మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, అక్టోబర్ 2026, శనివారం

గలివరు హోన్మాన్ యాత్ర

గలివరు యొక్క చివరి యాత్ర, విశిష్టమైన గుర్రాలుండు హోన్మాన్” అను ప్రాంతానికి చెందినది. ఈ ప్రాంతంలో గలివరు అన్ని విధాల భిన్నమైన రెండు అసాధ్యమైన దృక్పథాల గుర్రాల గుంపులను గమనిస్తాడు. మొదట అతి హీనమైన జాతి గుర్రాలను, వాటి జీవనవిధానాన్ని తెలుసుకుంటాడు. తరువాత అత్యున్నతమైన ఉత్తమజాతి గుర్రాలను వాటి జీవన విధానాన్ని తెలుసుకుంటాడు. మొదటిది ‘యీVAన’ అనే గుర్రాల గుంపు. ఇవి మనుషులకు దగ్గర సంబంధం గల తక్కువస్థాయి గుర్రాలు. 

రెండవది హోన్మాన్’ అనే మరో గుర్రాల గుంపు. ఇవి ఆకారంలో గుర్రాలను పోలినట్లువున్నా ప్రకృతిని పూర్తిగా తెలిసినవి. ‘యీVAస్ దుర్మార్గమైన ఆలోచనలు చెడ్డ ప్రవర్తనను కలిగివుంటాయి. ఇవి తరుచు హోన్మాన్’ పై తిరగబడుతుంటాయి. వాటికి కోపం తెప్పించటం, తిరిగి వాటిచే తరిమివేయబడటం సాధారణంగా జరుగుతుంటుంది. 

ఆ ‘యీVAస’ వారి తెగలోనే వారి నాయకుడితో కలసి జీవిస్తుంటాయి. వారి నాయకుడు పెద్ద కురూపి. వాళ్ళందరిలోకి అతనే పరమ దుర్మార్గుడు, చెడ్డవాడు. ‘యీVAన’ అంతా శారీరకంగానూ, మానసికంగాను దుర్మార్గపు ఆలోచనతో జీవిస్తుంటారు. ‘యీVAన’ మాట్లాడలేరు. కనీసం ఇతర జంతువులకుండే ‘గొప్పనైన తెలివి తేటలు కూడా వీటికుండవు. అందుకే హోన్మాన్’లు ‘యీVAస’ ను అసహ్యియించుకుంటారు. కాని యీVAస్ పిల్లల్ని పట్టుకొని కష్టమైనా సరే వాటిని పోషిస్తుంటారు. గలివరును కూడా ‘యీVAస’ అనుకొని పట్టు కుంటారు. కాని వీరికి గలివరులోని రెండు విషయాలు బోధపడవు. ఒకటి గలివరు వస్త్రాలు వేసుకోవటం, రెండు మాట్లాడే ఆలోచించే గుణాలు ఉండటం.

గలివరుకు తెలియని భాషలు నేర్చుకోవటం అలవాటు. గలివరు ఆ ప్రాంత భాషను నేర్చుకోవటంతోపాటు మంచి పాండిత్యాన్ని కూడా ఆర్జిస్తాడు. గలివరు తరుచుగా గుర్రాల పెద్దలతో సంభాషిస్తుంటాడు. వారికి యÖరప్ లోని మానవ సంబంధాలను క్లుప్తంగా వివరిస్తుంటాడు. ఆ గుర్రాల పెద్దలు మనుషుల రెండు భిన్న దృక్పథాలు గల విషయాలపట్ల శ్రద్ధను చూయిస్తారు. ఒకటి యÖరప్ వాసులకు యుద్ధకాంక్షవల్ల వారు పెంచుకుంటున్న శక్తులు వాళ్ళనే అంటే వాళ్ళ జాతిని వాళ్ళే నాశనం చేసుకుంటారని, రెండు డబ్బు సంపాదించటానికి యంత్రాలను వాడుకోవటం. 

గలివరు చెప్పిందంతా విన్న తరవాత ఆ హోన్మాన్’ పెద్దలు మానవజాతి 

ఉత్తమజాతి కాదన్న అభిప్రాయానికి వస్తారు. కేవలం మానవ జాతికి కొద్దిగా ఆలోచించే ఒక శక్తి ఉండడం అన్న భేదం తప్పా మరొ కటి లేదని తెలుసుకుంటారు. ఆ శక్తి కూడా మంచికొరకు వాడుకోకుండా అవివేకంతో అజ్ఞానంతో ప్రవర్తిస్తారనుకుంటారు. ప్రకృతిసిద్ధంగా వచ్చిన ఆ కొద్దిపాటి జ్ఞానాన్ని నాశనం చేసుకుంటున్నారనుకుంటారు.

తరవాత గలివరు హోన్మాన్’ వారి పద్ధతులను ఉద్దేశాలను పరిశీలిస్తాడు. వారు స్వాభావికమైన పద్ధతులను ఇష్టపడతారు. అందరికి మేలుచేసే మంచినే వారు కోరుకుంటారు. వారి లక్ష్యం ఒక్కటే! మంచిని పెంచటం, ఆ మంచే వారిని పరిపాలిస్తుందని, రక్షిస్తుందని నమ్ముతారు. వారికి అనురాగాలు ఉండవు. ప్రేమను, రాజభక్తిని వ్యక్తీకరించే పద్ధతులు ఏవి వారికి తెలియదు. వారికి మరణంపట్ల దుఖం, భయం ఉండవు. కాని జనన మరణాలు తప్పవని వారికి తెలుసు. వారు వివాహాలు చేసుకుంటారు. ఉత్తమమైన సంతానం పొందుతారు. వారు నాలుగు సంవత్సరాలకు ఒకసారి సమావేశం అవుతారు. అందులో సమస్యలకు పరిష్కారాలను తెలుసుకుంటారు. అందులో ‘హూన్మాన’ జాతినంత నాశనం చేయాలన్న నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇటువంటి సమావేశాలకు గలివరు హాజరౌతుంటాడు. 

గలివరు ఆ ప్రాంతంలో ఒక సొంత గుడిసెలో జీవిస్తుంటాడు. అతను జంతువుల చర్మాలే బట్టలుగా ధరిస్తాడు. అతను తేనె దాన్యంతో చేసిన రొట్టెముక్కలు తింటాడు. ఇలాంటి జీవితం గడుపుతున్న గలివరుకు ఒక విషయం అర్థమవుతుంది. వాస్తవిక జీవితంలోనే అనంతమైన ఆనందం ఉందని, గలివరుకు ఇలాంటి జీవితమే 

ఉల్లాసాన్ని స్తుంది. కుట్రలకు, అన్యాయాలకు, లంచగొండితనానికి, దుర్మార్గానికి, దౌర్జన్యానికి దూరంగా ఇలానే బ్రతకాలని ఆశిస్తాడు. కొద్దికాలంలోనే గలివరు ఆశ నిరాశగా మారుతుంది. హోన్మాన్’ వారు గలివరు ‘యీVAన’ లో ఒకడని వారి జాతిలో నాగరికుడుగా మారినంత మాత్రాన పశుత్వమే పరమావధిగా గల మానవజాతివాడని అతన్ని పంపివేయటానికి నిర్ణయం తీసుకుంటారు. గలివరుకు వారి తీర్పు బాధను కలిగిస్తుంది. వారి జాతివారిలో ఒకడిగా జీవిస్తానని ప్రార్ధించినవారు ఒప్పుకోరు. 

చివరికి బలవంతంగా యÖరప్‌కి పంపిస్తారు. ఆ తరవాత ఇంగ్లాండులో గలివరు మనుషుల వాసన తగిలితేనే సహించడు. ఎప్పుడు ఒంటరిగా జీవితం సాగిస్తాడు. ఇలా ఐదు సంవత్సరాల తరవాతే తన కుటుంబ సభ్యులను తన దగ్గరికి రానిస్తాడు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి