మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2026, శుక్రవారం

శ్రాద్ధ కర్మలు - మాంసాహార వినియోగం విశ్వ బ్రాహ్మణులు

ఇక్కడ ప్రస్తావించిన విషయంలో 3 ప్రధాన అంశాలు కనబడుతున్నాయి 

1. శ్రాద్ధ కర్మలు 

2. మాంస నివేదనం 

3. విశ్వ బ్రాహ్మణులు 

1. శ్రాద్ధ కర్మలు: ‘శ్రద్ధాయాం కుర్యతే కార్యం ఇతి శ్రాద్ధం’ శ్రద్ధతో భక్తి పూర్వకంగా పితృ దేవతలకు చేసే నివేదన కార్యక్రమం శ్రాద్ధం అనబడును... 

పితృ దేవతలు ఎవరు? 

ఏకాదశ ఆదిత్యులు 

ద్వాదశ రుద్రులు 

అష్ట వసువులు 

ఈ మÖడు సమÖహ దేవతలనే పితృ దేవతలు అని అంటారు.. అంతే కాని దివంగతులైన మన తల్లి దండ్రులు, తాత నాయనమ్మలూ కాదు. ఈ పితృ దేవతలకు విశేష శక్తి సామర్థ్యాలు సహజంగానే ఉంటాయి. వీరి పని తపాలా శాఖ ఉద్యోగుల వంటిదే.

శ్రాద్ధ కార్యక్రమంలో, మనం సమర్పించే తర్పణ దానాలు వీరు స్వీకరించి వాటిని దివంగతులైన మన మాతా పితృలకు వారే రూపంలో ఉన్నా కూడా వారికి తదనుగుణంగా అందిస్తారు.. ఇది కుల మత విచక్షణ రహితంగా అందరికీ వర్తిస్తుంది. 

2.మాంస నివేదనం: యజ్ఞయాగాదులలో శ్రాద్ధ కార్యాలలో మాంస నివేదనం నిషిద్ధం.. గమనించగలరని మనవి. మనుస్మృతి 5వ అధ్యాయం లో 52వ శ్లోకం చూడండి.... 

స్వమాంసం పర మాంసేన యో వర్ణయితు మిచ్చతి

అసభ్యచ్చ్య పితన్ దేవాన్ తతో అన్యస్య పుణ్య కృత్ 

భావం: ఎవడైతే యజ్ఞ యాగాదుల యందు దేవతలను, శ్రాద్ధ కర్మలు యందు పితృ దేవతలను ఘృతము అన్నము మొదలైన యజ్ఞ ద్రవ్యములతో నివేదనం చేయక మాంసమును వినియోగించునో అట్టి వాడు నీచుడు. వాడు నరకంలో పడి అనేక బాధలను పొందును. 

కావున మాంస వినియోగం నిషిద్ధం. అలాగే ఆంధ్ర మహా భాగవతము సప్తమ స్కంధములో పోతన గారు ఆశ్రమ ధర్మాలను వివరిస్తూ ఈ విధంగా అన్నారు. 

ధర్మ తత్వవేత్త అయిన గృహస్తుడు శ్రాద్ధములయందు మాంస ప్రసాదంబు చేయక, భక్షింపక, చరింపవలయును. కంద మÖలాది దానంబున అయ్యడి ఫలంబు పశు హింసనంబున సంభవింపదు. ప్రాణి హింస చేయక వర్తించుటకంటే మిక్కిలి ధర్మంబు లేదు అని పోతన ఉవాచ.

3. విశ్వ బ్రాహ్మణులు: శ్రాద్ధాది కర్మలయందు విధి విధానాలు ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణులకు ఏమీ లేవు బ్రాహ్మణత్వం కలిగి విశ్వజన శ్రేయోభిలాషి అయినవాడే విశ్వ బ్రాహ్మణుడు కదా! 

బ్రాహ్మణత్వం అంటే శమ దమాది గుణోజ్జ్వలుడె సంధ్యావందనాది నిత్య కర్మలను, శ్రాద్ధాదిక నైîమిత్తిక కర్మలను, ఏకాదశి వ్రతాచరణాది కామ్య కర్మలను చేయుచూ తన వృత్తి ధర్మ నిర్వహణ ద్వారా సంఘ పురోభివృద్ధిని కాంక్షించు విశ్వబ్రాహ్మణుడే భాసుర భూసురోత్తముడు. 

వీటన్నిటికన్నా ముఖ్యం? నిత్య జీవితంలో మాంస వినియోగం సమర్ధనీయమేనా, సమంజసమేనా. శాస్త్ర సమ్మతమేనా! ఆలోచించండి.. దాని మీద మనందరం మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమంటారు? 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి