మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

10, అక్టోబర్ 2026, శనివారం

లైలామజ్నూ (1949)

భరణీ పతాకంపై భానుమతి రామకృష్ణ దంపతులు తీసిన రెండవ చిత్రం ‘లైలామజ్నూ’. భారతీయ సినిమా చరిత్రలో ఇదే కథాంశంతో వివిధ భాషల్లో అప్పటికే తొమ్మిది మార్లు ఈ సినిమా నిర్మించబడింది. దక్షిణాదిన మాత్రం ‘లైలామజ్నూ’ల కథాంశంతో సినిమా రావడమన్నది భరణీవారి చిత్రంతోనే మొదలయింది.

తెలుగులో వచ్చిన మొదటి విషాద ప్రేమకథా చిత్రం, భరణీవారి ‘లైలామజ్నూ’. అంతేకాదు అన్యదేశపు (అరబ్) నేపథ్యంతో వచ్చిన తొలి ప్రేమకథా చిత్రం కూడా యిదే! భరణివారు ఆరంభించిన సమయంలోనే న్యూటోన్ స్టూడియోస్ వారు బాలాజి పిక్చర్స్ పతాకంపై ‘లైలామజ్నూ’ చిత్రం ఆరంభించారు. వాళ్ళు తెలుగులో అనువదించి విడుదల చేయనున్నారని వార్తలు రావడంతో భరణి వారు వేగంగా తీసి వారి కంటే ముందే విడుదల చేశారు.

ఈ చిత్రంలో లైలాగా భానుమతి. మజ్నూగా అక్కినేని నాగేశ్వరరావు నటించారు. మజ్నూ పాత్రకు అక్కినేనిని ఎంపిక చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. భానుమతి పక్కన నటించడానికి అక్కినేని పర్సనాలిటి చాలదని బి.ఎన్.రెడ్డి లాంటి వాళ్ళు రామకృష్ణకు సలహా యిచ్చారు. కానీ అక్కినేనిలో పరిపూర్ణమైన నటుడిని దర్శించిన రామకృష్ణ అతనినే ఎంపిక చేసుకున్నారు. “భగ్నప్రేమికుని పాత్రను నాగేశ్వరరావే పోషించాలి” - అని ప్రజలందరూ మెచ్చేలా చేశారు... అదీ, రామకృష్ణ అనబడే దర్శకునిలోని దార్శనికశక్తి!

మధ్యఆసియాకు (అరబ్బి) సంబంధించిన విషాదాంత ప్రేమకథకు భారతీయతను అద్దారు భానుమతీ రామకృష్ణులు. అయినప్పటికీ ఈ సినిమా కేవలం పాటల బలంతో జీవించిందని, భ.రా.గో. వంటి ప్రముఖులు విశ్లేషించారు.

కులం, మతం, ధనం కారణాలుగా ప్రేమవిఫలమై ప్రేమికులు మరణిస్తారన్నది ప్రపంచ సాహిత్యం చెబుతున్న చారిత్రక సత్యం. చనిపోయిన ప్రేమికులు స్వర్గంలో కలుసుకొంటారని చెబితే భారతీయులు తృప్తి పడతారు. అలాంటి ఫినిషింగ్‌తో చక్కగా పాలిష్ చేసిన ఆచార్యులు, సముద్రాల వారు. అందుకే ‘జీవన మధుభాండం తునాతునకలయిందని’ మజ్నూ ఆక్రోశించినపుడు ప్రేక్షకులు కన్నీరు కారుస్తూనే ఇది కళాఖండమని మురిసిపోయారు...

‘లైలామజ్నూ’ కథకు ఆకృతినిచ్చిన వారు రామకృష్ణ గారే. ఈ చిత్రకథా చర్చల్లో సముద్రాల, భానుమతి, డి.ఎల్.నారాయణ, మల్లాది ప్రముఖంగా పాý£్గన్నారు. అంతకుముందు 1948లో హిందీలో వచ్చిన చిత్రాన్ని నిశితంగా పరిశీలించారు. ఎక్కడా లోపాలు లేకుండా నిర్మించారు.

ఈ చిత్రానికి, సముద్రాలవారు మాటలు, పాటలు రాశారు. సి.ఆర్.సుబ్బురామన్ సంగీత దర్శకత్వం వహించారు. విక్రమ్ ప్రొడక్షన్స్ అధినేతగా పేరుగాంచిన నిర్మాత దర్శకులు బి.ఎస్.రంగా ఛాయాగ్రాహకుడిగా, వి.శ్రీనివాసరాఘవన్ శబ్దగ్రాహకుడిగా, వేదాంతం రాఘవయ్య నృత్యదర్శకుడిగా పనిచేశారు. డి.ఎల్.నారాయణ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు.

సుబ్బురామన్‌గారి సంగీతం, ముఖ్యంగా రీరికార్డింగ్, మనల్ని మధ్య ఆసియా దేశాలకు తీసికెళుతుంది. అలాగే సముద్రాల వారి రచన కూడా అరబ్బు వాతావరణాన్ని ప్రతిఫలింపజేసింది. (అయితే నోములు, వ్రతాలు, విధి వంటి పదాలతో తెలుగు తనాన్నీ చూపించింది.)

ప్రసిద్ధ గాయకుడు మాధవపెద్ది సత్యంగారికిది తొలిచిత్రం. తిరువాన్కూరు సిస్టర్స్ లలిత, పద్మినిలకు కూడా ఇది తొలిచిత్రం. ప్రసిద్ధ వైణికుడు వీణ చిట్టిబాబు, ఈ చిత్రంలో చిన్ననాటి మజ్నూగా నటించాడు.

‘మనుచుగాత ఖుదా తోడై’ పాటను ఘంటసాల, సుసర్ల దక్షిణామÖర్తి మాధవపెద్ది సత్యం, పిఠాపురం కలిపి పాడారు.

ఈ సినిమా ఆరంభంలో వచ్చే నేపథ్య వ్యాఖ్యానాన్ని ముక్కామల చేత చెప్పించారు రామకృష్ణ.

ఈ చిత్రంలో లైలా తండ్రి అమీర్ సర్వార్‌గా ముక్కామల, తల్లి బేగం సర్వారిగా హేమలతా దేవి, మజ్నూ తండ్రి అమీర్ ఉమ్రిగా ఆరణి సత్యనారాయణ, సి.ఎస్.ఆర్. ఇరాక్ ప్రభువుగా, అతని భార్య జరీనాగా జూ॥ శ్రీరంజని, అన్వర్‌గా కస్తూరి శివరావు, జోరాగా సురభి బాలసరస్వతి, జుగ్నుగా విమలాదేవి, మౌల్విగా సీతారాం, మౌల్వీ భార్యగా అన్నపూర్ణదేవి, చిన్నలైలాగా బేబి కృష్ణవేణి నటించారు.

కథాసంగ్రహం :

ముస్లింల పవిత్రక్షేత్రమైన మక్కా ప్రాంతంలో జరిగిందని భావించబడిన ప్రేమకథ యిది. లైలా అమీర్ సర్వార్ కూతురు. అమీర్ ఉమ్రీ కుమారుడు ఖయస్. సర్వార్, ఉమ్రి ప్రాణ స్నేహితులు. లైలా, ఖయస్‌లు ఒకే చోట పుట్టి, ఒకేచోట చదువుకొంటున్నారు. వారి వయసుతో పాటే వారి ప్రేమ కూడా వర్థిల్లింది.

లైలా తండ్రికిది నచ్చలేదు. ఖయస్‌ను మందలిస్తాడు. ఉమ్రిని కూడా హెచ్చరిస్తాడు. ఇద్దరి మధ్య పగలు, పొగలు చెలరేగాయి. కోపించిన సర్వార్ కూతురిని తీసికొని పరివార సమేతంగా మక్కాకు మకాం మర్చాడు. లైలాను వెతుక్కుంటూ ఖయస్ కూడా మక్కా చేరుకుంటాడు. ఇద్దరూ రహస్యంగా కలుసుకుంటుంటారు. ఓసారి లైలా తండ్రి కంట పడ్తారు. ఖయాస్‌ను మెడబట్టి గెంటిస్తాడు. అల్లరిమÖకలు ఖయస్‌ను పిచ్చివాడికింద జమకట్టి రాళ్ళతో కొడ్తూ లైలాకా ముజ్ను’ అని గేలిచేస్తుంటారు.

ఇరాక్ ప్రభువు, వీధుల్లో తిరిగే ఖయాస్‌ను చూసి అన్వర్‌ద్వారా అతని కథ తెలుసుకుంటాడు. ఖయాస్‌ను సమ్మోహన పరచిన ఆ అందాల రాశిని ఎలాగైనా పొందాలను కొంటాడు. ఇరాక్ ప్రభువు సంపద ముందు ఖయస్ ప్రేమ చిన్నబోయింది.

లైలా అభ్యంతరాలను పెడచెవిన బెట్టి, ఇరాక్ ప్రభువుకు యిచ్చి పెళ్ళి చేస్తాడు. ఖయస్ తిండీ నీళ్ళూ మానేసి ఎడారుల్లో తిరుగుతుంటాడు. ఇరాక్ ప్రభువు లైలాను పెళ్ళాడటం అతని భార్య జరీనాకు ఇష్టముండదు. లైలా కథ తెలుసుకొని జరీనా నిర్ఘాంతపోతుంది.

లైలా ఇరాక్ ప్రభువుతో సంసారం చేసేందుకు ఎంతమాత్రం అంగీకరించదు. చందమామతో ఖయస్‌కు రాయబారాలు పంపుతుంది. ఓపలేని ఇరాక్ ప్రభువు ఓరోజు లైలాను ఏ సంగతీ తేల్చమంటాడు. ఆమె ý£ంగదు. చావడానికి సిద్ధపడుతుంది.

షహజాదా, ఆమె పవిత్రప్రేమకు ముగ్ధుడై తన చెల్లెలిగా ప్రకటిస్తాడు. రాజలాంఛనాలతో ఖయస్ దగ్గరకు సాగనంపుతాడు. ఇంతలో ఎడారి తుఫాన్ వస్తుంది. ఎట్టకేలకు లైలా - ఖయాస్ కలుసుకుంటారు. ఒకరి ఒడిలో ఒకరు కన్నుమÖస్తారు.

నిర్మల ప్రేమ ఎన్నడూ వ్యర్థంకాదు

ఈ లోకంలో కాకపోతే - అమరలోకంలో ఫలిస్తుంది.

సాహితీ విశేషాలు:

సముద్రాలవారు సహజత్వం కోసం ఎక్కువ ఉరుదూ, అరబ్బీ పదాలు ఉపయోగించారు. అయితే తెలుగు నుడికారంతో మాటలు అందించారు. లోకంలో నిత్య జీవితంలో జరిగే వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని రాశారు. ఎప్పటిలాగే జాతీయాలు, లోకోక్తులు వాడి  సంభాషణలకు పటుత్వం కలిగించారు. మచ్చుకు కొన్ని:

1.  పేనుకు పెత్తనమిస్తే ఇంతే మరి! (చిన్న లైలాను మౌల్వీ కొట్టినందుకు లైలాతల్లి కోపంతో భర్తతో  పలికినపుడు)

2.  అహంకారమే ఈ ఆడజాతిని ఇంతకాలం బ్రతికించింది. (ఇరాక్ ప్రభువు, జరీనాతో)

3.  మాటజారేముందు ఆలోచించాలి. (ఖయస్ తండ్రి అవిÖరఉమ్రి,లైలా తండ్రితో)

4.  చచ్చినపామును చంపటం సర్దార్ల లక్షణం కాదు, (ఖయస్ తండ్రి)

ఇవన్నీ లోకంలో అందరి నోళ్ళల్లో నానే మాటలే! ఇక ప్రేమ, పెళ్ళికి సంబంధించి సందర్భానుసారంగా బరువైన సంభాషణలు రూపొందించారు.

1.  ‘మన శరీరాలు దూరమైన, మనసులు దూరంకావు, ప్రేమ అజరం, అమరం’ -లైలా ఖయస్‌తో అంటుంది.

2.  పెళ్ళంటే పూలపాన్పు కాదు. కాళ్ళకు సంకెల కంఠానికి ఉరి. స్వేచ్ఛాజీవులకు పెళ్ళివద్దు (ఇరాక్ ప్రభువు)

ఇక ఉరుదూ పదాలు  మేళవించి వచనంలో కూడా ప్రాసతో రాశారు.

“ఖజానా ఎందుకే దివానా? నాకంటికి  నిండుగా వున్నవే బనానా” (మౌల్వి) అన్వార్, తయ్యార్, హుజూర్, హజార్ వంటి పదాలతో శివరావు హాస్యం పండించాడు. 

భారతీయ సంస్కృతి ప్రతిబింబించే విశ్వాసాలు, చేర్చారు.

ఉదాహరణకు.

“ ఏం గ్రహచారమే తల్లి” (లైలా తల్లి - లైలా పరిస్థితికి బాధపడ్తూ అయింది.

ఇస్లాం విశ్వాసాల్లో గ్రహచారం ఉండదు)

“విధిబలీయము” ఏకొరనోములు నోచుకున్నానో” మొ॥నవి లైలా నోట మనకు విన్పించారు సముద్రాల-

చివరికి లైలా మజ్నులు చనిపోయాక-

వారి ప్రేమ అమరలోకం’లో ఫలిస్తుంది (ఇస్లాం మతస్తులకు ఇంద్రాది లోకాలుండవుగదా! అని ప్రేమ సిద్ధాంతాన్ని భారతీయం చేశారు.

---

ఇక పాటల విషయానికొస్తే.... సముద్రాల sTÖ చిత్రానికి 19 పాటలు రాశారు- ఈ పాటలల్లోనూ కవితా సౌందర్యారాధనే కనిపిస్తుంది. ఉరుదు పదాల మార్దవ్యమÖ కనిపిస్తుంది.

Q మొదటి పాటలోనే ఆ మెరుపు తళుక్కుమంటుంది. చిన్నలైలా మజ్నులకు పువ్వుపుట్టగానే పరిమళించినట్టు, ‘మదర్‌సా’ (బడి)లోనే ప్రేమపుడుతుంది. అందుకే మౌల్వీ చెప్పే ఎక్కాలు, లెక్కలు అలీఫ్‌బేపేలు జేర్ జెబర్‌పేష్‌లు ఉరుదు భాషలోని అక్షరాలు, గుణింతాలు) తలకెక్కవు. 

నీవే నా చదువు, నీవే మౌల్వీ అంటాడు బాల ఖయాస్.తేనెలుతీర్చే ఒరవడిలో కోయిల నేర్పే పాటలు 

మన మనసులే కలలు ఆ బడిలో లేవే అంటాడు. అతనికి బడి కంటె అమ్మాయి ప్రేమఒడి యిష్టం.

Q రెండోపాట లైలా ఖయస్‌ల తరుణదశ (టీనేజ్)లో తయారైంది.

ప్రేమజీవితమే -హాయి! అని తీర్మానించుకొంటారు.

పూచినపూలతీగలో, విరబూసిన వెన్నెలలో, లైలాను చూస్తాడు. జీవసితారా అంటాడు. ప్రేమకు నీరాజనం పలికిన అనుభవించిన మనిద్దరమే చేయాలి. అని అంటాడు. 

Q తరువాత వారిద్దరికీ ఎడబాటు - వియోగం మొదలవుతుంది.

పూవును వదలి సువాసన వుండదు.

జాబిలిని వదలి చక్రవాకం ఉండదు.

లైలా ఖయస్‌లు అలాంటివారే

వారి ప్రేమే అద్వైతస్థితిని పొందింది. 

Q ఖయస్ ప్రేమ ఫలించదు. లైలాను ఇరాక్ ప్రభువు తీసికెళ్తుంటారు. అతని ఉద్విగ్నస్థితి - ఎలాంటిది?

జీవన మధుభాండం - తునాతతునకలైపోయింది.

చుక్కలు కరిగికరిగి కన్నీరు కార్చాయి.

చంద్రుడు మొఖం చాటు చేసుకున్నాడు.

లైలా సుఖాన్ని కోరుకొని త్యాగదృష్టిని చూపాడు. కానీ ఏదో ఆశ ఆ అమాయక ప్రేమికులను బ్రతికిస్తుంది. కానీ వేదనే మిగిలింది. లోకం, దైవం ఏకమై పగబట్టాయట.

మబ్బులెన్ని ఏకమైనా - చంద్రుని కాంతిని మాపలేవు!

అని విప్లవ భాషతో నిందిస్తాడు. (అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు అన్న నక్సలైట్ల నినాదం)

Q చివరికి ఎడారితుఫానులో చిక్కుకుంటారు.

‘దివ్యప్రేమధామం - ఇదేగా శాశ్వతానురాగం’ అని సంతోషిస్తారు.

స్త్రీ పురుషుల మధ్య గల ఆకర్షణ, మోహం, కామం మొ॥ శారీరక స్థాయిని దాటించి, నిజమైన ప్రేమకు లైలా ఖయాస్ పాటల ద్వారా నిర్వచించారు సముద్రాల.

పాటల నిర్మాణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే - కొన్ని లోతైన అంశాలూ తెలుస్తున్నాయి.

ఇస్లాం సంప్రదాయంలో చంద్రుడే దైవ చిహ్నం. ఇది దృష్టిలో పెట్టుకొని, సముద్రాల పాటలు రాశారు. ఇందులోని పాటలన్నిటిలోనూ జాబిలి, వెన్నెల, చందమామలనే సంబోధించడం కనిపిస్తుంది. 

అంటే కథావస్తువు, వాతావరణం తాలూకు స్నృహ కవులకుండాలని అదే ముఖ్యమని వారు కలం ద్వారా చెప్పారు.

సముద్రాలవారు ప్రయోగించిన ఉరుదు శu్దపల్లవాలు :

ఖుదా, సలామ్, హుజూర్, జాగీర్దార్, షెహజాదా, అన్వారే, తల్వార్, హజార్, తయార్ మొ॥నవి.

తెలుగు తనం కూడిన సొగసుపదాలు, పదచిత్రాలు :

జాబిలి లేని చకోరి - నివాళి.

దివాళి (దీపాలవరుస - ఖయాస్‌కు ఆపాదించిన పదం. ఖయాస్‌కు మన దీపావళి తెలియకపోవచ్చు. తెలిసింది ఒకటే. అది ప్రేమ దీపాల వరుస!)

అమావాస్య అర్థరాత్రి మస్తుగ ముస్తాబై (అనగనగా - పాటలో)

ఏకొరనోమునోచుకున్నానో (ప్రేమే నేరమౌనా? పాటలో)

విధి బలీయము (పయనమయే ప్రియతమా పాటలో)

ఇవేకాదు పాటలలోని పంక్తుల విన్యాసం వినూత్నంగా కన్పిస్తుంది. 

ఉదా :

విషమాయె ప్రేమ

మని ఆయె మనసు.

ప్రేమసుధా వాహిని ఎండమావి అయిపోయింది. (వాళ్ళుండేది ఎడారిలోకదా!)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి