అమ్మ పాదపద్మములే మాకు శరణ్యం
అమ్మ నామ స్మరణే మా నిత్యజీవనం
అమ్మ పాదములు తప్ప అన్యము లేదు
అమ్మ నామ స్మరణ తప్ప అన్యము లేదూ
1. మేడిచల వంశానికి ముద్దుబిడ్డ వై బొడ్డుపల్లి వంశానికి వన్నె తెచ్చినావు నారసింహ ప్రియ సతి రామామణి అష్ట సంతానానికి చూడామణి
2. షట్చక్రవర్తులే నీ మరుదులు పంచామృత స్వరూపులు ఆడపడుచులు కామితార్ధమును తీర్చు కోడళ్ళకి జామాతాలందరికి శ్రీ మాతవే
3. చతుర్విధ సుకృతాత్ములు నీ పుత్రులు పుణ్య చరితులే నీపుత్రికా మణులు నీదు ఆశీస్సులే నవఉషస్సులు బ్రోవుమమ్మ విశ్వ భూసుర వందితా
4. సంగీత సాహిత్యాలే నేత్రద్వయమై కామాక్షి మీనాక్షీ విశాలాక్షి గా కరుణతో మమ్మేలు కంజలోచనా కాళిదాస సన్నుత జగదంబ కాళికా
పదముల అర్థములు :
1. చూడామణి
శిరస్సున ధరించే వజ్ర వైడూర్య రత్న ఖచిత స్వర్ణాభరణం
షట్చక్రవర్తులు హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జనుడు
2. పంచామృతాలు
ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునేయి, పంచదార, తేనె
3. చతుర్విధ సుకృతాత్ములు (నలుగురు పుణ్యాత్ములు)
1. ఆర్థి =శారీరిక బాధలనుండి విముక్తిని కోరువాడు
2. అర్ధార్ధి=సంపదలను కోరువాడు
3. జిజ్ఞాసువు=మోక్షమే కావలనుకొనువాడు
4. జ్ఞాని= పరమాత్మ ప్రాప్తి పొందినవాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి