మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, అక్టోబర్ 2026, శుక్రవారం

భాగ్యలక్ష్మి (1943)

రేణుకా పిక్చర్స్ బ్యానర్‌పై చిత్తూరు వి.నాగయ్యగారు పి.పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన తొలిచిత్రం ‘భాగ్యలక్క్ష్మి’. గూడూరులోని మైకావ్యాపారి దువ్వూరు నారాయణరెడ్డి, చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు.

స్వంతచిత్రమైనప్పటికీ, సంగీత దర్శకత్వాన్ని భీమవరపు నరసింహారావు గారికి అప్పజెప్పారు నాగయ్య. అయితే కథాపరంగా మÖ్యజిక్ కంపోజర్‌గా సంగీతాన్ని బోధించే ఉపాధ్యాయుని పాత్రను పోషించారు.

శ్రీమతి రావు బాలసరస్వతీ దేవిగారు నేపథ్యగాయనిగా ఈ చిత్రం ద్వారానే పరిచయమయ్యారు. మహారాష్ట్ర రంగస్థలనటి కమలా కోట్నీస్ తెలుగు సినీరంగప్రవేశం ఈ చిత్రంతోనే కావడం విశేషం.

ప్రేమ విఫలం కావడం వేరు. ప్రేమిస్తున్నట్లు ఒకరికొకరు మనసువిప్పి చెప్పుకోకపోవడం వల్ల జరిగే పరిణామాలకు బాధపడటం వేరు. తను ప్రేమించిన యువతి, వేరొకరిని పెళ్ళి చేసుకొంటుంది. ఆవిడ కాపురం సజావుగా సాగిపోతుంది. కొన్నాళ్ళకు మళ్ళీ ఆమె కన్పిస్తుంది. అంతవరకు ప్రేమగా చూసుకొనే భర్తలో అనుమాన బీజం పడుతుంది. అది అతన్ని అగ్నిలా దహిస్తుంది. పాపం ఆమె అటు భర్త, ఇటు ప్రియుడు - వీరి మధ్య నలిగిపోతుంది. చివరికి ఎవరోఒకరు త్యాగం చేస్తారు.

ఈ థీమ్‌తో వచ్చిన అనేక చిత్రాలకు ‘భాగ్యలక్క్ష్మి’ నాంది పలికింది. ‘ప్యాసా’, ‘మల్లెపూవు’, ‘సాగరసంగమం’, ‘అభినందన’ మొ॥ సినిమాలు ఈ ఒరవడిలో వచ్చినవే!

కథాసంగ్రహం :

ధర్మన్న (దొరస్వామి) పెంపుడు కొడుకైన శ్రీనివాసరావు (నాగయ్య) సంగీతం మాష్టారు. పొరుగింటి రంగమ్మ (పార్వతీబాయి) కూతురు భాగ్యలక్క్ష్మి (మాలతి)ని ప్రేమిస్తాడు. కానీ ఆమెతో చెప్పుకోడు. ఆమెకు శ్రీనివాస్ అంటే యిష్టమే! మామయ్యా అంటూ అతని స్వరకల్పనకు స్ఫూర్తినిస్తూ, నాటకాలలో నటిస్తుంది. ఆమె అన్నయ్య గోపి (గిరి) వీరిద్దరికి పెళ్ళి చేయాలనుకుంటాడు. కానీ మేనమామ కోటయ్య (ఆదినారాయణయ్య) సంగీతవిద్యను హేళన చేసి, శ్రీనివాసరావు కులం తక్కువవాడని, రిటైర్డ్ తహశీల్దారు జానకీరామయ్య (రాఘవన్) కుమారుడు విశ్వంతో (ఉమామహేశ్వర్రావు) లక్క్ష్మి పెళ్ళి చేస్తాడు. శ్రీనివాసరావు తట్టుకోలేక, ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. ధర్మన్న కొడుకు జాడలో తిరుపతి వెళ్ళాడు. అక్కడ శ్రీనివాసరావును చూసి బ్రతిమాలి యింటికి తీసుకొస్తాడు. శ్రీనివాసరావును మోహించిన ఓ పంతులమ్మ పగతో విశ్వం మనసులో అనుమాన బీజం వేస్తుంది. అప్పటికే ఆదంపతులకు కొడుకు పుడ్తాడు. విశ్వం తన భార్యను అనుమానించి ఇంట్లోనుంచి వెళ్ళగొడ్తాడు. ఈ ఘటనను చూసిన శ్రీనివాసరావు షాక్‌కు లోనై మతికోల్పోతాడు. “లక్క్ష్మి నిర్దోషి” అంటూ కలవరిస్తుంటాడు. చివరికి ఏడుకొండల వాడిని ధర్మన్న కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తుంటాడు. ఏదో ఓ జ్యోతి విచ్చేసి, విశ్వంలోని సంస్కారాన్ని తట్టిలేపుతుంది. విశ్వం భాగ్యలక్క్ష్మిని క్షమించమని కోరుతాడు. ఇద్దరూ శ్రీనివాసరావు ముందు మోకరిల్లుతారు. శ్రీనివాసులో తెలివివస్తుంది. ఆ జంటను మనసారా ఆశీర్వదిస్తాడు.

సాహితీ విశేషాలు :

ఒక సంగీతోపాధ్యాయుడి గాథ అయినప్పటికీ, సినిమా ఆద్యంతము రకరకాల పాటలతో నిండివుంది. సముద్రాల - బి.ఎన్.ఆర్.ల కాంబినేషన్ మÖ్యజికల్ హిట్ చేసింది.

మాటల కూర్పులో తమ నేర్పును చూపించారు సముద్రాల - సినిమాల పట్ల, సంగీతం పట్ల ఆనాటి తరానికి గల అభిప్రాయాలను పాత్రలపరంగా చెప్పి, మెత్తని చురకలను అక్కడక్కడా వేశారు. బారసాల సందర్భంగా అమ్మలక్కలంతా చేరి పాటలు పాడాలని అంటుంటారు. వారిలో ఒకావిడ “ఈనాటి వాళ్లకి ఏం పాటý£స్తాయి? సినిమా పాటలూ లేదా హిందీ పాటలు...” అని ఎత్తి పొడుపుగా అంటుంది.

‘భాగ్యలక్క్ష్మి’ చిత్రగీతరచనలో వైవిధ్యం చూపించారు సముద్రాల. కొన్ని సంప్రదాయశైలిలో కొన్ని జానపదధోరణిలో, కొన్ని భావగీతాల మార్గంలో రాయడం విశేషం.

సంప్రదాయ శైలి :

1. శ్రీరమణీ మనోరమణా....

2. రామలాలీ - మేఘశ్యామ లాలీ...

3. వారే ధన్యులుగా...

4. రారా గోకులనాథా...

5. కలడా వేరే దైవము...

జానపద ధోరణి :

1. తిన్నెమీద సిన్నోడ...

2. కులుకతవా పలుకతవా...

భావగీతాలు :

1. సుమమా! కుసుమమా...

‘భాగ్యలక్క్ష్మి’ చిత్రానికి ముందు విడుదలయిన హిట్ సినిమా పాటల పల్లవుల మాలికతో ఓ పేరడీసాంగ్‌ను వినోదప్రధానంగా రాశారు. ఈ గీతాన్ని ప్రముఖ హాస్య జంట ఎన్.ఎస్.కృష్ణన్, టి.ఎ.మధురంలపై చిత్రించారు.

భాషా, ప్రయోగాల దృష్ట్యా, ‘తిన్నెమీద సిన్నోడ...’ పాటలో సముద్రాల వారు జానుతెనుగు సౌందర్యాన్ని జానపద నాయికల నెరజాణ శృంగారాన్ని అక్షరీకరించినతీరు అద్భుతం. మరో పాటలో ‘కుశాలు, గాగరాలు, కురువేరు’ మనల్ని అలరిస్తాయి.

ప్రకృతి పదాలను, శిష్టవ్యవహారికపదాలను యాసలో చొప్పించటం గమనించవచ్చు.

ఉదా : చిలకల కొలికి - శిలకల కొలికి

వలపు కలిగె - వెలపాయగలిగితేను

గాగ్రా (రాజస్థాన్ దుస్తులు) - గాగరాలు

..........................................................

సముద్రాలవారి పదబంధాలు, వాక్య విన్యాసాలు తరువాతి కవులను ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. ఈ చిత్రంలో “వారేధన్యులుగా...” అన్న పాట పల్లవిలోనే ‘రాగములో అనురాగము కలిపీ’ అని రెండవ పంక్తి కనిపిస్తుంది. దీనిని,

‘రాగమందనురాగమొలికి

రక్తి గొలుపును గానము’ - అని ఆచార్య ఆత్రేయ ‘పులకించిన మది పులకించు’ (అర్థాంగి)లో ప్రయోగించారు

రాగములో అనురాగము నిలిపి

పాట పాడుతుంటే నామది

పరవశమై పోతూ వున్నది - అని కొసరాజు ‘ఆడుతు పాడుతు పని చేస్తుంటే” (తోడికోడళ్ళు) చిత్రంలో ప్రయోగించారు.

ప్రయోగంలో తేడా వున్న అర్థబేధమున్నా, శబ్ద సంయోజనంలో పోలిక గల మల్లాది వారి ‘రాగమsTÖ రావే - అనురాగమsTÖ రావే...’ (జయభేరి) పాట sTÖపాటికి మీకు గుర్తుకు వచ్చే వుంటుంది.

అన్నిటిని మించి ‘మావారొచ్చే వేళాయె’ పాటలో కవిత్వం, అలంకారం ఏదీ కనిపించదు. కాఫీ, బిస్కట్లు, క్యారం, టెన్నిస్, మిఠాయి వంటి మాటలతో కూర్చిన మామÖలు పాట. అయితేనేం, ఈ పాటను సైతం పల్లకినెక్కించారు సముద్రాల వారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి