగా సాగి
పడవలోన ప్రభువు పదిలముగా సేరాలి
శ్రీరాములోరి వెంట సీతమ్మ కూర్చుండ,
తోడు లక్క్ష్మణ స్వామి నీడల్లె నిలుస్తున్నాడు -
హైలేసా హైలేసా హైలేసా ” అదీ ఆ పాట ఇంతకీ నేనా పాటలో పాడింది చివర అన్న ‘హైలేసా హైలేసా హైలేసా అనే ఊత పదాలే. అదీ నా తొలిఛాన్సు.
నాకు నీడనిచ్చి, తిండిపెట్టి, ఆపదలో ఆదుకుని ఇంతవాణ్ణి రావడానికి కన్నాంబ గారే కారకురాలు. ఆవిడకు నేను జీవితాంతం ఋణపడి వుండాలి, వుంటాను.
ఈలోపు మా బాబాయి ఇంటిమీద ధ్యాస మళ్లి మధ్యలో ఊరెళ్లి పోయాడు.
అప్పుడు గూడవల్లి రామబ్రహ్మంగారు రాయపేట నర్సింగ్‌హోంలో ఆరోగ్యం సరిలేక ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్టుల్ని, సప్లయ్ చేసే లింగం సుబ్బారావు నా గురించి ‘రామబ్రహ్మం గారికి చెప్పడంతో నేను వెళ్లి ఆయనను కలిశాను. ఆయన నన్ను పరిశీలించి వారి “మాయాలోకం” (44) చిత్రంలో రాకుమారుడి వేషం ఇచ్చారు. ప్రముఖనటుడు సి.ఎస్.ఆర్‌కు చిన్నప్పటి వేషం అని. అక్కినేని నాగేశ్వరరావుగారు హీరో. నాకిది మొదటి చిత్రమైతే ఆయనకిది మÖడో చిత్రం.
ఇంటూరి వెంకటేశ్వరరావు రామబ్రహ్మంగారికి అసోసియేట్. నాకు నెలకు నలభైరూపాయల జీతం మీద ఆర్టిస్టుగా అపాయింట్‌మెంట్ టైపు చేసి తెచ్చి ఇచ్చిరాయన. ఏడునెలలు పని చేశానక్కడ.
ఆ తర్వాత నెలకు పాతిక రూపాయల జీతం, భోజన సౌకర్యంతో చిత్తూరు నాగయ్య గారి ‘రేణుక’లో చేరాను. అక్కడ “త్యాగయ్య” ()లో ఆయన శిష్యుడిగా నటించాను. ఆ వేషం కోసమని గుండు గీయించుకున్నాను. అదీ నాకు ఫస్ట్‌మేకప్. నాగయ్య గారంటే నాకెంతో గౌరవం. ఆ గురుభావంతోనే నా సొంత చిత్రం “దేవత”లో నాగయ్యగారు నటించారు. ఆ సమయంలోనే వారికి ‘పద్మశ్రీ’ బిరుదు వచ్చింది. సెట్‌పైన ఆయనకు పెద్ద సన్మానం చేశాను. ఒకరకంగా ఆయన నాకు గైడ్, ఫిలాసఫర్.
నేను నటించిన మÖడో చిత్రం ప్రతిభా వారి “ముగ్గురు మరాఠీలు” (46) ఈచిత్రంలో నేను తులేరావు పాత్ర పోషించాను. కుమారి గారు నాకు అమ్మగా నటించారు. అప్పట్లో మేమంతా ఈ చిత్రం కోసం ప్రతిభా ఆఫీసుకెళ్లి కత్తిసాము నేర్చుకునే వాళ్లం. నెలకు అరవై రూపాయలు జీతం. ఆ తర్వాత “నారదనారది” (46), “భక్త శిరియాళ” (48), “యోగివేమన” (47) చేశాను.
1947లో “రాధిక” చిత్రంలో కృష్ణుడు వేషం వేశాను. 1937లో “చింతామణి” నాటకంలో నేను కృష్ణపాత్రను పోషించాను. ఆ తర్వాత సరిగ్గా పదేళ్లకు మళ్లీ యిందులో కృష్ణుని పాత్ర ధరించే అవకాశం కలిగించారు దర్శకులు కాళ్లకూరి సదాశివరావుగారు. నా సరసన ఆర్.బాలసరస్వతి రాధగా నటించింది. సాలూరి హనుమంతరావు సంగీతంలో నా పాటలు నేనే పాడుకున్నాను. బాలకృష్ణ, నల్లరామÖ్మర్తి, పృధ్వి వెంకటేశ్వర్లు గోవబాలకులుగా నటించారు. ‘సురభి’ బాలసరస్వతికిదే తొలిచిత్రం. ఆ తరువాత “వింధ్యరాణి”లో నటించారు.
మధ్యలో కుటుంబ క్లేశాల వల్ల నటించడం మాని మా వూరెళ్లి పోయాను. సి.పుల్లయ్యగారు “వీరకుమార” చిత్రం కోసం మళ్లీ పిలిపించారు. ఈ సినిమా నిర్మాణంలోనే విజయా సంస్థతో నాకు పరిచయం ఏర్పడింది. వారు అప్పుడు “షావుకారు” తీస్తున్నారు. ఎల్.వి.ప్రసాద్, తాతినేని ప్రకాశరావు, రజనీకాంత్‌లు నన్ను విజయాసంస్థ అధినేతలైన నాగిరెడ్డి, చక్రపాణి గార్లకు పరిచయం చేయడం, వారు “షావుకారు”లో సోలయ్య పాత్రను ఇవ్వడం జరిగింది. నెలకు 150 రూపాయలు జీతం. ఆ పాత్రను నాకు ఇచ్చే ముందు చక్రపాణి గారు ‘నువ్వు పూర్తిగా జుట్టు తీసేసి గుండు చేయించుకుంటేనే నీకు వేషం ఇస్తాం. లేకపోతే లేదు” అన్నారు.
వేషం దొరికితే చాలురా దేవుడా అనుకుంటున్న నేను... జుట్టే కాదు, తలతీసి యిచ్చేయమన్నా, ఇచ్చేస్తాను అన్నాను. ప్రస్తుతానికి నీ జుట్టు తీయించు చాలు అన్నారు చక్రపాణి గారు. అక్కడున్న వారంతా గొల్లున నవ్వారు.
1949లో “షావుకారు” చిత్రం ద్వారా విజయాసంస్థలో ప్రవేశించిన నేను ఆ సంస్థలో ‘పర్మనెంట్ ఆర్టిస్ట’గా స్థానాన్ని సంపాదించుకున్నది ‘పాతాళభైరవి” చిత్రంతోనే. మÖడు సంవత్సరాలు పర్మనెంటు ఆర్టిస్టుగా పనిచేశాను. ఆ చిత్రంలోని సదాజపుడి పాత్ర నాకు చాలా పేరు తెచ్చిపెట్టింది. ‘అయ్యోగురూ’, ‘మోసం గురూ’ అనే మాటలు చాలా పాపులర్ అయ్యాయి. శతదినోత్సవాలు జరుపుకుందా చిత్రం. తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో శతదినోత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవంలో యÖనిట్ సభ్యులందరం పాý£్గన్నాం. ఆనాటి సభల్లో ప్రేక్షకుల కరతాళధ్వనులు ఇప్పటికీ చెవుల్లో మారుమ్రోగుతూనే వున్నాయి. ఆ తర్వాత విజయాలో “పెళ్లిచేసి చూడు” (52), “చంద్రహారం” (54) చిత్రాల్లో చేశాను. నేనూ, జోగారావు, కె.వి.ఎస్.శర్మ ముగ్గరం కలసి నటించిన చిత్రం “చంద్రహారం”. హాలీవుడ్ చిత్రాల్లో లారెల్ అండ్ హార్డీ పోషించినటువంటి పాత్రలను మేం ముగ్గురం ఈ చిత్రంలో పోషించాం. హాస్యరసాన్ని పోషించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న, జోగారావు చివరిదశలో, క్యాన్సర్‌తో బాధపడే రోజుల్లో - చనిపోయే ముందు నన్ను దగ్గరికి పిలిచి, ‘హాస్యనటుడు గానే గాకుండా, మంచి కేరెక్టర్ ఆర్టిస్టుగా కూడా నువ్వు మున్ముందు ఉన్నత స్థాయికి చేరుకునే రోజుý£స్తాయి’ అని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన ఉత్తమ వ్యక్తి. హాస్యనటుడుగానే గాకుండా ‘దేశోద్ధారకులు’ వంటి చిత్రాల్లో విభిన్నధోరణులు గల పాత్రలు పోషించి ‘కేరెక్టర్ ఆర్టిస్టు’గా కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందగలిగానంటే అందుకు కారణం వారి ఆశీర్వాదమేనని నా విశ్వాసం.
వ్పుియాలో కాంట్రాక్టు అయిపోయిన తర్వాత రచయిత తోలేటి వెంకటరెడ్డి ప్రోత్సాహంతో “శ్రీకాళహస్తి మహాత్మ్యం” (54)లో నటించాను. నాస్తికుడైన తిన్నడికి గురువుగా శివమంత్రాన్ని ఉపదేశించి అతనిని పరమభక్తునిగా తీర్చిదిద్దే ‘కాశీ’ పాత్ర పోషించాను. ఆ ప్రేరణ వల్లే మేము ‘శ్రీకాళహస్తి మహాత్మ్యం’ నాటకాన్ని మÖడువందల సార్లు ప్రదర్శించడం జరిగింది. ఈ చిత్రం తర్వాత “సతీ అనుసూయ” (సుందర్‌లాల్ నహతా నిర్మాత) చిత్రంలో నారదుడి వేషంలో నటించాను, ఆ తర్వాత వరుసగా “శ్రీకృష్ణ లీలలు” (59), “శ్రీకృష్ణప్రేమ” (61), “సతీతులసి” (59), “సతీసుకన్య” () మొదలైన చిత్రాల్లో నారదుడిగా మంచిపేరు తెచ్చుకున్నాను. టి.ఆర్.రామన్న నిర్మించిన “కార్తవరాయని కథ” (58)లో తొలిసారిగా విలన్‌గా నటించాను. 1956లో వివాహం చేసుకున్నాను.
1960లో “భార్యాభర్తలు”తో సినిమారగంలో కమెడియన్‌గా పూర్తి స్థాయిలో నిలదొక్కుకున్నాను. ఆ వెంటనే “ఇద్దరుమిత్రులు” (61), “మÖగమనసులు” (64)లో సావిత్రిగారికి భర్తగా నటించాను. ఆ రోజుల్లో అది సాహసం.
1964లో నేను “రేఖ అండ్ మురళి ప్రొడక్షన్స” పేరుతో ఒక చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించాను. వల్లం నరసింహారావు గారి కూతురు రేఖ, మా అబ్బాయి మురళిల పేరుతో పెట్టిన బానర్ అది. తొలిచిత్రంగా “దేవత” తీయాలనుకున్నాం. హీరోగా ఎన్.టి.రామారావు, హీరోయిన్‌గా సావిత్రి గార్లు వేశారు. ఈ చిత్రం నిర్మించే ముందు భలేగమ్మతైన విషయం జరిగింది. కథానాయికగా సావిత్రి గారిని బుక్ చేస్తూ అడ్వాన్సు ఇస్టుంటే ఒక వంద రూపాయల నటు చేజారి కిందపడిపోయింది. ఆ మహానటి వంగి ఆ నోటు కళ్లకద్దుకుని తీసుకుంటూ “ఇది శుభశకునం, మీ దేవత వందరోజులు గ్యారంటీ” అన్నారు. అన్నట్లుగానే ఆమె జోస్యం నిజమై “దేవత” శతదినోత్సవాలు చేసుకుంది.
ఆ తర్వాత “పొట్టిప్లీడరు” (66), “శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న” (67) చిత్రాల్ని నిర్మించాను. ఈ చిత్రంలోనే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా పరిచయం చేశాను. సంగీత దర్‌శకులు కోదండపాణి ఆంధ్రక్లబ్బులో బాలు పాట విని నాతో చెబితే విని పాడించాను. నిజానికి ఘంటసాల పాడాల్సిన పాటది. ఆ సమయంలో ఆయన తల్లిగారి ఆరోగ్యం బాగోక వూరు వెళ్లడంతో బాలుతో ట్రాక్ తీయించాం. అయితే మంచి క్లారిటీతో పాట రావడంతో ఆ వాయిస్‌ను అలాగే వుంచేశాం. రఘురామయ్యగారు కూడా ప్లేబాక్ పాడారు మా చిత్రంలో. ఈల పాట రఘురామయ్యగారితో నాకు సుధీర్ఘ పరిచయముండేది. నేను మద్రాసొచ్చిన తొలిరోజుల్లో రఘురామయ్య గారుంటున్న ఇంటి ఆవరణలోనే దాసరి కోటిరత్నం గారింట్లో ఓ గది అద్దెకు తీసుకుని వుండేవాన్ని. ఆయన దృష్టిలో పడాలని చాలా ప్రయత్నాలు చేసేవాన్ని. నాతోపాటు పృధ్వీ వేంకటేశ్వరరావు కూడా వుండేవారు. మేమిద్దరం కలసి రఘురామయ్య ఇంటి కిటికీని ఆనుకుని ఉన్నచెట్టెక్కి పాటలు పాడేవాళ్లం. ఓ రోజు ఆయన బయటికి వచ్చి పలుకరించి నన్ను ఆశీర్వదించారు, పృధ్విని చేరదీసి పెంచారు.
స్టేజి, సినిమా నటుడిగా నాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, నేనే చిత్రాలకు దర్శకత్వం ఎందుకు చేయకూడదనిపించి “శ్రీరామకథ” (68) చిత్రానికి దర్శకత్వం వహించాను. ఆ తర్వాత “కథానాయిక మొల్ల”, “జాతకరత్న మిడతంu£ట్లు” (71), “ఆజన్మ బ్రహ్మచారి” (73), “మాంగల్యభాగ్యం” (74) చిత్రాలను నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించాను. వీటిలో “మొల్ల” మినహాయించి తక్కినవన్నీ నన్ను నిరాశపరిచినవే. అందుకు కారణాలూ లేకపోలేదు.
“శ్రీరామకథ” చిత్రానికి ఆరోజుల్లోనే ఆరున్నర లక్షలు ఖర్చయ్యింది. చిత్రం బాగుంది. అందరూ మెచ్చుకున్నారు. కానీ ఆర్థికంగా మాకు ఒకటిన్నర లక్ష నష్టమొచ్చింది. దీనికి కారణం - విచారిస్తే “శ్రీరామకథ” టైటిల్ చిత్ర కథాంశానికి తగ్గట్టుగా లేకపోవడమేనని నిర్ధారణయ్యింది. ఈ చిత్రంలోనే “రామకథ శ్రీరామకథ” అనే 13 నిముషాల పాటను చిత్రీకరించాం.
అలాగే “జాతకరత్న మిడతం u£ట్లు” చిత్రం కూడా. ఈ చిత్రాన్ని కె.వి.రెడ్డి, ఎన్.టి.రామారవు గార్లు చూసి అద్భుతంగా నిర్మించావంటూ నన్నెంతో అభినందించారు. తప్పకుండా చిత్రం విజయవంతమవుతుందని ఆశించాను కానీ ఫలితం ఎదురుతిరిగింది. దీనికి కారణం ఏమిటయ్యా అంటే నాయకానాయకులు లత, భరణికుమార్ కొత్తవారు కావడం వల్ల ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించలేదు.
దీన్నే “జాతకరత్న గండజోస్య” అనే పేరుతో కన్నడంలో పునర్నిర్మిచాం. తెలుగులో నటించిన నాయికా నాయకులే కన్నడంలోనూ నటించారు. తెలుగులో నేను పోషించిన టైటిల్ పాత్రను కన్నడంలో నరసింహరాజు పోషించారు. సినిమా సక్సెస్ అయ్యింది. మాకు లక్షానలభైవేలు లాభమొచ్చింది.
ఇలా ఎన్నో విధాలుగా తెలుగులో మా సంస్థ నిర్మించిన చిత్రాలు పరాజయం పొందుతున్నా నిరుత్సాహపడకుండా ధైర్యంతో నిలబడి మరో ప్రయత్నంగా “ఆజన్మ బ్రహ్మచారి” చిత్రాన్ని నిర్మించాం. “వెయ్యినవ్వుల హాస్యచిత్రం’2 అని మేం ప్రకటించినట్లుగానే విడుదలైన తర్వాత మంచి వసూళ్లతో ధియేటర్ దద్దరిల్లిపోయేలా విరగబడి నవ్వుకునే జనంతో నాలుగు వారాల పాటు నడిచింది. ఆ వూపు చూసి నూరురోజులాడుతుందని అనుకున్నాం. కానీ అయిదో వారానికే బాక్స్ ఇంటికొచ్చేసింది. అయినా మేం నిరుత్సాహ పడలేదు. మళ్లీ మరో ప్రయత్నం చేసాం. పి.భానుమతి గారు ప్రధానపాత్ర ధారణిగా “మాంగల్య భాగ్యం” నిర్మించాం. నేనూ, రమాప్రభ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసాం. తమిళంలో విజయవంతమైన ‘పత్తుమాదబంధం’ చిత్రం ఆధారంగా ఈ చిత్రం నిర్మించాం. భానుమతి గారు చాలా బాగా నటించారు. అయినా చిత్రం పరాజయం పాలైంది. ఆర్థికంగా మÖడు లక్షలు నష్టమొచ్చింది. నష్టమొస్తే వచ్చింది, “కృష్ణప్రేమ” చూసిన నాటినుండి భానుమతిగారి అభిమానిగా మారిన నేను నా అభిమాన నటీమణితో సినిమా నిర్మించే భాగ్యం కలిగిందని సంతృప్తి చెందాను. నిజానికి, ఈ చిత్రం పరాజయం పొందడానికి కారణం. అప్పటికే భానుమతిగారు నటించిన మట్టిలో మాణిక్యం విజయానంతరం ఆవిడ పాత్ర హీరో పాత్రలను అధిగమించే స్థాయిలో వుండడం వల్ల కొన్ని చిత్రాలు దెబ్బతిన్నాయి. ఆ ప్రభావం వల్ల మా చిత్రం విడుదలకు ముందే ‘ప్లాప’ అని తీర్పు చెప్పేసారు ప్రజలు. భానుమతిగారు ఎంతో సమర్థవంతంగా, ఉదాత్తంగా నటించినా నాకు నాలుగు వారాల భాగ్యమే దక్కింది.
“పొట్టి ప్లీడరు” దగ్గర్నుంచీ ఒక దాని తర్వాత ఒకటి దెబ్బలు తింటూ చిట్టచివరి యత్నంగా నలభైమంది ప్రముఖ తారలతో, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మేము నిర్మించిన “సినిమా వైభవం” () రెండు వారాలు కూడా ఆడలేదు. తెలుగు మహాసభల్లో జరిగిన నాటికలూ, నృత్యనాటికలూ, బాలసుబ్రహ్మణ్యం పాటకచేరీ మొదలైన అంశాలు చిత్రీకరించాం. దీని పరాజయానికి కారణం- తెలుగు మహాసభలు జరిగే సమయంలో విడుదల చేయడమే.
కానీ 1970లో మా సంస్థ “కథానాయిక మొల్ల” చిత్రం నిర్మించడానికి పూనుకున్నప్పుడు - ఈ చిత్రంలో కథానాయకుడు లేడు. అంచేత తప్పకుండా ఘోరంగా పరాజయం పొందుతుంది. ఆ ప్రయత్నం మానుకుంటే మంచిది అని ఎందరో సలహా ఇచ్చారు. ఆకని నా మనసుకు నచ్చిన కథ మొల్ల జీవితచరిత్ర, అంచేత, ఎవరు ఎన్ని విధాలుగా నన్ను ఆ ప్రయత్నం నుంచి విరమింప చేయాలని ప్రయత్నించినా, సాహసం చేసి నిర్మించాను. ఆ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి బంగారునంది అవార్డు లభించింది.
నా సొంత చిత్రాలకే గాక బయట చిత్రాలైన “పెళ్లికాని తండ్రి” (76) “మా ఇంటి దేవత” (80) చిత్రాలకు దర్శకత్వం వహించాను. మొత్తం ఎనిమిది చిత్రాలకు దర్శకత్వం వహించాను.
మొదటి నుంచి వీలునుబట్టి నా పాటలు నేనే పాడుకునేవాన్ని. మధ్యలో ప్లేబాక్ వచ్చింది. “దేవత” చిత్రంలో నా పాత్రకు నేనే పాడుకున్నాను. ‘మా వూరు మదరాసు నా పేరు రాందాసు’ పాట బాగా పాపులర్. నేను గానం చేసిన ‘సుందరకాండ’ను హెచ్.ఎం.వి.వారు 1995లో విడుదల చేశారు, ఈ హరికథారూపానికి ఘంటసాల విజయకుమార్ సంగీతాన్ని అందించారు.
సుమారు 400 చిత్రాల్లో నటించిన నాకు రంగస్థలంపై ఎప్పుడూ చిన్నచూపు ఉండేదికాదు. మహామహులతో నా పరిచయాలన్నీ రంగస్థలం పైనే జరిగాయి. సినిమాల్లో కంటే రంగస్థలంపై నటించి మెప్పించడం చాలా కష్టం. ఏ మాత్రం లోపం కనిపించినా ప్రేక్షకులు నానా రభస చేసేస్తారు. దానివల్ల మా ఇబ్బందులెన్ని వున్నా తెరపై వాటిని కన్పించకుండా మేనేజ్ చేసేవాన్ని.
ఓసారి సి.ఎస్.ఆర్.గారు “భక్త తుకారాం” నాటకం వేస్తున్నారు. అందులో నేను తుకారాం కొడుకు మహాదేవ్‌గా నటించాను. తుకారాంగా సి.ఎస్.ఆర్. వేశారు. ఆ నాటకంలో తుకారాం కొడుకు మహదేవ చనిపోయే ఘట్టముంది, ఆ ఘట్టంలో చచ్చిపోయినట్టుగా నేను పదినిముషాలు సేపు పడుకోవాలి. ఈ కాలంలోలా అప్పట్లో కరెంటు దీపాలు లేవు. పెట్రోమాక్స్ లైట్లు వుపయోగించేవారు. పెట్రోమాక్స్‌లైట్లు పెడితే రకరకాల దీపం పురుగులు స్టేజీమీద వీనులవిందుగా సంగీతాన్ని వినిపిస్తూ, కన్నుల పండవుగా, మిలమిలా మెరుస్తూ నాట్యం చేసేవి. అంతేగాకుండా స్టేజి మీదున్న నటీనటుల మీద వాలి ముద్దులుకురిపించేవి. మహదేవ చనిపోయే ఘట్టంలో నేను ఎప్పటిలాగానే స్టేజి మీద పడుకున్నాను. సరిగ్గా అదే సమయంలో కొన్ని పురుగులు చెవుల్లోనూ, మెడమీద వాలి మమాప్రేమగా కుట్టడం ప్రారంభించాయి. మమాదేవ తల్లిగా నటిస్తున్న బండారు వెంకటేశ్వర్రావు, తుకారాం పాత్రధారి సి.ఎస్.ఆర్ నా అవస్థని గమనించకుండా నాటకంలో మునిగిపోయారు. పురుగులు నన్ను విపరీతంగా కుట్టి బాధ పెట్టేస్తూంటే, భరించలేక నా బాధని వాళ్లకి తెలియజేయ్యాలని ‘పురుగులు కుట్టేస్తున్నాయ్ యిటు చూడండి” అని మెల్లగా మెల్లగా మొరపెట్టుకునేవాడ్ని. వాళ్లు యిదేమీ పట్టించుకోకుండా వాళ్ల ధోరణిలో వాళ్లు నటించుకుపోయేవారు. ఇక లాభం లేదు - లేచిపోదామంటే జనం గొల్లున నవ్వుతారు, నాటకం చెడిపోతుంది. దాంతో సి.ఎస్.ఆర్.కు కోపం వచ్చి మర్నాడు మళ్లీ నాటకంలో అవకాశం ఇవ్వరేమోనని భయం. అంచేత తెర పడేవరకూ ఆ పురుగుకాట్లు భరిస్తూ వుండేవాణ్ని. ఇలాంటి సంఘటనలెన్నో.
1944 నుండి 1946 వరకు తుకారాం, పాదుకాపట్టాభిషేకం, రామదాసు, శ్రీకృష్ణలీలలు, రంగూన్ రౌడీ, హరిశ్చంద్ర నాటకాల్లో రఘురామయ్య, రుష్యేంద్రమణిలతో నటించాను. పి.సూరిబాబు తారాశశాంకంలో చంద్రుడిగా వేశాను. ప్రజానాట్యమండలి వారి ‘అల్లిముఠా’లో చదలవాడ కుటుంబరావుతో నటించాను. విశ్వశాంతిలోనూ నటించాను.
1958లో వల్లం నరసింమారావుతో కలిసి ‘శాంతినివాసం’ స్టేజి నాటకంలో నటించాను. 1960లో శ్రీకాళహస్తి మహాత్మ్యంలో ‘కాశి’ పాత్ర ‘పేరిగాడు రాజంటు’లో పేరిగాడు పాత్రలో నటించాను. ఈనాటకం సుమారు 40 ప్రదర్శనలు ఇచ్చాను. డా॥ గరికపాటి రాజరావుగారి ‘అల్లూరి సీతారామరాజు’ యిందులో ఇంగ్లీషు దొర కవర్టు పాత్ర వేశాను. ఇంతవరకూ నేనున 2.500 నాటక ప్రదర్శనల్లో పాý£్గన్నాను. ట్రూపులేకుండా నేను స్వంతంగా ప్రదర్శించిన ‘చింతామణి’ నాటకం సూపర్ హిట్ అయ్యింది. దీంట్లో సుబ్బిశెట్టి పాత్ర చాలా పాపులర్.
నాటక ప్రదర్శనల్లో వచ్చిన డబ్బంతా దాదాపు మానవసేవకే వెచ్చించేవాన్ని. బీహార్ క్షామనిధికి 15,000, వార్‌ఫండ్‌కు 5,00, గుడివాడలోని నాగేశ్వరరావు కళాశాలకు 5 వేలు విరాళం ఇచ్చాను. ‘రక్తకన్నీరు’ సీతతో కలసి వేసిన ‘మనోహర’ నాటకం ద్వారా వచ్చిన లక్షరూపాయలు తెనాలి కాలేజికి ఇచ్చాను.
1970లో జపాన్ ఎక్స్‌పోకు నేను, రాజబాబు వెÞ£్లచ్చాం. సింగపూర్, జపాన్, బ్యాంకాక్ మొదలైన నగరాలన్నీ సందర్శించాం. 1991లో గొల్లపూడి మారుతీరావు, సుబ్బారావు, సోమయాజులు, తులసిగార్లతో నేను అమెరికలో ‘మనిషి గోతిలో పడ్డాడు’, ‘దొంగý£స్తున్నారు స్వాగతం పలకండి’, మొదలైన నాటకాల్లో పాý£్గన్నాను. అమెరికాలో హాస్యవల్లరి పేరిట నేనిచ్చిన సోలోపర్‌ఫార్మెన్స్‌కు ప్రవాసాంధ్రులనుండి మంచి స్పందన వచ్చింది.
టి.వీ వచ్చి సినిమాను డామినేట్ చేయడంతో నేనూ ఆ రంగంలోకి అడుగుపెట్టాను. అనగనగా ఒక శోభ అనే టీవి సీరియల్‌లో తొలిసారిగా నటించాను. ఆ తర్వాత ‘గయ్యాళి భార్య’ టెలిఫిలింను డైరెక్ట్ చేసాను. దీన్ని నేన్నే (1989) నిర్మించాను. ఆ తర్వాత ‘పంచభూతాలు’ అనే టెలీఫిలింను కూడా డైరెక్టు చేసాను. ఆ తర్వాత ప్రైవేట్ టి.వి. ఛానల్‌లో రాడాన్ వారి ‘ఇదికధకాదు’లో హరిదాసుగా నటించాను. ఇందులో సుందర కాండతో పాటు సీతాకల్యాణం, రుక్మిణీకల్యాణం, హరికథల్ని స్వంతంగా నేనే పాడుకున్నాను. జయసుధ ‘జనని’, రాడన్ వారి ‘శ్రీమతి’లో కూడా నటించాను. ప్రస్తుతం పి.ఎన్.రామచంద్రరావుగారి దర్శకత్వంలో ‘గోల్‌మాల’ చిత్రంలో బామ్మవేషం వేశాను. కాగా ‘బామ్మ’ టైటిల్‌తో ఒక సీరియల్ తియ్యాలనే సంకల్పంతో ఉన్నాను. నేను నటించిన చివరి చిత్రం ‘గణేష’.
నా ఊపిరి వున్నంతవరకూ నటుడిగా కొనసాగి, తెలుగు వాళ్లను నవ్విస్తూనే వుండాలని నా కోరిక. 1943 నుంచి 2003 వరకూ నా నట జీవితం సాగినంతవరకూ సాఫీగానే సాగిపోయంది తెలుగు చలనచిత్ర చరిత్రలో నాకంటూ ఓ ముఖ్యస్థానం సంపాదించుకోగలిగాను. ఇందులో నా గొప్పేమీ లేదు. ఆనాడు దర్శకులు, నిర్మాతల్లో వున్న కమిట్‌మెండు అలాంటిది. మేమÖ అలాగే అంకిత భావంతో పనిచేసేవాళ్లం. ముఖ్యంగా మాకు డైలాగులు, మేనరిజమ్స్ విషయంలో మాకు స్వేచ్ఛ వుండేది. చాలా వరకూ మేనరిజమ్స్ నా ఇమేజీని పెంచాయని చెప్పుకోవచ్చు “పాతాళభైరవి”లో “ఏం గురూ! మోసం గురూ!” అనే ఊతపదాలు బాగా వ్యాప్తి చెందాయి. నారదపాత్రలో నారాయణ నారాయణ అనే ఊతపదాన్ని వివిధ చిత్రాల్లో వివిధ రకాల ఉచ్ఛారణలతో చెప్పాను. పూర్తిగా గొంతు మార్చి “గులేబకావళి”, “పూలరంగడు”, “దాగుడుమÖతలు”, “మాంగల్యభాగ్యం” చిత్రాల్లో డైలాగులు చెప్పాను. “అత్తయ్యా! నీకు కడుపా!” అనేది పూలరంగడులో చెప్పిన డైలాగ్, “దాగుడుమÖతలు”లో “ఏమంఈ, మీ పువ్వు” అని చెప్పాను. ఇందులో కాస్త వెటకారం నిండి వుంటుంది. ఆనాడు ఈ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది.
అదే చిత్రంలో సైకిల్ పంచర్ కాగా, దాని నుద్ధేశించి మాట్లాడుతూ “అయ్యో! బూరెల్లా వుండేవి. చపాతీలులా తయారయ్యాయి. సైకిల్ షాపుకు పద, కొట్టించుకుందువు గాని... గాలి” అని చెప్పాను. “సంబరాల రాంబాబు”లో శుద్ధ బ్రాహ్మణ్యంలో వ్యవహరిస్తూ భార్యని “ఒసే, అంటూ” అని పిలిచాను. “పునర్జన్మ”లో కోడినవ్వు ధోరణిలో నవ్వాను. ఇలా చాలా వాటిని నేనే సొంతంగా క్రియేట్ చేసుకునే వాడిని. ఇవన్నీ నాకు గుర్తింపు తెచ్చి, ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకునేలా చేసినవే.
ఇక అవార్డులంటారా ప్రభుత్వం నుండి ఏవీ రాలేదు గానీ ‘హాస్యబ్రహ్మ’, ‘హాస్యనట చక్రవర్తి’ వంటి బిరుదలన్నీ ఇతర సంస్థలవారు చాలానే ఇచ్చారు. బి.సరోజాదేవిగారు ఎప్పుడూ నన్ను ‘పద్మశ్రీ’ అని సంబోధించేవారు. ఆమె అలా పిలిచినప్పుడల్లా ఆ అవార్డు తీసుకున్నంత అనుభూతి పొందే వాన్ని. ఇంతకాలం నన్ను ఆదరించి, ఇంకా ఆదరిస్తూ వున్న ప్రజానీకం నన్ను మరచిపోకుండా వుండడమే నాకు పెద్ద అవార్డు.
జీవితం అనేది వెలుగు చీకటులు సమ్మేళనం. దాన్ని మనం స్వీకరిస్తూ పోవాలే గానీ నిరాశపడకూడదు. నాకు తెలిసినంత వరకూ కృషితో నాస్తి దుర్భిక్షం. శ్రమయే దైవం, దైవమే ప్రేమ, ప్రేమే జీవితం - దేనికైనా నిరాడంబరత ముఖ్యం. ఇదే నా ఫిలాసఫీ. మరొక్కమారు, నా జీవిత ప్రస్థానంలో తోడ్పడిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి