ఆ పేరు వినగానే జ్ఞాపకాల పేటిక 50 ఏళ్ల నాటి లోపలి అరను తెరుస్తుంది. అంతరంగంలో ఓ ఆహ్లాద వీచిక. ఆనాటికీ ఈనాటికీ శ్రీరామనవమి ఉత్సవాల్లో, పెళ్లిపందిళ్లలో వీనులవిందు చేసే ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి...’ పాట వినీ వినగానే ముగ్ధుమోహన స్నిగ్ధ సుందరి సీతే కళ్లముందు ప్రత్యక్షమౌతుంది. ఎవరా సీత?
చారడేసి కళ్లల్లో కనీ కనిపించని సిగ్గుý£లకబోస్తూ, పెదవుýపై విరిసిన దరహాసం బుగ్గల్లో ప్రతి ఫలిస్తుంటే బుగ్గన వేలు పెట్టుకుని, రఘురాముడెపుడు విల్లు విరిచి, తన చేత విరిమాల వేయించుకుంటాడని నిరీక్షించే సీత ప్రేక్షకులకు కనువిందు చేసే ఘట్టం ఎన్.ఏ.టి.వారి “సీతారామ కల్యాణం” చిత్రంలోనిది. కల్యాణ సీతగా మృదులావణ్య అభినయం ప్రదర్శించిన ఆ సీతే చిత్రనాయిక గీతాంజలి.
“డా॥చక్రవర్తి” (1964) లో కథకు కీలకపాత్ర అయిన చెల్లెలుగా, “ఇల్లాలు” (1965) లో పరస్పర విరుద్ధమైన రెండు పాత్రలు అద్వితీయంగా నటించిన అభినేత్రిగా, “అమ్మాయిగారు అబ్బాయిగారు” (1966) లో అతిక్లిష్టమైన పాత్ర అతి సునాయాసంగా చేసిన నటీమణిగా, ఒక పాతిక చిత్రాలలో ముప్ఫెí డాన్సులు లావణ్యంగా, నాజూకుగా, సరసంగా చేసిన నర్తకిగా తెలుగు ప్రేక్షకులకు నేటికీ గుర్తుండిపోయిన అభినేత్రి గీతాంజలి. తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణాధ్యాయానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఈమెతో కాసేపు...
నేను ఉమ్మడి కుటుంబం నుంచీ వచ్చాను. మాది చాలా పెద్ద కుటుంబం. శ్రీమతి శ్యామలాంబ, శ్రీరామమÖర్తి గార్లు మా తల్లిదండ్రులు. మేము మొత్తం నలుగురు అక్కచెల్లెళ్లం. ఒక తమ్ముడు. నా అసలు పేరు మణి. మా అక్క స్వర్ణతో కలిసి కాకినాడ సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో చదువుకునే దాన్ని. అక్కడే తొమ్మిదవ తరగతి దాకా చదువుకున్నాను.
మా నాన్నగారికి భరతనాట్యంటే చాలా ఆసక్తి. అందుకే మాకు కూడా చాలా చిన్నవయసులోనే ఆ కళ మీద ఆసక్తిని కలిగించారు. నాకు మÖడు సంవత్సరాల వయసు రాగానే నాట్యాభ్యాసం మొదలు పెట్టించారు. నేనూ, మా అక్కయ్య స్వర్ణా నాట్యం నేర్చుకునే వాళ్లం. నా నాలుగో ఏటి వరకూ మాకు లక్ష్మణరెడ్డి గారు నాట్యం నేర్పారు. ఆ తరువాత తంజావూరు శ్రీనివాసన్ దగ్గర శాస్తీయమైన భరతనాట్యం నేర్చుకున్నాను. ఆయన అప్పట్లో ‘గంధర్వ నాట్యమండలి’ అన్న పేరుతో ఒక నృత్య పాఠశాలను ఆరంభించారు. ఆ పాఠశాలలో మేము నాలుగు సంవత్సరాలు నాట్యాన్ని అభ్యసించి అక్కడి కోర్సును పూర్తి చేశాం. ఆ తర్వాత నాట్యప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాము.
మా నాట్యప్రదర్శన చూసినవాళ్లంతా ఆశ్చర్యపోయేవారు. మేం స్టేజి ఎక్కితే దూరాన కూచున్న వాళ్లకు కనబడేవాళ్లం కాదు. అంత చిన్న పిల్లలం. అలాంటిది - అడుగులు వేస్తూ, లయబద్ధంగా మేము భరతనాట్యం చెయ్యడం చూసి ఎంతో ముచ్చటపడేవారు ప్రోత్సహించే వారు. ఎందరో ప్రోత్సహించబట్టే, మా నాన్నగారికి ఆ కళలో అంతటి ఆసక్తి ఉండబట్టే మేమీనాడు ఈ స్థితికి రాగలిగాం. నన్ను సినిమాలలోకి తీసుకొని వచ్చింది కూడా ఈ నాట్యమే. అందుకే నాట్యకళ అంటే ఇప్పటికీ నాకెంతో అభిమానం.
‘సోల్జర్స్ సైలర్స్ బోట్స్‌మన్ షిప’ అన్న సంస్థలో అకసారి మేము నాట్య ప్రదర్శన ఇచ్చాము. ఆ సంస్థ చైర్మన్ ఉద్దండరామన్ గారు మమ్మల్ని ‘ఆంధ్రా సిస్టర్స’ గా ప్రశంసించారు. అప్పట్నుంచీ ఆ పేరుతోనే ఓ వెలుగు వెలిగాము. దాదాపు యాభై ప్రోగ్రాములు ఇచ్చివుంటాము.
చదువును అశ్రద్ధ చెయ్యకుండా ఇంట్లో ఒక ట్యూటర్ని కూడా ఏర్పాటు చేశారు మా నాన్నగారు. ఇదంతా నాకు కంటకంగా వుండేది. స్కూలుకు వెళ్లాలి అనగానే రకరకాల జబ్బుల పేర్లన్నీ గుర్తు చేసుకుని మరీ చెప్పేదాన్ని. స్కూలుకు వెళ్లడం, అక్కడ చెప్పే పాఠాల గొడవ వినడమే బోరు అనుకుంటే ఇంటి దగ్గర వేరే, చదువుకు ట్యూటర్ని ఏర్పాటు చెయ్యడం నాకేం నచ్చలేదు. అయినా గోడు వినేవాళ్లెవరూ?
అయితే ఒకందుకు స్కూలును మెచ్చుకునేదాన్ని. రోజూ పొద్దున్నే క్లాసులకు వెళ్లేముందు డ్రిల్లు చేయిచేవార. ఈ డ్రిల్లు క్లాసుకు మాత్రం హుషారుగా హాజరయ్యే దాన్ని. చదువుకెలాగూ ట్యూటరున్నాడు కదా - స్కూల్లో కూడా చదువే చెప్పాలా - ఇలా డ్రిల్లులు చేయించి ఆటలాడించి, వీలుంటే స్కూల్లోకి ఒకటో అరో సినిమాలు తెప్పించి చూపించి పంపెయ్యకూడదా అనిపించేది నాకు.
దైవవశాత్తూ నా స్కూలు జీవితానికి అచిరకాలంలోనే తాళం పడింది. ఓసారి మేమంతా కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుపతి బయలుదేరాం. ఎటూ, తిరుపతి వచ్చాం కదా, చెన్నెí కూడా చూసిపోదాం అని చెన్నెí వచ్చాం. అప్ప్పుడే సినిమాల్లో మమ్మల్ని ప్రవేశపెట్టాలని మా నాన్న గారికి కోరిక కలిగింది.
సినిమాలలో వేషాలకని 1957 లో చెన్నెí వచ్చి మాకు ఆప్తులైన విజయకుమార్ (“దాంపత్యం” హీరో) ఇంట్లో దిగాము. మొట్టమొద ముఖానికి రంగు పూసుకున్నది “ఇరుమనం కలందాల్ తిరుమణం” (1959). ఈ తమిళ చిత్రానికి నిర్మాత కాకినాడ స్వస్థలమైన కాంచన (“చంద్రవంక”, “ఆడబిడ్డ” ల హీరోయిన్). ఇందులో నాయిక ఎం.ఎన్.రాజం చుట్టూ గంతులేసే గుంపులో గోవింద వేషం నాది. ఇలాంటిదే “శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం” (1960) చిత్రంలో వకుళాశ్రమ వాసిని పాత్ర కూడా. నర్తకిగా ఎదిగిన తర్వాత “భక్త అంబరీష” (1959) చిత్రంలో రాజశ్రీతో కలసి ‘నిను చూశాము మనసేసింది...’ అనే పాటకు మతంగ నాట్యం చేశాను.
ఇలా సాగుతుండగా బి.ఏ.సుబ్బారావు గారు “రాణీ రత్నప్రభ” (1960) చిత్రంలో నేను భరతనాట్యం చేశాను. వాహినీలో ఆ సినిమా రషెస్ చూస్తున్న ఎన్.టి.రామారావుకు నా డాన్స్‌బిట్ బాగా నచ్చిందట. ఆయన వెంటనే ఆ డాన్సుకు మళ్లీ రివైండ్ చేసుకొని చూసి నా గురించి బి.ఏ.సుబ్బారావు గారిని వాకబు చేశారట. “వాళ్లది కాకినాడ. కొత్తగా వచ్చారు” అన్నారట సుబ్బారావు గారు. “అమ్మాయి బాగుంది. మొహంలో అమాయకత్వం ఉంది. సీత పాత్రకు నప్ప్పుతుంది. ఓసారి మన ఆఫీసుకు రమ్మని చెప్పండి” అన్నారట రామారావుగారు. అంతే... అలా “సీతారమ కల్యాణం” (1961) లో హీరోయిన్నయిపోయాను. ఆ చిత్రంలో కూడా నా పేరు మణి అనే ఉంటుంది. మొదటి సినిమా అనో ఏమో పెద్దాయన (ఎన్.టి.ఆర్.) నాకు వాయిస్ డబ్బింగు చెప్పించారు. ప్రముఖ నట గాయని టి.జి.కమలాచంద్రబాబు గారు నాకు గాత్రదానం చేశారు. ఈ సినిమాలోనే మరో విశేషం కూడా ఉంది. మా అక్కయ్య స్వర్ణ ఇందులో శూర్పణఱ వేషం వేసింది. ఈ మహత్తర అవకాశాన్ని కలుగజేసిన బి.ఏ.సుబ్బారావు గారిని నేను ఎప్పటికీ మరచిపోలేదు.
“సీతారామ కల్యాణం” షూటింగ్‌లో మొదట నేను చాలా బిడియంగా ఉండేదాణ్ణి. ఎందుకంటే అందరూ పెద్దపెద్దవాళ్లు... బి.సరోజాదేవి, ఛాయాదేవి... ఇలా. కానీ తర్వాత అýవాటైపోయింది. నా పాత్రకు కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ పెద్దాయనే దగ్గరుండి చూసుకునేవారు. నా నుదుట తిలకం దిద్ది “ప్రప్రథమంగా సీతమ్మ వారి పాత్ర ధరిస్తున్నారు. ఇక మీ జీవితంలో ఎటువంటి లోటూ ఉండదు” అని మనసారా ఆశీర్వదించారు. వారి మాట వృధా కాలేదు. ఇప్పటికీ ఆంధ్రదేశంలో శ్రీరామనవమికి ‘శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి...’ పాట తప్పకుండా వినబడాల్సిందే. ఆ పాటతో పాటు ప్రజలు నన్ను గుర్తుకు చేసుకోవాల్సిందే తప్పదు. నా అదృష్టమది. శ్రీరామనవమి ప్రజలు జరుపుకునేంత కాలం నేను అఖిలాంధ్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవినే!
రెండేళ్లపాటు ఎన్.టి.రామారావు గారు బ్యానర్‌లో పనిచేసేలా ఒప్పందం. దాని ప్రకారం “గులేబకావళి కథ” (1962) లో వీధి నాట్యం చేయక తప్పలేదు. అయితే ఆ మధ్యలో కూడా “మగవారి మాయలు” (1960) చిత్రంలో ‘అందాల సొగసుల రాధ...’ అన్న పాటకు అందాల సొగసుల అభినయమే చేశాను.
ఎన్.ఏ.టి. లో ఉన్నంతకాలం సంభాషణలు, నృత్యం, నటన అన్నీ పెద్దాయనే నేర్పించారు. ముఖ్యంగా బిహేవియర్. ఈనాటికీ ఎవరిని ఉద్దేశించి అయినా సరే నా నోట ‘రా’, ‘పో’, ‘ఏమే’, ‘ఏరా’ ఇలాంటి మాటలు రాకపోవడానికి రామారావు గారే స్ఫూర్తి. ఎంత చిన్నవారినైనా ‘ఏమండీ’, ‘రండి... కూర్చోండి’ ఇలాగే మాట్లాడేవారు. అవే పద్ధతులు మాకూ నేర్పారు. అందుకు ఆయనకు నేను ఎప్పటికీ ఋణపడే ఉంటాను.
మా కుటుంబంలో రామారావుగారు, త్రివిక్రమరావు గారు ఇద్దరూ చాలా వాత్సల్యాంగా ఉండేవారు. చనిపోయేంత వరకూ కూడా నేను ఎక్కడ కన్పించినా ‘సీతా!’ అనే పిలిచేవారు. మా అమ్మగారు చాలా చక్కగా వంట చేసేవారు. సెట్స్‌లో ఉన్నప్ప్పుడూ మా నాన్నగారు క్వారియర్ తీసుకొస్తే అందరం కలిసి తినేవాళ్లం. ముఖ్యంగా పెద్దాయనకు మా అమ్మగారి చేతి వంటంటే చాలా ఇష్టం. మా ‘సీత’ ఇంటి నుంచి క్యారియర్ వచ్చిందంటే అందులో ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది అనే వారు. కోడి కూర, చేపల కూర మా అమ్మగారు చేశారంటే ఆయన వదిలేవారు కాదు.
1962 లోనే తమిళ చిత్రాలు “శారద” లో సోలో డాన్సు, “దైవత్తిన్ దైవం” (కె.ఎస్.గోపాలకృష్ణన్) లో చక్కటి పాత్ర. ఎస్.జానకి చక్కగా పాడిన పాటకు మంచి డాన్సు (కణ్ణన్ మబననిలై వెంపటి సత్యం) చేశాను. ఇవి నాకు మంచిపేరే తేవడంతో నేను చాలా బిజీ ఆర్టిస్టు అయిపోయాను. తమిళంలో కూడా నా కెరీర్ గురించి ఎన్.టి.ఆర్. గారే చాలా శ్రద్ధ తీసుకున్నారు. నాకు అరవం సరిగా రాకపోతే ఫీల్డులో నిలదొక్కుకోవడం కష్టమని ఆయనే స్వయంగా ట్యూటర్‌ను పెట్టి ఆ భాష నేర్పించారు. ప్రముఖ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య గారు సంభాషణý తీరులో చక్కటి తర్ఫీదునిచ్చారు. అంటే దీనికొక కారణముంది - “సీతారామకల్యాణం” సమయంలో నేను చాలా దీర్ఘసమాసాలు చెప్పలేక పోయేదాన్ని. దీనిలో టేకులు మీద టేకులు తినేదాన్ని. ఒకసారైతే రామారావుగారు సెట్టుమీదే బాగా అరిచేశారు కూడా. నేను భయంతో వణికిపోయాను. బిగ్గరగా ఏడ్చేశాను. దీంతో రామారావు గారు మళ్లీ నన్ను అనునయించారు. మా నాన్నగారిని పిలిచి అలా బయటకు తీసుకువెళ్లి సరదాగా తిప్పిరమ్మన్నారు. అప్ప్పుడే కమలాచంద్రబాబు గారితో నాకు డబ్బింగ్ చెప్పించారు. దీంతో నాకు ట్యూటర్ అవసరమనిపించిందాయనకు.
1963-1964 సంవత్సరాలు. నా జీవితంలోఊ మరచిపోలేనివి. ఆ సమయంలోనే నాకు తొలిసారిగా హిందీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ‘పూర్ణా’ సుబ్బారావు గారితో ప్రముఖ దర్శకులు బాబూభాయి మిస్తీగారు ఒకసారి “మా హిందీ పిక్చర్‌లో నటించడానికి దక్షిణాది నటి కావాలి. ఎవరినైనా మీరు సూచించండి” అని అడిగారట. ఆయన నా పేరు సూచించారు. అలా బాబూభాయి మిస్తీగారి హిందీ చిత్రం “పారస్ మణి” (1963) లో మహీసాబ్ సరసన నాయికగా అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలో నటిస్తున్నప్ప్పుడు బాబుభాయి మిస్తీగారు “నీ పేరు మణి అని పెట్టారేంటి - చిత్రం పేరు మణి, నీ పేరు మణి. ఏం బాగా లేదు. అంచేత ‘గీతాంజలి’ అని నీకు నామకరణం చేస్తున్నాను.” అని నా పేరును మార్చారు. ఆయన పెట్టిన ‘గీతాంజలి’ పేరే నాకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. “పారస్ మణి” నా తొలి హిందీ చిత్రం. సుప్రసిద్ధ హిందీ సంగీత దర్శకులు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ల తొలిచిత్రం కూడా అదే. చెన్నెíలో ఆ రోజుల్లో సూరజ్ నారాయణ్ సిన్హా అనే హిందీ మాష్టారు ఉండేవారు. ఆయన దగ్గర హిందీ నేర్చుకుని సినిమాల్లో నా డైలాగులు నేనే చెప్ప్పుకున్నాను.
ఆ తర్వాత “సంగ్రాం” (1965), “షంషీర” (1967), దారాసింగ్‌తో, “బలరాం శ్రీకృష్ణ” (1968) లో రుక్మిణి, “దో కలియా” (1968) లో వేంప్, చివరగా “శంకర్ పార్వతి” (1970) దారాసింగ్‌తోనే చేశాను. ఈ “దో కలియా” ఏ.వి.యం. వారి “లేతమనసులు” కు రీమేక్. “బలరాం శ్రీ కృష్ణ” లో సావిత్రిగారు కూడా నటించారు. ఆ చిత్ర నిర్మాణమప్ప్పుడు సావిత్రిగారు ఆ ముంబై భోజనం తినలేకపోయేవారు. చెన్నెíకు ఫోన్ చేసి జెమినీగణేశన్ గారికి ఈ విషయం చెబితే ఆయన సావిత్రి గారు కోరిక వంటలన్నీ తయారు చేయించి విమానంలో వచ్చి మాకు వడ్డించి వెళ్లేవారు.
అప్పట్లోసే కన్నడంలో రాజ్‌కుమార్ గారి “బభ్రువాహన” చిత్రంలో గెస్టు ఆర్టిస్టుగా ఆయనతో పాటు ఓ పాటలో డాన్సు చేశాను. అప్పట్లోనే “తాయిన్ మడియిల”, “నెంజిరుక్కుంవరై”, “ఆసైముగం” తమిళ చిత్రాల్లో సహాయ పాత్రలూ, మెర్రీలాండ్ సుబ్రహ్మణ్యం గారికి నాలుగు మలయాళ చిత్రాల్లో హీరోయిన్ వేషాలు వేశాను. “కాట్టుమల్లిక” ఒక్క పేరే గుర్తుంది. రెండు విన్నెంటుతోనూ, రెండు మధుతోనూ.
నాకు తెలుగులో మంచి పేరు తెచ్చిన చిత్రం “మురళీకృష్ణ” (1964). అందులో పిచ్చిదానిగా నటించాను. దాదాపు అదే సమయంలో మహానటులు అక్కినేని నాగేశ్వరరావు, డా॥కొంగర జగ్గయ్య గార్లు “పునర్జన్మ”, “మంచిరోజుý£స్తాయి” చిత్రాలలో ‘పిచ్చి’ వేషాలే వేశారు కానీ నేను చేసిందే వాస్తవికతకు దగ్గరగా ఉందన్న పేరు వచ్చింది. కానీ ఆ ఘనత అంతా పి.పుల్లయ్య గారిదే! “మురళీకృష్ణ” లో నా నటనను చూసి అన్నపూర్ణా వారి “డాక్టరు చక్రవర్తి” (1964) లో శారదగారు పోషించాల్సిన చెల్లెలి పాత్రను నాకు ఇప్పించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈ చిత్రంలో నాపై చిత్రీకరించిన ‘పాడమని నన్నడగవలెనా...’ పాట నేటికీ సూపర్‌హిట్. పి.సుశీల గారి టాప్‌టెన్ సాంగ్‌లో ఒకటిగా నిలిచిపోయిందా పాట. ఇప్పటికీ చాలా ఫంక్షన్స్‌లో నేను కన్పిస్తే అప్పటి తరం ప్రేక్షకులు ‘చెల్లెమ్మా’ అని నన్ను ఇంకా అభిమానంగా పలుకరించడం “డా॥చక్రవర్తి” పుణ్యమే. అక్కినేని గారికే “మంచిరోజులు వచ్చాయి” (1972) చిత్రంలో కూడా సోదరిగా నటించాను.
నా మొదటి కామెడీ వేషం, మొదట వేంపూ, కె.హేమాంబరధర రావు గారు వేయించినవే. “కలవారికోడలు” (1964), “వీలునామా” (1965). ఆ తర్వాత డజన్లకొద్దీ కామెడీ వేషాలు వేసినా నాకు నచ్చింది “దేవత” (1968) లోనిదే. ఈ చిత్రం నుంచే నేను పద్మనాభంతో నటించడం ప్రారంభించాను. రేలంగి-గిరిజలలాగా మా జంట పాపులరయ్యంది. ఆ తరువాత పద్మనాభం గారే తీసిన “పొట్టిప్లీడరు” (1966) లో, “మర్యాదరామన్న కథ” (1967) లో హీరోయిన్ అవకాశమిచ్చారు. ఇంకా “పూలరంగడు” (1967), “పవిత్రబంధం” (1971) వంటి చిత్రాల్లో మా జంటకు చాలా మంచిపేరు వచ్చింది. ఇక నాకు తెలుగులో మరో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ఇక నాకు తెలుగులో మరో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన చిత్రం “సంuరాల రాంబాబు” (1970). తమిళంలో “ఏదిర్ నిచ్చల” అనే చిత్రంలో మహానటి డా॥షావుకారు జానకి గారు చేసిన పట్టుమామి పాత్రను నేను పైచిత్రంలో చేశాను. ఆ పాత్రలో ‘పొరుగింటి మీనాక్షమ్మను చూశారా...’ అంటూ ఆండాళ్లుగా నేను ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచే ఉంటానేమో? ఆ పాత్రను చలా కష్టపడి చేశాను. చలం గారు నాపై ఎంతో నమ్మకంతో ఆ పాత్రను ఇచ్చారు. అంజలీదేవి, గుమ్మడి గార్లకు నేనంటే ప్రత్యేకాభిమానం. వాళ్లిద్దరికీ నేను “కాలం మారింది” (1972) మొదలైన అనేక చిత్రాల్లో కూతురుగా నటించాను. అందుకే వాళ్లిద్దరూ నన్ను కన్నకూతురిలాగే చూసేవారు.
నేను చాలా సినిమాల్లో మంచి నృత్యాలే చేశాను. “పంతాలు పట్టింపులు” (1968) చిత్రంలో నేనూ, వాణిశ్రీ పోటీపడి నృత్యం చేశాం. అదే విధంగా “శ్రీరామకథ” (1968) చిత్రంలో చంద్రమోహన్‌తో కలిసి చేసిన రతీమన్మథుల నృత్యం కూడా నాకు చాలా మంచిపేరు తెచ్చిపెట్టింది. హీరాలాల్ గారు నృత్యదర్శకులు. చంద్రమోహన్‌లో మంచి పట్టుదల ఉండేది. నాకు డాన్సు వచ్చు - ఆ కారణంగా నాతో పోటీపడి డాన్సు చేయాలని షూటింగ్‌కి పది రోజుల ముందు నుంచి ఆయన డాన్సు ప్రాక్టీసు చేసి, రిహార్సల్లు చేసి షూటింగ్‌లో పాý£్గన్నారు. “ఆడజన్మ” (1970) తదితర చిత్రాల్లో మేమిద్దరం కలిసి నటించాం. ఆయన చాలా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ కలుపుగోలుగా ఉంటారు. హీరాలాల్ గారే నాకు, భారతికి కలిపి “అఖండుడు” (1970) చిత్రంలో ఓ అద్భుతమైన నృత్యం చేయించారు. ఇప్పటికీ నాకు నాట్యమంటే చాలా ఇష్టం. కొంచెం లావైన కారణంగా సాధన లేదు గానీ, పాత చిత్రాల్లోని నృత్యాలు చూస్తే నాకు తెలీకుండానే పాదాలు నర్తించేస్తుంటాయి. ఇంకా “బంగారు తిమ్మరాజు” (1964) లో ‘నాగవల్లి కోనలోన...” (ఎ.కె.చోప్రా), “మహాబలుడు” (1967) లో ‘చూడండి మీకు నేను చూపిస్తాను...’ (శీను) వంటి చక్కని నృత్యాలు కూడా నర్తకిగా నాకు పేరు తెచ్చిపెట్టినవే.
నా సినీ జీవితంలో ప్రముఖంగా చెప్ప్పుకోవాల్సిన మరో మంచి చిత్రం “ఇల్లాలు” (1965), ఎల్వీప్రసాద్ గారు ఓసారి ఆఫీసుకు రమ్మని నాకు కబురు పంపారు. వెళ్లాను. మరాఠీలో వచ్చిన ఓ చిత్రం ఆధారంగా హిందీలో నిర్మించిన “మేరే సాయా” చిత్రం చూపించారు. అందులో నాయిక (సాధన) ది ద్విపాత్రాభినయం. ఆ వేషాలు నీవు వేయాలన్నారు ప్రసాద్‌గారు. మేకప్ మాన్ హరిబాబు గారు చాలా చక్కగా మేకప్ వేశారు. ఈ పాత్రనే తమిళంలో (“ఇదయకమలం”) కె.ఆర్.విజయ చేశారు. తెలుగు, తమిళ చిత్రాలకు ఒకేసారి షూటింగ్ జరుగుతూ వుండేది. కె.ఆర్.విజయ, నేను పోటీపడి నటించే వాళ్లం. అంతకుముందు నర్తకిగా, హాస్యనటిగా, వేంప్‌గా పాత్రలు పోషించిన నాకు ‘ఇల్లాలు’ పాత్రనిచ్చి నా నటనా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పించారు. ఎల్.వి.ప్రసాద్ గారు. “ఈ చిత్రంలో ఒక మంచి ఉదాత్తమైన ఇల్లాలి పాత్ర పోషిస్తున్నావు. ఇక ముందు కామెడీ, వేంప్ పాత్రలు పోషించొద్దు” అని సలహా కూడా ఇచ్చారు. ఈ చిత్రంలో కథానాయకుడుగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించాల్సింది. కాల్‌షీట్ల సమస్యల వల్ల ఆయనకు కుదరక కె.వి.నాగేశ్వరరావు అనే ఓ నూతన నటుణ్ణి పరిచయం చేశారు. చిత్రం విజయవంతంగా నడిచివుంటే కథానాయికగా నాకు మంచి భవిష్యత్తు లభించి ఉండేదేమో? నా కెరీర్‌లో ఈ సినిమాకు పడ్డ కష్టం మరే సినిమాకూ పడలేదు. నా నటనకు ఎవరూ వంకలు పెట్టకపోయినా ప్రథమశ్రేణి హీరోయిన్‌గా నేను స్థిరపడక పోవడానికి కారణం “ఇల్లాలు” ఆడుతున్నప్ప్పుడే “వీలునామా” ఆడడం. అందులో పవివ్రత. ఇందులో పతితవ్రత. రెండూ ప్రేక్షకులు స్వీకరించలేకపోయారు.
అందుకే ఆ రోజుల్లో హీరోయిన్ వేషాల కోసమే కూర్చోకూడదనుకున్నాను. తక్కిన వేషాలూ వేశాను. అదే సమయానికి “గూఢచారి 116” (1966) సినిమా వ్యాంప్‌గా నాకు మంచి ఇమేజ్ తెచ్చింది. ఇక ఆ తర్వాత “ఆటu£మ్మలు” (1966), “హంతకుý£స్తున్నారు జాగ్రత్త” (1966), “లేతమనసులు” (1966), “అవేకళ్లు” (1967), “u£మ్మలు చెప్పిన కథ” (1969), “బంగారు పంజరం” (1969)... ఇలా చాలా సినిమాలు చేశాను. ఆ సమయంలో ఊపిరి తీసుకునే వీలు లేనంత బిజీ అయిపోయాను. ఆదుర్తి సుబ్బారావు గారైతే నేను ఎప్ప్పుడు కన్పించినా “మిగతా వాళ్లకేవైనా వేషాలు మిగలనిస్తున్నానా” అని ఎగతాళి చేసేవారు.
నాకు ప్రముఖ కథానాయకుడు రామకృష్ణ గారితో 1973 లో వివాహం జరిగింది. మేమిద్దరం కలసి నటించిన తొలిచిత్రం “తోడూ-నీడ” (1965). ఆ తర్వాత “రణభేరి” (1968) మొదలైన పింజల సుబ్బారావు గారి చాలా చిత్రాల్లో నటించాం. మేమిద్దరం కలసి చాలా చిత్రాల్లో నటించినా, భార్యాభర్తలమౌతామని నేనెప్ప్పుడూ ఊహించలేదు. మేం కలసి నటించేటప్ప్పుడు కూడా ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఆయనే “ఏం గీతా బాగున్నావా?” అని అప్ప్పుడప్ప్పుడూ పలుకరించేవారు. అయితే ఎప్ప్పుడూ నన్ను ప్రత్యేకంగా చూస్తుండే వారు. అది నేను గమనించాను. అదే మా పెళ్లికి దారి తీసిందేమో? పెళ్లయ్యాక సినిమాల్లో నేను నటించకూడదని షరతు పెట్టారు రామకృష్ణగారు. నేనూ అంగీకరించాను. నాకు కూడా ఇద్దరం కష్టపడి, అలసిపోవడం అనవసరం అనిపించింది. 1975 లో బాబుశ్రీనివాస్ పుట్టాడు. బాబు పేరు మీదనే చెన్నెíలో ఓ ప్రివ్యూ థియేటర్‌ను ప్రారంభించాం. ఎన్.టి.రామారావు గారే దాన్ని ప్రారంభించడం నాకు సంతోషం కలిగించే అంశం. మా పెళ్లయిన తర్వాత రామకృష్ణగారు హీరోగా అగ్రశ్రేణికి ఎదిగారు. “నోము”, “పూజ”, “దొరలు-దొంగలు” ఇలా చాలా చేశారు. ఆ తర్వాత మేమే సొంతంగా “రామాపురంలో సీత” చిత్రం నిర్మించాం. అది ప్లాపయ్యింది. దాంతో చిత్రనిర్మాణం మానుకున్నాం.
పెళ్లయ్యాక జెమినీబాలన్ అభ్యర్థన కాదనలేక “కన్నవారి కలలు” (1974) చిత్రంలో తొమ్మిది నెలల గర్భంతో చివరి షాట్స్ ఇచ్చాను. అప్పటికి నా ఆఖరు చిత్రాలు “ఈ కాలపు పిల్లలు” (1976), “మంచిరోజు” (1977),. ఆ తరువాత మొరక కన్నడ చిత్రంలో కల్యాణకుమార్‌కి హీరోయిన్ వేశాను. బి.ఎస్.నారాయణ దాని డైరెక్టరు. మంచి వేషం కానీ ఆ చిత్రం (ప్రేమబంధన) విడుదల కాలేదు.
ఆ తర్వాత నా మలి అధ్యాయం టి.వీ. సీరియల్సుతో ప్రారంభమైంది. “లేతమనసులు” లో నటించిన కుట్టిపద్మిని ఒకసారి గుడిలో కన్పించి నన్ను టీవీ సీరియల్స్‌లో నటించమని బాగా ప్రోత్సహించింది. ఆమె మాట కాదనలేక 1995 లో ఆమె నిర్మించిన “కిట్టిగాడు” లో నటించాను. ఆ తర్వాత బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు సినిమా రియల్ లెజండ్ డా॥భానుమతీ రామకృష్ణ గారు నిర్మించిన “అత్తగారి కథలు” లో కోడలిగా నటించాను. ఆ అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. భానుమతి గారితో కలిసి చేయడమంటే మాటలా? ఆ “అత్తగారి కథలు” షూటింగు సమయంలో ఎక్కువగా వాళ్లింట్లోనే ఉండేదాన్ని. ఆమె నన్నుర ‘గీతా’ అని ఎంతో ప్రేమగా పిలిచేవారు. భానుమతి గారితో నేను ఓ స్తీని గాక పురుషుణ్ణి చూసేదాన్ని. అంత ధైర్యం వుండేది ఆమెలో. ఆమె మంచి జాతక నిపుణురాలు. ఎప్ప్పుడూ అదే పనిలో వుండేవారు. సోమవారం రోజు మౌనవ్రతం, ఉపవాసం కూడా! ఆ తర్వాత ఈటీవీలో స్నేహ, జెమినీలో అంతులేని కథ చేశాను.
ఇక నా జీవితంలో ఊహించని విషాదాలు మÖడు. చిన్నప్పటినుండీ మమ్మల్నందర్నీ కళ్లల్లో పెట్టుకొని కాపాడిన మా అమ్మగారు “డాక్టర్‌చక్రవర్తి” సినిమా షూటింగులో మమ్మల్ని వదలి వెళ్లిపోయారు. ఇక్కడో విషయం చెప్పాలి. చెల్లమ్మా అంటూ మా అమ్మని సొంత చెల్లెల్లా చూసుకునే ఎన్.టి.రామారావు గారు ఏదో సిక్త్ సెన్స్ పనిచేసినట్లు మా అమ్మ పోవడానికి కొంచెం ముందే వచ్చారు. ఆవిడ పోయాక అలానే మÖడు గంటల పాటు కూర్చుండిపోయారు. “సీతారామకల్యాణ” మప్పటి రెండేళ్ల కుటుంబ బాంధవ్యం అంతలా నిలిచిపోయింది మరి. మా అమ్మగారు పోవడంతో నాకు జీవితంలో పెద్ద వెలితి ఏర్పడింది. ఎందుకంటే ఆమె ఉండేంత వరకూ నా జీవితంలో కష్టమంటే ఏమిటో ఎరుగను. ఇంట్లో వ్యవహారాలన్నీ ఆమే చక్కబెట్టేది. నాతో బాటు షూటింగ్‌లకు వచ్చేది. షూటింగ్‌కు వెళ్లేటప్ప్పుడు మాతోబాటు మా నాన్నగారైనా ఉండాలి, తనైనా కూడా ఉండాలని ఆంక్షలు పెట్టేది. మాకు ఫీల్డు బాగా అలవాటై అందరూ తెలిసి, గుర్తించినా సరే ఒక్కళ్లూ వెళ్లడానికి ఒప్ప్పుకునే వారు కాదు. మాకు సినిమాలు ఎందుకు? చక్కగా పెళ్లిళ్లు చేసేయాలని ఆరాటపడేవారు. అలాంటి మా అమ్మ పోవడం నాకు ఎవరూ భర్తీ చేయలేని వెలితి.
మీ అమ్మగారు పోయాక నాన్న మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. నా పెళ్లయిన ఆరేళ్లకు మనవడి ముద్దుమురిపాలు కూడా చూసుకున్నాక 1980 లో ఆయన మరణించారు. ఇది నాకు మరో విషాదం. అయినా మా వారి ఓదార్పుతో ఆ ద్ణుఖాన్ని కూడా దిగమింగుకున్నాను.
నెమ్మది నెమ్మదిగా మళ్లీ నటనపై దృష్టి సారించాను. సురేష్ ప్రొడక్షన్స్ “ప్రేయసిరావే” (1999) చిత్రంలో తల్లి పాత్రలో మళ్లీ వెండితెరపైకి వచ్చాను. ఈ సమయంలోనే రామకృష్ణ గారు క్యాన్సర్ వ్యాధితో 2001 లో మరణించారు. దీంతో నేను పూర్తిగా సుమారు మÖడేళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత మళ్లీ కొంతకాలానికి నన్ను నేను ఓదార్చుకుని కళామతల్లి ఒడిలోకి మళ్లీ వచ్చి సేద తీరాను. 2005 సంవత్సరంలో హైదరాబాదుకు చెన్నెí నుండి వచ్చేశాను. “పెళ్ళెíన కొత్తలో”, “గోపి, గోపిక, గోదావరి”, “ఆలయం”, “నేరము-శిక్ష” తదితర చిత్రాల్లో నటించాను.
ఇక చెప్పాల్సింది నా కొడుకు శ్రీనివాస్ గురించి. బాబు కూడా మా నటవారసత్వాన్నే పుణికి పుచ్చుకున్నాడు. సినిమా రంగాన్నే ఎన్నుకున్నాడు. తమిళంలో “కలర్స” అనే సినిమా చేశాడు. తెలుగులో కూడా “ఆదివిష్ణు”, “కోయిల” తదితర సినిమాలు చేశాడు. మా అబ్బాయి సినిమాల్లో తప్పక స్థిరపడతాడనే నమ్మకం నాకుంది. ఇన్నేళ్లు నన్ను, మావారిని ఎంతగానో ఆదరించి, అక్కున చేర్చుకున్న పరిశ్రమ, ప్రేక్షకులు అదేవిధంగా నా నటవారసుణ్ణి కూడా ఆదరించి ఆశీర్వదించాలని నా ఆకాంక్ష!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి