తెలుగు చలన చిత్ర పితామహుడు హెచ్.ఎమ్.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, రామ్‌నాథ్, పారేపల్లి శేషయ్య, కన్నాంబ - అందరూ కలసి రోహిణి పిక్చర్స్ సంస్థ బ్యానర్‌పై ‘రంగూన్ రౌడి’ నాటకం ఆధారంగా 1938లో నిర్మించిన సాంఘిక చిత్రమిది.
హెచ్.ఎం.రెడ్డిగారే చిత్ర దర్శకులు. ప్రభల సత్యనారాయణ సంగీతం నిర్వహించారు.
సముద్రాలవారు పూర్తిగా రచన చేసిన మొదటి చిత్రమిది. కథ, మాటలు, పాటలు రాసి సింగిల్ కార్డ్ క్రెడిట్ పొందారు.
చిత్తూరు వి.నాగయ్యగారికి ఇది తొలిచిత్రం. కన్నాంబ హీరోయిన్. నాగయ్య గారికి హీరోయిన్ సోదరుడి పాత్రను యిచ్చారు. అది గోపీనాథ్ అనే దేశభక్తుడి పాత్ర. రామానుజాచారి హీరో. వీరితో పాటు కాంచనమాల వ్యాంప్ పాత్ర పోషించింది. ఇంకా గౌరీపతి శాస్త్రి, సరళ మొ॥ వారు నటించారు.
‘గృహలక్క్ష్మి’ చిత్రం వీడియో అలభ్యం. రికార్ట్స్‌పై మÖడు పాటలు (రాధా అభాగ్యసోదరి..., లెండు భారతవీరులారా..., వందే వందే భారతమాతా...) మాత్రమే దొరుకుతున్నాయి.
ఈ సినిమాకు, సముద్రాల 12 పాటలు, 3 పద్యాలు రాశారు. వీటిలో ప్రబోధాత్మకమైనవి, ప్రణయ భావనతో కూడినవి, శృంగార పరమైనవీ వున్నాయి. కొన్ని పాటల్లో భాష సరళగ్రాంథికంగా వుంటె మరికొన్ని వ్యావహారిక భాషకు కాస్త పై స్థాయిలో వున్నాయి.
కథ - మౌలికాంశం :
ఆనందమయమైన సంసారం కంటె స్వర్గం లేదు.
కాని ఆ స్వర్గ సౌఖ్యాన్ని భగ్నం చేయటానికి ఎందరో
సైతానులు కాచుకొని వుంటారు - ఎవరు కుట్ర పన్నినా
సత్యమే నిలుస్తుంది - దైవబలమే జయిస్తుంది
ఇది ఈ చిత్ర కథకు మÖలం. మద్యపాన నిషేధం, అస్పృశ్యత మొ॥నవి ఈ కథా చక్రంలో తిరిగే రేకులు.
కథా సంగ్రహం
కోటీశ్వరుడైన కొడుకు డా॥ కృష్ణారావు, ఆయన భార్య రాధ. ఆమె ఆదర్శ ఇల్లాలు. ఉత్తమ గృహలక్క్ష్మి. సంఘసేవకునిగా, అస్పృశ్యతపై మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడే గోపి, రాధ తమ్ముడు - ఆశ్రమ సహాయార్థం గోపి ఏర్పాటు చేసిన భరతనాట్య ప్రదర్శనకు బావ కృష్ణారావును ఆహ్వానిస్తాడు. కృష్ణారావు అందం ఆస్తి ఐశ్వర్యం మీద కన్నేసిన నర్తకి మాధురి, అతడిని వల్లో వేసుకుంటుంది. తాగుడుకు బానిసగా మారుస్తుంది. కృష్ణారావు తన భార్యాపిల్లల్ని మరచిపోయి, మగువ, మధువు వ్యసనంలో కూరుకుపోతాడు.
డాక్టర్ యింట్లో పనిచేసే అయ్యర్‌గారు, మార్వాడి, నర్తకి తల్లి కృష్ణారావు ఆస్తిని కాజేయాలని పథకం వేస్తుంటారు. ఈలోగా ఆస్తిని తన మనుమల పేరున రాసి ఆఫీసు మేనేజర్ విశ్వాసరావును అటార్నిగా నియమించి మరణిస్తాడు కృష్ణారావు తండ్రి.
విశ్వాసరావు, రాధను సంప్రదించి మాధురి యింటికి వెళతారు. అక్కడ జరిగిన గలాటాలో విశ్వాసరావును పిస్టల్‌తో కాల్చి, మార్వాడి ఆ నేరాన్ని కృష్ణపై తోస్తాడు. కృష్ణ పశ్చాత్తాపంతో రాధను క్షమించమంటాడు. ఇంతలో పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు.
బాకీదార్లు డాక్టరు ఆస్తిని జప్తు చేసి రాధను, పిల్లల్ని యింట్లోంచి వెళ్ళగొడతారు. మారుమÖల పల్లెలో ప్రచారం చేస్తున్న గోపీ చెల్లెలి కొచ్చిన ఆపద తెలుసుకొని తన ఆశ్రమంలోకి తీసికొస్తాడు.
కాని రాధ, మాధురిని బతిమాలితే లాభం కలుగుతుందని వెళుతుంది. అక్కడివారు ఆమెను కొట్టి మేడమీద నుంచి నెట్టివేయగా, ఆమె పిచ్చిదవుతుంది. సత్యం, దైవం, న్యాయం అంటూ వీధుల్లో పడి పరుగెడుతుంది.
చివరికి మాధురి కోర్టుకు వచ్చి నిజానిజాలు చెబుతుంది. కృష్ణారావును నిర్దోషిగా విడుదల చేస్తారు. గోపి, రాధాకృష్ణులంతా ఆశ్రమానికి విచ్చేస్తారు. తమ విజయానికి గాంధీజీని స్తుతిస్తారు.
ఇందులో కన్నాంబ (రాధ), రామానుజాచారి (డా॥కృష్ణ), నాగయ్య (గోపీనాథ్), కాంచనమాల (మాధురి), గౌరీపతి శాస్త్రి (ప్రచండశాస్త్రి), సుబ్బారావు (మార్వాడి), విశ్వాసరావు (ఎం.సి.రాఘవన్) మొ॥వారు నటించారు.
సామాజిక చైతన్యానికి సముద్రాలవారి కలం శ్రీకారం చుట్టింది ఈ చిత్రం ద్వారానే !
అభ్యుదయభావాలు, నైతిక విలువలు మేళవించి సామాజిక స్పృహతో పాటలు రాస్తే అవి సమకాలీనుýనే కాదు, సార్వకాలీనులనూ ఆకట్టుకొంటాయని ఈ చిత్రం ద్వారా నిరూపించారు సముద్రాల.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి