మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, అక్టోబర్ 2026, సోమవారం

కపిలవాయి లింగమూర్తి .... చారిత్రక నేపత్య పరిశీలన

ఉపోర్ఘాతము

చరిత్రచుట్టూ అల్లుకున్న ఆనాటి నాగరికతలను జీవిన విధానాలను, గ్రామాల పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకోవాలంటే, చారిత్రక పరిశోదన అద్యయనం చాలా అవసరం. మనం పుట్టిన నేత దాని చుట్టుముట్టూ ఆవరించి ఉన్న రాజకీయ, ఆర్థిక, సహజ వనరుల మÖలాలను తెలుసుకొని, వాటిని బహిర్గతం చేయాలంటే పరిశోదనా అద్యయంతో పాటు చాలా సహనం ఉండాలి. అపరిష్కృత అంశాలపై పరిష్కరించుకొనే జ్ఞానసిద్ధి ఉండాలి.  ఒక ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే కొన్న వందల ఏళ్ళ పూర్వ చరిత్రను తెలుసుకోవాలి. 

 కపిలవాయి  లింగమూర్తి .... చారిత్రక నేపత్య పరిశీలన

చరిత్రను త్రవ్వి అందులోని అంశాలను మÖలాలను తెలుసుకొని, ప్రామాణికమైన చారిత్రక పరిశోదన చేసిన వారిలో ప్రముఖులు, పరిశోదకులు, కవి, కవిలవాయి లింగమÖర్తి ఒకరు. చిన్నతనం నుండి ఆయన పాండిత్యం కల్గిన మేనమామతో సహావాసం చేయడంతో శాస్త్ర చారిత్రక పరిజ్ఞానం, జోతిష్య నైపుణ్యం, సంస్కృత తెలుగు నిఘంటువులపైన పట్టు సాదించడంలో ఉత్తమ పరిశోదకుడిగా కనుమరుగైన ఎన్నో ప్రాంతాల చరిత్రకు అక్షర రూపం ఇచ్చాడు. 

పాలమూరు జిల్లాలోని అనేక ప్రాంతాలు చారిత్రాత్మకతకు ప్రసిద్ధి. మహాక్షేత్రం, మామిళ్ళపల్లి, బైరవకోన మహాత్య్మం, సోమేశ్వర మహా క్షేత్ర మహాత్య్మం మొదలైన రచనల ద్వారా పాలమÖరు ప్రాంత ప్రాముఖ్యతను తెలియజేశాడు. చరిత్ర పరిజ్ఞాన పరిశోధన దృక్పదంతో కపివాయి లింగమÖర్తి వ్రాసిన నవలలు ఎన్నో ఉన్నాయి. ఉప్పునూతల కథ నవలలో ఉప్పునూతల గ్రామ చరిత్ర. అక్కడి ప్రసిద్ధి చెందిన ఆలయాల చుట్టూ తిరుగుతుంది. ఉప్పునూతల గ్రామం ఏవిధంగా ఏర్పడిందో ఉప్పునూతల నవల చదివితే ఆ నవýలోపల అన్నీ విషయాలు క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. 

నాగవంశ ప్రస్థానం, చారిత్రక వ్యాసంలో నాగవంశ చరిత్రను వారి మత ఆచారాలను, పరిపాలన విధానమును క్షుణ్ణంగా పరిశోదించి వ్రాసిండు. చంద్రవంశంలో జన్మించిన పరిక్షిత్ వంశం 28 తరాల వరకు క్షేమకునితో అంతమయ్యే వరకు చెప్పిండు. కపిలవాయి లింగమÖర్తి గారు ఆంధ్రప్రాంతాన్ని పరిపాలించిన పాలకులందరి చరిత్రను తులనాత్మకంగా అద్యయనం చేసి సందర్భానుసారంగా, వారి యొక్క నేపత్యాన్ని తెలియజేస్తూ గత చరిత్ర తాలూకు సజీవ సాక్షాలను మనముందుంచాడు. కవిలవాయి లింగమÖర్తిగారు దుందుబి నంది ప్రాశస్త్యం  చారిత్రక వ్యాసంలో దుందుబి ప్రాశస్త్యాన్ని  తెలిపాడు. 

ఇది 95 మైళ్ళ పొడవు ఉంటుంది. ఇది పాలమÖరు జిల్లాలో పుట్టి మళ్లీ అదే జిల్లాలో కృష్ణాలో కలుస్తుంది. దీనికి గుండ్లపల్లి దగ్గర కీ॥శ॥ 1943`44లో దిండి ప్రాజెక్టును కట్టబడింది. దీని యొక్క చారిత్రక నేపత్యాన్ని తీసుకుంటే 700 సం॥రాల క్రిందటే ఇక్కడి దుందుభి నది నిండుకుండలా ఉండేదని, ఇది 13వ శాతబ్దానికి పూర్వం ఉన్నట్లు ఈ వ్యాసంలో చెప్పారు. పాల్కుర్కి సోమనాథుడు తన పండితారాద్య చరిత్రలో చతుర్ముఖ, నందీశ్వరుడనే ఒక చిన్న ప్రాకారమే సృష్టించాడు. అట్లాంటి చతుర్ముఖ సశేశ్వర లింగం కీ॥శ॥ 2008లో మున్ననూరులో ఒక లంబాడి ఇంటికి పునాదులు త్రవ్వుతుండగా బయల్పడింది. ఇట్లా ఒక నది పుట్టుక చరిత్రక నేపత్యాన్ని ఆ నదీతీర ప్రాంతాన వెళ్ళివిరిసిన సంస్కృతిని, సాంప్రదాయాలను, మాతాచారాలను దుందుభి ఏనాటిది, చారిత్రక వ్యాసంలో తెలిపారు.

చరిత్రలో ఇంద్రకల్లు  అనే చారిత్రక వ్యాసంలో ఇద్రకల్లు గ్రామం ఎట్లా ఆవిర్భవించిందో, ఆ నాటి పాలకులు ఎవ్వరో ఇందులో తెలిపారు. మహబూబ్‌నగర్ వడ్డెమాన్ ఏన్నూటిలో ఇంద్రకల్లు ఒక ప్రాచీన గ్రామం. ఇప్పుడు ఇది నాగోలు సీమలో (నాగర్‌కర్నూల్ తాలూకా) జడ్చర్లకు వెళ్ళే మార్గంలో ఉంది. 

ఇంద్రుడు నల్లనివాడు ఇక్కడి భూమిలో నల్లరసపు రాయి ఎక్కువ. అందువల్ల ఇంద్ర కాలని పిలిచినారేమో. కల్లు (గల్లు) అనగా రాయి అని అర్థము. పూర్వము ఇది ఒక జైన క్షేత్రంగా ఉన్నది. 

పూర్వము ఇంద్రకల్లు వేదపండితులకు ప్రసిద్ధి. కల్వకుర్తి తాలూకాలోని ఇరువెన్నులో (నేడిది ఇర్విన్) ఇందేశ్వర ఆలయం ఉంది. రాష్ట్రకూటులు ఇంద్ర వరుణాధికులు కనుక ఇంద్రేశ్వర ఆలయం వారినాటివి కావచ్చు. వీరు కీ॥శ॥ 696 నుండి 973 వరకు తెలంగాణను పాలించారు. ఈ వంశం ఇంద్రరాజు అని పేరుతో ప్రారంభం కావడం మరొక అంశంగా గమనించవచ్చు. కపిలవాయి లింగమÖర్తిగారు ఇట్ల ఒక పేరు ఒక ప్రాంతానికి రావడానికి అనేక చారిత్రక అంశాలను పరిస్థితులను ప్రామానికి పద్దతిలో మనముందు ఉంచారు. 

కాశ్వీరు రాజుల చరిత్ర వ్రాసిన, తక్షశిల వాసుల వృత్తాంతాలను తెలిపిన, యుగ యుగాల కృష్ణ అని చెప్పి కృష్ణానది వృత్తాంతం చెప్పిన చారిత్రక సత్య శోదన చేసి తెలిపారు. కవిలవాయి లింగమÖర్తి గారు ప్రధానంగా వ్రాసిన చరిత్రను తీసుకుంటే మాహాక్షేత్రం మామిళ్ళపల్లి ` ప్రాచీన స్థల చరిత్ర ` 1982, ఉప్పునూతల కథ (బాలసాహిత్యం) స్థల చరిత్ర ` 1983, క్షేపాల గంగోత్రి (తూమురెడ్ల చరిత్ర) స్థల చరిత్ర ` 1988, పాలమÖరు జిల్లా దేవాలయాలు ` స్థల చరిత్ర ` 1990 (ఇది జిల్లాలోని  300 ఆలయాలకు పైగా చరిత్రలను, విశేషాలను తెలిపే ఏకైక చరిత్ర గ్రంథం) భైరవకోన మహాత్య్మం (ప్రకాశం జిల్లాలోనిది) స్థల పురాణం ` 1991, సోమేశ్వర క్షేత్ర మహాత్మ్యం ` సోమశిల చరిత్ర ` 1999. వీటితో పాటు 8 క్షేత్ర ఆవిర్భావ చరిత్రలు. 

సూచనలు

కపిలవాయి లింగమూర్తి గారు రాబోయే పరిశోదకులకు ఉపయుక్తమైన సూచనలు చేశాడు. నదీతీర ప్రాంతంలోని నాగరికతను పరిశీలించవలసిన అవసరం ఉందంన్నాడు. శిలలతో, తాళపత్ర గ్రంథాలలలో శాసనాల్లో నిక్షిప్తమై ఉన్న ఆంతరంగిక విషయాలను పరిశీలించి, పరిశోదన చేయవలసినటువంటి అవసరం ఉందని తెలిపాడు. ఎవ్వరి గ్రామ చరిత్రలు ఆ గ్రామ వాస్తవ్యులలో, కవులలో, రచయితలో, పరిశోధకులు క్షోదన చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. 

ముగింపు

 కపిలవాయి  లింగమూర్తి గారు చారిత్రక పరిశోదకుడిగానే కాకుండా కథా రచయితగా నవలా రచయితగా, జీవిత చరిత్రకారునిగా, వ్యాసకర్తగా, సంకీర్తన స్వరకర్తగా, అనువాదకుడిగా, సంపాదకుడిగా, వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞాకలిగిన బహుముఖ ప్రజ్ఞా కల్గిన పాలమÖరి సాహిత్య ఆణిముత్యం. తెలుగు సాహిత్యానికి 100పైగా పుస్తకాలను అందించిన మహÃన్నతుడు. ఉన్నత ప్రమాణాలు  పాటించడంలో వాస్తవిక ప్రదర్శనను ప్రోత్సహించడంలోను ఆచరించడంలోను ఆయనకు ఆయననే సాటి. తెలంగాణ బాషకు లభించిన వరప్రసాదం. పాలమÖరి మట్టి నుదిటిన చెదరని అక్షరం కపిలవాయి లింగమÖర్తి గారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి