తెలంగాణాన్ని పాలిస్తున్న పశ్చిమచాళుక్య రాజ్యం క్షీణించేదశలో దేవగిరిని రాజధానిగా జేసికొని మహారాష్ట్రులు, ద్వారసముద్రాన్ని రాజధానిగా జేసికొని కన్నడులు, ఓరుగంటిని రాజధానిగా జేసికొని ఆంధ్రులు స్వతంత్రులైనారు. ఒక విధంగా ఇవి ఆనాటి భాషాప్రయుక్త రాష్ట్రాలు. వీనిలో మరాఠా శాఖ మళ్లీ రెండుగా, చీలిపోయింది. రత్నగిరిని రాజధానిగా చేసికొని సేవణవంశం, దేవగిరి నుండి యాదవవంశం దక్షిణ దేశాన్ని పాలించినవి. వానిలో యాదవరాజ్యంలో ఓ సంస్థానం వెలసింది. అదేలోకయ్య పల్లె సంస్థానం దాన్ని నారాయణ పేట సంస్థానం అని గూడ అన్నారు. ఇది మగతల పరగణాలో ఉండేది.
క్రీ.శ.16వ శతాబ్దంలో పాలమÖరు జిల్లాలో వర్ధిల్లిన సంస్థానాలలో లోకాయపల్లె సంస్థానం ఒకటి.
ఇది మహారాష్ట్ర బ్రాహ్మణ సంస్థానం. దీని ఎల్లలు పాలమÖరు జిల్లాలో కల్వకుర్తి తాలుకా వరకు హైదŠరాబాదులో షాలిబండ వరకు వ్యాపించి ఉండేవని అంటారు.ఈ సంస్థాన స్థాపకురాలు వెంకమ్మ దొరసానిగారు.
మగతలకు “ముఖస్థలి” అని సంస్క ృతవ్యవహారం, దాన్ని శా.శ.1216 క్రీ.శ. 1294 ప్రాంతంలో దేవగిరి యాదవ రామచంద్రుని సామంతుడు స్థాణుచమÖపతి పాలించినాడు. ఈ దేవగిరి ప్రభువులకు కాకతీయులకు ఎప్పుడూ కొరకొరలు రవరవముగానే ఉండేది.
మగతల పరగణాలో గురుమిటికెల (గురుమఠగల్), చండ్రకి (చంద్రకి), కాన్ కుర్తి (కర్ణకుటీర), కాన్‌గడ్డ, మద్దూరు, కోసిగి (కౌశికి), కోయలకొండ, కోటకొండ, ధన్వాడ, ఊటుకూరు, మక్తల్ (మకస్థలి) ఉజ్జలి (ఉజ్జయిని) అనే గ్రామాలన్నిటిలో కలిపి 365 అగ్నిీVAత్రాల కుటుంబాలుండేవి. వానికి నైజాము ప్రభుత్వం నుండి ఊమియాలు దినబత్తెం కూడా ఉండేది. ఈ కుటుంబాలకు నారాయణపేటలోని దీక్షిత వంశంవారు ఆధ్వర్యులుగా ఉండేవారు. దీక్షిత వంశం లోని త్రియంబక సోమయాజి, విఠ్ఠలబట్టు అనే సోదరులకు వెంకటనారాయణ పడ్నవీస్ అనే ఇక్కడి ప్రభువు ఇచ్చిన ఈ క్రింది దాన పత్రం వల్ల ఆనాటి వీరి సంస్థాన వివరాలు కొన్ని మనకు తెలుస్తున్నాయి.
‘స్వస్తిశ్రీమత్ శాలివాహన శకే1161 వ్యవహారిక చాంద్రమానేన శుక్లనామ సంవత్సర మార్గశిర శుద్ధ పంచమి సోమవారం వేద శాస్త్ర సంపన్న రాజమాన్య రాజశ్రీ వశిష్ట గోత్రోత్పన్న ఆయాచిత విఠ్ఠలబట్టు వారి పుత్రుడు భైరవబట్టు వారి పుత్రులు త్రయంబక సోమయాజి విఠ్ఠలబట్టు కల్వర్గ వాస్తవ్యులకు వెంకటనారాయణ పడ్నవీస్ వమా మలే దిల్షాదాబాద్ (ఊట్కూరు) తాటికొండ, దౌల్తాబాద్ దేశముఖ్ నాడగౌడ్ పరగణే తాటికొండ వ బాదేపల్లి వ బూర్గుల పరగణే వెలిజాల్ వగైరా మా నుంచి వ్రాయించి ఇచ్చిన భూదాన పత్రం.
మీ పౌత్ర పరంపరగా అనుభవం చేస్తూ మా సంస్థాన హిత చింతన కోరుతూ ఉండవలెను. మాకు మా సంస్థానమునకు హితచింతన చేస్తూ ఉండవలెను.
ఈ దాన పత్రంలో పేర్కొన్నది శాలివాహన శకమని చెప్పబడింది కానీ అది శాలివాహన శకం కాదు. హిజిరియో ఫసిలియో తెలియదు. సంవత్సర ప్రకారము అది 16వ శతాబ్దంలోని ఉత్తరార్థంలో క్రీ.శ 1569అవుతుంది .
గణంజయదీక్షితుల యొక్క మÖలపురుషుడు ఆయాచిత విఠలబట్టు గుల్బర్గా నుండి నారాయణపేటకు వచ్చినాడు. అప్పటికి నారాయణపేట లేదు. దానిస్థానంలో పళ్ళీ అనే గ్రామం ఉన్నది.
ఇక్కడి ప్రభువంశాలలో నారాయణరావులు ముగ్గురు నలుగురున్నారు.
1157 హిజిరిలో నారాయణరావు జాదవ్ అని ఒక ప్రభువున్నాడు. ఈయన భార్య లక్ష్మమ్మ గారు. ఈమె పడ్నవీస్ వంశానికి తల్లి అని చెప్పబడింది.ఈ నారాయణరావు ‘పళ్ళీ’ గ్రామాన్ని తనపేర నారాయణపేటగా మార్చి దాన్ని అభివృద్ధి పరచినాడు.
నారాయణపేటకు బళ్ళారి వాసుదేవాచారి, ముంజె నారాయణాచార్యులు. వీరిద్దరూ మొదటి ఈనాందార్లు. వాసుదేవాచార్యులకు లోకాయపల్లె ప్రభువు ఒకరు క్రీ.శ 1730 లో ఒక గుర్రం పరువు భూమి సాలింభగొటగా ఇనామిచ్చినాడని ఆ వంశీయుడైన జయా వెంకటాచార్యులు చెప్పినాడు. కానీ వీరి దాన పత్రమేది ఎంత ప్రయత్నించినా లభించలేదు.
ఈ అగ్నిీVAత్రులతో పాటు ఇంకా నిత్యకర్మా నుష్ఠానపరులయిన స్మార్తులు, జేడుంబర వ్రతస్థులైన వానప్రస్థులు, అప్పటికి జైనంగూడా ఇంకా సజీవమేగాబట్టి లోకాయతులు తమ తమ కొరకు ఆపరగణాలో పల్లెలు గట్టుకొని నివసించినారు. వానిలో లోకాయతులు గట్టుకున్న పల్లెనే లోకయ్యపల్లె పేర ఒక సంస్థానానికి రాజధానియై క్రీ.శ. 16వ శతాబ్ది నుండి 1844 ప్రాంతం వరకు. ఓ వెలుగు వెలిగింది.
ఈ సంస్థానాన్ని పాలించినవారు మహారాష్ట్ర స్మార్తులు భారద్వాజస గోత్రులు` సోనార్ భైరవుని భక్తులు. తమదిపడÁ్నవీసు వంశమని యాదవరాజ్యాన్ని పాలిస్తున్నామని దానపత్రాలలో చెప్పుకున్నారు. ఈ ప్రభువులు పాలమÖరు జిల్లాలో పెక్కు మందికి మక్తాలీయటమే గాక ఎన్నో నూతన గ్రామాలకు గూడ కారణ మైనారు. వానిలో ఈ గ్రామం గూడ ఒకటి.
లోకయ్యపల్లెను పాలించిన ప్రభువంశంలో మొదటి వెంకటనారాయణ రావు అని ఒకే పేర ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వారు తాతా మనుమలు.
మొదటి వెంకటనారాయణరావుగారు క్రీ.శ. 1611 శుక్ల సంవత్సర మార్గశిర శుద్ధపంచమి సోమవారం నాడు పళ్లలోని త్రియంబకభట్టు, విఠల భట్టు అనే సోదరులకు ఓ భూదానం చేసినాడు. ఈ శాసన కాలం నాటికి అక్కడ నారాయణపేట ఉన్నట్టు లేదు. నేటిబారంబావి దగ్గర మనోహరేశ్వర, అవ్వన్నేశ్వర (అమ్మణ గుడి) లింగేశ్వర (లింగయ్య గుడి) ఈ దేవాలయాలు వాని ప్రక్కన ఒక అగ్రహారం మాత్రం ఉండేవట. అందులో బ్రాహ్మణులు నివసించేవారని పై ఆలయాలు వారే ప్రతిష్టించినారని అంటారు.
ఈ నారాయణరావు గారి భార్య లక్ష్మమ్మ గారు. ఆమె మహా ప్రతివ్రత పండుముసలిదయ్యే వరకు జీవించిందట.
లోకాయపల్లె లక్ష్మమ్మ దొరసాని గారు ఆ రాజవంశంలో చివరిది. ఆమె మహాపతివ్రత, గొప్ప ధర్మాత్మురాలు మరియు భక్తురాలు. ఆమె మహిమలను వితరణను, ధార్మిక వర్తనను, ఔదార్యాన్ని, పరిపాలనను, భక్తిని గురించి ప్రజలు అనేక కథలు చెప్పుకుంటారు. ఈమె దగ్గర బోయనపల్లై వారనే కరణాలు దివాంజీలుగా ఉన్నారు.
ఈమె నారాయణపేట దగ్గర ఏక్లాస్‌పూర్ లోను, పాలమÖరులో ఉన్న కోట తిరుమల దేవుని గుట్టపైన వెంకటేశ్వర ఆలయాలు ప్రతిష్టించింది. ఈమె స్థాపించిన ఆలయాలు మిక్కిలి నిరాడంబరంగా ఉన్నవి. తర్వాత అవి ఇప్పుడు కొత్త మరమ్మతులు చేయబడినవి.
లోకాయపల్లి దొరల కింద బోయినపల్లె కరణాలు పెద్ద అధికారులుగా నుండిరట. కనుక వారి వలన మరి కొన్ని వివరాలు తెలియజేయవచ్చును. పూర్వమీపట్టున బ్రాహ్మణులు విద్యలలో గాని ఇతర విద్యలల్లో గాని దిట్టలై యుండిరట. తాడూరు, పొలమÖరు, పోలేపల్లి గ్రామములందు వేద పండితులు పెక్కురుండిరట. పోలేపల్లి వారు వేదములు పిల్లన గ్రోవిపై పలికించు చుండిరట.
దేహదారుఢ్యం ఉన్నంత కాలం ఏటేటా కాశీ మరియు తిరుపతి యాత్రలు చేసి, వెళ్ళ లేకుండా అయిన పిమ్మట ఒక నాడు విశ్వేశ్వరుని తలుచుకొని ‘స్వామీ! నేనిక నీ సన్నిధికి వచ్చి దర్శింపలేను’ అని మ్రొక్కుకున్నదట. అపుడు విశ్వేశ్వరుడు కలలో కనిపించి ‘నీవు నా దగ్గరకురా లేకపోతె నేనే నీదగ్గరకు వస్తాను’ అని చెప్పినాడట. ఆ స్వప్న ప్రకారానికామె అద్భుతపడి మేలు కొని తెల్లవారగానే ఆస్థాన పురోహితులను పిలిపించుకొని, కాశీకి పంపి విశ్వేశ్వరలింగాన్ని తెప్పించి ఔదుంబరగిరిపై ఒక ఆలయం గట్టించి దానిలో ప్రతిష్ఠించింది. అక్కడ మట్టికుప్పబోసినట్లుగా రెండు పెద్ద రాతిగుట్టలు జతగా ఉన్నవి.
వర్షాకాలంలో వానిపై పడిన నీరుజారి ఆ రెంటి నడుమ ఒకనది ప్రవహిస్తుంది. లక్ష్మమ్మ గారానదికి పై వైపు క్రింది వైపు, రెండు గోడలు గట్టించి ఆ కోనేటిరూపమిచ్చి దానికి అవతలిగట్టుపై ఈ ఆలయం గట్టించింది. మనోహరమయిన శిల్ప సంపదతో ఏకాంత ప్రదేశంలో నిలిచిన ఈ ఆలయం చూపరులను విస్మయావహులను చేస్తుంది.
లక్ష్మమ్మ గారికి కాశీవిశ్వనాధునివలెనే ఒక నాడు తిరుపతి వెంకటరమణుడు గూడా కలలో కనిపించి ‘నేనే నీదగ్గరకు వస్తాను. నన్నక్కడే అర్చించుకుందు వుగాని, ఫలానా గుట్టపై ఫలానా రాతికి శంఖుచక్రాలు కనిపిస్తవి. అది నేను అక్కడికి వచ్చినందుకు గుర్తని’ సెలవిచ్చినాడట. ఆమె ఈ స్వప్న ప్రకారానికిగూడ అబ్బురపడి మేలుకొని, పరివారాన్ని వెంట తీసుకొని వెళ్ళి స్వామివారు నిర్దేశించిన శిలను జూడగా దానికి శంఖచక్ర చిహ్నలు కనిపించినవట. అపుడామె స్వామి వారి కరుణకు అవాక్కై ఆరాధనకు ఒక ఆలయం గట్టించి గుట్ట క్రింద ఒక గ్రామాన్నేర్పాటు జేసి దానికి “ఏకశిలాపురం” అని పేరు పెట్టింది.
తెలుగువారు మల్లికార్జనుని “మల్లయ్య” అని పిలిచినట్లు తిరుపతి దేవుని “తిమ్మయ్య” అని పిలుస్తారు. అచటివారు ప్రస్తుతం ఆ స్వామిని ఈ పేరనే పిలు స్తున్నారు. ఈ స్వామికి క్రీ.శ. 1972 లో శ్రీజడ సిద్ధప్ప స్వాములవారి శిష్యులు కోనేళ్ళ ఆశప్పగారి సతీమణులు వైకుంఠద్వారం గట్టించినారు.
ఈమెపై పెద్ద రామేశ్వరాయలు దండయాత్ర చేసి ఈ సంస్థానాన్ని నామమాత్ర వశిష్ఠం చేసినాడు. పెద్ద రామేశ్వర రాయలీమెను పట్టుకోబోగా ఆమె అక్కడున్న రాగి చెట్టులో అదృశ్యమైపోయిందని అక్కడి వారి కథనం.
అప్పుడు పెద్ద రామేశ్వరరాయలు నెత్తురు కక్కుకొని ఆమె మహిమ తెలుసుకున్నాడట. ఇప్పుడా రావి చెట్టు కిందనే ఆమె సమాధి ఉంది.
ఈ ఆలయాలు గట్టించిన లక్ష్మమ్మగారి సమాధి నేడు లోకయ్యపల్లెలో’ వారి కోట వెనుకనే ఒక పెద్దరాగిచెట్టు క్రింద ఉంది. ఆమె జీవించినదినాలలో ఎప్పుడు దాని క్రిందనే కూర్చునేదట. మరణించినప్పటికీ ఆమె ఆ అశ్వత్థనారాయణునిలోనే లీనమై పోయిందని అక్కడి వారినమ్మకం. అందువల్ల ఏటా శ్రావణంలో అక్కడివారానెల దినాలు ఆ చెట్టును పూజిస్తుంటారు. ఈమెను గురించి వివిధాలైన మాహత్మ్యాలకు సంబంధించిన ముచ్చట్లు అక్కడివారు చెబుతుంటారు.
ఈ లక్ష్మీనారాయణుల పౌత్రుడు రెండవ వెంకటనారాయణరావు. అతడు తండ్రిగారికి లేకలేక కలిగిన సంతానమట. తండ్రిగారికి “నారాయణ్ దేవ’ అనే ఒక సన్యాసి “నీవు నారాయణ ప్రతిష్ఠ చెయ్యి సంతానం కలుగుతుంది” అని చెప్పినాడట. అదివిని ఆయన అక్కడొక ఆలయం గట్టించి స్వామిని ప్రతిష్టించి అర్చించగా వారికి రెండవ వెంకటనారాయణరావు గారు జనించి పెద్దవాడైనపిదప తండ్రిగారు ప్రతిష్టించిన నారాయణాలయాన్ని ప్రధానంగా చేసికొని నారాయణ పేటను కట్టించినాడట.
వి.శ. 1785 లో భాస్కరరాయలు అనే పండితుడు లలితాసహస్రానికి భాష్యం వ్రాసినాడు. ఆయన దానిపీఠికలో తాను ప్రసిద్ధమైన నారాయణపేట సమీపంలోని లోకయ్యపల్లెలో నరసింహయజ్వగారి చెంత చదువుకొంటినని చెప్పుకున్నాడు.
సంస్థానంగాబట్టి మొదట రాచరికంగా లోకయ్యపల్లెకే ప్రసిద్ధి గాని భాస్కరరాయల మాటను బట్టి 17వ శతాబ్దం నాటికి ఆ విశేషం నారాయణపేటకు సంక్రమించినట్లు తెలుస్తుంది.
మొదటి వెంకటనారాయణరావు గారి దానపత్రం శా.శ. 1611 నాటికి లోకయ్యపల్లెకే ప్రసిద్ధి. ఆనాటికి నారాయణపేట పేరు లేదు. భాస్కరరాయలమాటను బట్టి వి.శ. 1785 నాటికి నారాయణపేటకు ప్రసిద్ధి. ఆ లోకయ్యపల్లెకు గాదు. కాబట్టి పై ఆధారాలను బట్టి క్రీ.శ. 1689 నడుమ నారాయణ పేట ఎప్పుడో ఏర్పడి ప్రసిద్ధికి వచ్చింది అనుకోవాలె.
భాస్కరరాయలు లలిత సహస్రానికి భాష్యం వ్రాయటానికి గూడ ఓ కారణం ఉంది. వారిపూర్వులది కొంకణప్రాంతం. ఆయన తండ్రిగారి పేరు గంభీరరాయలు, వీరి అన్నగారు హరిహరరాయలు ఈ సోదరులకు కుష్టువ్యాధి ఉండేదట. అందువల్ల సంచారానికి బయలు దేరి మÖలిమళ్ళకు వచ్చి అక్కడ గల మడుగులో స్నానంచేసి సూర్యోపాసన చేయగా అది తగ్గిందట. ఆకారణంగా వారికా దేశం నచ్చి బీజాపురానికి వెళ్లి అలీఅదిల్‌షాహ దర్బారులో మంత్రిపదవులు సంపాదించుకొని అక్కడ స్థిరపడినారు. పాదుషాగారీ సోదరులను రాజ్యంలో వన్నుల వసూలుకు పంపేవాడు.
పాదుషావారు ఒకప్పుడు గంభీరరాయలను లోకయ్యపల్లెకు పన్ను వసూలుకు పంపినాడు. అపుడాయన నారాయణపేటలో చాలాకాలం నివసించినాడు. తండ్రి పన్నుల వసూలుకు దేశాలపై తిరుగుతు ఉంటె ఇంటిదగ్గర కొడుకు భాస్కరరాయలు అల్లరిచిల్లరగా తిరిగేవాడు. అదిచూచి ఒక నాడు “ ఊరూరు తిరిగి యింటికి వెళ్లిన తండ్రి కుమారునిపై నా కడుపున చెడబుట్టితివని కేకలు వేసినాడు. అదివిని భాస్కరరాయలు పౌరుషపడి యింటినుండి పారివచ్చి లోకయ్యపల్లె చేరి నరిసింహయజ్వగారి నాశ్రయించినాడు.
కాబట్టి భాస్కరరాయలు అనంతర కాలంలో ఆమె స్మరణచిహ్నంగానే లలితాసహస్రానికి భాష్యం వ్రాసినాడని చెబుతారు. దాని రచనా కాలం క్రీ.శ. 1696 ప్రాంతం. అక్కడతడు పదేనేండ్లున్నట్లు చెబుతారు కాబట్టి భాస్కరరాయలు విద్యార్థిగా ఉన్న కాలం క్రీ.శ. 1680 అవుతుంది. అతని మాటను బట్టి అది అప్పటికే ప్రసిద్ధిచెందింది. కాబట్టి అందుకు మరో వంద సంవత్సరాలైన తీసుకుంటే ఆ గ్రామం క్రీ.శ. 1670 ప్రాంతంలో ఏర్పడి ఉంటుంది అనుకోవాలె.
ఇక మొదటి వెంకటనారాయణరావు గారు భూదానం చేసిన బ్రాహ్మణులను గురించి గూడా ఒ కధ ఉంది.
త్రియంబక సోమయాజుల పూర్వులది సింధూ ప్రాంతంలోని “పళ్లీపురం” వారు మహా కాలభైరవ మహాగణపతి ఉపాసకులు. కాశ్మీర్, కాశీ పట్టణాలు - సంచారం చేస్తు పూనాకు వచ్చి కొంతకాలం సోనార్ గ్రామంలో నివసించినారు. సోనార్‌లో కాలభైరవుడు ప్రసిద్ధి. అక్కడి నుండి వారు మళ్లీ బయలుదేరి ఆలంద్, కలిదుర్గ (గుల్‌బర్గా) పట్టణాలు చూస్తు “పళ్ళకు” వచ్చినారు. అక్కడ వారి నియమనిష్ఠలు జూచి మొదట ఓ రెడ్డిగారు ఆశ్రయమిచ్చినాడు.
ఈ వంశీయుల మÖలపురుషుడు అయాచిత విఠలదీక్షితులు. పళ్ళకు, వచ్చిన పురుషుడు ఆయాచితేంద్రత్య్రంబక దీక్షితులు. ఈయన పళ్ళలో కాపురం పెట్టిన పిమ్మట దానికి సమీపంలో ఉండే కొండపై తన వెంట తెచ్చుకొన్న భైరవుని ప్రతిష్ఠించి గుడి గట్టించినాడు. ఆనాటి నుంచి దానికి “భైరవునికొండ” అని పేరుపడింది. దానిపై అతడు కట్టించిన ఆలయం ఇపుడుంది.
మహారాష్ట్రలలో పీష్వా, పట్వర్థన్, ఔంధ్, జితకర్ అనే వంశాలవారు మహాగణపతి ఉపాసకులు, అందువలన ఈ వంశీయులు గణపతిని ఉపాసించి నారు. ఈ త్రియంబక దీక్షితులకు అన్నప్పదీక్షితులని గూడ పేరు. వీరికి భైరవ దీక్షితులు బాలచంద్రదీక్షితులు అనే సోదరులుండే వారు. వీరందరూ యజ్ఞ యాగాలు చేయించటంలో దక్షులు. అందువల్ల ముఖస్థలి పరగణాకు వచ్చిన పిమ్మట అక్కడ యజ్ఞాలు చేసే పెక్కు కుటుంబాలకు ఆధ్వర్యం సంపాదించుకున్నారు. ఆనాటి ప్రభుత్వం కొన్ని ఈ కుటుంబాలకు యÖమియాలు (దిన వెచ్చం) గూడ మంజూరు చేసింది. కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక చోట యజ్ఞం జరుగుతు ఉండేది. దీక్షితులకుటుంబాలవారు వెళ్ళుతు ఉందేవారు.
మొదటి వెంకటనారాయణరావు గారి కాలంలో ఈ సంస్థానంలో దిల్షాదాబాద్ (ఊటుకూరు), తాటికొండ, దౌలతాబాదు (దేవగిరి), బాదేపల్లి, బూరుగుల, మరియు వెలిజాల పరగణాలుండేవి. ఇది తూర్పున తాటికొండ, దక్షిణంగా కలువకుర్తి, పడమట కాకులహారం (గురుమీటి కేలదగ్గర), ఉత్తరంగా షాలిబండ (హైదరాబాదు) వరకు వ్యాపించి ఉండేది. ఈ సంస్థాన ప్రభువులు మధ్వ మతస్థులు. ఉత్తరాది మఠానికి చెందినవారు.
వీరి దగ్గర చివరి కాలంలో ఉన్న మంత్రి వెంకన్నగారు. దక్షిణ దేశంలోని రాఘవేంద్రమఠానికి చెందినవారయి తనతోడివారినందరిని దానికి చేర్పించి ఒకప్పుడు ఉత్తరమఠం నుండి శ్రీశ్రీశ్రీసత్యపరాక్రమస్వామివారు రాగా కోట తలుపులు మÖయించినాడట. అపుడు స్వామివారు కొంత సేపు వాకిటనే నిలచి ప్రతీక్షించి చివరకు ఏనుగునుదిగి ద్వారం తెరిపించుకొని లోపలికి వెళ్ళగా వెంకన్న గారు రాణిగారి దర్శనం కానీయలేదట. అపుడు జరిగిన సంగతి తెలిసి స్వామి వారు వెనుదిరిగి ద్వారందాటి వారిని శపించి వెళ్ళిపోయినాడట. ఆయన వెళుతుండగా అక్కడ నిలిచిన వారికపుడే కోటకాలిపొతున్నట్లు కనిపించిందట.
చివరి దశలో ఈ ప్రభువంశంలో గూడ సంతానం లేక నాగర్‌కర్నూలు నుండి పిప్పళ్ళవంశానికి చెందిన మాధవరావు అనే ఆయన్ని దత్తుతీసు కుందామనుకున్నారు గాని అప్పటికే దత్తుచట్టం వచ్చేసింది. గాబట్టి నైజాం సర్కారు వీరి దత్తును అంగీకరించలేదట.
భారత స్వాతంత్య్రసంగ్రామాన్ని ఝూన్సీరాణి దత్తు చట్టం ఎదుర్కోవటంతోనే మొదలు పెట్టింది గదా! ఈ సంస్థానప్రభువులకు ఆమె అనుచరవర్గం లోని తాంతియాతోపే మున్నగువారితో సంబంధాలుండేవట. అందువల్ల ఆనాటి నిజాం ప్రభువు వీరిపైకి పెద్ద రామేశ్వరరాయలను ఉసిగొలిపినాడని క్రీ.శ. 1844 ప్రాంతంలో అతడు దండెత్తి ఈ కోటను నాశనం చేసినాడని చెబుతారు. దానినాశనంతో ఆపరగణాకు నారాయణపేట కేంద్రమైపోయింది.
లోకయ్యపల్లె వైభవంగా ఉన్న దినాలలో నారాయణపేటలోని నేటి ‘పళ్ళ’ రోడ్డున దాని సొరంగద్వారం ఉండేది. దానికి తూర్పున వారిటంకశాల, ఆప్రక్కన గజశాల ఉండేది. ఊరికి ఉత్తరంగా అవధూతమఠం, యోగేశ్వరమఠం అని మఠాలున్నవి. అక్కడ మహారాష్ట్ర దేశపు యోగులుండేవారు. యోగేశ్వరస్వామి క్రీ. శ. 1817 వైశాఖ బహుళ సప్తమినాడు అందరు చూడగానే యోగ సమాధిలో ప్రవేశించెనట. ఇపుడు దానిపై మఠం గట్టబడింది.
ఈ గ్రామంపై రామేశ్వరాయలలాగే మహమ్మదీయుల ఆక్రమణ కూడా జరిగింది. అది ఎప్పుడు జరిగిందో చెప్పటానికి ఆస్కారం లేదుగాని ఈ చుట్టు పట్ల గ్రామాలను వారు “అన్నపూర్ణ నగరాన్ని అన్నాపూర్, కర్ణ కుటీరాన్ని కాన్ కుర్తి” ఏకశిలాపురాన్ని “ఎక్లాస్‌పూర” బ్రాహ్మణపాటిని ‘బొమ్మన్‌షహాద’ మీనాక్షి పురాన్ని “మినాన్ పూర” “చంద్రికిని “ “చంద్రిక “ అని మార్చి వేసినారు.
ఈ ప్రాంతం లోని నీరు మంచిదిగాదు. దాని వల్ల జలోదరం, బోడకాలు, కుష్టు మొదలయిన వ్యాధులేర్పడుతవట.
పాలమÖరులో లోకాయపల్లె దొరలది పెద్ద కోట ఉండేది. ఆ కోటలో పనిచేసే వారందరికీ కోట్లవారని పేరు రూఢియై నిలిచిపోయింది. గత శతాబ్దిలోని స్థానికుడైన డోకూరి బాలబ్రహ్మచారి అవధాని ఇంటిపేరు కోట్లవారే. ఈ కోటలోని దొరసానులకు సొమ్ములు చేసేవారు కాబట్టి డోకూరిబాలబ్రహ్మచారి పూర్వీకులకు కోట్ల అనే ఇంటి పేరు నిలిచింది.
లోకాయిపల్లి దొరలు ఎందరికో మఖ్తాలు ఇచ్చినారు. వారికి చాలా గ్రామాలుండేవట. ఈ సంస్థానం ప్రభువుల యొక్క దివాంజీలు కూడా బ్రాహ్మణులే. వారికి నసులవాయి వారని పేరు. వారు బొంబాయి రాష్ట్రం నుండి వచ్చినారట. వారు దేవి ఉపాసకులు. ఈ వంశంలో తిమ్మాజీరావు ప్రసిద్ధుడు .ఆయన ఒకసారి రకం వసూలుకు తమ పరగణాలకు బయలుదేరి వసూలు చేసుకుని తిరిగి వెళుతుండగా దారిలో జడ్చర్ల దగ్గర ఆవంచ పరగణాను నిజాం ప్రభుత్వము వేలం వేస్తున్నది. ఆ పరగణాను మధ్వప్రభవులు పాలిస్తున్నారు. వారు పన్ను చెల్లించలేకపోగా ప్రభుత్వం దాన్ని వేలం వేస్తుండగా చూడటానికి వెళ్లిన తిమ్మాజీరావు ఉండలేక తాను ఒక పాట పాడినాడు.
పై పాట రాలేదు సవాలు అతని పై తిరిగి దాన్ని కొనవలసి వచ్చింది. వెంట రకం ఉన్నది కాబట్టి తన వాటా రకం కట్టి అప్పటికి లోకాయపల్లెను రుక్మమ్మ దొరసాని గారు పాలిస్తుండగా ఆమె పేర రసీదు తీసుకొని ఇంటికి వెళ్లి దొరసాని గారికి జరిగిన విషయం చెప్పినాడు.
ఆమె అది విని ‘ఇప్పటికే మనకు చాలా గ్రామాలున్నాయి. వానిని సరిగా చూసుకోలేక పోతున్నాం. మళ్ళీ నీవీ క్రొత్తది ఎందుకు కొన్నావు’ అని మందలించింది. ఆయన ‘నాలుక జారి కొనవలసి వచ్చింది. దాన్ని నా సొంతానికి కొనలేదు. ఇదిగో మీ కొరకే కొన్నాను దీన్ని మీరింకేమైనా చేసుకోండి లేదా దానమిచ్చుకోండి’ అని అంటూ రసీదు ఆమెకిచ్చినాడు. అది చూసి ఆమె అతని ప్రభుభక్తికి సంతోషించి దానమిచ్చేటట్లయితే దాన్ని మరొకరికెందుకు? నీకే ఇస్తాను తీసుకోమని అప్పుడే ఆ పరగణా అతని పేర వ్రాసి ఇచ్చింది.
పిమ్మట తిమ్మాజీరావు ఆ ప్రకటన తీసుకొని ఆవంచ పరగణకు వచ్చి ఏ గ్రామంలో దండోరా వేయించిన అది తెలిపిన మా పరగణాను మీరేమి పాలిస్తారని అందరతనిని అవహేళన చేసినారు.
తిమ్మాజీరావు పిమ్మట అతని కొడుకు రుక్మాజీరావు అధికారానికి వచ్చి దీవాంజి వేషం తీసి స్మార్త వేషంతో పోలేపల్లిలో మకాం పెట్టి ప్రక్కగా ఒక స్థలం ఎన్నుకొని కోట మొదలుపెట్టి యాచనా కార్యక్రమం తోనే కోటను పూర్తిచేసినాడు.అప్పుడు పోలేపల్లి లేచి దాని పక్కకు జరిగింది. ఆ కొత్త గ్రామానికతడు తమ తండ్రి పేర తిమ్మాజీపేట అని పేరు పెట్టినాడు.
ఆవంచ, గణపురం ప్రక్క ప్రక్క పరగణాలు కాబట్టి అక్కడికి గణపురం నుండి పని వారిని పిలుచుకున్నాడు. అట్లా వచ్చినవారిలో సరాపువారనే విశ్వబ్రాహ్మణులు ఒకరు.ఆ వంశంలోని లింగోజు అనే ఆయన గ్రామం కొరకు ఒక శిలపై హనుమంతుని తీర్చి ఆలయం ఏర్పరిచి నిలుపగా ఆ ఆలయానికి రుక్మాజీరావు హిజిరి 1020లో లింగోజి వంశీయులకు ఒక సనదు నిచ్చినాడు.
వదినగారు కొట్టగా తన దగ్గరికి సల్కరపేట వేముల నుండి పారిపోయి వచ్చిన అంతన్న అనే బాలుని చదివించి బుద్ధిమంతుని చేసి అంతారం మక్తాగా ఇచ్చి నిలిపినాడు. జడ్చర్లలో ఇప్పుడున్న వెంకటేశ్వర ఆలయం కట్టించినాడు.
ఈ రుక్మాజీరావుకు తిమ్మాజయ్య, ఉప్పాజయ్య, అప్పాజయ్య, రామాజయ్య, అని ఐదుగురు కుమారులు కలిగినారు.
తిమ్మాజయ్య కుమారుడు శ్యామ్‌రావు. ఆయన రుక్కమ్మ, కావేరమ్మ అని ఇద్దరు భార్యలను చేసుకున్న వారిలో ఎవరికి సంతానం కలవలేదు.
రుక్కమ్మ గారు తిమ్మాజీపేటలో ఒక బావి తవ్వించింది. అది ఇప్పుడుంది. కావేరమ్మ నేరెళ్ళపల్లైలో ఒక పెద్ద చెరువు వేయించింది. దానికట్ట సుమారుగా రెండు మైళ్ళు ఉంది. ఈ తాలూకాలోని పెద్ద చెరువులలో ఇదొకటి.
వీరి పెంపుడు కొరకు ఉప్పాజయ్య. అతడు గిరమ్మ, వెంకమ్మ, కాశమ్మ అనే ముగ్గురు భార్యలను చేసుకున్నాడు. వారికి కూడా ఎవరికి సంతానం కలుగలేదు.
ఈ గిరమ్మ కూడా తిమ్మాజిపేటలో ఒక చెరువు వేయించింది. అది కూడా ఇప్పుడుంది. వీరి పెంపుడు కొడుకు శ్యామ్‌రావు. అతని భార్య వెంకమ్మ. ఈమె శాలివాహన శకం 1230 విభవ సంవత్సర కార్తీక బహుళ దశమి నాడు ఇరు వెంటిరామన్నకు ఐతోలు మఖ్తాగా వ్రాయించి ఇచ్చింది.
రుక్మాజీరావు రెండవ కొడుకు ఉప్పాజయ్య. ఆయన కొడుకు శేషప్ప. ఆయనకు తిమ్మాజయ్య, ఉప్పాజయ్య అని ఇద్దరు కుమారులు కలిగినారు.
ఉప్పాజయ్యకు శేషప్ప, ఉప్పాజయ్య అని మళ్లీ ఇద్దరూ కుమారులు కలిగినారు. శేషప్ప కొడుకు రామాజాయ్య.ఆయన లక్ష్మమ్మ, రుక్కమ్మ, నాగమ్మ అనే ముగ్గురు భార్యలను చేసుకోగా వారిలో ఎవరికి సంతానం కలగలేదు. రుక్కమ్మ తన చెల్లెలు కొడుకు శేషారామాజీరావును పెంచుకున్నది. ఆయన పడాలలో సన్ 1276 ఫసిలీ అక్షయ సంవత్సర శ్రావణ శుద్ధ పాడ్యమినాడు హనుమాన్లకు శిలా మంటపం కట్టించినాడు. ఈయన కొడుకు ఉప్పాజయ్య. ఆయన భార్య రాధమ్మ. ఈమె శిరసవాడలో ఉండేది. అక్కడి కోట నభివృద్ధి చేసింది ద్వాదశి వ్రతంపాటించేది కాబట్టి బ్రాహ్మణ భోజనానికై చాలామందికి సిరసవాడలో ఆశ్రయమిచ్చింది.
రుక్మాజీరావు మÖడవ కొడుకు అప్పాజయ్య. అప్పాజిపల్లెను కట్టించినాడు.ఈయన కొడుకు మెల్‌గిరి. ఇతని శాఖ అంతరించింది.
నాలుగోకొడుకు రామాజయ్య. అతను కొడుకు రుక్మాజయ్య. వీరి శాఖ ఇప్పుడు ఉంది. ఐదవ కొడుకు చందరుసు. వీరిశాఖ శాఖ నష్ట సంతానమైపోయింది.
రుక్మాజీరావు నుండి వీరు కూడా స్వతంత్రమైన దొరలైనారు. కారుకొండ మారేపల్లి. రేవల్లి, వాడాల వారని నాలుగు శాఖలైనారు. వీరిలో వాడాల శాఖ అందరికంటే పెద్దది. వారికి 12 గ్రామాలు ఉండగా తక్కిన ముగ్గురికి నాలుగు గ్రామాలే ఉన్నాయి.
పాలమÖరుజిల్లాలో ఈ సంస్థానం నాటకరంగానికి సేవ చేసిన ఏకైక సంస్థానంగా ఉంది. ఈ సంస్థానం యొక్క గ్రామాలు అన్నీ ఒకేచోట గాక తాలుకాకు కొన్ని చొప్పున ఉన్నవి. అవిగాక వీరు స్వయంగా ఎన్నో గ్రామాలు స్థాపించినారు. ఈనాడు మహబూబ్‌నగర్ జిల్లాలోని తిమ్మాజిపేట, కావరంపేట, అప్పాజీపల్లె. బావాజీపల్లె మొదలైన గ్రామాలు స్థాపించినట్లు చెబుతారు.
ఈనాటి మహబూబ్‌నగర్‌కు మొదట పాలమÖరని పేరు. అక్కడ పాలకోడిసె చెట్లు ఎక్కువగా ఉండగా వానిని నరికి గ్రామం స్థాపించిరట. అందువల్ల దానికి పాలమÖరని పేరేర్పడిందని ఒక కధ ఉండగా “పాలమఱ్ఱి” అని మర్రిలో ఒక భేదం. ఆ చెట్లెక్కువగా ఉన్నందువల్ల దీనికి ‘పాలమఱ్ఱి’ అని పేరు నిలిచి అది పాలమÖరయిందని మరో మతం ఉంది. ఇప్పుడు ‘మర్లు’ అని మహబూబ్‌నగర్‌లో ప్రత్యేకంగా కాలనీయే ఉంది.ఈ గ్రామాన్ని రుక్కమ్మ దొరసాని స్థాపించింది. అందువల్ల మొదట ఇది రుక్కమ్మపల్లె అని పిలువబడుతు రానురాను అమ్మపల్లె అయింది. అదిప్పుడు పాత పాలమÖరుగా ఉంది. ఈ రుక్కమ్మ దొరసాని సమాధి ఇపుడు తిమ్మాజీపేటలో ఉంది. ఏటా శ్రావణంలో అక్కడికి బండ్లు వెళ్లుతవి.
ఈ రుక్కమ్మ దొరసాని సవతి కావేరమ్మగారు. ఈమె పీష్వాబాజీరావు తమ్ముని కూతురు అని ఒక వదంతి ఉంది. ఈమె పేరుతో ఈనాటి కావరంపేట వెలసింది. అదిపుడు క్రిష్టియన్ హాస్పిటల్‌తో ప్రసిద్ధంగా ఉంది.
ఈ వంశీయులు ఝాన్సిలక్ష్మీబాయికి ఆనాడు యుద్ధంలో పరోక్ష సహాయం అందించినారని ఈ సంస్థానంపై క్రీ.శ .1859 జూలై రెండవ తేదీ నాడు వనపర్తికి చెందిన రామేశ్వరరాయలు దండెత్తి ఓడించి వీరి గ్రామాలను తమ సంస్థానంలో కలుపుకున్నాడు. అంతవరకు ఈ సంస్థానం 300 సంవత్సరాలు పాలించిందని స్థానికుల కథనం. కనుక దీని ఆవిర్భావం 16వ శతాబ్ది ఉత్తరార్థంలో జరిగి ఉంటుంది. ఈ సంస్థానానికి మÖలపురుషుడెవరో అతనినుండి చివరివరకెందరు రాజులు పాలించినారో తెలుసుకునే అవకాశం లేదు. ఈ వంశీయులు శాసనాలేవి వేయించలేదు. కాబట్టి వీరి చరిత్రకు వీరాయాకాలాలలో ఇచ్చిన దాన పత్రాలే ఆధారంగా ఉన్నవి కాని అవి కూడ ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి