గలివరు చాలా కొద్దికాలం మాత్రమే ఇంగ్లాండులో తన కుటుంబ సభ్యుల మధ్య కలసి ఉంటాడు. సముద్ర యానంపట్ల తన ఇష్టతను తగ్గించుకోలేకపోతాడు. ‘క్యాపటన్ విలియం రాబిన్సన’ ఆజ్ఞ మేరకు ఆయన తిరిగి ఒక ఓడలో శస్త్రవైద్యుడుగా నియమితుడై మరో సముద్రయానానికి ప్రయాణం అవుతాడు. ఈసారి దోపిడి దారులు వీరి ఓడపై దాడి చేస్తారు. వారి దోపిడి ప్రయత్నంలో మునిగిపోతుంది.
ఈసారి గలివరు ‘లపుటా’ ప్రాంతానికి చేరుకుంటాడు. ఈ ‘లపూటా’ ప్రాంతంతోపాటు గలివరు అనేక ప్రాంతాలను సందర్శిస్తాడు. ‘లపుటా’ ప్రజలు మనసును ఆకర్షించే ఆలోచింపజేసే విధంగా వారి వారి శాస్త్ర, సాహిత్య, సంగీత మరియు జ్యోతిషశాస్త్రాలపై పరిశోధనలు చేస్తుంటారు. కాని నిజజీవితం గూర్చి కాని నిత్యజీవితం గురించి కాని ఆలోచన ఏమాత్రం వారిలో కనిపించదు. ఈ ‘లపుటా’ ప్రజల జీవితాలు కేవలం గణితశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, సంగీత శాస్త్రాల చుట్టూ మాత్రమే పరిభ్రమిస్తుంటాయి. వాస్తవిక జీవితానికి అనంతమైన దూరంలో వీరి ఆలోచన పరిభ్రమిస్తుంటాయి.
మానవ సంబంధాలను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా కనీసం గలివరుకు సరిపడు బట్టలు, ఆహారం కూడా సమకూర్చలేక పోతారు. వారికి నివసించటానికి సరిపడే అందమైన భవంతులుకూడ ఉండవు. మానసిక పరిపక్వ తకు వివేకవంతమైన జీవితానికి ‘లపుటా’ వాసులు చాలా దూరంగా ఉంటారు. వీరి మనుగడ ఎంతో భిన్నంగా ఉంటుంది. గలివరు “బాల్‌నిబరిబి” (దీALచీIదీA=దీI) అనే ప్రాంతాన్ని చూడాలని వారితో అనుమతి తీసుకుం టాడు. ఈ ‘బాల్‌నిబరబి’ ప్రాంత సైనికులు ప్రొజెక్టర్లను ఉపయోగిస్తారు. కేవలం ప్రొజెక్టర్లతోనే యుద్ధం చేస్తారు. అక్కడ అంతా యుక్తితోనే పనులు జరుగుతుంటాయి. ఈ ప్రొజెక్టరులు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అమర్చి ఏర్పాటు చేయబడ్డ పథకాలు. ఈ ప్రాంత వాసులు దోసకాయలోంచి సూర్యకిరణాలు తయారుచేస్తారు. సాలెపురుగు గూళ్ళ నుండి పట్టుబట్టలు తయారు చేస్తారు. ప్రజలు కేవలం ఇలాంటి వినూత్న పథకాల ద్వారానే కళలను, శాస్త్రాలను, భాషలను, యంత్రాలను ఒకే పద్ధతిలో ఒకేచోట అమర్చిపెడ్తారు. ఇలాంటి పథకాలకొరకు, వాటి అభివృద్ధికొరకు వాళ్ళ ఆనందకరమైన జీవితాన్ని కూడా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉంటారు. చాలాకొద్దిమంది ‘మÖడి’ లాంటివారు వాస్తవిక జీవితానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. వీరు తమ పాత పద్ధతిలోనే మనుగడ సాగిస్తారు. కాని ఎన్నో విధాలుగా విమర్శలకు, తిరస్కారాలకు నిత్యం గురవుతుంటారు.
వారి విద్యావిధానం అంతా ఒకేచోట జరుగుతుంది. దాదాపు ఐదువందల గదులుంటాయి. ప్రతిగదిలో ఒకటి లేక రెండు ప్రొజెక్టర్లు ఉంటాయి. ‘లపుటా’ ప్రజల చదువులు ప్రొజెక్టర్లద్వారా కొనసాగుతాయి. కొన్నిరకాల ప్రొజెక్టర్లు మంచును కూడా తుపాకి శక్తిగా మారుస్తాయి. మరికొన్ని నూతనపద్ధతిలో వ్యవసాయసాగుకు ఉపయోగిస్తారు. తేనెటీగలు, సాలెపురుగులు గూళ్ళు కట్టుకునే పద్ధతిలో ‘లపూటా’ ప్రజలు తమ శిల్పనిర్మాణ కౌశలం చేత క్రిందికి వ్రేలాడే భవంతులు నిర్మిస్తారు. పైకప్పు కిందుండి పునాదులు పైనుంటాయి. తద్వారా వ్రేలాడుతున్నట్లు భవనాలు కనిపిస్తాయి. విద్యాలయాల్లో భోదించే చదువు కేవలం వినూత్న ప్రయోగాలను
ఉద్దేశించే జరుగుతుంది. మనిషి నోటమాట ఏమాత్రం వాడుకోకుండా కేవలం వస్తువులతో గుర్తులతో భావాల్ని ఆలోచనల్ని వ్యక్తం చేయగలిగే వినూత్న పథకాలను ఉద్దేశించే ఈ విద్యావిధానం కొనసాగుతుంది.
గలివరు ‘లపుటా’ దేశ ప్రజల పద్ధతులన్నింటినీ పూర్తిగా వ్యతిరేకిస్తాడు. గలివరు ‘లిండోలైన’ ప్రాంతంకూడా సందర్శిస్తాడు. అక్కడివారి జీవనవిధానం ఎంతకృత్రిమంగా ఉంటుందో వివరిస్తూ దాన్ని వ్యతిరేకిస్తాడు. ఆ తరవాత ‘గ్లుబీడబ్‌డ్రిచ’ అనే ప్రాంతం సందర్శించి అమితాశ్చర్యం ప్రకటిస్తాడు. అక్కడి దృశ్యాలు అతనికి అయోమయంలో పడేస్తాయి. అలెగ్జాండర్, ీVAమర్, అరిస్టాటిల్ లాంటి వ్యక్తుల చావులు ఎలా సంభవించాయో వారిని తిరిగి ఎలా పుట్టించాలో తెలుసుకుంటాడు. గలివరు ‘స్టల్ బ్రగ్స’ అనే ప్రాంత ప్రజలను చూస్తాడు. వీరికి మరణం ఉండదు కాని క్రమేనా శారీరకంగా, మానసికంగా కృశించుకుపోతారు. గలివరు యÖరప్ నుండి జపానుకు బయల్దేరుతాడు. ఇలా వాస్తవికతకు దూరంగా విరుద్ధంగా మనుగడ సాగించే మనుషుల ఆలోచనతీరు విజ్ఞానశాస్త్రం పేరుతో దినదినం ఎంత వికృతరూపాన్ని పొందుతుందో గలివరు మÖడవ యాత్ర ద్వారా మనకు తెలుస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి