మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, అక్టోబర్ 2026, శనివారం

జమున...కోరిక అలాగే వుండిపోయింది

యాభై సంవత్సరాల క్రితం డాక్టరు గరికపాటి రాజారావుగారి “పుట్టిల్లు” (53) ద్వారా కథానాయికగా పరిచయమైన నాటి నుంచి, సుమారు పాతిక సంవత్సరాలు ఆదేహోదాలో నటీమణిగా కొనసాగిన ఏకైక నటి జమున. 

చక్కని ఉచ్ఛారణ, తెలుగింటి ఆడపడచు అందాలు, నవరసాల్ని అలవోకగా పండించగలిగే సామార్థ్యం -ఇవన్నీ కలసి ‘జమున’ను ప్రజానటిగా వెండితెరపై ఆవిష్కరించాయి...

‘జమున’ అంటేనే ‘మÖగమనసులు’ చిత్రంలో కొంటెపిల్ల, ‘మిస్సమ్మ’ చిత్రంలో అల్లరిపిల్ల, ‘పండంటి కాపురం’లో రాణీ మాలినీదేవి ‘శ్రీకృష్ణతులాభారం’లో సత్యభామ! పాత్రలు స్మృతి పధంలో మొదుల్తాయి. ముఖ్యంగా ‘సత్యభామ’ పాత్ర పోషణలో ‘సరిరారు నా కెవ్వరు’ అనిపించుకున్నారామె.

ఈ యాభైసంవత్సరాలలో రెండువందల చిత్రాలు పూర్తి చేసుకుని,సామాజిక, రాజకీయ రంగాల్లో సైతం తనదైన ముద్ర వేసిన ఈ స్వర్ణోత్సవ నటి జ్ఞాపకాలు ఈ వారం...

నేను 30.08.1936న విజయనగరం సామ్రాజ్య వైభవ చిహ్నంగా నిలుచున్న ‘హంపీ’(కర్ణాటక)లో జన్మించాను. అందుకే ఆ రోజుల్లో నన్ను హంపీకన్య అనేవారు. మానాన్న నాప్పాణి శ్రీనివాసరావుగారు పసుపు,పొగాకు వ్యాపారం చేసేవారు. మా అమ్మ కౌసల్యాదేవిగారు మంచి సంగీత విద్వాంసురాలు. నాకు గిరిధర్ అని ఒకే తమ్ముడు. డాక్టరు, కానీ నేడు దివంగతుడు.

నా పేరుకు వెనుకో విశేషం వుంది. మా అమ్మనాన్నలు తీర్థయాత్రలు చేస్తూ పండరీపురంలోని పాండురంగస్వామిని దర్శనం చేసుకుని వచ్చాక నేను పుట్టానట. అందువల్ల నాకు ‘జానాబాయి’ అన్న పేరు పెట్టాలని అనుకున్నారట, కానీ నా జన్మనక్షత్రం ప్రకారం ఏదైనా నదిపేరు రావాలని పెద్దలు చెప్పేసరికి, జానాబాయి పేరు మధ్యన ‘ము’ అన్న అక్షరం కలిపి పెట్టారు. జమునాబాయి అన్నది కాస్తా జమున అయ్యింది.(ఉత్తరాదిన యమునానదిని ‘జమున’ అని అంటారు) ఇంత నాజూకైనా పేరుపెటి, సినిమా రంగం కోసం - మళ్లీ నా పేరు మార్చుకునే అవసరం రాకుండా చేసిన మా తల్లిదండ్రలను నిజంగా అభినందించాలి.

నా చదువు సంధ్యలు కొంతకాలం వెంకటగిరిలోనూ, ఆ తర్వాత దుగ్గిరాలలోనూ కొనసాగింది. అక్షరాభ్యాసం మాత్రం వెంకటగిరిలోనే జరిగింది. ఒక చిన్న పలక, బలపం తీసుకుని ‘ఆ, ఆ, లు దిద్దడానికి రోజూ బడికి వెళ్లేదాన్ని. పంతులమ్మ చెప్పేదేమిటో వినకుండా అటూ ఇటూ చూస్తూ, ఏవిÖ తోచకపోతే పలక విÖద బలపంతో తాళం వేస్తూ, అల్లరి చేస్తూ వుండేదాన్ని. ఒకరోజు పంతులమ్మకు కోపం వచ్చి, రెండు వడ్డించి, కాళ్లకు కొయ్యబండ తగిలించింది. బడి వదిలిపెట్టినప్ప్పుడు ఆ బండ కొయ్యతీసేసి, ఇంటికి పంచాలని ఆమె ఉద్దేశ్యం, కానీ ఈలోగా నేను పంతులమ్మకు తెలీకుండా, బంతినుంచి, కొయ్యలబండతో సహా -ఏడుస్తూ ఇంటికి వచ్చేశాను. ఎర్రగా వుండేదాన్నికదా! ఆ కర్ర మొద్దును యింటిదాకా ఈడ్చుకొచ్చేసరికి నా కళ్లు ఎర్రగా కందిపోయాయి.

ఈ నా అవస్థ చూసి మా అమ్మ కోపం తెచ్చుకుని బడి మాన్పించేసి. ఇంట్లోనే చదువుచెప్పడం ప్రారంభించింది. ఇదీ నా చదువుకు సంబంధించిన తొలి రోజుల్లోని విశేషం. 

చిన్నప్ప్పుడూ, చదువుకునే రోజుల్లోనూ నేను చేసిన అల్లరి, చిల్లర చేష్టలు చాలా వున్నాయి!

కొన్నాళ్లుపాటు మా అమ్మదగ్గర చదువుకున్న తర్వాత దుగ్గిరాల వచ్చాకే నాస్కూలు చదువు మళ్లీ ప్రారంభమైంది. మా తమ్ముడు గిరిధర్ కూడా బడికొచ్చేవాడు ఆ సమయంలో మానాన్నగారు ఒక చిన్న మÖడు చక్రాల సైకిల్ కొనిచ్చారు. దానిమీదే మేము స్కూలుకెళ్లేవాళ్లం. సాయంత్రం బడినుంచి రాగానే - మా ఇద్దరికే ఇంట్లోనే చేసిన టిఫిన్, కాఫీ ఇచ్చి, స్నానం చేయించి వాకిట్లో ఆడుకోమనేది మా అమ్మ. ఇద్దరం ఆడుకుంటూ ఉండగా, నాన్నగారు వచ్చేవారు. ఇద్దర్నీ - చెరోకవైపు ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళీ చెరోకముద్దు యిమ్మని అడిగితే-లంచం (అంటే డబ్బులన్నమాట) అడిగేవాళ్లం. మానాన్నగారు ఇవ్వబోతుంటే అమ్మకోప్పడేది. ‘అలా అడిగినప్ప్పుడల్లా డబ్బులు అడిగితీసుకోవడంలో - నాన్న దగ్గర వున్న చనువు - మాకు మా అమ్మదగ్గర వుండేది కాదు.

నా బాల్య జీవితం చదువు సంధ్యలు, ఆటపాటలు ఎక్కువగా దుగ్గిరాలలోనే జరిగాయి. దుగ్గిరాల గరల్స్ హైస్కూల్‌లో చేరిన తర్వాత, అక్కడి వాతావరణం చూశాక నాలో చదువంటే కొత్త వుత్సాహాం వచ్చింది.

ఆస్కూల్‌లో హెడ్‌మాష్టార్‌గానీ, ఇతర టీచర్లుగాను మమ్మల్ని బాగాచూసుకునేవారు. ఆ జిల్లాలోని మిగతా పాఠశాలల కన్న మంచి పేరు తెచ్చుకోవాలని చదువుసంధ్యల్లో ఆటపాటల్లో ఇక్కడి పిల్లలే ఫస్ట్‌రావాలనే ఆశయంతో మా టీచర్స్ అన్నీట్లోనూ మమ్మల్ని ప్రోత్సహించేవారు. నేను బాగా పాటలు పాడుతానని మా పాఠశాలలో ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా నా చేత ప్రార్థన గీతం పాడించేవారు.

ఒకసారి తెనాలి దగ్గర పెనుగుదురుపాడు గ్రామంలో - ఆ జిల్లాలోని అన్ని పాఠశాలలూ పాý£్లనేలా నాటకాలు, ఆటల పాటల పోటీలు ఏర్పాటు చేశారు. మా హెడ్‌మాస్టార్ ‘సతీసావిత్రి’ నాటకాన్ని మాకంటే  పెద్ద పిల్లలచేత వేయించాడనికని కొందరిని, పాటలు పాడడానికని నన్ను తీసుకెళ్లారు. ఆటలపోటీల్లో అన్ని పాఠశాలలుకంటే మేమే గెలిచాం. ఇక సాయంత్రం నా ప్రార్థనగీతంతో సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు ఆరంభమయ్యాయి. డాన్సు కాంపిటేషన్ తర్వాత పాటలపోటీ కార్యక్రమం ఆరంభమైనది. ‘ఇప్ప్పుడు దుగ్గిరాల స్కూల్ గర్ల్ బేబి జమున పాట పాడుతుంది.’ అని ప్రకటించారు. తెరతొలిగింది. నేను తెల్లని గ్లాస్కోగౌను వేసుకుని, బాబ్ట్‌హెయిర్‌లా వున్న పొట్టిజుట్టును గాల్లో వదిలి, చిన్న చిన్న రింగులలో సినిమాతార బేబి సరోజిలా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. వచ్చీ రాగానే, కాగితంతో చేసిన పావురాన్ని ఎడమచేత్తో పట్టుకుని పి. భానుమతి గారు పాడిన ‘ఓహో... ఓహ్హోహ్హో పావురమా’ (స్వర్గసీమ) అంటూ పాట ప్రారంభించి, ఆ పాటకు తగినట్లుగా మధ్య మధ్య అభినయం చేయసాగాను. ఇలా కొంతసేపు పాట సాగింది. పాట మధ్యలో ఓ చరణంలో “నా వలపు కౌగిలిలో ఓలలాడరావే” అని పాడే సరికి - ప్రేక్షకులు గొల్లున నవ్వుతూ చప్పట్లు కొడ్తూ, ఈలలు కూడా వేశారు. వాళ్లెందుకలా చేశారో నాకైతే అర్థం కాలేదు. నేను పాడిన ఒక లైను దగ్గర వాళ్లు ‘క్లాప్స’ కొట్టినందువల్ల - నేను చాలా ఆడుతూ, పాడతానని మెచ్చుకుంటున్నారేమోననుకుని, ఆ చరణాన్ని మళ్లీ పాడాను. ఈ సారి ఇంకా పెద్దగా అరుస్తూ అల్లరిచేశారు! పాట పూర్తి అయి స్టేజి దిగిరాగానే మా టీచర్ మచ్చి నన్ను వీపరీతంగా తిట్టారు- ఎందుకు అలాంటి పాట పాడతావని! నాకు ఏడుపు తన్నుకొచ్చేసింది. అప్ప్పుడు మా టీచర్స్‌లో ఒకామె “ఏమీ లేదమ్మా....వూరికే ఏడవకే... ఆపాట అర్థం నీకు తెలీదు. అలాంటి పాటలు స్టేజీ మీద పాడకూడదు. ఇంకెప్ప్పుడూ అలా పాడకు. అంటూ నన్ను బుజ్జగించారు. కానీ నాకు మాత్రం చాలా భాదేసింది. మొదటి మారు బయటివూరికి రావడం ఈ విధంగా అవమానం జరగడం సంహించలేకపోయాను. ఎవరైతే నన్ను ఎగతాళి చేశారో వారిచేతనే బాగా నటించింది అనిపించుకోవాలన్న పట్టుదలతో మారోస్కూల్ ప్రోగ్రాంలో పాý£్గన్నాను. ఈసారి భారతమాతపైన స్వాగతగీతం ఆలపిస్తూ, అభినయించాను. పాట అయిపోగానే కరతాళధ్వనులు వినిపించాయి.

ఆ రాత్రంతా - కొంతమంది పిల్లలు, మా టీచర కూర్చుని కార్యక్రమాల గురించి చర్చించుకోసాగారు. ఈసారి మన స్కూలుకు పెద్దగా ప్రైజులు రావనీ. జమున మÖలంగా పాటలు పాడయ్యాయని అనుకున్నారు. మరుసటిరోజు ఉదయం ఆ పాఠశాలలో బహుమతులు అందజేసే కార్యక్రమం ఏర్పాటు చేసారు. uహుమతులు ప్రదానం చేయడానికి డి.ఇ.ఓ వచ్చారు. మా టీచర్లు అనుకున్నట్లు ఆటల్లో ప్రథమ బహుమతి, నాటకాల్లో వుత్తమ నాటకంగా మాస్కూల్ వాళ్లు వేసిన ‘సతీసావిత్రి’ ఎంపికైంది. ఆ తర్వాత పాటల పోటిలో ప్రథమబహుమతి ‘జమున’ అన్న ప్రకటన వచ్చింది. ఒక్క క్షణం మావాళ్ల మతులూ పోయాయి. నాకైతే గుండెల్లో దడ ప్రారంభమైంది. మా మాస్టారు వెళ్లి ‘ప్రైజ’ తెచ్చుకో అనేదాకా నాకేం తెలీదు. వణుకుతూ వెళ్లి వెండికప్ప్పు అందుకున్నాను.

అప్ప్పుడే కొంతకాలం శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. మా అమ్మ నాకు సంగీత గురువు మొదట్లో ఒక సంగీతం మేష్టారు దగ్గర  సంగీతం మొదలు పెట్టాను. ఆయన దగ్గర ఒక పాత డొక్కు హార్మోనియం వుండేది. ఆ హార్మోనియం మీదే నాతోపాటు మరికొందరికి సంగీతం నేర్పుతూ వుండే వారు. వారంరోజుల్లో నేను స్వరాలన్నీ నేర్చుకున్నాను. ఆ ఉత్సాహంతో ఇరవైనాలుగుగంటలూ సరిగమలు వల్లెవేస్తూ, తలుపుల మీద, పీటలమీద, కుడిచేతి వ్రేళ్లతో సరిగమలు వేస్తూ, ఎడమ చేత్తో ఏ చెక్కనో పట్టుకుని హార్మోనియం వాయిస్తున్నట్లు ఫీలయ్యేదాన్ని. ఆఖరుకు నా సంగీతం పిచ్చి ఎంత వరకూ వచ్చిదంటే - అన్నం తినేటప్పుడు కూడా కంచంలో వేళ్లు వేస్తూ ‘సరిగమ’ అంటూ పాడుతూ వుండేదాన్ని. అప్పటికి మా నాన్న నాకు హార్మోనియం కొనలేదు. సంగీతం మేష్టారు ఇంటిదగ్గర చాలాసేపు హార్మోనియం వాయించడానికి వీలులేదు. ఎందుకంటే మిగతా పిల్లలు ‘క్యూసిస్టమ’లో కూర్చుని వుండేవారు! అందువల్ల నానా ప్రయత్నాలు చేసి మానాన్నతో హార్మోనియం కొనిపించాను. అది కొన్న రోజు నుంచి ప్రొద్దున్నే 5 గంటలకు లేచి సంగీత సాధన చేసేదాన్ని.

మా అమ్మ ఒకరోజు హార్మోనియం లేకుండా, తాళం వేస్తూ మొదటి నుండీ పాడమంది. అలాగేనంటూ అలంకారాల వరకు తాళం వేస్తూ పాడాను. ఆ తర్వాత రాదన్నాను. మేష్టారు చెప్పలేదన్నాను. “ఏడ్చినట్లే వుంది. తాళం లేకుండా సంగీతం ఏమిటి ” అని మండిపడి- “ఆయన చెప్పకపోతే పోనీగాని రోజూ సాయంత్రం కూర్చుని తాళం వేసి పాడు. నేను చెబుతాను” అంది. ఆ రోజు నుంచి తాళం వేస్తూ పాడడం అలవాటు చేసుకున్నాను. అలా నేను రెండున్నర సంవత్సరాలు హార్మోనియం నేర్చుకున్నాను. కృతుల వరకూ హార్మోనియం మీద వాయించేదాన్ని. ఆ తర్వాత క్రమేణా హార్మోనియం మీద మోజు తగ్గిపోయి, ఓ స్నేహితురాలింట్లో వీణ చూసి వీణ నేర్చుకోవాలనుకున్నాను. కానీ ఆ వూళ్లో వీణ మాస్టారు దొరకలేదు. దాంతో ఆ కోరిక కొంతకాలం అలాగే వుండిపోయింది. ఆ తర్వాత నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత వీణ నేర్చుకున్నాను.

మా వూళ్లో ఒక నాటకసమాజం వారు ‘ఢిల్లీ ఛలో’ అనే నాటకం వేశారు. అనుకోకుండా ఆ నాటకంలో హీరో చెల్లెలి పాత్ర నేను వేయాల్సి వచ్చింది. అంతవరకూ నేను స్కూలు డ్రామాలలో స్టేజీ ఎక్కడం తప్పిస్తే, ఇలా బహిరంగంగా, ఏ డ్రామాల్లోనూ పాý£్గనలేదు. అందువల్ల ‘ఢిల్లి ఛలో’ నా మొట్టమొదటి నాటకంగా చెప్పుకోవచ్చు. ఆ నాటకంలో నా నటన అందర్నీ ఆకట్టుకుంది. ఆ నాటకం అనంతరం మా వూర్లోని ఒక ప్రముఖుడు “చిరంజీవి జమున వయసులో చిన్నదైనా ఎంతో బాగా నటించింది. ప్రస్తుతం నా దగ్గర వస్తురూపంలో ప్రజెంటేషన్ లేనందున ధనరూపంలో 25 రూపాయలు ఈ పాపకు కానుకగా యిస్తున్నాను” అని చెప్పారు. నిజం చెప్పొద్దూ... నేను మాత్రం ఆనందంలో మహాగర్వపడ్డాను. అంతేగా మరీ.. అప్పటికి ‘నటన’ గురించి నాకేం తెలుసు! అందరూ అంతగా పొగడుతుంటే, పిసిపాపను కదా, పొంగిపోయాను.

కొన్నాళ్లకు తిరిగి నేను సుంకర - వాసిరెడ్డి గార్లు రచించిన “మా భూమి” నాటకంలో నటించాను. అందులో కూడా నేను హీరో సిస్టర్ వేషమే వేశాను.

ఈ నాటకంలో మా అందరికి నటనలో శిక్షణ యివ్వడానికి, బుర్రకథాపితామహుడు నాజర్ వచ్చారు. అందులో ఆర్టిస్టులందరూ మావూరి రైతులే కావడం వల్ల పొలం పనులన్నీ చూసుకుని రాత్రిపూట రీహార్సల్స్‌కు వచ్చేవారు. ఆ వేళకు నేను నిద్రలోకి జారుకునేసేదాన్ని. దాంతో నాజర్, మా మామయ్య వచ్చి నా మొహానికి నీళ్లుకొట్టి నిద్ర లేపి మరీ రిహార్సల్స్ యిప్పించేవారు. అలా ఆ నాటకం విజయవంతంగా ప్రదర్శించాం. తెనాలి, బెజవాడ సమీపంలో వున్న ‘అయితానగర పాడు’లోనూ ప్రదర్శించాం. నాకు బహుమతులు కూడా వచ్చాయి. ఆ నాటకంతోనే నాకు ‘నటన’ అంటే ఏమిటో తెలిసింది.

కొంగర జగ్గయ్య గారు సినిమారంగంలోకి రాకముందు మా హైస్కూల్‌లో టీచరుగా వుండేవారు. ఆయనతో మా కుటుంబానికి కొంత పరిచయంకూడా వుండేది. ఆ పరచయంతో ఆయన ఓరోజు మా యింటికొచ్చి మా అమ్మతో ‘అక్కయ్యా’ ఈరోజు రాత్రి ‘మండూరు’ అని తెనాలి దగ్గర ఒక గ్రామంలో ‘ఖిల్జిరాజ్యపతనం’ అనే నాటకం మేం వేస్తున్నాం. అందులో అమ్మాయి చేత ఒక చిన్నడాన్సు చేయించాలి. పర్మిషన్ ఇవ్వండి” అన్నారు. మొదట అమ్మ ఒప్పుకోకపోయినా జగ్గయ్యగారి ప్రోద్భలంతో చివరకు సరేనంది. తెనాలి వెళ్లే పాసింజరులో - మేం బయలుదేరాం. తెనాలిలో దిగి, జట్కా ఎక్కాం. జట్కా బండ్లో జగ్గయ్యగారు, ఆయనతో బాటు మరో ముగ్గురు టీచర్లు, వారితోపాటు నేను కూర్చున్నాం. జట్కా ప్రయాణం నాకు చాలా అసౌర్యంగా వుంది. “మామయ్యా.. నేనిక్కడ కూర్చోలేను” అని ఏడుపు మొహం పెట్టాను. పోనీ నా ఒళ్లో కూర్చోమ్మా” అని ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. దారి మధ్యలో బిస్కట్లు, చక్కెరకేళి వంటి చిరుతిండ్లు కూడా కొనిచ్చారు. రెండు, మÖడు మైళ్లు జట్కాలో ప్రయాణం చేశాక, దిగేశాం. కొంతదూరం నడవాలన్నారు. అప్పుడు ప్రారంభమైంది నా అల్లరి. నేను నడవనంటే నడవను, నేనసలు ఆవూరేరాను! అని ఒకటే ఏడుపు. పాపం... నన్ను సమాధాన పరిచేందుకు ఆరోజున జగ్గయ్యగారు పడ్డతిప్పలు అన్నీ యిన్నీ కాదు. ఇక ఏం చేస్తారు? “దేవుడో” అనుకుని, జగ్గయ్యగారు నన్ను ఎత్తుకుని, ఆ వూరికి తీసుకెళ్లి డాన్సు చేయించారు. ఆ డాన్సుకు పాటకూడా ఆయనే పాడారు. నాటక ప్రదర్శన కాగానే మావూరు చేరుకున్నాం. ఇప్పటికీ జగ్గయ్యగారు, గుమ్మడిగారు - అప్పుడు నేను చేసిన అల్లరి గుర్తు తెచ్చి నవ్వుతూ వుంటారు. ఆ డ్రామాలో గుమ్మడిగారు కూడా నటించారు. అయితే అప్పటికి నాకు గుమ్మడి గారితో పరిచయం లేదు.

ఆ రోజుల్లో సినిమాలో చేరాలనే కోరిక లేకపోయినా, సినిమాలు మాత్రం తెగ చూసేదానిన. చుట్టు పక్కలుండే అమ్మలక్కలతో సినిమాలకెళ్లేదాన్ని. నాకు పాటలంటే కూడా చాలా యిష్టం. దాని వల్ల “బాలరాజు” చిత్రాన్ని, ఎస్.వరలక్క్ష్మిగారు పాడిన రాగమాలిక కోసం పదిసార్లు చూశాను! మా అమ్మనాన్నల కంటబడకుండా వెన్నెల్లో మా దొడ్లో వున్న బంతిపూల మొక్కల దగ్గర నిలబడి, “కీలుగుర్రం”లో అక్కినేని నాగేశ్వరరావుగారు గుర్రంపై వెళ్తూ పాడే ‘కాదుసుమా కలకాదుసుమా’ అనే పాటను ఎడమ చేత్తో బంతి మొక్కను పట్టుకుని గుర్రాన్ని తోల్తున్నట్లు ఊపుకుంటూ ప్రాక్టీసు చేసేదాన్ని. అలాగే అంజలీదేవి గారి ‘తీయని వెన్నెల రేయి’ అనే పాట కూడా అభినయించుకునేదాణ్ణి. ఎవరైనా చూస్తే ఎగతాళి చేస్తారేమోననే భయంతో ఒంటరిగా నటించుకుని, మురిసిపోయేదాణ్ణి.

ఒకరోజు - జయప్రకాష్ నారాయణ్, నీలం సంజీవరెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు మా వూరు వచ్చారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నాచేత పాట పాడించారు. ఆ పాట నా జీవితంలో ఓ కొత్త మలుపుకు దారితీయించింది. నేనీనాడు ప్రజానతిగా ఎదగడానికి ఓ పూలబాటను ఏర్పరచింది!

ఎలా అంటే - ఆ రోజు జరిగిన సభలో నా పాట విన్న ఓ సినిమా నటుడు మా యింటికి వచ్చాడు. “నా పేరు నారాయణమÖర్తి. నేను సినిమాలలో నటిస్తూ వుంటాను” అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత చాలా సార్లు మా యింటికి వచ్చేపోయేవారు. వచ్చినప్పుడంతా తన సినిమా అనుభవాలు, ఆ వాతావరణం, సినిమా తారలు మెలగాల్సిన పద్ధతులు అన్నీ చెప్పేవారు. ఎంతో విలువ కలిగిన ఆయన మాటలు, వాస్తవాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి.

అలా పరిచయం బాగా పెరిగాక ఓ రోజున - “ఏమండీ మీరేమీ అనుకోకపోతే - నేనొక మాట చెబుతాను. మీ అమ్మాయిని సినిమాల్లోకి ఎందుకు చేర్పించకూడదు? మంచి గొంతు, నటనలో ఉత్సాహం, రూపం... అన్నీ వున్నాయ్ కదా?” అన్నాడు. మా నాన్న నవ్వి వూరుకున్నారు గానీ అమ్మ మాత్రం “మాకు సినిమాలు, గినిమాలు ఏమీ అక్కర్లేదు. మమ్మల్ని మర్యాదగా బ్రతకనివ్వండి” అంటూ దండకం చదివింది. ఆ తర్వాత కూడా ఆయన అదే మాట వీలైనప్పుడల్లా ప్రస్తావనకు తెచ్చేవారు. అమ్మ పడనిచ్చేది కాదు గానీ, నాకు మాత్రం సినీమాతార కావాలనే వుండేది.

ఒకరోజు మా మాష్టారుగారి ఇంట్లో వడియాలు పెట్టుకుంటూ వున్నాం. వాళ్లింటికి చుట్టపు చూపుగా వచ్చిన ఓ అరవైఏళ్ల ముసలమ్మ, సినిమా కబుర్లు చెబుతూ కూర్చుంది. కాసేపు అదీ, ఇదీ మాట్లాడి నన్ను పట్టుకుని “ఏమ్మా... జమునా... నువ్వెందుకు సినిమాల్లో చేరకూడదు? మంచి అందం, వుంది... మా అబ్బాయి ఒకడు అంతా కొత్తోళ్లను పెట్టి సినిమా తీస్తున్నాడు. నేను ప్రయత్నిస్తాను.  తీరా అవకాశం వచ్చాక, వద్దనవద్దు “అంటూ, ఏమో అప్పుడే నాకేదో సినిమా ఛాన్సు యిప్పించేసినట్లు మాట్లాడసాగింది. “ఛాల్లే... నాయనమ్మ... పోచుకోలు కబుర్లు “అంటూ మా మాష్టారు గారి భార్య విసుక్కుంది. దాంతో ఆమెకు ఎక్కడలేని కోపమొచ్చి “మారాజాతో చెప్పి జమునకు వేషమిప్పించకపోతే, నన్ను మళ్లీ ‘నాయనమ్మా’ అని పిలవ్వొద్దు అంటూ సవాలు చేసింది. ఆమె చెప్పిన ‘రాజా’ అంటే డా॥గరికపాటి రాజారావు గారన్నమాట! డా॥ రాజారావుగారి కామె పినతల్లి. కొంతకాలానికి డా॥ రాజారావుగారి నుండి రాజమండ్రి వెంటనే బయలుదేరి రమ్మని టెలిగ్రాం వచ్చింది. మేం ఆశ్చర్యపడుతూనే మా నాన్న, నేను రాజమండ్రికి వెళ్లాం. రాజారావు గారింట్లోనే దిగాం. ఆ మరునాడు ఉదయం, రాజారావుగారు, కర్రి నాగభూషణంగారు వారి ఫ్రెండ్స్ అందరూ హాల్లో కూర్చొని, నన్ను పాట పాడమన్నారు. పాట అనగానే లేచి రెండు పాటలు పాడేసాను. నటనానుభవం గురించి అడిగితే “మాభూమి”, “ఖిల్జిరాజ్యపతనం’ మొదలైనవి చెప్పా. నన్ను చూస్తూనే రాజారావుగారు ‘అయ్యో చాలాచిన్నపిల్ల’ అని అన్నారు. “మేం మొదటిసారి ఈ సినిమా పరిశ్రమలో ప్రవేశిస్తున్నాం. మాకు గైడెన్స్‌గా వుండే వి.ఎన్.రెడ్డి (కెమెరామెన్)గారి సలహాలతో సినిమా తీస్తున్నాం. వారికి మీ అమ్మాయి ఫోటోలు u£ంబాయి పంపుతాం. ఆయన తీసుకోమంటే తీసుకుంటాం అన్నారు. ఆ తర్వాత దుగ్గిరాలకు ఒక ఫోటో గ్రాఫర్ని పంపి మేకప్ అది లేకుండా ఫోటోలు తీసుకెళ్లారు. ఆ తరువాత ఆ సంగతే మేం పట్టింకోలేదు.

ఇలావుండగా ఓరోజు బి.వి.రామానందం (‘వరూధిని’ చిత్ర నిర్మాత) మా యింటికి వచ్చారు. “మేం జైవీర బేతాళ” అనే చిత్రాన్ని మొదలు పెడుతున్నాం, కథానాయికగా ఎవరైనా కొత్త అమ్మాయిని తీసుకోవాలను కుంటుంటే, నా మిత్రుడు శ్రీమన్నారాయణమÖర్తి మీ గురించి చెప్పాడు. వచ్చే నెలలో చిత్రనిర్మాణం. ఇదిగోండి 500/- అడ్వాన్సు అని డబ్బిచ్చి ఎప్పుడు రావాల్సింది టెలిగ్రాం ఇస్తానని వెళ్లిపోయారు. అనుకున్నట్టుగానే బి.వి.రామానందంగారి దగ్గర్నుంచి టెలిగ్రాం వచ్చింది. ఆ రాత్రే నేను, మా నాన్నగారు మద్రాసు బయలుదేరాం. మేం మద్రాసు వచ్చామని తెలియగానే శ్రీమన్నారాయణమÖర్తి స్వయంగా వచ్చి మమ్మల్ని రామానందంగారి ఆఫీసుకు తీసెకెళ్లారు. అక్కడ గుమ్మడిగారు కూర్చుని వున్నారు. ఆయనే “జై వీర భేతాళ” చిత్రంలో హీరో అని చెప్పారు. “ఈ పూట అమ్మాయికి మేకప్ స్టిల్స్ తీయిద్దామండీ” అన్నారు రామానందంగారు. మేకప్‌మాన్ రావడం కొంచెం ఆలస్యం కావడంతో, అంతలోపు రెండు, మÖడు దృశ్యాలు రిహార్సల్స్ చేయించారు. ఈలోగా మేకప్‌మాన్ భద్రయ్యగారు వచ్చారు. అప్పటికే ఆయన చాలా పేరుపొందిన మేకప్ మేన్. ఆయన మేకప్ వేస్తే నా మొహానికి తిరుగుందా? స్టిల్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. రామానందంగారు సంతోషపడిపోయి మరో 500/- అడ్వాన్స్ యిచ్చి అగ్రిమెంట్ రాయించేసుకున్నారు. తర్వాత మేం దుగ్గిరాల కొచ్చేశాం. అలా పదిరోజులు గడిచిపోయాయి. నాకు పరీక్షలు మొదలవుతాయి అనంగా, షూటింగ్‌కు రమ్మని టెలిగ్రాం వచ్చింది. పరీక్షకు వెళ్లాలా, షూటింగ్‌కు వెళ్లాలా! అసలే ఫస్టు ఛాన్సు. అందులోనూ హీరోయన్. పైగా అగ్రిమెంట్ రాసేసాం. కాబట్టి చదువుకు నామం పెట్టి మద్రాసు ప్రయాణం కట్టాం. మా తమ్ముడు గిరికి తోడుగా మా అమ్మమ్మను వుంచి అమామ, నాన్నలతో బయలుదేరాను.

సినిమాల కోసమనే తాత్కాలికంగా ఒక చిన్న యిల్లు అద్దెకు తీసుకున్నాం. ఆ రోజుల్లో రాత్రి పూట షూటింగ్‌లు ఎక్కువ. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారి 6 గంటల వరకు. కోడంబాకంలోని ‘స్టార్ కంబైన్స’ స్టూడియోలో షూటింగు. రాత్రి 10 గంటలకు సెట్టులో అడుగుపెట్టా. అంతా వింతగా తోచింది. సెట్‌నిండా బోలెడు మంది జనం, పెద్దపెద్ద లైట్లు, లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్ అంటూ కెమెరామెన్ అరుపులు. ఇవన్నీ చూడగానే నాకు భయమేసింది. రామానందం గారే స్వయంగా నన్ను తీసుకెళ్లి కెమెరామెన్ కొట్నీస్‌గాఇరికి పరిచయం చేశారు. ప్రక్కనే రాణీగారి వేషంలో ‘వాంప’గా నటిస్తున్న జూ॥లక్క్ష్మీరాజ్యంగారికి మన కొత్తహీరోయిన్ అంటూ పరిచయం చేసారు. ఎలాగో, అలాగా షూటింగ్ పూర్తి చేసాను. షూటింగ్ అయిన మరో 2 రోజులకి మళ్లీ దుగ్గిరాల ప్రయాణమయ్యాం. ‘ఎలాను మద్రాసు వచ్చాం కనుక ఓసారి రాజారావు గారిని కలిసివెళ్దాం’ అని నాన్నగారంటే, సరేనని వారి ఆఫీసుకెళ్లాం. ఆయన కోపం జేసుకుని “ఏమిటి, మిస్టర్ శ్రీనివాసరావ్ మొదటిసారి కొత్త హీరోయిన్‌గా మీ అమ్మాయిని తెరకు పరిచయం చేయాలని మేం అనుకుంటుంటే వేరే పిక్చర్ ఎందుకు ఒప్పుకున్నారు? మా చిత్రంలో అవకాశం లేదు. అని ఖరాఖండిగా చెప్పగానే, “మీరే కదండి, వి.ఎన్.రెడ్డిగారు ఒప్పుకుంటే గాని బుక్ చేయలేమన్నారు. ఈలోగా మరో పిక్చర్‌లో హీరోయిన్‌గా అవకాశం వచ్చిందని ఒప్పుకున్నాం. మీకిష్టమైతే యివ్వండి, లేకపోతే లేదు. మేము దీన్నే బ్రతుకు తెరువుగా అనుకుని రాలేదు” అని గట్టిగానే మాట్లాడివచ్చేసారు.

మేం దుగ్గిరాల కొచ్చిన రెండోరోజే డా॥ రాజారావుగారి వద్ద నుంచి మనిcõచ్చాడు. “మిమ్మల్ని వెంటనే మద్రాసు తీసుకుని రమ్మన్నారండి” అని ఒక లెటర్ ఇచ్చాడు. అప్పుడు పొమ్మన్నారు. ఇప్పుడు రమ్మంటున్నారు - అయినా పిలిచినపుడు వెళ్లకుంటే బావుండదని వెళ్లాం.

రాజారావుగారు నవ్వుతూ మాట్లాడారు. అప్పుడు తెలిసింది అసలు విషయం. బాంబే నించి టెలిగ్రాం వి.ఎస్.రెడ్డిగారి నుంచి వచ్చిందట. “బుక్ జమున ఇమీడియట్లీ, ఆమెకు నర్గీస్ పోలిక వుంది అని”. అప్పట్నించే నన్ను “ఆంధ్రా నర్గీస” అని పిలిచేవారు. అప్పటికప్పుడు అగ్రిమెంట్ టైప్ చేయించి, నెలకు 500/- పారితోషికంగా మాట్లాడుకున్నాం. ‘పుట్టిల్లు’(1.19.53)లో కథానాయిక ‘సుశీల’ పాత్ర నాది. చాలా గొప్ప పాత్ర. పతనం చెందిన భర్తతో యిక కాపురం చేయనని, భర్తను వదలి, ఆదర్శాలకు కట్టుబడిన పాత్ర అది. చాలా కష్టతరం. అంత చిన్నవయసులో నాకు అంతగొప్ప పాత్ర యివ్వడం సాహసమే. “పుట్టిల్లు”లో నేనేకాదు, ఇంకా చాలా మంది కొత్తవారు పరిచయమయ్యారు. అల్లురామలింగయ్య, దేవిక, పెరుమాళ్లు... ఇలా అందరికీ అదే తొలిచిత్రం. డా॥ రాజారావుగారే హీరోగా నటించారు. “పుట్టిల్లు” బాగా వుందని పేరు తెచ్చుకున్నా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. అయినా నాకు మాత్రం మంచి పేరే వచ్చింది.

డా॥ రాజారావుగారికి ఆడపిల్లలు లేరు. నన్ను స్వంతకూతురులాగే చూసేవారు. ఎప్పుడూ ‘అమ్మలూ’ అని పిలిచేవారు. నేనీనాడు యిలా వున్నతస్థితిలో వున్నానంటే దానికి కారణం రాజారావుగారే. ఆయన గొప్ప మానవతావాది. పేదవాళ్లంటే విపరీతంగా జాలి చూపేవారు. ‘పుట్టిల్లు’ దెబ్బ తిన్నా మద్రాసులోనే వుండేవారు. చిన్న ప్రాక్టీసు పెట్టి పేదలకు ఉచితంగా వైద్యసహాయం, అవసరమైతే ఆర్థిక సహాయం కూడా చేసేవారు. పాపం డాక్టర్‌గారి భార్య ముగ్గురు పిల్లలతో చాలా కష్టాలు పడింది. రాజారావు గారిని మళ్లీ సినిమా తీయమని, నేను ఉచితంగా నటించి, మిగిలిన ఆర్టిసుట్ల వద్ద నుంచి కూడా సహకారానికి ప్రయత్నిస్తామని చెప్పాను. ఆయన, జగ్గయ్యగారు హీరోగా “దేవుడు చేసి మేలు” మొదలు పెట్టారు. కేవలం మÖడు రోజులు షూటింగ్ జరిగి ఆగిపోయింది. అయితే బి.గోపాలం గారి సంగీత దర్శకత్వంలో కొన్ని పాటలు మాత్రం రికార్డయ్యాయి.

నేను ‘మురళీకృష్ణ’ (..) షూటింగ్‌లో హైదరాబాదులో వుంటే, రాజారావు గారు చనిపోయారనే వార్త తెలిసింది. నేను వెంటనే మద్రాసు వచ్చాను. వచ్చిన వెంటనే విజయాగార్డెన్స్‌లో సంతాపసభ ఏర్పాటు చేశాం. నేను వారి కుటుంబానికి లక్షరూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించాను. అందరూ సంతోషించారు. తర్వాత ఎన్టీరామారావుగారి అధ్యక్షతన ఒక కమిటీని పెట్టి లక్షరూపాయలు ఎలా అందించాలో అన్నది నిర్ణయించాం. ఎన్.టి.రామారావు గారు డబ్బిస్తే ఖర్చయిపోతుందని, ఒక యిల్లు కొనిస్తే బాగుంటుందని సూచనిచ్చారు. హబీలుల్లా రోడ్డులో ఒక పెద్దమేడ, ఆయన శ్రీమతి పేరు కొనిచ్చాను, పిల్లలు పెద్దవారై సుఖంగానే జీవిస్తున్నారు. ఈ విధంగా రాజారావుగారి పట్ల నా కృతజ్ఞత తెలియజేసుకోగలిగాను. వారి పట్ల నేను చేసిన అపచారమేదైనా వుంటే అది “పుట్టిల్లు” ఫిల్మ్ నెగెటివ్‌ను కాపాడుకోలేక పోవడమే.

“పుట్టిల్లు” తర్వాత నాకు కొత్త ఆఫర్లు ఏమీ రాలేదు. ఏం చేయాలో తోచక తిరిగి దుగ్గిరాలకు వెళ్లి పోదామనుకున్న దశలో రోహిణీ సంస్థ అధినేత హెచ్.ఎం.రెడ్డిగారు “వద్దంటే డబ్బు” (54) చిత్రాన్ని నిర్మిస్తూ నాకు రెండో హీరోయిన్‌గా అవకాశం యిచ్చారు. మొదటిలోనే కథానాయికగా వచ్చి మళ్లీ ఒక మెట్టు కిందకు దిగితే ఎలా అని ఆలోచించాం. కానీ “ఆ సంస్త చాలా పెద్ద సంస్థ సెకండ్ హీరోయిన్ అయినా మంచి వేషం... అందులోనూ రెండు భాషలు (తెలుగు, అరవం) కాబట్టి అవకాశం వదులుకోవద్దని పెద్దవాళ్లు సలహాయివ్వడంతో అంగీకరించాను. తెలుగులో పేకేటి శివరాం గారు, అరవంలో తంగవేలుగారు నా సరసన నటించారు. “వద్దంటే డబ్బు” చిత్రనిర్మాణ సమయంలోనే నేను అరవం చదవడం, రాయడం నేర్చుకున్నాను. ఈ చిత్రంలో మాత్రం నా డైలాగుల్ని మరొకరిచే చెప్పించారు. తర్వాత్తర్వాత - నేను నటించిన తమిళచిత్రాలలో నా తమిళ డైలాగులు నేనే చెప్పుకోసాగాను. “వద్దంటే డబ్బు” రెండు భాషల్లోనూ విజయవంతం కాలేదు. దాంతో నాకు ‘అన్‌లక్కీస్టార’ అని పేరొచ్చేసింది. అవకాశాలు వెదుక్కుంటూ వచ్చికూడా, ఫలితం దక్కకుండా పోతూ వుందే అనే నిరాశాభావం నాలో కలిగింది! ఈలాంటి సమయంలో నాకు సారథీ వారి “అంతామనవాళ్లే” (54)లో రెండో కథానాయికగా అవకాశం లభించింది. ఆ చిత్రానికి తాపీ చాణక్యగారు దర్శకులు. ఆ చిత్రం షూటింగ్ సమయంలోకి పరిశ్రమ గురించి పూర్తిగా నాకు తెలిసొచ్చింది. “అంతా మనవాళ్లే” చిత్రం నూరు రోజులాడింది. విజయవంతంగా ఆడిన నా మొదటి చిత్రం అదే! ఆ చిత్రంలో నేను ఏ పాత్రకైనా సరిపోతానన్న పేరు వచ్చింది. “అంతా మనవాళ్లే”లో నటిస్తూ వుండగానే, బి.ఎన్.రెడ్డి గారి “uంగారు పాప” (54)లో అవకాశం వచ్చింది. అతిథి పాత్రయినా, మంచి పేరే వచ్చింది. దీని తర్వాత వరసగా “మాగోపి” (54), “నిరుపేదలు” (54) మొదలైన చిత్రాల్లో నటించాను.

ఆ వెంటనే “మిస్సమ్మ” (55)లో నటించాను. నేను, సావిత్రిగారు, అక్కాచెల్లెళ్లుగా నటించిన మొదటి చిత్రమది. సావిత్రిగారితో నాకు పరిచయం అంతకు ముందే వుంది. అదెలాగంటే - ఓరోజు షూటింగు లేవీ లేకుంటే, ఖాళీగా యింట్లో కూర్చుని వున్నాను. ఉదయం పదిగంటల ప్రాంతంలో - మాయింటికి ఓ పెద్దకార్లో... ఓ అబ్బాయి వచ్చాడు. “నేను సావిత్రిగారి యింటి నుంచి వస్తున్నానండి... సావిత్రిగారు మీ ఫొటో పత్రికలో చూశారట. పేరు ‘జమున’ అని తెలియగానే ‘తను దుగ్గిరాలలో నాట్యం చేయడానికి వచ్చినపుడు- ఆ పల్లెలో జమున అనే అమ్మాయి కలిసిందట. ‘ఆ జమున మీరూ ఒకరేనా’ అని సందేహం తీర్చుకుని  - దుగ్గిరాల జమునే అయితే ఈ కార్లోనే మిమ్మల్ని ఎక్కించుకుని యింటికి తీసుకురమ్మన్నారు” అని చెప్పాడు ఆ అబ్బాయి. నేను, మా నాన్న, తమ్ముడు కలిసి సావిత్రిగారి ఇంటికెళ్లాం. అప్పటికే ఆమె పద్దెస్టారు. నేనేమో యింక తొలిచిత్రంలోనే వున్నాను. కానీ ఎంత మర్యాద చేసారు. ఇంట్లోకి వెళ్లగానే ‘ఓహో జమునా’ అంటూ కౌగలించుకుని బుగ్గల మీద ముద్దులు పెట్టింది. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఉన్నతమైన స్థితిలో ఉండీ కూడా - తానెప్పుడో కాకతాళీయంగా కలుసుకున్న వ్యక్తులను గుర్తుంచుకుని - కబురు చేసి మరీ పిలిపించడమనేది ఆమె మంచితనం, గొప్పతనంగా భావిస్తుంటాను.

యిక ‘దుగ్గిరాల’కు ‘సావిత్రి’గారికి సంబంధం ఏమిటంటే - నా చిన్నప్పుడు ఓసారి శ్రీరామనవమి ఉత్సవాలకు డాన్స్ చేసేందుకు సావిత్రిగారు మా ఊరు వచ్చారు. మా మాష్టారు గారింట్లో స్నానాలు, భోజనాల ఏర్పాట్లు జరిగాయి. తర్వాత తొక్కిసలాట కారణంగా సావిత్రిగారు అక్కడ స్నానానికి ఇబ్బంది పడుతుంటే మా యింటికి తీసుకెళ్లాను. మాయింట్లోనే భోజనం కూడా చేసారు. ఆ సంఘటన సావిత్రిగారు మరచిపోలేదు. జ్ఞాపకం పెట్టుకోవడం ఒక ఎత్తయితే, ఇంటికి పిలిచి అంతగా అభిమానం చూపించడం మరొక ఎత్తు. ఈ విషయం నేనెప్పుడూ మరచిపోలేను. చాలా ఆప్యాయంగా పలకరించి, ఆ మర్నాడు ఆగస్టు 15 “మా యింట్లో జెండా ఎగుర వేస్తున్నాం కారు పంపుతాను తప్పకుండా రావాలి” అని చెప్పారు. అలా ఏర్పడిన మా పరిచయం “మిస్సమ్మ”తో బలపడింది.

సావిత్రిగారు నన్ను సొంత చెల్లెల్లా చూసుకునేవారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో సలహాలిచ్చేవారు. భోళా మనిషి. ఓసారి “మిస్సమ్మ” టైంలోనే అనుకుంటా, తారలందరం కూర్చుని లంచ్ చేస్తున్నాం. ఛాయాదేవి గారు ఎందో ముక్కలుగా తీసి వడ్డిస్తున్నారు. అది మాంసమని తెలుసుTని “ఛీ, పాడు, దీన్నెలా తింటారు మీరు” అని ఏవగించుకున్నాను. ఛాయాదేవి గారు “అదేమిటమ్మాయ్! తినే పదార్ధాలను అలా అంటావ” అని తన ధోరణిలో కేకలేసింది. వెంటనే సావిత్రిగారు నా నెత్తిన ఓ మొట్టికాయ వేసి - ‘ఏం జమునా, నీకేం తెలియదు, నీకిష్టం లేకపోతే వూరికే వుండాలిగాని, అలా కామెంట్ చేయకూడదు” అని మందలించారు. “దొంగరాముడు” (55), “అప్పుచేసి పప్పుకూడు” (59), “గుండమ్మకథ” (), “మÖగమనసులు” (). ఇలా చాలా సినిమాల్లో యిద్దరం కలసి పని చేశాను. మా అన్యోన్యస్నేహపు సహించలేక కూడా కొందరు మా మధ్య అపార్థాలు సృష్టించారు. మేమిద్దరం కొంతకాలం మాట్లాడుకోలేదు. మళ్లీ నా పెళ్లి కార్డు యివ్వడానికి ఆమె ఇంటికెళ్లాను. వస్తుందో, రాదో అని సందేహిస్తూనే ‘శుభలేక’ ఇచ్చాను. ఆమె నన్ను బాగా రిసీవ్ చేసుకుని, నన్ను గట్టిగా పట్టుకుని ఆప్యాయంగా కౌగలించుకుని, “నా చెల్లెలి పెళ్లికి నేను రాకుండా వుంటానా” అని చెప్పి, చెప్పినట్లుగానే తానే పెళ్లిలో నన్ను స్వయంగా అలంకరించింది. అలా మళ్లీ మామÖలు అయిపోయాం. తన మ్యారేజీ లైఫ్ గురించి చాలా మనస్తాపం పొందారు సావిత్రి. “ఆయన ఎప్పుడూ తన సమక్షంలోనే వుండాలి” అని కోరుకునేది అక్కడే వచ్చింది సమస్యంతా. విషయం తెలిసి కూడా అలా ఆలోచించకూడదని చెప్పేదాన్ని. అప్పటికి విని, అంగీకరించినా మళ్లీ యధాస్థితి కొచ్చేసేది.

ఆమె చివరిదశలో కూడా ఆమెను మద్రాసు వెళ్ళినప్పుడు కలిశాను. అప్పటికే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అందరూ అనుకున్నట్లు ఆమె మరీ బీద స్థితిలో లేదు. కోడైకెనాల్‌లో గెస్టుహౌస్ అదీ వుండేది. వాటిని అమ్మేసి సంతోషంతో వుండొచ్చు కదా అనేదాన్ని. సరే అనేది. ఆ తర్వాత అవన్నీ ఏమైపోయాయో తెలీదు. ఎక్కడో అన్నానగర్‌లో వుంటే వెళ్లాను. అమెరికాకైనా తీసుకెళ్లి వైద్యం చేయించాలనుకుని నిశ్చయించుకుని, భాట్టం శ్రీరామమÖర్తి గారిని సంప్రదించాను. ముఖ్యమంత్రి అంజయ్యగారు కూడా “జమునగారు సావిత్రిగారి విషయంలో ఏమి చేస్తే దానికి మీరు సహకరించండి” అని భరోసా యిచ్చారు. కానీ డాక్టర్లు “ఏం ప్రయోజనం లేదండీ, మీరు అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నారు కదా, ఆ అమెరికా డాక్టర్లే ఇక్కడ కూడా ఆమెకు వైద్యం చేస్తున్నారు. ఏం లాభం లేదు” అని చెప్పారు. దాంతో నేనేమీ చేయలేకపోయాను.

నేను మొట్టమొదట భరతనాట్యం చేసిన చిత్రం కూడా “మిస్సమ్మే” ‘బాలనురా మదనా’ అనే పాటకు డాన్స్ చేశాను. ఆ పాటకు డాన్స్ రిహార్సల్స్ నాకు నెలరోజులు పట్టింది. పసుమర్తి కృష్ణమÖర్తిగారు చాలా ఓపికగా చెప్పించారు. అయితే చక్రపాణి గారు మాత్రం కొంచెం విసుక్కునేవారు. “ఏందీ అటు చూడమంటే - ఇటు చూస్తావ” అని అనేవారు. ఆయన మాట తీరే అంత. కాని నిజంగా చాలా గొప్పవ్యక్తి ఆయన. ఈ విషయం వారితో బాగా పరిచయం ఏర్పడిన తర్వాతగానీ అర్థం కాదు. మళ్లీ “ఉషాపరిణయం” (61)లో క్లాసికల్ డాన్సెస్ చేశాను.

అన్నపూర్ణా వారి “దొంగరాముడు” ()లో హీరో (అక్కినేని) చెల్లెలుగా నటించాను. ఆ చిత్రం నాకు మంచిపేరు తెచ్చిపెట్టింది. అందులో నా సోలోసాంగ్ ‘అనురాగము విరిసేనా’ పాట పి.సుశీల పాడారు. సుశీలగారు అప్ప్పుడప్ప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటరవుతున్నారు. ఆపాట ఆమెను కూడా తారాస్థాయికి చేర్చింది. దొంగరాముడు తర్వాత మళ్లీ “పూలరంగడు’ 1967లో హిరోహిన్‌గా ‘అన్నపూర్ణ’ వాళ్లకు చేశాను. 

మొదటినుంచీ నేను మగవారిలో ఎక్కువగా మట్లాడేదాన్నికాదు. ఎవరు ఏం ‘లీనియన్స్ ‘తీసుకుంటారో అని ఎందుకంటే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఆడది కాలుమీద కాలు వేసుకుని కూర్చోకపోతే, ప్రతి మగవాడు భుజం విÖద చెయ్యేస్తాడు. అలా రెండు మÖడు విషయాలు జరిగయి కూడా. అందువల్ల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని పద్ధతులు పాటించనప్ప్పుడు - అది చూసే వారికి అహంకారంగానే కన్పిస్తుందేగాని ఆత్మగౌరమనే విషయం స్ఫురించదు. అలా వుండేదాన్ని కాబట్టే అది అర్థం చేసుకోక ‘అహంకారి’ గర్విష్టి’ ‘పొగరబోతు’ లాంటి బిరుదులు తెచ్చుకున్నాను. దానికి నేనేం చేయలేను.

1956లో నేను నటించిన సినిమాలన్నీ విజయం సాధించినవే. ‘చిరంజీవులు’, ‘ముద్దుబిడ్డ’, ‘నాగులచవితీ’ ‘తెనాలి రామకృష్ణ’ వంటివన్నీ ఆ సంవత్సరంలో వచ్చినవే.

‘చిరంజీవులు’ చిత్రంలో నా పాత్ర నాకు మరుపురాని పాత్రలలో ఒకటి. వేదాంతం రాఘవయ్యాగారు, యన్.టి.రామారావుగార్ని, నన్ను ప్రత్యేక దృష్టిలోకి తీసుకొని ఆ పాత్రల్ని సృష్టించారు. భగ్నప్రేమికులుగా నేను,రామారావుగారు పోటిపడి నటించాం. మల్లాది రామకృష్ణశాస్త్రిగారి సాహిత్యం. ఘంటసాలగారి సంగీతం బాగా సక్సెస్ చేసిందా సినిమాను. ఆ చిత్ర నిర్మాత డి.యల్. నారాయణగారు నాకు పితృసమానులు. డి.యల్ గారంటే మొదట్లో మా నాన్నగారికి సదభిప్రాయముండేది కాదు. కానీ ‘చిరంజీవులు’ పూర్తియ్యేసరికి ఆ అభిప్రాయం పూర్తిగా తప్పనిపించింది. ఆ తర్వాత ఆయన మాకు ఫ్యామిలిఫ్రండ్ అయిపోయారు. మాకొక రకంగా పెద్దదిక్కు. నన్ను సొంతకూతురులాగా చూసుకునేవారు. చివరికి నా పెళ్లి సంబంధాలు కూడా ఆయనే చుశారు. రమణరావు గారితో పెళ్లికూడా ఆయనే దగ్గరుండి జరిపించారు. ఆయన చిత్రాలే ‘దొంగల్లోదొర” (1957), “ఏకవీర”, “బందిపోటుదొంగలు”, “దొరికితే దొంగలు”(1965), సిపాయి కూతురు లాంటివి చేశను. నన్ను కథానయకగా పెట్టి “కవయిత్రిమొల్ల” తీయాలనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం నెరవేరలేదు. ఆయన మరణిస్తే ఆ కర్మకాండలు కూడా నేనే చేయవలసి వచ్చింది.

కె.బి.తిలక్ గారు మాకు ‘పుట్టిల్లు’ నాటి నుంచీ పరిచయం, ఆయనంటే మాకు అభిమానం, గౌరవం. ఆయనే నిర్మాతగా, దర్శకుడిగా మారి ‘ముద్దుబిడ్డ తీశారు. ‘అనుపమా’ పతాకంలో మొట్టమొదటి హీరోహిన్ నేనే. ఒక్క అనుపమ మాత్రమే కాదు ‘జగపతి’ (అన్నపూర్ణ 60) ‘సురేష్ ప్రొడక్షన్స్ (రాముడు భీముడు 64) మొదటి చిత్రాల్లోకూడా నేనే హీరోహిన్‌గా నటించడం నాకు చాలా ఆనందం కలిగించే విషయం. 

ఇక నేను ఎక్కువగా నటించిన సంస్థ ఏ.వి.ఎం. సంస్థ. “నాగులచవితి” మొదలుకుని వరసగా 14 సినిమాలు చేశాను. “భూకైలాస”(1958) “మÖగనోము” “రాము”(1968) “లేతమనసులు” (1966) వంటి చిత్రాలన్నీ ఏవియం వారివే 1956లోనే ‘ఆదర్శసతి అనే కన్నడ భాషా చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆవార్డు తీసుకున్నాను. అదే నా కన్నడ చిత్రం. “భాగ్యరేఖ” (1957) చిత్రం జాతీయ అవార్డు తీసుకుంది. బి.యన్.రెడ్డిగారు దర్శకత్వం వహించిన చిత్రమది. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే “పూజాఫలం ”లో నటించాను. 

సినిమా రంగం తీపి అనుభావాలనే గాక, చేదు అనుభవాలు కూడా కలిగించింది. “భూకైలాస” టైంలో ప్రారంభమైంది వార్. ఆనాటి అగ్రహీరోలు ఇద్దరూ నాతో నటించమని బాయ్‌కాట్ చేసారు. “జమున పొగరబోతు, లేట్ కమ్మర్, ట్రబుల్‌సమ” అంటూ లేనిపోని కారణాలు చెప్పేవారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల కిందట జరిగిన సంఘటన పరిశ్రమకు, ఇటు ప్రేక్షకులకు తెలసు. దాని గురించి నేనిప్ప్పుడు చెప్పి ఎవరినీ బాధ పెట్టదలచుకోలేదు. నిజంగా నేను ట్రబుల్ సమ్ అయితే నన్ను బుక్ చేసుకున్న నిర్మాతలు బాధపడాలి కదా? అందుకు భిన్నంగా జరిగిందిక్కడ, అయితే అలా ప్రచారం చేసినందుకు కాదు నాబాధ, నాకు సినిమాలు కూడా లేకుండా చేసి నా కెరీర్‌నే దెబ్బతీయాలని చూశారు. నా ఆత్మాభిమానం చంపుకోకుండా వారితో ఒక రకంగా పోరాటమే చేశాను. భగవంతుని దయ, ప్రేక్షకుల ఆశీస్సులు, ఆదరణలతో నేనే నెగ్గి సగర్వంగా చిత్రసీమలో నిలబడ్డాను. 

ఆ టైంలో నేను జగ్గయ్యగారితో (ఈడుజోడు) రమణమార్తిగారితో (పెళ్లితాంబూలం) హరినాధ్ (నాదీ ఆడజన్మ, లేతమనసులు)లతో నటించిన సినిమాలు సక్సెస్ అయిపోయాయి. అలా కూడా కొంతకలిసొచ్చింది నాకు. అంతేకాదు హిందీ చిత్రాల్లోకూడా అవకాశాలు వచ్చాయి. రేలంగిగారు ‘జమునా! తంతే బూరెల బుట్టలో పడ్డట్టు వుందామ్మాయ్ నీపని అనేవారు. అప్పటికే నేను నయా ఆద్మీ మిస్‌మేరి హిందీలో చేశాను. ఎల్.వి.ప్రసాద్‌గారు హమ్‌రాహి చిత్రంలో నాయికగా అవకాశం ఇచ్చారు, తర్వాత బేటాబేటి “మిలన్ దుల్హన్ ఏక్‌రాజ్ ఇలా 12 చిత్రాల వరకు చేశారు.

ఇలా మÖడు నాలుగేళ్ల సంగ్రామంలో నిర్మాతలు దెబ్బతిన్నారు. నిర్మాత సుఖంగా వుంటేనే కదా, ఆర్టిస్టు సుఖంగా వుంటాడు. వాళ్ల చిత్రాల్లో కొన్ని, నా చిత్రాల్లో కొన్ని దెబ్బతిన్నాయి. ఇదంతా మంచి పరిస్థితి కాదని పరిశ్రమలో అనుకున్నారు. సరిగ్గా అదే టైంలో విజయావారు “గుండమ్మకథ” మొదలుపెట్టారు. అందులో రెండుజంటలులో మాది ఒక జంట. కానీ మా వివాదం చక్రపాణి గారికి తెలుసు. వాళ్లంతట వాళ్లే సర్దుకుపోతారులే అనుకున్నారు, కానీ లాభం కనిపించక పోవడంతో రాజీ సమావేశాలు ఏర్పాటు చేశారు. మొదటిరోజు కె.వి.రెడ్డి గారు వచ్చారు.

గుండమ్మకథ రజతోత్సవాలు చేసుకుంది. అందులోని అమ్మాకాఫీ! అనే నా డైలాగ్ ఆంధ్రలో చాలా పాపులరఅయింది.

నన్ను పక్కకు పిలిచి చూడమ్మా! వాళ్లంత పెద్దవాళ్లు ఏదో సర్దుకోపోవాలి ‘అన్నారు. నాతప్పేంటో నాకు తెలిస్తే కదా అన్నాను. ఆయన వారిద్దరితో  కూడా మాట్లాడివచ్చారు. రాజీ కుదరలేదు. చివరికి ‘చక్కన్న’ గారు (చక్రపాణి) కలుగజేసుకుని ఓ చిన్న మీటింగ్‌లాంటిది పెట్టి అందరికీ అక్షింతలు వేసి ‘ఇక అంతా కలసి పనిచేయండి. అవతల నా గుండమ్మ ఏడుస్తుంది అన్నారు. అలా ‘గుండమ్మ’ కోసం కాంప్రమైజ్ అయ్యాం. అయితే దానికంటే ముందుగా “గుళేబకావళికధ1969 మొదలైంది.

యన్.టి.రామారావు గారి సొంత సినిమా అది. ఆయన దర్శకత్వంలో నేను పనిచేయడం కూడా అదే మొదలు. కాశీమంజలీకథలాంటిదా చిత్రకథ. అందులో ‘యుక్తిమతి’ గా వేసాను. ఆ పాత్ర  ఒక వేశ్యపాత్ర దాన్ని ఆయన నేను వేస్తున్నాను కాబట్టి నాకోసం ఆ పాత్ర స్వభావాన్ని మార్చి, పూర్తిగా హీరోహిన్‌ను చేసేసారు. డా॥సి.నారాయణరెడ్డి గారి మొదటి సినిమా పాట ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’ నా విÖద చిత్రీకరింపబడి, ఎందరి హృదయాల్ని  దోచుకుందో.  ఒక పాత్ర కేవలం నా కోసమే అంంటే ‘జమున’ అయితేనే బాగుంటుంది అని నిర్మాత, దర్శకుడు, రచయిత అనుకుని రూపొందించడం అనే ట్రెండ్ వచ్చింది నాతోనే. ‘మÖగమనసులు’లో గౌరి పాత్ర కూడా అలాంటిదే. నేను చాలా కేర్ తీసుకుని చేసిన పాత్ర అది. ఆ పాత్ర నాకొక సవాల్ లాంటిది. ఆ పాత్ర మాట్లాడే భాష, ఆయాస నేను మాట్లాడలేనని నిర్మాత, దర్శకులు(ఆదుర్తిసుబ్బారావు)లకు చలా సందేహంగా యుండేది. ఆ చిత్రానికి సహకార దర్శకులుగా పనిచేసిన కె.విశ్వనాధ్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని నాకు భాష నేర్పారు. ‘ముక్కు మీద కోపం’ అనే పాట భలే హిట్ అయింది. ఆ సినిమాలో నాపై చిత్రీకరించిన ప్రతిపాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఔట్‌డోర్‌కు వెళితేచాలు ‘గౌరమ్మా నీమొగుడెవరమ్మా’ అంటూ వెంటపడేవారు. ఆఖరకు పి.ఏ.పి.సుబ్బారావుగారు కూడా నవరాత్రిలో  ఓ పిచ్చాసుపత్రి సీనుల్లో నా చేత ఆపాటే పాడించేవారు. అలాగే పెళ్లిరోజు అనే సినిమాలో ‘పెళ్లివారమండి’ అనే పాట (పి.బి.శ్రీనివాస్‌తో) నేనే స్వయంగా పాడుకున్నాను.

ఇక నాకు పేరు తెచ్చిన పాత్ర సత్యభామ పాత్ర. ఎన్టీరామారావు అంటేనే ఎలా కృష్ణుడు గుర్తు వస్తాడో. అలాగే సత్యభామ అంటేనే నేను గుర్తుకొస్తాను. నేను మొదట వినాయకచవితి1957లో ఆ పాత్ర వేశాను. ఆ తర్వాత సురేష్ ప్రోడక్షన్ వారి శ్రీకృష్ణాతులాభారంలో సత్యభామ పాత్ర వేశాను. ఆపాత్ర వేశే నాటికి నాకు వంద చిత్రాల అనుభవం వుంది కానీ అదొక పరీక్షలాగా నిలిచింది. కారణం... రంగస్థలం పైన స్థానం వారు సినిమాల్లో ఎస్. వరలక్క్ష్మీగారు ఆ పాత్ర చేసి పేరు తెచ్చుకున్నారు. అందువల్లనే ఆ పాత్ర పోషణలో ఎవ్వరి ప్రభావం పడకుండా నటించాలని నిర్ణయించుకున్నాను. ఆ పాత్ర స్వభావాన్ని బాగా ఆకళింపు చేసుకుని, ప్రతిరోజు ఒక కొత్తనటిలా అద్దం ముందు నిలుచుకుని ప్రాక్టీస్ చేసేదాన్ని. అంత కష్టపడ్డాను కాబట్టే ఈ రోజుకి ‘సత్యభామ’ పాత్రకు ఐ.ఎస్.ఐ మార్క్‌లా నిలిచిపోయాను. అదే విధంగా కైకేయి (సంపూర్ణరామాయణం), యశోదాదేవి (యశోదకృష్ణ) లాంటి పాత్రలు కూడా.

సాధారణంగా సినిమా తారల వివాహాలు నిలబడవని అంటుంటారు. అయితే ఆ విషయంలో మాత్రం నేను అదృష్టవంతురాలినే. సినిమా పరిశ్రమకు సంబంధం లేని ఒక బయటివ్యక్తిని, విద్యాధికున్ని వివాహమాడిన తొలి తెలుగు సినిమా తారను నేను. మా ముందు తరంలో నాట్యధురీణ పద్మిని ఒక్కతే బయట వ్యక్తిని పెళ్లాడింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి