“ప్రసిద్ధి చెందినటువంటి ఇంతమంది మేధావుల సమక్షంలో ప్రోత్సాహకరమైన మాటలతో నన్నుగూర్చి ఎంతో విశేషంగా మాట్లాడటం చూసి మరెంతో ఆనందంతో నన్ను నేను ఉన్నతంగా, కిరీటం వరించిన రాజకుమారుడిలా ఉప్పొంగి భావావేశంతో కదిలిపోతున్నాను. చీకట్లో బతికే ఒక గుడ్లగూబ అకస్మాత్తుగా తన గూటి నుండి బయటకొచ్చి ప్రకాశవంతమైన వెలుతురును ఒక్కసారి చూస్తే అది పొందే ఆనందం ఎట్లా ఉంటుందో అట్లాంటి ఆనందానుభూతిని నేడు నేను పొందుతున్నాను.
మొదట నాదేశం గురించే నేను నిరంతరం ఆలోచిస్తాను. స్వీడిష్ అకాడమివారు నిండు మనసుతో ఈ విధంగా నన్ను సత్కరించటం నాకెంతో గర్వంగా ఉంది. ఇంతవరకు ఇటువంటి అనుభూతిని నేను పొందలేదు. మాటలకందని ఆనందంతో దాదాపు ఉక్కిరిబిక్కిరికి లోనవుతున్నాను. ఈ అనుభూతిని ఎట్లా చెప్పాలో, మరెట్లా వివరించాలో తెలియటం లేదు.
ఈ సంవత్సరానికి గాను ఒక ఫ్రెంచి రచయితను నోబుల్ పురస్కారానికి ఎన్నుకోవటం ఆనందంగా ఉంది. ఈ బహుమతితో మా ఫ్రెంచి సాహిత్య కీర్తి ప్రతిష్టలకు గొప్ప గుర్తింపును గౌరవాన్ని కల్గించిన స్వీడిష్ అకాడమి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఫ్రెంచి సాహిత్య క్షేత్రంలో సృజనాత్మకతకు, అద్భుత ఆలోచనలకు మరో పేరుగా ఉన్న కవులెందరో ఉన్నారు. వారిని ముందుగా ఎన్నుకోవలసి ఉండినది. వారందరికి బదులుగా నన్ను ఎందుకు ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎన్నుకున్నారో తెలియదు.
మానవ శక్తి ఎప్పుడు స్తబ్దంగా ఉండదని, నిస్సారంగా మిగిలిపోదని నా నమ్మకం. ఈ నమ్మకమే నన్ను నెమ్మదిగా కదిలించి అధిక సంతోషంతో ముందుకు నడిపించింది. స్వీడీష్ అకాడమి వారు ఏమాత్రం బోధనలు చేయని నా నవలకు ఇంత అత్యున్నత పురస్కారం ఎట్లా ఇచ్చారని దూరం వెళ్ళి ఆలోచించాను. ప్రతివ్యక్తి తనను తాను సమర్థించుకోవటం తన పట్ల తనకు నమ్మకం ఉండటం సహజం కాని ఇట్లాంటి లక్షణాలను మరి కొందరు ప్రశ్నిస్తారు. అనుమానిస్తారు. సందేహాలు కూడా వ్యక్తం చేస్తారు. స్వేచ్ఛాయుతమైన వ్యక్తులు ఇట్లాంటి వాటిని వారికున్న అత్యధికమైన ఆకర్షణ ద్వార సులభంగా తప్పించుకుంటారు. ఇట్లాంటి వారే తమ వ్యక్తిత్వం కాపాడుకుంటూ ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతుంటారు. స్వతంత్ర భావాలు నిర్మలమైన ఆలోచనలే ఇందుకు కారణం.
నేను అనుకుంటాను నే నమ్మిన సిద్ధాంతానికి ఈ పురస్కారం లభించి ఉంటుంది. సిద్ధాంతం అన్నది చాలా పెద్ద మాట ఇది వివిధ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మనిషి అభిప్రాయాలను ఒక పద్ధతిలో మన ముందు ఉంచే అంశం. సిద్ధాంతాలను నేను నమ్ముతాను. సరియైన రీతిలో వాటిని అంగీకరిస్తాను. నాకు నేను నిర్మించుకున్న సిద్ధాంతాలను నా పరిధిలోని కొన్ని మార్గదర్శిక సూత్రాలకు అనుగుణంగా నిత్యనిష్టతో ఆచరించాను.
నేను చిన్న తనంలో ఆంగ్ల రచయిత థామస్ హర్డి నవలలను చదివి అతని స్వభావానికి పాటించిన గొప్ప విలువలకు ప్రభావితుడనైనాను. “నిజమైన జీవితం యొక్క విలువ అందమైన దాంట్లో అంతగా ఉండదు, విషాదంలోంచే అంతా కనపడుతుంది” అంటాడీయన. ఈ నవల నన్ను ఎంతో ఆకర్షించి మనసులొ మిగిలినటువంటిది. సాహిత్యానికి నన్ను దగ్గర చేర్చి దానిపట్ల అభిరుచిని కలిగించింది. అప్పుడే అనుకున్నాను నవల ముఖ్య ఉద్దేశం జీవితంలో జరిగే విషాద సంఘటనలకు మాట కావాలని. దానికి ఈ రోజు మరో విషయం జతచేసి చెప్తున్నాను. ఒక వైయక్తిక విషాద సంఘటనల జీవితం ఆ వ్యక్తి బతికిన కాలంలోనే పూర్తికావాలి అప్పుడే పరిపూర్ణత సిద్ధిస్తుంది.
ఈ సందర్భంలో టాల్స్టాయి చెప్పిన కొన్ని శాశ్వత సత్యాలను చెప్పకుండా ఉండలేను. ఆయన పుస్తకాలు నా అభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. అసమానమైన ఆయన జ్ఞానం ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలకు నిలువుటద్దం. నవల బ్రతకాలన్నా, రచయిత బ్రతకాలన్నా ఎంత చెప్పారు అన్నది కాకుండా ఏం చెప్పారు అన్నది ముఖ్యం. అంతే కాకుండా రచయితకు తప్పనిసరిగా జీవిత రహస్యంతో పాటు విశ్వంలోని విషయాలను బహిర్గతం చేయగల భవిష్యత్ దృష్టి, గాఢమైన ఆవేశం ఉండాలి. ఈ విషయంలో టాల్ స్టాయి గొప్ప ప్రతిభగల వ్యక్తి. అతని ప్రతి సృష్టిలోను దాదాపు తత్వ విచారంతో వెంటాడిన నైతిక విలువలుంటాయి. ప్రతి అనుభవం బద్రపరిచి మనకందిస్తున్నట్లు ఉంటాయి. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలు నెమరేసుకోవటం నా అదృష్టంగా భావిస్తాను. స్వీడిష్ అకాడమి వారు పరోక్షంగా ఆయనపట్ల గౌరవాన్ని చూపి ఆ మేధావికి ఈ విధంగా నివాళులు అర్పించి ఉంటారు.
నా ప్రసంగం కొన్ని యదార్థ సంఘటనల ద్వారా ముగించాలనుకుంటున్నాను. కొన్ని విషాద సంఘటనలు గుర్తుచేసి ఆనందకరమైన ఈ సమయాన్ని భగ్నం చేస్తున్నందుకు ఎంతో విచారిస్తున్నాను. ఏది ఏమైనా స్వీడిష్ అకాడమివారు ప్రత్యేక ప్రయోజనం లేనిది ఈ ఫ్రెంచి నవల “లెవిట” 1914 (సమ్మర్ 1914) రచయితను ఎన్నుకొని ఉండరు.
‘సమ్మర్ 1914’ అనేది నా చివరి నవల. దాని విలువను నిర్నయించేది నేనుకాదు. కాని ఎందుకోసం దానిని నేను రచించానో నాకు తెలుసు. యÖరప్ పూర్వ వైభవం పునరుద్ధరణకు నేను ఈ మÖడు సంపుటాల పుస్తకంలో ప్రయత్నించాను. 1914 నాటి పరిస్థితులను, ప్రభుత్వం యొక్క విచక్షణా రహిత పరిపాలన, పాలకుల బలహీనతలను చూయించటానికి ప్రయత్నించాను. ముఖ్యంగా వారి మÖర?త్వం వల్ల జరిగిన పరిణామాలను తమ ముందు ఏం జరుగుతుందో తెలుసుకోలేని అశ్రద్ధను వివరించాను. తొమ్మిది మిలియన్ల మంది ఎట్లా జల ప్రళయానికి బలైపోయారో, పది మిలియన్ల మంది ఘోరంగా ఎలా చితికి పోయారో తెలియజేయటం జరిగింది.
ప్రపంచంలోని అత్యున్నతమైన నోబుల్ బహుమతి సాహిత్య న్యాయ నిర్ణయ మండలివారు నాపుస్తకానికి గొప్ప గౌరవపదమైన పేరును సమకూర్చటం వెనుక పుస్తకాలు అచ్చు వేయబడి వ్యాప్తిలోకి రావటం కన్నా ముఖ్యంగా నేను యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా నిలిచి పోరాడినందుకు, వినాశకర శక్తులను ధైర్యంగా ఎదుర్కొన్నందుకు ఈ పురస్కారం లభించి ఉండొచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి