మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, అక్టోబర్ 2026, శనివారం

జయగురుదత్త ...డా. కాళిదాసు


మా ప్రియాతి ప్రియమైన జ్యేష్ఠ పుత్రుడు, వైద్యనారాయణుడు, ఆధ్యాత్మిక చింతనాపరుడు, దీనజన సేవాపరాయణుడు, మళయాళస్వామి ఆశ్రమ నిర్వహణా తత్పరులు, మధుర మృదుభాషి, అందరిలో పరమాత్మను దర్శించే ప్రేమమÖర్తి అయిన డాక్టర్ కాళిదాసు గారి 76 వ జన్మదిన శుభాకాంక్షలతో వారి పరిచయు వాక్యాలు వ్రాసే అవకాశము వచ్చినందుకు సంతోషిస్తున్నాము. 

పరమ భాగవతోత్తములు, పాండురంగని పరమ భక్తులు, నిరంతర దైవచింతనా పరులు, ప్రతినిత్యం శ్రీకృష్ణ మేలు కొలుపుల పలుకులతో దైనందిన జీవనయానం ప్రారంభించే ఒక ఉత్తమ స్వర్ణకారుడు, కేశవగిరి గంగాధర భక్త సమాజ నిర్వాహకులు, సర్వజన ప్రీతిపాత్రుడు, బొడ్డుపల్లి వంశ కీర్తి ప్రధాత, కేశవగిరి వాస్తవ్యులు అయిన బ్రహ్మశ్రీ బొడ్డుపల్లి బ్రహ్మయాచార్యులు (1906`1982) వారి గృహలక్ష్మి ధర్మపత్ని మాతృశ్రీ చెన్నమ్మ (1920`2000) గారు.

మాతా పితరులు - జన్మస్థలం

మహా పుణ్యక్షేత్రం, దేవాలయాల సమాహారంగా విరాజిల్లుతున్న శ్రీ చెన్నకేశవసన్నిధి చంద్రాయణగుట్ట, కేశవగిరి, హైదరాబాదు 500005 లోని ఒక పెంకుటిల్లు. అది ఇరువది మంది పుణ్యమÖర్తులకు జన్మనిచ్చి నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెలసిన ఆ ప్రదేశము. ప్రస్తుతం  “కారుణ్య భారతి ఆశ్రమము” పేరుతో బొడ్డుపల్లి బ్రహ్మయ్యచారి స్మారక భవనమై అనాధలకు, పేద ప్రజలకు సేవాకేంద్రముగా విరాజిల్లుతున్నది. 

బ్రహ్మయాచార్యులు, చెన్నమ్మ పుణ్య దంపతులకు 12 గురు సంతానము. అందులో ప్రథముడు శ్రీ బొడ్డుపల్లి నరసింహాచార్యులు (1930`2018). పూవుపుట్టగానే పరిమళించునట్లు వారికి బాల్యము నుండే భక్తి ప్రపత్తులు, సత్ప్రవర్తన వారి తండ్రిగారి నుండి సంక్రమించినవి.

బ్రహ్మయ్యాచార్యుల గారు బాల్యము లోనే కుటుంబ బాధ్యతలు స్వీకరించినందున ఎక్కువగా చదువుకునే అవకాశము లేక స్వర్ణకార వృత్తిని స్వీకరించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కావున వారు వారి సంతానము మాత్రం బాగా చదువుకోవాలని ఆశించి నరసింహాచార్యులను బి.ఏ. పట్టభద్రులను చేయగలిగారు. వారి వివాహము బ్రహ్మశ్రీ మేడిచలం నారాయణ గారి (సికిందరాబాదు వాస్తవ్యులు) పుత్రిక అయిన రామామణితో జరిగింది. నారాయణ గాయకుడు, మంచి భక్తులు, శ్రీమంతులు. 

రామామణిగారు (1933`2004) బాల్యములోనే భక్తి ప్రపత్తులతో భగవద్గీత పారాయణము చేసేవారు. ఎంతో సుమధుర గాత్రంతో భక్తి గీతాలు పాడుతుండేది. ఆమెకు చిన్న వయస్సులోనే వివాహము జరిగింది. 

నరసింహాచారిగారు ప్రభుత్వ ఉద్యోగములో చేరి అంచెలంచలుగా ఎదిగి ఛీప్ అకౌంట్సు ఆఫీసరుగా ప్రభుత్వ పుస్తక ప్రచురణ కార్యాలయము, మింట్ కాంపౌండు, హైదరాబాదులో పదవీ విరమణ చేశారు. వీరు సత్యనిష్ఠాపరులు, సత్యధర్మపరాయణులు. వీరికి 8 మంది సంతానము. 

ప్రథమ సంతానం డాక్టరు కాళిదాసు. వారి తాత గారైన మేడిచలం నారాయణ గారు శ్రీ రాములవారి భక్తితో రామామణి కుమారుడు డా కాళిదాసుకు ‘రామకృష్ణ’ అని నామకరణం చేసారు. తరువాత కొన్ని కారణాలవల్ల బొడ్డ్డుపల్లి వారు కాళిదాసు అని పేరు మార్చినారు. 

బాల్యము - విద్యాభ్యాసము 

బహుశా రామకృష్ణ, కాళిదాసు ఈ రెండు పేర్లను సార్థకము చేయాలని సంకల్పించుకున్నాడేమో “వికటకవి” రామకృష్ణ లాగా హాస్యచతురత “కాళి దాసు మహాకవి” లాగా సంస్కృతం, తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం పొంది అనేక ఆధ్యాత్మ గ్రంథాలు పఠించడమే కాక జ్యోతిష్య జ్ఞానం కూడా సముపార్జించారు. వీరి విద్యాభ్యాసము శ్రద్ధానంద పాఠశాల చంద్రాయణ గుట్టలో ప్రారంభమయి, శాలిబండా మిడిల్ స్కూల్, సిటీకాలేజీ లో ఉన్నతవిద్య నభ్యసించడం జరిగింది. 

తరువాత ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబిబియస్ పూర్తి చేసి అనెస్తీషియా ప్రత్యేకతగా ఉన్నత వైద్యవిద్యకూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. ఆ రోజుల్లో ఎంబిబియస్ లో సీటు రావటం ఒక గగనం. ఆపై ఉన్నత వైద్యవిద్య ఇంకా ఇంకా కష్టం. అలాంటిది వారు అన్నింటిని అధిగమించి విజయవంతంగా పూర్తి చేశారు. 

వివాహము - ఉద్యోగము :

డా. కాళిదాసు వివాహము ప్రసిద్ధ వైద్యనిపుణులు  షాద్‌నగర్ వాస్తవ్యులు శ్రీశ్రీ మళయాల స్వామి వారి భక్తులయిన డా. రామాచారి గారి ఏకైక పుత్రిక కుసుమమ్మ గారితో 12.05.1978 నాడు శుభముహూర్తంలో అంగరంగ వైభవంగా జరిగింది. 

అనంతరకాలంలో డా. రామాచారిగారు సన్యాసము స్వీకరించి శ్రీశ్రీ రామేశ్వరానంద స్వామిగా జడ్చర్లలో దివ్య, భవ్య ఆశ్రమ నిర్మాణము చేసి శ్రీచక్ర, శ్రీమాతా ప్రతిష్ఠ గావించారు. అందులో గోశాల, వేదపాఠశాల నిత్య పూజా విధులు ఇతర వైదిక కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. 

డాక్టర్ కాళిదాసు గారు ప్రభుత్వ సర్విస్‌లో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా చేరినారు. హైదరాబాదులో మరియు విజయవాడ ఆసుపత్రులలో సేవలు అందజేస్తూ అంచెలంచెలుగా ఎదిగి అదనపు డైరెక్టర్‌గా (ఎయిడ్స్ ప్రాజెక్టులో) పనిచేస్తూ విశ్రాంతినందినారు. సహచ£ర వైధ్యాధికారుల మన్ననలందుకుంటు ప్రజల ప్రేమకు పాత్రులయ్యారు.

సామాజిక సేవలు, కుటుంబ ధర్మము 

బొడ్డుపల్లి కుటుంబసభ్యులకు, బంధు మితృలందరికి చేరువగా ఎల్లకాలము అందుబాటలో ఉంటూ తగు ఆరోగ్య సూచనలు, పరీక్షలు చేయిస్తూ ఎంతో సహాయకారిగా ఉంటున్నారు. వైద్యసలహాలే కాక పంచాంగ, ఆధ్యాత్మిక విషయాల ద్వారా జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. 

విశ్వబ్రాహ్మణ వైద్యనిపుణుల సంఘము గుడిమల్కాపూర్‌లో ఉచిత ఆసుపత్రిని నిర్వహిస్తుంది. ఈ సంఘ భవనానికి శ్రీనరహరిగారు ఉచితంగా స్థలం అందించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో డా.కాళిదాసుగారు రోజు ప్రజలకు ఉచితసేవలు అందిస్తున్నారు. 

శ్రీ రామేశ్వరానందస్వామి వారి శివైక్యము తరువాత లలితాంబికా తపోవనం ఆశ్రమ నిర్వహణలో కూడా చురుకుగా పాల్గొంటూ వ్యవస్థను సక్రమ మార్గములో నడిపే దిశలో కూడా ఎంతో కృషి చేస్తూనే ఉన్నారు. 

మా కోడలమ్మ కుసుమమ్మ. డాక్టర్ కాళిదాసు గారి సహధర్మచారిణి. శ్రీ రామేశ్వరానంద స్వామి పూర్వాశ్రమ పుత్రికా రత్నం. రామామణిగారి పెద్ద కోడలంటె ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. డాక్టర్ కాళిదాసుకు అన్ని విధాల సహకరిస్తూ వంశ ప్రతిష్ట కాపాడడంలో ముందుంటూ తోటికోడళ్ళను ప్రేమ, ఆప్యాయతలతో కలుపుకొని ఆడపడుచులకు, బంధుమిత్రులకు సందర్భానుసారంగా సాంప్రదాయ పద్ధతిలో తగు మర్యాదలు చేస్తూ ఇంటి గౌరవాన్ని కాపాడడంలోనూ పెద్ద కోడలు అనిపించుకుంటుంది.

కుసుమమ్మ ఆధ్యాత్మిక రంగంలోనూ, ధార్మిక రంగంలోనూ ఎప్పుడు ముందుంటూ అందరి ప్రేమ ఆప్యాయతలు పొందగలుగుతుంది. ఈ దŸంపతులిద్దరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందమయ జీవితం  గడపాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

మా జ్యేష్ట పుత్రశ్రేష్టుడు డాక్టరు కాళిదాసు మా కుటుంబ కార్యక్రమాలలో పాల్గొంటుంటే నూతనోత్సాహము, ఉత్తేజము కలిగి మాకు ఎనలేని శక్తి వస్తుంది వారు ప్రతిసారి విలువైన ఆధ్యాత్మి విశేషాలు, నిత్యజీవితంలో ఆచరించవలసిన పద్ధతులు, పూజలను గురించి సులభశైలిలో వివరిస్తారు. ఆరోగ్య వైద్య సలహాల ద్వారా కుటుంబ సభ్యులందరి ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి